Sunday 30 December 2012

రేప్ గూర్చి.. ఒక మంచి కల!



నేర తీవ్రత ననుసరించి శిక్ష కూడా అంతే తీవ్రంగా ఉండాలని కొందరు వాదిస్తుంటారు. ఇంకొందరు శిక్షలు reformative గా ఉండాలని కోరుకుంటుంటారు. ఎవరి వాదనలు వారివి.

ఒక సమాజానికి నాగరికత ఉంటుంది. ఆ సమాజానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ వ్యవస్థకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అందుకు అనుగుణంగా ఆ సమాజం లేక దేశంలో శిక్షలు ఉంటాయి.. అమలవుతుంటాయి. చైనాలో మరణశిక్షలు ఎక్కువ. యూరప్ లో దాదాపుగా లేవు. ఇది ఆయా సమాజానుగతంగా ఉంటాయి.

ఒక దేశంలో అమ్మాయి చెయ్యి పట్టుకుంటే.. ఆ చేతిని బహిరంగంగా నరికే శిక్ష ఉండొచ్చు. ఇంకో దేశంలో అదే నేరానికి మూణ్ణెల్ల జైలు శిక్ష మాత్రమే ఉండొచ్చు.

అవసరం అనుకుంటే ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోనివాణ్ణి కూడా ఉరి తీసుకుందాం. జేబు దొంగల్ని కూడా కరెంటు షాకులిచ్చి చంపేసుకుందాం. ఇక్కడిదాకా నాకు పెద్దగా కన్ఫ్యూజన్ లేదు. అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి.

ఈ దేశంలో నేరస్తులు, శిక్షని అనుభవించేవారు అధిక శాతం పేదవారు, సామాజికంగా తక్కువ కులం వారు.. అందునా దళితులు.. ఎందుకుంటారు? అనేక జైళ్ళలో పేదవారు, అణగారిన కులాలవారు.. (వారిపై మోపిన నేరానికి పడే శిక్ష కన్నా ఎక్కువకాలం) విచారణ పేరుతొ జైళ్ళలో ఎందుకు మగ్గిపోతున్నారు?

పదిమంది నేరం చేస్తే పదిమందికీ శిక్ష పడేలా ఉండే సమాజం కావాలని కోరుకుంటున్నాను. పైన నేను చెప్పినట్లు.. ఆ శిక్ష ఎలా ఉండాలనేది, ఎంత తీవ్రంగా ఉండాలనేది పూర్తిగా వేరే చర్చ.

ఉదాహరణకి.. రేప్ కేసుల్నే తీసుకుందాం. అత్యాచారానికి గురైన యువతి స్వేచ్చగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వ్గలిగే వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామా? క్రింది స్థాయి పోలీసు అధికారులకి ఈ నేరతీవ్రత గూర్చి, విధివిధానాల గూర్చి మన పోలీస్ ఎకాడెమీల్లో ఎంత శిక్షణనిస్తున్నారు? అసలు ఆ ఆ శిక్షణనిచ్చే ఉన్నతాధికారులకి gender sensitization  ఉందా?

రేప్ బాధితురాలిని పరీక్షించి, నిర్ధారించే వైద్యుని శిక్షణ ఏమిటి? దానికి సరియైన శాంపిల్స్ కలెక్ట్ చెయ్యడంలో సరైన విధానాలున్నాయా? ఆ శాంపిల్స్ చేరినా.. Forensic lab వారు నెలల తరబడి రిపోర్ట్ ఎందుకివ్వరు? చార్జ్ షీట్ మూడు నెలల్లో ఫ్రేం చెయ్యకపోతే నిందితుడికి (బెయిల్ పొందటం ప్రాధమిక హక్కు) స్వేచ్చ వస్తుంది.

ఆ తరవాత తాపీగా, హాయిగా కేసుని ఎలా మాఫీ చేసుకోవాలో నిందితులకి తెలుసు. అట్లా సహకరించే వ్యవస్థ మనకి లేదా? యేళ్ళ తరబడి సాగే కేసులో.. కోర్టులో బాధితురాల్ని క్రాస్ ఎక్జామినేషన్ పేరిట చాలా నీచమైన, అసభ్యమైన ప్రశ్నలడిగే న్యాయవ్యవస్థలో కూడా మనం బ్రతుకుతున్నాం.

అంటే డబ్బు, పలుకుబడి కలవాడు తప్పించుకోడానికి అడుగడుగునా అవకాశాలు పుష్కలం. ఇవేమీ లేని అర్భకుల్ని న్యాయవ్యవస్థ నేరం చేసినవాడిగా నిర్ణయిస్తుంది. మనం కోరుకున్న శిక్షలు పడేది ఈ 'బలహీన నేరస్తులకే'! (నేరస్థుల పట్ల నాకు సానుభూతి లేదు. వాడికి ఉరిశిక్షో, జీవితకాల శిక్షో తరవాత సంగతి). నా బాధల్లా వాడితో బాటుగా అదే నేరం చేసిన తొంభై మంది హాయిగా సమాజంలో పెద్దమనుషులుగా తిరిగేస్తుంటారు.

ఈ వ్యవస్థలోని లోపాలని సరిచెయ్యడానికి చట్టసభలకి కమిట్ మెంట్ అవసరం. అయితే ఆ సభలకి పటిష్టమైన వ్యవస్థలంటే ఇష్టం ఉండదు. ఎవరి ప్రయోజనాలు వారివి. అందుకే వారు వాగాడంబరం ప్రదర్శిస్తారు. ముసలి కన్నీరు కారుస్తారు. టీవీల వారికి ఇదంతా ఓ ఫ్రీ రియాలిటీ షో!

రాత్రి నాకో కల వచ్చింది...

మా ఊళ్ళో ఇద్దరు నిరుపేద, దళిత యువతులు అత్యాచారానికి గురయ్యారు. వారిద్దరూ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. అక్కడి పోలీసులు వారితో అత్యంత మర్యాదగా ప్రవర్తించారు. శ్రద్ధగా కేస్ నమోదు చేసుకున్నారు.

ఆ యువతుల కంప్లైంట్ ప్రకారం నిందితుల్ని వెంటనే ఎరెస్ట్ చేశారు. నిందితుల్లో అగ్ర కులస్తులు, మైనారిటీలు, బిసి కులస్తులు, దళితులు.. అందరూ ఉన్నారు. కొందరు రాజకీయ నాయకుల కొడుకులు. ఇంకొందరు బడా ధనవంతుల పిల్లలు.

ఆ యువతుల పిర్యాదుల్ని పకడ్బందీగా నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని ఒక వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టరమ్మ ఏంతో సానుభూతితో బాధితుల్ని అనునయిస్తూ, వారికి ధైర్యం చెబుతూ చాలా సైంటిఫిక్ గా మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. చక్కటి నివేదిక తయారుచేసింది. ఆ మెటీరియల్ ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నెలలోపే రిపోర్ట్ ఇచ్చేసారు.

ఇదిలా ఉండగా.. నిందితుల తండ్రులు తమ డబ్బుని, అధికారాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ.. కేసుని నీరు గార్చడానికి అనేక ప్రయత్నాలు చెయ్యసాగారు. కానీ వారు సఫలీకృతులు కాలేకపోయ్యారు.

ఈ లోగా ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఇన్ కెమెరా విచారణ జరిపి.. నిందితులందరూ నేరస్తులని తేల్చింది. వారికి నిర్దేశిత సెక్షన్ లో కల గరిష్టమైన శిక్ష కూడా విధించబడింది. చట్టం ముందు అందరూ సమానులే! నువ్వు ఏ నేరం చేసినా, ఎంత పెద్దవాడవైనా.. శిక్ష నుండి తప్పించుకోలేవు. ఇది పుణ్యభూమి. ఇదే మా దేశ నీతి! సమాజ గతి!!

అయితే.. దురదృష్టం! తెల్లవారింది. నాకు నిద్ర నుండి మెళుకువ వచ్చింది! కల చెదిరింది. నా కల నిజమైతే ఎంత బాగుండు!!

(photo courtesy : Google)

51 comments:

  1. నిజమే.. మీ కల నిజమయితే ఎంత బావుణ్ణో.. :(

    ReplyDelete
  2. బాగుంది.
    అంటే మనదేశంలో "చట్టం తన పని తాను చేసుకుపోయేదీ" కేవలం కలలలోనే అన్న మాట.

    ReplyDelete
    Replies
    1. అంతేనేమో! అంచేత మనం.. 'కల నిజమాయెగా! కోరికలు తీరెగా!' అంటూ పాడుకోడం మించి చేయగలిగిందేమీ లేదు.. ప్రస్తుతానికి!

      Delete
    2. కల నిజం అవుతే బాగుండు.
      మన దేశంలో రాజకీయ వ్యవస్థ మారాతే కానీ కలాలూ నిజాం కావు.

      Delete
  3. పర్ఫెక్ట్ . నేన్నది చివర్లో మెలుకువరావడం గురించి సుమా

    ReplyDelete
    Replies
    1. (కొంపదీసి) శాశ్వితనిద్రలోకి జారుకున్నాననుకున్నారా యేమిటి?!

      Delete
  4. రమణగారు,
    ఈ టపా చదివితే మీకు కోర్ట్ ప్రొసీడింగ్స్ మీద అవగాహన ఉన్నట్లు అర్థమైంది. మీ కల కలగా కన్నా వాస్తవికతో కూడుకొని ఉంది. ఆ కల నిజమౌతుందని ఆశిద్దాం. స్వంత అభిప్రాయం, చట్టం మీద అవగాహన లేకుండా, గొర్రెమందల సైకాలజిని ప్రోత్సహించే మీడియా వారి వాదనలు వినేవారికి మీ టపా నచ్చకపోవచ్చు.

    నిన్నటి సంఘటనలో ఇంకొక ముఖ్య అంశం ప్రజలందరికి తెలిసేలా బయట పడింది. అది ఇంతకాలం రాజకీయ నాయకులు, మంత్రులు సర్వశక్తి మంతులు లాగా ఊహించుకొన్న ప్రజానికానికి పోలిసు ఆఫిసర్లు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం ఒక వెంటృక పికిపారేసినట్లు పీకి పారేశారు. ముఖ్యమంత్రికి ఎమీ చేయాలో తెలియక చేతూలెత్తేసింది. చాలా మార్లు బ్యురోక్రసి ఇలా ప్రవర్తిస్తూంట్టుంది, కాని మన రాజకీయ నాయకులు ఆ విషయాని దాచిపెట్టుకొని (బయటకు చెప్పితే పరువుపోతుందని, నువ్వేమి లీడర్ కింద వాళ్ల చేత పని చేయించలేకున్నావు అంటారని), వారి మాట నెగ్గుతున్నట్లు పోజులుపెడుతూంటారు. మనదేశంలో బ్యురోక్రసిని కూడా స్ట్రీం లైన్ చేయాల్సిన అవసరం ఉంది.

    SriRam

    ReplyDelete
    Replies
    1. SriRam గారు,

      నాకు ఎడ్వొకేట్ స్నేహితులున్నారు. MBBS కోర్స్ లో Forensic medicine అనే సబ్జక్ట్ ఉంటుంది. MD కోర్స్ లో Forensic psychiatry అంటూ పెద్ద చాప్టర్ ఉంటుంది. అంచేత కోర్టుల గూర్చి కొంత అవగాహన ఉంది.

      ఇప్పుడు ఒకట్రెండుసార్లు జైలుకి వెళ్ళొచ్చినవారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్సై, సీఐలు ఎల్లయ్య, పుల్లయ్యల్ని సాక్షులుగా పెడుతూ పిచ్చి కేసొకటి రాస్తారు. ఆపై తమ బావమరిది మరియూ తమకి కమిషన్ ఇచ్చే ఫలానా ప్లీడర్ని పెట్టుకొమ్మని సలహా ఇస్తారు. ఆ ప్లీడర్ ఫలానా PP ని ఫలానా రకంగా మేనేజ్ చెయ్యమని సలహా ఇస్తాడు. ఇలా డబ్బులు పంచుకుంటూ పోవడమే. ఇదంతా చాలా మెథాడికల్ గా, చాలా ప్రొఫెషనల్ గా జరిగిపోతుంది. (రావిశాస్త్రి 'ఆరు సారా కథలు' గుర్తుంది కదూ).

      నాకు నా పేషంట్లే అన్ని విషయాలు చక్కగా వివరిస్తుంటారు. సబ్ జైల్లో డబ్బులిచ్చినవాడు పరుపు మీద పడుకుంటే.. ఆ డబ్బులు ఇవ్వలేనివాడు.. పరుపు మీద వాడికి సేవకుడిగా నియమించబడతాడు! ఇట్లాంటి కబుర్లు మొన్న నాకు ఒక పేషంట్ (వృత్తి - గేదెల్ని దొంగిలించడం) చెబుతుంటే నోరు తెరుచుకుని విన్నాను. ఇవన్నీ బ్లాగుల్లో రాసుకోడానికి అంత మర్యాదపూర్వకంగా ఉండవు.

      Delete
  5. డాటేరు రమణ గారు,

    చ, చ, కల కంటే అందులో కూడా రేప్ ఉండాలా ?

    అసలు కలలోనైనా అది జరగ లేదన్నట్టు కొంత బెటర్ కల కని ఉండ వచ్చుగా?

    సువిశాల భారద్దేశం లో స్త్రీ కి కలలో కూడా ఈ వెసులు బాటు లేదా ?

    ఘీం'కారాల'
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. Zlilebi జీ,

      నాకు నిద్ర పట్టదు. పట్టే ఆ కొంచెం కూడా నిద్రమాత్రల ప్రభావమే! కాబట్టి నేను బెటర్ కలలు కనే అవకాశం లేదు. ఇందులో నా ప్రమేయం ఇసుమంతయూ లేదు. అంచేత.. శాంతించగలరు.

      Delete
    2. premalu maasipoyina chota rape maatrame migulutundi

      Delete
  6. sri ram garu 1995 లో వైస్ రాయి హోటల్ వద్ద ఒక మంత్రిని పొలిసు అధికారి... డిజిపి కాదు , కమిషనర్ కాదు ips కూడా కాదు అంత కన్నా క్రింది స్థాయి అధికారి .. ఒక మంత్రిని చెంప పై ఈడ్చి కొట్టాడు. హోం మంత్రిని హోటల్ లోకి వెల్ల కుండ అడ్డుకున్నాడు ... మీడియాతో పటు చాల మంది చూస్తుండగానే...

    ReplyDelete
    Replies
    1. ఈ మొత్తం వ్యవహరంలో డిల్లి పోలిస్ కమిష్నర్ ఒక్కరే కాంఫిడేన్స్ గా, టేన్షన్ బయటకి కనపడనీయకుండా, ఈ ఇష్యును హాండిల్ చేయగలను అనే ధీమాతో కనిపించింది. మిగతావారేవ్వరు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించలేకపోయారు. అందరు టి వి ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పుకొంట్టూ,ఏడుస్తూ,బాధపడుతూ చాల బేలగా కనిపించారు.

      Delete
    2. Anonymous, I agree with u.

      Delete
  7. //ఈ దేశంలో నేరస్తులు, శిక్షని అనుభవించేవారు అధిక శాతం పేదవారు, సామాజికంగా తక్కువ కులం వారు.. అందునా దళితులు.. ఎందుకుంటారు? అనేక జైళ్ళలో పేదవారు, అణగారిన కులాలవారు.. (వారిపై మోపిన నేరానికి పడే శిక్ష కన్నా ఎక్కువకాలం) విచారణ పేరుతొ జైళ్ళలో ఎందుకు మగ్గిపోతున్నారు?//

    ఒక బూతు సినిమాకు A woman in Brahmanism అనే పేరు పెట్టినపుడు, ఆ వర్ణానికి చెందిన పట్టెడు మంది మాత్రమే గొంతెత్తారు. ఐనా పట్టించుకున్న నాథుడు లేడు. Brahmanism బదులు Dalitism అని పేరు పెట్టుంటే, నిరసన ఎలా ఉండుండేది?

    ఈ కాలంలో ఎవరి వద్ద డబ్బు ఉన్నదో, సర్వం వారి వద్దనే ఉన్నట్టు. ఇక్కడ ముఖ్యం కులం కాదు - ఆర్థిక స్థోమత. స్వాతంత్ర్యం వచ్చిన 65 ఏళ్ళ తరువాత కూడా ప్రతి దానినీ 'కులం' దృష్టితో చూసే అలవాటు నుండి ఈ దేశం ఎప్పుడు బయట పడుతుందో.

    ReplyDelete
    Replies
    1. Well said తెలుగు భావాలు గారూ.

      రమణ గారూ.. మీరూ దళిత అనే పదం సహాయంతో మీ పోస్ట్కి కొన్ని ఎక్కువ మార్కులు కొట్టేశారు. అభినందనలు. దళిత యువతివా, కాదా అని అడిగి అత్యాచారం మొదలెడతారు. దళిత యువతినైతే దారుణంగా అత్యాచారం చేస్తారు. నాన్-దళిత యువతి మీద అత్యాచారమైతే సో-సోగా చేస్తారు.

      Delete
    2. అంతేనేమో. :))
      సైక్రియాటిస్టులు ఎలా చెబితే అలానే చేసివుంటారు. ఈ విషయం మీద గార్డియన్, వాషింగ్ టన్ పోస్టూ ఏమన్నాయో ఓ సారి NRI లను అడిగి తెలుసుకుందామా?

      Delete
  8. Looking through the prism of social class may explain why some (or many) get away with rape in India, but, ignores the fundamental problem: woman is a second class citizen not entitled to fundamental rights especially if she does not conform to the traditional stereotype.

    Here is an excerpt from a Wall Street Journal article I thought hit the nail on its head:
    While better law enforcement is part of the solution, women’s rights advocates say that alone is not enough. “We can’t only have action, we need to address the root cause of this problem,” says Anne F. Stenhammer, who heads the South Asian chapter of the United Nations women’s agency, UN Women. “I think a total change in mindset is necessary.”

    A patriarchal system where women have restricted liberties, and are discouraged to speak out in their own defense is the main reason why so many cases of rape happen and go unreported, says Ms. Stenhammer.

    “In some environments, it is not seen as a good thing for women to speak up and when they do, we have evidence that they are often subject to violence,” she says.

    To prevent cases of abuse, too often the onus is on women, with people ranging from family members to politicians giving tips to women on what to wear and how to behave. This is a dangerous logic as it implies that women share the blame for abuses of which they are victims.

    ReplyDelete
    Replies
    1. Dear GIdoc,

      >>we need to address the root cause of this problem.<<

      ఇదంతా మన దేశంలో ఇప్పట్లో జరిగే పనేనా!

      నేరం మూలాల్లోకి వెళ్ళాలంటే మన దేశంలో ఎలా కుదురుతుంది! ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు రాసుకుపోతున్నారు. లేదా వేరే దేశాల్లో జరిగిన స్టడీల్ని కోట్ చేస్తున్నారు. ఎక్కడైనా అదే థియరీ ఎలా పని చేస్తుంది.. అదేమన్నా బీపీ మాత్రా?

      మనకి Forensic psychiatry స్పెషాలిటీ లేదు. NIMHANS, బెంగుళూరు, CIP, రాంచి, లలో ఉన్న డిపార్ట్ మెంట్లు అలంకారప్రాయమే!

      మనం ఈ నేరస్థుల నుండి డాటా సేకరించాలి. criminal's mind స్టడీ చెయ్యడం చాలా దేశాల్లో సీరియస్ జాబ్. మన దేశంలో మాత్రం వాళ్ళని బహిరంగంగా ఉరి తీసేస్తే భయంతో మళ్ళీ అవి జరగవు. అంతే! ఒక రకంగా ప్రభుత్వాలకి ఈ పద్ధతే సుఖం.

      ఈ నేరస్థుల్ని రేప్ కి ప్రేరేపించిన కారణాల గూర్చి శాస్త్రీయ అవగాహనకి రావాలి. ఉదాహరణకి ఈ నేరాలకి పోర్నోగ్రఫీ కారణం కావచ్చు. ఆల్కహాలిజం కావచ్చు. పెర్సనాలిటీ డిజార్డర్ కావచ్చు. bipolar disorder కావచ్చు. schizophrenia కావచ్చు. childhood abuse కావచ్చు. disturbed family environment కారణం కావచ్చు.

      అన్నీ కావచ్చు. ఏదీ కాకపోవచ్చు. అసలంటూ ఒక స్టడీ జరిగితే.. ఫలానా కారణాలంటూ తెలుస్తాయి. దాని ఆధారంగా గవర్నమెంట్ కి రికమెండషన్లు ఇవ్వొచ్చు. అప్పుడు preventive measures గూర్చి గవర్నమెంట్ ఆలోచించవచ్చు.

      అయితే ప్రభుత్వాలకి ఈ ఎకడెమిక్ స్టడీలు, గట్రా చేయించి.. భవిష్యత్తులో జరగబోయే రేపుల్ని minimize చేయించే చిత్తశుద్ధి ఉంటుందా? నాకు అనుమానమే!

      Delete
    2. Dear Ramana,
      You seem to have concentrated on how to study, treat or reform the criminal mindset. What I was saying or the article I quoted says is change the mindset of the society.

      Treat women as equal human beings. This begins at home. Stop imposing undue burdens on women in the name of family honor. Teach our sons to respect girls and women. Stop giving and accepting dowry. Minimize arranged marriages. Stop calling sexual harassment "eve teasing" - a needless trivialization of a serious offense. Oh, stop gender selection and female infanticide.

      Video tape all police station interactions - especially when it comes to reporting a rape. Impose severe penalties on police if they fail to file an FIR or initiate action. Have a toll free number or website where women can report sexual crimes. Let women arm themselves with mace or even hand guns to defend themselves - particularly for women who work odd hours in big cities. Provide mandatory gender sensitivity training in schools, colleges and places of employment for every one.

      Most importantly stop electing goons and hoodlums.

      Delete
    3. I suggested to study a criminal mind thoroughly for the betterment of the society only. i have clear reasons to suggest this. I am not interested in reforming a criminal at this juncture.

      It's like studying a fatal automobile accident. don't we record the statements of the drivers? unless we have a good first hand information about the accident, we can't take preventive measures.

      Another example is.. we study a lot about mosquito to understand malaria. Don't we?

      I am giving this answer not just for you. I request my blog readers not to misunderstand me as rapists sympathizer.

      Delete
    4. Thanks for the lecture!

      I suspect the vast majority of the rapists do not particularly have deranged brains (like significantly less grey matter in the anterior rostral prefrontal cortex and temporal poles recently identified on scans of mass murderers that apparently correlates with lack of empathy).

      Rather I would think the average rapist is an opportunist misogynist coward who takes advantage of an opportunity to attack a helpless woman enabled by his lifelong learning from family, society and Bollywood how a virtuous woman ought to be and how much “izzat” is valued; how an independent (read arrogant) woman can be taught a lesson and "damaged" by sexual assault; bolstered by knowing the difficulties in reporting, policing and prosecuting such offenses. Yes, I agree it is just not sexual attraction, but, power, control and anger can be involved. But, put a gun in the woman's hand and see how quickly the rapist's brain would start working very rationally!

      All I am saying is we need whole sale changes in our society with regard to how we treat and value girl child and woman. And it is not necessarily a class thing.

      Peace.

      Delete
  9. ఎకడెమిక్ స్టడీలు అంట్టూ మీరు మరీ డీప్ గా వేళ్లిపోయారు. మొదట జె.పి. ఇచ్చిన సలహా తో మొదలుపెడితే పరిస్థితి లో కొంతమార్పు వస్తుందనిపించింది. ఆ తరువాత శాస్రియమైన అధ్యయనం అన్నిను.

    JP video
    http://www.youtube.com/watch?feature=player_embedded&v=d8PaZu9h31g

    ReplyDelete
    Replies
    1. >>ఎకడెమిక్ స్టడీలు అంట్టూ మీరు మరీ డీప్ గా వేళ్లిపోయారు.<<

      మీకు ధన్యవాదాలు.

      ఉత్సాహం ఎక్కువైపొయ్యి.. social psychiatry, trans-cultural psychiatry లని ప్రస్తావిస్తూ రేప్ గూర్చి రాద్దామనే ఆవేశంలో ఉన్నా. నేల మీదకి దించారు. థాంక్స్!

      Delete
  10. నిన్న వనజవనమాలి గారి బ్లాగులో ఒక కామెంట్ రాశాను. ఆ కామెంట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పబ్లిష్ చేస్తున్నాను. (I don't know whether i can re-publish my earlier comment which was published in another blog. if it is wrong.. my apologies to vanajavanamali గారు)

    వనజవనమాలి గారు,

    మీరు వ్యక్తీకరించిన అభిప్రాయాల్ని సమర్ధిస్తూనే..

    రేప్ అనేది సెక్సువల్ ప్లెజర్ కోసం మాత్రమే అనుకోకూడదు. చాలాసార్లు రేపుల్లో సెక్సువల్ ఇంటర్ కోర్స్ కన్నా.. శరీరంపై గాయాల శాతం చాలా ఎక్కువ. ఇది శాడిజం అనబడే ఒక మానసిక స్థితి.

    మీలో ఎంతమంది రేప్ బాధితురాల్ని చూశారో నాకు తెలీదు గానీ.. నేను చూసిన ఒక కేస్ ఇప్పటికీ నన్ను డిస్టర్బ్ చేస్తుంది. చాలా భీతి గొలిపే కేసది.

    రేప్ బాధితుల్ని కౌంసెలింగ్ చెయ్యడం సైకియాట్రిస్ట్ కి కూడా చాలా దుర్భరంగా ఉంటుంది.

    మన తెలుగ్ బ్లాగర్లు రేప్ ని సమాజంలోని కొన్ని అంశాలకి ముడిబెట్టి చూస్తున్నారు. రాస్తున్నారు. అయితే అందుకు సాక్ష్యాలు (నాకు తెలిసినంతమటుకు) లేవు.

    ఈ రోజుల్లో మగపిల్లల్ని కూడా రేప్ చేస్తున్నారు. నిన్ననే ఒక కేస్ చూసి షాకయ్యాను. ఒక స్వామీజీ నీలో ఒక ఆడదెయ్యం ఉంది. దాన్ని నా శక్తితో లాగేస్తానని నమ్మబలికి.. ఒక పదిహేనేళ్ళ కుర్రాడికి sodomy చేశాడు. Anal tears చాలా ఉన్నాయి. ఆ అబ్బాయికి జ్వరం, కడుపు నొప్పి.

    HIV, Hepatitis risk మర్చిపోరాదు.

    PTSD (post traumatic stress disorder) జీవితాంతం వెంటాడుతుంది. మానసికంగా.. జీవచ్చవం అంటారే.. అలా అయిపోతారు.

    రేప్ అనేది ఏదో సెక్స్ దాహం ఉన్నవాళ్ళు చేస్తారనే భావం కరెక్ట్ కాదు. ఆధిపత్యాన్ని చూపించుకోడానికి, కసిని వ్యక్తీకరించడానికి కూడా రేపులు జరుగుతుంటాయి. అందుకే యుద్ధంలో గెలిచిన పక్షం సైనికులు ఓడిన పక్షం వైపు ఆడవారిని, పిల్లల్ని పాశవికంగా రేప్ చేస్తుంటారు. ఇది హత్య కన్నా తీవ్రమైన, క్రూరమైన నేరం. దురదృష్టవశాత్తు ఇండియాలో స్టడీస్ పెద్దగా లేవు.

    ఇప్పటికే పెద్ద కామెంట్ రాశాను.

    ReplyDelete
  11. www.huffingtonpost.ca/mobileweb/2012/12/29/india-gang-rape-case_n_2380464

    When I read this posting , it saddens me and so much rage and helplessness shows up.

    Holographic-ally our consciousness is one. You thinking like this creates new reality Ramana. I really wish that each one of us change to make this world a safe place to live.

    ReplyDelete
    Replies
    1. http://www.guardian.co.uk/world/2012/jul/23/why-india-bad-for-women

      Delete
    2. /ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు రాసుకుపోతున్నారు. లేదా వేరే దేశాల్లో జరిగిన స్టడీల్ని కోట్ చేస్తున్నారు./
      I agree with Dr.Ramana.

      Delete
    3. Did you read the stories linked at all? You think they are about other countries? Do you have a problem with the causes/remedies mentioned? If so enumerate them, correct them, criticize them or give your opinion. Otherwise what is the point of your post?

      Delete
    4. I have no problem. In fact i welcome them. Both of us are on same side in this issue.

      (కానీ నాకెందుకో 'కన్యాశుల్కం' సౌజన్యారావు పంతులు గుర్తొస్తున్నాడు.. కోప్పడకండి!)

      Delete
    5. I did not realize SNKR was quoting you and the above reply of mine is actually addressed to him/her for not actually furthering the debate and for spineless sycophancy and gratuitous NRI bashing.
      I have addressed your post down below.

      Delete
    6. /Did you read the stories linked at all?/
      No! not yet, in detail.

      /furthering the debate and for spineless sycophancy and gratuitous NRI bashing/
      Add few more spicy phrases, I am pleased to agree with and share your emotions. NRI/RI/PIO/OCI whatever they have some Indian link.

      Delete
  12. kadu andi rape chesina vallu peda vallu aithe vadileyala?aa ammayi yentha torture pettaro oka second alochinchandi..may be mi maga vallaku artham kadu aa badha..oka doctor ayindi meeru ela yelo alochincha galugutunnaru?

    ReplyDelete
    Replies
    1. అయ్యబాబోయ్! రేప్ చేసిన పేదవాణ్ణి వదిలెయ్యమని నేనెక్కడ రాశానండి!? పేదవాణ్ణే కాదు, డబ్బున్నవాడిని కూడా శిక్షించమనేగదా నే రాసింది!

      Delete
    2. aithe sorry andi nene sariga chadavaledu sariga artham chesukoledu sorry andi

      Delete
  13. "నేరం మూలాల్లోకి వెళ్ళాలంటే మన దేశంలో ఎలా కుదురుతుంది! ఎవరికి తోచిన కారణాలు వాళ్ళు రాసుకుపోతున్నారు. లేదా వేరే దేశాల్లో జరిగిన స్టడీల్ని కోట్ చేస్తున్నారు. ఎక్కడైనా అదే థియరీ ఎలా పని చేస్తుంది.. అదేమన్నా బీపీ మాత్రా?"
    Here is the link to the WSJ article:
    http://blogs.wsj.com/indiarealtime/2012/12/19/a-total-change-in-mindset-is-necessary/
    As you can see, it is about the Delhi rape case and the commentary is about offenses on women in India. As far as I can tell all the quoted links by other commenters are also directly related to the Indian rape case as well. So, I am at a loss to understand your foreign studies comment. Is it an attempt at sarcasm or humor with the BP pill comment?

    ReplyDelete
    Replies
    1. గురువర్యా!

      what is this link! this is an opinion of some western lady, who belongs to some UN agency!

      I don't call it "A STUDY". I call it an opinion.

      ఆ దొరసానమ్మ మన దేశంలో ఆడవారి దుస్థితికి చాలా కారణాలే చెప్పింది. మరి gender equality ఉన్న గొప్ప దేశాల్లో రేపులు జరగట్లేదా!

      ఆనందభవనంలో ఉప్మా పెసరట్టు తిని.. కాఫీ తాగుతూ.. నేను కూడా అమెరికాలో డేటింగుల్ని, తుపాకీ హత్యల్ని విమర్శించగలను. గొప్పగొప్ప రెమిడీలు సూచించగలను.

      (గురువర్యా.. అని నమస్కారబాణం వేశాను. తిట్టటాలు లేవు!)

      Delete
  14. విజ్ఞులైన బ్లాగ్మిత్రులారా,

    నేను 'నిరుపేద దళిత మహిళలు' అని రాయడానికి నాకు పొలిటికల్ రీజన్ ఉంది. వాళ్ళకన్నా తక్కువ స్థాయి మనుషులు ఈ దేశంలో లేరనేది నా అభిప్రాయం.

    కొందరు బ్లాగర్లు నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.

    ఈ దేశంలో (అణగారిన కులాల) పేదవాడితో పాటుగా, అందరూ కచ్చితంగా శిక్షించబడాలనే నేను రాశాను. ఇలా భావించడంలో తప్పేముంది!?

    "లేదు.. లేదు.. మన చట్టవ్యవస్థలో అందరూ సమానమే.. మంత్రి కొడుకయినా, మిఠాయి అమ్మేవాడయినా.. చట్టం అందర్నీ సమానంగా శిక్షిస్తుంది. నీ అభిప్రాయం తప్పు." అంటారా? మీరే కరెక్టయినట్లయితే నేను చాలా సంతోషిస్తాను.

    ఈ భావాన్ని తిరగేసి 'దళితుల్ని వదిలెయ్యాలా?' అంటూ నే రాయనిదాన్ని నాకు అంటకడుతున్నారు. ఇది అన్యాయం. దయచేసి నా పోస్ట్ మరొకసారి చదవండి. నేను నా పోస్టులో నేరం చేసిన దళితులకి immunity ఇమ్మని ఎక్కడా అడగలేదు. నా కలలో.. నిందితుల్లో మైనారిటీలు, దళితులతో సహా అందరూ ఉన్నారు, అందరికీ కఠిన శిక్ష పడిందనేగా రాశాను.

    మన బ్లాగర్లకి ఒక సలహా. మీ మీ జిల్లా కేంద్రాల్లో సబ్ జైల్ ఇన్ మేట్స్ గూర్చి వాకబు చెయ్యండి. చాలామంది పేదవారైన నిందితులు.. కోర్ట్ బెయిల్ మంజూరు చేసినా.. ష్యూరిటీస్ లేక, బెయిల్ మనీ కట్టలేక.. జైల్లోనే ఉండిపోతుంటారు. ప్రభుత్వం వీళ్ళ కోసం పీరియాడికల్ గా 'జైల్ మేళా'లు పెడుతుంటుంది.

    నాకు తెలిసిన కొంత సమాచారంతో, నా అభిప్రాయాలు వ్యక్తీకరిస్తూ పోస్టులు రాస్తుంటాను. ఈ దేశంలోని పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోకుండా 'నేరము-శిక్ష' ల గూర్చి మాట్లాడుకోవచ్చా? అనేది నా అనుమానం. అంతేగానీ.. నేను నేరస్థులని సమర్ధిస్తున్నానని అనుకోవద్దు.

    ReplyDelete
  15. ""లేదు.. లేదు.. మన చట్టవ్యవస్థలో అందరూ సమానమే.. మంత్రి కొడుకయినా, మిఠాయి అమ్మేవాడయినా.. చట్టం అందర్నీ సమానంగా శిక్షిస్తుంది. నీ అభిప్రాయం తప్పు." అంటారా? మీరే కరెక్టయినట్లయితే నేను చాలా సంతోషిస్తాను."
    None of the commenters have said that. You are creating a Bogey man and arguing against your own imaginary statements. We are all fully aware of application of selective justice in India and I am fully with you for equal punishment for equal crimes. But, the point is that the whole law and order and governance is broken and corrupt and needs change.

    For any proposed change towards progress and development, the common man/dalit is often cited as reason why the ruling class cannot implement policies. This is a completely bogus argument to delay and worse not to take any action at all. Granted, the current justice system is unequal, but, why is it a hindrance to implement good policing and transparent governance is beyond me.

    And also one should realize that the whole country and the whole world for that matter is agitated and anguished over the Delhi rape case without knowing the victim's caste or religion. That I would say is a great tribute to the people at large.

    We can bitch about foreign papers and opinion from abroad, but, the fact remains that they are right. We should be indignant about how our system treats girls and women and not the foreign press. A good number of foreigners are also raped in India every year and some of their commentary is quite pertinent to themselves as well.

    ReplyDelete
    Replies
    1. A very well written comment !

      Delete
    2. గురువర్యా,

      నా లాజిక్ చాలా సింపుల్.

      ఉదాహరణకు.. ఒక అమ్మాయితో పదిమంది కుర్రాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పట్టుకోడానికి వెంటబడితే తొమ్మిదిమంది పారిపొయ్యారు. ఒక దరిద్రుడు / దౌర్భాగ్యుడు దొరికాడు. వాణ్ణి చెట్టుక్కట్టేసి కొడదామంటారు. ఇంకొందరు చంపేద్దామంటారు. వాణ్ణి ఏదైనా చేసుకోండి. నాకస్సలు అభ్యంతరం లేదు.

      నా పోస్ట్ దొరక్కుండా పారిపోయిన ఆ తొమ్మిదిమంది గూర్చి. సహజ న్యాయం, సమన్యాయం అంటే.. తప్పు చేసిన ప్రతి ఒక్కడూ ఒకే విధంగా శిక్షించబడటం. ఆ దొరికిన ఒక్కణ్ణీ ఉరి తీసి కసి తీర్చుకుంటాం అంటే నాకభ్యంతరం లేదు. అటులనే కానిండు. కానీ ఆ శిక్ష సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది?

      నేరం చేసిన "ప్రతి ఒక్కడూ" శిక్షించబడతాడు.. ఎటువంటి మినహాయింపులు లేకుండా.. అనేదే deterrent. "దొరికినవాడు మాత్రమే" తీవ్రంగా శిక్షించబడతాడు అనేది ఎప్పటికీ deterrent కాదు. ఎవడికి వాడు తప్పించుకోగలననే ధైర్యంతో ఉంటాడు కాబట్టి.

      మీరేమో ముందు ఆ దొరికిన వెధవతో పని మొదలెడదాం అంటారు. మిగిలిన తొమ్మిది మంది గూర్చి అడిగితే good policing and transparent governance ఉండాలంటారు. దాన్ని తెలుగు 'చట్టబద్ద పాలన' అంటారనుకుంటాను. అది లేకనే గదా ఈ గోలంతా!

      మన దేశంలోని గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా.. ట్రాఫిక్ రూల్స్ తరహాలో వాదిస్తున్నారు. నాకు మీ వాదనలో లోక్ సత్తా పెద్దమనిషి మరియూ అర్నబ్ గోస్వామి అనే టీవీ ఏంకరాయన కనిపిస్తున్నారు.

      >>For any proposed change towards progress and development, the common man/dalit is often cited as reason why the ruling class cannot implement policies. This is a completely bogus argument to delay and worse not to take any action at all. <<

      'రూలింగ్ క్లాస్' కి ఈ దేశంలో చట్టాలు ఎంత ఘోరంగా దుర్వినియోగ పడతాయో తెలుసు (ఎమర్జన్సీ). అందుకే కొద్దో గొప్పో సందేహిస్తుంటాయి. educated urban elite కి ఆ మాత్రం తటపటాయింపు కూడా ఉండవలసిన అవసరం లేదనుకుంటాను.

      >>We can bitch about foreign papers and opinion from abroad, but, the fact remains that they are right.<<

      ఫారిన్ పేపర్ల వాళ్ళు రైటని మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఎలాగో చెబితే నేను సంతోషిస్తాను.. వాళ్లకి కూడా మన ఈనాడు, సాక్షికి మల్లే ఎజెండా ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి!

      ఇట్లు..

      మీ శిష్య పరమాణువు.

      Delete
    3. You are right, not only well written but spell checked too.

      Delete
    4. >>the fact remains that they are right
      here is such fact

      http://www.youtube.com/watch?hl=en-GB&gl=SG&v=B65M_smGewo

      Delete
  16. రమణ గారు,
    ఆ మధ్య అంధ్రజ్యొతి ఆదివారం అనుబంధం లో అక్కినేని కుటుంబరావు గారి కథ (పేరు గుర్తు లేదు) చదివాను. అందులో 30 ఏళ్ళ కిందట రేపు కు గురైన 'రమజాబీ' గురించి,అప్పటి ప్రజల నిరసన వల్ల హైదరాబాదు లో విధించిన curfew గురించి చెబుతూ నాటి స్ఫూర్తి నేడెక్కడ?అని ప్రశ్నించారు.
    నేటి డిల్లి బాధితురాలి విషయం లో బాధ పడాలో యువ స్ఫూర్తి ని అభినందించాలో తెలియక ఆలోచిస్తు పడుకున్న నేనూ ఒక కలగన్నాను.
    మొహానికి నల్ల బట్ట ముక్క కట్టుకుని CANDLES వెలిగిస్తున్న యువతరమంతా కదలి వెళ్ళి మహిళలు,బాలబాలికలు అని చూదకుండా లైంగిక నేరాలకు పాల్పడుతున్న అన్ని మతాలకు చెందిన మత గురువులను చావ బాదినట్లు,deodarant spray చేసుకోగానె చిత్తకార్తె కుక్కల్లా అమ్మాయిలంతా వాడి వైపు దూసుకురావటమే కాక పూజ చేస్తున్న ఆడాళ్ళూ,వదినలు వాడికి లోబడినత్లు తీస్తున్న ad film makers ను ఉతికి ఆరేసినట్టు,కథా నాయికను 'ఏమే,'ఒసే' అంటూ పిలిచే సినిమా లు తీస్తున్న పూరి జగన్నాథ్,రవి తెజ లను వీపు పగలగొట్టినట్టు,పసిపిల్లలతో reality show ల పేరుతొ vulgar dances వెయించె వాళ్ళను బాదేసినట్టు,రింగ రింగ,కెవ్వు కేక పాటలను రాసిన వాళ్ళ ను నిషేదించినత్తు కలగన్నాను.
    ఆలస్యం గా నిద్ర లెచిన నేను t.v చూద్దునుగా నిన్నతి దాకా డిల్లి బాదితురాలి గురించి కన్నీళ్ళు కార్చిన గొప్ప channels వాళ్ళందరూ year round up top ITEM SONGS countdown చూపిస్తుంటే లొట్టలేస్తు చూస్తుండిపోయాను.

    ReplyDelete
  17. రమణ గారు,
    ఆ మధ్య అంధ్రజ్యొతి ఆదివారం అనుబంధం లో అక్కినేని కుటుంబరావు గారి కథ (పేరు గుర్తు లేదు) చదివాను. అందులో 30 ఏళ్ళ కిందట రేపు కు గురైన 'రమజాబీ' గురించి,అప్పటి ప్రజల నిరసన వల్ల హైదరాబాదు లో విధించిన curfew గురించి చెబుతూ నాటి స్ఫూర్తి నేడెక్కడ?అని ప్రశ్నించారు.
    నేటి డిల్లి బాధితురాలి విషయం లో బాధ పడాలో యువ స్ఫూర్తి ని అభినందించాలో తెలియక ఆలోచిస్తు పడుకున్న నేనూ ఒక కలగన్నాను.
    మొహానికి నల్ల బట్ట ముక్క కట్టుకుని CANDLES వెలిగిస్తున్న యువతరమంతా కదలి వెళ్ళి మహిళలు,బాలబాలికలు అని చూదకుండా లైంగిక నేరాలకు పాల్పడుతున్న అన్ని మతాలకు చెందిన మత గురువులను చావ బాదినట్లు,deodarant spray చేసుకోగానె చిత్తకార్తె కుక్కల్లా అమ్మాయిలంతా వాడి వైపు దూసుకురావటమే కాక పూజ చేస్తున్న ఆడాళ్ళూ,వదినలు వాడికి లోబడినత్లు తీస్తున్న ad film makers ను ఉతికి ఆరేసినట్టు,కథా నాయికను 'ఏమే,'ఒసే' అంటూ పిలిచే సినిమా లు తీస్తున్న పూరి జగన్నాథ్,రవి తెజ లను వీపు పగలగొట్టినట్టు,పసిపిల్లలతో reality show ల పేరుతొ vulgar dances వెయించె వాళ్ళను బాదేసినట్టు,రింగ రింగ,కెవ్వు కేక పాటలను రాసిన వాళ్ళ ను నిషేదించినత్తు కలగన్నాను.
    ఆలస్యం గా నిద్ర లెచిన నేను t.v చూద్దునుగా నిన్నతి దాకా డిల్లి బాదితురాలి గురించి కన్నీళ్ళు కార్చిన గొప్ప channels వాళ్ళందరూ year round up top ITEM SONGS countdown చూపిస్తుంటే లొట్టలేస్తు చూస్తుండిపోయాను.

    ReplyDelete
  18. Gldoc

    డిల్లీ రేప్ కేసు నిందితులు అతి తక్కువ స్థాయి నుండి వచ్చినవారు. మరి వారి తల్లిదండ్రులు ఏరోజుకారోజు పూటగడిచే మార్గం వెతుక్కుంటూ మీరు చెప్పినంత పద్దతిగా పెంచగలరా? సమస్య అక్కడ ఉంటే సంస్కరణ మధ్య సంపన్న తరగతిలో అమలు చేద్దాం అంటున్నారు మీరు. అందుకే నేరం ,నేరస్తుల స్వభావం మరియు పరిస్థితులను అధ్యయనం చెయ్యాలి. అలా చేస్తే మన జైళ్ళు డాక్టర్ రమణగారు చెప్పినట్లు గా ఉపయోగపడతాయి.

    రేప్ చెయ్యబడిన అమ్మాయి, చేసిన అబ్బాయిలు ఇద్దరూ మన దేశ పౌరులే, ముందు ముందు వాళ్ళిద్దరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనికి పరష్కారం ఎక్కడివారిని అక్కడ ఉంచి సాధించలేరు. పైస్థాయిలో ఉన్నవారు క్రిందిస్థాయిలో ఉన్నవారిని కలుపుకుపోతు ఉండాలి. అది వదిలేసి మీరు సూచించినవి ఏవి సమస్యను అంగుళం కూడా కదిలించలేవు. కట్నం ఇవ్వవద్దు, తీసికోవద్దు అని చెపుతున్నారు, అయినా మారుతుందా ...కట్నం యొక్క రూపం మారుతుంది అంతే .

    ReplyDelete
  19. డాక్టర్, ఈ బ్లాగులో మంచి చర్చ జరిగింది. వ్యాఖ్యలను చదవండి.

    http://praja.palleprapancham.in/2012/12/blog-post_24.html

    ReplyDelete
  20. Sure, I agree. No solution or progress is possible because we can never have 100% conviction of all the culprits and we haven't finished the indigenous study of the perpetrators that is well grounded in ground reality. Actually let's us do away with IPC because it only applies to the poor and downtrodden. Oh, I did not realize that we cannot resolve not to take dowry for our son or brother to start the dowry reform process because that would be cruel and unusual and unachievable of course, who am I kidding? I will wait for consensus of all (including the grammar aficionados and 9/11 conspiracy theorists) before any meaningful reform is possible.
    Nmaste'.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.