కొందరు దేశం ముందుకు పోతుందంటారు. ఇంకొందరు వెనక్కి పోతుందంటారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ కోణాల నుండి రోజూ అనేక విశ్లేషణలు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. నేను ఆర్కెలక్ష్మణ్ కామన్ మేన్ లాంటివాడిని. అంచేత నాకు మాత్రం దేశం స్థిరంగానే ఉందనిపిస్తుంది!
ఒక్కో దేశానికి ఒక్కో సమస్య. ఏ సమస్యనీ ఇంకో సమస్యతో పోల్చడానికి లేదు. మనది అన్నం సమస్యయితే అమెరికా వాడిది ఆయుధాల సమస్య. సరే! ఈ సమస్యలతో కాపురం చేస్తూ.. వాటి పరిష్కార మార్గాలకై అన్వేషణ చేస్తూ.. మానవ సమాజం, నాగరికత ముందుకు పురోగమిస్తుంది. అయితే ఆ పురోగమనం అంగుళాల్లో ఉందా.. అడుగుల్లో ఉందా అన్నది కూడా చర్చనీయమే! ఇక్కడి దాకా నాకు పేచీ లేదు.
ఐతే.. కొన్ని అమానవీయ సంఘటనలు విన్నప్పుడు గుండె కలుక్కుమంటుంది. ఢిల్లీలో జరిగిన రేప్ మనని వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబంలో సొంత మనిషి చనిపోయినంత దుఖం. ఇలాంటి సంఘటనలు మనిషి మనుగడకే ప్రమాదం. ఇవి ఇక ఎంత మాత్రం జరగరాదు.
కారంచేడు, చుండూరు మారణ హోమాలకి ఈ దేశ చరిత్రలోనే మూలాలున్నాయి. రైతుల అత్మహత్యలు ఈ దేశరాజకీయ పార్టీల క్షమించరాని నిర్లక్ష్యం కారణంగా ఉంది. కానీ.. పాశవికంగా రేప్ చేసి.. హత్య చెయ్యడం, చేతబడి పేరుతో సజీవ దహనాలు, ఏసిడ్ దాడులు మన అజ్ఞానానికి, అహంకారానికి, దుర్మార్గత్వానికి ప్రతీకలు.
సామాజిక, రాజకీయ అవగాహనతో చక్కటి విశ్లేషణలు చేస్తూ.. ప్రజాసంక్షేమం గూర్చి ఆలోచన చేస్తున్న మేధావులకి మన దేశంలో కొదవ లేదు. దురదృష్టవశాత్తు.. వారి ఆలోచనలు చేరవలసిన వారికి చేరడం లేదు. నేర మనస్తత్వం కలవాడు ఇవేవీ పట్టించుకోడు. వాడికి చదువు లేకపోవచ్చు. ఉన్నా పత్రికలు చదవకపోవచ్చు.
మన సమాజంలో చాలా స్పష్టమైన డివిజన్ ఉంది. చదువుకునే అవకాశం లేక, ఆ చదువు ఇచ్చే జ్ఞానం పొందే అవకాశం లేనివారు ఒక కేటగిరీ. చదువుకున్నప్పటికీ.. ఆ చదువు.. తమ ఉద్యోగ అర్హతగా మాత్రమే చదివే డిగ్రీ రాయుళ్ళు. వీరిది ఇంకో కేటగిరీ. రెండో ప్రపంచయుద్దం ఎందుకు జరిగిందో కూడా తెలీని 'విద్యావంతుల్ని' నేను చూశాను. ఇది కూడా నిరక్షరాస్యతే!
మానవ సమాజం గూర్చి కనీస అవగాహన లేని వారిలో నేర మనస్తత్వం ఎక్కువగా ఉండి ఉండొచ్చు.. అని అనుకుంటున్నాను. వీరిని ఎడ్యుకేట్ చెయ్యడానికి ఆవేశంతో లక్ష బ్లాగులు రాసినా మనకి మిగిలేది వేళ్ళ నొప్పి మాత్రమే! అయితే వీరిని చాలా ప్రతిభావంతంగా ఎడ్యుకేట్ చెయ్యొచ్చు. ఎలా? ఎలానో చెప్పడానికి.. నేను ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం గూర్చి మాత్రమే ప్రస్తావిస్తాను.
మనం తెలుగువాళ్ళం. మనకి భయంకరమైన సినిమా పిచ్చి. ఒకప్పుడు తమిళ తంబిలకీ పిచ్చి ఉండేది. ఇప్పుడు మనం వారిని దాటేసేశామా? సరే! ఎవడి పిచ్చి వాడికానందం. నేను సినిమా చూసేవాళ్ళని ఎగతాళి చేస్తున్నానని అనుకోకండి. ఒకప్పుడు నేనూ ఆ పిచ్చలో బ్రతికినవాణ్ణే.
సినిమాలు చూడ్డం అనేదేమీ దేశ సేవ కాదు. దురద పెడితే వీపు గోక్కోడం లాంటిది. అయితే మనకున్న ఈ దురద రోగాన్నే వైద్యం కింద మారిస్తే ఎలా ఉంటుంది?! ఇక్కడ రోగాన్నే వైద్యానికి ఉపయోగించుకోవడం.. అనగా ఈ సినిమా పిచ్చినే వాడుకుంటూ సమాజాన్ని ఎడ్యుకేట్ చెయ్యాడానికి ప్రయత్నం జరగాలి. (అట్టడుగు సమాజంలో సినిమా హీరోల రీచ్, పెనిట్రేషన్ గణనీయంగా ఉంటుంది.)
ఇప్పుడు నా నమ్మకానికి కారణమైన ఉదాహరణని మీకు చెబుతాను. నేను హౌజ్ సర్జన్సీ చేసే రోజుల్లో ఒక పేషంటుతో పాటు ఎక్కువమంది ఎటెండెంట్స్ వచ్చినప్పుడు.. అంతమంది జనాల మధ్య వైద్యం చెయ్యవలసిన ఇబ్బందిని తప్పించుకోవటానికి.. ఒక చిన్న ఎత్తు వేసేవాళ్ళం. 'అర్జంటుగా బ్లడ్ కావాలి. బ్లడ్ బ్యాంక్ కి వెళ్ళి మీ బ్లడ్ శాంపిల్స్ పరీక్షకివ్వండి.' అని చెప్పంగాన్లే.. ఒక్క నిముషంలో వార్డ్ మొత్తం ఖాళీ అయిపొయ్యేది! ముఖ్యమైన కుటుంబసభ్యులే మిగిలేవాళ్ళు. హాయిగా వైద్యం చేసుకునేవాళ్ళం. ఈ ఉదాహరణ ఎందుకు రాస్తున్నానంటే ఒకప్పుడు రక్తం ఇవ్వాలంటే ఒణికి పొయ్యేవాళ్ళం అని చెప్పడానికి.
ఇప్పుడు ధైర్యంగా రక్తదానాన్ని వలంటీర్ చేస్తున్నారు. కారణం.. చిరంజీవి. లక్షమంది మేధావులు లక్ష వ్యాసాలు రాసి ఉండవచ్చు. ప్రచారానికి ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి ఉండొచ్చు. కానీ.. రక్తదానం విషయంలో సామాన్య జనంలో ఉండే సందేహాలు తొలగించడంలో చిరంజీవి పాత్ర చాలానే ఉంది. ఇందుకు మనం చిరంజీవిని హృదయపూర్వకంగా అభినందించాలి. తమ అభిమాన అన్నయ్య కోసం తమ్ముళ్ళు క్యూలో నించుని మరీ రక్తం ఇచ్చారు. దీనికి విపరీతమైన ప్రచారం వచ్చింది. రక్తదానంపై చాలామందికి అపోహలు తొలిగిపొయ్యాయి.
అంతర్జాతీయంగా నటీనటులు అనేక రాజకీయ సమస్యలపై ప్రజల, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి ఎరస్టులకి కూడా వెనుకాడట్లేదు. జార్జ్ క్లూనీ అంతటి పెద్ద నటుడే నిరసన తెలుపుతూ సూడాన్ ఎంబసీ ముందు బేడీలు వేయించుకున్నాడు. ఆస్కార్ ఎవార్డ్ విన్నర్ సీన్ పెన్ చాలా చురుకైన రాజకీయవాది. హిందీ నటుడు బలరాజ్ సహానీ కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. ఎమర్జన్సీలో దేవానంద్, కిషోర్ కుమార్లు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.
నేనయితే అల్ప సంతోషిని. తెలుగు నటీనటుల దగ్గరనుండి గొప్ప పొలిటికల్ ఏక్టివిటీ ఆశించట్లేదు. సినీనటులు అద్దాల మేడల్లో ఉంటారు. వారి సమస్యలు వారివి. ప్రభుత్వాలు వారిపై ఆదాయపు పన్ను దాడి లాంటి అనేక ఎత్తుగడలతో నియంత్రించవచ్చు. కాబట్టి వీరు గిరిజనుల భూమి సమస్య, మూలపడుతున్న ప్రజారోగ్యం లాంటి హాట్ టాపిక్స్ జోలికి వెళ్ళనవసరం లేదు. అమీర్ ఖాన్ లాగా సాఫ్ట్ టార్గెట్స్ ని ఎంచుకుని.. ఒక గొప్ప సోషల్ యాక్టివిస్ట్ పోజులు కూడా కొట్టవలసిన అవసరం కూడా లేదు.
మహేష్ బాబు కోకకోలాతో కోట్లు సంపాదించాడు. మంచిది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి. అంచేత ఇంకా సంపాదించుకోమనే నా సలహా. జూనియర్ ఎన్టీఆర్ కూడా నవరత్న ఆయిల్ తో పాటుగా ఇంకొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉండాలని కోరుకుంటున్నాను.
అయితే.. వరంగల్ లో విద్యార్ధినులపై ఏసిడ్ దాడి జరిగినప్పుడు.. మన పాపులర్ హీరోలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి.. తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడినట్లయితే సమాజానికి చాలా మంచి జరిగేదని నా అభిప్రాయం. ఆ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. మన తెలుగు సినిమా హీరోలు ఎందుకనో తమకి మాత్రమే సాధ్యమయ్యే ఎవేర్ నెస్ కార్యక్రమాలు చెయ్యట్లేదు!
మన హీరోలు స్త్రీలపై అత్యాచారాలకి వ్యతిరేకంగా (ప్రకటనల తరహాలో) సందేశమివ్వాలి. వారి సందేశానికి ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం కల్పించాలి. చిరంజీవి కల్పించిన రక్తదాన కాంపెయిన్ వంటిది.. స్త్రీలపై అత్యాచార వ్యతిరేకతలో కూడా జరగాలి. మన హీరోలు అత్యాచారాల్ని వ్యతిరేకించే యువతకి రోల్ మోడల్ గాను.. బ్రాండ్ ఎంబాసిడర్లు గానూ వ్యవహరించాలి. తమ అభిమానుల్ని ఈ కాంపెయిన్ లో పాల్గొనేలా మోటివేట్ చెయ్యాలి. ఇది ఈ సమాజ పౌరులుగా హీరోల ప్రాధమిక బాధ్యత. నటులు ఈ విధంగా చేసే విధంగా తెలుగు సమాజం కూడా వారిపై వత్తిడి తీసుకురావాలి.
సరే! మన హీరోలు కల్పించే ప్రచారం మూలాన.. 'సమాజంలో ఆడవారిపై దాడులు ఏమాత్రం తగ్గలేదు.' అనుకుందాం. అంటే దానర్ధం.. 'ఫలానా హీరోని సినిమాలో ఐతే సరదాగా చూస్తాం. అంతేగానీ.. మాకు నీతులు బోధించడానికి అతనెవరు?' అనుకున్నారనుకోవాలి.
అప్పుడు మన మాస్ ప్రేక్షకులు తెలివైనవాళ్ళని.. వాళ్ళు చూపించే అభిమానం కేవలం వినోదపరమైందేనని.. అనవసరంగా తెలుగు హీరోల ప్రభావాన్ని అతిగా అంచనా వేసుకుని.. టైం వేస్ట్ చేసుకున్నామని అర్ధమౌతుంది. ఇదీ నాకు శుభవార్తే! ప్రజలు 'కేవలం వినోద సాధనంగా సినిమాల్ని చూస్తామే తప్ప.. వాస్తవప్రపంచంలో మా సొంత అభిప్రాయాలు మాకున్నయ్!' అని చెబుతుంటే అది శుభవార్త గాక మరేమవుతుంది?
అప్పుడు మన మాస్ ప్రేక్షకులు తెలివైనవాళ్ళని.. వాళ్ళు చూపించే అభిమానం కేవలం వినోదపరమైందేనని.. అనవసరంగా తెలుగు హీరోల ప్రభావాన్ని అతిగా అంచనా వేసుకుని.. టైం వేస్ట్ చేసుకున్నామని అర్ధమౌతుంది. ఇదీ నాకు శుభవార్తే! ప్రజలు 'కేవలం వినోద సాధనంగా సినిమాల్ని చూస్తామే తప్ప.. వాస్తవప్రపంచంలో మా సొంత అభిప్రాయాలు మాకున్నయ్!' అని చెబుతుంటే అది శుభవార్త గాక మరేమవుతుంది?
చివరి తోక..
నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం ఇవ్వాల్టి తెలుగు సినీనటులకి 'సమాజ హిత' కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్ కి ఉండేది. నాది సమాచార లోపమనీ.. మన నటులు 'నా దృష్టికి రాకుండా' చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మిత్రులు చెప్పినట్లయితే.. క్షమించమని కోరుకుంటూ.. నా పోస్ట్ ఉపసంహరించుకుంటాను.
ఈ పోస్ట్ లో వార్తాపత్రికలు చదవని.. సినిమాలు విరివిగా చూసే వ్యక్తుల్ని ఎడ్యుకేట్ చెయ్యడం గూర్చి మాత్రమే రాశాను. కేవలం వీరు మాత్రమే భావి నేరస్థులనే అభిప్రాయం నాకు లేదు. కానీ వీరు మన సమాజంలో చాలా ముఖ్యమైన సెక్షన్. నేను క్లాస్ బయాస్డ్ కాదు. గమనించగలరు.
(photo courtesy : Google)
చక్కని సూచన చేశారు రమణ గారు. మీరు చెప్పిన రెండు రకాల వాళ్ళను ప్రభావితం చేసే మీడియా సినిమాలు, టివిలు. సినిమాలలో ఆడవాళ్ళను అర్ధ నగ్నంగా నీచంగా చూపే సంస్కృతి మారితే బావుంటుంది. మనం రావాలనుకుంటున్న మార్పు అక్కడనుండే మొదలవ్వాలి.
ReplyDeleteచాలా బాగుంది డా. రమణ గారు. మీ ఆలోచన నిజమవ్వాలని కోరుకుంటున్నా .
ReplyDeleteexcellent.. chaalaa baagaa raasaaru. mi aalochanatho 100% Ekeebhavistunnaa!
ReplyDeleteచక్కని సూచన చేశారు రమణ గారు.
ReplyDeleteమంచి అయినా చెడు అయినా ప్రభావితం చేయడం ఇప్పుడు హీరో ల పని. కచ్చితంగా వాళ్ళు చెపితేనే మాస్ వింటారు. క్లాస్స్ నేరాలు సంగతి అటు ఉంచితే మాస్ కి మాస్ హీరోలు కాస్త క్లాస్స్ ని జతచేసి ఎడ్యుకేట్ చేస్తే బాగానే ఉంటుంది.
ReplyDeleteరాజకీయ పార్టీలకి ప్రచారం చేసే కంటే ఇది చాలా మంచి పని నాకు అనిపిస్తూ ఉంటుంది.
రమణ గారు బాగుంది. చాలా బాగా చెప్పారు .
సరైన పాయింట్ చెప్పారండీ....
ReplyDeleteనైస్ పోస్ట్..
చాలామంచి సూచన రమణ గారు... మీ పోస్టును ఎవరైనా సినీజీవులకు చేర్చగలిగి హీరోలు పాటిస్తే బాగుండును. వారు చేయవలసిన అసలైన సమాజ సేవ ఇది.
ReplyDeletesir,
ReplyDeletethey are busy with modelling for jewellary shops.try others.
Very well Said
ReplyDeleteఅయ్యా రమణ గారూ,
ReplyDeleteమీరు పనిలేక రాస్తే మా హీరోలూ పనిలేక వున్నారనుకుంటున్నారా?ప్రతి సినిమా లో వెతికి వెతికి item girl ను తెచ్హేదెవరు?ఆయనెవరొ రాసినట్టు బంగారు కొట్లకు brand ambassadors గా వుండేదెవరు?
టపోరి,రింగ రింగా ,కెవ్వు కేక,డీబిరి,నాకు తిక్కుంది పాటల తో మమ్మల్ని అలరిస్తున్న మా హీరో ల జోలి కి వచ్హారో ఖబద్దార్!!!!!!!!
బాగా చెప్పారు. అందులో ఈ మధ్య ఆంధ్రా మన్మధుడికి అడిషనల్ వర్క్ వచ్చింది. ప్రతినెల నిమ్మగడ్డ ను పరామర్శించటానికి జైల్ కు వెళ్లి రావటం, వస్తూ వస్తూ యువనేతను కలసి కబుర్లు చెప్పటం. అడ్డాదిడ్డంగా వందల కోట్లు సంపాదించటం కోర్టుల చుట్టుతిరగటం. ఇది ఇప్పటి తెలుగు జాతి సంస్కృతి.
ReplyDeleteమంచి సూచన చేసారండీ...ఎవరైనా పాటిస్తే బాగుండును...
ReplyDeleteఇంతకన్నా పనికొచ్చే(పనిచేసే) అయిడియా రాలేదా మీకు :)
ReplyDeleteఎన్టీఆర్ స్వభావ సిద్దంగా సమాజ హితుడు అందుకే ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టారు. ఇప్పుడెవరున్నారండీ, చిరంజీవి కూడా పదవీ వ్యామోహంతో కొన్ని చేపట్టినా అందులో వ్యాపార దృక్పధాన్ని ప్రజలు విస్మరించలెకపొయారు . అయినా సినిమా నటులు గ్లామర్ వదిలేసి మీరు చెప్పిన పనులు చెయ్యాల్సిన అవసరం ఏముంది ? చెయ్యరు గాక చెయ్యరు. ఓట్లు అడుక్కున్న చిరంజీవే పట్టించుకోవడంలేదు ఇప్పుడు, మిగిలవారికేం ఖర్మ పట్టింది?
మన నాయకులను మనమే తయారు చేసుకోవాలి కాని, వాళ్ళని వీళ్ళని డిమాండ్/రిక్వెస్ట్ చెయ్యడం ఏంటి ???? వీల్లెవరు కష్టపడి సినీహీరోలు కాలేదు సమాజ స్పృహ ఉండడానికి. ఇక వీళ్ళ అభిమానులెంత వివేకం ఉన్నవారో మీరే చెప్పాలి.
కాస్తో కూస్తో స్వశక్తి పై వచ్చిన నటులకు వీరంత పలుకుబడీ ఉండదు, వీళ్ళతో పోటీ పడుతూ మిగిలినవి ఆలోచించే తీరికా వుండదు.
This comment has been removed by a blog administrator.
Deleteఅయ్యా మౌళిగారు,
Delete"...మన నాయకులను మనమే తయారు చేసుకోవాలి...." చాల బాగా చెప్పారు.
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇదివరకిటికంటే ఇప్పుడే జనాలు (అంటె మనము అందరము) నీతిబాహ్యంగ తయారయారని.
మనకి కులం, మతం, పార్టీ మాత్రమే ముఖ్యం. ఇక మనకి అంతకంటె గొప్ప నాయకులు రారు.
కృష్ణ
మన సినీ అభిమానులు ఎప్పుడో కులాల లెక్కన విడిపోయారు. ఇప్పుడు నటన ఎవడకి కావాలి. ఎవరో మీలాంటి వాళ్ళు తప్ప.
ReplyDeleteమా కులపు హీరో ఎంత దరిద్రంగా తితక్కలాడిన, ఎన్ని బూతులు మాట్లాడిన , ఎన్ని ట్రైన్లు, విమానాలు తోడ గిల్లి ఆపిన మేము చూస్తాం. ఎందుకంటే వాడు మా కులపోడు కాబట్టి.
ఇప్పుడు హీరోలు బిజీ గా ఉన్నా మనకి ఇంకో ఛాయస్ కూడా ఉంది.
నాగార్జున చిన్న కొడుకు తో, బాలకృష్ణ కొడుకు తో గాని, లేక పవన్ కళ్యాణ్ కొడుకుతో గాని చెప్పించిన ఆ వీరాభిమానులు కచ్చితంగా పొలో మంటూ ఎగబడతారు.
వాళ్ళు కూడా దొరక్కపోతే వాళ్ళ ఇంట్లో పనిమనుషులతో అయిన చెప్పించచ్చు , భేషుగ్గా వింటారు మన అభిమానులు.
:venkat
Ramana sir comment on the cartoon pleez :)
ReplyDeletehttp://www.thehindu.com/opinion/open-page/doctors-in-the-dark/article4253548.ece?homepage=true
జ్యోతిర్మయి, Chandu S, sharma, శ్రీనివాస్ పప్పు, వనజవనమాలి, రాజ్ కుమార్, వేణూశ్రీకాంత్, srinivas reddy.gopireddy, హరే కృష్ణ, sri nivas, శ్రీలలిత, Mauli, venkat మరియూ అజ్ఞాతలు..
ReplyDelete(అందురి పేర్లకి చివర 'గారు' చేర్చి చదువుకొమ్మని ప్రార్ధన.)
అందరికీ ధన్యవాదలు.
"ముల్లుని ముల్లుతోనే తియ్యాలి." అన్నదే ఈ పోస్ట్ రాయడానికి నాకు ప్రేరణ.
చదువుకున్న వారు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, మేధావులు ఈ సమాజానికి దిశానిర్దేశం చెయ్యాలి. సమాజాన్ని ఎడ్యుకేట్ చెయ్యడంలో చొరవ తీసుకోవాలి. ఓట్లడుక్కునే రాజకీయ పార్టీలు సమాజహిత భావజాలానికి నాయకత్వం వహించడంలో ముందుండాలి. ఇప్పుడు మన సమాజంలో ఇవేవీ జరగడం లేదు.
సినిమా నటులు సమాజం పట్ల అవగాహన కలిగి ఉంటారనే భ్రమలు నాకు లేవు. అదొక వినోదాన్నిచ్చే పరిశ్రమ. వారికి మంచి ఆలోచనలు ఉంటే మంచిదే. ఉండకపోయినా కొంపలు మునిగేదేమీ లేదు. స్పూర్తి నివ్వవలసిన యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, రాజకీయ వేత్తలే.. తమ కులం పరిధి దాటి ఆలోచించలేని ఈ సమాజంలో.. సినిమా నటుల నుండి గొప్ప చైతన్యాన్ని ఎలా ఆశిస్తాం!
రాత్రికి రాత్రి మన ఆలోచనలు మారవు. సినిమా జీవులూ అంతే. అయితే టపాలో నేను రాసినట్లు.. సినిమా హీరోలకి సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండలేని పరిస్థితి ఈ సమాజం కలిపించాలి. వత్తిడి చెయ్యాలి. అప్పుడు ఇష్టం లేకపోయినా.. ఒక యాడ్ చేస్తున్నట్లే వారు తమ ప్రయాణాన్ని మొదలెట్టొచ్చు.
సినిమా హీరోల్ని వారి వృత్తిని, సంపాదనని వదిలేసుకుని సోషల్ సర్వీస్ చెయ్యమనడం లేదు. వారి గ్లామర్ ని, ఫాలోయింగ్ ని ఒక మంచి పనికి అప్పుగా ఇమ్మని అడుగుతున్నాం. ఇందుకోసం వారు నెలకో రోజు కేటాయించినా సరిపోతుంది. (ఆ ఒక్క రోజు కూడా మాకు సంపాదనే ముఖ్యం అనే నటులకి మనలాంటి వాళ్ళం తలా కొంత వేసుకుని పే చేద్దాం.)
ప్రతి సినిమా షో మొదలయ్యే ముందు.. మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ లు.. ఆడియన్స్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.. "స్త్రీలని గౌరవించండి. వారికి హాని చెయ్యొద్దు." అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక అప్పీల్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
సినిమా హీరోలతో ఈ సమాజంలో ఒక section of people ని ఎడ్యుకేట్ చెయ్యొచ్చునన్న నా బేసిక్ థాట్ ని మీరు సెకండ్ చేసినందుకు ధన్యవాదాలు.
@"స్త్రీలని గౌరవించండి. వారికి హాని చెయ్యొద్దు." అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక అప్పీల్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
Deleteఅప్పుడు జనం ముందు మీ సిన్మా లో హీరోయిన్ ని యెంత గౌరవిన్చావ్ అని అడిగితె మరి? ముందు సిన్మా హీరోలు మాట్లాడే హక్కు సంపాదించుకోవాలి, మీరు అడిగే ప్రచారానికి హీరోయిన్స్ పనికి రావడం లేదు :)
అయినా ఈ ప్రశ్న ప్రభుదేవా అడిగితె జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ? :)
Mauli గారు,
Deleteఅవున్నిజమే. ఆ ప్రమాదం ఉంది. అప్పుడు.. 'గౌరవం' అన్న పదం ఎత్తేస్తే సరిపోతుంది.
సగటు తెలుగు సినిమా హీరోల వెర్రి అభిమాని, తమ హీరో ఏంచేసినా.. చివరికి నేరం చేసినా.. అందులో ఒక హీరోయిజం చూస్తాడు. దురద పుట్టి వీపు గోక్కుంటే కూడా అందులో అతనికి ఒక స్టైల్ కనబడుతుంది. వీరిలో ఎక్కువమంది నిరక్ష్యరాస్యులు. ఒకరకంగా వీరు అమాయకులు, అజ్ఞానులు. అందుకే వీళ్ళకి వారి సూపర్ హీరో గారితో ఒక మంచిమాట చెప్పిస్తే వింటారని నా అనుమానం.
సినిమా హీరోలు చెప్పే అంశం కూడా.. 'ట్రాఫిక్ సూత్రాలు పాటించండి'.. వంటి నీతిసూత్రమేనని నా అభిప్రాయం. అంతకుమించి దానికి ప్రాముఖ్యత లేదు. (ఏ హీరో అయినా అత్యాచార నేరంలో నిందితుడయినట్లయితే ఈ మాట చెప్పడానికి కూడా అనర్హుడే.)
ఇక మీరు ప్రభుదేవ సంగతి చెప్పారు. అది నైతికతకి సంబంధించిన అంశం. ఈ ఏరియా కొంచెం కాంప్లికేటెడ్. ఒక వ్యక్తికి నైతికతే ప్రధానమని భావిస్తే.. మనకి తెలిసిన అన్ని రంగాల ప్రముఖులు.. విప్లవ రచయితలు, అవధానాలు చేసే సరస్వతి స్వరూపులు, అభ్యుదయ కవులు, సంగీతకారులు, స్వామిజీలు.. ఎవ్వరూ కూడా మిగలరు. అప్పుడు మన పని ఎవరితో కానిస్తాం!?
"అవధానాలు చేసే సరస్వతి స్వరూపులు,సంగీతకారులు, స్వామిజీలు "
Deleteరమణ గారు,
ఇంత క్రితం మీరు హిందుత్వ వాదిని కాదని చెప్పుకొన్నారు. కాని మీవాదన బలంగా వినిపించటనికి అభ్యుదయ కవులు,విరసం సభ్యులతో వారి పేర్లను ఎలా కలిపి రాస్తారు? మీరు వారి పేర్లు ప్రస్తావించకుండా ఉండి ఉంటె బాగుండేది. వాళ్ల నైతికత గురించి హిందుత్వ వాదులు చూసుకొంటారులేండి. మీరు వామపక్ష వాదై ఉండి, ప్రజలను చైతన్య పరచటనైకి పెట్టుబడివర్గానికి కొమ్ము కాచే, కళాకారులతో యాడ్ ఇప్పించాలనటం అని మీరు సూచించిన సలహ గురించి ఎందుకులె వ్యాఖ్యానించటం అని ఊరుకొంట్టున్నాను.
ప్రభుదేవా పేరు సరదాగా ప్రస్తావించాను, వ్యక్తిగా ఆయనకు నేను అభిమానిని అండీ.
Deleteసినిమా హీరోలు అప్పటి రామారావు, అక్కినేని వంటి వారు కాదు. వీరు కోకా కొలా నో, బంగారాన్నో, ఇంకా బట్టలకో ప్రచారం చేస్తున్నారు అంటే డబ్బు తీసికొని, అందుకే వారి పనికి విలువ ఉంది అక్కడ. అలాగే మీరు చెప్పిన సామాజిక కార్యక్రమాలు కూదా వారికి ఫీజిచ్చి చేయించుకోవడం ఉత్తమం . ఊరికే ఉదారంగా వారు చెయ్యలేరు, అలా చేసి ఇంకోరకమైన హైప్ కోసం ప్రాకులాడే పరిస్థితికి వాళ్ళని, వాళ్ళ అభిమానుల్ని దిగజార్చి మన కష్టాలు పెంచుకోవద్దు అని అనుకొంటున్నాను.
అలాగే తమిళ సినీ పరిశ్రమ లో హీరోయిన్ వస్త్రధారణ పై కొంత పరిమితులు ఉండేవి, ఇప్పుడెలా ఉందొ తెలియదు.. మన ప్రభుత్వం కూడా ఈ విధానం ఫాలో అయితే కొంతలో కొంత మార్పు వస్తుంది.
అందుకోండి అభినందనలు డాక్టర్ రమణ గారు. మీరిచిన్న సలహా చాలా బాగుంది. ఈ టపాను రాసి మన సమాజంలో పురుష సింహాల పలుకుబడిని, కొదమ సింహా పోటొను సింబాలిక్ గా ప్రస్తావిస్తూ బ్లాగులోకానికి మరోమారు తెలియజేసారు. ఏనుగు చచ్చినా బ్రతికినా దాని విలువ ఒకటే, అలాగే చిరంజీవి ముసలి వాడై, సినేమాలలో నటించకపోయినా,మగహీరొల విలువను మీరు నొక్కి చెప్పి పురుషజాతి అభిమానాన్ని సంపాదించుకొన్నారు. సామాజిక పరిజ్ణానంలో, క్రియేటివిటి లో, తెలివితేటల లో అన్నిరంగాలలో మగవారు ఎప్పుడు ముందజలో ఉంటారనటానికి మీరిచ్చిన సలహా/సూచించిన ఉపాయమే ఒక ఉదాహరణ. ఎవ్వరు మీరు రాసిన దానికి ప్రత్యామ్న్యం మార్గం చూపలేకపోయారు. ఎమైన మరొకసారి సమాజం పైన పురుషులపట్టును తెలివితేటలతో నిలబెట్టినందుకు థాంక్స్. కత్తిలాంటి పదునైన మీ వ్యూహం చాలా బాగుంది. మీకు చిన్న హింట్ ఇస్తే చేలరేగి పోతారు సుమా! :) :)
ReplyDeleteమంచి ఆలోచన. వాళ్ళ సినిమా విడుదలైనప్పుడు, పైరసీని అరికట్టండి అని పిలుపునిస్తే, పనులు మానుకొని మరీ, పైరసీదారులను పట్టించిన ఘనత ఉన్న అభిమాన సంఘాల వాళ్ళు, ఈ విషయం లో కూడా స్పందిస్తారు. అందరూ కాకపోయిన పర్లేదు. ఎక్కడో ఓ చోట మొదలవ్వాలి. హీరోలకు పోయేది ఓ అరగంట, కాని దాని వల్ల సమాజం లో కదలిక వస్తే, అంతకన్నా కావలసిందేముంది.
ReplyDeleteintha manchi post ki comments kuda thakkuve.
ReplyDeleteAnand bhavan lo bajji lapaati kuda cheyaledu
Below average post
ReplyDelete"తమిళ సినీ పరిశ్రమ లో హీరోయిన్ వస్త్రధారణ పై కొంత పరిమితులు ఉండేవి"
ReplyDeleteసహజత్వం పేరుతో హీరొయిన్ కి జాకేట్ వేయకుండా మొదల్ మరియాదై లో రాధ ను సినేమా మొత్తం చూపిస్తారు. ఇంకొక సినేమాలో రంజితను చూపిస్తారు. భారతీయ సినేమాను బ్రష్టు పట్టించటంలో మొదట తమిళ సినేమానే చెప్పుకోవాలి. బూతులను మాటలలో,పాటలలో విరివిగా వాడటం మొదలుపెట్టింది తమిళులె.వెకిలి కామేడి వాళ్ల ప్రత్యేకత.
This comment has been removed by a blog administrator.
Deleteసినిమా హీరోయిన్ల వస్త్రాలకి, రేపులకి కనెక్షనేంటి!?
ReplyDeleteఫ్యాక్షన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు హత్యలు చెయ్యటం మొదలెట్టలేదు కదా!
ఇండియాలోని జనాలకి వినోదానికి, వాస్తవానికి గల తేడా తెలుసనుకుంటాను.
(భారత్ సంగతి మాత్రం నాకు తెలీదు.)
This comment has been removed by a blog administrator.
Deleteనేనయితే మీ టపా సినిమా హీరోల గురిమ్చికాబట్టి తమిళ సినిమాల గురించి ప్రస్తావిమ్చానండీ, హీరోయిన్ల వస్త్ర ధారణకి, రేపులకి సంబంధం ఉండాల్సిన పనిలేదు.
Deleteనేను సీరియస్ గానే రాస్తున్నాను. దయచేసి నీతిబోధనలు వద్దు.
Deleteదాదాపు పుష్కరకాలం తరవాత ఒక కొత్త తెలుగు సినిమా.. మహేష్ బాబు 'పోకిరి' (డివిడి) చూశాను.
సినిమా అంతా చంపుకోడమే! హీరోయిన్ కి దుస్తులు కూడా పొదుపుగా, పొట్టిగా వాడారు.
నాకు సినిమా అయిపోయిన తరవాత.. హీరోగారిలా ఎవర్నీ తన్నాలనిపించలేదు. కాల్చెయ్యలనిపించలేదు. ఎవరినైనా రేప్ చెయ్యలనే తలంపే రాలేదు. ఏదో కార్టూన్ సినిమా చూసినట్లు అనిపించింది. నవ్వేసుకున్నాను.
నాకు రాని చెడ్డ ఆలోచనలు ఇంకెవరికైనా ఎందుకొస్తాయి!? బ్రతకడానికి చదువుకున్న చదువు తప్ప.. నేను స్పెషల్ వ్యక్తిని కాదు గదా!
తెలుగు సినిమాలు చూడంగాన్లే.. మీకెవరికైనా తీవ్రమైన మానసిక కోరికలు / ప్రకోపం కలిగి (చంపుదామనో, రేపులు చేద్దామనో).. అతి కష్టంతో ఆ కోరికల్ని అణుచుకుంటున్నట్లయితే.. దయచేసి మీ అనుభవాలు కూడా రాయండి. అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాను.
అంతేగానీ.. మేము మాత్రమే ఉన్నతంగా ఆలోచించగలమని.. తాము తప్ప మిగిలినవారందరూ చెడిపోతారంటూ.. (చెడిపొయ్యేవారి తరఫున) వకాలత్ పుచ్చుకుని moral policing చేసే దైవాంశ సంభూతుల్ని చూస్తుంటే చికాగ్గా ఉంది. అంతే!
"నాకు రాని చెడ్డ ఆలోచనలు ఇంకెవరికైనా ఎందుకొస్తాయి!?"
Deleteమీరు చెప్పుకోవడానికి ఇష్టపడని మహానుభావులు మరి :)
నేరం చేయడానికి కొంతమంది అవకాశం కోసం చూస్తారు, కొంతమంది అవకాశమున్నప్పుడు చేస్తారు. ఇంకొంత కొంతమంది అవకాశం కోసం ప్రయత్నిస్తారు. అందరూ మీలా డాక్టర్లయి హాస్యం కోసమే సినిమాలు చూడరు. బాలక్రిష్ణ సినిమాలు 30మార్లు చూసే వాళ్ళలో మీరున్నారా? మీ టేస్ట్ స్వర్గీయులు నాగయ్య, సావిత్రి, సూర్యకాంతం. నీతిగా వుండండ్రా అని అంటే అదేదో దొంగలా పోలీసింగ్ అని మీరెందుకు చికాకు పడిపోవాలి? ఇమ్మోరల్ ట్రాఫికింగ్ చేయాండ్రా అని చెబితే ఒళ్ళు మండాలిగాని.
>>మీరు చెప్పుకోవడానికి ఇష్టపడని మహానుభావులు మరి :)<<
Deleteఅవును. అసలు పేరే లేని అజ్ఞాతల కన్నా నేను చాలా బెటర్ కదూ!
>>బాలక్రిష్ణ సినిమాలు 30మార్లు చూసే వాళ్ళలో మీరున్నారా?<<
నేను లేను. మీరున్నారా? బాలకృష్ణ సినిమా అన్నిసార్లు చూసేవాళ్ళు హంతకులా? రేపిస్టులా? మీరే చెప్పాలి.
>>నీతిగా వుండండ్రా<<
నా సమస్య ఇదే! నీతిగా ఉండమని ఎవరికి చెబుతున్నారు?
నాకు ఈ నీతులు చెప్పేవాళ్ళంటే ఎలర్జీ! దొంగలని అనుమానం కూడా!
నాకు చిత్తూరు నాగయ్యంటే చాలా ఇష్టం. అయితే బ్లాగుల్లో చిత్తూరు నాగయ్య కబుర్లు చెప్పేవాళ్ళంటే పరమ చిరాకు.
This comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
Deleteరమణ గారూ,
ReplyDeletePsychological గా diseased people ని పక్కకుపెడితే, రెగ్యులర్ పీపుల్ లో apart from power, desire & opportunity....
మీకు తెలిసి, రేప్ మీద సైంటిఫిక్ స్టడీస్ ఏమైనా కండక్ట్ చేయబడ్డాయా, అయితే ఆ స్టడీస్ ఏమైనా స్పెసిఫిక్ పాటర్న్ ని ఏమైనా నోటీస్ చేసాయా?
Ramana ji
ReplyDeleteArundhati chusi, mee opinion cheppamani request chesthe, meeru Pokiri chudatam, emanna bagunda?
Recently Maheshbabu did a video called MARD 'Men Against Rape and Discrimination', check the link http://www.youtube.com/watch?v=X0Yh48oCOGI.
ReplyDeleteI think it would be if they telecast in every theatre before every show.