అమెరికా వాసియైన డా.రావ్.పి.పచ్చిపులుసు తెలుగోత్తేజంతో ఇండియాకి తిరిగొచ్చిన విధం "డా.రావ్ కష్టాలు" అనే పోస్టులో చదివారు. ఆ విధంగా మాతృభూమిపై మమకారంతో తన సొంత ఊరైన గుంటూరులో ఆస్పత్రి ఓపెన్ చేశాడు డా.రావ్.
గుంటూరులో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతూ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్ లోనే ఉంటాయి. ఆ వీధిలోనే ఓ కాంట్రాక్టర్ రెడ్డిగారు ఈ మధ్య కొత్తగా ఐదంతస్తుల మేడ కట్టారు. డా.రావ్ తన సైకియాట్రీ ఆస్పత్రి కోసం అందులో మొదటి అంతస్తు అద్దెకి తీసుకున్నాడు.
ఇండియాలో తన కార్యాలు చక్కబెట్టిన వెంకట్రావంటే డా.రావ్ కి ప్రత్యేక అభిమానం. పైగా తన క్లాస్మేట్. అంచేత వెంకట్రావుకి హాస్పిటల్ ఎడ్మినిష్ట్రేటివ్ వ్యవహారాలు అప్పగించాడు. సైకియాట్రీలో డిప్లొమా ఉన్న ఒక డాక్టర్ని అసిస్టెంట్ గా కూడా నియమించుకున్నాడు. వెంకట్రావ్ ఆస్పత్రి ప్రారంభానికి మంచి ప్రచారం కల్పించాడు. అందువల్ల మొదటి రోజే పేషంట్లతో ఆస్పత్రి కళకళ లాడుతుంది.
ఆ రోజు కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించాడు డా.రావ్. మనసంతా హాయిగా, ప్రశాంతంగా ఉంది. 'కల నిజమాయెగా.. కోరికలు తీరెగా.. ' అని పాడుకుంటూ తన ఆస్పత్రికి చేరుకున్నాడు. ఆస్పత్రిలో వెయిటింగ్ హాల్లో ఉన్న పేషంట్లని చూసుకుని తృప్తిగా తల పంకించాడు.
కన్సల్టేషన్ చాంబర్లో తన రివాల్వింగ్ చైర్ లో కూర్చున్నాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. నర్స్ లోపలకోచ్చింది.
"చూడండి సిస్టర్! నాకు పేషంట్లు దేవుడితో సమానం. డబ్బు ప్రధానం కాదు. నేను చాలా ఎకడెమిక్. వారికి సరైన సలహా ఇవ్వడమే నా కర్తవ్యం." అని చిన్నపాటి లెక్చర్ ఇచ్చాడు. నర్స్ వినయంగా తలాడించింది.
"మొదటి పేషంటుని పంపండి." నర్సుకి చెప్పాడు.
"నమస్కారం డాక్టర్ గారు!" అంటూ ఓ నడివయసు జంట లోపలకొచ్చింది. పక్కన ఓ పధ్నాలుగేళ్ళ కుర్రాడు. బెదురు చూపులు చూస్తూ లోపలకోచ్చాడు. ఇంతలో పక్క గదిలోంచి హడావుడిగా డా.వెంకట్రావొచ్చాడు.
"వీరు మా బావమరిదికి తెలిసినవాళ్ళు. ఈయన మిర్చి కమిషన్ వ్యాపారం చేస్తాడు. వాళ్ళబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందిట. నీ సలహా కోసం వచ్చారు." అని డా.రావ్ కి చెప్పి.. "అన్ని విషయాలు వివరంగా చెప్పండి. సార్ చాలా పెద్ద డాక్టరు గారు." అని వారికి భరోసా ఇచ్చి నిష్క్రమించాడు వెంకట్రావ్.
ఆ జంట డా.రావ్ ని ఎగాదిగా చూశారు. తెల్లగా, బక్కగా, బట్టతలతో, కళ్ళజోడుతో అచ్చమైన, స్వచ్చమైన అనాసిన్ మాత్రల ప్రకటనలో కనబడే డాక్టర్లా ఉన్న డా.రావ్ రూపం వారికి తృప్తినిచ్చింది.
"నమస్తే! కూర్చోండి." అంటూ ఎదురుగానున్న కుర్చీల్ని ఆఫర్ చేశాడు డా.రావ్.
డా.రావ్ టేబుల్ మీదనున్న కేస్ షీట్ పై బుల్లి అక్షరాలతో 'శ్రీరామ' అని రాసుకుని వాళ్ళకేసి చూశాడు. భర్తకి నలభైయ్యేళ్ళు ఉండొచ్చు. ఎత్తుగా, చామన చాయగా ఉన్నాడు. అతని భార్య ఎర్రగా, పొట్టిగా, బొద్దుగా ఉంది. కంగారుగా, ఆందోళనగా కూడా ఉంది. వారి పిల్లవాడు బక్కగా, పొట్టిగా ఉన్నాడు. ముఖానికి మందపాటి కళ్ళజోడు కూడా ఉంది. ఆ అబ్బాయి ముఖంలో ఇందాకటి బెరుకు తగ్గింది. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లుగా పరాకుగా ఉన్నాడు.
కుర్చీలో పూర్తిగా కూర్చోక ముందే ఆ పిల్లాడి తల్లి చెప్పడం మొదలెట్టింది.
"డాక్టరు గారు! మా అబ్బాయికి ఈ మధ్య చదువు మీద ఏకాగ్రత తగ్గింది సార్! చదువు కోకుండా దిక్కులు చూస్తున్నాడు. అసలే పరీక్షలు దగ్గర కొస్తున్నాయ్. నాకు భయంగా ఉంది." అంటూ కంగారు పడసాగింది.
"అప్పుడే ఫైనల్ ఎక్జామ్స్ మొదలయ్యాయా!" అడిగాడు డా.రావ్.
"అబ్బే! దానికింకా చాలా టైముందండి. ఇవ్వాళ శుక్రవారం. వీక్లీ టెస్ట్ దగ్గర కొచ్చేస్తుంది." అన్నది ఆ ఇల్లాలు.
డా.రావ్ కి వీక్లీ టెస్ట్ అంటే ఏంటో అర్ధం కాలేదు. తనదైన ధోరణిలో నెమ్మదిగా చెప్పసాగాడు.
"చదువులో కాన్సంట్రేషన్ లాప్స్ కి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఉదయాన్నే మీ అబ్బాయితో గేమ్స్ ఆడించండి."
ఆవిడ హడావుడిగా అందుకుంది.
"గేమ్స్ ఆడటం మా ఇంటా వంటా లేదు. అయినా ఆ పాడు గేమ్స్ ఆడితే టైం వేష్టయిపోదూ? మా అబ్బాయి ఉదయాన్నే మూడింటికే లేస్తాడు. అయిదున్నర దాకా చదువుకుంటాడు. గబగబా తయారై ఆరింటికల్లా స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఉదయం ఆరున్నర నుండి రాత్రి పదిన్నర దాకా స్కూల్లోనే ఉంటాడు."
డా.రావ్ కి కొద్దిగా కళ్ళు తిరిగాయి. ఎందుకైనా మంచిదని టేబుల్ పై చేతులు పెట్టుకున్నాడు.
"అంతసేపు స్కూల్లో ఏం చేస్తాడు?" ఆశ్చర్యంగా అడిగాడు.
తల్లి ఉత్సాహంగా చెప్పసాగింది.
"సాయంత్రం ఆరింటి దాకా రెగ్యులర్ స్కూల్. తరవాత ఎనిమిదింటి వరకు స్టడీ అవర్స్. ఆ తరవాత పదిన్నర దాకా ట్యూషన్. పదకొండింటికి ఇంటికొస్తాడు. ఇంట్లో కనీసం పన్నెండుదాకా అయినా చదువుకోవాలి గదా! కానీ చదవడు. ఒకటే దిక్కులు చూస్తుంటాడు. కునికిపాట్లు పడుతుంటాడు. అప్పటికీ నేను అరుస్తూనే ఉంటాను."
"ఏం బాబు? చదువు కష్టంగా తోస్తుందా?.. " ఆ అబ్బాయిని అడగబోయాడు డా.రావ్.
అప్పటిదాకా నిరాశగా, నిర్లిప్తంగా ఎటో చూస్తున్న ఆ కుర్రాడు నిదానంగా రావ్ వైపు తల తిప్పాడు. సందేహిస్తూ ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు.
ఆ కుర్రాడు సమాధానం చెప్పేలోగా తల్లి అందుకుంది.
"అబ్బే! అదేం లేదండి. మావాడు పొద్దస్తమానం చదువులోనే బతుకుతుంటాడు. మొన్నామధ్య మంటల జొరంతో కూడా రోజంతా చదివాడు. మా బాబుకెప్పుడూ ఫస్ట్ మార్క్ వస్తుందండీ!"
డా.రావ్ అయోమయంగా చూసాడు. ఇంతలో డా.వెంకట్రావ్ వచ్చి పక్కగా నున్న సోఫాలో కూర్చున్నాడు. జరుగుతున్న సంభాషణ ఫాలో అవ్వసాగాడు.
"ఫస్ట్ మార్కులోచ్చేట్లయితే ఇక చదువుకోకపోవడం ఏంటి?" డా.రావ్ ధర్మసందేహం.
ఈసారి తండ్రి అందుకున్నాడు.
"మావాడికి ఎప్పుడూ 99.9 మార్కులోస్తాయి సార్! మొన్న స్లిప్ టెస్ట్ లో 99.8 మాత్రమే వచ్చాయి. ప్రిన్సిపాల్ మమ్మల్ని పిలిపించి పిల్లాడికి చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని హెచ్చరించాడు."
డా.రావ్ కి అంతా గందరగోళంగా ఉంది. కేస్ షీట్ పై 'శ్రీరామ' తరవాత ఏ రాయాలో అర్ధం కాకుండా ఉంది.
"అంత సమయం చదువుకోవటం సరియైన పధ్ధతి కాదు. మీరు బాబుకి కల్చరల్ యాక్టివిటీస్ పట్ల ఆసక్తి కలిగేట్లు చేస్తే మంచింది." నిదానంగా, మెల్లగా ఆన్నాడు డా.రావ్.
తలిదండ్రులకి అర్ధం కాలేదు. డా.రావ్ ధోరణి వాళ్లకి అనుమానం కలగజేసింది. బాగా చదువుకోడానికి మందివ్వమంటే ఆటలు, పాటలు అంటాడేంటి!
"ఈ రోజుల్లో, ఈ కాంపిటీషన్లో కనీసం వంద మార్కులైనా రాకపోతే మా అబ్బాయి భవిష్యత్తు పాడైపోతుంది డాక్టర్ గారు. మా అబ్బాయి అమెరికా వెళ్ళి మంచి పొజిషన్లో స్థిరపడాలని మా కోరిక. మీరు పెద్ద అమెరికా డాక్టరు. అందుకే మీమీదే ఎంతో ఆశ పెట్టుకుని వచ్చాం. మా బాబుని మీరే రక్షించాలి సార్!" దుఖంతో గొంతు రుద్దమవుతుండగా.. ఆ మహాఇల్లాలు అసలు సంగతి చెప్పేసింది.
డా.రావ్ నొసలు చిట్లించాడు. "మీ పిల్లవాణ్ణి అంతసేపు చదువులో.. " అంటూ చెప్పబోతుండగా.. అప్పటిదాకా ఈ సంభాషణని ఫాలో అవుతున్న వెంకట్రావ్ రంగంలోకి దిగాడు.
"నువ్వు వాళ్లకి ఏదోటి ప్రిస్క్రైబ్ చేసి పంపు. తరవాత మాట్లాడతాను." అంటూ ఇంగ్లీషులో డా.రావ్ కి చెప్పాడు.
"ఏం రాయమంటావ్? పిల్లవాణ్ని చదువుతో హత్య చేసే కార్యక్రమం నడుస్తుంది. ఆ స్కూల్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను." ఇంగ్లీషులోనే అన్నాడు డా.రావ్ కోపంగా.
వెంకట్రావ్ హడావుడిగా టేబుల్ మీదనున్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద ఒక ఖరీదైన బి కాంప్లెక్స్ టానిక్ పేరు గెలికాడు.
"డాక్టర్ గారు మీ బాబుకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని విపరీతంగా పెంచే మందు చెప్పారు. వారు చెప్పిన మందునే నేను రాసిస్తున్నాను. ఈ మందు బాబు చదువుకునే సమయంలో గంటకి రెండు స్పూన్లు చొప్పున నీళ్ళతో కలిపి తాగించాలి. వంకాయ, గోంగూర లాంటివి పెట్టకండి. మజ్జిగ ఇవ్వండి. పెరుగు దగ్గ్గరకి రానీయొద్దు." అంటూ జాగ్రత్తలు చెప్పి, మందుల చీటీ వాళ్ళ చేతులో పెట్టాడు.
ఆ కాగితాన్ని చూసుకుని తల్లి ఆనంద పడిపోయింది. తండ్రికి మాత్రం అమెరికా డాక్టర్ కన్నా గుంటూరు డాక్టరే నచ్చాడు. ఇద్దరూ తమ నిర్వికార, నిశ్శబ్ద కొడుకుతో నిష్క్రమించారు.
గదిలో రెండు నిముషాలు నిశ్శబ్దం.
కొంతసేపటికి "సారీ!" అన్నాడు వెంకట్రావ్.
'ఎందుకిలా చేసావ్?' నాగేశ్వర్రావు బి.సరోజాదేవిని చూసినట్లు చూసాడు డా.రావ్.
"మిత్రమా! మొదటి కేసుతోనే నువ్వు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. గుంటూరులో పిల్లల్ని రోజుకి ఇరవై గంటలు చదివిస్తుంటారు. ఆ మిగిలిన నాలుగ్గంటలు కూడా ఎలా చదివించాలా అని తలితండ్రులు ప్లాన్లు వేస్తుంటారు. ఈ కేస్ ఆ రకం ప్లాన్లేసే బ్యాచ్! రోజంతా మాట్లాడినా కూడా ఈ కేస్ పూర్వాపరాలు నీకర్ధమయ్యే చాన్స్ లేదు. నువ్వు చెప్పే సైకాలజికల్ యాస్పెక్ట్స్ వాళ్ళు ఒప్పుకునే అవకాశమూ లేదు. అంచేత ఏదో రాసిచ్చేశాను. నీకు టైం సేవయ్యింది. వాళ్ళూ శాటిస్ఫై అయ్యారు." ఫ్రాంక్ గా చెప్పాడు వెంకట్రావ్.
అంతా శ్రద్ధగా విన్నాడు డా.రావ్. కొద్దిసేపు ఆలోచించాడు.
"పిల్లలు చదువు పేరిట ఇంత ఘోరంగా హింసింపబడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది?" క్యూరియాస్ గా అడిగాడు డా.రావ్.
'అమ్మయ్య! ఈ మెంటల్ డాక్టర్ నన్ను అపార్ధం చేసుకోలేదు.' అనుకుంటూ నిట్టూర్చాడు వెంకట్రావ్. ఆపై అమాయకుడైన తన స్నేహితుణ్ని జాలిగా చూశాడు.
"నువ్విక్కడే ఉంటావుగా! నిదానంగా అన్నీ తెలుస్తాయిలే!" అంటూ ఏదో ఫోన్ వస్తే పక్క గదిలోకి వెళ్ళాడు వెంకట్రావ్.
బుర్ర గోక్కుంటూ.. కాలింగ్ బెల్ నొక్కుతూ.. "నెక్స్ట్" అన్నాడు నర్సుతో డా.రావ్!
(pictures courtesy : Google)
* చదువు పేరుతో ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చిత్రవిచిత్రమైన చిత్రహింసల గురించి చక్కగా వ్రాసారండి.
ReplyDelete* పెద్దవాళ్ళు అయితే, ఆఫీసుల నుంచి అలసిపోయి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు. లేక వినోదకార్యక్రమాలను చూస్తారు.
* పిల్లలు స్కూల్ నుంచి అలసిపోయి వచ్చినా , రెస్ట్ తీసుకోవటానికి పెద్దవాళ్ళు ఒప్పుకోరు. మళ్ళీ ట్యూషన్స్ కు వెళ్ళమని తరుముతారు, లేకపోతే ఇంట్లోనే చదువుకోమంటారు.
* ఈ చదువుల భారాన్ని భరించలేక, తమ గోడు వినిపించుకునే పెద్దవాళ్ళు లేక , కొందరు పిల్లలు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
చక్కగా చెప్పారు. అయితే.. ఈ విషయాలు డా.రావ్ కి తెలీదు. అదీ సంగతి!
DeleteDoctor garu , Me daggira ki ilanti Caselu kuda vasthaya ?
ReplyDeleteనా ఖర్మ కొద్ది.. వస్తాయి.. వస్తూనే ఉన్నాయి.
Deleteహాస్యధోరణిలో చెప్పినా... ఎంతో సీరియస్ విషయాన్ని ప్రస్తావించారు
ReplyDeleteథాంక్యూ! దీన్నే 'ఏడవలేక నవ్వడం' అంటారు!
Deletechaduvulaa?chaavulaa?
ReplyDeleteకొందరికి చదువు. ఇంకొందరికి చావు.
DeleteIt is very good you wrote what is happening today. But how many people will follow it. Every one agrees with you but when they see the marks of their children they forget everything (especially compare with their neighbours' or friend's child). Now a days in India as soon as the child is born parents decide what he will become and where he settles. This culture is spreading like a disease. I am not sure who controls this. It should be the self realisation of parents. How the government is giving permission to open and run schools without any play grounds. PE has totally disappeared from the school curriculum. They are opening schools for business only. It is a very lucrative business. By the way, when my children were small my wife use to threaten them to send to India for studies if they misbehave.
ReplyDeleteGV
మనం మన పిల్లల్ని బాగా చదివించి విదేశాలకి ఎగుమతి చేస్తున్నాం. మన అవసరాల కోసం వెలసిన చదువుల ఫ్యాక్టరీలే ఈ కార్పొరేట్ స్కూళ్ళు.
Deleteఉదా - ఇప్పుడు ఇక్కడ ఫార్మా- D కోర్స్ కి డిమాండ్. బాగానే చేరుతున్నారు. అమెరికా వాళ్ళకి ఈ అర్హత ఉన్నవాళ్ళు కావాల్ట! అందుకని! అయితే ఇండియాలో ఈ కోర్స్ అసలు ఉపయోగం లేదు. అదీ సంగతి!
పిల్లల్ని ఈ రుద్దుడు బారి నుండి రక్షించడం మన ప్రధమ బాధ్యతే కాని విదేశాలకి ఎగుమతి చేయడం లో మాత్రం తప్పు లేదు.
Deleteఎక్కడ తెలివి తేటలకి , చదువకున్న చదువు కి గుర్తింపు ఉంటుందో అక్కడకి వెళ్ళడం తప్పు లేదు.
అవకాశాలని ఉపయోగించుకోవడం లో వెనకడుగు వేయకూడదు
విదేశాలకి ఎగుమతి చేసే లక్ష్యంతోనే పిల్లల రుద్దుడు కార్యక్రమమం జరుగుతుందని నా అభిప్రాయం. 'తప్పు' అనను గానీ.. 'కారణం' అంటాను.
Deleteదీనికి మూలాలు అన్వేషించాలంటే గత రెండు దశాబ్దాలుగా సమాజంలో (ముఖ్యంగా గ్రామాల్లో) చదువు వల్ల చోటు చేసుకున్న సామాజిక, ఆర్ధిక మార్పుల్ని పరిశీలించాలి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, చిన్న రైతుల పిల్లలు అమెరికా వెళ్ళి దండిగా డాలర్లు సంపాదించి తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని పూర్తిగా మార్చెయ్యడం.. మచ్చుకి కొన్ని పరిణామాలు.
పిల్లల చదువులపై పెట్టుబడి వ్యవసాయం కన్నా అధిక దిగుబడి నిస్తుందని ఎప్పుడైతే మనవాళ్ళు గ్రహించారో.. అప్పుడే వారి అవసరాలకి తగ్గట్లుగా కార్పొరేట్ స్కూళ్ళు వెలిశాయి. మన రైతులు ఎక్కువ దిగుబడి కోసం వేలంవెర్రిగా / అశాస్త్రీయంగా పురుగుమందులు కొట్టేస్తారు. ఒక్కోసారి మొక్క చస్తుంది కూడా. ఆ అలవాటునే పిల్లల చదువు విషయంలో కూడా కొనసాగిస్తున్నారు!
అంటే డాక్టర్స్ కి ఫీజు ఇచ్చేది ఇలా ప్రిస్క్రిప్షన్ వ్రాసివ్వడానికి కాని, మంచి మంచి సలహాలివడానికి కాదు అని పేషెంట్స్ చెపుతున్నారనమాట. సలహాలు ఉచితంగా టీ వీ లోనే ఇవ్వాలి, అప్పుడు పాటిస్తారు. పిల్లల చదువు గురించి అయితే టీవీ చానెల్స్ కూడా సలహాల కార్యక్రమం చస్తే పెట్టవు :D
ReplyDeleteMauli గారు,
Deleteటీవీలో వైద్య, విద్యా సలహాలు ఉచితం కాదు. అవి పెయిడ్ న్యూస్ వలె పెయిడ్ సలహాలు. అంటే ఆయా సంస్థలు ఇంతకాలంలో, ఇన్ని ప్రొగ్రాములకి ఇంత ఫీజు.. అంటూ రకరకాలైన పేకేజెస్ టీవీ ఓనర్లతో మాట్లాడుకుంటారు. మీరు చూసే సలహా ప్రోగ్రాములన్నీ ఇవే! చాలాసార్లు ప్రశ్నలు కూడా ముందుగా అనుకుని అడిగేవే!
ప్రస్తుతం మా గుంటూర్లో సిటి కేబుల్ లో ఒక అరగంట వైద్యసలహాలకి పదివేలు ఆ డాక్టర్ / సంస్థ చెల్లించాలి. మూడు స్లాట్స్ కొనుక్కుంటే ఒక స్లాట్ ఉచితం. అంటే.. 3+1 ఆఫర్ అన్నమాట! మనం ఏం చెప్పదలుచుకున్నామో ఆ టాపిక్ కి ప్రశ్నలు ముందుగానే రాసిస్తే.. షూటింగ్ పార్ట్ కానిచ్చేస్తారు.
(ఈ సమాధానానికీ మీ వ్యాఖ్యకి సంబంధం లేదు.)
హ్మ్, సలహాలు ఇచ్చినందుకు ఛానెల్ వ్యాఖ్యాతకు డబ్బు చెల్లించదన్నమాట.
Deleteచదువే ఒక రోగం కథను మా మాస పత్రిక రియల్ అడ్వైజర్ లో ప్రచురించుకోవచ్చా?
ReplyDeleteఅయితే 9177883390 సెల్ కు ఎసెమెస్ పంపగలరా
నిరభ్యంతరంగా ప్రచురించుకోండి. నా బ్లాగ్ రాతలకి నో కాపీరైట్.
Deleteనా బ్లాగ్ రాతలకి నో కాపీరైట్.. :) నైస్.
Deleteమీ పోస్ట్ చదివాకా నాకూ చెప్పాలనిపిస్తోంది.. మా పిల్లల క్లాస్ లో ఒకమ్మాయికి స్లిప్ టెస్టుల్లో అన్ని సబ్జెక్టుల్లో ఇరవై కి ఇరవై వచ్చాయి కానీ, ఒక్క దాంట్లో పద్ధెనిమిది వచ్చాయని ఇంటికెళ్లడానికి భయపడి ఏడ్చిందట. వాళ్లింట్లో జరిగే రభస కి భయపడి. నాకు అతిశయోక్తి గా, ఆ అమ్మాయే కొంచెం తల్లిదండ్రులని బాడ్ లైట్ లో చూపిస్తోందేమోనని అనుమానం వచ్చింది.
అయ్యా రమణగారు,
ReplyDeleteచూడబొతే మీకు అమెరికా సమ్యుక్త రాష్రాల్లొ పని చెసి వచిన వాల్లంటే , గౌరవం మాట అటుంచండి, కొంచెం చులకన భావం వ్యక్తమవుతొంది.
సరే, కనివ్వండి.
కృష్ణ
అయ్యా కృష్ణగారు,
Deleteనా మనసులో అయితే మాత్రం ఎటువంటి చులకన భావం లేదు. మరి రాతల్లో ఎందుకు వ్యక్తమవుతుందో అర్ధం కావట్లేదు. అయినా నా భావాలకి విలువేముంటుంది!?
(అయితే అసరా తెలుగు సంఘాల తెలుగోద్ధరణని విమర్శిస్తూ "అసూబాల ఆహర్యం" అంటూ ఒక పోస్ట్ రాశాను.)
మనకీ మాయ రోగం పోయేడి ఎప్పుడో ?
ReplyDeleteపిల్లల వధ లో మన తోటి తల్లి తండ్రులు
కంసుడి కంటే తక్కువ వాళ్ళేమీ కాదు.
కంసుడు రాక్షసుడైతే, వీళ్ళు పరమ కిరాతకులు.
ఈ సంఘాన్ని బాగు చేసేందుకు కృష్ణుడు ఎప్పుడు
పుడతాడో కదా?
ఆ రోజున పిల్లలకు పది గంటలు ఆటలు; గంట చదువు.
అయినా మన వాళ్లకు బిజినెస్స్ సెన్స్ లేకుండా పోతోంది.
ఫార్మా డి కంటే మంచి వ్యాపారం రాజకీయం.
నేనైతే, గుత్తె దారు ఎలా అవ్వాలి; కుల రాజకీయాలు యెట్లా నడపాలి,
లంచం ఇచ్చుట యెట్లు; పవరే లక్షం; క్యాషే ముఖ్యం అనే
విషయాలతో స్కూలు పెడదామను కున్టున్నా.
పుచ్చా
డియర్ పుచ్చా,
Deleteమనం పిల్లల తలిదండ్రుల్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చదువుల పేరుతొ పిల్లల్ని హింసించడం వెనుక ఒక సామాజిక కోణం ఉంది. సమాజంలో ఒక వర్గానికి చెందిన పిల్లలు ఎక్కువగా హింసించబడతారని నా అభిప్రాయం.
ఈ వర్గం పిల్లల తలిదండ్రులు.. సమాజంలో చదువు ప్రాముఖ్యత అనుభవపూర్వకంగా గ్రహించినవారు. వీరు కొద్దిపాటి చదువుతో, చిన్న ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళ స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ "మేం చదువు నెగ్లెక్ట్ చేసి ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు మాకులా కాకూడదు." వాళ్ళ POV కరెక్టే!
అయితే దురదృష్టవశాత్తు వీరికి చదువు పట్ల శాస్త్రీయ అవగాహన ఉండదు. ఎన్ని గంటలు చదివితే అంత బాగా చదువు వస్తుందనే అపోహతో ఉంటారు. అందుకనే ఈ వర్గం వారు నివసించే ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళలో ఎక్కువ స్టడీ అవర్స్ ఉంటాయి. హింస కూడా ఎక్కువే. అందుకే గుంటూరు టూ టౌన్ లో కన్నా వన్ టౌన్ లో పిల్లలు ఎక్కువగా హింసించబడతారు. (ఇది నా అబ్జర్వేషన్ మాత్రమే.)
మా అబ్బాయి బుడుగు స్కూల్ హెడ్ మిస్ట్రెస్ (వీళ్ళని ప్రిన్సిపాల్ అంటారు) ఒకసారి నా ఆస్పత్రికి వచ్చారు.ఆవిడని పిల్లల హింస గూర్చి అడిగితే.. తన బాధని వెళ్ళగక్కింది. "మీరొక్క సారి పేరెంట్స్ మీట్ కి రండి. పిల్లల తల్లులు మాతో పోట్లాడుతున్నారు. ఆదివారం కూడా స్కూల్ పెట్టమంటారు. మార్క్స్ రాకపోతే వాళ్ళ పిల్లల్ని బాది పడెయ్యమంటున్నారు. స్టడీ అవర్స్ పెంచమని, స్పోర్ట్స్ ఆడించి టైం వేస్ట్ చెయ్యొద్దని.. మార్క్స్ సరీగ్గా రాకపోతే స్కూల్ మార్చేస్తామని.. ఏం చెప్పమంటారు?" అని బోల్డు బాధ పడింది.
ఇంకో వ్యాపార రహస్యం.. మార్క్స్ విషయంలో పోట్లాడే పేరెంట్స్ ఉన్న విద్యార్ధులకి.. వాడు రాసిన ఆన్సర్ షీట్ తో నిమిత్తం లేకుండా.. గత పరీక్ష కన్నా ఒకట్రెండు మార్కులు ఎక్కువొచ్చేట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదంతా పూర్తిగా బట్టల కొట్టు వ్యవహారంలా నడుస్తుంది.
ఇంకో కారణం.. ఈ స్కూళ్ళన్నీ చిన్నపాటి ట్యూషన్ హోమ్స్ లా ప్రారంభం అవుతాయి. మన గుంటూరులో భాష్యం, ఆక్స్ఫర్డ్ స్కూళ్ళు చక్కటి ఉదాహరణ. వీరు కస్టమర్ల (అంటే తలిదండ్రులు) అవసరాలకి తగ్గట్లుగా మంచి 'సర్విస్' ఇవ్వడం చేత వ్యాపారం అభివృద్ధి అయింది. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి ఏ చేసుకోవాలో తెలీక జుట్టు పీక్కుంటున్నారు. వారికి విజయవంతమైన వ్యాపార సూత్రాన్ని ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు?
సర్కారు బడిజెప్పు సార్లకు పట్టదు
ReplyDeleteచేతి నిండ రియలెస్టేటు వల్ల
పర్యవేక్షకులకు పట్టదు పనితీరు
విద్యానిధులు బొక్కు విధుల వల్ల
పాఠశాలల బాగు పట్టదు నేతకు
కార్పొరేటు బడుల కలిమి వల్ల
బిడ్డల చదువులు పెద్దవారెరుగరు
జీవన పోరాట స్థితుల వల్ల
వెరసి - గ్రామీణ బడులలో వెలయు చదువు
చిత్తశుధ్ధికి దూరమై చిత్రమైన
తీరు తెన్నుల భాసించు తీరు చూడ
చదువు మృగ్యము సర్కారు ‘సాగు’ బడుల .
కొడుకు జదివించు కొనుటకు కూలి చేయు
తల్లికి తనయ చేదోడు తప్పదయ్యె
చదువు సర్కారు బడులలో చక్కనైన
కార్పొ’ రేటు ’ బడుల కేగు కర్మ తొలగు .
బ్లాగు : సుజన-సృజన
రాజారావుగారు,
Deleteచక్కగా చెప్పారు. ముచ్చటగా మూడు పద్యాల్లో విషయమంతా తేల్చేశారు. ధన్యవాదాలు.
డాటేరు,
ReplyDeleteమన పురుషజాతికి చెందిన బాలుడి పైన తల్లిభూతం పెత్తనం లేకుండా ఎమీ చేయలేమా? చదువు నేర్చిన ఈ తల్లి భూతాల ఒత్తిడి పురుషజాతి పైన చాలా ఎక్కువ అవుతున్నాది. చదువు లేని తల్లి భూతాలే ఎంతో మంచివి. అయ్యికాని చదువులు చదివిన తల్లిభూతాల హింస తీవ్రవాదుల హింసతో పోల్చదగినదే. పురుషజాతిని రక్షించుకోవటానికి తల్లిభుతాన్ని ఎదుర్కొనే మార్గాలు బాలురకు చెప్పండి. తల్లిభూతం చదువుకొమ్మని తీవ్ర ఒత్తిడితేస్తే, ఆత్మరక్షణ చర్యలో భాగం గా భూతం చేయి కొరికి వీధిలో పారిపోవటం, ఇంకా అతి ఎక్కువ చేస్తే అతడు సినేమాలో మహేష్ బాబు త్రిష జడకత్తిరిస్తాన్నట్లు తల్లిభూతం నిద్దురపోతున్నపుడు జడలు కత్తిరించమని మీరు బాలురకు సలహాలివ్వండి. జుట్టుపోవటం తో తల్లిభూతం అటేన్షన్ జడ పైన పడుతుంది. జడ పూర్తిస్థాయిలో పెరిగేటంతవరకు పిల్లవాడికి కొంచెం వెసులుబాటు లభిస్తుంది. ఈ తల్లి భూతాలు పురుషజాతి పైన విరుచుకుపడటానికి కారణం కొంపలో పెద్ద పని ఎమీ లేకపోవటం. పిల్లలకు చిన్నపటిముంచి బ్రైన్వాష్ చేసే తల్లిని మించిన దైవం లేదు అనే మాటలను పాఠ్య పుస్తకాలనుంచి తొలగించి, తల్లిని మించిన భూతంలేదు అని తిరగరాయాలి.అప్పుడు పిల్లలు భూతం చేతిలో చిక్కకుండా, దానిని ఎలా ఎదుర్కోవా లో వాళ్ళ ఎత్తులు వాళ్ళు వేసుకొంటారు.
Very well said Venkata Rajarao garu!
ReplyDeleteI thought I would share an excerpt from this interview with Aaron Swartz, an American computer programmer, writer, archivist, political organizer, and Internet activist whose life ended tragically at 26 last weekend.
Q: You did a lot of important things at a very young age, could you describe a few of them? And how do you see and would explain that? Talent, inspiration, curiosity, hard work? Is there something that you would think that other kids who would like to follow your steps should know?
A: When I was a kid, I thought a lot about what made me different from the other kids. I don't think I was smarter than them and I certainly wasn't more talented. And I definitely can't claim I was a harder worker -- I've never worked particularly hard, I've always just tried doing things I find fun. Instead, what I concluded was that I was more curious -- but not because I had been born that way. If you watch little kids, they are intensely curious, always exploring and trying to figure out how things work. The problem is that school drives all that curiosity out. Instead of letting you explore things for yourself, it tells you that you have to read these particular books and answer these particular questions. And if you try to do something else instead, you'll get in trouble. Very few people's curiosity can survive that. But, due to some accident, mine did.
http://www.fastcompany.com/3004769/my-email-exchange-aaron-swartz-shows-original-thinker
PS: Dear Ramana, here is some unsolicited advice on your great blog: is it possible to change the font, formatting of the text in the comments section? When we write the comment in the box before posting, it is a nice and beautiful Gill Sans font with small (optimal) size, but, once you post it, becomes this giant lettered vile Arial font that is justified (as opposed to left aligned) in a narrow column that is not very pretty. Also, wouldn't it be nice if you allow live html links so you can click and go to the video clip or story as opposed to cut and paste. Thirdly, I think it would be great to let the readers like or dislike the comments. Finally, wouldn't it be more transparent if you don't allow anonymous posters? We should be able to own up to what we say.
"wouldn't it be more transparent if you don't allow anonymous posters? We should be able to own up to what we say"
Deleteడాటేరు గారు, మీ మిత్రుడు అనానిమసుల మనోభావాలను, ఆత్మస్థైర్యం దెబ్బతీసేవిధంగా మాట్లాడుతున్నడు. అనానిమస్సులు అనాధలు కారని ఆయనకు తెలియనట్లుంది. అయినా తల్లిని మించిన దెయ్యంలేదు అంటే అంతగా బాధపడవలసిన అవసరం లేదు. నేటి తల్లులు అంజలీదేవి కాలంనాటి సీతమ్మ లాంటి తల్లులు కారు. ఈ తరం తల్లులు భర్త అంటే గౌరవంలేని వాళ్ళు. కోరికలు తీరని పిశాచులు,వాళ్లకెమీ కావాలో వాళ్లకే తెలియని ఎర్రి మొహాలు.
పెళ్లైన కొన్ని రొజులకే వాళ్లకి మొగుడు మొహం మొత్తేస్తాడు. భర్త వాడిని ఎలాగూ మార్చలేం, అని తెలుసుకొన్న తరువాత,వాళ్ళు రూట్ మార్చి , మొగుడు లాగా తనకొడుకు పెరగకుడదనుకొని మగజాతి శిశువుల, మీద వాళ్ల ప్రయోగాలు మొదలు పెడతారు. ఇవ్వని బహిరంగ రహస్యాలే! నేను రాసినదానిలో నిజాలు కావా? అనానిమస్ గాకాకుండా పేరు తో రాసినంత మాత్రాన ఏమి మారుతుంది.
"భర్త వాడిని ఎలాగూ మార్చలేం, అని తెలుసుకొన్న తరువాత,వాళ్ళు రూట్ మార్చి , మొగుడు లాగా తనకొడుకు పెరగకుడదనుకొని మగజాతి శిశువుల, మీద వాళ్ల ప్రయోగాలు మొదలు పెడతారు. ఇవ్వని బహిరంగ రహస్యాలే! నేను రాసినదానిలో నిజాలు కావా? "
Deleteనిజమే అనిపిస్తుంది. ఇన్ని కష్టాలతో పెరిగిన మీరు కనీసం పేరుకి కూడా నోచుకోక అజ్నాతగా మిగిలిపోయ్యారు. ప్రయోగం పేరుతొ ఈ పసి అజ్నాతకి ఇంకా పేరు పెట్టలేదు వారి మాతృమూర్తి . ఖళ్ ఖళ్ దగ్గుతో మాటలు రావడం లేదు.
అయ్యా అనానిమస్ గారు,
Deleteనాకష్టాలను గురించి జాలి తీరిక ఉన్నపుడు పడుదురు గాని మీ పిల్లలను సరిగా చూసుకోండి. లేకపోతే పిచ్చోళై వీధిన పడతారు.ఇప్పుడు చాలా మందికి ఒకరు ఎక్కువైతే ఇద్దరు. నాకు తెలిసిన వారింట్లో ఒక్క అబ్బాయిని కన్న తల్లిదండృలు, కొన్ని కారణాల వలన వాళ్ల అబ్బాయి చనిపోతే పిచ్చికి దగ్గర గా పోయి వచ్చారు.
Dear GIdoc,
Deletei don't know whether i can implement your suggestions in comments font and other related issues in blogger. But i will definitely look into this and try to bring some changes if possible.
please dont stop ananymous comments unless you have too many offensive comments. Sometimes people can't login to the accounts in office, or sometimes they may be in hurry too.
Deleteటపా చదవగానే "భారతీయ పిల్లల వెట్టి చాకిరి సంఘం" సభ్యులు (అదేనండీ సగటు తల్లితండ్రులు) మీద పడి కుమ్మేస్తారనుకున్నాను. అలా జరగకపోవడానికి కారణాలు ఏమిటో?
ReplyDeleteJai Gottimukkala గారు,
Deleteలేదు. లేదు. నాకు తలిదండ్రుల మీద గౌరవం తప్ప మరే భావనా లేదు. కొందమంది అమాయకులు తమ సొమ్ము మూడేళ్ళల్లో మూడు రెట్లు అవుతుందని డిపాజిట్లు వేసి మోసపోతుంటారు. వారికి బ్యాంకింగ్ గూర్చి బేసిక్స్ కూడా తెలీదు. వారిపట్ల మనం జాలి చూపించాలి. ఈ తలిదండ్రులూ అంతే!
డాక్టర్ గారు,
ReplyDeleteమేము కూడా మాఇంటిలో పిల్లలకు మార్కులు (90 శాతం వచ్చినా గాని) రావడం లేదని ఇలాగే భాదపడుతుంటాము.
వాల్లు చదివేది 1వ మరియు 4వ తరగతి.వాళ్ళ కార్పొరేట్ స్కూల్లో మర్కులకు బ్రాకెట్లో రాష్ట్రస్తాయి రాంకులు ఇస్టుంటారు.అవి చూసి మాపిల్లల రాంకులు పొల్చుకుని ఒకటే బాదపడుతూ, బాగా చదవాలని పిల్లలని ఒకటే పొరుపెడుతుంటాము. వాళ్ళేమో మేము బాగానే చదువుతున్నాముగా అని చిన్నగా గొనుగుకుంటారు.(పాపం పెద్దగా చెప్పే దైర్యం లేక).
కాని సార్, మా పిల్లలు మాత్రం ఇద్దరూ ఐఎయెస్ లు కావాలని కోరుకుంటున్నాను.ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని కొరుకుంటున్నాను(లాయెర్ చంద్రశేఖర్ గారిలా)దయచేసి నాకు వెంకటరావు గారిలా కాకుండా సలహా ఇవ్వగలరు.
చివరి విషయంగా, ఆ పురుషాదిక్య అగ్నాతా ఎవరు సార్, ప్రతి టఫాకు పురుషాదిక్యంతో లింక్ పెడుతున్నారు.
జి రమేష్ బాబు
గుంటూరు
డియర్ రమేష్ బాబు,
Deleteనేను ఒకప్పుడు డా.రావ్ లాగా పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చెయ్యడానికి ప్రయత్నిస్తుండేవాడిని. అయితే.. నాకిప్పుడు అంత ఓపిక లేదు. ఇప్పుడు మా రిసెప్షనిస్టే చెప్పేస్తుంది.. ఇటువంటి కేసులు చూడం అని.
100% కరెక్ట్ సార్.నోరులేని పిల్లలు.ఎదురు చెప్పలేరు.చెప్పితే మన పశుబలం చూపిస్తాం.ఈ తల్లిదండ్రులకు పనిష్మెంట్ బిడ్డలు పెద్దయ్యాకా వీధుల పాలయి అనుభవిస్తారు.
ReplyDeletepoojita
రైతుల పిల్లలు విదేశాలకు వెళ్లి సంపాదించి కుటుంబ ఆర్ధిక స్థితి మార్చడం వరకు కరెక్టే . కాని ఇలా విదేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ రుద్దుడు కార్యక్రమం లోంచి వచ్చిన వాళ్ళు కాదు అనుకుంటున్నాను. మరి విదేశాలకు వెళ్ళడానికి రుద్దుడే ఏకైన /సరైన మార్గం అనే అభిప్రాయం ఎవరు కలిగించారో మరి.
ReplyDeleteపిల్లల చదువు తోనే సౌకర్యవంతమైన, భద్రమైన భవిష్యత్తు (మనది, పిల్లలది) అని తల్లిదండ్రులు అనుకునేలా ఉంది మన దగ్గర సామాజిక భద్రత. విలాసాల మాట అటుంచి అన్ని కనీస సౌకర్యాలు కుడా డబ్బు తోనే ముడి పడి ఉన్నప్పుడు తల్లిదండ్రులను తప్పు పట్టి ఏమి లాభం?
చంద్ర గారు,
Deleteమీ బ్లాగ్ పేరు బాగుంది. నాకు నచ్చింది. అభినందనలు. మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
ఫలానావాడు సక్సెస్ అవడానికి కారణం ఏమిటో మనకి తెలీదు. అందుకే గుడ్డిగా అనుకరిస్తాం. నేను మెడిసిన్ చదివే రోజుల్లో.. మా ఊళ్ళో బలరాం హోటల్లో అర్ధరాత్రిళ్లు టీ తాగేవాళ్ళం. ఓ రోజు ఓ గోల్డ్ మెడల్ స్టూడెంట్.. టీ తాగేముందు పూరీలో చపాతీ కుర్మా నంచుకు తినడం గమనించాం. అప్పట్నుండి మేమూ ఆ కాంబినేషన్ ప్రయత్నించాం. చపాతి కుర్మాలో నంచుకుని ఎన్ని రోజులు, ఎన్ని పూరీలు తిన్నా మా చదువు స్థాయి పెరగక పోవడం చేత.. ఆ ప్రయోగాన్ని విరమించాం.
"పిల్లల్ని చదువుకొమ్మని పోరకండి." అని సలహా ఇస్తే వెంటనే ఒక ఎదురు ప్రశ్న ఎదురవుతుంది. "మరి నువ్వెందుకు చదువుకున్నావ్?" జవాబు చెప్పడం కష్టం.
ఫ్యాక్టరీ కూలీల్లా చదివిస్తే కాని మన పిల్లలు చదువులో సక్సెస్ కాలేరు అన్న నమ్మకం మన సమాజంలో ఎందుకుందో ఆలోచించాలి.
అమెరికా వాడి దగ్గర ఎంత డబ్బుందో నాకు తెలీదు గానీ.. మా ఊళ్ళో అనేకమంది పేరెంట్స్ కి తమ పిల్లల్ని అమెరికా పంపించడమే ధ్యేయం. అక్కడ వీధుల్లో డాలర్లు రాసులుగా పోసి ఉంటాయని.. ఆ రాసుల్లొ ఒక కుప్ప మనవాడు తీసుకు రావాలని ఎంతోమంది తలిదండ్రులు కలలు కంటుంటారు. వారిలో ఎక్కువమంది పెద్దగా చదువుకున్నవారు కాదు!
నా బ్లాగ్ చదివి.. అభిమానంతో కామెంట్స్ రాసిన మిత్రులందరికీ వందనాలు.
ReplyDeleteఇవ్వాళ work load కి బుర్ర వేడెక్కిపోయింది. దరిమిలా మొద్దుబారిపోయింది. చదువుతుంటే కామెంట్లు అర్ధం కావట్లేదు. చెప్పవలసిందేమన్నా ఉంటే.. రేపు రాస్తాను.
ఇంతకీ డా.రావ్ క్యారెక్టర్ ఎలా ఉందో రాశారు కాదు. మీకు డా.రావ్ నచ్చితే గనక అప్పుడప్పుడూ కనబడుతుంటాడు.
(ఇంతకు ముందు సుబ్బు వచ్చేవాడు. ప్రస్తుతానికి సుబ్బుని పక్కన బెట్టాను.)
నేను వ్రాయాలని సంశయించిన వ్యాఖ్య :
ReplyDeleteచాలా చిన్న విషయం, నాలుగు కాకపొతే పది లైన్లు ఉన్నాయమే చదివినది అనుకొన్న టపా, వెనక్కి చూస్తె చాలా పెద్దది ఇది. అంత చిన్న విష్యం ఉంది కాని చాలా ఆసక్తికరంగా ప్రతి లైను దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వ్రాయడం వల్లనేమో, నడక తెలియలేదు. టపా కన్నా ఇది చాలా గొప్ప విష్యం గా అనిపించింది నాకు. డాక్టర్.రావ్ గారు ఇంత అమాయకంగా ఉండడం వల్ల ప్రస్తుతానికి పాఠకులు ఆయనతో ఎక్కువ కనెక్ట్ అవుతారేమో. కాని నాకు డా.వెంకట్రావ్ అనే క్రొత్త వ్యక్తీ పరిచయం అయ్యాడు :)
అయితే ఈ వ్యాఖ్య వ్రాస్తున్నంతలో డా. రావ్ లో మీరు , ఈ వెంకట్రావు గారు లో సుబ్బు కనిపిస్తున్నారు .బహుసా సుబ్బు బాగా అలవాటు అవడం వల్ల కావచ్చు . కాబట్టి డా. రావ్, వెంకట్రావ్ (అగ్ని, జమదగ్ని అని చదువుకోండి ) టపా లకోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాము.
Mauli గారు,
Deleteప్రస్తుతానికి అంతా అస్పష్టతే. డా.రావ్ గూర్చి యేడాది క్రితం ఒకలా ఆలోచించాను. అందుకే కొంత వ్యంగ్యంగా రాశాను. ఇప్పుడు ఇంకోలా ఆలోచిస్తున్నాను. అందుకే Dr.Rao is more dignified and decent in the second post.
నాకు ఆలోచనలు ఎక్కువ, టైం తక్కువ. ఇలా ఎంతకాలం రాస్తానో తెలీదు. నా మీద నాకు నమ్మకం తక్కువ. Suddenly i may lose interest in blogging and may close the shop.
సైకియాట్రిస్ట్ చాంబర్లోకి రోజూ ఎన్నో లైవ్ క్యారెక్టర్స్ వచ్చి వెళ్తుంటాయి. కొందరు చాలా ఇంటరెస్టింగ్ పర్సనాలిటీస్ ఉంటారు. అయితే వారిని గూర్చి బ్లాగులో రాయడానికి కుదర్దు. రాయకూడదు కూడా. రాయాలంటే ఏదోక దోవ వెతుక్కోవాలి. ఆ ప్రయత్నమే ఈ డా.రావ్ అండ్ వెంకట్రావ్.
నా వీలును బట్టి, ఇంటరెస్ట్ బట్టి భవిష్యత్తులో డా.రావ్ may become a recurring character.
Thank you very much for the nice words.
Eager to see more about Dr. Rao although we can ask Subbu to comment on P.Rao too. I agree with GI Doc that if we make a statement we should be able to own it and defend it. I do not give importance to those comments anyway.
ReplyDeleteI'm hoping/expecting that Dr. Rao would adopt - after all he's not stupid (according to your write up) to the medical practice conditions prevailing in India and get the best of both worlds. During that process we can have several fun filled (educating)situations.
డియర్ గౌతం,
Deleteడా.రావ్ సైకియాట్రిస్టుగా గొప్పోడే. అయితే మన గుంటూరు జనాలకి నచ్చుతాడా? వెండితెరపై వేచి చూడుము.
(మా సైకియాట్రీ మీ న్యూరాలజి అంత వీజీ కాదు మిత్రమా!)
'ఎందుకిలా చేసావ్?' నాగేశ్వర్రావు బి.సరోజాదేవిని చూసినట్లు చూసాడు డా.రావ్..... -- LOL.
ReplyDeleteAnd, meeku B Complex tablets and tonic chaala sarlu handy ga paniki vachinattunnay :-)
'బి' కాంప్లెక్స్ టాబ్లెట్లు, టానిక్కులు లేకపోతే.. మేం చాలామందిమి బస్ స్టాండులో బజ్జీలమ్ముకోవలసి వస్తుంది. అప్పుడు డాక్టర్ కోర్సుకి డిమాండ్ పడిపోతుంది. తద్వారా మెడికల్ కాలేజిలు మూతపడిపోతాయి. చివరికి దేశ ఆర్ధిక పరిస్థితి కుంటుపడిపోతుంది.
Delete(మీరిలా మా వ్యాపార రహస్యాలు రాయరాదు.)
డాక్టరు రావు గారు,
ReplyDeleteఈ చదువే ఒక రోగం బ్లాగులు చదివే మా లాంటి వాళ్లకు కూడా వర్తించునా? దయచేసి తెలుపుడీ!
చీర్స్
జిలేబి.
ప్రస్తుతం నాకంతా కంఫ్యూజింగ్ గా ఉంది.
Deleteవెంకట్రావ్! ఆ చేత్తోనే ఈ జిలేబి గారిక్కూడా ఏదోక మందు రాసివ్వు!
"...ఈ మందు బాబు చదువుకునే సమయంలో గంటకి రెండు స్పూన్లు చొప్పున నీళ్ళతో కలిపి తాగించాలి. వంకాయ, గోంగూర లాంటివి పెట్టకండి. మజ్జిగ ఇవ్వండి. పెరుగు దగ్గ్గరకి రానీయొద్దు." అంటూ జాగ్రత్తలు చెప్పి, మందుల చీటీ వాళ్ళ చేతులో పెట్టాడు."
ReplyDeleteనా ఉద్దేశంలో ఈ ముక్క అదిరింది! శాస్త్రంతో సంబంధం లేని ఇలాటి మాటలు ప్రజలికి బాగా నచ్చుతాయి. ఇలా, ద్రుశ్య కావ్యాలు రాయడం మన రమణ మహర్షి కి కొట్టిన పిండి.
డాక్టర్ రావు గారి లాంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టిషనర్ల పని ఔటే! వెంకట్రావే డాక్టర్ రావు గారిని రక్షించాలింక!! డాక్టర్ రావు గారి పాత్ర బాగుంది. మన ఫైన్ న్యూరాలజిస్ట్ గారు చెప్పినట్లు డాక్టర్ రావు, వెంకట్రావుల ఇంటరాక్షన్ మరిన్ని కథలకు ప్రాణం పోయగలదని కొరుకుంటూ,
బి ఎస్ ఆర్
అమ్మయ్య! చాలా రోజులకి మీరు తెలుగులో కామెంట్ రాశారు. ధన్యవాదాలు.
Deleteమీరు తెలుగులో మంచి కబుర్లు రాస్తారు గదా! ఎందుకో ఈ మధ్య పితృభాషని (ఆంగ్లం) విరివిగా వాడేస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్ కి చెప్పి మాతృభాషని నిర్లక్ష్యం చేస్తున్న మిమ్మల్ని కృష్ణా జిల్లాలోకి రానీకుండా కట్టడి చేయిద్దామనుకున్నా. ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకుంటున్నా.
రమణ గారు,
ReplyDeleteచాలా బాగా రాశారు. ఈ రోజుల్లో ఉన్న విద్యా విధానాన్ని ప్రస్ఫుటంగా చూపించారు.
పిల్లల బాల్యాన్ని హరిస్తున్న శృతి మించిన పోటీ మనస్తత్వం పోవాలంటే తల్లిదండ్రుల ఆలోచనలలో మార్పు రావాలి.
వాహిని
వస్తే మంచిదే! ప్రస్తుతానికి బ్లాగులు రాసుకుంటూ.. ఆశాజనకంగా ఎదురు చూడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.
Delete"అమెరికా వెళ్ళటానికి" తల్లి తండ్రులు కల్పించుకున్న ఈ రోగం, అమెరికా లో ఉన్న మన దేశం తల్లి తండ్రులకు కూడా ఉంది అంటే మీరేమంటారు?
ReplyDeleteఅసలు మన మనస్తత్వం అదేనేమో.
జపాన్ లో కూడా ఇదే పద్ధతి. అందుకే జపనీస్ పెట్టిన ట్యూషన్ స్కూళ్ళు అమెరికాలో మన దేశ పిల్లలతో రాణిస్తున్నాయి.
కొంచెం exaggeration అయినా చెప్పిన పాయింట్ బాగుంది.
"చదువు" అనే విద్యలో మనకి సరిలేరెవ్వరు. అన్నీ వదిలే్సుకుని విపరీతంగా చదవడం మన స్పెషాలిటీ. ఆపై మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి.. బాగానే సంపాదిస్తుంటాం. అయితే ఈ స్ట్రెస్ వల్ల తొందరగా బిపి, షుగర్లు తెచ్చుకుని రోగిష్టివాళ్ళం కూడా అయిపోతున్నాం.
Deleteజపనీస్ కూడా తమ పిల్లలని చదువుకోసం ఒత్తిడి చేస్తారుగాని, బొత్తిగా ఆడుకోకుండా అడ్డు పెట్టరు. చిన్న దేశమైనా జపాన్ లో పిల్లలకి బొలేడు ఆట స్థలాలు/ పార్కులు ఉన్నాయి. పైగా అక్కడ పిల్లలకు తమ గోడు చెప్పుకునే స్వేఛ్చ కూడా ఉంది.
Delete