Friday, 11 January 2013

ఘంటసాలా! ఓ ఘంటసాలా!


"ఘంటసాల గొప్పేంటో నాకర్ధం కాదు. ఆయన స్వరం ఒక అద్భుతం. ఎన్నో యేళ్ళు శాస్త్రీయ సంగీతం అభ్యసించాడు. మంచి సంగీత విద్వాంసుడు. ఆయనకి ఆ స్వరం దేవుడిచ్చిన వరం. అందులో పదో వంతు వాయిస్ నాకున్నా ఆంధ్రదేశాన్ని ఊపేసేవాణ్ణి." అనేవాడు నా స్నేహితుడు.

"నిజమే కదా!" అనుకునేవాణ్ణి.

మరి మన తెలుగువారిలో ఘంటసాలంతటి చక్కటి గాత్రం కలవారెవరూ లేరా? ఉండొచ్చు. ఘంటసాలకున్నంత శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం కలవారు ఇంకెవరూ లేరా? ఉండొచ్చు. మరి మనం ఘంటసాలనే ఇంకా ఎందుకు తలచుకుంటున్నాం? ఇందులో మతలబు ఏమిటి? విషయం నా స్నేహితుడు చెబుతున్నంత సింపుల్ కాదు.

సినిమా పాటలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమా అనేది ఒక దృశ్య రూపం. తెరపై ఒక సన్నివేశం నడుస్తుంటుంది. పాత్రధారులు నటిస్తుంటారు. ఒక పుస్తకం చదువుతున్నట్లుగా ప్రేక్షకులు కథలో లీనమైపోతారు. ఉన్నట్లుండి పాట మొదలవుతుంది.

సినిమా పాట ప్రయోజనం ఆ సన్నివేశాన్ని మనసుకు హత్తుకు పోయేట్లు ముద్రించడం.. కథని ముందుకు నడిపించడం. అప్పటిదాకా తన గొంతుతో మాట్లాడిన పాత్రధారి హఠాత్తుగా గాయకుని గొంతులోకి మారిపోతాడు. వ్యవహారిక భాష గ్రాంధికంగా మారినట్లు.. గద్యం పద్యమైపోయినట్లు.. నటుని వాయిస్ గాయకుని స్వరంగా మారిపోతుంది.

ప్రధాన నటుడు సినిమా అంతా ఉంటాడు. తన హావభావాలతో క్యారెక్టర్ ని పండిస్తూ.. ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి అతనికి కావలసినంత సమయం ఉంటుంది. ఆ సౌలభ్యం గాయకుడికి ఉండదు. అతడు తన గొంతుతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఆ పాత్ర స్వభావం, సన్నివేశం.. 'ఫీల్' అవ్వాలి. సమయం చాలా పరిమితం. ఆ కొద్ది నిముషాల్లోనే నటుణ్ణీ, సన్నివేశాన్ని ఎలివేట్ చెయ్యగలగాలి.



నా వాదనకి ఉదాహరణగా పాండురంగ మహత్యం సినిమాని ప్రస్తావిస్తాను. కాళ్ళు కోల్పోయిన పుండరీకుడు 'అమ్మా అని అరచిన ఆలకించవేమమ్మా.. ఆవేదన తీరు రోజు ఈ జన్మకి లేదా?' అంటూ పిచ్చివాడిలా తలిదండ్రుల కోసం పరితపిస్తూ పాడతాడు. పాట చివర్లో ఘంటసాల తన హెవీ బేస్ వాయిస్ లో 'అమ్మా! నాన్నా!' అంటూ చేసే ఆర్తనాదాలు మన గుండెల్ని పిండేస్తాయి.

తలిదండ్రుల దర్శనం చేసుకున్న పుండరీకుడు 'ఏ పాదసీమ కాశీప్రయాగాది.. ' అంటూ ఆర్తిగా ఆలాపించే శ్లోకంలో ఘంటసాల స్వరం పుండరీకుని భావావేశాన్ని పూర్తిగా నింపుకుంది. సినిమాకి ఎంతో ముఖ్యమైన ఈ సన్నివేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో ఘంటసాల గాత్రం పాలు చాలా ఎక్కువ. మిగిలిన కొద్ది పని పూర్తి చెయ్యడం రామారావుకి చాలా ఈజీ అయిపోయింది. ఒక అత్యున్నత గాయకుడు సన్నివేశ స్థాయిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలడో ఈ ఉదాహరణ నిరూపిస్తుంది.

సినిమా పాటలు అనేక రకాలు. కొన్ని పాటలు కచేరీల్లో పాడుకోడానికి అనువుగా శ్రావ్యంగా ఉంటాయి. చక్కటి స్వరం, కొద్దిపాటి స్వరజ్ఞానం ఉన్నవారెవరైనా ఈ పాటలు పాడెయ్యవచ్చు. ఈ పాటలు ఘంటసాల కాఫీ తాగినంత సుఖంగా పాడెయ్యగలడు. పాడేశాడు కూడా. ఇంకొన్ని పాటలు సన్నివేశంలో మమేకమై.. ఆ సన్నివేశాన్ని ఎలివేట్ చేసే పాటలు. నా దృష్టిలో ఇవి బహుకష్టమైన పాటలు. ఈ 'బహుకష్టం' కేటగిరీ ఘంటసాల స్పెషాలిటీ.

మీరు యాభై, అరవైలలోని తెలుగు సినిమాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. నే చెప్పే విషయం అర్ధమైపోతుంది. ఘంటసాల స్వరం కథలో ఇమిడిపోతుంది. కథని చెప్పేస్తుంది. ముందుకు నడిపిస్తుంది. ఇదేమి సామాన్యమైన విజయం కాదు. అయితే ఘంటసాల గానం ఈ పని చాలా అవలీలగా, అలవోకగా చేసేసింది. దటీజ్ ఘంటసాల!

(photo courtesy : Google)

48 comments:

  1. ఘంటసాల గోప్పోడు అని చెపాడనికి యరమణ టెక్నిక్ అక్కర్లేదు. బాలక్రిష్ణ గొప్పోడు అని చెప్పడానికి మాత్రమే యరమణ టెక్నిక్ కావాలి

    ReplyDelete
    Replies
    1. యరమణ టెక్నిక్ (!?) ఏంటో నాకు తెలీదు.

      రాత్రి యూట్యూబ్ లో పాట చూశాను. అద్భుతం అనిపించింది. వెంటనే నా ఆలోచనలు ఒక పోస్టుగా రాసేశాను. అంతే!

      Delete
  2. That is a lovely write up on the legendary music maestro. There won't be another Ghantasala ever - for sure.

    ReplyDelete
    Replies
    1. యూట్యూబ్ నిండా ఘంటసాల పాటల హంతక ముఠాలు తిష్ట వేసుకున్నాయి. ఇప్పుడు అసలు పాటలు మాయమైపోతున్నాయి.

      మొన్న 'జయభేరి' లోని 'నందుని చరితము వినుమా.. ' చూద్దామనుకున్నాను. ఇంతకు ముందు ఈ పాట ఉండేది. ఇప్పుడు అసలు పాట మాయమై.. ఆయనెవరో (ఘంటసాలకి బదులుగా) ఆ పాట పాడుతున్నాడు! కడుపులో తిప్పేసింది.

      (మీరేమన్నా జయభేరి పాట లింక్ పంపగలరా?)

      Delete
    2. Here is the link Ramana. I truncated it from the movie. I could not not include the touching temple scene before the song. Enjoy!http://www.youtube.com/watch?v=V79Tm9KE2S0&feature=endscreen&NR=1#t=01h00m50s
      They sure don't make movies like that anymore!
      BSR

      Delete
  3. అందుకే ఘంటసాల ని స్వరటంకశాల అంటారు.

    ReplyDelete
  4. ఏ అంశాన్ని ఎలా మలిచి వ్రాయొఛ్చొ చక్కగా చూపిస్తున్నారు.దానికి పాత పాటలు బోనస్సూ . ఘంటసాల మాత్రమే కధలో లీనమై పాడడానికి కారణం అప్పటి సినిమాలో కధలు ఉండడం, ఆ కధలు జనజీవనాన్ని ప్రతిబింబించడం ఏమో. ఇప్పుడు కూడా కధను బట్టి గాయకుని పరిణితి పెరిగే అవకాశాలు లేకపోలేదు అన్నది నా అభిప్రాయం.

    ReplyDelete
    Replies
    1. Mauli గారు,

      అవును. మీ అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నాను.

      అయితే.. ప్రతిభ కూడా ముఖ్యమే గదా! ఘంటసాల తరవాత తెలుగులో ప్రతిభావంతమైన గాయకులెవరూ లేరు. ఈ సమస్య హిందీలో కూడా ఉంది. రఫీ స్థానం ఈ రోజుకీ ఖాళీగానే ఉంది.

      అందుకే మనం ఈ రోజుకీ ఘంటసాలని తలచుకుంటున్నాం. ఆయన పేరు చెప్పుకుని టీవీ రియాలిటీ షో వాళ్ళు కూడా సొమ్ము చేసుకుంటున్నారు.

      ఘంటసాల శాస్త్రీయ సంగీత నేపధ్యం నుండి వచ్చారు. ఆ రకంగా సినిమా సంగీతానికి గౌరవం కూడా వచ్చింది.

      Delete
  5. రమణా,

    మామూలుగానే బాగా రాసావు.

    ఘంటసాలలో కమిట్మెంటు ఉన్నది. ఆయన చుట్టూత వున్న వాళ్ళలో బోలెడంత టీం స్పిరిట్ వున్నది. వీటన్నిటిని మించి వాయిస్ ని ఎక్కడ ఎలివేట్ చెయ్యాలో ఘంటసాలకి ఎలా తెలుసో.. ఏ ఇంస్త్రుమెంటు ఎలా వాడాలో సంగీత దర్శకుడికి బాగా తెల్సు - ఉదాహరణకి పద్యంలో క్లారినెట్ వాడారు చూసావా! వీటిని అన్నిటిని వాడుకోవటం ఘంటసాలకి బాగా తెల్సు . అందుకనే కొన్నికాలాల పాటు నిలిచిపోయే పాటలు వచ్చినయ్యి. ఏమయినా మనం అద్రుష్టవంతులం.. అని నేను ఎప్పడు అనేది అందుకే.

    తోక : రాత్రిపూట అన్ని శబ్దాలు ఆగిపోయిన్తర్వాత పహాడీ రాగంలో ఘంటసాల పాడిన 'పయనించే ఓ చిలుకా ఎగిరిపో' విను - దృశ్యం లేకుండాకూడా ఘంటసాల ఏడిపించగలడు అని అర్థం అవుతుంది.

    గోపరాజు రవి

    ReplyDelete
    Replies
    1. 'పయనించే ఓ చిలుకా.. ' గూర్చి చాలానే రాయాలి. అయితే అప్పుడు రంగంలోకి రఫీని కూడా లాగాల్సి ఉంటుంది. వీలైతే ఒక పోస్ట్ రాస్తాను.

      Delete
    2. అన్నట్లు ఈ పోస్ట్ టైటిల్ గమనించావా? శ్రీశ్రీ మహప్రస్థాన గీతం 'కవితా! ఓ కవితా!' కి అనుసరణ(అంటే ఏం లేదు.. కాపీ అని అర్ధం)!

      Delete
  6. "..ఘంటసాల తరవాత తెలుగులో ప్రతిభావంతమైన గాయకులెవరూ లేరు."
    రమణ గారు,
    ఈ మాట సరదా కి అన్నారా? నిజం గానే అన్నారా? నిజం గానే అంటే, మా బాలు మీ దృష్టి కి ఆననదుకు మీ మాటల తీవ్రం గా ఖండిస్తాండా..! ఘంటసాల గారు గొప్ప గాయకుడే కాదనటం లేఅదు. కానీ బాలు పాడిన కొన్ని పాటలు ఆయన పాడ లేరు. ముఖ్యం గా ఫాస్ట్ బీట్ పాటలు. తాళి కట్టు శుభ వేళ, ఇందువదన కుందరదన, జగడ జగడ జగడం, మాటేరాని చిన్న దాని వంటి ఫీట్స్ ఆయనకే సాధ్యం. బాలుది ఆల్ రవుండ్ టాలెందయం ఇందుకు . ఇద్దరూ కలిసి పాడిన పాటలలో కొన్ని బాలు డామినేట్ చేశాడు కూడా. "ఎన్నాళ్ళో వేచిన ఉదయం", ఇందుకు ఓ ఉదాహరణ.

    ReplyDelete
    Replies
    1. బొందలపాటి గారు,

      నేనైతే నిజంగానే అన్నాను. సరదా పాలు పైసా కూడా లేదు. అది నా స్థిరాభిప్రాయం.

      మీరు చెప్పిన గాయకుడు ఫీట్స్ బాగానే చేస్తాడు. ఒప్పుకుంటున్నాను.

      ఎవరి అభిప్రాయం వారిది. మా తరవాత తరం వారు రామారావు కన్నా కృష్ణ గొప్ప నటుడని వాదించేవారు. మా అబ్బాయి దృష్టిలో మహేష్ బాబంతటి గొప్ప ఏక్టర్ ఇంతవరకూ తెలుగులో లేడు. ఈ తరం వారికి ఎస్.రాజేశ్వరరావు కన్నా దేవిశ్రీప్రసాద్ గొప్ప సంగీత దర్శకుడు అనిపిస్తుంది. గబ్బర్ సింగ్ పాటల్ని ఎస్.రాజేశ్వరరావు ఇంత హిట్ అయ్యేంతగా స్వరపరచగలడా? ఎలా చెప్పగలం!

      ఏ వయసు వారికి ఆ వయసు వారినే ఇష్టపడతారు. ఇలా అనిపించడం సహజం కూడా. ఈ విషయంపై ఇంతకు ముందు ఓ టపా కూడా రాశాను (ఎప్పుడో గుర్తు రావట్లేదు).

      Delete
    2. డాక్టర్ గారు చాలా బాగా రాశారు. మన మగవారి ప్రతిభా పాటవాలను గురించి ఇలా రకరకాల విశ్లేషణలు చేసి, వాళ్ల ప్రత్యేకతను తెలియజేస్తూ, టపాలుగా రాసి పొగుడుతూండండి.నేను సంతోషిస్తాఉన్. పురుషులు ఏ రంగలో నైనా అద్భుతంగా రాణిస్తారు అనటానికి ఘంటసాల గారు ఒక మంచి ఉదాహరణ. ఘంటసాల,బాలు ఇద్దరు సంగీత దర్శకత్వం వహించారు. అదే తెలుగులో ఎన్నోసంవత్సరాలు పాటలు పాడిన గాన కోకిల మ్యుజిక్ డైరేక్షన్ చేయలేదు. అది వాళ్ల ప్రతిభ. మీరేమంటారు?
      మీరు బాలును ఫీట్స్ చేస్తాడు అని వెటకారంగా అంట్టున్నారు. ఇలా నోరు జారటవలన అవతల వర్గం వారికి లోకువైపోతాం. మనం జాగ్రత్త గా ఉండాలి. అవతలి వారికి అవకాశం ఇవ్వకుడదు. జీవితం లో మనమెంత ఎత్తుకు ఎదిగాం అన్నది కాదు ప్రశ్న. అవతలి వారిని పైకి రానియకుండా ఏం చేశాం అన్నది చాలా ముఖ్యం (ఇది పాత సినేమాలో రావుగోపాల రావు డైలాగ్ )

      గత రెండు సం|| గా ఇన్నిటపాలు రాసిన మీ ప్రతిభ గుర్తించి, మీ గురించి నాలుగు మంచి మాటలు రాసిన వాడు ఎవడులేడు. అదే వాళ్లైతే చూడండి, జాజిమల్లి బ్లాగు లో మహిళా బ్లాగర్ల గురించి పరిచయ కార్యక్రమం మొదలు పెట్టారు. మగవారిలో ఐక్యత,సంఘటితంగా ఉండి ఉంటే ఇన్నిటాపాలు రాసిన మిమ్మల్ని ఈ పాటికి సుపర్ స్టార్ గా ప్రకటించి ఉండెవారు. అది లేకపోవటం వలన మనవారికి రావలసిన తగిన గుర్తింపు రావటంలేదు. ఈ లోపాన్ని మీరు సరిద్దిదే చర్యలు మొదలు పెట్టాలి.

      నా వంతుగా గత సంవత్సరం ఎక్కువటపాలను, అందులోను ముఖ్యంగా హాస్యానికి పెద్ద పీఠ వేస్తూ రచనలు చేసినందుకు, మిమ్మల్ని తెలుగు బ్లాగు లోకం లో 2012 సూపర్ స్టార్ రమణ గారని మీ బ్లాగు ముఖంగా ప్రకటిస్తున్నాను. అందుకోండి నా శుభాకాంక్షలు :)

      Delete
    3. ఆ పాట అలా నిర్దేశించబడితే, ఏ వీధి బిచ్చగాడో ఇద్దరినీ డామినేట్ చేయొచ్చు.

      Delete
  7. అబ్బా,

    ఈ పాత జమానా వారికి వాళ్ళ పాత జమానా గొడవే, భడాయిలే !

    ఈ కాలం లో ఎంత మంది గొప్పగా పాట్లు పడి పాడే వారు ఉన్నారు ! వాడికి భాష రాక పోయినా వాడి భాషలో రాసేసు కుని 'అన్గంగా ఆఖాశం ఉంది' అంటూ పాడె కట్టేస్తారు వాళ్ళని మెచ్చుకోరుస్మీ!

    జిలేబి.

    ReplyDelete
  8. అబ్బా,

    ఈ పాత కాలం జమానా వాళ్ళకి వాళ్ళ కాలపు బడాయిలే ఎప్పుడూ.

    ఈ కాలం లో ఎంత మంది పాట్లు పడి తెలుగు రాక పోయినా వాళ్ళ భాషలో రాసేసుకుని, 'అన్గంగా ఆఖాషమ్ ఉంది' అని టెల్గూ పాటల్ని పాతరేస్తున్నారు వాళ్లకి ఎవరూ కితాబు ఇవ్వరుస్మీ!

    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి జి,

      పురానా జమానా కబుర్లు బడాయిగా రాసుకోకపోతే్.. కుర్ర బ్లాగర్లకి లోకువైపోమూ!

      తెలుగు తెలీకుండా తెలుగు భాషలో పాటలు పాడినవారిని అభినందిస్తున్నాను! నాకయితే వాళ్ళ ఉచ్చారణ గమ్మత్తుగా, సరదాగా ఉంటుంది. ఇప్పటి సినిమాలకి ఈ తరహా పాటలే సరిపోతాయేమో!

      Delete
  9. నా దృష్టిలో ఘంటసాల ఎంత గొప్ప గాయకుడో, జేసుదాస్ కూడ అంతే గొప్ప గాయకుడు. మళయాళీలు ఆయన్ని అంతగా గౌరవిస్తారు.
    జేసుదాస్ తెలుగువాడు కాదు కాబట్టి మనవాళ్ళు ఆయన్ని పొదుపుగా వాడుకున్నారు. వీళ్ళిద్దరి గొంతుల్లో ఒక ప్రత్యేకమైన జీర ఉంటుంది. బాలు గొంతు ఏ జీర లేకుండా ప్లెయిన్ గా ఉంటుంది.
    అన్నట్టు ఘంటసాల ఇంకొన్నేళ్ళు జీవించి శంకరాభరణం సినిమాకి పాడి ఉంటే ఎలా ఉండేదో?

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,

      నేను ఘంటసాల గూర్చి రాసినప్పుడు మీరు బాలు, జేసుదాసుల్ని తీసుకొచ్చి ఘంటసాలతో పోల్చడం చాలా అన్యాయం. వీరి స్థాయి చాలా తక్కువ. బాలసుబ్రహ్మణ్యం అయితే మరీ ఘోరం. అతని మిమిక్రీ తరహా పాటలు చిరంజీవి, బాలకృష్ణల పిచ్చిగంతులకి బాగా సూటయ్యాయి. నా దృష్టిలో రఫీ ఒక్కడే ఘంటసాలకి సరిజోడి. గాయకుల్ని పోల్చడానికి కనీస ప్రాతిపదిక అంటూ ఉండాలి.

      ఘంటసాల స్వరం 1965 తరవాత చాలా తొందరగా చెడిపోయింది. ఆ స్వరంలోని మాధుర్యం, మార్ధవం తగ్గిపోయి.. మొరటుగా, రొప్పుగా తయారయ్యింది. దీనికి బహుశా ఆయన అనారోగ్యం కారణమనుకుంటాను. భగవద్గీత పాడినప్పుడయితే ఆయన గొంతు దాదాపుగా పోయింది. 'అయ్యో పాపం!' అనిపించి.. వింటానికే ఇబ్బందిగా తయారయింది.

      ఘంటసాల చివరి రోజుల గొంతుతో 'శంకరాభరణం' పాటలు పాడించినట్లయితే్.. పాటలు మనకి అర్ధమయ్యేవి కావు.. సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. అయినా..బాలసుబ్రహ్మణ్యం బాలమురళిని మిమిక్రీ చేసి 'శంకరాభరణం' లో బాగానే మెప్పించాడుగా! ఇంక మళ్ళీ ఘంటసాల ఎందుకు?

      Delete
    2. మిమ్మల్ని 2012 బ్లాగు సుపర్ స్టార్ గా ప్రకటించి 12గం|| పైన అయింది. నాకు మీరు కనీసం ఒక థాంక్స్ చెప్పలేదు. ఈ మధ్య నా వ్యాఖ్యలకి మీరు బదులివ్వకుండా ఉంటే సరేలే పో "మాలోని వాడివిలే మా మగ జాతి వాడివేలే , పెళ్లి చేసుకోని ప్లేట్ ఫిరాయించావు" అని అనుకొన్నానే కాని, ఇలా పిరికివారిలాగా ప్రవర్తిస్తారను కోలేదు :) ఎవరైనా అభినందిస్తే సంతోషించాల్సింది పోయి, మౌన వ్రతం పాటిస్తారా? అంతటితో ఆగక రంగనాయకమ్మ కో.కు. ను దుమ్మెత్తి పోసినట్లు, బాలసుబ్రమణ్యం ను విమర్శిస్తారా? బాలు అంటే ఎవరనుకొన్నారు మన "సింహపురి పురుష సింహం". మీ ఊరుల్లో కుచొని మిమ్మల్ని మీరు గొప్పవాళ్లనుకోవటం కాదు. దేశంలో ప్రస్తుతం తెలుగు వారికున్న ప్రత్యేకత, గొప్ప చరిత్ర ఎమిటి? ఎమీలేదు. మన తెలుగు వారి చరిత్ర అంతా స్కాంల ,రంకుపురాణల, కులాల గొడవలచూట్టూ తిరుగుతుంట్టుంది. ఇంతకు మించి ఒక్క మంచి పనిలో తెలుగువారికి ఎమైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? ఇటువంటి చరిత్రకల మనం, కొద్దో గొప్పో మంచి పేరు ఉన్న బాలుని ఎగతాళి చేయటం. హతవిధి. మీకు తెలియకపోతే తెలుసుకోండి బాలు గొప్పతనం. ఘంటసాల తెలుగులో తప్పించి ఇతర భాషలలో చెప్పుకోదగ్గ స్థాయిలో పాడలేదు. అదే బాలు తెలుగోడని చాలా మంది తమిళోల్లకి తెలియదు కూడా, ఆ లేవల్ లో వాళ్ల భాషను నేర్చుకొని తన గాత్రం తో అక్కడి తమిళ గాయకులను సైతం మరచిపోయేలా చేసేశాడు. బాలు వచ్చిన తరువాత సౌందర్య రాజన్ ఎక్కడ? ఇక ఇళయ రాజ, ఏ.ఆర్. రెహ్మాన్ లను (రోజా సినేమాకు మ్యుజిక్ డైరేక్షన్ చాన్స్ రేహ్మాన్ కి ఇవ్వవలసింది గా బాలచందర్ కు రెకమేండ్ చేశాడు)ప్రోత్సహించింది బాలునే. అది అతని దూర దృష్టి. ఇళయ రాజ దళితుడు, రెహ్మాన్ ముస్లిం. దీనిని బట్టి సగటు తెలుగు వారిలా కులగజ్జి లేదని చెప్పవచ్చు. హిందీసినేమా లో, ఇప్పటివరకు వచ్చిన టాప్ 10 సుపర్ హిట్ సినేమాలలో బాలు పాడినవి మూడు ఉన్నాయి. అవి ఏక్ దూజే కేలియే , మైనే ప్యార్ కియా, హం ఆప్ కే హై కౌన్ అది బాలు స్టామినా! తెలుసుకోండి.

      Delete
    3. అజ్ఞాతా,

      శాంతించండి. మీ భాష బాగుంటుంది. భావం చమత్కారంగా ఉంటుంది. మీ కామెంట్లని చదువుతూ హాయిగా నవ్వుకుంటాను. మీ కామెంట్లకి ఏం సమాధానం రాయాలో తెలీక మాత్రమే నేను ఊరకున్నాను. దయచేసి అర్ధం చేసుకుని క్షమించగలరు.

      నేను మీరు సీరియస్ గా కామెంట్లు రాస్తున్నారని అనుకోలేదు. అందుకే మీ కాంప్లిమెంట్ / బిరుదుకి ఎలా స్పందించాలో తెలీక తికమక పడ్డాను. ఓకే! మీరు నాకు ప్రదానం చేస్తున్న టైటిల్ ని ఆనందంగా, సంతోషంగా, గర్వంగా స్వీకరిస్తున్నాను. అయితే.. నేను ఈ టైటిల్స్, బిరుదుల గూర్చి విమర్శిస్తూ.. 'బిరుదులు-బరువులు' అంటూ ఒక టపా రాశాను. ఇప్పుడది కొద్దిగా గుచ్చుకుంటుంది!

      ఇకపోతే బాలసుబ్రహ్మణ్యం గూర్చి.. నా బ్లాగులో నా అభిప్రాయాల్ని స్వేచ్చగా రాసుకుంటూ వస్తున్నాను. ఆ క్రమంలో ఘంటసాలతో పోలిక వచ్చినప్పుడు నా అభిప్రాయం స్పష్టంగా రాశాను. అంతేగాని.. అతని పాపులారిటీ, పలుకుబడి తక్కువ చేసి రాయలేదు. గమనించగలరు. పాపులారిటీ పరంగా చూసుకుంటే ఘంటసాల కన్నా బాలుయే చాలా ఎక్కువ పాపులర్ అయ్యుండొచ్చు. నేనెందుకు కాదంటాను!

      ప్రస్తుతం నా పిల్లలకి ఒక స్కీం పెట్టాను. 'యూట్యూబ్ లో ఘంటసాల పాట ఒకటి చూస్తే ఒక కోకకోలా పెట్ బాటిల్ ఉచితం!' వాళ్ళు కోకకోలా వద్దంటున్నారు!

      Delete
    4. సినేమాలు నటించటంలో రాసిలో సుపర్ స్టార్ కృష్ణ, వాసిలో మెగస్టార్ చిరంజివి ఎలాగో, మీరు అలాగే. ఎక్కువ టపాలను రాసినా దాదాపు అంతే శాతం క్వాలిటిని మైంటైన్ చేశారు. మీరు 2012 బ్లాగు సుపర్ స్టార్ అవార్డ్ కు అన్ని విధాల అర్హులే. 'బిరుదులు-బరువులు' ఈ టపాను చదవలేదు. కాని అందులో ఎమీ రాసి ఉంటారో ఊహించగలను. మీరు చదివేది శ్రీ శ్రీ పుస్తకాలను, ఈ శతాబ్దం నాది అన్న శ్రీ శ్రీ కాంఫిడేన్స్ చూసి కొంచెం నేర్చుకొండి. 2012 బ్లాగు సుపర్ స్టార్ అవార్డ్, ఇస్తుంటే రంగనాయకమ్మ కారా మాష్టారు, విరసం వాళ్లని విమర్సించిన వ్యాసలను గుర్తుకు తెచ్చుకొని నేగటివ్ గా ఆలోచించటమేమిటి? ప్రపంచంలో నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఏ ఫలాపేక్ష ఆశించకుండా, నా ప్రతిభని కనీసం ఒక్క అజ్ణాతన్నా ఆవిషయం గుర్తించాడు అని మీరు తెలుసుకొని ఆనందించాలి. ఆ తరువాత నిజమే, నేను దీనికి అర్హుడనే అన్న ఆత్మవిశ్వాసం తో గుండే ఉప్పొంగాలి గాని.

      మిమ్మల్ని పొగడటానికి రతన్ టాటా రాడు.నాలంటి తెలుగు బ్లాగులు చదివే వాడే వస్తాడు. ఒకవేళ ఆయన వచ్చి పొగిడినా, మీరు అంతటోడు వచ్చి నన్ను ఎందుకుపొగుడుతాడు. ఎదో ఎత్తుగడ ఉంట్టుంది అని పలు రకాలుగా, కమ్యునిస్ట్ పుస్తకాలలో రాసిన ఎత్తుగడలను గుర్తుకు తెచ్చుకొని, ఆనందించరు సరికదా! నన్ను పొగిడితే టాటా కువచ్చే లాభం ఎమీటా అని ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకొంటారు. ఇప్పటి కన్నా అర్థమైదనుకొంటాను నేను ఇచ్చిన బిరుదు విలువ

      సంక్రాంతి శుభాకాంక్షలు.

      Delete
  10. అమరగాయకుని మీద ఆర్టికల్ చాలా పేలవంగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. ఏదో పాట చూసేసిన ఆనందంతో, ఆవేశంగా రాసేశాను. పోనిద్దురూ!

      Delete
  11. విజ్ఞులైన మిత్రులారా,

    కామెంట్స్ చదివిన తరవాత నాకొక విషయం బోధపడింది. నేను నా ఆలోచనని అర్ధమయ్యేట్లు రాయలేకపోయానని. అందుకు నాదే బాధ్యత.

    ఈ పోస్టులోని విషయం నేను కొత్తగా కనిపెట్టి రాసిన ఆలోచన కాదు. సినిమా పాటల గూర్చి గతంలో కొడవటిగంటి కుటుంబరావు, VAK.రంగారావులు ఇవే అభిప్రాయాల్ని రాశారు. ఆ అభిప్రాయాలనే నాకు నచ్చిన పాటకి అన్వయించుకున్నాను. మీకు ఆ పాయింట్ నచ్చకపోతే అది వేరే సంగతి.

    మంచి పాట అంటే శాస్త్రీయ సంగతులని హెవీగా బేస్ చేసుకుని ట్యూన్ చెయ్యడం / పాడటం అనే అపోహ కూడదు. అందుకే కొందరు 'శంకరాభరణం' ప్రస్తావన తెచ్చారు. అప్పుడు ఘంటసాలకి 'రసికరాజ తగువారము కాదా.. ', 'శివశంకరి శివానందలహరి.. ' వంటివి బెస్ట్ సాంగ్స్ అవుతాయి. ఆయన చేసిన 'రహస్యం' సినిమా వరసలు బెస్ట్ అయిపోతాయి. కానీ కాదు.

    అసలు శాస్త్రీయ సంగీతాన్ని సినిమాల్లో వెతుక్కునే దరిద్రం దేనికి? శుభ్రంగా, చక్కగా, హాయిగా మంగళంపల్లి, పట్టమ్మాళ్, సుబ్బులక్ష్మి వంటి ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతాన్ని రికార్డుల్లో వినేస్తే సరిపోతుందిగా! నే చేసేదదే!

    ఘంటసాల 'పాత్రోచితం'గా పాడటంలో నిష్టాతుడు. ఈ పాయింటే నే చెప్పింది. అర్హత లేని ఎవరెవర్నో తీసుకొచ్చి ఘంటసాలతో తూకం వెయ్యబూనడం దురదృష్టం.

    దయచేసి నన్ను ఘంటసాల గుడ్డి అభిమానిగా కూడా చూడకండి. శ్రోతగా నాకు పూర్తి స్వేచ్చ ఉంది. కొందరు కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో బాగా నచ్చుతారు. లేకపోతె లేదు. అందుకే.. ఘంటసాల చివరి దశలో పాడిన పాటలు నాకు చిరాకు.

    ReplyDelete
  12. శ్రొతగా మీకైతే స్వేచ్చ ఎలావుంటుందో, మీ రాతలమీద కామెంట్ చేసే స్వేచ్చ మీ చదువరులకు వుంటుంది. మీరు పదే పదే ఈవిషయాన్ని నొక్కివక్కాణించనవసరం లేదు. చివరిదశలో అంటే గొంతుకేన్సర్ వున్నా భగవద్గీత తన తృప్తికోసం పాడారు. భగవద్గీత లతామంగేష్కర్, ఇంకా ఎందరో పాడారు, కాని ఘంటసాల స్వరపరిచిందాన్లోని మాడులేషన్, గంభీరత, సీరియస్నెస్ అంతగా అనిపించలేదు.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాతా,

      మీ ఘంటసాల వీరాభిమనానికి అభినందనలు. ఘంటసాల తుమ్మినా కూడా అందులోని మాధుర్యానికి ముగ్ధులయ్యే అభిమానులు నాకు తెలుసు. ఎవరి గోల వారిది.

      మీకు ఘంటసాల వ్యక్తిగత వివరాలు తెలీదని నాకు అర్ధమవుతుంది. అందుకే ఘంటసాలకి లేని 'గొంతు కేన్సర్' రోగం అంటగట్టారు. ఆయన చనిపోయిన కారణం.. complications of diabetes. ఇంకా చాలా వివరాలు ఘంటసాల భార్య సావిత్రి రాసిన పుస్తకంలో లభ్యం. చదువుకొమ్మని సలహా.

      అయినా.. ఒక గాయకుడికి ఏదన్నా వ్యాధి ఉండి.. సరీగ్గా పాడలేకపోతే శ్రోతగా అది నాకనవసరం. నాకు నచ్చలేదనే చెబుతాను. నేను ఆ గాయకుడి స్వరానికి అభిమానిని. ఆయన వ్యక్తిగత విషయాలు నాకెందుకు!? ఇక్కడ స్వరం ముఖ్యం. గాయకుడి వ్యాధులు కాదు.

      Delete
    2. మీ వ్యక్తిగత అభిరుచులు ఎవరికి అవసరముంటాయిలేండి. మనం 50రూ పెట్టి చూసే, ఫ్రీగా డౌలోడ్ చేసుకునే సంగీతానికి, స్వరం, సాహిత్యం, గాత్రం అన్నీ ముఖ్యమే.

      Delete
    3. రమణగారు, ఘంటసాల కేన్సర్ వల్ల పోయారని నెట్‌లో చూశాను, డయాబిటిస్ అని మీరంటున్నారు మరిన్ని వివరాలు ఇవ్వగలరా? సావిత్ర్మ్మ గారి పుస్తకం చదివేశారా? స్వర మాధుర్యం పుస్తకంలో వుంటుందా, ఏదో స్వంతవిషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, అభిమానం కాని.

      Delete
    4. ఘంటసాల డయాబెటిస్ తో బాగా ఇబ్బంది పడ్డారు. దానికోసం ఏదో వైద్యం (?నాటు వైద్యం) చేయించుకుని ఆస్పత్రి పాలయ్యారు (ఘంటసాల సావిత్రమ్మ గారి పుస్తకం). అయితే ఆయన భగవద్గీత సమయానికే MI (గుండెపోటు), ఆస్త్మా వంటి వ్యాధులతో బాధ పడుతున్నారు. He died of septicemic shock leading to multi-organ failure.

      ఘంటసాలపై నాకు తెలిసే ఎన్నో పుస్తకాలున్నాయి. డజన్ల కొద్ది వ్యాసాలున్నాయి. ఆయన ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ సంగీతమంటే పిచ్చిన్నర పిచ్చి (ఆరుద్ర సినీ మినీ కబుర్లు)! మా తరం వారికి ఘంటసాల వివరాలు, విశేషాలు కొట్టిన పిండిన్నర పిండి!!

      Delete
  13. నా మటుక్కి ఘంటసాల ఒక అముదం చెట్టు. ఆ రొజుల్లో అంతగా బాగా పాడే వారులేరు లేరు కదా? బాలు ఒక అరటిచెట్టు. చాలారకాలుగా పాడగలడు. జేసుదాసు ఒక మిరియల చెట్టు. కొద్దిగా వాడితెనే బాగుంటుంది. మిగిలిన వాళ్ళు చాలామంది కలుపు మొక్కలపాటి. ;)

    ReplyDelete
    Replies
    1. మీ చెట్టు పోలిక బహు బాగుంది. ఇదేమీ 'సిరిమల్లె చెట్టు.. ' ఎఫెక్ట్ కాదుగదా:)

      Delete
    2. ఆముదం చెట్టుతో పోల్చడం, పొగడ్త కాదు. ఎవరూ లేరు కాబట్టి నెగ్గుకొచ్చాడు అని చెప్పడం.

      Delete


  14. ప్రతిభ అనేది ఏ రంగం లోనైనా,ఏ కాలంలోనైనా ఉంటుంది.కాని తరతమ భేదాలు ఉంటాయి.ఘంటసాలను మెచ్చుకుంటే ఇతరులను కించవలసిన అవసరం ఏముంది?ఎవరి ప్రత్యేకత,విశిష్టత ,ప్రత్యేకత


    వారికుంటాయి.ఘంటసాల గొప్పదనం ఆయన కంఠంలో గాంభీర్యము,మాధుర్యము రెండు మేళవించి ఉండడం.శాస్త్రీయసంగీతంలో ఉన్న పరిజ్ఞానం.
    ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చును.ఆ హక్కు వారికుంది.కాని ఏ కళారంగాన్ని తీసుకున్నా ,కొన్నివిలువలు ,ప్రమాణాలు ఉంటాయి.వాటిని బట్టే విమర్శకులు సమీక్షచేసి నిర్ణయిస్తారు.కళలకు,ప్రమాణాలు,కొలబద్దలు లేకపోతే విమర్శకి అర్థం ఉండదు.
    వీటిప్రకారం చూస్తే తెలుగుసినిమా సంగీతంలో ఘంటసాలకి మొదటిస్థానం,జేసుదాసుకు రెండవస్థానం,బాలుకి మూడవ స్థానం ఇవ్వవలాసి ఉంటుంది.అలాగే హిందీ సినిమాసంగీతంలో 1వస్థానం సైగల్ కి,2వస్థానం రఫీకి 3వస్థానం కిశోర్ కి ఇవ్వవలసి ఉంటుంది.

    ReplyDelete
  15. * ఏ కళారంగాన్ని తీసుకున్నా ,కొన్నివిలువలు ,ప్రమాణాలు ఉంటాయి*

    కమనీయం గారు,
    సినేమా పాటలు శాస్రియ సంగీతం కేటగిరి లోకి రాదు. కాకపొతే కొన్ని సినేమాలలో శాస్రీయ సంగీతం పాటలు పెట్టి ఉండవచ్చు. ఇక వాటికి మీరనుకొనే ప్రమాణాలను అన్వయించలేము. ఆపాటల ప్రధానోద్దేశం సినేమా విజయానికి ఉపయోగపడటం,సాధ్యమైనంత నూతనత్వం కలిగి ఉండటం. ఆ లెక్కన చూస్తే బాల సుబ్రమణ్యం, ఘంటశాల, రామకృష్ణ,జేసుదాస్ వస్తారు. కర్ణాటక సంగీతం పాడే కోణం లో నుంచి చూస్తే బాలు ఆఖరు స్థానం లోకి రావచ్చు. అదివేరే విషయం. జేసుదాస్ గొప్ప కర్ణాటక సంగీత కచేరిలు చేస్తాడు. అంతే ఆయన గొప్ప ప్లే బాక్ సింగర్ కాడు.
    ఒక తెలుగు సినేమాలో ఆయన చేత ఆరు పాటలను పాడిస్తే హిట్ అవుతుందని ఎవరు అనుకోరు. మోహన్ బాబే ప్రయత్నించలేదు. మీకు శాస్రీయ సంగీతం ఇష్ట్టం కనుక ఆ స్కేల్ ను తీసుకొచ్చి సినేమా సంగీతానికి అన్వయించకండి.

    ReplyDelete
  16. ananymous గారు,
    గాయకులకు rankings వగైరాలెందుకండి?ఎవరికి నచ్హిన గాయకులు వారికి నచ్హుతారు.తమిళులతొ వాళ్ళ టీయం.సౌందరరాజన్ ను కామెంట్ చేస్తె మనమీద విరుచుకు పడతారు,అదే గొంతు మనకు కర్ణ కఠొరంగా వుంటుంది.ఎవరి అభిరుచి వారిది.మీరు రాసిన గాయకుల్లొ పి.బి.శ్రీనివాస్,ఎ.యం.రాజా లు లేరు మరి.
    నాకైతే పి.బి.శ్రీనివాస్ లోని మార్ధవం మరి ఎవరి లో కనిపించదు.కావలంటె ఈడు-జోడు లోని 'రేపంటి రూపంకంటీ' ,రాము లోని 'మంటలు రేపే నెలరాజా' పాటలను తమిళ 'పాసం','రామూ చిత్రాల్లొ పి.బి.శ్రీనివాస్ గొంతులో వినండి.అలాగే కన్నడ లో వచ్హిన 'ఎరడు కనసూ(తెలుగు లో పూజ,ప్రణయ గీతం చిత్రల్లొ)పాటలు వినండి. బాలు ఎంత దరిద్రం గా పాడాడో తెలుస్తుంది.
    అసలు బాలు గొంతులో మార్ధవం అంటూ వచ్హింది ఇళయరాజా వచ్హిన తరువాతే కదా....

    ReplyDelete




  17. ఈ విషయంలో అభిప్రాయభేదాలు ఉంటాయని తెలుసును.నేను శాస్త్రీయ సంగీతం దృష్టిలో పెట్టుకొని రాయలేదు.సినిమాసంగీతం దృష్టి తోనే రాసాను.దానికి కూడా విలువలు, ప్రమాణాలు ఉన్నాయనే అనుకొంటున్నాను.ఆ దృష్టి తోనే overall rankings ఇచ్చాను.ఇంకా M.S.రామారావు,P.B.శ్రీనివాస్ ,A.M.రాజా మొ;వారిని ప్రస్తావించక పోయినా ,వారు పాడిన కొన్ని మధురమైన పాటల్ని మరచిపోలేదు.మంద్రంలో శ్రీనివాస్,మార్దవంలో రాజా,గాంభీర్యంలో రామారావు,మాధవపెద్ది గొప్ప.వాళ్ళందరూ పాడిన అన్ని పాటలనీ బేరీజు వేసినతర్వాతే పైవిధంగా రాసాను.
    షేక్స్పియర్ ఇంగ్లిష్ లో, కాళిదాసు సంస్కృతంలో ఉత్తమకవులు అంటే మిగతా వాళ్ళు మంచి కవులు కాదని అనలేము కదా.ఎవరి గొప్పతనం,ప్రత్యేకత వారిది.ఐనా లోకో భిన్న రుచిః.

    ReplyDelete
  18. రాంకింగులు మీ ఇష్టం. పెద్దలైన మీలాంటి పురుష సింహాలతో గొడవ పడటం నా పాలసికి వ్యతిరేకం. మనలో మనం వాదించుకోవటం పురుషుల ఐక్యతను దెబ్బతీస్తుంది :)
    బాలు ను నెల్లురోళ్ల లాగా డాటేరు మరీ తక్కువ చేయబోతే అడ్డుకొన్నాను. నెల్లూరు లో పాటలు పాడే లోకల్ వాళ్లకి బాలు అంటే పెద్దగా పడదు అని విన్నాను. ఆ మన ఊరులో పుట్టి,మన కంటి ముందు పెరిగిన వాడు అంత గొప్పవాడు కావటమేమిటి? ఘంటసాల కన్నా గొప్ప వాడాని డాటేరు లా వాదించే వారు కోకొల్లలు అని, నా మిత్రులు చెపుతూండేవారు.

    ఈ సైకాలజినే మిస్సమ్మ సినేమాలో ఒక సీన్ లో చూపేడతారు. నాగేశ్వర రావు తనను ఒక గొప్ప డిటేక్టివ్ లాగా పరిచయం చేసుకోబోతూంటే యస్.వి .రంగారావు ఆ వాడు నా మేనల్లుడు అని నాగేశ్వర రావు కు వృత్తిరిత్యా రావలసిన క్రేడిట్ ఇవ్వకుండా సమాజంలో వాడు ఎంత పెద్ద వాడైనా నాకు అల్లుడే కదా! వాడి గొప్పతనం ఏముందన్నట్లు క్రెడిట్ ఇవ్వడు.

    రమణ గారు,
    ప్రజా బ్లాగు ఓనర్ పల్లా కొండలరావు గారు, ఈ మధ్య ఒక టపాలో వేసిన ప్రశ్న "స్త్రీవాదం అంటే ఏమిటి? ఈ వాదమెందుకు?"

    దానికి నా సమాధానం వీడియోల రూపంలో ఇచ్చాను. నేను చెప్పలనుకొన్నదాన్ని ఈ క్రింది వీడియోలలో, చాలా స్పష్టం గా పూరి పాత్ర ద్వారా దర్శకుడు చెప్పాడు మీరు తప్పక చూడండి. ఇక నుంచి ఆ వాదాన్ని మనం పూరి వాదం అని పిలుచుకుందాం :)

    http://www.youtube.com/watch?v=F7X1ilDpYHc

    http://www.youtube.com/watch?v=NsJ0z2hzEiI

    ReplyDelete
    Replies
    1. మీ విడియో లింక్స్ చూశాను. బాగున్నాయి.

      నాకు ఘంటసాల చాలామటుకు ఇష్టం. బాలు అంటే ఎలర్జీ. పెసరట్టు ఇష్టం. పిజా పేరెత్తితేనే రోత. ఇవన్నీ నా ఇష్టాయిష్టాలు. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. వారివారి పేరుప్రఖ్యాతులతో నాకేమి పని?

      నాకు సమయం లేని కారణాన బ్లాగ్ ఎగ్రిగేటర్లు చూట్టం లేదు. కావున మీరు చెప్పిన్ ప్రజా బ్లాగ్ నాకు తెలీదు. క్షమించగలరు.

      నా బ్లాగులో నే రాసేదంతా నా సొంత గొడవ మాత్రమే. నే బ్లాగ్ రాసేదే నా అభిప్రాయాలు రాసుకోడానికి. అంతకు మించిన 'బ్లాగ్ధర్మం' నాకు లేదు. విజ్ఞులు గమనించగలరు.

      Delete




    2. ఒకరు అడిగారు కాబట్టి రాస్తున్నాను.ఘంటసాల మరణానికి కారణం కేన్సర్ కాదు.మధుమేహవ్యాధి(Diabetes with complications and cardiac failure ) గుండెజబ్బు కారణం.అందువల్లనే 70'ల్లో ఆయన పాటల్లో ఆయాసం తెలుస్తూ ఉంటుంది.ఆ రోజుల్లో సరి ఐన అధునాతనవైద్యం ఆయనకు అందలేదనుకొంటాను.

      Delete




  19. anonymousగారూ,ఇందులో గొడవపడడానికేమున్నదండీ? Academic discussion మాత్రమే.ఎవరికిష్టమైన పాటలు వాళ్ళు విని ఆనందిద్దాం .సరేనా?

    ReplyDelete
  20. లోకోభిన్న రుచి, ఈ లింక్ చూడండి...
    http://manishi-manasulomaata.blogspot.in/2010/06/blog-post.html
    ఈ గాయకుల విషయం నాకు తెలీదు కానీ... నా మట్టుకు నాకు సునీతను మించిన గాయనీమణి లేదు.
    అందంగా (అలంకరించుకున్న) వున్న మనిషి పాడింది గనక సంగీతం కూడా శ్రావ్యంగా వుంటుందనుకునే బ్యాచ్ లో నేను లేనని మనవి.
    -బ్రహ్మం

    ReplyDelete
    Replies
    1. నో ప్రాబ్లం. సునీత మా గుంటూరు చంద్రమౌళినగర్ అమ్మాయి. కావున ఆవిడని అభిమానిస్తున్న మిమ్మల్ని అభినంధిస్తున్నాను.

      Delete
    2. మాష్టారు, మీ బ్రాడీపేట అభిజాత్యం నశించాలి, సునీత ఇళ్ళు లక్ష్మీపురం ముడో లైను, ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్ ఏ,టి.యం. వెనక ఇళ్ళు, ఆ పక్కనే మా ఇళ్ళు, సునీత టీవీల్లోకి రాకముందునుంచి మాకు తెలుసు

      Delete
    3. తారగారు,

      ఒకట్రెండు లైన్లు తేడాగా రాశాను. నాకు ఆ లైన్లు సరీగ్గా తెలీవు. సునీత మన గుంటూరమ్మాయి. అదీ ముఖ్యం.

      అయినా మధ్యలో మా బ్రాడీపేటేం చేసింది. నేనేమి ఆ అమ్మాయిని మా పేట ఖాతాలో వేసుకోలేదే :)

      Delete
  21. అంతకు ముందు చంద్రమౌళినగర్ నాల్గవ లైన్లో ఉండి ఉండచ్చు కదా!

    ReplyDelete
  22. ఎవరి ఇష్టాఇష్టాలు వారివి, కాని రమణగారు ఒక్కోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వర్గపోరాటాలకు తెరలేపుతున్నారు. ఆ కమ్యూనిస్టు పుస్తకాలు ఎక్కువ చదివి ఇలా అయ్యారేమో నాకు తెలియదు మరి.
    రమణగారూ, మనకు నచ్చిన కళాకారున్ని విశిష్టమైన వ్యక్తి అనో, అరుదైన జాతి రత్నమనో అంటే తప్పులేదుగాని, వాడంత వాడు లేడు అంటే అది రాంగ్ రూట్ లోకి వెళ్ళదూ? అలా చేస్తే వెర్రి అభిమానం తో కొట్టుకుంటున్న పంఖాలకు మీకు ఇక తేడా ఏముంటుంది చెప్పండి?

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.