నా భార్య నాలుగోనెల గర్భవతి. డాక్టర్ ఇప్పుడే ఆవిడకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాడు.
"అమ్మాయా? అబ్బాయా?"
డాక్టర్ నన్ను ఇబ్బందిగా చూశాడు.
"ఫీటస్ జెండర్ రివీల్ చెయ్యకూడదని మాకు రూల్స్ ఉన్నాయి." అన్నాడు.
"డాక్టర్ గారు! ఎన్నోయేళ్ళుగా సంతానం కోసం తపన పడుతున్నాం. నా భార్యకి 2004 లో ఆరోనెల్లో ఎబార్షన్ అయ్యింది. 2009 లో నాలుగోనెల్లోనే ఎబార్షన్ అయ్యింది. ఇప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ నిలబడుతుందో, లేదో తెలీదు." అన్నాను.
"మీకు అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?" నవ్వుతూ అన్నాడు డాక్టర్.
"నాకు ఎవరైనా ఒకటే. బేబీ సక్రమంగా పుడితే చాలు. ఇంతకీ అమ్మాయా? అబ్బాయా?"
డాక్టర్ చిన్నగా నవ్వాడు.
"అమ్మాయికి రోడ్ మేప్ సిద్ధం చేసుకోండి."
"అంటే?"
"గౌన్లు, ఫ్రాకులు రెడీ చేసుకోండి. పేరేం పెట్టాలో కూడా ఆలోచించుకొండి."
నాకర్ధమైంది. లోపలుంది అమ్మాయే! ఈ డాక్టర్ ఎంత మంచివాడు.!
ఈ హాస్పిటల్లో ఇంతకుముందు డాక్టర్ ఆజాద్ ఉండేవాడు. ఈ మాత్రం కూడా ఎప్పుడూ చెప్పిన పాపాన పోలేదు.
"అంటే అబ్బాయి కాదుగా ?" కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను.
డాక్టర్ మళ్ళీ నవ్వాడు.
"అబ్బాయిక్కూడా రోడ్ మేప్ సిద్ధం చేసుకోండి."
ఇప్పుడు ఆ నవ్వు నాకర్ధం కాలేదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది.
"అమ్మాయీ కాదు, అబ్బాయీ కాదు. మరి లోపలున్నదెవరు? అసలు ప్రెగ్నెన్సీ అయినా ఉందా? లేదా?" చికాగ్గా అన్నాను.
ఇప్పుడు మళ్ళీ నవ్వాడు డాక్టర్.
"వెల్. ఎవరైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. అన్నింటికీ రోడ్ మేప్ తయారు చేసుకోండి."
అన్ని ప్రశ్నలకి ఒకే తరహా ప్లాస్టిక్ నవ్వు. ప్రతిదానికీ రోడ్ మేపంటాడు. అసలీ ఈ రోడ్ మేపుల గోలేంటబ్బా?
మనసులో ఏదో అనుమానం. ఇంతకీ ఈ డాక్టర్ పేరేంటి?
డాక్టర్ టేబుల్ మీదున్న ఆయన నేమ్ ప్లేట్ చూశాను.
డాక్టర్ దిగ్విజయ్ సింగ్!
(photo courtesy : Google)
డాక్టరుగారు,
ReplyDeleteఅదరగొట్టారు !!!
కృష్ణ
థాంక్యూ కృష్ణగారు.
Deleteఇంతకీ ఆయన, అంటే ఆ దిగ్గి - గురించి మనం ఏ రోడ్ మాప్ వెసుకోవాలో? ఆడ అనా, మగ అనా, లెక '.....' అనా?
ReplyDeleteఒక లైక్ ... ఇక్కడ ఆ ఆప్షన్ లేదని రాశా.
Deleteఇలాంటి డిక్కీ డాక్టరు నాకుగనుక తగిలితే "లోపలున్నది ఆడా మగా లేక రాహుల్ బాబా సరిగా చెప్పెహె!" అని ప్రశ్నించేవాడిని. దెబ్బకి దారికొచ్చి ఉండేవాడు.
ReplyDeleteదిగ్విజయ్ సింగ్ తెలివైనవాడు. మీ ప్రశ్నకి కూడా నవ్వేసి ఊరుకునేవాడని నా అనుమానం.
DeleteAdirindi
ReplyDeleteచిన్న పోస్టుకి బుల్లి కామెంట్. అదిరింది!
DeleteIt's a shame Telugu people have surrendered their destiny to the "High Command". I do not know when if ever we would lose the shackles of the colonial mindset. The British might have left, but, the divide and rule paradigm is alive and well in India. Digvijay Singh personifies what is wrong with India today. The General Sycophant...er.. Secretary of the party is a dog unleashed on the distractors of the "First Family". This man has done so much harm to India and the Dharmic people of India, he should be tried for treason.
ReplyDeleteBSR
నూటికి నూరుపాళ్ళూ మీరన్నది నిజం.
DeleteThank you!
DeleteBTW, I meant detractors (not distractors).
BSR
dear BSR,
Deleteకాంగ్రెస్ పార్టీకి అనేక ముఖాలు. అందులో ఒక ముఖం దిగ్విజయ్ సింగ్. ఇవన్నీ కాంగ్రెస్ వ్యూహాల్లో భాగం. సమయం, సందర్భం బట్టి వారి ప్రాముఖ్యతలు మారుతుంటాయి. అంతేగాని దిగ్విజయ్ సింగ్ ఒక్కడికే ఏదో game plan ఉందనుకోను.
I agree Ramana, he is not acting on his own. He does the bidding not so much for the party, but, the ruling family. He is the chief attack dog who out barks his fellow spokespersons for congress like Manish Tewari and Abhishek Singhvi. Joseph Goebbels does not get a pass because, he is not Hitler.
DeleteBSR
ఇంకేం చెప్పినా డాక్టర్ నేరస్తుడవుతాడు :)
ReplyDelete@Mauli,
Deleteనాకు ఇద్దరు పిల్లలు. కడుపులో ఉండగా వాళ్ళ gender తెలుసుకుందామని ప్రయత్నించి.. విఫలమయ్యాను. రేడియాలజిస్టు నా క్లాస్మేట్. స్నేహితురాలు కూడా. ఆవిడ స్కాన్ చేస్తూ, ఎంతసేపటికీ (స్క్రీన్ మీద) హార్ట్ చూడు, కిడ్నీ చూడు అంటుందేగాని.. అంతకన్నా 'కిందవిషయం' అడిగితే ఏమీ చెప్పలేదు!
మరే! దిగ్విజయ్ ఏం చెప్పినా తగలడటమే. అయినా రోడ్డు మ్యాప్ సిద్దం చేస్కోమంటే చొక్కాలు లాగులో సిద్దం చేస్కోవడమా ? ఎలా కొనాలి , ఏం కొనాలి ఆలోచించి పెట్టుకోవాలి . కాని ఆ మాత్రం ఆయన గారు చెప్తే గాని తెలియని స్థితి లో రాష్ట్రం ఉంటె ఆయన మాటకే చానల్స్ హడావిడి చేసే దుస్థితిలో ఉంటె మరి కాంగ్రెస్సుకు పండగ కాదూ .
Delete
ReplyDeleteనేను కూడా మీ తరం వాడినే కాబట్టి (కాకపోతే మీ కన్నా ఓ పదేళ్ళు పెద్ద అనుకుంటాను), "కెవ్వ్" అని "కేక" పెట్టను. మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పుడంటే కొంచెం తగ్గినట్లనిపిస్తోంది గాని, ఆ రోజుల్లో కొంతమంది సినిమా నటీనటులు "డాక్టర్ అవబోయి ఏక్టర్ అయ్యాను" అంటుండేవాళ్ళు. మీరు మాత్రం రైటర్ అవబోయి డాక్టర్ అయ్యారు. అయినా రెండు పాత్రల్నీ చక్కగా పోషిస్తున్నారు.
నరసింహారావు గారు,
Deleteబుర్రలోకి ఒక ఐడియా వచ్చేస్తుంది. చేతిలో బ్లాగుంది. రాసిపడేస్తున్నాను. మీవంటి పెద్దలకి నచ్చినందుకు ఆనందంగా ఉంది.
అసలు మీ రాతలు చదువుతుంటే నాకూ బోలెడు అయిడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి.
Deleteమిమ్మల్ని చూసి అసూయపడే బదులు నేనూ ఓ ప్రయత్నం చేసేస్తే బాగుంటుందేమో.
కాని నా రాతలకి, ముఖ్యంగా శ్యామలీయం బ్లాగుకి వచ్చేసిన (అ)యశస్సు కారణంగా ఎవ్వరూ చదవరు లెండి అని ప్రస్తుతానికి మానేస్తున్నాను మరి.
ఏమంటారు?
శ్యామలీయం గారు,
Deleteనా రాతలు మీకు నచ్చినందుకు సంతోషం.
మీరు కూడా నిక్షేపంగా రాసెయ్యొచ్చు. నేనైతే చదవటానికి రెడీగా ఉన్నాను.
(ఇప్పుడు మీరు పద్యాలు రాస్తున్నారు. అర్ధం చేసుకునేంత భాషాజ్ఞానం నాకు లేదు.)
రమణగారూ,
Deleteనేనేమంత పండితుణ్ణి కాను కాబట్టి జనం బ్రతికిపోయారని నా ప్రగాఢవిశ్వాసం. నా పద్యాలు చాలావరకు ద్రాక్షాపాకంలో చదివేస్తే వెంటనే అర్థం అయేలాగా ఉంటాయని నా నమ్మకం. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లుగా నా పద్యాలు నా కెలాగూ బాగుంటాయి మరి. మన రాములోరికీ బాగుంటున్నాయని కబురందింది, మీరు నమ్మగలిగితే!. దయచేసి ఓపిక చేసుకొని కొన్ని చదివి చూడండి. ఆపైన యెలాగూ మీయిష్టమే ననుకోండి.
సైన్సు రిపోర్టింగ్ మీద నాకు మాచెడ్డ దురద ఉంది ఇంకా. నా ప్రపంచపటం బ్లాగులో ఆ దురదతీర్చుకున్న వైనం కూడా చూడగలరు. అదంతా వ్యావహారిక వచనమే లెండి. మీకు ప్రత్యేకం జాబు కూడా పంపాను యీ విషయమై.
Habitual Abortion
ReplyDeletesuperb
ReplyDeleteఇండియా పాలిటిక్స్ ఫాలొకాకపోతె ఈజోకు వెలగదని అర్దమైనది ,నీ బ్లాగులు మరీ చిక్కిపోతున్నాయేమిటి .
ReplyDeleteమిత్రమా,
Deleteఈ పోస్ట్ AP లో కాంగ్రెస్ పోలిటిక్స్ గూర్చి. 'కన్యాశుల్కం' రామప్పపంతులు గుర్తున్నాడా? లుబ్దావధానికో మాట, అగ్నిహోత్రుడికింకో మాట చెప్పి పబ్బం గడుపుకుంటాడు. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుందదే! ఇంతకన్నా అర్ధం చేసుకోడానికి ప్రయత్నించకు (నాక్కూడా ఇంతకన్నా తెలీదు).
బాగుంది >@ సూర్యం: నీ బ్లాగులు మరీ చిక్కిపోతున్నాయేమిటి
ReplyDeleteముందు ముందు వ్రాయబోయే బ్లాగు సబ్జక్ట్ ల కోసం రోడ్ మ్యాప్ తయారుచేసుకుంటున్నారేమో? :-)
ఇక్కడంత దూరాలోచనలేమీ లేవులేండి:-)
DeleteWonderful poke. Even Suryam replied!!!
ReplyDelete