నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళయింది. తెలుగు పత్రికల్లో ఒకటే కథనాలు. నాకవి చదువుతుంటే నవ్వొస్తుంది. తెలుగు సినీజర్నలిజం సన్మాన పత్రాల స్థాయిలో పరమనాసిగా ఉంటుంది. ఈ సినిమాలో నాగేశ్వర్రావు చుక్కమందు కూడా తాగకుండా నటించాట్ట (నాకైతే ఆయన ఫుల్లుగా తాగి నటించినా అభ్యంతరం లేదు)!
అసలీ అరవైయ్యేళ్ల గోలేంటి? బహుశా షష్టిపూర్తి సన్మానమేమో! ఏదైతేనేం.. తెలుగు సినీప్రేమికులు దేవదాసుని గుర్తు తెచ్చుకుని తన్మయత్వం చెందుతున్న ఈ సందర్భాన దేవదాసు గూర్చి నేనూ నా ఆలోచనలు రాస్తున్నాను. అయితే నాగేశ్వరరావు సినిమా షూటింగులో గడ్డపెరుగు తిని నటించాడా? గొడ్డుకారం తిని నటించాడా? లాంటి చవకబారు వివరాలకి నేను పోదల్చుకోలేదు.
అరవైయ్యేళ్ల క్రితం (1953) ఈ దేవదాసు సినిమా ఎందుకంత అఖంఢ విజయం సాధించింది? ఇప్పుడు నేన్రాయబోయే అంశాలు మొత్తం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ రాస్తాను. దేవదాసు సినిమాకి ఆధారం బెంగాలీ పాపులర్ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాసు అనే నవల.
నేను చిన్నప్పుడు శరత్ బాబు సాహిత్యం (దేశీ ప్రచురణలు) చదివాను. అప్పుడే దేవదాసు నవల కూడా చదివాను. వివరాలు సరీగ్గా గుర్తులేదు కానీ.. సినిమాలో ఉన్నంత నాటకీయత నవలలో ఉండదని గుర్తు. ఇప్పుడా చెత్త మళ్ళీ చదివే ఓపిక లేదు. అయితే నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను.
నవల చదవాలంటే కష్టంగానీ.. సినిమా చూడ్డం చాలా సుఖం. హాల్లో కూర్చుంటే మన ప్రమేయం లేకుండానే వెనక కన్నాల్లోంచి తెరమీద సినిమా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా పోస్ట్ అక్కినేని నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా కథకి మాత్రమే పరిమితం.
దేవదాసు సినిమాకి ముందు ఆరేళ్ళ క్రితం బ్రిటీష్ వాడి నుండి మనకి రాజకీయంగా అధికార మార్పిడి జరిగింది. సమాజంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఆనాడు మన సమాజంలో కులం, మతం, డబ్బు చుట్టూ చాలా ఖచ్చితమైన గోడలు, లక్ష్మణరేఖలు ఉన్నాయి. సమాజ స్థితిగతులకి చాలా స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడి ఉంది.
ప్రేక్షకుడు అన్నవాడు ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడడు. వాడు సమాజానికి ప్రతిబింబం. అంచేత సాధారణ ప్రేక్షకుడు సమాజ చట్రం నుండి బయటపడి ఆలోచించగలిగే స్థితి, స్థాయిలో ఉండడు. ఆనాడు నిరక్షరాస్యత కూడా చాలానే ఉంది. (అయితే అక్షరాస్యతకి, ప్రోగ్రెసివ్ థింకింగ్ కి సంబంధం ఉంటుందనే భ్రమ నాకు లేదు).
ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం.. కథ మొదటి నుండి చివరిదాకా సాంఘిక కట్టుబాట్లని గౌరవిస్తూ (ప్రమోట్) చేస్తూ ఉంటుంది. జమీందారు కొడుకైన దేవదాసు పక్కింటి పేదపిల్లతో స్నేహం కడతాడు. దేవదాసు పెద్దకులంవాడు, డబ్బున్నవాడు. కావున నేచురల్ గా పార్వతి దేవదాసుకి surrender అవ్వాలి. అయి తీరాలి (కాకుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు).
జమీందార్ల పిల్లలు చదువుకోటానికి పట్నం పోవటం అనేది బ్రిటిష్ ఇండియాలో చాలా కామన్. కావున శరత్ కూడా కథ అలాగే రాసుకున్నాడు. దేవదాసు కూడా పట్నం పొయ్యి ఏవో చదువులు వెలగబెడతాడు. జట్కాబండి తోలుకుంటూ (పాట పాడుకుంటూ) ఊళ్లోకి వచ్చి పార్వతికి ఏదో నగ ప్రెజెంట్ చేసి తన ఖరీదైన తన ప్రేమని ప్రదర్శించుకుంటాడు (ఎంతైనా జమీందారు బిడ్డ కదా).
ఇలా కొంతకాలం శరత్ బాబు నాయికానాయకుల మధ్య స్వచ్చమైన ప్రేమని పూవులు పూయనిస్తాడు. కాయలు కాయనిస్తాడు. భవిష్యత్తులో వారి ప్రేమ అమరం కావాలంటే ఆ మాత్రం సన్నివేశాలు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. వీళ్ళ ప్రేమ పెళ్ళిగా మారాలంటే పెద్దల అనుమతి కావాలని, అది అసాధ్యమని శరత్ కి కథ మొదట్లోనే తెలుసు. అయినా ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడతాడు.
(కథని ముందుకు నెట్టడం కోసం) ఒక దుర్ముహోర్తాన దేవదాసు తన తండ్రి దగ్గర పెళ్లి ప్రసక్తి తెస్తాడు. ముసలి జమీందారు తమ వంశం పరువు, మర్యాద గూర్చి ఒక లెక్చర్ ఇస్తాడు. పాపం! ఆ ముసలాయన మాత్రం కొడుకు ప్రేమని ఎలా ఒప్పుకుంటాడు? ఛస్తే ఒప్పుకోకూడదు. మధ్యతరగతివారు దేవదాసు తండ్రి సమస్యని ఎంతో సానుభూతితో అర్ధం చేసుకుంటారు.
మనది పవిత్ర భారత దేశం. ఈ పుణ్యభూమిలో తండ్రి మాటకి కట్టుబడి ఒక యుగపురుషుడు అడవుల బాట పట్టాడు. ఇట్టి భూమిలో దేవదాసు తండ్రిమాట చచ్చినట్లు వినాల్సిందే. వినకపోతే జనాలకి నచ్చదు. అంచేత ప్రేక్షకుల కోరిక మన్నించి దేవదాసు పార్వతిని వదులుకుని పట్నం పోతాడు.
పట్నంలో భగవాన్ అనే ఒక సకలకళావల్లభుడు దేవదాసుకి ముఖ్యస్నేహితుడు. అతని ప్రోద్బలంతో దేవదాసు తాగుడు మొదలెడతాడు. (తాగుడు చెడ్డ అలవాటు. దేవదాసు వంటి సచ్చీలునికి స్వతహాగా ఇటువంటి దుర్బుద్ధి పుట్టరాదు). భగవాన్ అనేవాడు హీరోకి తాగుడు అలవాటు చెయ్యడానికి, వేశ్య దగ్గరకి తీసుకెళ్లడానికి రచయితచే సృష్టించబడ్డ ఓ అల్పజీవి.
దేవదాసు మీద ప్రేమని చంపుకోలేని పార్వతి అర్ధరాత్రి దేవదాసు ఇంటికొచ్చి తనని ఎక్కడికైనా తీసుకెళ్ళిపొమ్మంటుంది. దేవదాసు భయకంపితుడై పోతాడు (అవును. సమాజం, సంప్రదాయం దేవదాసు ఉఛ్వాసనిశ్వాసలు). పార్వతి ప్రపోజల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాడు. ధర్మబద్దుడైన దేవదాసు ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతాడు.
దేవదాసు తిరస్కృతికి గురైన పార్వతి తన తండ్రి వయసున్న జమిందార్ని వివాహం చేసుకుంటుంది (ఆ రోజుల్లో పార్వతి వంటి చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోటానికి డబ్బున్న ముసిలి వెధవలు గుంటనక్కల్లా కాచుక్కూర్చుని ఉండేవాళ్ళనుకుంటా). పార్వతి ఆ ముసలి జమీందారు పిల్లల్ని సన్మార్గంలో పెడుతుంది. పార్వతి ఎంతటి మహాఇల్లాలు! పవిత్ర భారతీయ ధర్మాన్ని పాటించిన మహాపతివ్రతా శిరోమణి. పార్వతి ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతుంది.
ఈ తాగుబోతు దేవదాసుని చంద్రముఖి అనే వేశ్య కూడా ఇష్టపడుతుంది. ఆవిడ వేశ్య అయినప్పటికీ ఉన్నత హృదయురాలు. అందువల్లనే ఆ వేశ్యామణి దేవదాసు పరిచయం వల్ల తన వృత్తి, బ్రతుకు హీనమైందని తెలుసుకుంటుంది. (ఆనాటికీ, ఈనాటికీ జనులు తమ శారీరక అవసరాల కోసం వేశ్యల వద్దకు వెళ్ళెదరు. కానీ ఆ వృత్తి మాత్రం ఎప్పటికీ హీనమైందే). ఈ పాయింట్ కూడా ప్రేక్షకకులకి బాగా పడుతుంది.
ఇప్పుడు శరత్ పాఠకుల్ని ఏడిపించటానికి కావలసిన దినుసులన్నీ సమకూర్చుకున్నాడు. రంగం సిద్ధం చేశాడు. ఈ దేవదాసు కథలో అందరూ ఉత్తములే. ఉన్నత హృదయులే. సమాజ చట్రంలో ఇరుక్కుపోయిన విధివంచితులు. లలాటలిఖితాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? (శరత్ కథలన్నీ ఇట్లాంటి జీళ్ళపాకాలే). క్లినికల్ సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist అంటారు.
మానసిక వైద్యంలో త్రాగుడు అలవాటుని alcohol dependence syndrome అంటారు. మానసిక వైద్యులు మద్యపానం అనేదాన్ని ఒక రోగంగా చూస్తారు. దేవదాసు మొదట్లో పార్వతిని మర్చిపోవటానికి (తన పిరికితనం వల్ల జరిగిన నష్టం మర్చిపోటానికి) త్రాగడం మొదలెట్టినా.. తర్వాత్తర్వాత ఆ అలవాటుకి బానిసైపొయ్యాడు. (దేవదాసు త్రాగుడు మొత్తం పార్వతి ఖాతాలో వేసేస్తాడు శరత్).
తాగుబోతు భగ్నప్రేమికులకి protagonist ఈ దేవదాసు. తాగుడు అలవాటుని దేవదాసు కథ romanticise చెయ్యటం వల్ల తెలుగు సమాజానికి నష్టం జరిగింది. అందుకే ప్రతి వెధవ ప్రేమ కోసం వెంపర్లాడటం (సాధారణంగా ఈ ప్రేమికుల జాతి చదువులో drop outs అయ్యుంటారు), ఆ ప్రేమ విఫలమైందని తాగుడు పంచన చేరడం చూస్తుంటాం ('ప్రేమించిన' అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసేకన్నా alcohol తాగితాగి, లివర్ చెడిపొయ్యి చావడం మంచిదే).
ప్రేక్షకుల్ని బాగా ఏడిపించటానికి కథలో శరత్ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు. చచ్చేముందు ఒక్కసారైనా తనకి సేవ చేసుకునే అదృష్టం కల్పించమని పార్వతి దేవదాసుని వేడుకొంటుంది (ఎందుకో తెలీదు). దేవదాసు చావటానికి ముందు భీకరమైన వర్షంలో దుర్గాపురం ప్రయాణం చేసి, చివరాకరికి ఓ చెట్టుకింద దిక్కులేని చావు చస్తాడు.
అరవయ్యేళ్ళనాడు నాటి కులాలు, కట్టుబాట్లను గౌరవించుటచేతనూ.. ప్రతిపాత్రా పాత్రోచితంగా పరమపవిత్రంగా ప్రవర్తించుటచేతనూ.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలని బలంగా తాకింది. ఆ రోజుల్లో కొద్దోగొప్పో చదువుకున్న తెలుగువారికి బెంగాలీ బాబుల్లాగా సున్నితంగా, ఉన్నతంగా ఆలోచించటం గొప్ప ఫ్యాషన్.
ఎగువ మధ్యతరగతి సెక్షన్ ప్రతినిధిగా వారి ఆలోచనలకి తగ్గట్టుగా శరత్ బాబు ఒక పవిత్రమైన, హృద్యమైన, విషాదకరమైన కథ వండాడు. ఈ బెంగాలి వంటకాన్ని గొప్ప తెలుగు వంటకంగా మార్చిన ఘనత వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, డియల్, సుబ్బురామన్, ఘంటసాలలకి దక్కుతుంది. ఈ ప్రతిభావంతులు నాగేశ్వరరావు, సావిత్రిలని దేవదాసు, పార్వతిలుగా ఆవిష్కరించి బోల్డంత సోమ్మునీ, కీర్తినీ మూటగట్టుకున్నారు.
ఈ కథ మనకి గొప్ప నీతిని చెబుతుంది. ఈ సమాజంలో మనం ఏమీ మార్చలేం. మనకి కావలసిందేదీ పొందలేం. సమాజ కట్టుబాట్లని మనం ఎలా కాదనగలం? మనం చేయగలిగిందల్లా.. మన చేతకానితనానికి ఏడ్చుకుంటూ బ్రతకటమే! అందుకే ఈ సినిమా అంత విజయం సాధించిందని నా అభిప్రాయం. అసలు ఈ సినిమాలో జనాలకి బాగా నచ్చిన పాయింట్.. పార్వతి, దేవదాసు పెళ్లి చేసుకోకపోవటం!
చివరి మాట :
మిత్రులారా! దేవదాసు సినిమాని ఇంత నిర్దయగా విశ్లేషించిన వ్యాసం మీరు ఎప్పుడూ చదివి ఉండరు (నేనూ చదవలేదు). ఆ సినిమాని చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను (ఏడిచాను). ఇంత క్రిటికల్ రాయటం నాకూ ఇష్టం లేదు. ఆ సినిమా ఎందుకంతగా విజయం సాధించిందని ఆలోచించినప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచనల్ని uncensored గా రాసేశాను. దేవదాసు సినీప్రేమికులు నన్ను మన్నించగలరు.
(photo courtesy : Google)
Nicely written. I saw Devadas only one time continuously, rest of them in bits and pieces..several times. what you said sounds very true, enjoyed it.
ReplyDeleteఈ సినిమా చూడటం వల్ల lacrimal glands శుభ్రపడును. కళ్ళకి మంచి వ్యాయామం.
Delete(ఇంకోసారి చూడమని నా సలహ!)
ఈ సినిమా ప్రజలకు ఎందుకు నచ్చిందో తెలీక గుంజుకుంటున్న వాణ్ణి. మీరు మీ టపాతో చిన్నసైజు వైద్యం చేశారు నాకు.
ReplyDeleteఅమ్మయ్య! నా టపా వల్ల మీకు స్పష్టత వచ్చేసిందన్న మాట! సంతోషం.
Delete(దయచేసి ఫీజు పంపడం మర్చిపోకండేం!)
This comment has been removed by the author.
ReplyDeleteWell, that is too cynical a view of the story. Sarat Chandra Chattopadhyay obviously is a huge winner as a writer. After all, we are still discussing it 6 decades later and the story has been made into at least 16 movies so far. Even though you state at the outset the commentary is about ANR's Telugu version movie and not the original story of Sarat, yet, you go on to criticize him anyway. So, here is my little defense of him. Firstly, in his book, Devdas is the weak-willed, unsure coward who did not have the guts to follow his heart (little too much blame placed on parents in the movies). Secondly, Devdas is a spoilt, selfish, egotistical fellow who throws away his life when he does not get what he wants (by slow suicide if you will). He is an unlikable jerk with flawed character in the story. I will not talk about Paro and Chandramukh now, but, their depiction in the book is also quite different from the movie adaptations. Sarat did not intend this story to be a moral how to book or offer a social message. He wrote a fantastic novel with deeply flawed character/s and mesmerized the readers with his skillful mastery of the plot and the characters and made them care and cry for a rich no good alcoholic unheroic protagonist.
ReplyDeleteBSR
Dear BSR,
Deleteనేనూ దేవదాసు పార్టీనే! అందరూ దేవదాసుని పొగుడుతుంటే వెరైటీగా ఉంటుందని ఇలా రాసితిని.
ఈ లింక్ చదవండి.
http://english.chass.ncsu.edu/jouvert/v1i1/DEVDAS.HTM
Dear Ramana,
DeleteGood deal. Nice to hear you are still in the same party!
This Poonam Arora lady is one imaginative person! Sarat would be rolling in his grave wondering, what the hell, I thought through all of this colonial mumbo-jumbo?! Her highfalutin English is amusing and many of her deductions are almost plausible, but, what comes through loud and clear is that she has this theory and she is going to torture the facts to fit her narrative.
BSR
I never liked any version of Devdas, Hindi or Telugu (I believe Dilip Kumar's version is the closest to Sarats novel).
ReplyDeleteSadomasochist is the right word for Devdas.
And for its time, the novel is no different than a typical college love story these days. A reflection of contemporary society (ideals which the society aspires to, more like) tailored for commercial success. In other words, its pulp fiction. I never understand the craze for the story after so many years.
మీ వయసు చిన్నది. అందుకే చరిత్ర తెలీకుండా మాట్లాడుతున్నారు. ఈ సినిమా చూసి తెలుగువారు కార్చిన కన్నీటితో నాగార్జున సాగర్ డాం నిండిపొయ్యేది.
Delete(ఆ రోజులే వేరు! డబ్బులిచ్చి మరీ కడవల కొద్దీ కన్నీరు కార్చేవారు!)
ha ha..i am too young for ANR's or Dilip Kumar's Devdas...i only watched Sanjay Leela Bhansali's Devdas in a theatre. And while i liked watched ANR's version and Dilip Kumars (liked the songs in them, and most other technical aspects). I could never understand how any one can sympathise with a loser and irresponsible character like Devdas.
Deleteఅనాదిగా వీరత్వానికి అల్లూరి సీతారామరాజు, భగ్నప్రేమిత్వానికి దేవదాసు.. తెలుగువారి సింబల్స్. మీరిలా ప్రశ్నించరాదు!
Deleteతెలుగు సినిమాని కూడా శరత్ రచనా కోణం లో వివరించడం ముందు కొంత ఇబ్బంది కలిగించినా మన వరకు తెలుగు సినిమాలో చూసినదే మాట్లాడాలి అనడం లో అభ్యంతరం లేదు .
ReplyDeleteఒకప్పటి దేవదాసు లానే ఇప్పటికీ అబ్బాయిలు అలానే ఉన్నారు చాలా వరకు (ఊర్లలో). పెద్దగా మార్పెం లేదు!!!! చివరికొచ్చేసరికి ఇంట్లో వాళ్ళ మాట వినడం లో సుఖం చూసుకొంటున్నారు. నిజానికి వీరు పూర్తిగా స్వతంత్రులు కాదు కాబట్టి వీరి ప్రేమకి స్వంత నిర్ణయాలు తీసికొనే ధైర్యం లేదు .అంతే కాని తాగుబోతులు మాత్రం అవడం లేదు. (అసలు ప్రేమ విఫలం అవడానికి, తాగుబోతులవడానికి సంబంధం ఉందాడానికి అవకాసం యెంత?). అమ్మాయిలూ కూడా పార్వతిలానే ముందు ఎంతటి తెగింపు కయినా సిద్దపడుతున్నారు ..వీల్లకి మాత్రం అమ్మా, నాన్న కుటుంబం లాంటి సంకెళ్ళు అస్సలు అడ్డం రావు .కాని కుదరక పొతే , పార్వతిలా బాధ పడరు త్యాగాలు చెయ్యరు.
@Mauli,
Deleteప్రేమ అనేది ఒక బ్రహ్మపదార్ధం. చూసేవాణ్ని బట్టి అర్ధం మారిపోతుంది.
(అబ్బాయిలు అమ్మాయిల అందం చూసి ప్రేమిస్తే.. అమ్మాయిలు అబ్బాయిల బ్యాంక్ బేలన్స్ చూసి ప్రేమిస్తారని సుబ్బు చెబుతుంటాడు.)
హమ్మయ్యా! నాలా ఆలోచించేవారు ఉన్నారన్నమాట. టీవీ చానెళ్లు, పత్రికలు, రేడియల్లో ఊదరగొట్టేసారు రెండు రోజులు. సరే మరీ ఇంతగా పొగడాలా?ఏముందంత స్పెషల్ అని ఎప్పటినుండో అనుకుంటున్నా. మీరు ఉన్నదున్నట్టు చెప్పేసారు. ధాంక్స్..
ReplyDeleteజ్యోతి గారు,
Deleteటీవీ, పత్రికల వాళ్లకి ఒక standard format ఉంటుంది. 365 రోజుల్లో రెండ్రోజులు ఘంటసాలకి ఒక పుట్టిన్రోజు, ఒక పోయిన్రోజు.. అలాగే మిగిలిన ప్రముఖులకి. అయినా వీళ్ళకి న్యూస్ దొరక్క ఈ మధ్య సినిమాలకి కూడా సంవత్సరీకాలు చెయ్యడం మొదలెట్టారు. అన్నీ ఒకేరకం కథనాలు. రాసేవాడు మాత్రం ఎంతని రాస్తాడు? ఏమని రాస్తాడు?
సావిత్రి బాగా యాక్ట్ చేసింది అమాయకంగా భలే ఉంటుంది .
ReplyDeleteనాగేశ్వర రావు కుడా బాగా యాక్ట్ చేసాడు , అసలే వెన్న ముద్దలు తిన్నాడెమో .
సినిమా హిట్ అయింది , కాకపోతే ఇందులో అంత విశేషం ఏముంది .
ఒక సినిమా హిట్ అవ్వడానికి ఉన్న సవాలక్ష కారణాల్లో ఒక కారణం ఏంటంటే చూసేవాళ్ళు తనని తానూ identify చేసుకోవడం .
ఇక్కడ అదే జరిగింది .
ఈ సినిమా ఒకటే కాదు, ఇంకా చాలా సినిమాలు హిట్ అయ్యాయి , దీని కన్నా ఎక్కువ హిట్ అయినవి ఉన్నాయి . మరి దీన్నే ఎందుకు లాగుతున్నారు ?
మనం చెప్పుకోవాడానికి ఏమి లేక .
పక్క రాష్ట్రం వాడి దగ్గరకి వెళ్లి మన గుండమ్మ గురించి మాట్లాడలేము కదా , అందుకే దేవదాసు ని బయటకి తీస్తారు , మాకు కూడా దేవదాసు ఉన్నాడు అని చెప్పుకోడానికి తప్పితే , అదేదో గొప్ప కళాఖండం అనుకోవాల్సిన అవసరం లేదు .
ఇకపోతే అబ్బాయిలు, అమ్మాయిలూ ప్రేమలో ఫెయిల్ అయిపోవడం పెద్ద విషయం కాదు .
చివరి వరకు వచ్చి అబ్బాయిలకి హ్యాండ్ ఇచ్చిన ఇద్దరు అమ్మాయిలు నా ఎదురుగానే వాళ్ళ భర్త ల కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు . వరలక్ష్మి వ్రతాలు కుడా ఎంతో భక్తీ శ్రద్దలతో జరుపుకుంటున్నారు .
ఆ అబ్బాయిలు ఇంకో అమ్మాయిలని చేసుకుని హనీమూన్ మలేసియా లో చేసుకున్నారు , US లో సెటిల్ అయ్యారు .
ప్రేమలో ఫెయిల్ అయితే దేవదాసు / దేవదాసి (?) అవుతారనుకోడం కుడా ఆ సినిమా ప్రభావమే .
Note : దేవదాసి అంటే వేరే మీనింగ్ వస్తుందేమో , ఇక్కడ మాత్రం అది కాదు .
venkat గారు,
Deleteప్రత్యేకంగా దేవదాసుని నా బ్లాగులోకి లాగడానికి నాకైతే పెద్ద కారణాలేమీ లేవు.. 'పని లేక' తప్పించి!
పిదప కాలం, పిదప బుద్ధులు! ప్రేమలో విఫలం అయినవారు ఏడ్చుకుంటూ (కనీసం కొంతకాలమైనా) బతకాలి. మీ స్నేహితుల ప్రేమరాహిత్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను!
మిమ్మల్ని ఉద్దేశించలేదండి మీరు బ్లాగుల్లో కి లాగడం చాలా మంచిదయింది .
Deleteమీ విశ్లేషణ మాకు కొత్తగా అలోచిన్చడానికి ఒక దారి చూపుతుంది .
నేను చెప్పేది, ఈ పేపరోల్లు, టీవొళ్ళు . రెండు మూడు నెలలకి ఒకసారి ఈ సినిమా ని పొగడకుండా ఏ ఆర్టికల్ ఆపరు .
ఒకతరం తెలుగువారంతా దేవదాసుని చూసి కన్నీరు కార్చినవాళ్ళే. ఈనాటికీ కొందరి దృష్టిలో దేవదాసు ఒక కళాఖండం.
Deleteకాకపోతే ఆ సినిమాని అదేపనిగా పొగుడుతూ.. రాసిందే రాస్తుంటారు. అందువల్ల మీకు చికాకు కలిగుంటుంది (నా సమస్య కూడా అదే).
నేను వ్రాయాలనుకున్న వ్యాఖ్య మరి కొందరు వ్రాసేసారు. చాలా బాగా వ్రాశారండీ
ReplyDeleteనేనొక విషయం చెప్పదలచాను. అసలు దేవదాసు పాత్రే నాకు నచ్చదు
వనజవనమాలి గారు,
Deleteదేవదాసు కేరెక్టర్ (పైన GI Doctor చెప్పినట్లు) చాలా complicated. దేవదాసు సైకాలజిస్టులకి బహు ప్రీతిపాత్రుడు. అతన్ని అనేక కోణాల్లో తీవ్రంగా dissect చేశారు.
దేవదాసు మీకు ఎందుకు నచ్చలేదు?! (నా విమర్శ శరత్ పైనే.. దేవదాసుపై కాదు).
(దేవదాసు సినిమా చూసినప్పుడల్లా కనీసం లోటాడు కన్నీరు కార్చినవాడిగా చెబుతున్నాను.)
thank you
ReplyDelete>అసలు దేవదాసు పాత్రే నాకు నచ్చదు
ReplyDeleteనాక్కూడా నచ్చదు.
శ్యామలీయం గారు,
Deleteఅన్నది మీరేనా! విన్నది నేనేనా!
(కుర్రాళ్ళకి దేవదాసు పవర్ తెలీకపోవచ్చు. మన వయసువారికి దేవదాసు ఒక iconic figure అనుకుంటున్నానే!)
సరే! మీ అభిప్రాయం చెప్పారు కనుక నా అభిప్రాయం కూడా రాస్తున్నాను.
నాకు దేవదాసు పట్ల ఆసక్తి ఉంది. అతనిది different shades ఉన్న complex character. అతని వ్యక్తిత్వం మనకి నచ్చకపోవచ్చు కానీ.. అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు తెలుస్తాయి.
నా 'psychoanalysis of గుండమ్మ' టపా చాలామందికి నచ్చిందనే ఉత్సాహంతో సీతారామారావుని (అసమర్డుని జీవయాత్ర - త్రిపురనేని గోపీచంద్) రాద్దామనుకున్నాను. సీతారామారావుతో పోలిస్తే దేవదాసు చాలా ధైర్యవంతుడు! నాకు సమయం కుదరకపోవటం, ఆల్రెడీ ఎవరైనా రాసేరేమోనన్న అనుమానం.. రాయకపోటానికి కారణం.
literary characters మనకి నచ్చకపోవటం అంటూ ఏముంటుందండి!? అట్లాగైతే గిరీశం (కన్యాశుల్కం) కన్నా దౌర్భాగ్యుడు నాకింతమటుకూ కనిపించలేదు.
రమణగారూ, దేవదాసు పాత్ర ఒక ఆత్మవిశ్వాసం లేని, చేతగాని వాడి పాత్ర. అందుకే నచ్చలేదు. సీతారామారావు మన బ్రతుకింతే అని బ్రతికేసే పరమ సగటు అసమర్థ జీవి. గిరీశం ఒక గుంటనక్క.
Deleteliterary characters మనకి నచ్చకపోవటం అంటూ ఉండదన్న మాట వాస్తవమే. కాని దేవదాసు పిరికితనం మీద అసహ్యమూ పార్వతి దీనపరిస్థితిమీద సానుభూతీ కలుగుతాయి చదువరులకు. నేను పార్వతి దీన చరిత్రం మాత్రమే చెబుతున్నానంటాడు శరత్ - దీనికి బహుశః వాల్మీకి అన్న సీతాయాశ్చరితం మహత్ అన్న వాక్యం స్ఫూర్తి కావచ్చును.
శ్యామలీయం గారు,
Deleteమీ అభిప్రాయం ఇప్పుడు అర్ధమైంది.
ఈ పోస్టుకి సంబంధించి నాలోనే కొంత confusion ఉందనుకుంటున్నాను. దేవదాసు రచయిత శరత్ బాబుని తీవ్రంగా విమర్శించాను. చర్చలోనేమో శరత్ సృష్టించిన దేవదాసు పట్ల సానుభూతి చూపిస్తున్నాను (విషయం సూటిగా చెప్పకుండా దేవదాసుని అర్ధం చేసుకోవాలనే intellectual argument లోకి దిగానా?).
డాక్టరు గారు,
ReplyDeleteచాలా నిర్దయగా రాశారు. కానీ నిజాలు రాశారు. మనకి ఎప్పుడూ నిజాలు నచ్చవు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చెదుగానె వుంటుంది.
బహుశా జనాలు, తాము చెయలేని పని కధా నాయకుడు చెయ్యాలని అనుకుంటారెమొ.
కృష్ణ
@GK,
Delete>>బహుశా జనాలు, తాము చెయలేని పని కధా నాయకుడు చెయ్యాలని అనుకుంటారెమొ.<<
అవును. మన ఎన్టీఆర్ అభిమానానికి ఇదే కారణం. దేవదాసు విషయంలో కాదనుకుంటా.
ఫ్రాయిడ్ చెప్పిన super ego అప్పు తెచ్చుకుంటే దేవదాసుని మనం ఎందుకంత ఇష్టపడ్డామో అర్ధం చేసుకోవచ్చునేమో. ప్రేమని showcase చేస్తూ, immortalise చెయ్యటం జనాలకి నచ్చి ఉంటుంది. మనలోని idealism ని దేవదాసు సినిమా పాత్రల్లో చూసుకుని satisfy అయ్యామా?
(తెలుగువారికి దేవదాసు ఎందుకంత నచ్చిందన్న నా రీసెర్చ్ ప్రస్తుతానికి ఆపేస్తున్నాను.)
ఒక తెలుగు సినిమాని, బెంగాలి రచయితని కలివిడిగా విడివిడిగా చూసినట్లున్నారు. అందుకే కొంచెం కంఫ్యూజన్ కనిపించింది మీ పోస్టులో. నాకు బెంగాలీ రాదు కాబట్టి, ఇప్పటికిప్పుడు నేర్చుకునే ఓపికా లేదుకాబట్టి వికిపీడియా లో నవల వివరాలు చదివాను. ఆ ప్రకారం నాకు తెలిసినట్టనిపించిన విషయంబులెవ్వన.. ఈవిధంబుగనుండె!
ReplyDelete1)ఆ నవల రాసేప్పటికి శరత్ బాబు వయసు 17 ఏళ్ళేనట. ఆయన వయసు ప్రభావం దేవదాసులో కూడా కనబడిందేమో. ముఖ్యంగా తనకేం కావాలో తనే తెలుసుకోలేకపోవటం.
2)దాసు, పారు ఇద్దరికీ ఒకరకమైన ఆకర్షణ మాత్రమే ఉంది మొదట్లో. అలాగే మొదట దాన్ని ప్రేమ అనుకున్నది మన సావిత్రే.. ఐ మీన్ పార్వతే!
3) ఇద్దరి సామాజికవర్గాలూ (థాంక్స్ టు ఈనాడు) ఒకటేనట! వారికుటుంబాలమధ్య ఆర్థిక అంతరాలు ఉన్నాయట. పైగా పారు కుటుంబం కన్యాశుల్కానికి ఫేవర్ అయితే దాసు కుటుంబం వరకట్నానికి ఫేవర్ ఇస్తుంది. అందుచేత సహజంగానే వారి పెద్దల చర్చలు తొందరగా ఒక కొలిక్కి వచ్చేసాయి!
4) అర్థరాత్రి పార్వతి దేవదాసుదగ్గరకి వెల్లినపుడు అతను ఆశ్చర్యపోతాడు. మనం "జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అనుకున్నా. కాదా?" అనే ఫీలింగ్ అతనికి మొదలవుతుంది. బహుశా అదే అతనిపాలిట శనిలా మారింది! అపుడతను తన తండ్రితో ఓసారి మాట్లాడుతాడుగాని, ఏజ్ యూజువల్.. సేం రిజల్ట్!
5) అతను కలకత్తాకి వెల్లిపోయి "మనం జస్ట్ ఫ్రెండ్స్" అని పారు కి ఉత్తరం రాసిపడేస్తాడు. కాకపోతే ఎందుకో మళ్ళీ మనవాడికి బుధ్ధిమారి, గ్రామానికి వెల్లి ఎలాగైనా మన ప్రేమని దక్కించుకుందామంటాడు. (కాకపోతే ఈసారి చాన్సు పార్వతిది!!) పెళ్ళి ఏర్పాట్లు కూడా జరిగిపోవటం తో పార్వతి నో చెప్పేస్తుంది. కాకపోతే చనిపోయేలోపల తనదగ్గరకు రమ్మని చెప్తుంది (ఇదేం శాడిజమో! పోయేవాడిని పొమ్మనకుండా పొగబెట్టడం అంటే ఇదేనా!!)
6) నాలాటి ఫ్రెండ్ దాసు కి చంద్రముఖిని పరిచయం చేస్తాడు. మనోడు మంచినీళ్ళకు బదులు మందు తాగుతుంటాడు. పారు నీ చంద్రముఖినీ కంపేర్ చేసుకుంటాడు అపుడపుడూ (మనవాడు చదువుకున్నది మేథ్స్ గ్రూపులోనేమో!). పార్వతి తనని మోసం చేసిందనుకుంటాడు. కాకపోతే పార్వతే తనని ముందు లవ్ చేస్తే తను ఒప్పుకోలేదనీ, కాబట్టి లాజికల్ గా తప్పు దాసుదే అని చంద్రముఖి వివరిస్తుంది. (బహుశా అందుకేమో) మనవాడు మందు కొట్టినపుడు తప్ప మిగతా టైం లో చంద్రముఖిని ఇష్టపడడు. మరి ఆమెకేం మాయరోగమో వీడిని ఇష్టపడుతూంటుంది.
7) ఏ లక్ష్యమూ లేనివాడిని పెట్టి కథ సాగతీయటం దండగ. కాబట్టి దేవదాసుకి అంత్య సమయం ఆసన్నమవుతుంది. చనిపోయెపుడు దేవుడిని చూస్తూ పోవాలంటారు. సో మనోడు తన ప్రేమదేవతని కలవడానికి తిరిగొస్తాడు. ఆమె ఇంటిముందే చనిపోతాడు. కాకపోతే ఆమెను బయటకి పరిగెత్తనివ్వకుండా అడ్డుకుంటారు ఇంట్లోవాళ్ళు. మరీ ఇంటిముందు చావు సీన్ తీయటం మన తెలుగు వాళ్ళు అశుభం అనుకున్నరేమో అందుకే దాసుని చెట్టుకిందే మర్డర్ చేసేసారు.
ఈ ప్రకారం గమనిస్తే శరత్ బాబు నవల్లో కాస్త మెచూరిటీ లోపించిందేమో! మనవాల్లు కొంత ఆలోచన చేర్చి ఓ బడి పిల్లాడి నవలని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దారు. సో క్రెడిట్ మన సినిమావాళ్ళకే ఇవ్వాలి!!
సూర్య గారు,
Deleteవికిపీడియా ఉన్న దేవదాసు విశేషాలు చక్కగా రాశారు. శరత్ చంద్ర తన రచనల్లో ఉన్నత / ఉన్నత మధ్యతరగతి బెంగాలి బ్రాహ్మణ జీవితాలనే రాశాడు.
ఎస్వీరంగారావు (దేవదాసు తండ్రి) పార్వతి కుటుంబం గూర్చి 'పిల్లల్ని అమ్ముకునే వంశం' అంటాడు. ఆ కారణం చేత ఆ రోజుల్లో అదో కులమని అనుకున్నాను. వికిలో పార్వతి, దేవదాసులది ఒకటే కులమని చదివి ఆశ్చర్యపొయ్యాను.
సీనియర్ సముద్రాల బారువా దేవదాసుని, సైగల్ దేవదాసుని కూడా చూసి.. కొంత నాటకీయత జోడించి ఉండొచ్చు. ఆ విషయాలని తెలుగు సినీజర్నలిస్టులు ఎక్కడైనా రాసేరేమో నాకు తెలీదు. ఆ సినిమాలో పనిచేసి.. ఇంకా జీవించి ఉన్న నాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలియొచ్చు.
బలహీన మనస్కుడు / పిరికివాడు / అసమర్డుడు బాధ పడుతుంటే చూడ్డానికి చాలా బాధాకరంగా ఉంటుందేమో. ఉదాహరణకి తెలివితక్కువగా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి గాయపడ్డ కుక్కపిల్ల రోదన కూడా గుండెల్ని పిండేస్తుంది.
(దేవదాసు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.)
Dear Ramana,
ReplyDeleteDid you read Bengal Nights (or Maitreyi) by Mircea Eliade? It's a sort of an autobiographical love story based on his teacher's (senior colleague's?) daughter, Maitreyi when the Romanian lived in Calcutta. It was first published in 1933 in Romanian. Maitrevi was not aware of the eponymous best seller book for many decades! Maitreyi Devi who grew up to be a writer of great renown in her own right wrote back a counter novel, Na Hanyate (It Does Not Die) in 1974. Very fascinatingly different takes on same story by the two. The tragic love story has some parallels with Sarat's Devdas.
For English movies, normally when a movie of the fame of Devadas completes a milestone of half a decade or more, they release special DVDs with lot of background details, interviews with the surviving Actor/s, Director etc. and sometimes,there will be an Audio Commentary to the Movie where one of the surviving Actor/Director shall be talking all through the movie explaining each scene how it was made etc. We can select the alternate Audio-Movie audio or the Commentary audio. You must have seen such Angrezi DVDs. For Ben Hur there was such a special DVD like there were many such DVDs for many other similar movies of fame.
ReplyDeleteWhen Malleeswari completed a milestone, our so called media made a big "Story" out of it and filled up print/electronic space to sell their ads. This time also the same thing happened.
I hope atleast for this movie (good or bad, its iconic for Telugu Movie goers), the DVD Merchants release a special DVD with Audio Commentary by ANR and anybody else still alive (are there?!) associated with the Devadas Movie. May be ANR straighten the facts and dispel some half truths and myths about the movie.
Your review is quite dispassionate Mr. Ramana. I liked it.
Shri Gudipati Venkiata Chalam (well known writer "Chalam") was living in a house adjacent to Lakshmi Talkies in Vijayawada and due to proximity was compelled to hear the movie audio everyday. He wrote about Laila Majnu in his famous "Musings". Please read it(if not already) when you find the book and time. I wrote a few words about Shri Chalam's Laila Majnu (ANR and Bhanumati fame) in my Blog(http://saahitya-abhimaani.blogspot.in/2009/08/blog-post_13.html)
Just because one movie was a great success sometime back, there is no need for everybody to like it and drool over it all the time and the reasons for its success can be analysed. I appreciate your dispassionate search for the reasons for the movie's success.
http://shankaratnam.blogspot.sg/2013/07/blog-post_6.html
ReplyDeleteసెన్సార్ బోర్డులో, సభ్యునిగా ఒక మానసిక వైద్యుణ్ణి కూడ నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు?
ReplyDeleteవిదేశాల్లో ఎక్కడైనా ఇలాంటి నియమం ఉందేమో నాకు తెలియదు.
bonagiri గారు,
Deleteసెన్సార్ బోర్డుల గూర్చి ఒకసారి నా బ్లాగులో చర్చ జరిగింది. అసలు సినిమాల్ని సెన్సార్ చెయ్యకూడదని నా అభిప్రాయం.
నా దేవదాసు పోస్ట్ చదివారు కదా! అనవసర విషయాలపై తీవ్రంగా ఆలోచించడం మానసిక వైద్యుల ప్రత్యేకత. అప్పుడు సైకియాట్రిస్ట్ మెంబర్ దెబ్బకి మిగిలిన బోర్డ్ మెంబర్స్ పారిపోతారేమో!