Saturday 11 January 2014

'నేనొక్కడినే' నాకు నచ్చింది


దాదాపు పదమూడేళ్ళ తరవాత ఒక సినిమా హాల్లోకి అడుగెట్టాను. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. లోపల లైటింగ్ తక్కువగా ఉంది. ఫ్లోర్ మెట్లుమెట్లుగా ఉంది. ఎందుకైనా మంచిదని నాభార్య చెయ్యి పుచ్చుకుని అడుగులో అడుగేసుకుంటూ, సీట్లు తడుముకుంటూ వెళ్ళి నా నంబర్ సీట్లో కూలబడ్డాను.  

సినిమా మొదలైంది. తెరపై (పెద్ద) బొమ్మ చూసి చాల్రోజులైన కారణాన.. సంభ్రమాశ్చర్యాలకి గురయ్యాను. అయితే సినిమా శబ్దం (హాల్లో సౌండ్) ఎక్కువగా ఉంది. నడిచేప్పుడు వచ్చే బూట్ల శబ్దం కూడా చెవిలో లక్ష్మీ ఔటు పేల్చినంత భయానకంగా ఉంది.

మహేశ్ బాబు బాగున్నాడు. కానీ కోపంగా ఉన్నాడు.. ఎందుకో తెలీదు. హీరోయిన్ పొడుగ్గా ఉంది. సినిమా హడావుడిగా ఉంది. intermission లో మావాడు నా చేతిలో పెట్టిన పాప్ కార్న్ బాగుంది. 

కొద్దిసేపటికి నడుం నొప్పిగా అనిపించింది. అంచేత సినిమా తొందరగా అయిపోతే బాగుండునని అనిపించింది.

అమ్మయ్యా! సినిమా అయిపొయింది. హాల్ బయటకొచ్చాం. 

"సినిమా నీకెలా ఉంది నాన్నా?" అనడిగింది మా అమ్మాయి. 

"బాగుంది. నాకు నచ్చింది." అన్నాను. 

నా కూతురు నావైపు విచిత్రంగా చూసింది. 

"సైకియాట్రీ సబ్జక్టులో మహేశ్ బాబు కొచ్చిన రోగం లాంటిదేదైనా ఉందా?" నా భార్య ప్రశ్న. 

వాస్తవానికి నేను సినిమా ఫాలో అవలేదు. సినిమాలో ఓ డాక్టర్ కనిపించాడు. అతనేదో చెప్పాడు గానీ, నే పట్టించుకోలేదు. కాబట్టి ఆవిడ అడిగిన ప్రశ్న అర్ధం కాలేదు. అంచేత ఓ వెధవ నవ్వొకటి సమాధానంగా నవ్వాను. 

కుటుంబ సభ్యులతో సినిమా చూడ్డం మాత్రమే ఇవ్వాల్టి 'నేనొక్కడినే' పర్పస్. భార్యాపిల్లల్ని కనీసం సినిమాక్కూడా తీసుకెళ్ళని దుష్టాధముడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోవటం నాకిష్టం లేదు. డైలాగ్ కొంచెం హెవీగా ఉంది కదూ! ఏంచెయ్యమంటారు? కొన్నాళ్ళుగా నామీదున్న ఒత్తిడి అట్లాంటిది! కాబట్టి సినిమా మంచిచెడ్డలు నాకనవసరం.  

రైల్లో వెళ్తుంటే కిటికీ లోంచి బయటకి చూసినప్పుడు పొలాలు, కొండలు కనపడుతుంటయ్. అవి బాగున్నయ్యా, లేదా అని ఆలోచించం కదా? నాదృష్టిలో సినిమా చూడ్డం కూడా అంతే. కాకపోతే ప్రకృతి వీక్షణం ఆహ్లాదకరం, సినిమా వీక్షణం వ్యధాభరితం. అంతే తేడా!

(photo courtesy : Google)

21 comments:

  1. సినిమా పేరు "నేనొక్కడినే" కాబట్టి మీరొక్కరే వెళ్ళాలి. ఇలా కుటుంబం మొత్తం కలిసి వెళ్ళాలనుకుంటే "మనమందరం" సినిమా చూడాలి. నా మట్టుకు నేను ఈ సినిమాకు వెళితే గిళితే నేనొక్కడినే వెళ్తాను.

    ReplyDelete
    Replies
    1. Jai గారు,

      సినిమా చూడదల్చుకుంటే అర్జంటుగా వెళ్ళండి. లేనిచో.. సినిమా హాల్ మొత్తం మీదా 'నేనొక్కడినే' అనుకుంటూ చూడాల్సిన ప్రమాదం మెండుగా ఉంది.

      Delete
    2. కావాలంటే అన్ని టికేట్లూ నేనొక్కడినే కొని నేనొక్కడినే "నేనొక్కడినే" సినిమా చూస్తానండీ :)

      Delete
    3. ramana garu lanti vari 6 patalu 4 fighta unte chalu .

      Delete
    4. @swetha s,

      ఏడ్చుకుంటూ నిన్నరాత్రి సెకండ్ షో చూసి.. పొద్దున్నే ఆ ఏడుపు బ్లాగులో రాశాను. అంతే.

      నిన్న నే చూసిన సినిమాలో పాటలు, ఫైట్లు ఉన్నాయి. :)

      Delete
    5. @Jai,

      అప్పుడు మిమ్మల్ని 'ఎవడు?' అంటూ బయటకి పంపేస్తారు. :)

      Delete
    6. తెలుస్తుందిలెండి! మొక్కుబడి చెల్లించారని.:)

      Delete
    7. బ్రేకింగ్ న్యూస్! నన్నొక్కడినే వదిలేసి మా వాళ్ళు నేనొక్కడినే సినిమా చూసొచ్చారు. మా ఇంట్లో నేనొక్కడినే నేనొక్కడినే సినిమా చూడలేదన్న రికార్డు నిలుపుకుందామనే లక్ష్యంతో నేనొక్కడినే నేనొక్కడినే సినిమా చూసే ఆలోచన మానుకున్నాను

      ఇట్లు: నేనొక్కడినే

      Delete
  2. పొలాలు, కొండల గురించి పట్టించుకోకూడదనే గొప్ప సలహా ఇచ్చారు... దండాలు బాబయ్యా :)

    ReplyDelete
    Replies
    1. నేనెప్పుడూ అంతేనండి. గొప్పసలహాలు మాత్రమే ఇస్తాను. :)

      Delete
  3. పదమూడేళ్ళ మీ సినీ అజ్ఞాతవాసాన్ని భంగం చేసినందుకు మహేష్‌బాబుకు (సుకుమార్ కాదనే అనుకుంటున్నాను) అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      భంగం చెయ్యడానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నానండి. ఇన్నాల్టికి కుదిరింది.

      Delete
  4. ధైర్యం గా అభిప్రాయం చెప్పారు. నేటి కాలం తెలుగు సినెమాల గురించి నాకన్నా చిన్న వారి దగ్గర అభిప్రాయం చెప్పటానికి తటపటా ఇస్తాను. నన్ను ఎక్కడ అవుడేటెడ్ ఆద్మి అనుకొంటారో అని నాకు భయం.

    ReplyDelete
    Replies
    1. మీరెందుకు తటపటాయిస్తున్నారు!? నేను outdated అని ఇల్లెక్కి కూస్తుంటాను. నిజం చెప్పుకోడానికి సిగ్గు పడాల్సిందేముంది!?

      Delete
  5. Guruji
    Psychiatrist ga mee view cheppakunda, blog visitors ni chinna chupu choosaru.

    ReplyDelete
    Replies
    1. అయ్యో! అదేం కాదు. నా blog visitors పట్ల నాకు విపరీతమైన ప్రేమ (నా ఆలోచనలు / గోడు చదువుతున్నారు కాబట్టి). ఇందులో రెండో అభిప్రాయం లేదు.

      నేనీ సినిమాకి ఒక తండ్రిగా / భర్తగా (ఒక పవిత్ర కర్తవ్యనిష్టాగరిష్టుడనై) వెళ్ళినందున సినిమా గూర్చి పట్టించుకోలేదు. అదీగాక ఆస్పత్రి గుమ్మం దాటంగాన్లే నేనో సైకియాట్రిస్టుననే సంగతి మర్చిపోతుంటాను. అదో రోగం.

      ఇప్పుడు సినిమా గూర్చి రాయాలంటే..ఆవు నెమరు వేసుకున్నట్లు మళ్ళీ గుర్తు తెచ్చుకుని రాయాలి. ప్రయత్నిస్తాను.

      Delete
  6. movie ardam kaledu ani matram opurra babu e janam....veellu mararu
    marina valanu mechukoru

    ReplyDelete
  7. Sir, your blogs are really awesome. I am Krishna and I am also from Guntur.
    Wish you can review or write a Blog on movie 1, by reading that some people will reduce their Blood Pressure. Courtesy Munna Bhai MBBS :)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.