ఇవ్వాళ పొద్దున్న నా స్నేహితుడి నుండి ఫోన్.
"మహేశ్ బాబు సినిమా 'నేనొక్కడినే'లో ఏదో సైకియాట్రీ జబ్బు చూపించారు. అట్లాంటి కేసు నువ్వెప్పుడైనా చూశావా?"
చచ్చితిని. అనుకున్నట్లే అయ్యింది. ఇట్లాంటి ప్రశ్న నేను ఊహిస్తూనే ఉన్నాను. సినిమాల్లో గజ్జి, తామర చూపిస్తే జనాలు పట్టించుకోరు. కానీ ఎందుకో సైకియాట్రి కేస్ చూపించగాన్లే ఎక్కడ లేని డౌట్లు వచ్చేస్తాయి.
ఇంతకు ముందు 'అపరిచితుడు' అంటూ ఏదో సినిమా వచ్చింది గానీ.. నేనా సినిమా చూళ్ళేదు. ఇప్పుడు 'నేనొక్కడినే' చూశానంటూ నా బ్లాగులో దండోరా వేశాను కావున.. తప్పించుకోటానికి లేదు.
"బిజీగా ఉన్నాను. తరవాత మాట్లాడతా." అంటూ ఫోన్ కట్ చేశాను.
నేను ఇంతకు ముందు మిస్సమ్మ, దేవదాసు, పెద్ద మనుషుల్ని విమర్శించాను. దానికి కారణం కూడా రాశాను. అందరికీ నచ్చిన సినిమాలో సూక్ష్మ లోపాల్ని ఎత్తి చూపుతూ, విమర్శిస్తే మజాగా ఉంటుంది. కానీ ప్రేక్షకులు తిరస్కరించిన సినిమాని విమర్శించడం అనవసరం. అయినా - 'నేనొక్కడినే' సినిమాపై నా ఆలోచనలు కొన్ని రాసి ముగిస్తాను.
ఇదేదో తెలుగువారి స్థాయిని మించిన హాలీవుడ్ స్థాయి సినిమా అని కొందరు సెలవిస్తున్నారు. వారికో నమస్కారం. నాకర్ధం కానిది.. తెలుగు సినిమాలు హాలీవుడ్ సినిమాలా ఎందుకు ఉండాలి? తెలుగు సినిమా తెలుగు సినిమాలాగే ఉండాలి కదా! టెక్నికల్ గా ఆ స్థాయిలో ఉండాలని అంటున్నారా?
ఇంతకూ అసలీ 'నేనొక్కడినే' తెలుగు సినిమానేనా? పాత్రలు తెలుగు భాషలో మాట్లాడుకుంటాయి. అంత మాత్రాన దీన్ని తెలుగు సినిమా అంటూ చెప్పలేం. ఇది అనేక హాలీవుడ్ సినిమాల్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బి వండిన సినిమా. స్థానికత లేని ఈ సినిమాకి మనం ఎలా కనెక్ట్ అవుతాం? అవ్వలేం కదా. మన గుండమ్మకథ ఇంగ్లీషోళ్ళకి నచ్చుతుందా?
తెలుగు సినిమాల్ని అమెరికాలో కూడా విరగబడి చూస్తున్నారనీ, అంచేత తెలుగు సినిమా చచ్చినట్లు ఇతర దేశాల్లో తీయాల్సొస్తుందనీ అంటున్నారు. ఔను, అదీ నిజమే! నిర్మాత డబ్బు ఖర్చు పెట్టేదెలా? కాబట్టి పాత్రలు తెలుగులో మాట్లాడతాయే గానీ.. ఇది తెలుగువాడి జీవితానికి సంబంధించిన సినిమా కాదు. ఓవర్సీస్ వ్యూయర్స్ ని దృష్టిలో ఉంచుకుని డబ్బులు వెదజల్లుతూ తీసిన అతి ఖరీదైన సినిమా.
వెరైటీగా తీశారు కాబట్టి బాగుంది అంటున్నారు కొందరు. వెరైటీ అంటే బెండ కాయల్తో వంకాయ పులుసు చెయ్యడం కాదు, అది కుదరదు కూడా. ఈ సినిమా దర్శకుడు అదే చేశాడు. నే చదువుకునే రోజుల్లో ఓ క్షుద్ర రచయిత చేతబడిని హిప్నాటిజంతో లింకు పెట్టి పెద్ద నవలొకటి రాశాడు, దండిగా సొమ్ము చేసుకున్నాడు. ఆ రోజుల్లో ప్రేమ కథల్తో విసిగి ఉన్న పాఠకులు ఆ చెత్తనే ఓ రిలీఫ్ గా ఫీలయ్యారు.
ఈ సినిమాలో గాల్లో ఫైటింగ్ చేసి, హత్య చేసినట్లుగా భావించుకుంటాడు హీరో. దీన్ని hallucinatory behavior అంటారు. ఇది మానసిక రోగం. అర్జంటుగా ఆస్పత్రిలో చేర్చి వైద్యం చేయించాలి. దీనికి ఓ డాక్టర్ టెస్టులు, గట్రా చేయించి (డాక్టర్లు ఉట్టి పుణ్యానికి డబ్బులు బాగా ఖర్చు పెట్టిస్తారని దర్శకుడు ఫిక్స్ అయిపోయినట్లున్నాడు) integration disorder అని ఊరూ, పేరు లేని ఓ రోగం పేరు చెబుతాడు.
హైదరాబాదులో సైకియాట్రిస్టులు కనీసం వందమంది ఉన్నారు. దర్శకుడు వారిలో ఒకరితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడినట్లయితే.. వాళ్ళు హీరోకి ఇంకొంచెం బెటర్ రోగం సూచించి ఉండేవారు. కానీ ఆ మాత్రం రీసెర్చ్ చేస్తే అతను తెలుగు సినిమా డైరక్టర్ అవడు.
సరే! ఏదొక రోగం. మరీ శంకరశాస్త్రిలా చాందసంగా రాస్తున్నట్లున్నాను, వదిలేద్దాం. దర్శకుడి రూట్లోకే వద్దాం. డాక్టర్ హీరోదంతా ఊహే, అతనికి గతం లేదు అంటాడు. అన్నన్ని టెస్టులు చేశాడు కాబట్టి డాక్టర్ కరెక్ట్ చెప్పాడనుకుందాం. కానీ డాక్టర్ తప్పు చెప్పాడు. హీరో ఊహించుకున్న వాళ్ళంతా నిజంగానే ఉన్నారు.
మరయితే సినిమా మొదట్లో హీరో గాల్లో ఫైటింగ్ ఎందుకు చేశాడు? ఆయనగారికి అదేదో గ్రే మేటర్ తగ్గి (అసలు సంగతి - దర్శకుడికి గ్రే మేటర్ తగ్గింది) ఒక మాయదారి రోగం ఉన్నందువల్లనే కదా! డాక్టరో, హీరోనో ఎవరో ఒకళ్ళే కరక్ట్ అవ్వాలిగా. ఇద్దరూ ఎలా కరెక్ట్ అవుతారు? కనీస శాస్త్రీయత లేకుండా ఇంట్లో కూర్చుని రాసుకున్న కథ కూడా తప్పులతడకే!
ఇట్లా రాసుకుంటూ పొతే.. ఈ సినిమాలో చూపించిందంతా ఓ పెద్ద సైకలాజికల్ ట్రాష్ అని అర్ధమవుతుంది. ఒకప్పటి క్షుద్ర రచయిత లాగా, ఈ దర్శకుడు 'నేను సైకలాజికల్ థ్రిల్లర్ తీశాను, చూసి తరించండి' అంటాడు.
ఈయన ఒకప్పుడు 'ఆర్య' అనే గొప్ప సినిమా తీశాట్ట. నేనా సినిమా విడియో చూశాను. ఆ ఆర్య అనేవాడు ఒక చౌకబారు stalker. మనకి కనిపిస్తే అర్జంటుగా eve teasing కేసు పెట్టించి జైల్లో వేయించదగ్గ వ్యక్తి. 'ఆర్య'ని ఓ intelligent సినిమాగా భావించాల్ట! దర్శకుడికి ఎంత ధైర్యం!
అసలు సమస్య ఏమంటే.. మన తెలుగు సినిమాలు చదువుకున్న వాళ్ళు చూడరు (నా తోటి సైకియాట్రిస్టులు సినిమాలు చూడరు, వాళ్ళల్లో నేనే గొప్ప), చూసినా పట్టించుకునే టైం ఉండదు.. నాలాంటి సైకియాట్రిస్ట్ 'పని లేక' రాస్తే తప్ప. తెలిసిన వాళ్ళు చెప్పకపోతే నిజంగానే ఇదేదో గొప్ప కథ అనుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఇవ్వాళ ఈ పవిత్ర కార్యం నెత్తినెత్తుకున్నాను.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కావలిసినంత స్వేచ్చ ఉంది. కావున రెండో ఎక్కం తెలీకుండా గణిత శాస్త్రంలో పుస్తకం రాసెయ్యొచ్చు. న్యూటన్ సూత్రం తెలీకుండా గొప్ప సైన్స్ ఫిక్షన్ రాయొచ్చు. ఎవడన్నా తలకి మాసినవాడు నిర్మాతగా దొరికితే (తెలుగు ప్రేక్షకులకి దరిద్రం శనిలా పట్టుకుంటే), ఆ కథనే సినిమాగా కూడా తీసి ప్రేక్షకులపై కసి తీర్చుకోవచ్చు. అది మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
నా దృష్టిలో రొటీన్ ఫార్ములా సినిమాలు తీసేవాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు సినిమా సక్సెస్ కోసం ఓ కథ ఒండుకుంటారు. దాన్లో మసాలా దట్టిస్తూ నానా తిప్పలు పడతారు. అది వారి వృత్తి. కోటి విద్యలూ కూటి కొరకే అన్నారు పెద్దలు. కానీ చెత్త తీస్తూ, తెలుగు సినిమాని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొట్టే మేధో డైరక్టర్ల డొల్లతనాన్ని గుర్తించకపొతే మాత్రం ప్రమాదం, నష్టం. ఇంతకన్నా ఈ సినిమా గూర్చి రాసి సమయం వృధా చేసుకోలేను.
(picture courtesy : Google)
డాక్టరుగారూ,
ReplyDeleteదర్శకుడు బుర్ర తిన్నగా పనిచేయటం లేదు కాబట్టే ఆ కథని ఎంచుకుని తీసాడు. నిర్మాతకి బుర్ర లేద్ కాబట్టే వాడికి దొరికి పోయాడు. జనానికి ఇంకా బుర్ర తిన్నగానే పనిచేస్తోంది కాబట్టే సినిమా చీదేసింది.
"చెత్త తీస్తూ, తెలుగు సినిమాని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొట్టే మేధో డైరక్టర్ల డొల్లతనాన్ని గుర్తించకపొతే మాత్రం ప్రమాదం, నష్టం" అన్న మీ మాటే నాదీను. నా బుర్రకి శంకరాభరణమూ ఒక సంగీతోధ్దరణముసుగులో పోజుకొడుతున్న కమ్మర్షియల్ సినిమానే. అలా అన్నందుకు ఆ రోజుల్లో అనేకమంది నన్ను విమర్శించారు కూడా.
ఈ రోజుల్లో భక్తిసినిమాలు తీసేవారు కూడా కమ్మర్షియల్ దృష్టితోనే తీస్తున్నారు. వృధ్ధనారీ పతివ్రతా అన్నట్లుగా హీరోవేషాలకు తగనంతగా వయస్సు పైబడ్డాక ఈ రకం సినిమాల్లో విజృంబిస్తున్న నట దర్శక మహానుభావులు తెలుగుజాతికి ఉపకారం చేస్తున్నట్లు పోజులిస్తున్నారు. అసలు అన్నిరకాల సినిమాలూ డబ్బుకోసమే తీస్తారన్నది నిజమే కాని జనాన్ని ఉధ్ధరించటానికో కళని బ్రతికించటానికో తీస్తున్నామని చెప్పుకోవటం, అదీ చెత్తతీస్తూ గొప్పచెప్పుకోవటం, పరమ అన్యాయమైన విషయం.
శ్యామలీయం గారు,
Deleteయోగి వేమన సినిమా title cards లో చాలా ప్రముఖంగా 'ఈ సినిమాకి చరిత్ర ఆధారం లేదు. కొన్ని పాత్రలు తీసుకుని సినిమాకి అనుగుణంగా కథ రాసుకున్నాం' అని కె.వి.రెడ్డి, సముద్రాల ఒక disclaimer పడేశారు. ఇంక ఆ కోణం నుండి ఎవ్వరూ మాట్లాడ్డానికి లేదు. అటువంటి disclaimer ఒకటి ఈ సినిమాలో పడేస్తే బాగుండేది. నాకీ పోస్ట్ బాధ తప్పేది.
శ్యామలీయం మాస్టారు వ్యాఖ్య నూటికి నూరు శాతం కరెక్టు. అయితే నేను డబ్బు కోసం మాత్రమె కాలక్షేపం బఠానీ సినిమా తీస్తున్నానని ఒప్పుకుంటే వచ్చే జనాదరణ తక్కువ. అందుకే దేశాన్ని (లేదా కళను) ఉద్దరిస్తున్నాననో, ప్రజలకు ఒక గొప్ప శాస్త్రీయ విజ్యానం అందిస్తున్నాననో చెబితే క్లాసూ మాసూ రెండూ కలిసి వచ్చి బ్రహ్మాండంగా దండుకోవచ్చు. పైగా తానొక మహామేధావి అని బిల్డప్పులు ఇవ్వొచ్చు. అదృష్టం ఇంకా కలిసి వస్తే అవార్డులూ కొట్టేయచ్చు.
Deleteరమణ గారు సినిమా పాత్ర మానసిక ఆరోగ్యం సంగతి పక్కనబెట్టి తీసేవారి psychology problems గురించి రాస్తే బాగుంటుందేమో :)
తెలుగులో రచయితలకి (ఇదిగో ఇప్పుడు దర్శకులక్కూడా) తమ పాథకులు (or ప్రేక్షకులు) అంటే మొదట్నుంచీ చులక్నభావమే. వీళ్ళకి తెలిసి చచ్చిందా అన్నట్లుగా రాస్తారు. మొన్నామధ్య ఒక ప్రముఖ రచయితవారి సాయిన్సు ఫిక్షను చదివి, గురుత్వాకర్షణశక్తి విషయంలో న్యూటన్ చెప్పినదికూడా చదవకుండా ఆపుస్తకాన్ని ఎలా రాశాడా అని ఆశ్చర్యపోయాను. రచయిత కనీసం తొమ్మిదోతరగతి విద్యార్ధులతో మాట్లాడిఉన్నా దాన్ని అంతకన్నా మెరుగ్గా రాయగలిగి ఉండేవాడు.
ReplyDeleteకొన్నాళ్ళక్రితం వచ్చిన సిక్స్త్‌సెన్స్ సినిమాకూడా ఇలాగే ఉంటుంది. అందులోనయితే జెనెటిక్ మెమొరీకీ, న్యూరలాగినకల్ మెమొరీకీ కూడా తేడా తెలియకుండానే సినిమాను లాగించేశారు దర్శకవరేణ్యులు. వీళ్ళకు తెలిసిన నాలుగు సైన్సుపదాలను గుమ్మరించి కషాయం కాయడమేతప్ప, వాటిగురించిన కనీస అవగాహనతో మనం సినిమాలు ఎప్పటికి తీయగలుగుతామో! కొన్ని ఇంగ్లీషు సినిమాలుకూడా ఇలాగే ఉంటున్నాయి. బహుశా దాన్ని కన్సొలేషన్‌గా భావించాలేమో మనం,
వెరైటీ అంటే బెండ కాయల్తో వంకాయ పులుసు చెయ్యడం కాదు,
ReplyDelete-----------------------------------------------------
నా కెందుకో ఈ వాక్యం బాగా నచ్చేసింది. కామెంట్ పెట్టకుండా ఉండలేక పోతున్నాను. ఇవ్వాళ సంక్రాంతిట, అమెరికా నుండి మీకు మా శుభాకాంక్షలు. ఇవ్వాళ మా ఇంట్లో కూడా వెరైటీ గా ఏవో చేస్తున్నారు.
>>ఇవ్వాళ మా ఇంట్లో కూడా వెరైటీ గా ఏవో చేస్తున్నారు.<<
Deleteమీరు జాగ్రత్తగా ఉండండి. :)
అందరికి అన్నీ తెలిస్తే సినిమావాళ్లు డబ్బులు చేసుకోవడం ఎలా? బాబాలు బ్రతకడమేలా? వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లడమెలా? రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవాడం ఎలా?ఓవర్సీస్ వాడు మన ప్రజల్ని కొల్ల గొట్టడం ఎల్లా? _______ఇలాంటి వారికి మీరు గండి కొట్టుతున్నారు. మీకిది న్యాయమా సార్?
ReplyDelete...డాక్టరో, హీరోనో ఎవరో ఒకళ్ళే కరక్ట్ అవ్వాలిగా. ఇద్దరూ ఎలా కరెక్ట్ అవుతారు? కనీస శాస్త్రీయత లేకుండా ఇంట్లో కూర్చుని రాసుకున్న కథ కూడా తప్పులతడకే!...
ReplyDeleteఎందుకని ?
మొదటి సీన్ లో ఎవరూ లేకుండా ఉన్నారని ఊహించు కున్నాడు కాబట్టి. అదంతా Hallucination అనడం వరకూ కరెక్ట్. అది hallucination కాబట్టి అసల వాళ్ళు లేరు అనడం తప్పు. Hallucination అంటేనే అప్పుడు అక్కడ లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకోవడం కానీ అసలు ఎక్కడా లేని వాళ్ళను ఊహించుకోవడం కాదు కదండీ .
Film ni film la chudandi...thats it .
ReplyDeleteFilm ni film la chudandi...thats it .
ReplyDelete--- ఆ ఆర్య అనేవాడు ఒక చౌకబారు stalker. మనకి కనిపిస్తే అర్జంటుగా eve teasing కేసు పెట్టించి జైల్లో వేయించాల్సింత perverted rogue.---
ReplyDeleteఆర్య Stalker, ఒకే . కానీ ఎక్కడా Perverted rogue లా కానీ, చౌకబారుగా కానీ అనిపించలేదు నాకు.
This comment has been removed by the author.
ReplyDeleteష్.. నెమ్మదిగా చెప్పండి. హోటల్లో డబ్బు తెసుకుని దరిద్రపుగొట్టు భోజనం పెట్టి.. ఓనర్ గాడు ఇదే సమాధానం చెప్పే ప్రమాదం పొంచి ఉంది. :)
Deleteరమణ గారు మీ మాటల చతురతని అభినందించ లేకుండా పోతున్నాను, సింప్లీ సూపర్బ్ సర్ మీరు, మీరు చెప్పింది రాజేష్ గారికి అర్ధం అయ్యుంటుంది అంటారా?
Deleteమీరు ధరిద్రపుగొట్టు భోజనం అంటున్నారు మేము పరమాన్నం అనుకుంటున్నాం ... :)
DeleteFirst Things First. డాక్టర్ చెప్పేది "integration disorder" అని తప్ప ఇంటర్ ప్రెటేషన్ డిజార్డర్ అని కాదండీ రమణ గారు. దాని గురించి గూగుల్ చేస్తే నాకు ఈ లింక్ కనిపించింది. http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC1472254/ దీనిగురించి ఫర్దర్ గా గూగుల్ చేస్తే http://www.schizophrenia.com/disease.htm# ఇదీ http://www.ncbi.nlm.nih.gov/pubmed/14599267?dopt=Abstract కలిపి నాకు అర్ధమైన విషయమేంటంటే గౌతంకి ఉన్నది Schizophrenia దానివలనే గ్రేమాటర్ తగ్గిపోయింది దాని కాన్సీక్వెన్సెసే అమ్మానాన్నలని గుర్తుపెట్టుకోలేకపోవడం అని కూడా అనిపించింది. కాకపోతే నాదంతా గూగుల్ సెర్చ్ నాలెడ్జ్ కనుక నా స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యే అవకాశాలెంతవరకూ ఉన్నాయో మీరే నిర్ధారించాలి.
ReplyDeleteఇక పోతే డాక్టర్ గౌతం ఇద్దరూ కూడా పూర్తిగా కరెక్ట్ కాదండీ కేవలం పాక్షికంగా కరెక్ట్ ఎలాగంటే... డాక్టర్ హీరోకి తల్లిదండ్రులున్నారనేది, వాళ్ళని ఎవరో చంపేశారనేది, ఆ చంపినవాళ్ళని హీరో చంపేశాననేది అన్నిటినీ హెలూసినేషన్ అన్నాడు కానీ హీరో అవన్నీ నిజం అన్నాడు. ఇందులో హీరోకి తల్లిదండ్రులున్నారనేది నిజం వాళ్ళని ఎవరో చంపారన్నది నిజం కానీ చంపినవాళ్ళని హీరో చంపినట్లుగా ఊహించుకున్నది అబద్దం. అలాంటి ఒక హెలూసినేటెడ్ మర్డర్ కేస్ విషయంలోనే డాక్టర్ దగ్గరకి తీసుకువస్తారు హీరోని.
ఈ సినిమాదర్శకుడు ఏం చదువుకున్నాడో తెలీదు కానీ.. బుర్ర తక్కువ వాడు. అందుకే అతితెలివితేటలు చూపించాడు.
Deleteఆ బఫూన్ డాక్టర్ చెప్పిన disorder తప్పుగా రాశాను, సరిచేస్తాను.
మేం హాస్పిటల్లో క్లినికల్ డయాగ్నోసిస్ చేస్తాం. అందుకోసం DSM (ప్రస్తుతం DSM 5) కానీ, ICD (ప్రస్తుతం ICD 10) అనేవి ఉపయోగించుకుంటాం. DSM లో Axis 1 డయాగ్నోసిస్ ఎక్కువగా చేస్తుంటాం. ట్రీట్మెంట్ ప్లానింగ్ కోసం ఈ క్లినికల్ డయాగ్నోసిస్ చాలా ముఖ్యం.
సినిమా మొదలైన పది నిమిషాల్లో ఆ ఫైట్, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్.. ఈ హిస్టరీతో paranoid schizophrenia అనే డయాగ్నోసిస్ (working diagnosis) తో ట్రీట్మెంట్ మొదలెట్టెయ్యాలి. My choice is a good dose of Aripiprazole or Ziprasidone or Paliperidone. ఇంత పెద్ద రోగం (a treatable case of psychosis) ఉన్నవాడు సెకండాఫ్ అంతా మామూలుగా ఉంటాడు!!!
మీరు (సినిమాలో ఆ డాక్టర్) చెప్పే disorders పేరు ట్రీట్మెంట్ ప్లాన్ కి ఉపయోగించుకోరాదు. అవన్నీ సెమినార్లు,కాన్ఫెరెన్సుల్లో చర్చలకి మాత్రమే పరిమితం. ఇప్పుడు మీకు హాస్పిటల్లో పేషంట్ల దగ్గర డాక్టర్ల భాష, academic discussions డాక్టర్ల భాష వేరువేరని అర్ధం అయిందనుకుంటాను.
నా బ్లాగులో Beautiful mind సినిమా గూర్చి కొంత చర్చ జరిగింది. ఆ సినిమాలో hallucinations చాలా consistent గా ఉంటాయి.కొన్ని ఘటనల్లో డాక్టర్ చెప్పినట్లూ, ఇంకొన్నిసార్లు పేషంట్ ఊహించుకున్నట్లు ఉండదు. ఆ పోస్టులో schizophrenia గూర్చి కొంత చర్చ జరిగింది. వీలయితే ఒకసారి చూడండి.
ఈ సినిమా దర్శకుడు పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్, ఈడియట్. ఒక చెత్త చూపిస్తూ తనో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ దర్సకుడిలా పోజు పొట్టే దరిద్రుడు. అందుకే ఇంత రాస్తున్నాను.
వేణూశ్రీకాంత్ గారు,
Deleteఅసలిదంతా ఎందుకు రాశానంటే.. ఈ సినిమా కూడా చౌకబారు సగటు ఫార్ములా తెలుగు సినిమానే. కాకపోతే ఇదో సైకలజికల్ థ్రిల్లర్ అంటూ దర్శకుడు, హీరో మనని మోసం చేస్తున్నారు. కొందరు అమాయకులు నమ్ముతున్నారు. అందుకని.
ఓపికగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు రమణ గారు. హహహ "బఫూన్ డాక్టర్" కరెక్ట్ గా చెప్పారండీ ఆ డాక్టర్ అసలు పేషంట్ తో అలా వెకిలిగా బిహేవ్ చేయడమే చాలా ఆడ్ గా ఉంది కాకపోతే దర్శకుడు ఆ సీన్ ద్వారా ప్రేక్షకులలో కూడా ఒక కన్ఫూజన్ ఇండ్యూస్ చేయాలనుకున్నాడేమో తెలీదు. మీరన్నట్లు స్క్రిప్ట్ సమయంలోనే సరైన డాక్టర్ ని కన్సల్ట్ చేసి మరింత పగడ్బందీగా రాసుకుంటే బాగుండేది. సైకలాజికల్ థ్రిల్లర్ కాకపోయినా సినిమా మంచి థ్రిల్లర్ అండీ, కొన్ని లోటుపాటులున్నప్పటికీ తెలుగుతెరకు అంతగా పరిచయంలేని టేకింగ్ తో వైవిధ్యమైన ప్రయోగం అని మాత్రం నాకు అనిపించింది. ముఖ్యంగా లవ్ స్టోరీలూ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్స్ కాకుండా కొంత కొత్తదనం కోసం ప్రయత్నించాడు.
Deleteమీరు Beautiful mind గురించి రాసిన పోస్ట్ ఇదివరకూ చూశానండీ కాకపోతే అక్కడ జరిగిన డిస్కషన్ ఫాలో అవలేదు తప్పక చదువుతాను. థాంక్స్.
This comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by the author.
DeleteLol ..movie lo chupinchindi meeru cheptunna ooru peru leni 'Interpretation disorder' kadandi ..adi 'Integration disorder'.. http://en.m.wikipedia.org/wiki/Integration_disorder
ReplyDeleten aa disorder prakaram doctor cheppindi correct eh ..asalu akkada jarigina scene kanuka correct ga gamaniste ..doctor aduguthadu aithe nuvvu murder chesina vaadu mee amma nannalani champadu antav..mee amma,nanna evaro thelusa neeku ani ante mahesh theliyadu antadu (mahesh vallani ela marchipoyadu anedu manaki tharuvatha thelustundi) appudu doctor antadu aithe nuv muder chesina vyakthi (imaginary) neeku theliyani mee amma nannalani champesadu ante ikkada leni mee amma nannalani oohinchukunnav.. vallani vaadu champesadani oohinchukunnav vaadini nuv murder chesavani oohinchukunnav ani doctor ante mahesh nenu vadni murder cheyatam oohe kavacchu kaani na amma nannalu unnadi nijam ante ledu needi oohe antadu doctor ..mahesh kopam tho kotti nenu kottanani neeku ela thelisindi ante doctors antadu it pains man ..appudu mahesh naaku na amma nannalu unnatu kuda ikkada pain tho(heart ni chuputhu) thelustundi ani vellipothadu
ReplyDeletePaina nenu rasina danni batti chuste..meeru mee article lo doctor okati mahesh okati ela veru veru ga cheptaru iddaru oke laaga cheppali kada ani annaru ..ikkada doctor ki mahesh background gurinchi thelisindi thakkuva n mahesh elagu thana amma nannalni marchipoyadu..doctor athanni oka patient lane chusade thappa (mahesh daggara kuda correct info lenanduvalla ) asulu nijam enti ani grahinchaleka ..elagu test la tho disease conformation chesunnadu kanuka thana version lo thanu cheppinde correct annadu..ledu naaku amma anna lu unnaru ani mahesh strong ga feel auvthunnadu kabatti adi athani pov lo correct..ika pothe chaala simple ga director a scene ni present chesina kuda meeru aa chinna vishyanni grasp ela cheyalekapoyaro naaku ardam kavatam ledu
ReplyDeleteమీరు lekhini.org సహాయంతో తెలుగు లిపిలో వ్యాఖ్య రాయగలరు.
Deleteఅంతా బావుంది గానీ డాట్రారూ, ఈ ఫారిన్ వ్యూయర్స్ ఎవరండీ? వాళ్ళకి ఫారెన్ లో సినిమా తీస్తే తప్ప నచ్చదా? ఇదెక్కడి సెంటిమెంటు?
ReplyDeleteమీరేనండి! మీ దేశం వాళ్ళు తెలుగు సినిమాలకి లక్షల డాలర్లు కుమ్మరించేస్తున్నారు. మీరిచ్చే డబ్బుల్తో తెలుగు సినీ నిర్మాతల budget బలిసింది. అంచేత మిమ్మల్ని దృష్టిలో ఉంచుకునే కథ ఏ యూరప్ లోనో జరిగినట్లు రాసుకుంటున్నారు. అంచేత అధ్యక్షా! తెలుగు సినిమాల్లో తెలుగు లేకపోటానికి overseas market కూడా ఒక కారణం అని తెలియచేసుకుంటున్నాను. :)
DeleteThis comment has been removed by the author.
DeleteUS lo vachedi maha ithe 6-7crs, adi kuda cinma hit aipothe...ikkada 50 daka vasthadi...bagundi ra baga analyze chesthunnav
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDelete
ReplyDeleteడాటారు బాబు గారు,
ఈ మీ వాక్యమును విశదీకరింపుడు !! ---> " నే చదువుకునే రోజుల్లో ఓ క్షుద్ర రచయిత చేతబడిని హిప్నాటిజంతో లింకు పెట్టి పెద్ద నవలొకటి రాశాడు, దండిగా సొమ్ము చేసుకున్నాడు."
క్షుద్ర రచయిత అనగా ఎవరు ? వారికున్న ప్రత్యెక విశేషములెవ్వి ??!!!
జిలేబి
జిలేబి జీ,
Deleteమీరెప్పుడూ ఇంతే.. చిక్కుప్రశ్నలు అడుగుతారు. ఆ క్షుద్రరచయిత పేరు గుర్తు రావట్లేదండి!
పోనిద్దురూ, క్షుద్రులపేర్లు గుర్తుచేసుకోవటం దేనికీ!
Deleteయండమూరి.. తులసిదళం... అంతేనా డాక్టర్ గారూ...
Deleteపని లేకుండా ఇంతమందిని అయోమయాస్త్రం తో కొట్టగలిగిన మీకు, జిలెబీగారి చిక్కు ప్రశ్న ఎదుర్కోవటం ఏమంత పెద్ద సమస్య అంటారు? సింపుల్ గా పోస్ట్ ఉంకోసారి చదవమనండి, దెబ్బకి అయితే సందేహ నివృత్తి, లేదా, నేనొక్కడినే పార్ట్2 లో జిలేబీ గారి తెరంగేట్రం :)
Deleteఇకపోతే, తెలుగు సినిమా చూడడమే దండగమారి పని. దాని మీద విశ్లేషణ ఇంకా పెద్ద వృధా. మీ స్నేహితుడి నంబరు బ్లాక్ చేసుంటే సరిపోయేది. పైగా పని లేకుండా ఉంకో పని చేసుకునే వారు. :)
సీతారామం
Seetharam గారు,
Delete>>తెలుగు సినిమా చూడడమే దండగమారి పని.<<
అయ్యుండొచ్చు. అయితే సినిమాని ఎక్కువమంది చూస్తారు. సామాన్యుడి ఆలోచన సరళి అర్ధంచేసుకోటానికి ఈ మీడియం పనికొస్తుంది. మన సమాజం ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోటానికి మనకి sociology studies లేవు. కొద్దోగొప్పో సినిమాల ద్వారా అంచనా వెయ్యొచ్చు.
ఈ మాట కారా మాస్టారు (అనుకుంటాను) అన్నారు.
రమణ గారూ,
Deleteజోకు లా కాకుండా సమధానం ఇచ్చారు గనక, నా ప్రత్యుత్తరం.
సినిమా చాలా శక్తివంతమైన మీడియం. ఒక విషయాన్ని సమాజం లో అన్ని వర్గాల వారికీ ఏక కాలం లొ చేరువ కాగలదు. అయితే సినిమా వ్యాపార సాధనమే కాని విజ్ఞాన సాధనము కాదని ఏనాటినుంచో ఉన్న చర్చ. నా మటుకు నేను సినిమా ఒకా శక్తివంతమైన మాధ్యమం అని విశ్వసిస్తాను. అలాంటి సినిమాలు పరదేశస్తుల మధ్య చూడాల్సి వస్తే ఒచ్చే తలవంపులే నన్ను 'తెలుగు సినిమా చూడడమే దండుగా' అనే స్థితికి తీసుకు వచ్చాయి.
మీరు చెప్పిన కొద్దో గొప్పో సినిమాలు ఇప్పట్లో వొస్తాయని అనుకోవడం బహుశ అత్యాశేనేమో...
సీతారామం
To my thinking, a good film, however complicated it might be will be well received. The basic principle should always be - while communicating one must understand the "terms of reference" of the audience it is aimed at. And then tailor it accordingly. An easy example is that of kissing scenes being acceptable to the multiplex going urban audience in Hindi films. But then we should also look at the fact that previously kissing scenes were not accepted in Hindi films. There is nothing wrong in challenging the existing cultural equations in art form. Except that, like I said earlier it should be done well enough to get the appreciation of the audience.
ReplyDelete100 % Accept with your opinion, All these ppl are fully adicted to Routine movies like 'Yevadu' whats there new to watch. All they guys want one introduction, thn solo Song then fight scene, 6 songs, 4 fight scenes. Routine masala formula. Pity on you Guys. This writer may belongs to Mega compound.
Delete>>This writer may belongs to Mega compound.<<
Deletei don't have mega compound, only mini compound.
జ్ఞానానికి లేనట్టే, అజ్ఞానికి కూడా ఎల్లలు లేవు. ఏం చేస్తాం.
ReplyDeleteమన సినిమా హీరోల లక్షణాలు
ReplyDeleteఅ) అమ్మాయిలని ఏడిపించాలి. ఎంత శాడిస్టిక్ గా అయితే అంతా హీరోయిజం.
ఆ) కానీ, అమ్మాయిల్ని ఏడిపించే విలన్లను చావ చితక్కొట్టాలి
ఇ) సిగరెట్లు, మందు, నల్లమందు లాటివి దండిగా వాడాలి
ఉ) బేంకుల్ని కొల్లగొట్టాలి, విలన్లతో చేతులుకలపాలి. వాళ్ళు చేసిన నేరాల్లో పాల్గోవాలి, లేదా వాళ్ళ కోసం హత్యలు నేరాలు చెయ్యాలి. నేరస్తుల కంటే ఎక్కువ నేరాలు చెయ్యాలి. నేరాల్లో నేరస్తుల్ని తుత్తునియలు చెయ్యాలి.
ఊ) హీరోయిన్లని చీత్కరించుకోవాలి, పురుగులాగా చూడాలి. ద్వందార్ధాలతో మాట్లాడాలి.
మీ observation బాగుంది.
Deleteకానీ ఆ సినిమాల్ని మనవాళ్ళు బాగానే చూస్తున్నారుగా. అంటే తమ వికారాల్ని హీరోలో చూసుకుని తృప్తి నొందుతున్నారా!? :)
This comment has been removed by the author.
Deleteచూసే వాళ్ళ వికారాలా లేక తీసేవాళ్ళవా?
Deleteథియేటర్లు నిండడానికి, పెరిగిన జనాభా చాలు, అందరూ తలోసారీ చూస్తే సరిపోతుంది ఓ కళాఖండం తయారవడానికి. ఇవన్నీ నిస్సందేహం గా తీసే వాళ్ళ వికారాలె.
ఒక పాత్ర మరణిస్తే పూర్వం ఫొటొకి దండ వేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు ఎంత భీభత్సంగా చూపిస్తున్నారో తెలిసిందే..
సీతారామం.
ఈ సినిమా బాధితులలో నేనూ ఒకడిని. చూసి నాకు integrated disorder మొదలయ్యింది.
ReplyDeleteఅయితే ఫైటింగ్ సీనే తరువాయి.
Deleteజాగ్రత్త, వంటరిగా తిరగకండి. :)
sukumar...lekkala mastaru.... maths ki logics matrame untay....science ki okka logic saripodu....anduke maths is a part of sceince ayyndi.....miru chepthunna psycological medical terminalogy science lo oka bagam....anthey kani adey science kadu...mundu miru adi pshycological thriller anagane medicine ki sambandinchindi ani brama paddaru....film lo okka scene matrame untundi doctor tho...akada kuda doctor porapatu padthadu..akade telchesadu sukumar ey film medical view tho chudalsinadi kadu ani.....mahesh charaacter chustey chala telivaina kurradu film lo....anni logical ga nammuthuntadu.....sukumar mathematical ga cheppadu katha ni with his screenplay.....miru pshcologist avadam valla anni miku ah kallatho chudatam alavatu ayndi ankunta......alane sukumar ki anni mathematical ga alochinchadam alavataipoyindemo......miru okasari maths chadavandi lekapothey cinemalu reviews rayatam maneyandi...inka arya antara.....dani gurinchi ipudu kadu miru matladalsindi....adi release aynapudu review rayakapoyara....
ReplyDeleteమీరు lekhini.org సహాయంతో తెలుగు లిపిలో రాస్తే చదవటానికి అనుకూలంగా ఉంటుంది.
Deleteమీరు చెప్పింది నిజమేనండి వై.వి.రమణ గారు,,,,,....గ్రే మేటర్ తగ్గిపోతే కన్న తల్లిదండ్రులు ని మర్చిపోయి ,,అప్పుడే ముసుగు లో చూసినా విలన్ లను పెద్ద అయ్యేదాకా గుర్తుకుపెట్టుకుంటాడు ఇక్కడ హీరో గారు....చిన్నప్పుడు చదివిన A ,B,C,D లు గుర్తుకు ఉంటాయి గాని,,నిన్న మొన్న చదివిన ఆన్సర్ గుర్తుండదు..ఏంటో ఈ పిచ్చి...పిచ్చి పరాకాష్ట కి చేరిదంటే ఎలా ఉంటాది అని అనుకున్నాను కాని సినిమా చూసాకా తెలసివచ్చింది......ఇంకో విషయం ,,ఇక్కడ ఉన్న వాళ్ళందరకి చెప్తున్నాను...దర్శకుడు సినిమా తీసేది ప్రేక్షకులు గురించి గాని దర్శుకుడు గురించి కాదు....సినిమా తీస్తే ప్రజలు ఆనందించాలి,,అర్ధం చేసుకోవాలి,,రంజిపమవ్వాలి ...కాని ఆలోచించి,,ఆలోచించి,,అర్ధం కానిది తీసి చుసేయండి అని మనిషిని పిచ్చోడిని చేయకూడదు....ప్రేక్షకుడే సినిమా కి మొదటి సంపద...వాడికి నచ్చకపోతే అది 100 కోట్లు పెట్టి తీసిన ఒక్క(1 ) రోజు కూడా ఆడదు...ఇది నా ప్రగాడా విన్నపం......మీరు చెప్పినదానికి నేను `100 % అంగీకరిస్తాను...మీ చేతన్...
ReplyDeleteఅమ్మయ్య! మీ కామెంట్ చదువుతుంటే ఎడారిలో ఒయాసిస్ కనిపించినంత ఆనందంగా ఉంది. థాంక్యూ.
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteహమ్మయ్య...
ReplyDeleteసినిమా చూసి బయటకొచ్చేటప్పుడు నాకర్ధమయిన విషయం ఏంటంటే "నాకు సినిమా నచ్చలేదు" అని... కొన్ని సీన్లు మినహా. కానీ చాలా మంది చెప్పిన కారణాల వల్లా, సవాలచ్చ డిస్కషన్స్ వల్లా "ఇంత గొప్ప సినిమా నాకు నచ్చలేదంటే నాలోనే లోపమున్నట్టుంది" అనుకుని తెగ ఇదైపోతున్నా.. ;)
రాజ్ కుమార్ గారు,
Deleteమీరీ సినిమా మీద రివ్యూ రాయకపోవడం చాలా అన్యాయం. facebook లో మీ శాడిస్ట్ మొగుడు / తాగుబోతు మొగుడు కామెంట్ చదివి చాలాసేపు నవ్వుకున్నాను. థాంక్యూ.
ramana garu meku movie making gurinchi emina telusa ??
Delete@Karhik,
Deleteఅస్సలు తెలీదు.
ఎందుకు తెలియాలీ సినిమా తీయటం గురించీ? మనకు సినిమా చూడటం చేతనైతే సరిపోదా?
Deleteఇడ్లీ బాగుందో ఏడ్చినట్లుందో తెలియటానికి తినేవాడికి పాకశాస్త్రనైపుణ్యం అవసరమా చెప్పండి!
This comment has been removed by a blog administrator.
ReplyDeleteఇలాంటి సినిమాలు ఫస్ట్ షో డాక్టర్లకే పరిమితం చేయాలి. ముందుగా వారు చూసి మనం చూడొచ్చో లేదో చెప్తారు.
ReplyDeleteఅయినా సినీ రోగాలు ఎప్పుడు వైద్యులకు అంతుబటాఅయి కనుకా..:-))
సర్, మీరు రాసే విదానం బాగుంటుంది.
థాంక్యూ. చాలా యేళ్ళ తరవాత హాల్లో సినిమా చూశాను. హిచ్ కాక్ సినిమాలు చూసిన అనుభవం ఉంది కాబట్టి.. మొత్తం సినిమా గూర్చి రాద్దామనుకున్నాను.. కుదర్లేదు. అంచేత డాక్టర్ పాత్రకి మాత్రమే పరిమితం అయ్యాను.అంతే.
Deleteసైకలాజికల్ థ్రిల్లర్స్ లో (మీరు హిచ్ కాక్ 'సైకో' చూసే ఉంటారు) డాక్టర్ పాత్రల్ని దర్శకుడు తెలివిగా వాడుకుంటాడు. ఆ డాక్టర్ పాత్ర ద్వారా కథకి ఓ రీజన్ / లాజిక్ / స్పష్టత ఇస్తూ.. ఓ సైంటిఫిక్ డైమన్షన్ తీసుకు రావడానికి దర్శకుడు ప్రయత్నిస్తాడు. అందుకోసం కొంత రీసెర్చ్ కూడా చేస్తాడు. ఈ పని చెయ్యడానికి కాకపొతే, ఇట్లాంటి కథలో డాక్టర్ పాత్ర ప్రయోజనం ఉండదు. ఈ సినిమాలో జోకర్ లాంటి డాక్టర్ పాత్ర ద్వారా ప్రేక్షకుల్ని మరింత కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు.
సైకో గురించి రాసే ఉద్దేశమేమైనా ఉందా డాక్టర్ గారూ...
Deletepuranapandaphani గారు,
DeleteNorman Bates ని ఇప్పటికే చాలామంది ఎనలైజ్ చేశారు. సైకాలజి పుస్తకాల్లో కూడా అతని రిఫరెన్స్ వస్తుంటుంది. ఇంక కొత్తగా నేను రాసేదేముంది!
ఒకసారి స్నేహితుల కోసం.. Psycho సినిమాని రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, దాసరి ఎలా తీస్తారో ఒక స్కిట్ లాగా రాశాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు.
సర్, మన సినిమాలు కేవలం డబ్బు దండుకోవటానికి వేసే కుప్పిగంతులు మాత్రమే..
Deleteడాక్టర్స్ ని జోకర్స్ గా చూపించి, తమ వికృత మానసిక చర్యలకు తెరతీస్తున్నారు.
బాలీఉడ్ సినిమాలంటే అర్దనగ్న అమ్మాయిలుంటారు అనుకొనే మన యువత చత్త సినిమాలే చూస్తారు.
Psycho గురించి మీరు వ్రాసిన స్కిట్ మీ బ్లాగ్లో పెడితే మేం కూడా చదివి ఎంజాయ్ చేస్తాం గదా (ఆ స్కిట్ మీరు ప్రైవేట్ సర్కులేషన్ కోసం మాత్రమే వ్రాసినది అనుకోకపోతే).
Deleteసంధర్భం కాకపోవచ్చు కాని అడుగుతున్నాను.
ReplyDeletepsychology and psychiatry కి తేడా ఏంటి సర్ .
ఇప్పటి వరకు ఈ రెండు ఒక్కటే అని అనుకుంటున్నాను , ఈ మధ్యన ఎక్కడో చదివాను రెండు వేరే అని .
physiotherapist కీ, orhopedic surgeon కీ ఉన్న తేడా.
Deleteఏవిటో డాక్టర్ గారూ, పిల్లి-మార్జాలం ఉదాహరణ గుర్తుకొస్తోంది.
DeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteDear Rao garu.
ReplyDeleteAgreed, there are many mistakes in One, the movie. Accepted, you did not like Arya. Personally even I didn’t enjoy One the movie as much as I wanted to but that does not give me or you the right to call the director Sukumar names. Calling him an idiot and ‘దరిద్రుడు’ is entirely uncalled for and is indecent and it is seriously offensive. I respect your right to criticise and share your opinion of the Film and its director and his comments in your blog. What I can’t respect is the inherent tone of your article, it is almost spiteful and displays certain arrogance on your part. I feel you have misused your freedom of speech/expression as much as you have accused the Filmmakers/writers of!
I request you for little more civility.
Thank you.
Hari.
Dear Hari garu,
Deletethanks for the nice advice. I will be more careful in choosing my words in future and see that such things will not repeat again.
బ్లాగ్మిత్రులకి నమస్కారం,
ReplyDeleteఒక సినిమా గూర్చి ఇంత చర్చ అవసరమా? అనిపిస్తుంది. నాకు తోచిన పాయింట్లు రాశాను. ఒక సినిమా బాలేదని అతితక్కువమంది చదివే ఓ తెలుగు బ్లాగులో రాస్తే కొంపలు మునిగిపోవు. మీకు నేన్రాసింది నచ్చకపోతే పట్టించుకోకండి. ఎవరి అభిప్రాయాలు వారివి. కొందరు కామెంట్లుగా మరీ బూతులు రాశారు, అవి తొలగించాను. ఇంకొందరు నన్ను విమర్శిస్తూ రాశారు, అవి ఉంచాను.
కామెంటిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పోస్టుపై చర్చని ఇంక ఆపేద్దాం. అంచేత ఇకనుండి నేను ఈ పోస్టులో కామెంట్లకి స్పందించను. గమనించగలరు, థాంక్యూ.
My dear Doctor,
DeleteI am sure you agree with me that movies are made to entertain all people who are stupids to think that they are related to our daily lives.not so.It's just like sipping a beer and eating trash along with it and you forget.But if u consume more u will end up having head ache.U can't expect impractical thing to happen and comment it that it should be practical.A psychic thriller is for people who have more of psychological interpretation.So they accept.
No matter in the brain will give relief if you take it it seriously.I have nt seen the movie but i can c the hype in every body becoming crazy to c and evaluate.So many psychics.
Pardhu
డాక్టరు గారూ..
Deleteకామెంటు రాద్దామనుకుంటే మీరేమో ఇక చర్చ అపేద్దామని చెప్పేశారు.. ఎలా..ఎలా.. అందుకే కామెంటుగా ఒక పోస్ట్ రాసేశా.. క్రిందన ఉన్న లింక్ చదవండి
http://raghavvoice.blogspot.in/2014/01/blog-post.html
@rajiv raghav,
Deleteమీ పోస్ట్ చదివాను. బాగుంది. చక్కగా రాశారు.
చాల్రోజుల తరవాత సినిమా చూసినందున.. సినిమా హాల్లో సౌండ్ భరింపరానంతగా ఉన్నందున.. దర్శకుడు ఏదీ తిన్నగా చెప్పనందున.. ఆ చికాకంతా నా పోస్టులోకి వచ్చేసింది.
oka cinema gurinchi intha discussion avasaram ledhu , mela vimarsinche vallu vunte kotla rupayalu vasulu chese hollywood cinema vaallu kuda cinema lo apesi vere pani chesukovali endhukante ye hollywood cinema thesukunna 1% logic vundadhu reality vundadhu, movie is one imagination world. 3 hours movie chusi enjoy cheyali anthe.
ReplyDeleteసర్, నేను “నేనొక్కడినే” అద్భతం అనిగానీ, సుకుమార్ అద్భుతమైన దర్శకుడు అనిగానీ చెప్పడంలేదు. నిజంగా మీరెవరో నాకు తెలీదు. ఎవరో ఫేస్బుక్లో మీ ఆర్టికల్ పోస్ట్ చేయడం వల్ల మీ గురించి తెలిసింది. మీ ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ని నేను ప్రశ్నించనుగానీ, సుకుమార్ మీదా, ఆర్య సినిమా మీద మీ కామెంట్లు చాలా దురుసుగానూ, హేళనగానూ ఉన్నాయి. అవి ఎడిట్ చేసి పోస్ట్ పెడితే మీ మీద గౌరవం పెరుగుతుంది. ధన్యవాదాలు
ReplyDeleteనేనొక సినిమా చూశాను. పిమ్మట నా అభిప్రాయాలు, నా బ్లాగులో స్వేచ్చగా రాసుకున్నాను. నా బ్లాగు ఉన్నదే అందుకు.
Deleteనాకైతే నా పోస్ట్ బాగానే ఉంది. మార్చాల్సిన అవసరం లేదని నమ్ముతున్నాను.
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteHero ki grey matter takuva undi doctor cheppindi nijame. Hero ki gatham lo villains unnaru adi kooda nijame. ikkada evaro okaru nijam avvali anedi tappudu logic. Endukante hero ki gatham leo edo jarigindi ganuka edo psychological disorder ki guri ayyadu. Btw hero ki unnadi interpretation disorder kadu, integration disorder aka schezophrenia, adi chala mandi lo tarachu untundi. naaku telisina preminchi mosapoyina (ante dwandwardham teeskovaddu) oka ammai ki ee rogam undi.. tanaki evaro kanipistunnatu hallocinations vacchevi
ReplyDeleteఇంసేప్షణ్ లో అంత ఇల్యుషణ్ చూసాం , అపరిచితుడు అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అన్నాం , గజినీ అంటే చప్పట్లు కొట్టాం , చంద్ర ముఖి అంటే వహ్వా అన్నాం..కానీ మీకు తెలియని ఒక రోగం పుట్టుకోచి అది బేస్ చేసుకుని సినిమా తీస్తే ఒర్వలేకపోతిరి..
ReplyDeleteఇంతర్నేష్ణల్ స్టాండర్డ్ లో సినిమా తీసా అని దర్శకుడు కాని హీరో కాని ఎక్కడ కూడా అనలేదు కేవలం సినిమా చుసిన క్రిటిక్స్ , ప్రేక్షకులు మాత్రమె సినిమాని అల ఆపాద్దించారు, అయినా సినిమా ఇంతర్నేష్ణల్ స్టాండర్డ్ లో అంటే విదేశాల్లో షూటింగ్ చెయ్యడం అనుకునే మీకు ఎం చెప్పాలో కూడా తెలియట్లేదు..సినిమా మొత్తం కూడా కథ కి అవసరం లేని ఒక్క సన్నివేసం కూడా చొప్పించకుండా , సగటు తెలుగు చిత్రాలలో ఉండే తోడ గొట్టుడు , కమెడియన్ ని కొట్టుడు వంటి సన్నివేశాలకు స్వస్తి పలుకుతూ సుకుమార్ చేసిన ఈ ప్రయోగం అభినందనీయం.ఇంతర్నేష్ణల్ స్టాండర్డ్ అంటే ఈ చిత్రం ఏ భాష లో కి అనువదించినా వారికి అనువుగానే ఉంటుంది అని.
ఇక ఈ సినిమా ల పై రివ్యు లు చేసిన వారి ని ఇప్పటికే ఎంతో మంది రివ్యు లు చేసి మరీ ఆరి పారేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా విలువెంతో ఇప్పటికే చాలా మందికి అర్ధమైంది. మూస ధోరణి లో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు సుకుమార్.
ఆయన సృష్టించిన రోగానికి ఆయన కు తెలిసిన లాజిక్ ఏవీ కూడా మిస్ అవ్వకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అది ఎంత మందికి సాధ్యం ఇప్పుడున్న దర్శకులలో.సినిమా జాగ్రతగా గమనిస్తే ఏది నిజమో ఏది అబధమో మనకి ముందే చేపెస్తాడు దర్శకుడు కాని మనకే వెలగవు. ఆ పాత్ర తాలూకు చిత్రాలని మనం తెర పై చూస్తాం కాని మన బురకు కూడా సవాలును విసిరాడు దర్శకుడు చాలా చోట్ల. అందులో మనం నిలువలేకపోయం అందుకే మనల్ని మనం నిన్దిన్చుకోలేక సినిమాని నిందిస్తున్నాం.ఈ చిత్రం లో ఒక్క సన్నివేసం అయినా వేలేతి చూపే విధంగా ఉందా ? కథ కు అవసరం లేని చెత్త ఏమైనా ఉందా ? లేదు మనకు బ్రాహ్మీ లేదు , విలన్ తో భారీ డైలాగులు లేవు , కొడితే గాల్లోకి ఎగిరి పడిపోయే ఫైట్లు లేవు, అందుకేనేమో చాల మందికి అర్ధం కాలేదు.ఇది తెలుగు చిత్రమేనా అని..
అలాగే ఆర్య సినిమా గురించి అంటున్నారు. మీరు సినిమా చూడలేదని మీ వ్యాఖ్యలు చూస్తుంటే అర్ధమవ్తుంది. ప్రేమ అనేది ఏమీ ఆశించకుండా ఇవ్వగలిగేది మాత్రమె అనే సందేశాత్మక చిత్రం. మీరు గమనిస్తే కథానాయకుడు ఈ చిత్రం, లో ప్రేమకు చెప్పిన నిర్వచనాలు న భూతో న భవిష్యతు. ఇంత వరకు ఏ తెలుగు చిత్రం లో కూడా ఇంత స్వచ్చమైన ప్రేమ ని చూపించలేదు .
అయినా మనకి నలుగు ఫైట్లు , ఐదు కామెడీ సీన్లు, ఆరు పాటలు ఉన్న చిత్రాలు కావాలి కాని ఇలాంటి చిత్రాలేందుకు బాబు. బుర్ర లేని వాళ్ళ చేత మాట పడటానికి తప్ప..
How did you differentiate the imagination scenes from real scenes?
Hero imagines only 3 characters in the film. All other scenes involving other actors are real. If you look at it carefully, we have given a hint for the first episode. After coming out of rock concert, Mahesh looks at the hoarding consisting BMW car. Villain drives the same car in the next shot indicating that he is imagining it from the hoarding he saw. Like wise, during the first chase, hero’s bike has lights on and villain’s car lights are off. Water splashes on road when hero’s bike drives on it and it doesn’t splash when villain’s car drives on it. We have no shots from villain’s perspective in the entire episode. I had a few shots for police station episode with blood stains on bottle, but decided not to include it in the final cut.
ఇంసేప్షణ్ లో అంత ఇల్యుషణ్ చూసాం , అపరిచితుడు అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అన్నాం , గజినీ అంటే చప్పట్లు కొట్టాం , చంద్ర ముఖి అంటే వహ్వా అన్నాం..కానీ మీకు తెలియని ఒక రోగం పుట్టుకోచి అది బేస్ చేసుకుని సినిమా తీస్తే ఒర్వలేకపోతిరి..... ఆర్య లో ప్రేమకు చెప్పిన నిర్వచనాలు న భూతో న భవిష్యతు. ఇంత వరకు ఏ తెలుగు చిత్రం లో కూడా ఇంత స్వచ్చమైన ప్రేమ ని చూపించలేదు .
Deleteభలే రాశారండి. వ్యాఖ్యను చదువుతున్నంతసేపు చాలా నవ్వుకొన్నను. రమణ గారి టపా వలన ఔత్సహికులైన మీ లాంటి ఫెస్బుక్ రచయితల భావాలు తెలుసుకోగలిగాము .
"ఆర్య లో ప్రేమకు చెప్పిన నిర్వచనాలు న భూతో న భవిష్యతు. ఇంత వరకు ఏ తెలుగు చిత్రం లో కూడా ఇంత స్వచ్చమైన ప్రేమ ని చూపించలేదు ."
DeleteVery interesting!
డాక్టరు గారికి ఈపాటికే అర్ధమయ్యుండాల్సిన నీతి : Never criticize a holy cow.
A few examples for holy cow : బాపు, విశ్వనాధ్, రామాయణం, విశ్వనాధ సత్యనారాయణ, సచిన్, నరేంద్ర మోదీ, సినీతారలు మరియు దర్శకుడు సుకుమార్ :D
This comment has been removed by the author.
ReplyDeleteజనరల్ గా ఏ విషయం ఐన చదువుకున్న వాడికి ఒక లా అర్దమవుతుంది ..చాదుకొని వాడికి ఒక ల అర్దమవ్తుంది ....పేరు కి ...డాక్టర్ చదివిన మీరు ....ఎదో ఉద్దరించి నట్టు మాట్లాడటం మంచిది కాదు ...ఒక దర్శకుడి నుంచి మనం ఆశించేది ..అతను ఆర్టిస్ట్ ల నుంచి ఎంత నటన రాబ్బట్టాడు ....మిగితా సహచరుల నుంచి (కెమెరా ,మ్యూజిక్ ) లాంటివి ఎంత వరకు ఉపయోగించు కున్నాడు అని....అ విషయం లో సుకుమార్ చాల వరకు సక్సెస్ అయాడు ! ఇంక సినిమా లో అనేక లాజిక్స్ ఉన్నాయ్,,...వాటిని చాల వరకు ..విప్పే ప్రయత్నం బానే చేసాడు ...ఇప్పటి వరకు వస్తూన ట్రెండ్ కి వెరైటి గానే ఉంది సినిమా ..దానికి మీకు వచ్చిన నష్టం ఏంటి ?? ఈ సినిమా ని ఎదో అద్బుతం అని నేను అనట్ల....కానీ మీరు చెప్పిన్నాటు తిసిపారేసే చిత్రం అయితే కాదు ...అయిన 100 రూపాయి లు పెట్టుకుని సినిమా చూసే మీకంటే అన్ని కోట్లు కర్చు పెట్టి తీసిన నిర్మాతలకి బుర్రలేదు అనుకోటం మీ విజ్ఞతకే వదిలివేయటం నయం !! ఐన మీకు చాల అనుభవం ఉంది కనుక ..మిరే ఒక సినిమా తీయండి ....అప్పుడు తెలుస్తుంది ...ఎన్ని ఆలోచనలు చేయాలో..ఎంత మంది ని ఒప్పించాలో.. మన తెలుగు హెరొఇస్ం తగ్గటు ఎంత కంప్రమైస్ అవలో...ఇవన్ని అధిరోహించి ప్రేక్షకుడికి అంచనాలకి (మూస) కి లేకపోతే సినిమా ని పక్కన పెడతారు !అప్పుడు తెలుస్తుంది మీకు దర్శకుడి భాత్యత ఏంటో ...బ్లాగ్ ఉంది కదా అని వాడికి బుర్ర లేదు వీడికి లేదు అని రాయటం కన్నా మీ బుర్ర అంత ఉపయోగించి ఒక సినిమా తీయండి ...అది మిరే చూస్కోండి !ఏ తప్పు లేకుండా మీరు తేయగాలరో లేదో ???...అయిన ఇవని కాదు ఒక దర్శకుడి కన్న ...డాక్టర్ అవసరం జనాలకి చాల ఉంది ...అందుకే మీరు ఇలాంటి సినిమా ల మిధ ఎనాలిసిస్ లు రాసి వృధా చేస్కునే కన్నా .....అర్యోగ్యం మిద ఏమైనా జనాలకి తెలపటం ఎంతైనా అవసరం ఎందుకంటే "వైద్యో నారాయణో హరి : " అన్నారు ...డాక్టర్ ...దేవుడి తో సమానం !!
ReplyDelete>>ఇప్పటి వరకు వస్తూన ట్రెండ్ కి వెరైటి గానే ఉంది సినిమా ..దానికి మీకు వచ్చిన నష్టం ఏంటి ??<<
Deleteఈ సినిమా నాకు నచ్చలేదు. దానికి మీకు వచ్చిన నష్టం ఏంటి ??
This comment has been removed by a blog administrator.
DeleteThis comment has been removed by a blog administrator.
Delete"....ఇంక సినిమా లో అనేక లాజిక్స్ ఉన్నాయ్"
Deleteలాజిక్సా? అసలు సినిమాలో కొరవడిందే అది.
టేకింగ్ బాగుందని, రిచ్ గా తీసాడని చెప్పుకోడమే గాని, అందులో సరుకేముందని? అంతా గందరగోళం తప్పా? బంగారు పళ్ళెంలో వడ్డించినంత మాత్రాన (నిర్మాత డబ్బు బాగా పెట్టాడు కదా!), వుడికీ వుడకని పదార్థాలు రుచిస్తాయా?
@Kishore,
Delete>>బంగారు పళ్ళెంలో వడ్డించినంత మాత్రాన, వుడికీ వుడకని పదార్థాలు రుచిస్తాయా?<<
excellent.
I agree with Krishna PV. As my brother mentioned in his FB comments దేవదాసు ఒక తాగుబోతు సినిమా. మరి దాన్ని కళాఖండం అని ఎందుకన్నారో వీరే చెప్పాలి. Cinema ni cienma la chudali..edo vuddarinchi nantlu reviews chetta ga rayadam Kadhu
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
Deleteఆయనకు నచ్చ లేదు ఆయన రాసుకున్నాడు, మీకు నచ్చింది మీరు రాసుకోండి. అనవసరంగా ఎందుకు గోల
ReplyDeleteనాది కూడా మీ అభిప్రాయమే.
Deleteమొత్తానికి మీ బ్లాగ్ నుండి చాలా విషయాలు నేర్చుకొంటున్నాం సార్! అందులో ఒకటి ప్రజలకు ఎవరూ ఏమీ చెప్పగూడదు అనీ. అలా చెప్పిన వరెవరైనా విలన్ లై పోతారని.
ReplyDeleteTHIRUPALU P గారు,
Deleteరామరామ, నేనెప్పుడూ ప్రజలకి ఏమీ చెప్పనండి. నా ఆలోచనలే రాస్తుంటాను.
కాకపోతే పెద్దహీరోగారి దురభిమానులు ఈ పోస్ట్ మీదకి దండెత్తారు. అదీ సంగతి. :)
సినిమాకి రివ్యూ రాయడం ఈమధ్య ఒక జాఢ్యంలా తయారయ్యింది. డాక్టరుగారు బాగ అది పట్టించుకున్నట్టున్నారు. ఆసలు మీకు ఏ సినిమా నచ్హుతుందొ అర్థం కావట్లేదు (తెలుసుకోవలసిన అవసరం మాక్కూడా లేదు). మీరు ఇచ్చిన వాదాన్ని అందరు ఇప్పటికె థూర్పార బట్టారు. ఎవో నాలుగు అక్షింతలు నేను వెద్దామని (My two cents only).
ReplyDeleteనేతి బీరకాయలో నెయ్యి లేదె అన్నాడంట ఒక తల మాసిన వ్యక్తి. ఇంకా విశదీకరించాలంటే, పిల్లాడికి చందమామని చూపించే తల్లికి వాడు తినడమే ముఖ్యం. అంతేకాని చందమామలొ పరమాణువులు ఏమున్నాయో చెప్పవల్సిన అవసరం లేదు. మీ ధోరణిలో చెప్పాలంటే దేవదాసు ఒక తాగుబోతు సినిమా. మరి దాన్ని కళాఖండం అని ఎందుకన్నారో వీరే చెప్పాలి
మీకు 'ఇది సంగతీ' అనే ఒక సినిమా చూడమని కొరుతున్నా. ఆది ఎంతో ఘొరంగా విఫలమైన సినిమా కాని అందులో వున్న నిజాలు మన ప్రేక్షకులు ఒప్పుకోలేనివి. దయచెసి విమర్షకుడిగా వుండాలంటే సినిమాలొ వున్న మంచి, చెడు రెంటిని వ్రాయగలగాలి. ఆంతేగాని ఎద్దేవా చేయడం తగదు. మీరు వయసులో పెద్దవారు కాబట్టి చెపుతున్నా (నలభై ఏళ్ళ తరవాత మనిషిని మార్వడం కష్టం అని తెలిసినా)
ఒకటి మాత్రం నిజం తెలుగు చిత్రసీమ నిజంగా పుణ్యం చెసుకుంది అందరు మీలాంటి ప్రేక్షకులు కానందుకు.
>>ఒకటి మాత్రం నిజం తెలుగు చిత్రసీమ నిజంగా పుణ్యం చెసుకుంది అందరు మీలాంటి ప్రేక్షకులు కానందుకు.<<
Deleteగాడిద గుడ్డేం కాదు. అందరూ నాలాంటి ప్రేక్షకులే. అందుకే సినిమా ఫ్లాపయింది.
గాడిద గుడ్డు, హీరోయిన్ బొడ్డు, రవ్వ లడ్డు కాదేది సినిమాకి అర్ఠం.
Delete@Sekhar,
Delete:)))
చూడక చూడక ఒక సినిమా చూశాను. నా ఖర్మ కాలి అది నాకు నచ్చలేదు. ఆ విషయమే నాకు నచ్చినట్లు నా బ్లాగులో రాసుకున్నాను. ఒక పాపులర్ హీరో నటించిన తెలుగు సినిమా నచ్చకపోవటం నేరమని నాకు తెలీదు.
ReplyDeleteనా చిన్నప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమానులు (సినిమా పిచ్చోళ్ళు) ఎదుటి హీరో పోస్టర్ల మీద పేడ సుద్దలు కొట్టుకునేవాళ్ళు, బూతులు తిట్టుకుంటూ కరపత్రాలు వేసుకునేవాళ్ళు. ఆ శకం అంతరించిపోయిందని పొరబాటుగా అనుకున్నాను. ఆ జాతి ఇంటర్నెట్లో షికార్లు కొడుతుందని ఇప్పుడు అర్ధం చేసుకున్నాను.
నేను ఈ పోస్టులో కామెంట్లకి సమాధానాలు రాయట్లేదు. కారణం.. ఒక అప్రధాన విషయం పట్ల చర్చ సాగదీసి సమయం వృధా చేసుకోవటం ఇష్టం లేక మాత్రమే.
సినిమా నచ్చినవాళ్ళు చంకలు గుద్దుకుంటూ సినిమాని రోజూ చూసుకోండి, వంద పోస్టులు రాసుకోండి. అంతేగాని నా బ్లాగులో పడి ఏడవటం ఎందుకు?!
గత రెండేళ్లుగా అనేక విషయాలపై బ్లాగులో నా అభిప్రాయాలు రాస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు most popular of all అయి కూర్చుంది. ఈ రకంగా ఒక సినిమా పోస్టు నా బ్లాగులో అగ్రస్థానానికి చేరుకోవడం నాకు చాలా చికాగ్గా, ఇబ్బందిగా ఉంది.
ఇంకా మీ అదృష్టం. సినీ ఫంకాల సైటులలో అడ్డమయిన బూతులు రాస్తూ ఉంటారు. అవన్నీ మీ బ్లాగులో వాడలేదు.
Deleteరమణ గారు,
Deleteమీరిక సినీ క్రిటిక్ అయిపోయినట్టే అని ఈ పోస్టు...
బ్లాగ్సాఫీసు బద్ధలు కొట్టి మరీ నిరూపించిందోచ్! :-))
@Jai,
Deleteకొందరు ప్రబుద్ధులు బూతులు రాశారు. అవి తొలగించాను.
నాగరాజ్ గారు,
Deleteబాక్సాఫీసేమో గానీ.. బ్లాగ్ బద్దలవుతుందేమోననిపించింది. :)
యస్.. నేనొక్కడినే ఇటువంటి చెత్త సినిమా తీయగలను
ReplyDeletehttp://shankaratnam.blogspot.in/2014/01/blog-post_20.html
ఈ సినిమా మీద నా review ఎందుకో ఇక్కడ పంచుకోవాలనిపించింది.
ReplyDeletehttp://www.govulagopanna.blogspot.in/2014/01/1-review.html
మీ రివ్యూ చదివాను. బాగుంది. సినిమాల గూర్చి మీకు మంచి అవగాహన ఉందని అర్ధమైంది. అభినందనలు.
Deleteచదివి మీ అభిప్రాయం చెప్పినందుకు Thank you రమణ గారు.
DeleteSimple to say you are having generation gap, you think what ever was made, available, liked during your age, especially by you, was good and after that whatever is available and made is trash and poor quality. You made your mind and programmed your mind to like whatever belonged to your AGE and remaining is trash, thats the reason you didnt like anything. This can be seen with many writings of yours, example you like ghantasala (we do like) but you hate spb, you like kv reddy, nagi reddy, etc (even we like) but hate viswanath, dasari etc. You like nagaiah garu (we too like him) but hate all other actors.
ReplyDeleteProblem is you have good skills and able to attract and impress others so you are thinking that if you comment on something everyone would also think in your way only.
You feel that by saying i didnt like the movie and/or i didnt follow the movie except having popcorn is some thing great and none can do other a great intellectual like you.
You need to answer one question, if you didnt watch the movie how the heck you wrote your review. If you didnt bother to watch the movie then how can you understand and how can you say it is bad, how can you say director is an idiot etc. and how can you write trash about the movie.
Whether you watched the movie or your opinion is wrong and written for the sake of writing and to show off to others that you just dont like new movies (other than your good old aged movies, persons, incidents, actors etc).
You need to come out of that AGE and try to see things in current time, trends probably you may start liking new things (movies, songs, actors etc) or at least you wont hate like they are your enemies.
My friend... How come you didn't touch the technicalities? Did you mean to say "Treat a movie like a piece of art" too? Then why is this scientific branding of this movie? Any piece of art even a scientific thing deserves a peer review if not an opinion that contrasts the opinion of the majority. The way you have a right to express your discontent, the author has a right to express his discontent too.
DeleteThe same author didn't bother pointing out the faults in many old movies viz missamma, devadasu. I would like you re-consider your judgement.
ఒప్పుకుంటున్నాను,
ReplyDelete'నేనొక్కడినే' గొప్ప సినిమా, కాదుకాదు అత్యుత్తమ సినిమా.
మహేశ్ బాబు ఈ శతాబ్దపు ఉత్తమ నటుడు.
సుకుమారుడు ఫ్రాయిడ్ కన్నా వందరెట్లు తెలివైనవాడు.
నా తెలివి తక్కువ తనంతో, సినిమాని అర్ధం చేసుకోలేక - బాలేదని విమర్శించాను.
సినిమాని సినిమాగా చూళ్లేకపోయిన అధముణ్ని.
ఇది నా అజ్ఞానం.
ఈ పాపిని మన్నించండి, క్షమించండి.
మీకో నమస్కారం, ఇంక నన్నొదిలెయ్యండి.
నా చావు నన్ను చావనియ్యండి.
This comment has been removed by the author.
ReplyDeleteNice one!
ReplyDeletechala correct ga raasarandi
ReplyDelete