"నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని కావాలన్నదే నా కోరిక."
"ఓ! నువ్వు నరేంద్ర మోడీ అభిమానివా?"
"నరేంద్ర మోడీ ప్రధాని కావాలని అన్నాను గానీ, నేనతని అభిమానినని అన్లేదు. నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేదు.. పైగా వ్యతిరేకిస్తాను కూడా."
"మహానుభావా! నా బుర్ర చాలా చిన్నది, కొంచెం అర్ధం అయ్యేట్లు చెప్పవా?"
"ష్.. ఇది పరమ రహస్యం. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొప్ప స్కెచ్ వేశాను."
"కొంపదీసి బీజేపీ వాళ్ళ మీటింగుల్లో బాంబులూ గట్రా పెడతావా ఏమిటి?"
"అది కాదులే. ముందు నువ్వు నాకో మాటివ్వు. నా ఓటు బీజీపీకే, నువ్వు కూడా బీజేపీకే ఓటెయ్యి."
"ఎందుకు?"
"ఎందుకేమిటీ? మనందరం ఓట్లేస్తే గానీ బీజేపీకి రెండొందల సీట్లు రావు."
"వస్తే?"
"అప్పుడు బీజేపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది."
"అయితే?"
"ఆ మాత్రం తెలీదా? అప్పుడు బీజేపి చచ్చినట్లు జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు తీసుకుని గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు. అదీ నా స్కెచ్. ...................... "
"చెప్పడం ఆపేశావేం?"
"చెప్పడానికి ఇంకేం లేదు."
"అర్ధం కాలేదు."
"ఆ విధంగా మోడీకి జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు చాలా కీలకం అవుతుంది. ఈ ముగ్గుర్నీ శాంతింప చేస్తూ ప్రధానిగా కొనసాగడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. ఈ ఆడవాళ్ళ మధ్య నరేంద్ర మోడీని ఊహించుకో. భలే కామెడీగా ఉంటుంది కదూ."
"నేనలా అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు."
"గాడిద గుడ్డేం కాదు. నరేంద్ర మోడీ కమ్యూనిస్టుల్తోటీ, కాంగ్రెస్తోటీ యుద్ధం చేసి గెలవగలడు గానీ.. ఈ ముగ్గురు ఆడవాళ్ళని గెలవలేడు, అది అసాధ్యం."
"నీ ఆలోచన శాడిస్టిక్ గా ఉంది."
"నాకు మాత్రం ఆ ముగ్గురు ఆడవాళ్ళ మధ్యన నలిగిపోతున్న నరేంద్ర మోడీ ఊహే ఆనందాన్నిస్తుంది. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక మోడీ పని 'నమోన్నమః' అయిపోతుంది. అర్జంటుగా ప్రధాని పదవిని అద్వానీకి 'త్యాగం' చేసేసి, మళ్ళీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతాడు."
"ఆరి దుర్మార్గుడా! ఎంత దూరం ఆలోచించావు!"
"నేనెప్పుడూ అంతే. విశ్వనాథన్ ఆనంద్ టైపు, చాలా స్టెప్పులు ముందే ఆలోచిస్తాను!"
అంకితం :
MACALLAN కి ప్రేమతో..
(photo courtesy : Google)
ఏ బ్లాగ్ చుసిన ఏమున్నది గర్వకారణం
ReplyDeleteసమస్త బ్లాగ్లోకం నమో పారాయణం :))))
మెకాలెన్ మహిమ బాగుంది గురు ,నారి నారి నడుమ మోడి మరి అవ్వక చస్తాడా పిండి మెకాలెన్ మహిమ బాగుంది గురు
ReplyDeleteసూర్యం
మోడీ ముద్దూ ముచ్చట
ReplyDeleteమూడు 'ముళ్ళ' ముచ్చట !
జిలేబి
Chala Bagundi sir
ReplyDeleteరమణ గారూ,
ReplyDeleteవాళ్ళు నలుగురూ కలసిన నాలుగు నెలలు ఎలా ఉంటుందో!!!ఎందుకంటె పెద్దలు "బ్రహ్మచారీ శతమర్కట" అన్నారు.మరి ఒక బ్రహ్మచారి,ముగ్గురు బ్రహ్మచారిణులు .ఎలా ఉండబోతుందంటారు.
నమో బ్రహ్మచారి కాడు. ఈ మధ్య ఇండియన్ యక్స్ ప్రెస్ లో ఆయన ను పెళ్లి చేసుకొన్న ఆవిడతో ఇంటర్వ్యు వచ్చింది.
ReplyDeleteజై మెక్కాలన్! జై నరేంద్ర మోదీ!
ReplyDeleteబై ద వే, ఈ కధ టీ ఆర్ పీ ల కోసం రాసింది కాదు కదా మిత్రమా?!
బి ఎస్ ఆర్
మెక్కాలన్, టెక్సస్
మీరు అటు తిప్పి, ఇటు తిప్పి, ఎటు తిప్పి రాసుకొచ్చినా... నమో నెత్తిన నాలుగు అక్షింతలు వేయడానికే మిక్కిలి ఇష్టపడతారు, శాయశక్తులా కృషి చేస్తారు!! నమో అంటే మీకెంత అభిమానమో?! ఇక పోతే, మీ అభీష్టం నెరవేరాలని రాహుల్ బాబా చేత ‘‘నమోన్నమ:’’ యాగం చేయించాలని అపర కమ్యూనిస్టులు కారత్, బర్దన్ లు ఉవ్విళ్లూరుతున్నాట్ట! :-))
ReplyDeleteముగ్గురి మద్దతు అవసరం రాకపోవచ్చు.
ReplyDeleteలలిత, మమతలలొ ఒకరే గీత దాటించేయగలరని అనుకుంటున్నాను.
వీళ్ళిద్దరూ చాలా బలవంతులు కదా!
ములాయం, లాలూ, మాయావతీల మధ్య యువరాజును ఊహించి చూడండి
ReplyDeleteguruvu gaaru konni comments remove chesaru?
ReplyDeleteఆయనకి ముగ్గురా?!
ReplyDelete‘I like to read about him (Modi)… I know he will become PM'
ReplyDeletehttp://indianexpress.com/article/cities/ahmedabad/i-like-to-read-about-him-modi-i-know-he-will-become-pm/