Monday 10 February 2014

టెన్షన్.. టెన్షన్.. టెన్షన్!


"టెన్షన్.. టెన్షన్.. టెన్షన్! టెన్షన్తో చచ్చేట్లున్నాను."

"ఎందుకు?"

"సమైక్యాంధ్ర కోసం ఓ ఎంపీ సభలోనే ప్రాణత్యాగం చేస్తాట్ట."

"చేసుకొనీ. అది ఆయన ఇష్టం. మధ్యలో నీకెందుకు టెన్షన్?"

"అంతమంది మధ్యలో చావడం కష్టం గదా! కత్తితో పొడుచుకుంటాడా? ఉరేసుకుంటాడా?"

"అది ఆయన సమస్య. స్పీకర్తో చర్చించి ఏదోక మార్గం ఎంచుకుంటాళ్ళే."

"అంతేనంటావా? సమైక్యాంధ్ర కోసం ఇన్ని వేలమంది 5 కె రన్ అంటూ పరిగెత్తినా కేంద్రం దిగి రావట్లేదు. ఇది అన్యాయం."

"సమైక్యాంధ్ర ఒక రాజకీయ సమస్య.. అది పరిగెత్తితే తేలదు."

"అన్నింటికీ ఏదోలా సమాధానం చెప్పేసి తేల్చేస్తున్నావే! సరే, తెలంగాణా బిల్లు పాసవుతుందా? లేదా? అదైనా చెప్పి నా టెన్షన్ తగ్గించు."

"కాంగ్రెస్ ఫ్లోర్ మేనేజ్మెంట్ సరీగ్గా చెయ్యగలిగితే తెలంగాణా బిల్లు పాసవుతుంది, లేకపోతే లేదు."

"బిల్లు పాస్ అవుతుందా? లేదా?"

"ఆ సంగతి చూస్కోడానికి వెంకయ్య నాయుడు, దిగ్విజయ్ సింగులు ఉన్నార్లే. మొన్నెప్పుడో అమ్మకి జ్వరం అన్నావు, తగ్గిందా?"

"ఇంకా లేదు."

"డాక్టర్ ఏమన్నాడు?"

"డాక్టర్ దగ్గరకి ఇంకా తీసికెళ్ళలేదు."

"ఏవిటీ! ఇన్నిరోజులుగా జ్వరం ఉన్నా అంత పెద్దావిణ్ని ఇంకా డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళలేదా!"

"అవును, కుదర్లేదు."

"నీకసలు బుద్ధుందా? పనికిమాలిన సంగతుల గూర్చి టెన్షన్ పడుతున్నావు, కన్నతల్లి జ్వరం నీకు పట్టదా?"

"నేను నీలా స్వార్ధపరుణ్ణి కాను. నాకు ఇంట్లోవాళ్ళ ఆరోగ్యం కన్నా రాష్ట్రప్రజల శ్రేయస్సే ఎక్కువ. అందుకే టెన్షన్ పడుతుంటాను."

(photo courtesy : Google)

6 comments:

  1. తల్లికి మందు (రోగానికండీ బాబూ) పొయని వాడు సమై"ఖ్యాం"ధ్ర గురించి మదనపడుతున్నాడా? ఇలాంటి పుణ్యమూర్తిని కన్న తెలుగు తల్లి ధన్యురాలు. అందరూ ఇలాంటి దేశభక్తి ప్రదర్శిస్తే సగం మంది ముసలివాళ్ళు చచ్చి ఊరుకుంటారు. "ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండీ" అన్న మహాకవి శ్రీశ్రీ కోరిక ఇట్టే నిజం అవుతుంది.

    Disclaimer: no disrespect meant to mothers, united AP supporters, the letter ఖ, alcohol consumers, elderly people, doctors, medical (or other mandu) shops, Telugu language, so called Telugu talli, late Shankarambadi, people dying due to lack of medical treatment, India, patriotism, Sree Sree or similar cultural icons. If I unwittingly managed to insult these dozens of symbols in just two sentences, please put it down to my poor Telugu knowledge :)

    ReplyDelete
  2. ఇప్పుడే అందిన వార్త: కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఆరుగురు ఎంపీలను సస్పెండు చేసింది. వీరిలో నిండుసభలో ప్రాణత్యాగం చేసుకుంటానని శపథం చేసిన మహానాయకుడు కూడా ఉన్నారు.

    దీనితో సదరు ఎంపీ గారికి కత్తా ఉరితాడా, అలాగే సెక్యూరిటీ వారికి తెలియకుండా లోపలి ఎలా తేవాలన్న టెన్షన్ పోయింది.

    ReplyDelete
  3. ప్రాణ త్యాగం చేసుకొంటాననే ఎంపి కోట్లతో (చెవి సారీ) గొంతు కోసుకుంటాడట సార్‌!

    ReplyDelete
  4. భాజపా అతి ముఖ్యమయిన దిమాండు - హైదరాబాదుని యూటీ చెయ్యటం. సొంత పార్టీ మంత్రుల మాటే వినడం లేదు ఈ విషయంలో, భాజపా మాట కూడా వినకపోవచ్చు.

    చర్చ జరిగి వోటింగు పెడీతే ఈ తప్పుల తోనే భాజపా వ్యతిరేకంగా వోటు వేస్తుందేమో?మిగతా ప్రతిపక్ష పార్తీలు కూడా తమ రాష్ట్రాల్లో రేగే తుట్టెల్ని తలుచుకుని వాళ్ళూ వ్యతిరేకంగా వోటు వేస్తారు.కొంతమంది ఇప్పటికే బహిరంగంగా ప్రకటించేసారు గదా!

    కానీ ఇక్కడ అసెంబ్లీ లో బిల్లుని వ్యతిరేకించడానికి కిరన్ మరియు స్పీకర్ గారు చూపించిన మూజువాణీ వోటుతో బిల్ల్లుని గట్తిక్కించాలని చూస్తున్నట్తుగా ఉంది.

    ఈ రోజు గురువారం. ముందు అనుకున్నట్టు ఇవ్వాళ సభలో పెట్టలేదు. అసలు అజెండాలోనే పెట్టలేదు. భాజపా హామీ ఇచ్చాక కూడా బిల్లు సభలో పెట్టడానికే ధైర్యం చాలని దుస్తితి యేర్పడిందా?

    ఈ రోజు కుదరక పోతే మంగళ వారమే నంటున్నది భాజపా, రాష్ట్ర విభజనకి మంగళం పాడెయ్యటానికి కాబోలు:-)తెలంగాణా వాదులు ఆశాభంగానికి కూడా సిధ్ధంగా ఉండాలి.

    ReplyDelete
  5. అది ఆయన సమస్య. స్పీకర్తో చర్చించి ఏదోక మార్గం ఎంచుకుంటాళ్ళే.

    -- ఇంత మంచి సుభాషితాన్ని పై కామెంటర్లు యెవరూ పట్తించుకోలేదు, ఔరా?!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.