"నాకు ఏడుపొస్తుంది."
"ఎందుకు?"
"ఇక హైదరాబాదు మనది కాదు."
"మనకి మన చంద్రబాబున్నాడు. ఇట్లాంటి హైదరాబాదులు పది నిర్మిస్తాడు."
"మెట్రో మనకి కాకుండా పోతుంది."
"పొతే పోనీ, మనకి మన జగన్బాబున్నాడు. ఇట్లాంటి మెట్రోలు పది కట్టిస్తాడు."
"నిమ్స్ కూడా మనకుండదు."
"మనకి మన కిరణ్బాబున్నాడు. ఇట్లాంటి నిమ్సులు పది తెప్పిస్తాడు."
"శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోతుంది."
"వెళ్తే వెళ్ళనీ, మనకి మన కావూరి ఉన్నాడు. ఇట్లాంటి శంషాబాదు విమానాశ్రయాల్ని పది కట్టిస్తాడు."
"మనకిక ఔటర్ రింగు రోడ్డు ఉండదు."
"మరేం పర్లేదు, మనకి మన టీజీ వెంకటేశ్ ఉన్నాడు. ఇట్లాంటి ఔటర్ రింగు రోడ్డులు పది నిర్మిస్తాడు."
"హైటెక్ సిటీ ఇంక మనది కాదు."
"మనకి మన లగడపాటి ఉన్నాడు. ఇట్లాంటి హైటెక్కు సిటీలు పది సృష్టిస్తాడు."
"అవును కదా! గొప్ప లీడర్లంతా మనవైపే ఉన్నారన్న సంగతి మరిచిపొయ్యాను."
"తెలంగాణా వాళ్లకి బోడి హైదరాబాదే వెళ్ళింది. గొప్పగొప్ప లీడర్లంతా మనవైపుకే వచ్చేశారు."
"అయ్యయ్యో! అనవసరంగా ఏడిచానే."
(photo courtesy : Google)
అమ్మయ! ఇక కచరాకి నిమిషం కూలి పనికి లక్షలు ఇచ్చె బాధ కూడా తప్పుతుంది
ReplyDeleteహహ్హా...
ReplyDelete‘‘ఇక, ప్యారడైజు బిర్యానీ, పిస్తా హౌస్ హలీమ్ మనది కాదు’’
’’మరేం ఫర్లేదు. కనుమూరి బాపిరాజు తలచుకుంటే వాటిని తలదన్నేవి వంద తయారు చేయిస్తాడు’’
‘‘ఇక, పవిత్ర హుస్సేన్ సాగరు, పర్యాటక ట్యాంకుబండు మనవి కావు’’
’’మరేం ఫర్లేదు. ఉండవల్లి తలచుకుంటే ఏకంగా అరచేతిలోనే వైకుంఠం చూపెట్టేయగలడు’’
‘‘ఇక, చారిత్రక చార్మినారు, గోల్కోండ ఖిల్లాలు మనకు దూరమవుతాయి’’
‘‘మరేం ఫర్లేదు. రాఘవులు తలచుకుంటే వంద చారిత్రక తప్పులు చేసైనా, చరిత్రంతా తప్పుల తడకని నిరూపించగలడు’’
వగైరా వగైరా కూడా చెప్పుకోవచ్చునేమో :-))
ఇంకాస్త సరదాగా మాట్లాడుకుంటే... ఇటీవలి రెండు ఉద్యమాల సాక్షిగా ప్రస్తుతం రెండు వైపులా గొప్పగొప్ప నాయకులు పుట్టలుపుట్టలుగా పుట్టుకొచ్చారు. ఇక ఫాంహౌజులు, హెరిటేజులు, ల్యాంకోలు, ఇడుపులపాయలు, రింగురోడ్డులు, విమానాశ్రయాల సాక్షిగా గొప్ప నాయకులందరూ మినిమమ్ లక్ష కోట్లు సంపాయించనిదే కనీసం కునుకు తీయకుండా రేయింబవళ్లు శ్రమిస్తారు. ఇక అభివృద్ధే అభివృద్ధి! జనాలకు పండగే పండగ!! అబ్బబ్బబ్బా... ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది, సారీ, కడుపు నిండిపోతోంది!!!
మన దగ్గర అందరూ ఉన్నారు కాని "మా" నహీ హై.
ReplyDeleteఅన్నీ పదేసి కట్టించేది రాష్ట్రాభివృద్దికా? సొంత అభివృద్దికా? హైదరబాద్ పోగొట్టుకున్నందుకు ప్రజలకంటే నాయుడు గారే మరింత ఏడుస్తున్నారు. అభి వృద్దికి ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తుందొ లేదొ నని!
ReplyDeleteఒంగోలులో విమానాశ్రయం వస్తుందని చెప్పి గజం పాతిక వేలకు అమ్మారు. (మనలో మన మాట - బొచ్చ, థాగూర్, అశ్లీలం, డిగ్గీ వీల్లందరికి ఎకరాలు ఎకరాలు ఆ ప్రాంతంలో కుక్కల పేర్లు నక్కల పేర్లతో వున్నయ్యంట?) ఒంగొలు నుంచి గుంటూరుకు వెళ్ళేవాళ్ళు, బస్ స్టాండ్లో ఒక ఎక్స్ప్రెస్, ఒక ఓల్వో నిలబడి వుంటె, పల్లె వెలుగు కోసం ఎదురు చూసే కష్ట జీవులు వున్నారు. వాళ్ళెవరూ విమానాశ్రయం కోరుకోవడం లేదు. మంత్రి పనిలేనిబాక గారి లాగా బాపట్లను సింగపూర్లాగా చూదాలనుకోవడం లేదు. మొత్తానికి వీళ్ళ మొహాలు కూడా ఎవరూ చూడదలచుకొవడం లేదు.
ReplyDeleteచిరంజీవిని వదిలేసారు
ReplyDeletevallu avvani kattina taru vatha Telangana iddamey ..
ReplyDeletePaina cheppi nattu , anni vunna AMMA anedi matram vundadu
18/02/2024
ReplyDeleteవరంగల్:
తెలంగాణ(తెలుగు అనకూడదేమో!!)వాచకం;ఒకటొ అధ్యాయం;రాష్ట్రపిత:-
తెలంగాణ జాతిని 60 సంవస్ట్సరాల ఆంద్రొగ్రవాధుల ధాస్య శ్రుంఖలాల నుండి శాంతియుతంగా సాత్విక పద్దతిలొ పొరాడిన శ్రి శ్రి శ్రి.......
విజయవాడ:
తెలుగు వాచకం;ఒకటొ అధ్యాయం;రాష్ట్ర భగత్ సింగ్:-
తెలుగు జాతి విడిపొగూడదని తన ప్రాణలకి తెగించి పొరాడి ఆ ప్రయత్నం లొ తన రాజ్కీయ జీవితాన్ని త్యజించిన వీర ధీరొదాత్థ శ్రి శ్రి శ్రి.......
నల్గొండ : ఊత్తర తెలంగాణ రాజకీయ నాయకులు దక్షిణ తెలంగాణని పట్టించుకొవడం లేదు కనుక ఫ్లొరైడ్ సమస్య పొలేదు కావున వారికి ప్రత్యేక రాష్ట్ట్రం కావాలి...
ఆనంతఫురం:కొస్తా ఆంధ్ర రాజకీయ నాయకులు రాయలసీమని పట్టించుకొవడం లేదు కనుక తాగునీటి సమస్య పొలేదు కావున వారికి ప్రత్యేక రాష్ట్ట్రం కావాలి...