Saturday 8 February 2014

చంద్రబాబు నవ్వినవేళ..


మొత్తానికి చంద్రబాబు నాయుడు నవ్వాడు. ఆయన చాలా అరుదుగా నవ్వుతాడు. బహుశా నవ్వు నాలుగువిధాల చేటు అన్న సూక్తి చంద్రబాబుకి నచ్చి ఉండవచ్చు. అయితే - ఆయనకి నవ్వకపోవడం ఒక రోగం అన్న జంధ్యాల శుభాషితం తెలిసుండకపోవచ్చు. నవ్వేవాడు మనవాడైతే ఆ నవ్వు.. అప్పుడే పుట్టిన పసిపాపాయి చల్లని నవ్వులా అందంగా కనబడుతుంది. అదే నవ్వు గిట్టనివాడు నవ్వితే.. బొడ్లో బాకు దోపుకుని, గుండెల్లో గుచ్చబొయ్యబోయే ముందు నవ్వే కపట విషపు నవ్వుగా అనిపిస్తుంది. 

నాకు చంద్రబాబు  నవ్వుకు కారణం తెలీదు. బహుశా మోడీ కరచాలనం ఆయనకి ధైర్యం కలిగించి ఉండొచ్చు. పసితనంలో నాకు బయ్యం వేసినప్పుడల్లా అమ్మ చెయ్యి పుచ్చుకుని వదిలేవాణ్ని కాదు. షావుకార్లకి ఇనప్పెట్ట నిండా డబ్బుంటే ధైర్యంగా ఉంటుంది. పేదవాడికి ఆరోజుకి సరిపడా బియ్యం గింజలుంటే ధైర్యంగా ఉంటుంది. రౌడీలకి జేబులో కత్తీ, పొలీసోడికి తుపాకి.. ఇట్లా రకరకాల అయుధాలు కూడా ధైర్యాన్ని కల్పిస్తుంటాయి. 

రాజకీయాలు కఠినమైనవి.. ఇక్కడ సీనియార్టీ అంటూ ఉండదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ బిజేపీలో ఒక కార్యకర్త. ఇప్పుడు చంద్రబాబుకే ధైర్యం ఇవ్వగలిగినంత గొప్ప నాయకుడుగా ఎదిగాడు. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రాబోయే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారు. అప్పటిదాకా ఆయన కష్టపడాల్సిందే. దీనికే వేరే మార్గం లేదు. ఎన్నికల రాజకీయాలు చంద్రబాబుకి కొట్టినపిండి. బెస్టాఫ్ లక్ టు చంద్రబాబు. 

చంద్రబాబు నవ్వినవేళ ఆయనకి నాదో విజ్ఞప్తి. 

అయ్యా, 

మీరు అంతర్జాతీయ స్థాయి నాయకులు. రాష్ట్రానికి (వీలైతే దేశానికి) మళ్ళీ సేవ చెయ్యడానికి మీరు ఉత్సాహపడుతున్నారని తెలుసు. ప్రజలు విజ్ఞులు. మీ చల్లని పాలన మళ్ళీ కావాలనుకుంటే ఓట్లేసి వాళ్ళే గెలిపించుకుంటారు. ఆప్ ఫికర్ మత్ కరో.  

మీ మొహం ఫొటోల్లో ఆందోళనగా, వ్యాకులతతో, అలిసిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. కానీ ఈ ఫోటోలో మాత్రం నవ్వుతూ, చూడ్డానికి భలేగున్నారు. అందుచేత - మీరు ఈ ఫోటోలో ఉన్నట్లుగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నా కోరిక. 

'ఒకపక్క రాష్ట్రవిభజన, ఇంకోపక్క మా పార్టీ అంతర్గత సమస్యలు. బుర్ర వేడెక్కి చస్తుంటే నవ్వెలా వస్తుంది?' అంటారా?

అదేంటండీ! గ్యాస్ బండ బాదుడు, విద్యుత్ కోత, దోమల బాధ.. మాక్కూడా అన్నివైపుల్నుండీ సమస్యలేగా? మరి మేం హాయిగా నవ్వుకోటల్లేదూ?!


(pictures courtesy : Google)

22 comments:

  1. ఓహ్, ఇన్నిరోజులు మీ (పసుపు) రంగు ఎలా తెలీలేదబ్బా ;)

    ReplyDelete
    Replies
    1. ఇప్పటికైనా నా అసలు రంగు కనుక్కున్నారు. కంగ్రాట్స్. :)

      Delete
    2. మీ అసలు రంగు ఇదైతే మీతో జాగర్త గుండాలి, బాబోయ్!

      Delete
    3. మరి డాక్టరుగారి రెండో కంటి రంగేమిటి, రెండో కొడుకు వర్ణమేమిటి, రెండో కొబ్బరిచిప్ప కలరేమిటబ్బా

      Delete
  2. Only one comment ??,Unbelievable.
    Wake up YSR cong. Guys.

    ReplyDelete
  3. మోడీ గారిలొ ప్రధాని కల కనిపిస్తున్నాది అంతె కాకుండా మంచి ద్రుడంగా ఉల్లాసంగా కనిపిస్తునారు ఇవి ప్రధానికి అవసరం

    ReplyDelete
  4. సారీ సార్ కల కాదు కళ

    ReplyDelete
  5. అయ్యా,

    మీరు అంతర్జాతీయ స్థాయి నాయకులు. రాష్ట్రానికి (వీలైతే దేశానికి) మళ్ళీ సేవ చెయ్యడానికి మీరు ఉత్సాహపడుతున్నారని తెలుసు. ప్రజలు విజ్ఞులు. మీ చల్లని పాలన మళ్ళీ కావాలనుకుంటే ఓట్లేసి వాళ్ళే గెలిపించుకుంటారు.
    HEHEHE....... YES ... ప్రజలు విజ్ఞులు. ....!! ... heritage milk ammukovachu.. guarantee.. ee saari ..

    ReplyDelete
  6. "చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ బిజేపీలో ఒక కార్యకర్త. ఇప్పుడు చంద్రబాబుకే ధైర్యం ఇవ్వగలిగినంత గొప్ప నాయకుడుగా ఎదిగాడు."

    చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి ప్రాంతీయపార్టీల నాయకులకి ఇదే సమస్య. వీళ్ళు రాస్ట్రంలో ఎంత ఎదిగినా, ప్రధానమంత్రి అవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు. అదే జాతీయపార్టీలలో ఉంటే, రాష్ట్రంలో ఓడిపోయినా, దిగ్విజయ్ సింగ్‌లా ఏదో ఘనకార్యం చెయ్యొచ్చు.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారి మాట శూలపాణి పోటు!

      Delete
    2. అంటే అర్థం ఏమిటి సార్? (నాకు మరీ అంత తెలుగు రాదు మరి.)

      Delete
    3. కికురె బ్రహ్మాస్త్రాల్లా కాకుండా తగలాల్సిన చోట తగిలె గురి తప్పని ముక్కంటి(శివుడు) శూలం పోటు.

      Delete
    4. బొనగిరి గారు,
      నితిష్ కుమార్ పై మీకు అపారమైన ప్రేమ,ఆదరం,గౌరవం ఉన్నట్లు తెలుస్తున్నాది. మీకు ఆ అభిప్రాయం ఏర్పడటానికి గల కారణాలను, ఆయనలో మీకు నచ్చిన గుణగణాలను గురించి వీలైతే విపులంగా, లేకపోతే నాలుగు లైన్ ల లో రాస్తే చదివి తెలుసుకొంటాము. అలాగే ఇంతక్రితం ఎదో బ్లాగులో భారతదేశంలో "నిజమైన" సెక్యులర్ నాయకుడు లేకపోవటం పెద్ద లోటు అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం లో మీరు చూసిన "నిజమైన" సెక్యులర్ నాయకుడు ఉన్నారో, వారి గురించి చెప్పితే తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.

      Delete
    5. మంచి కండిషన్లో ఉన్న బండి నడపడానికి డ్రైవింగ్ వస్తే సరిపోతుంది. కాని డొక్కు బండిని నడపడానికి డ్రైవింగ్‌తో పాటు మెకానిక్ పనితనం, బోలెడంత సహనం కావాలి. అదే మోదీకి, నితీష్ కి ఉన్న తేడా.

      ఇకపోతే నితీష్ మోదీ కంటే less controversial.
      గైసాల్ రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి మంత్రిపదవికి రాజీనామా చేసాడు. కాని మోది 2002లో ఎన్ని ఆరోపణలు వచ్చినా, సాక్షాత్తు (స్వంత పార్టీ) ప్రధానమంత్రి చెప్పినా వినలేదు.
      నితీష్‌పై అవినీతి ఆరోపణలు తక్కువ. NITలో ఇంజనీరింగ్ చదివాడు.

      ఒకసారి నెట్‌లో సెర్చ్ చెయ్యండి. ఇంకా బోలెడన్ని ఉదాహరణలు దొరుకుతాయి.

      అయినా ఇప్పుడు దేశానికి మోదీయే అవసరం. ఇప్పుడు కావలిసింది సమర్థమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం. నితీష్ స్థిరమైన ప్రభుత్వం ఇవ్వలేడు. అందుకే కనీసం ఈ ఎన్నికలవరకు ప్రజలు లౌకికవాదాన్ని పక్కనపెట్టి మోదిని ఎన్నుకుంటారు.

      Delete
    6. బొనగిరి గారు,
      మీ సమాధానానికి ధన్య వాదాలు. ఈ క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా?
      "భారతదేశంలో "నిజమైన" సెక్యులర్ నాయకుడు లేకపోవటం పెద్ద లోటు అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశం లో మీరు చూసిన "నిజమైన" సెక్యులర్ నాయకుడు ఉన్నారో, వారి గురించి చెప్పితే తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది."

      Delete
    7. ప్రపంచం గురించి నాకు తెలియదు సార్.
      మన దేశంలో ప్రస్తుతం నిజమైన సెక్యులర్ నాయకుడు లేడని చెప్పి ఉంటాను.
      అయినా ఈ సెక్యులరిజం గొడవ మిగతా దేశాల్లో లేదనుకుంటాను.

      Delete
    8. అవును, మనకే ఈ సెక్యులరిజం పిచ్చ.అదీ యెడ్వినా ప్రియుడు గారు పాటించిన ప్రత్యేకమయిన పాప్యులారిటీ కోసం చేసిన స్టంటునే ఇప్పటికీ ఒక గొప్పా ISI మార్కు లాగా చూడ్డం.

      Delete
  7. రమణ గారు,
    నాయకుడంటే కార్యకర్తలకు "నేనుండగా మీకు భయమెందులకు అనే భరోసా", దేశ ప్రజలకు భవిషత్ మీద ఆశ కలిపించే వాడు. నమో మంచి నాయకుడు. కనుక ఆయనని కలవటం తో బాబు గారి కి ఆందోళన తొలగి, మొహం మీద చిరునవ్వు తొంగిచూసింది. పైపోటొలో బాబు గారు చాలా అందం గా ఉన్నాడు.

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. 1. నితీష్‌పై అవినీతి ఆరోపణలు తక్కువ
    WikiLeaks, saying these showed that the Gujarat Chief Minister was “incorruptible” — in fact, “the lone honest Indian politician”.
    http://m.indianexpress.com/news/incorruptible-in-wikileaks-narendra-modi-smiles/766153

    2. NITలో ఇంజనీరింగ్ చదివాడు.
    నాతో పని చేసే మితృలలో డిల్లి స్కూల్ ఆఫ్ ఏకనామిక్స్, ఐ.ఐ.టి. + ఐ.ఐ.యం. ల లో చదివిన వారు ఉన్నారు. వారికి మీలాగే చదువుకొన్న రాజకీయ నాయకులు అంటే చాలా గౌరవం. పెద్ద పెద్ద యునివర్సిటిలలో చదవని వారు వారి కళ్లకు ఆనరు. వారితో మరి ఎంతో గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రస్తుత ప్రధాని ఆర్ధిక మంత్రులు, దేశ ఆర్ధిక వ్యవస్థను ఈ స్థితికి ఎలా తీసుకొచ్చారు? అంటే సమాధానమే ఉండదు. ఈ చదువు కొన్న వారంటే మధ్యతరగతి వారికి గొప్ప అభిమానం ఉంటే ఉండవచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్, కామరాజ్ నాడార్, పి.వి.లు ఏ పెద్ద యునివర్సిటిలో చదివారని? వాళ్లలో ఉన్న లీడర్షిప్ క్వాలిటిస్, దేశం మీద ఉన్న అవగాహన లో సగం కూడాలేవు.ఇలా చదువుకొన్న వారిని తక్కువచేసి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. వాటి విలువ తెలుసు. నా దగ్గరి బంధువులలో హర్వర్డ్ లో చదివిన వారు ఉన్నారు. సుబ్రమణ్య స్వామి ఆరోజుల్లో హార్వర్డ్ లో చిన్న వయసులో పి.చ్.డి పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పాడు.

    తెలుగు సోషల్ మీడీయాలో మీరొక్కరే నితిష్ కుమార్ పేరు ప్రస్తావిస్తూంటే ఆసక్తి కలిగి మిమ్మల్ని అడిగాను. నితిష్ కుమార్ నెట్ లో వివరాలు వెతికి తెలుసుకోవలసిన నాయకుడేమి కాదు. ఆయన నాయకత్వం లో లాలుతో పోటి పడి,మెరుగని నిరూపించుకోవలసిందే. ఆయన బీహార్ని అంత అభివృద్దిచేసి ఉంటే, వైద్యం కోసం బీహార్ నుంచి ప్రజలు ఇంకా డిల్లికి ఎందుకు వస్తారు? బీహార్ కూలీ వాళ్లు డిల్లిలో ఇంకా ఎందుకు అంత ఎక్కువ సంఖ్యలో కనిపిస్తారు?

    ReplyDelete
    Replies
    1. OK. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది.

      Delete

comments will be moderated, will take sometime to appear.