టీవీలో ఇంగ్లీష్ న్యూస్ చానెల్ చూస్తున్నాను. నరేంద్ర మోడీ హిందీలో అనర్ఘళంగా ఉపన్యసిస్తున్నాడు. ఇంతలో సుబ్బు వచ్చాడు.
"కూర్చో సుబ్బూ! మొత్తానికి మోడీ చాలా ఘటికుడు సుమా!" టీవీలో మోడీని చూస్తూ అన్నాను.
"అంతేలే! సూపర్ మేన్ కూడా ఘటికుడే." అన్నాడు సుబ్బు.
"అబ్బబ్బా! మోడీకీ, సూపర్ మేన్ కి పోలికేంటి సుబ్బూ?" చికాగ్గా అన్నాను.
"మిత్రమా! నువ్వు సూపర్ మేన్ సినిమాలు చూశావుగా? సూపర్ మేన్ కి సాధ్యం కానిదేదీ ఉండదు. ఒక్క గుద్దుతో వందమందిని మట్టి కరిపిస్తాడు. గాల్లోకెగురుతాడు, భూమి చుట్టూ చక్కర్లు కొడతాడు, భూకంపాల్ని ఆపుతాడు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.
"సుబ్బూ! నేను సూపర్ మేన్ సినిమాలన్నీ చూశాను, నువ్వు మరీ అంత వివరంగా చెప్పనవసరం లేదు." అసహనంగా అన్నాను.
ఇంతలో కాఫీ వేడిగా పొగలు గక్కుతూ వచ్చింది. కాఫీ నిదానంగా సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.
"సూపర్ మేన్ అనేది ఓ పాపులర్ కార్టూన్ కేరక్టర్. ఓ హాలీవుడ్ స్టూడియో ఆధ్వర్యంలో కొన్ని డజన్ల మంది కొన్ని వందల గంటలు పాటు సూపర్ మేన్ కేరక్టర్ గూర్చి చర్చించుకుని, మరిన్ని మెరుగులు దిద్ది, సినిమా పాత్రగా తీర్చిదిద్దారు. తదనుగుణంగా ఓ నటుడు సూపర్ మేన్ పాత్ర పోషించాడు. ఇందుకోసం ఆ నటుడు ఆకుపచ్చని స్క్రీన్ ముందు వైర్ల సహాయంతో వేళ్ళాడుతూ, గాల్లో ఫైటింగులు చేశాడు."
"అవును, ఈమధ్య స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాలన్నీ ఇట్లాగే తీస్తున్నారు." నవ్వుతూ అన్నాను.
"అలా షూట్ చేసుకున్న ఫిల్మ్, ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్లో రకరకాల హంగులతో ఆకర్షణీయంగా తయారవుతుంది. ఆ విధంగా ఎంతోమంది, ఎన్నోరకాలుగా కష్టపడి ఒక ఎండ్ ప్రోడక్ట్ ని తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఇంకో దశ. మళ్ళీ ఎంతోమంది కూడి, ఆలోచించుకుని.. రిలీజ్ టైమింగ్ ప్లాన్ చేసుకుని, సరైన పబ్లిసిటీ కోసం కృషి చేస్తారు. వీళ్ళందరూ ఆయా రంగాల్లో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్." అన్నాడు సుబ్బు.
"అవును, పబ్లిసిటీక్కూడా భారీ బజెట్ ఉంటుంది." అన్నాను.
"తెరపై సూపర్ మేన్ని చూసేవారికి ఇవేవీ పట్టవు, అనవసరం కూడా. వారు సూపర్ మేన్ చేసే అద్భుత విన్యాసాల్ని సంభ్రమంగా, ఆశ్చర్యంగా మైమరచి చూస్తారు. మిలియన్ల కొద్దీ డాలర్లని ఖర్చు పెట్టిన స్టూడియో వారికి కావాల్సింది కూడా అదే. ఎంత ఎక్కువమంది మైమరచిపోతే స్టూడియోకి అంత లాభం." అన్నాడు సుబ్బు.
"అవును, ఒప్పుకుంటున్నాను. కానీ మోడీకీ, సూపర్ మేన్ తో గల పోలిక ఏమిటి?" ఆసక్తిగా అడిగాను.
"సింపుల్. నిన్నటిదాకా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పాపులర్. అందుకే ఇవ్వాళ బీజేపీ అనే స్టూడియో మోడీని హీరోగా పెట్టి 'ప్రధానమంత్రి' సినిమా తీస్తుంది. ఇందుకు గాను కొన్ని వేలమంది, లక్షల కోట్ల బజెట్ తో, చర్చోపచర్చలు జరుపుతూ, అందుబాటులో ఉన్న అన్నిరకాల ప్రచార సాధనాలు ఉపయోగించుకుంటూ వ్యూహాలు రచిస్తున్నారు. మోడీ ఈ దేశ దరిద్రాన్ని, నిరుద్యోగాన్ని ఉఫ్ మంటూ ఉదేస్తాడు. అభివృద్ధిలో దేశాన్ని అమెరికా కన్నా ముందుకు నడిపించేస్తాడు. పాకిస్తాన్, చైనాల్ని గడగడలాడించేస్తాడు." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.
"గో ఆన్ సుబ్బూ! ఇంటరెస్టింగ్." అన్నాను.
"మోడీ రాకతో దేశం రామాయణం నాటి పుణ్యభూమిగా మారిపోతుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లుతారు, ఆనంద పారవశ్యంతో నృత్యాలు చేస్తారు. ఈ సినిమా బీజేపి పార్టీ తీస్తున్న ఓ మేగ్నమ్ ఓపస్. మనకి కనిపిస్తుంది మాత్రం నరేంద్ర మోడీ అనే ఓ నటుడు. కానీ అతని వెనక స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నవాళ్ళ బుర్రలు మాత్రం పనిభారంతో వేడెక్కి సెగలు పొగలు కక్కుతున్నాయి." అన్నాడు సుబ్బు.
"వర్కౌట్ అవుతుందంటావా?" అడిగాను.
"అది మనమెలా చెప్పగలం? ఎన్నికల సంఘం అన్ని పార్టీలకి, వారి సినిమాల విడుదల తేదీ ప్రకటిస్తుంది. కరెక్టుగా ఆ సమయానికి మోడీ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ పూర్తి చేసుకుని రెడీగా ఉంటుంది, ఉండాలి కూడా. ఆ సినిమా బాగుందా, లేదా అనే సంగతి ప్రజలు నిర్ణయిస్తారు." అన్నాడు సుబ్బు.
"మరి కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీని సూపర్ మేన్ గా ప్రమోట్ చేసుకోవచ్చుగా?" అడిగాను.
"వచ్చు. కానీ సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ.. బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం. ఎన్టీఆర్ తో 'దేవదాసు' తీస్తే అట్టర్ ఫ్లాపయ్యేది. ఎఎన్నార్ తో 'బందిపోటు' తీస్తే నిర్మాతకి పోస్టర్ల డబ్బులు కూడా వచ్చేవి కావు. రాహుల్ గాంధీది చాక్లెట్ ఫేస్, లవర్ బాయ్ ఇమేజ్. కాబట్టి అతన్తో కాంగ్రెస్ పార్టీ అనే స్టూడియో 'రాముడు మంచి బాలుడు' టైపు పాత్రతో ఓ సినిమా తీస్తుంది. అందుకే ఆయన దళితుల పూరిపాకల్లో నిద్ర చేస్తాడు, గిరిజన మహిళల్తో ముద్దు పెట్టించుకుంటాడు. అధికారం అంటే ఇష్టం లేనట్లుగా, మనలో ఒకడుగా ప్రవర్తిస్తుంటాడు. ఇవన్నీ ఇమేజ్ బిల్డింగ్ ఎక్సెర్సైజులు." అన్నాడు సుబ్బు.
"మరి రాహుల్ సినిమా హిట్టవుతుందా?" ఆసక్తిగా అడిగాను.
"తెలీదు. కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లొచ్చినా వాళ్ళ సినిమా సూపర్ హిట్టే. అయినా ప్రస్తుత పరిస్థితుల్లోఇంతకన్నా కాంగ్రెస్ పార్టీ కూడా చెయ్యగలిగిందేమీ లేదు." అంటూ రిస్ట్ వాచ్ చూసుకుంటూ నిలబడ్డాడు సుబ్బు.
"సుబ్బూ! కొన్ని కోట్ల మంది జీవితాల్తో ముడిపడున్న ఎన్నికల్ని నువ్విట్లా సినిమా భాషలో విశ్లేషించడం నాకు నచ్చలేదు, సిల్లీగా ఉంది." అన్నాను.
"అంతేనంటావా? సర్లే! నువ్వు సీరియస్ గా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకో. ఏం చేసేది? నాకు నీ అంత ఓపిక లేదు." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.
(photos courtesy : Google)
good
ReplyDeleteexcellent
ReplyDeletevery nice
ReplyDelete"మోడీ రాకతో దేశం రామాయణం నాటి పుణ్యభూమిగా మారి పోవటం తో జరిగే పరిణామాల్లో మీరు ఒక్కటి వదిలేశారని నేను అనుకుంటున్నా. అది ఏంటంటే ? ప్రజలు రామనామ స్మరణలో మునిగి పోతారు.
ReplyDeleteమొత్తానికి సూపర్ చెప్పాడాండి మీ సుబ్బు!
ప్రతిసారి ఎన్నికలలో లాగా,ఈ సారి ఎన్నికలకి వామపక్షాలు కథ, మాటలు, పాటలు, దర్శకత్వం లో విడిదలయ్యే "థార్డ్ ఫ్రంట్" సినేమా బాక్సులు బయ్యర్లు లేక, వాటాదారుల మద్య వివాదాలు రావటంతో రీళ్ల బాక్సులు కనీసం స్టుడియో కాంపౌండ్ దాటి థియేటర్లలో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఇది ఒక పెద్దలోటు. :)
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteనమో సినేమాను బయ్యర్లు (ప్రజలు) ఎప్పుడో ఫాన్సి రేట్లతో కొనేసాru. నమో ప్రధానమంత్రి సినేమాకి పబ్లిసిటి ఇంచార్జ్,ఆయన పాపులారిటి అమాంతం పెరగటానికి ప్రధాన కారణం, మీరు రాసిన పై వారు కాదు, సాక్షాత్ మన దేశ ప్రధానే ! నమో ను వచ్చే ఎన్నికలలో గెలిపించటానికి గత మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఆ దశలో ఎంతో గ్రౌండ్ వర్క్ ఎప్పుడొ జరిగింది, ఈ మేధావుల T.V. చర్చలు సినేమాలో ఐటెం సాంగ్స్ లాంటివి, ప్రేక్షకులలో సినేమా మీద ఉత్సాహం కలిగించటానికి.
ఐబీయం నుంచి వొచ్చిన ఒక మేధావి నమోకి ప్రచారానికి కావలసిన విషయం, అంటే మన పెళ్ళి కాని ప్రసాదు యేం మాట్లాడీతే దానికి యే రిటార్టు ఇస్తే అదిరిపోద్ది అనే హోం వర్క్ చేసి ఇస్తున్నాడు(ట)! అంతా అమెరికన్ అద్యక్ష తరహా ఇస్టయిల్ చూపిస్తున్నాడు.ప్రజల బతుకుల్ని ఆ స్థాయికి తీసుకు వెళ్ళలేక పోయినా యెన్నికల్ని మాత్రం తీసుకెళ్తున్నాడు.
ReplyDeleteహాలీవుడ్దు రేంజి కదా ఆ మాత్రం భారీగా ఉండొద్దా?
Sir,
ReplyDeleteMeeru Chala Bagundi Ani Oka "option" , Supperb Ani Oka "Option " Kuda Ivvali
Modi "Superman" And Rahul "Ramudu Manchi Baludu" Supperb