Monday, 24 March 2014

పవన్ కళ్యాణ్ - ఎం.జె.అక్బర్


ఈమధ్య పవన్ కళ్యాణ్ అనే తెలుగు సినిమా నటుడికి నరేంద్ర మోడీలో చెగువేరా కనిపించాట్ట, రేపు ఈయనకి చంద్రబాబు నాయుళ్లో భగత్ సింగ్ కనిపించొచ్చు. ఎవర్లో ఎవరు కనిపించినా, అది ఆ సినిమా నటుడి ఇష్టం. ఎందుకంటే ఒక నటుడికి రాజకీయాలు తెలియాల్సిన అవసరం లేదు, నటించడం తెలుసుంటే చాలు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే నటుడి సమస్యని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఎం.జె.అక్బర్ అనే ఒక ఘనత వహించిన ఆంగ్ల కాలమిస్టు ఈమధ్య బీజేపిలో చేరాడు. ఇదేమంత విశేషం కాదు. కొందరు జర్నలిస్టులు ఎలక్షన్ల సమయంలో చాన్స్ (టిక్కెట్టు) దొరికితే రాజకీయపార్టీల్లో చేరిపోతుంటారు. ఈయన గతంలో రాజీవ్ గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీతో సహా ఏవో పదవులు వెలగబెట్టాడు. అటుతరవాత ఈయనకే మొహం మొత్తిందో, కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టిందో తెలీదు గానీ.. బుద్ధిగా పత్రికలకి వ్యాసాలు రాసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. 

ఎం.జె.అక్బర్ గుజరాత్ అల్లర్లకి మోడీని బాధ్యుణ్ణి చేస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు, మోడీని హిట్లర్ తో పోలుస్తూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు. మంచిది, జర్నలిస్టుగా ఆయన నమ్మిన అభిప్రాయాలు నిష్కర్షగా రాసుకున్నాడు, అది ఆయన ఇష్టం. 

ఇప్పుడు బీజేపిలో చేరుతూ (నరేంద్ర మోడీ పంచన చేరుతున్న అన్ని వలస పక్షుల్లాగే) నరేంద్ర మోడీలో ఈ దేశాన్ని భీభత్సంగా అభివృద్ధి చెయ్యబోతున్న భావిప్రధాని కనిపిస్తున్నాడని వాకృచ్చాడు. సిట్, సుప్రీం కోర్టులు నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చాయి కావున నరేంద్ర మోడీ అమాయకుడని కూడా సెలవిచ్చాడు! 

అలాగా? మరి ఈయనగారు దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తమ పని పూర్తి కానిచ్చేవరకూ ఆగకుండా, ఈలోపుగానే అదేపనిగా నరేంద్ర మోడీని ఎందుకు తిట్టిపోసినట్లో! డబ్బు కోసమా? కీర్తి కోసమా?

పవన్ కళ్యాణ్ కి చెగువేరా, భగత్ సింగ్, గద్దర్, నరేంద్ర మోడీ.. వీళ్ళెవరూ తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అయన ఒక సినిమా నటుడు కాబట్టి. అయితే - చాలామంది (తమకి తెలీకపోయినా) కొందరు ప్రముఖుల పేర్లు అలవోకగా ప్రస్తావిస్తుంటారు.. తమక్కూడా ఒక 'మేధావి' అనే గుర్తింపు వస్తుందని. కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ అర్ధమయ్యాడు. 

ఎం.జె.అక్బర్ మాత్రం పవన్ కళ్యాణ్ వంటి అమాయకుడు కాదు. ఆయన తెలివైనవాడు, మేధావి. అన్ని విషయాలు బాగా అధ్యయనం చేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు, కాలమిస్టు, రచయిత. ఆయనకి మోడీ నిన్నటిదాకా దెయ్యంలాగానూ, ఇవ్వాళ్టినుండి దేవుళ్ళాగానూ కనపడ్డంలో మాత్రం పూర్తిగా స్వార్ధప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా పచ్చి అవకాశవాదం, పాత్రికేయ దిగజారుడుతనం.


(photos courtesy : Google)

23 comments:

  1. u v 2 see so many in future

    ReplyDelete
  2. మీ భాషలో చెప్పాలంటే...
    ఒకరు Delusional disorder తో
    మరొకరు Bi polar disorder తో బాధపడుతున్నట్టుంది!
    ఈళ్లకి ఏదన్నా మాంచి బలమైన థెరపీ సజెస్ట్ చేయండి, రమణ గారు :-))

    ReplyDelete
  3. ప్రస్తుతానికి మోదీ సీజన్ నడుస్తోంది. మోదీని ముట్టుకున్నంతనే గతంలోచేసుకున్న పాపాలన్నీ పటాపంచలౌతాయన్నట్లు భావిస్తున్నారు. పవన్ సంగతే చూడండి. నిన్న మొన్నటివరకూ ఆయనకోదారీతెన్నూ లెవని బోలెడు విమర్శలు చేశారు. ఒక్కసారిగా మోదీ పంచన చేరేసరికి విమర్శకులందరూ కాం ఐపోయారు. నేను చెప్పేదేమిటంటే ఇదే సదవకాశం ఎక్కడెక్కడివారూ మోదీపంచనచేరి పునీతులవడానికి. అక్బర్ గారికీ ఎవో అవసరాలుండేఉంటాయి మరి.

    అబిరుద్ది. అదొక్క లేబుల్ చాలు మనకు. ఆ ముసుగులో ఎంతటి అన్యాయాన్నైనా, అవ్యవస్థనైనా భరించగలం. నిజానిజాలు అఖ్ఖర్లేదు.

    ReplyDelete
  4. ఎం.జె.అక్బర్‌కి మోడీ నిన్నటిదాకా దెయ్యంలాగానూ, ఇవ్వాళ్టినుండి దేవుళ్ళాగానూ కనపడ్డంలో మాత్రం పూర్తిగా స్వార్ధప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా పచ్చి అవకాశవాదం, ......దిగజారుడుతనం.

    చిత్తం మహాప్రభో. మనదేశంలో ఒక రాజకీయనాయకుదు అవటానికి ఈ‌ (అ)యోగ్యతలు చాలవా చెప్పండీ? ఐనా మన రాజకీయనాయకుల (అవ)గుణాలు వర్ణించటానికి ఆదిశేషుడికి కూడా నోళ్ళు సరిపోవే!

    ReplyDelete
  5. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టు కోవాలి.

    ReplyDelete
  6. ఆయన మేధవి గనుకనే మోడి సరసన చేరాడు. యం.జె అక్బర్ ఒక మంచి స్కాలర్. ప్రపంచ వ్యాప్రంగా సెమినార్లలో తరచు పాల్గొంటుంటాడు. ఆయన కి గల్ఫ్ , యురోప్, అమెరికా దేశాలలో మార్పులపైన పూర్తి అవగాహన ఉంది. వాటిన్నన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎంతో దూరదృష్టితో ఆలోచించి తీసుకొన్న నిర్ణయం. ప్రపంచ రాజకీయాలు అవగాహన లేని వారికి అవకాశవాదంగా కనిపిస్తుందేమో!

    ReplyDelete
    Replies
    1. "వాటిన్నన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎంతో దూరదృష్టితో ఆలోచించి తీసుకొన్న నిర్ణయం"

      సిధ్ధాంతాల ఆధారంగాకాక, 'దూరదృష్టితో ఆలోచించి' నిర్ణయాలు రాజకీయ stance తీసుకోవడాన్నే అవకాశవాదమంటారు.

      Delete
    2. అలాగా! ఆయన అవకాశవాది అని నిర్ణయించాల్సింది కాలం. చేరిన మొదటి వారంలోనే ఎలా నిర్ణయిస్తారు? అవకాశ వాదం అంటె యువనేత డిల్లి లో సి.పి.ఐ.యం వారి కార్యాలయానికి వెళ్లితే బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.

      Delete
  7. //పవన్ కళ్యాణ్ అనే తెలుగు సినిమా నటుడికి నరేంద్ర మోడీలో చెగువేరా కనిపించాట్ట, రేపు ఈయనకి చంద్రబాబు నాయుళ్లో భగత్ సింగ్ కనిపించొచ్చు.//
    ఉన్నట్టుండి ఈయనమాత్రం వాల్లలో వీల్లు ఎందుకు కనిపించాలి? వాళ్లు వాళ్లలాగే ఎందుకు కనిపించలేదు? కనిపించలేదంటె ఎదో మర్మమం ఉండి ఉంటుంది కదా? ఆమర్మం మనకు ఎందుకుకనిపించలెదు? నాకు ఇన్ని రోజులు తెలవదు వీలనేనా సార్‌ వైట్‌ కాలర్‌ క్రిమినల్‌ అనేది? మీరేదో యాష్ట పడి పోతున్నారు గాని , ఆ మోది గాని ఏమి మేదావి కాదా? - అదె మన బుర్రల్లో మెదడు లేకుందా చేయ డానికి?

    ReplyDelete
  8. //ఇది ఖచ్చితంగా పచ్చి అవకాశవాదం, పాత్రికేయ దిగజారుడుతనం//
    అప్పుడప్పుడు ఒపీనియన్లు చేంజ్ చేయ్యనిదే పొలిటీషియన్ కానేరడు అని పెద్దాయన ఎప్పుడో చెప్పారు కదండి

    ReplyDelete
  9. విషయం గూర్చి తెలీనివాడు ఏం చెప్పినా అతని గూర్చి పట్టించుకోనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ అనే నటుడు ఈ కోవలోకి వస్తాడు. అయితే - మనం మన అజ్ఞానాన్ని చాటుకోడానికి పైసా ఖర్చు లేకుండా బ్లాగు రాస్తాం, పాపం! పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టాడు!!

    మోడీ, రాహుల్ గాంధీ లాంటివాళ్ళు రాజకీయ అవసరాల రీత్యా రోజుకో మాట చెబుతారు. వాళ్ళని పట్టించుకునేవాడు పట్టించుకుంటాడు, లేకపోతే లేదు. అది చెప్పేవాడికి, వినేవాడికి మధ్య సమస్య.

    కానీ - ఎం.జె.అక్బర్ మేధావి, స్కాలర్, ప్రపంచవ్యాప్తంగా సెమినార్లలో గెస్ట్ లెక్చర్లు ఇచ్చే మహనీయుడు. ఒప్పుకుంటున్నాను, నేన్రాసిందీ అదే! మరి ఈ స్కాలర్ నిన్నటిదాకా గుజరాత్ అల్లర్లకి కారణం మోడీనే అని పదేపదే ఎందుకు రాశాడు? అంటే అప్పటికీయన ఇంకా స్కాలర్ కాలేదా!?

    నాకు ఇట్లాంటి అవకాశవాద, నికృష్ట మేధావులు అంటే అసహ్యం, రోత, కంపరం. ఇట్లాంటి నీచులు దేశానికి చాలా ప్రమాదం అని నమ్ముతున్నాను.

    ReplyDelete
  10. యం.జె.అక్బర్ స్కై బాబా కాదు. పట్టిన కుందేలుకు మూడే కాళ్లని మొండిగా నమ్మటానికి. వాదించటానికి. ఆయన బిజెపి లో చేరటానికి గల కారణాలు చెప్పాడు. యుట్యుబ్ లో విడియోలు ఉన్నాయి.చూసి అభిప్రాయం ఎర్పరచుకోండి. ఇక మీ అభిప్రాయల గురించి , నా అభిప్రాయం. మీ బ్లాగు 90% పైన చదివాను. మీ ఆలోచన విధానం పైన బ్రాహ్మణ ఆలోచన విధాన ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదా|| మీలాంటి వారు యవ్వనంలో అభ్యుదయ విధానలకు అకర్షితులై 50వ పది వచ్చేసరికి, ప్రపంచం మారదని అర్థమై, ఆధ్యాత్మికర వైపు ఆకర్షితులై, మీభావాలకు అనుగుణంగా ఉండే పేదరికంలో నివసించి పేరు తెచ్చుకొన్న కబీర్, గోచి గుడ్డ కట్టుకొని జీచించినన వేమన, ఉన్నదానితో తృప్తి గా జీవించిన పోతన లాంటి వారి తత్వం వయసు పెరిగే కొద్ది ఆకర్షితులౌతారు. మీలాంటి వారికి సత్యసాయిబాబా బురిడి బాబా ల అనిపించవచ్చు. ఇప్పటి వరకు మీ గురించి నేనురాసిందని నిజమని మీకనిపిస్తే మీరు యం.జె.అక్బర్ గారిని బ్రాహ్మణ విలువల కోణంలో చూస్తున్నరని అర్థం. కాని యం.జె.గారు ఇండియన్ ముస్లిం. వారి ఆలోచన విధానం వేరు. ప్రపంచ వ్యాప్తముస్లిం దేశాలలో శాంతి అన్నది లేదు, ఒక్క ఇండియా తప్పించి. ఆయన వారి వర్గం హితంకోరి బిజెపి లో చేరారు. అధికారంలోకి వచ్చే బిజెపి తో లక్షలకోట్ల స్కాముకు చేసే సెక్యులర్ పార్టిల మాటలు విని , జగడాలు వేసుకొంటే ముస్లింలకు కలిగే లాభం ఎమీటి ? పేదరికం , నిరుద్యోగం పెరగడం తప్ప.
    ఇతని వలన బిజెపి కి వంద వోట్లు పడతాయన్న గేరంటి లేదు. మీలాంటి వారి నుంచి తిట్లు తప్ప. కాని ఇతను పార్టిలో వారి వర్గం వాదనను అవకాశమొస్తే ఇంఫ్లు యన్స్ చేయగల సమర్ధుడు.

    ReplyDelete
    Replies
    1. జయహో గారూ,
      బ్రాహ్మణ ఆలోచనా విధానం అని ఒక మూస విధానం ఒకటి ఉందని తెలియజేసినందుకు ధన్యవాదాలు. వేమన, కబీరు ల జీవితాలు, లేదా పోతన తత్వాన్ని ఇష్టపడడం ఇవేనా? నాకు తెలిసి అధ్యాత్మికత కీ, బ్రాహ్మలకీ పెద్ద సంబధం ఉన్నాట్టు కనపడదు. ఉంటె, మీరన్న ఈ 'బురిడీ బాబా లకీ ఇంతమంది అనుచరులు, సహచరులూ ఉండరు.
      అక్బర్ మాట (తను అన్న మాటలే) మార్చి మోడీ తో చేరడం తప్పు అన్న వాదనని విభేదించి విమర్శించడానికి అతను ముస్లిం లేదా మరొకటి అన్న విషయం తో వాదించడం అవసరమా? ఒకవేళ అవసరమైతే అలా మాట మార్చి గోడ గెంతడం కరక్టా? మీరు విషయాన్ని కుల మత ప్రస్తావన తో తప్పుదారి పట్టిస్తున్నారనిపించి ఈ సమాధానం

      సీతారాం

      Delete
  11. చెప్పటం మరచాను. ఆయన వలన ప్రమాదం అని మీరంటున్నారు. అది మీ అపొహ. అతను రాసిన సమగ్ర సాహిత్యాన్ని ఒక లksha mamdi కూడ cadivi ఉంటే ఎక్కువే.120 కోట్ల జనాభ గల దేశంలో వీరి ప్రభావం ఎంత? ఆయన ఇంఫ్లుయెన్స్ చేయగలిగిన వారు ఇంటెలెక్త్యూల్స్ మాత్రమే. ఏ ఇద్దరి ఇంటెల్క్త్యు వల్స్ ఒక విషయం పై ఏకభిప్రాయానికి వచ్చరా?రచయితలు వారిని ఎక్కువ గా అంచనా వేసుకొంటారు. ప్రజలు వాస్తవానికి దగ్గరగా జీవిస్తారు, ఎంత విలువల గురించి మే ధావులు ప్రచారం చేసినా మోడి పాలన చూసి వోటు వేశారు. అలాగే బాబు గారు రైతులకు చేసిన సేవని వారు మరచిపోలేదు. బాబు గారు ఎన్ని వాగ్దానలు చేసిన యువనేత పైన మోజు తగ్గటంలేదు. ప్రజలు నిజమైన సెక్యులరిస్ట్ లు వారికి లాభంలేకపోతే గెలిపించరు.

    ReplyDelete
  12. mee abhiprayam ni intha spashtanga ,kachithanga cheppina vidhananiki ..abhinandanalu

    ReplyDelete
  13. రమణ గారు,
    మన దేశం లో ని మేధవులకు గుజరాత్ అల్లర్ల లో ముస్లింల జరిగిన అన్యాయలంటు ఏకరువు పెట్టటమే వారి అభ్యున్నతి పాటు పడుతున్నట్లు, వారి శ్రేయోభిలాషు లైనట్లు బిల్డప్ ఇస్తారు. ఆ అంశాన్ని కొంచెం పక్కన పెట్టి ,రానున్న కాలంలో ఇండియన్ ముస్లింలు, భారతదేశ నిర్మాణంలో ఎటువంటి పాత్రను పోషిస్తే బాగుంటుందో, దానికి వారేమి చేయాలో మీరు విశ్లేషిస్తే చదవాలని ఉంది.

    ReplyDelete
  14. ento lendi ee madhya prathi okkaru party name pettadam rendu speech lu ivvadam tharvatha emi cheyyalekapovadam alavatu ayyindhi. dochukunnodiki dochukunnantha. speech icchetappudu matram andaru nijayithi parulalane matladutharu... em chestham mana karma kakapothe

    ReplyDelete
  15. పవన్ కళ్యాణ్ ని అమాయకుడు, అజ్ఞానిని చేసేందుకు బాగా ప్రయత్నించారు...సమస్య ఏంటంటే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది...అవునులే యాక్టర్లకు రాజకీయాలు తెలియాల్సిన అవసరం లేనట్లే డాక్టర్లకు రాయడం తెలియాల్సినవసరం లేదు..మీ సమస్యకూడా అర్థం అయ్యింది.. కాబట్టి శ్రీమాన్ Y.V.Ramana అనే ఓ (పని లేక or పని లేని)డాక్టరుకి మెడికిల్ షాపువానికి అర్థమయ్యేలా ప్రిస్కిప్షన్ రాయడం తెలిస్తే చాలు...

    ReplyDelete
    Replies
    1. ఒప్పుకుంటున్నాను.. నాకు పని లేదు, రాయడం రాదు. మరి - మీకిక్కడేం పని?!

      Delete
    2. చరణ్ గారూ,
      రమణ గారికి మందుల షాపు వారికి అర్థమయ్యేలా ప్రిస్క్రిప్షన్ రాయమని సలహా ఇవ్వక్కరలేదు. పనిలెకుండా నే ఇంత బాగా రాసే ఆయన, పని ఉనిది ఇంకెంత బాగా రాస్తారో..
      ఇంక పవన్ కళ్యాణ్ గురించి, అతను అమాయకుదూ కాదు అజ్ఞానీ కాదు. అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ కాళ్ళు పట్టుకుంటే ఎవరు గెలిచినా స్వలాభానికి లొటు లేకుండా ఉంటుందని తెలిసిన మేధావి.
      అసలు అజ్ఞానులు మనమే. అన్నీ తెలిసీ తెలియనట్టు బతుకుతూ ఉంటాం.

      సీతారాం

      Delete
  16. య . ర . గారు, కుష్వంత్ సింగు ల్నీ అక్బర్ లనీ గుడ్డెద్దు చేలో పడినట్టు చదవటమే అసలైన మేధావి తనం అని బాగా నమ్మిన "మేధావి" లాగున్నారు. అది పాత ఫ్యాషన్ మాస్టారూ..!!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.