Tuesday, 6 May 2014

AC సర్వే


ఇది ఎన్నికల సమయం. రోజుకో సర్వే, గంటకో కథనం. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వాళ్ళ రిపోర్టు లాగా విషయం మారిపోతుంది. 

నేను మాత్రం ఖాళీగా ఎందుకుండాలి? కాబట్టి - ఈమధ్య నేనూ ఒక సర్వే చేశాను. దీని పేరు 'AC సర్వే' (అంటే AC రూములో కూర్చుని నిర్వహించిన సర్వే అని అర్ధం).

నాకు psephology తెలీదు. కావున, నా methodology నేనే తయారు చేసుకున్నాను.

exclusion criteria : 

1. రెడ్డి, కమ్మ కులస్తులు (ఈ రెండు కులాల వారి అభిప్రాయం కనుక్కోడం అనవసరం.. కారణం అందరికీ తెలిసిందే).  

2. PG స్థాయి చదువు (బాగా చదువుకున్నవాడు ఛస్తే నిజం చెప్పడు).  

inclusion criteria :

1. పై రెండు వర్గాలకి చెందని వారు. 

2. వ్యవసాయ కూలీలు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవారికి ప్రాముఖ్యం. 

sample size : 40 - 50 

నేను వాళ్లకి బాగా తెలుసు కాబట్టి.. నా ప్రశ్నకి చాలామంది స్పష్టంగా సమాధానం చెప్పారు, కొందరైతే నన్నుకూడా వాళ్ళు సూచించిన పార్టీకే ఓటెయ్యమని అడిగారు. 

నాకు ఓటర్లలో స్పష్టమైన ట్రెండ్ కనిపించింది. ఆ ట్రెండ్ ఇక్కడ ఇస్తున్నాను.

(> అన్న గుర్తుకి more than అని అర్ధం.)  

1. గుంటూరు టౌన్ లోకల్, జిల్లాలో ఇతర పట్టణాలు.. TDP > YSR CP 

2. గ్రామీణ ప్రాంతాలు.. YSR CP > TDP 

3. కుర్రాళ్ళు.. YSR CP > TDP 

4. మధ్యవయసువారు (30 - 65).. TDP > YSR CP

5. ముసలివారు (above 65).. TDP = YSR CP

6. BC ఓటర్లు.. TDP = YSR CP

7. SC ఓటర్లు.. YSR CP > TDP

8. దళిత్ క్రిస్టియన్లు.. YSR CP only. 

9. ముస్లిం ఓటర్లు.. YSR CP > TDP 

10. చిన్నఉద్యోగులు.. TDP > YSR CP

కొన్ని అబ్జర్వేషన్లు :

1. ఆరోగ్యశ్రీ, fee reimbursement స్కీముల వల్ల లబ్ది పొందిన కుటుంబాలవారు పూర్తిగా YSR CP పక్షాన ఉన్నారు. 

2. నిరుద్యోగులు (ముఖ్యంగా ఇంజినీరింగ్ చదివినవాళ్ళు) పూర్తిగా TDP వైపున్నారు. 

limitations :

ముందే చెప్పాను.. ఇది పూర్తిగా AC సర్వే. కావున, reliability & validity - ???????????? (0 - 100 ఎంతైనా కావచ్చు). 

conclusion : 

TDP, YSR CP లలో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది!

క్రీడల్లోలా రాజకీయాల్లో సిల్వర్ మెడల్ లేదు. ఒకటే మెడల్.. అధికారం. అందుకే ఈ రెండు పార్టీలు భీభత్సమైన డబ్బు బలంతో (రేపు రాష్ట్ర 'పునర్నిర్మాణం'లో వడ్డీతో సహా నాలుగింతలు వసూలు చేసుకుంటాయి లేండి), కండ బలంతో అధికారం కోసం పోరాడుకుంటున్నాయి.

బాబ్బాబు! మీ ఓటు ఒక వజ్రాయుధం.. అంచేత - మీట నొక్కండని ఎన్నికల కమిషన్ వారు (టార్గెట్లు పెట్టుకుని మరీ) జనాల్ని బ్రతిమాల్తున్నారు. మధ్యతరగతి మేధావులు కూడా మీట నొక్కకపొతే మనిషివే కాదన్నట్లు ప్రచారం చేస్తున్నారు. కావున - మీరు కూడా మీ ఓటేసి, వేలు పైకెత్తి ఫోటో దిగి ఫేస్బుక్కులో పెట్టుకోండి.. చాలా లైకులొస్తాయి. 

చివరి మాట :

డా.బి.హరిబాబు, ఆర్తోపెడిక్ సర్జన్, గుంటూరు. నాకు ఇంటర్ నుండి క్లాస్మేట్, అత్యంత అత్మీయుడు. 

నా సర్వే ఫలితాలు మా హరిబాబుకి ఫోన్లో చెప్పాను - 'ఇంకెందుకాలస్యం? పెట్టెయ్ నీ బ్లాగులో!' అన్నాడు.. పెట్టేశా! 

(picture courtesy : Google)

14 comments:

  1. I am no psephologist either, but, from reading more Indian newspapers than I need to these days, I concur. YSRC will get the largest vote, numbers wise. Seats I am not so sure. I would think TDP/BJP combine will edge out YSRC in Loksabha seats.

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతానికి - 'వేచి చూడుడు'.

      Delete
  2. we should vote for the guy who comes out of hyderabad in 2months. i doubt on these two guys. If really they come out of hyderabad in 2months it would be 50K govt employees+25k govt corporation employees will be out of hyd creating a new economy with them

    Also if raiway zone comes out, it would be ~20k jobs moving from hyd. Lets see. it would be tough for AP but its the way to go for real development.

    If you see namaste telangana they are worried about some 5000 posts in 6lakh posts of telangana which are occupied by non locals as per 371D.

    ReplyDelete
  3. కరెంటు లేక ఫాన్లే తిరగట్లేదంటున్నారు.
    మీ AC ఎలా పనిచేస్తోందండి?

    ReplyDelete
    Replies
    1. మీరు మరీను! సీమాంధ్రలో జెనరేటర్లు ఉండవా? ఉంటాయి కదా!

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. పోష్టులో కిరికిరి ఉంది మాష్టారూ! AC లో కూచుని చేశా నంటున్నారు,వాళ్లనీ వీళ్ళనీ కలిసి ఒపీనియన్స అడిగా నంటున్నారు - రెంటికీ పొసగదే?

    ReplyDelete
    Replies
    1. కిరికిరి! లేదండి లేదు, ఇది పూర్తిగా నేను నా consultation room లో కూర్చుని, పేషంట్లతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ సేకరించిన సమాచారం.

      నేనెవ్వరినీ కలవలేదు, వాళ్ళే నన్ను కలిశారు. :)

      Delete
    2. మానసిక చికిత్స పొందుతున్న వారిని మాత్రమె అడిగే సర్వే శాస్త్రీయం కాదేమో?

      Delete
    3. మీకసలా సందేహం ఎందుకొచ్చింది!? నా సర్వే పూర్తిగా అశాస్త్రీయం.

      Delete
    4. @Jai,

      శాస్త్రీయం కాకపోయినా.. కొన్ని గొప్ప విషయాలు కనిపెట్టాను. కాంగ్రెస్, జైసమైక్యాంధ్ర, కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావు! మీరు నాకు ఆ క్రెడిట్ ఇవ్వాల్సిందే. :)

      Delete
    5. ఈ పార్టీలు (అలాగే లోక్సత్తా & ఇంకా పుట్టని పవన్ కళ్యాణ్ పార్టీ) పొరబాటున అధికారంలోకి వస్తాయేమోనని ఆంధ్రలో చాలా మంది హడలి చస్తున్నారు. మీరు ఎంతో కష్టపడి ఆ అనుమానాలు నివృత్తి చేసినందుకు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే!

      Delete
  6. బియ్యం మొత్తం వత్తి చూడాలా. ఒక్క గింజ చాలదూ. మీ సర్వే రిజల్ట్స్ కరక్టే. బాబు, జగన్ ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు.

    ReplyDelete
    Replies
    1. అయితే ఆడ, లేపోతే మగ!

      మొత్తానికి మీరు కూడా నా అంత తెలివైనవారుగా నిరూపించుకున్నారు. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.