Sunday, 25 May 2014

మోడీ విమర్శకుల్లారా! ఖబడ్దార్


"ఒరే సూడో సెక్యులరిస్టూ! నీకు దమ్ముంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గూర్చి రాయి." సవాలు విసిరాడు నా మిత్రుడు.

నా మిత్రుడు ఆరెస్సెస్ సభ్యుడు, మోడీకి వీరాభిమాని. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తాడు. రాజకీయంగా ఈ అభిప్రాయాలు కలిగి వుండటం అతని హక్కు. ఆ హక్కుని ఎవరైనా గౌరవించాల్సిందే, ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు.

కొందరు అమాయకులు మనకి భావ ప్రకటనా స్వేచ్చ ఉందని అనుకుంటారు. కానీ ఆ స్వేచ్చ వంకాయ కూర గూర్చో, సినిమాల గూర్చో రాసినప్పుడు మాత్రమే ఉంటుంది. రాజకీయ భావాలకి మాత్రం స్వేచ్చ ఉండదు, ఈ స్వేచ్చ దేవతా వస్త్రాల్లాంటిది. (రాజకీయాలంటే రోజూ తెలుగు పత్రికలు రాసే జగన్, చంద్రబాబుల నామస్మరణ, విమర్శల పరంపర కాదు).

బాల్ థాకరే చనిపోయినప్పుడు ముంబాయిలో సెలవు ప్రకటించడాన్ని ఒక యువతి ఫేస్ బుక్ లో ప్రశ్నించింది, ఇంకో అమ్మాయి ఆ అభిప్రాయానికి లైక్ కొట్టింది. ఏవో సెక్షన్ల కింద ఇద్దర్నీ అరస్టు చేశారు. వాస్తవానికి ఆ అమ్మాయిలు లేవనెత్తిన ప్రశ్న విలువైనది, వివరంగా చర్చించదగ్గది. కానీ, దైవసమానుడైన థాకరే గూర్చి ప్రశ్నించడమే నేరంగా ముంబాయి పోలీసులు భావించారు.

ప్రొఫెసర్ U.R. అనంత మూర్తికి నరేంద్ర మోడీ రాజకీయాలు నచ్చవు. అందుకు ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆ కారణాలు అందరికీ నచ్చాలని లేదు కూడా. మోడీ గనక ప్రధాని అయితే తాను దేశం వదిలేస్తానన్నాడు. ఇదేమీ నేరపూరితమైన ప్రకటన కాదు. అనంత మూర్తి రాజకీయ అభిప్రాయాల గూర్చి చర్చ ఎంత జరిగిందో తెలీదు కానీ..  ఆయన్ని ఎగతాళి చెయ్యడం, కించపరచడం మాత్రం ఒక ఉద్యమంలా సాగింది. పాపం, ఇవ్వాళ అనంతమూర్తి పోలీసువారి రక్షణలో ఉన్నాడు!

మనకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగింది. ఇందువల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ సోషల్ మీడియా వల్ల, ఎమర్జన్సీలో ఇందిరాగాంధీలా రాజకీయ వ్యతిరేకుల్ని అణిచెయ్యడం కుదరకపోవచ్చు (అనుకుంటున్నాను). అలాగే - కార్పోరేట్ మీడియా వండి వారుస్తున్న వార్తల్ని మాత్రమే చదివి ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాల్సిన దుస్థితి తప్పింది.

అయితే - ఇదే ఇంటర్నెట్ అనేక ముసుగు వీరుల్ని కూడా తయారు చేసింది. ఈ వీరులు తమకి నచ్చని భావాలు వ్యక్తం చేసినవారిని హీనంగా తిడతారు. ఆ రాసిన వ్యక్తిని చికాకు పెట్టడమే వీరి ఉద్దేశం. ఇదొక 'పధ్ధతి' ప్రకారం జరుగుతున్న కుట్ర. గత కొన్ని నెలలుగా రాజకీయంగా తమ నాయకుణ్ని వ్యతిరేకించిన వారిని ఎంత ఛండాలమైన భాషలో వీరు తిట్టారో చూస్తే ఆందోళన కలుగుతుంది. 

నేనామధ్య ఒక పాపులర్ తెలుగు నటుడి సినిమా చూశాను. నాకా సినిమా నచ్చలేదు, అదే అభిప్రాయం నా బ్లాగులో రాసుకున్నాను. కానీ - అప్పుడు నామీద తిట్ల పురాణంతో వేరేచోట ఒక చర్చ నడిచింది. నాకు కోపం, ఆశ్చర్యం కలిగాయి. అయితే ఈ సినీనటుల అభిమానం ఉన్మాద స్థాయిలో ఉంటుందనీ, వారి 'మనోభావాలు' దెబ్బ తిన్నప్పుడు పిచ్చికుక్కల స్థాయిలో మొరుగుతారనీ అర్ధం చేసుకున్నాక పట్టించుకోవటం మానేశాను.

మొన్న ఎన్నికల సందర్భంగా జగన్, చంద్రబాబుల్ని తిట్టడంలో రెండు కులాల మధ్య భీభత్సమైన బూతుల పోటీనే జరిగింది.

అంచేత - ఇప్పుడు నేను మోడీపై ఏదన్నా రాస్తే, అందులో పొరబాటున (నా ఖర్మ కాలి) మోడీ భక్తులకి నచ్చందేదైనా ఉంటే, వారితో తిట్టించుకునే ఓపిక లేదు.

అదే నా స్నేహితుడితో అన్నాను.

"నేను నరేంద్ర మోడీ గూర్చి ఎందుకు రాయడం? మీ ఆరెస్సెస్ వాళ్ళతో కలిసి 'జై శ్రీరాం! శిరో మార్!' అంటూ కవాతు కర్రల్తో నా బుర్ర రాం కీర్తన పాడించటానికా? అందుకే ఒప్పేసుకుంటున్నాను - నాకు నరేంద్ర మోడీ గూర్చి రాసేంత దమ్మూ, ధైర్యం లేదు. నన్నొదిలెయ్! అయినా - నీ అభిమాన నాయకుడు అద్భుత విజయం సాధించాడు. మీ సంఘ పరివారం మోడీ విమర్శకుల్ని భయపెట్టడంలో కూడా గొప్ప విజయం సాధించింది. ఈ విజయాల్ని ఎంజాయ్ చెయ్యక నాతో ఈ చాలెంజ్ లేమిటి?" నవ్వుతూ అన్నాను.

ముగింపు :

నా మిత్రుడు నా సమాధానానికి ఒప్పుకోలేదు. నేను నరేంద్ర మోడీ గూర్చి ఏదోకటి రాయాల్సిందేనని పట్టు పట్టాడు. ఓకే! ఇదుగో రాస్తున్నా.. చదువుకో మిత్రమా!

'శ్రీశ్రీశ్రీ నరేంద్ర మోడీగారు కారణ జన్ములు, అవతార పురుషులు. శ్రీ మోడీగారు భారత దేశ రాజకీయాల్లో కోహినూర్ వజ్రం వంటివారు. జై నరేంద్ర మోడీ! జైజై నరేంద్ర మోడీ!! మోడీ విమర్శకులారా! ఖబడ్దార్. మా మోడీగార్ని ఎవరన్నా ఏమైనా అంటే డొక్క చించుతాం జాగ్రత్త!

ఇట్లు,

ఒక నరేంద్ర మోడీ అభిమాని.'

ఇది చదివిన నా స్నేహితుడు గర్వంగా, తృప్తిగా తలాడించాడు (నేను బతికిపోయ్యాను).  

ఉపసంహారం :

ఇది రాస్తుంటే నా భార్య వచ్చి చూసింది. "ఏంటి మోడీ గూర్చి రాస్తున్నారా? మీకు మాడు పగిలిందే!" అంటూ సంతోషంగా పక్క రూములోకి వెళ్ళింది. ఆవిడకి మొదట్నుండీ నా బ్లాగ్రాతలు ఇష్టం లేదు, అంచేత - నెట్లో నన్ను ఎవరైనా (ఎందుకైనా సరే) తిడితే ఆవిడకదో తుత్తి! అంటే - మోడీ గూర్చి రాస్తే తిట్లు గ్యారెంటీ అని ఆవిడక్కూడా ఒక అవగాహన ఉందన్నమాట!

(picture courtesy : Google)

17 comments:

  1. ఇంట్లోనే ఓటు పడలేదా? హతోస్మి :)

    ReplyDelete
    Replies
    1. ఇంట్లో వాళ్ళ ఓట్లనేవి సాధారణంగా పడవండీ.

      యావద్విత్తోపార్జనసక్తః
      తావన్నిజపరివారో రక్తః

      అని శ్రీఅదిశంకరాచార్యులవారే సెలవిచ్చారు.

      మీరేదో మరో నాలుగు డబ్బులు సంపాదించే పనిలో ఉండక ఇలా కాలక్షేపం రాతల్తో సమయం వృధా చేస్తూ ఉంటే ఇంట్లోవాళ్ళు విసుక్కుంటారా ? అనందించి ఓట్లేసి ప్రోత్సహిస్తారా? అర్థం చేసుకోరూ ...

      Delete
  2. FB post: protest against arrest bid

    http://www.thehindu.com/todays-paper/tp-national/fb-post-protest-against-arrest-bid/article6045300.ece

    ReplyDelete
  3. రమణ గారూ..
    విమర్శ కి, కువిమర్శ తేడా ఉందనుకుంటాను. ఒక విమర్శ చేసేటప్పుడు, ఒక సిద్ధాంత ప్రాతిపదికగా, ఆధార సహితంగా విమర్శిస్తే తప్పు లేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం విద్వేషంతో చేసె విమర్శ మంచిది కాదు. మీరు చెప్పిన ఆ బెంగలూరు రచయిత ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియనంత అమాయకుడేమీ కాదు. కానీ అయన అలా మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశాలు, లక్ష్యాలు ఏంటొ మరి..? ఆయన అలాంటి వివాదాస్పదమయిన మాటలు మాట్లాడటం ఇదే కొత్త కాదు. ఇంతకు ముందు కూడా జరిగింది. మనకు భావప్రకటనా స్వేచ్చ ఉంది. కానీ దానిని జాగ్రత్తగా వాడాల్సిన బాధ్యత కూడా ఉంది.
    నాకొక విషయం అర్ధం కాదు. నరేంద్ర మోడీని విమర్శించటానికి ఇంతమంది సాహసిస్తున్నారు. మరి సోనియా గాంధీ విషయంలో వీరి నోర్లు పదేళ్ళుగా ఎందుకు మూత పడ్డాయో అర్ధం కాదు. సుబ్రమణ్యం స్వామి అనే ఆయన సోనియా గాంధి గురించి, మొత్తం గాంధీ కుటుంబం గురించి ఎన్నొ ఆశ్చర్యకరమయిన విషయాలు చెప్పారు. ఆధార సహితంగా నిరూపించారు. అయినా సోనియాగాంధీ ని విమర్శించాలంటే ఈ మేధావులకు చాలా భయం. తమ సెక్యులర్ ముద్ర ఎక్కడ పోతుందో అని భయం కావచ్చు.
    ఆఖరుకు అరవింద్ కేజ్రీవాల్ చూడండి. ఢిల్లీలో 15 ఏళ్ళు అధికారం వెలగబెట్టిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ మీద పోటీ చేసి విజయం సాధించారు. నైతికంగా కూడా అది సరయిన చర్యే. అదే లాజిక్ ప్రకారం 10 ఏళ్ళు కేంద్రంలో అధికారం చలాయించిన సోనియమ్మ మీదనో, రాహుల్ గాంధీ మీదనో కదా అతను పోటీ చేయాల్సింది? కానీ చూడండి. మోడీ మీద పోటీ చేశాడు. కొంచెం జాగర్తగా ఆలోచిస్తే ఇందులో చాలా అర్ధం ఉంది. మోడీని ఎంత విమర్శిస్తే అంత ఎక్కువగా కొన్ని వర్గాలు వాళ్ళకు దగ్గరవుతాయి అనుకున్నారు. మోడీ విమర్శకులలో కూడా చాలా మంది ఉద్దేశం అదే. కానీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. ఇలాంటి vested interests ఉన్న రాజకీయ నాయకులకు, కుహనా మేధావులకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు.

    ReplyDelete
  4. *అనంత మూర్తి రాజకీయ అభిప్రాయాల గూర్చి చర్చ ఎంత జరిగిందో తెలీదు కానీ..  పాపం, ఇవ్వాళ అనంతమూర్తి పోలీసువారి రక్షణలో ఉన్నాడు!*
    ఆయన రాజకీయ అభిప్రాయల పై జరిగిన చర్చ మీకు తెలియకపోలుతే చర్చ జరగనట్లా? ఆయన , గిరిష్ కర్నాడ్ లాంటి లెఫ్ట్ లిబరల్స్ గురించి చర్చ ఎందుకు పెద్ద పాత్ర సృష్ట్టించి అవర్ణ అనే నవలే రాశాడు భైరప్ప. ఇది కన్నడంలో ఎంత పెద్దహిట్ అయిందో చెప్పక్కరలేదు.

    పాపం అనంతమూర్తా!? అసలికి అయనకొచ్చిన ఆపద ఎమిటి? పోలిసు రక్షణతీసుకొని భద్రంగా ఉంటే. పిచుకమీద బ్రహ్మస్రం ప్రయోగించాలని నమో అభిమనులు కోరుకోరు. నమో అభిమాను కోరుకొనేది నమో అన్నిటికన్నా ముందుగా బిజెపి పార్టి ప్రక్షాలణ చేయలని, వారికి క్రమశిక్షణ లో పెట్టాలని. కాంగ్రెస్ తో కుమ్మకు అయ్యి సుఖాలకు అలవాటు పడిపోయారు కేంద్ర నాయకులు.నమో రాకతో ఇప్పటికేపార్టిలో క్రమశిక్షణ పెరిగింది. మీడియా ముందు కొచ్చి అనవసరంగా వాగటంలేదు. ఎవరికి ఏ మంత్రి పదవి వస్తుందో తెలియక అటుపార్టివారు, మిత్రపక్షాలు , మీడియావారు, వారి ద్వార లాబియింగ్ చేసె కార్పోరేట్ వాళ్లు పాపం ఉత్కంటతతో నలిగిపోతున్నారు. మొదటి నాలుగు రోజులు అరుణ్ జైట్లికి ఆర్ధిక శాఖ అని ఊదరగొట్టరు (ఆయనవస్తే లాభం ఉందనుకొనే పంజాబి వారు) తరువాత అరుణ్ షౌరి ఇప్పడు ఎవ్వరి పేరువినబడటం లేదు.గతం లో నీరా రాడియా, మీడియా వారు కలసి చేసిన లాబియింగ్ కి ఈసారి నమో ఫిక్స్ ఇచ్చాడు. పాపం! ఇప్పుడు మీడియా వారికి, ఎవరికి ఏ మంత్రిపదవి వస్తుందో తెలియక, లాబియింగ్ చేసే అవకాశం లేక, ఏ వార్త దొరకక, నమో పుట్టిన ఇల్లు, ముసలి తల్లి, తీర్ధ యాత్రలకువెళ్లిన భార్య , ఆఫీసులో పని చేసిన ప్యున్ , ఆయన చిన్ననటి స్నేహితులతో ఇంటర్వ్యులు చూపించుకొంట్టు కాలక్షేపం చేసుకొంట్టున్నారు :)
    మీడియాలో పెట్టుబడులు పేట్టి ఇన్ని రోజులు లాబియింగ్ చేయించుకొన్న వారికి నమో మీడియాకిచ్చిన మొండి చెయ్యి మెసెజ్ చేరిపోయింది. అందులో పెట్టుబడులు పెట్టటం తగ్గిస్తారు. దేశానికి మంచి రోజులు వచ్చేశాయి.

    ReplyDelete
  5. yem chepparu.. yem chepparu... naaku ippudu nammakam kaligindi modi corporate interests ki against ga decisions teesukogaladu ani....

    ReplyDelete
  6. Idhi modalenandi inkaa challa chitralu mundhu vunnai ......

    ReplyDelete
  7. ఇలా భజన చేయడం నేర్చుకోండి. బతకనేర్చిన వాడివి అవుతారు. అవును! మనకు బతక నేర్చిన తనం అవసరం సార్‌! ఏ ఎండకాగొడుగు పట్టకఫొతే బండి నడవదు.
    బలే బొమ్మ పెట్టారు సర్‌!

    ReplyDelete
  8. మోడీ గురించి ..లెక్క లేనన్ని వెబ్ సైట్ లు, లెక్క లేనన్ని వ్యతిరేఖ వఖ్య్నానాలు సోషల్ సైట్ లో విరివిగా ప్రచారం అయ్యాయి. అతని పైన అన్నని వ్యతిరేఖ ఆరోపణలు ఇంకెవరి పైన జరగా లేదు. అయన పైన ఆరోపణలు చేసేవారెవరు,ఏ మాత్రం వారి ఆరోపణలోనీ మంచి చెడులు ఆలోచించకుండా చేసినవే.. ముఖ్యంగా.. అనంత్ నాగ లాంటి వాలు చేసినవి. మీడియా అతనికి సహకారం చేసింది అంటారు. నిజానికి మీడియా అతనికి పూర్తీ స్థాయిలో వ్యతిరేఖంగా పని చేసింది. ఇ రోజు ఆటను గెలవా గానే మాట మార్చాయి.
    మోడీ అధికారం వచ్చిన మొదటి వారం లోనే వచ్చిన అతి పెద్ద సంఘటన అత్యంత తొందరగా, అతి తక్కువ నష్టం తొ మామూలు స్థితి కి తీసుకు వచ్చాడు, ఐన అది జరిగిన కొన్ని రోజుల తరువాత మీడియా, మిగితా మేధావులు దాన్ని మల్లి, మల్లి రెచ్చగొట్టడానికి ప్రయత్నించాయి. ఇప్పటికి ప్రయత్నిష్టునే ఉన్నాయి. మైనారిటీ నీ రేచ్చాగోడుతూనే ఉన్నాయి. గుజరాత్ లో మొత్తం ముస్లిం లు రైతు లుగా ఉన్న గగ్రామాల్లో పనిచేసిన వాడిగా అక్కడి వారి ద్వార తెలిసిన నిజాలు నాకు తెలుసు., అయినా చాల మంది కి ఇది నచ్చాదు. జానాలు తిట్టుకోవాలి, కొట్టుకోవాలి. అప్పుడు జరిగిన కొన్ని సంగాతనలను మల్లి మాలి రేచ్చాగోట్టాలి.. అందుకు బ్ల్లాగ్ లు, ఫేస్బుక్, మీడియా లు, పేపర్లు, రచనలు, వ్యాసాలు ఎన్నో, ఎన్నో రాసారు..!
    కొంత మంది ఇప్పటికి కుడా ఇంకా జన సామ్యాన్ని అవమానపరిచే విధంగానే మాటల్డుతున్నారు.. గుజరాత్ లో వస్తున్నా ఎన్నిక రిసల్ట్ చూసి కుడా మారకపోవాడ౦ వారి భావ దరిద్యానికి నిదర్శనం.
    గుజరాత లో ముస్లిం ఏ విధంగా ఉన్నారో అందరికి తెలుసో లేదో.. అక్కడి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ముస్లిం లు వ్యవసయం లో ఉన్నారు. మిగితా అన్ని రాష్ట్రాల్లో కంటే ముస్లిం ల వార్షిక ఆదాయం అక్కడే ఎక్కువ ఉంది.
    మీడియా నీ నమ్మకూడదు అని ఇక్కడ ఉన్న వారు అందరు అన్నారు..అదే నిజం కుడా.,! మీడియా గోద్రా అనంతర సంఘటనలను కొన్ని నెలల తరువాత మరో విధంగా చిత్రీకరించడం, దానివల్ల జరిగిన నష్టం (మైనారిటీ, మెజారిటి మధ్య పెంచిన చిచ్చు) ఎప్పటికి పుడ్చాలేనిది. ఇప్పటికి కొంత మంది మల్లి, మాలి దాని రెచ్చగొట్టి, మేధావులుగా ముద్ర తెచ్చుకోవడం మన దరిద్రం.. ఇందులో మోడీ చేసిన ఒక మంచి పని, ఇలాంటి విషయాలు తన వాళ్ళ మరింత రేచ్చ్గోట్టకుండా ఉండడమే..!
    మీరు బాగా రాస్తారు..! అలానే ఇది కూడా బాగా రాసారు.. కాని కొన్ని రోజులు సమయం ఇవ్వండి.. నేను చుసిన గుజరాత్ లో, కనీసం సగం అభివృద్ది
    మన దేశం లో వస్తే చాలు

    ReplyDelete
    Replies
    1. వంశీ పులూరి గారు & కిరణ్ గారు,
      బాగా చెప్పారు. చూడండి ఇక్కడ కూడా, అనంత మూర్తి గారు, ఒక ఙ్ణాన పీఠం గ్రహీత, సిద్ధాంత పరంగా కాకుండా, చాలా చవకబారు తనంగా, వ్యక్తి గతంగా చేసిన విమర్శని అందరూ అమొదించారు (మోది ప్రధాన మంత్రి ఇతే దేశం విడిచి వెళ్తాను అనటం) కానీ అదే విమర్శని అక్షర సాక్షిగా తీసుకొని వ్యవహరించిన మోది అభిమానుల చర్యని మాత్రం భూతద్దంలొ చూపిస్తున్నారు.
      అలాగే కెజ్రివాల్ కూడా. 10 సంవత్సరాలు లెక్కలెనన్ని అవినీతి పనులు చేసిన వళ్ళని వదిలేసి మోది మీద పోటీ చెస్తే అందరికి అది సమజసమే అనిపించింది

      మోది ని విమర్శించటం మేధవి తనానికి ఒక గుర్తుగా చెశారు మన ఘనమైన మీడియా వారు! ఎంత చదువుకున్నా , అనుభవం వున్నా, ఎం లాభం. ఈ మోది వ్యతిరేక ప్రచారంలొ వీళ్ళ మెదళ్ళు అనీ మొద్దుబారి పోయాయి.
      కృష్ణ

      Delete
  9. మోది గురించి వ్రాయటం అంటే...ఒకటి అడ్డగోలుగా తిట్టటం, రెండవది విపరీతంగా పొగడటమేనా...భారతదేశంలో ఉన్న ప్రత్యెక పరిస్తితుల వలన ఎవరూ కూడా మనసులోని మాటని వ్రాయలేకపోతున్నారు. రాజుగారి భార్య మంచిది అని రాజ సభలో అనక తప్పనట్లే...అందరు సెక్యులరిజం ని నెత్తిన పెట్టుకుంటున్నారు. సెక్యులరిజం గురించి వ్రాసేవారి బయట మాటలు వింటే ఆశ్చర్చం కలిగి తీరుతుంది. విచిత్రంగా సెక్యులరిజం గురించి మాట్లాడే వారు 99 శాతం మంది హిందువులే. ఇలా మనసుని చంపుకునే వ్రాసే స్వేచ్చ కన్నా నిజాన్ని చెప్పే కట్టడే మేలు. కనీసం, దీనివల్లన దేశ ప్రజల అసలు మనోభావం ఏమిటో తెలుస్తుంది.

    ReplyDelete
  10. సి.పి.ఐ. యం - మత రాజకీయాలు . Death of ideology.

    Christians backed LDF, says CPI(M)
    http://www.thehindu.com/news/national/kerala/christians-backed-ldf-says-cpim/article6045256.ece

    ReplyDelete
  11. విషయ మేమిటంటే మతకలహాలలో యెప్పుడూ ముస్లిములే బాధితులుగా ఉండటం లేదు.ముస్లిములు చెలరేగి పోయినప్పుడు హిందువులు కూడా బాధితు లవుతున్నారు. కానీ మోడీకి ప్రతికక్షులుగా నిలబడిన కుహనా సెక్యులర్ పండితులు ముస్లిముల మీద దాడులు జరిగినప్పుడు చూపించే నిరసనలో ఉండే తీవ్రత్వం ముస్లిముల వైపు నుంచి హిందువుల మీద జరిగినప్పుడు కేవలం నత్తి మాటల స్థాయికి దిగజారి పోతున్నది.

    రెంటినీ నిశితంగా పరిశీలిస్తే ఉదారవాదులయిన హిందువులు కూడా ఈ యేకపక్షపు ప్రతిస్పందనని గుర్తించగలిగేటంత స్పష్టంగా ఉంది వాళ్ళలోని డొల్లతనం.

    ReplyDelete
  12. Desham fascism vaipu pothdani naku ikkadi comments chusakaa full confirmation vachindhi

    ReplyDelete
  13. *శ్రీశ్రీశ్రీ నరేంద్ర మోడీగారు కారణ జన్ములు, అవతార పురుషులు *
    మీరు రాసిన పై మాటలు 100% నిజం. కౌరవ సభలో శ్రీ కృష్ణుడు విశ్వరూపాన్ని తన భక్తులకు మాత్రమే చూపుతాడు. కాని నమో తన విశ్వరూపాన్ని భక్తులకు మాత్రమే కాదు, శతృవులకు కూడా చూపాడు. నమో ఎంతో కరుణామయుడు:) ఆ విశ్వరూపాన్ని చూసిగురువు అద్వానికి ఐతే గొంతు మూగ బోయి, కళ్లలో నీళ్లు తిరిగాయి. పార్లమెంట్ లో నమో బిజెపి చరిత్రను గుర్తు చేస్తూ మాట్లాడుతుంటే రవిశంకర ప్రసాద్ లాంటి వారు కళ్లలో నీళ్లు ఉప్పొంగాయి.నమో ఉపన్యాసం బిజెపి అధ్యక్షుడి నుంచి ఇంట్లో ఉండే సామాన్య కార్యకర్త వరకు, చివరికి అతనిని వ్యతిరేకించే వారిని సైతం భావోద్వేగానికి లోను చేసింది.
    నమో వ్యతిరేకులైన లెఫ్ట్ లిబరల్స్ ప్రజానాడిని పసి గట్టలేక పోయామని, వారి తప్పులను తెలుసుకొని, చెంపదెబ్బలు వేసుకొంట్టున్నారు. పాండవులు వన వాసం చేసినట్లు రానున్న పది సంవత్సరాలు హిందూవుల రాజ్యపాలన లో రోజులు గడపక తప్పదని గ్ర్రహించారు. వారు సరికొత్త ఎత్తుగడ ఎమిటంటే, ఇంతకాలం మనం ప్రవచించిన సెక్యులర్ భావజాలం లో తప్పులు ఉన్నాయని సరికొత్త చర్చను లేపారు. ఆ భావజాలం హిందువులకు అనుకూలంగా లేదని, వారిని కలుపు కు పోయే విధంగా మలచ వలసిన అవసరం ఉందని ఆలస్యంగా గుర్తించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఇప్పుడేమి ఎమి లాభం?

    http://blogs.timesofindia.indiatimes.com/talking-terms/a-missive-to-distraught-liberals/

    http://www.thehindu.com/opinion/lead/how-modi-defeated-liberals-like-me/article6034057.ece

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.