వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం, మండుటెండ, వేడిగాలి.
అబ్బా! సెగలు, పొగలు, నిప్పుల కొలిమిలో నిల్చున్నట్లు, బొగ్గుల కుంపట్లో పడుకున్నట్లు.. ఇవ్వాళ ఇంత వేడిగా వుందేమిటి!
ఆకాశం ప్రశాంతంగా ఉన్నట్లు దొంగనిద్ర నటిస్తుంది, పైన ఒక్క మబ్బు తునక లేదు. నేల మండిపొతుంది, చెట్లు కాలిపోతున్నాయి, చేమలు మాడిపోతున్నాయి.. అసలు భూదేవే కాలిపోతున్నట్లుంది.
'దేవుడా! నన్ను కాపాడు, నేను నీ బిడ్డని, నామీద కోపమొచ్చిందా తండ్రీ? నీకే కోపమొస్తే నేనెవర్ని వేడుకోవాలి. రక్షించు తండ్రీ! రక్షించు.' వందోసారి దేవుణ్ని వేడుకున్నాడా వృద్దుడు.
అతనో యాచకుడు. ఎన్నోయేళ్ళుగా ఆ రోడ్డు పక్కనున్న వేపచెట్టు కింద అడుక్కుంటున్నాడు. కొన్నాళ్ళక్రితం ఆ రోడ్డు వెడల్పు చేయ నిశ్చయించిన మునిసిపాలిటీ వారు దశాబ్దాల వయసున్న ఆ వేపచెట్టుని కొట్టేశారు. ఆ విధంగా మానవజాతి అభివృద్ధి కొరకు ఒక వృక్షం హత్య చేయబడింది. (ఎవరూ చావకపోతే అభివృద్ధి సాధ్యం కాదు).
ఆ రోజునుండీ అతను నీడ కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆ చుట్టుపక్కలా ఎక్కడా చెట్టు లేదు, కనీసం నీడ కూడా లేదు. ఆ పక్కగా కొన్ని దుకాణాలున్నాయి. కానీ - ఆ దుకాణాలవారు తమ దుకాణం ముందు వృద్ధుని బిక్షాటన దుకాణాన్ని ఒప్పుకోలేదు.
అతనికి నెత్తిన నీడ కరువైంది. కొన్నిరోజులుగా కడుపుకి తిండి కూడా కరువైంది. అంచేత - ప్రస్తుతం నీడలేక, తిండి లేక, దాహంతో అల్లాడిపోతున్నాడు.
రోడ్డుపై జనసంచారం లేదు. ఆ వృద్ధుని శరీరం ఎండకి కాలిపోతుంది, వణికిపోతుంది. నీరసంతో కళ్ళు మూసుకు పోతున్నాయి, క్రమేపి ఒరిగిపోతున్నాడు.
దాహం.. నోరెండిపొతుంది, దాహం.. నాలుక పిడచకట్టిపోతుంది, దాహం.. నరాలు తోడేస్తున్నాయి, ఆకలి.. కళ్ళ ముందు చీకట్లు, ఆకలి.. గుండెల్లో నిప్పులు.
ఇంక దేవుడు తనని కాపాడడని అర్ధమైపోయింది.
'దేవుడా! నన్ను నీలో కలిపేసుకో. నాకిక ఆకలి కేకలు, దాహపు మాల్గులు, రోగపు నాదాలు, ఆర్తనాదాలు.. ఏమీ లేకుండా చేసెయ్యి.' వృద్దుడు మౌనంగా ప్రార్ధించాడు.
కొద్దిసేపటికి వేటగాని దెబ్బకి ఒరిగిపోయిన జింకలా, నిదానంగా రోడ్డు మీదకి పడిపొయ్యాడా వృద్ధుడు. అక్కడి దుకాణాల వాళ్ళు ఆ వృద్దుడు ఎండకి మండుతూ ఒరిగిపోవడం చూస్తూనే వున్నారు, కానీ - వాళ్ళెవరూ అతన్ని పట్టించుకోలేదు.
ఆ దుకాణదారులు కొన్నాళ్ళపాటు తమ దుకాణాలు మూసేసి కుటుంబాలతో సహా సంపూర్ణ దక్షిణ భారత దేశ పుణ్య క్షేత్రాల్ని భక్తిగా దర్శించుకుని ఇవ్వాళే దుకాణాల్ని తెరిచారు, అంచేత వాళ్ళు తీవ్రమైన వ్యాపార హడావుడిలో వున్నారు
ఇంతలో అటువైపుగా నలుగురు యువకులు వచ్చారు, వారికి సుమారు ఇరవయ్యేళ్ళు వుండొచ్చు. వారి టీ షర్టుల మీద చె గువేరా బొమ్మ ముద్రించి వుంది. వారు తెలుగు సినిమా హీరో అభిమానుల్ట. ఆ హీరోకి రాజకీయ జ్ఞానం దండిగా వుందిట. ఈమధ్యే ఏదో పుస్తకం కూడా రాశాట్ట. ఆ యువకులు తమ హీరో పిలుపు స్పూర్తిగా - ప్రస్తుతం దేశసేవ చేసే పన్లో వున్నారు.
ఆహా! ఏమి మన సౌభాగ్యము! సినిమాలు తీసి యువతని అభిమాన మత్తులో ముంచి నాలుగు డబ్బులు చేసుకుందామనుకునే స్వార్ధపరులున్న ఈ రోజుల్లో ఒక సినిమా హీరో - యువకుల్ని సామాజికంగా, రాజకీయంగా ఉత్తేజ పరుచుటయా! గ్రేట్!
ఆ యువకులు నేలకొరిగిన వృద్దుడిపై ఒంగి చూస్తూ, ఒకరి తరవాత ఇంకొకరు ప్రశ్నల వర్షం కురిపించారు.
"ఓ పెద్దాయనా! ఎవర్నువ్వు? ఎందుకిలా ఎండలో పడిపొయ్యావు?"
"నీరసంగా వుందా?"
"దాహంగా వుందా?"
"ఆకలిగా వుందా?"
ఆ వృద్దుడికి మాట్లాడే ఓపిక లేదు. నీరసంగా, దీనంగా వాళ్ళని చూశాడు. అతని మొహం ప్రేత కళ పడింది.
అయితే - అన్ని ప్రశ్నలడిగిన ఆ యువకులు, ఆ తరవాత అతన్ని పట్టించుకోలేదు. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోసాగారు.
"ప్రస్తుతానికింతే! ఈ ముసలాయన మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ - మన హీరో ప్రశ్నించమనే చెప్పాడు. ఆ ప్రశ్నించే పనిని విజయవంతంగా పూర్తి చేశాం."
"అవును, ప్రశ్నలడగమన్నాడే గానీ సమాధానం వినమని మన హీరో తన పుస్తకంలో రాయలేదు."
"ఆయన ప్రస్తుతం సినిమా షూటింగులో ఉన్నాడు, వచ్చాక ఇంకో పుస్తకం రాస్తాళ్ళే! అప్పుడది ఫాలో అవుదాం."
"ఆ పుస్తకం పేరు 'జవాబిజం' అవ్వచ్చు."
"అప్పటిదాకా ఇలా ప్రశ్నిస్తూ ఉండటమే మన రాజకీయ కార్యాచరణ."
"అవునవును, ఇవ్వాల్టికి ఈ ముసలాయన్తో కలిపి మొత్తం పదిమందిని ప్రశ్నించాం."
ఇలా మాట్లాడుకుంటూ ముందుకు సాగారు ఆ యువకులు.
ముగింపు :
రాయడానికి పెద్దగా ఏం లేదు.. కొంతసేపటికి ఆ వృద్దుడు చనిపొయ్యాడు. అంతే!
(picture courtesy : Google)
Opikagaa samaadhanam vinatam prasna yokka mukhya uddesyam kadaa. Vine vopika leni prasna lenduku?
ReplyDeleteనువ్వు తెలుగు న్యూస్ ఫాలో అవ్వట్లేదా?
Delete:( Sad story. We cannot, however, blame the shop keepers, passers by or members of actors' fan clubs for their apathy. Even if they offered help this time that would not be the end of the man's troubles. This needs a societal action to create shelters and such for the elderly destitute. Begging is a complex problem with troubling underlying issues including mental and physical handicap, abandonment, deception, crime, gangsterism, aggression and so on.
ReplyDeleteInstitutional Provisions and Care for the Aged
Rs 180 crore- that is the annual earning of beggars in India
/ Even if 'they' offered help this time that would not be the end of the man's troubles. This needs a societal action to create shelters and such for the elderly destitute./
DeleteIf not 'they' who is the society?? you and me??? we were not there!!!if what 'they' have done is reasonable, what else is expected from 'societal action'???
oh so many questions, obviously none of us are bothered to get answers :)
dear BSR,
Deletethis post is not about begging.
a popular hero started a political party. his main agenda is 'questioning' only!
Dear Ramana, thanks for the clarification.
Delete@Mauli Societal action is arranging shelters for the destitute. Societal action is providing some type of pension for the elderly poor. Societal action is having roving vans pick up at risk elderly and handicapped from the streets - especially when the temperatures are very high. Societal action is when police or ambulances can pick the sick and dying from the street to get them to a hospital. Societal action is not leaving the rescue of the distressed to the kindness of random persons near by.
Well said.
Delete
ReplyDeleteకఠినంగా, కర్కశంగా లేదు ఆ వాక్యం..జీవితం లాగా!
Anil Atluri గారు,
Deleteఅయాం సారీ. ఆ చివరి వాక్యం రాసినందుకు సిగ్గుపడుతున్నాను. నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు, ఆ వాక్యాన్ని ఇప్పుడే తొలగిస్తున్నాను. థాంక్యూ.
// రాయడానికి పెద్దగా ఏం లేదు.. కొంతసేపటికి ఆ వృద్దుడు చనిపొయ్యాడు. అంతే!//
ReplyDeleteఅవును అభి వృద్ది పదములో వృద్దుడే గాదు ఎంతో మంది చనిపోతుంటారు. మనం సానుభూతి చూపించాలా? సాను భూతి చూపిస్తే అభివృద్ది ఎక్కడది? మనం మాత్రం ఆ అభివృద్ది పదంలో ఈ ముసలాడిలా బాగా వుంటాము కదా? బాగా వుండటాన్నే కదా మనం కోరుకుంటున్నది? అబ్బే ! పోనీ త్తురు ఇ లాంటోళ్లు ఎందరు పుట్టరు మన అభివృద్దికి దోహదం చేస్తూ. ప్రకృతి ఆవరణ సిద్దాంతాం ఏమి చెపుతుంది చూడండి. చిన్న చేపను పెద్ద చేప గెడ్డిని జంకా, జింకను పులి తిని బతుకుతున్నాయి. మీకు తెలీదా? మనం మాత్ర అలా గే వుండాలని కోరుకుందాం.
మరి అభివృద్ధి అంటే అంతే కదా!
Deleteఆవున్నిజమే....
ReplyDeleteప్రశ్నించడానికి ఉన్నారు...
జవాబివ్వడానికి ఉన్నారు...
విమర్శలు చేయడానికి ఉన్నారు....
అభివృద్ధి చేయడానికి ఉన్నారు....
సింగపూరులు, దుబాయిలు చేసేద్దామనే ఉన్నారు...
విశ్వసనీయత, నీతి నిజాయితీలు, మడమ తిప్పని వారు ఉన్నారు...
కానీ...
సేవ చేసే వారే లేరు.. కళ్ళెదుట నిస్సయ స్దితిలో ఉన్నవారికి కూసింత సాయం చేసే వారే లేరు ప్రసుత్త సమాజంలో...
గుండెలను తాకిన కధ అండీ ఇదీ....
'ప్రశ్నించడం' అనే concept నా గుండెల్ని తాకిందండి! అందుకే ఈ పొస్ట్. :)
DeleteThis comment has been removed by the author.
Deleteఅన్యాయం గురూ ఇలా బాధ పెట్టటం - మావి అసలే జాలి గుండెలు! వయసుతో ఇంకొంచెం సున్నితంగా మారుతున్నాయ్! ద్రవింపచేస్తున్నావ్ ! ఇది పోస్టు చెయ్య దలచలా. But after seeing the above I felt like I'm not alone in feeling that it was a bit harsh (especially the removed sentence).
ReplyDeleteగౌతం
హహహా! నీ జాలిగుండెని చూసి జాలిపడుతున్నాను. :)
Deleteనా పోస్ట్ ప్రధాన అంశం కుర్రాళ్ళ ప్రశ్నలు. వృద్దుడి కష్టం curtain raiser మాత్రమే.. కానీ - ఆ కర్టనే పోస్టుని dominate చేసేసింది. అదీ సంగతి!
మీరు రాసిన కథలలో ఇది ఆఖరు స్థానం లో నిలుస్తుంది. పవన్ కల్యాణ్ ను, అతని అభిమనులను తిట్టటానికి, ముసలోడిని అడ్డుపెట్టుకొన్నారు. ఆ హీరో రాజకీయాలలోకి రాకుంటె ఈ కథంశం మీకు రాయలని తట్టె ఉండేది గాదు
ReplyDelete>>ఆ హీరో రాజకీయాలలోకి రాకుంటె ఈ కథంశం మీకు రాయలని తట్టె ఉండేది గాదు<<
Deleteఖచ్చితంగా అవును. :)
సార్, ఏమనుకోకండి. నాదో చిన్న ప్రశ్న.
ReplyDeleteఈ క్రింది రెండు వర్గాల వారికి తేడా ఏమిటి?
1. వృధ్ధుడిని పట్టించుకోని దుకాణదారులు, ప్రశ్నించి వదిలేసిన అభిమానులు.
2. ఈ విషయాన్ని టపాగా వ్రాసిన మీరు, అది చదువుతున్న మేము.
ఇక్కడ అనుకోడానికేముంది? ఇదేమీ జరిగిన కథ కాదు కదా!
Deleteమరి కాలేజీల్లో వీళ్ళు ఏం చదివి ఛస్తారో తెలీదు గానీ.. సినిమాలకీ, రాజకీయాలకీ కనీస తేడా తెలీని దౌర్భాగ్యులు తయారవుతున్నారు. వీళ్ళు ఈ దేశభవిష్యత్తు గూర్చి రాజకీయంగా ఆలోచించలేని (వీళ్ళకి కాంగ్రెస్, బీజేపీ..తేడా తెలీదు! రెండిట్లో ఏది మంచిదో తమ హీరోగారు చెప్పాలి) వాజమ్మలు, శుంఠలు.
తమ అభిమాన సినిమా హీరో ఏదో చెప్పంగాన్లే, తోకలూపుకుంటూ మురిసిపోయిన అజ్ఞాన గొర్రెలమందల గూర్చి రాసిన చిన్న పోస్ట్ ఇది.
అంతకుమించి అర్ధం చెప్పడానికి ఈ పోస్టులో ఏమీ లేదు.
మీరు అటువంటి అభిమానుల గురుంచి మాత్రమే ఈ టపా రాస్తే, ఖచితంగా అభినందనీయమే.
Deleteఇతే, ఈ టపా సందేశం మాత్రం అలా అనిపించలేదు. మరి అది పాఠకుల (అంటే నేను) తప్పో, లేక సందేశం సూటిగా, స్పష్టంగా లేకపోవటమో. నేనైతే రెండొదే అనుకుంటున్నాను.
GKజీ,
Deleteస్పష్టంగా, సూటిగా రాస్తే అది ఏదో సందేశం లాగా వుంటుందేమో కదా!
అసలీరోజుల్లో అస్పష్టంగా, అసూటిగా ('సూటిగా'కి వ్యతిరేకం) రాస్తేనే గొప్ప. :)
నేను మీ కొత్త అభిమానిని. గత మూడు, నాలుగు రోజులుగా కుదిరినప్పుడల్లా కొన్ని బ్లాగ్స్ చదువుతున్నా. మీ presentation అద్భుతంగా ఉంది. ఏ బ్లాగ్ కి అది ఒక masterpiece.
ReplyDeleteఈ బ్లాగ్ లో మాత్రం మీ గురి తప్పినట్టుంది. failure కాదు గాని, మీరు దేన్నైతే high light చెయ్యాలనుకున్నారో , ఎవరికీ అర్ధం కాలేదా అనుకున్నా నిన్న. ఇవ్వాళ U G శ్రీరాం గారి కామెంట్ చూసాక , ఓహో , పర్లేదనుకున్నా . ప్రశ్నిస్తానని ఒచ్చిన ఒక్కగానొక్క మహా (మెగా) హీరో రాజకీయ ప్రవేశం చెయ్యక పోతే , అయన ఇజం ని ఆయన fans కి బోధించక పోతే , మీరు ఈ బ్లాగ్ ఎలా రాయగలరు ? మీకో బ్లాగ్ కి ఐడియా ఇచ్చిన పవన్ కళ్యాణ్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు .
ఆయన మల్ళీ ఒకసారి జనాల్లోకి వచ్చి , మరో హితబోధ చేసి , మీకు మరో బ్లాగ్ కి మసాలా ఇవ్వగలరని నా హృదయ పూర్వక కాంక్ష.
ఇ హ
థాంక్యూ. నా బ్లాగుకి స్వాగతం.
Deleteనాకు చిన్న పోస్టులు రాయడం ఇష్టం. చాలాసార్లు అలా రాద్దామనే మొదలెడుతుంటాను.. కానీ ఎక్కువ రాస్తుంటాను.
ఈ పోస్ట్ రాసేప్పుడు.. ఎండదెబ్బకి (మా ఊళ్ళో ఎండలు ఎక్కువ) చనిపొయ్యే అనాధ యాచకులు గుర్తొచ్చి.. ఫస్ట్ పార్ట్ కొద్దిగా పొడిగించాను. అందువల్ల.. పోస్ట్ ఉద్దేశం గురి తప్పింది.
ఏదేమైనా.. రాసేప్పుడు ప్లానింగ్ అవసరం.. ప్రయత్నిస్తాను.
రమణ గారు..
ReplyDeleteపవన్ కల్యాణ్ అభిమానుల మీద మీ అకారణ విద్వేషం చూసి ఆశ్చర్యం కలుగుతోంది.
పవన్ కల్యాణ్ మొన్నటి ఎన్నికల్లో ఏం చెప్పాడు? రాష్ట్రంలో తెలుగుదేశాన్ని, కేంద్రంలో బీజేపీని గెలిపించమనే కదా చెప్పాడు. ఆయన మాటలు ఆయన అభిమానులు ఎంతమంది విన్నారో మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? మొన్నటి ఎన్నికల్లో వచ్చిన తీర్పు మీకు నచ్చలేదేమో అనిపిస్తోంది.
లేకపోతే పవన్ కల్యాన్ అభిమానుల్ని వాజమ్మలు, శుంఠలు అని తిట్టడంలో మీ ఉక్రోషం ఏంటొ నాకు ఏంటొ అర్ధం కావట్లేదు. ప్రజలు రాష్ట్రంలో జగన్ ని, కేంద్రంలో కాంగ్రేస్ ను గెలిపించి ఉండాల్సింది అని మీరేమైనా భావిస్తున్నారా?
ఆయన ప్రశ్నించడానికే వచ్చానని చెప్పాడు. జగన్ ను, కాంగ్రేస్ ను గట్టిగానే ప్రశ్నించాడు. వాళ్ళకు తీవ్ర నష్టం చేశాడు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలను కూడా భవిష్యత్తులో ప్రశ్నిస్తాననే చెప్తున్నాడు.
పవన్ కల్యాన్ అభిమానులైతే దేశ భవిష్యత్తుని గూర్చి ఆలోచించలేరని, కాంగ్రేస్ కి, బీజేపీకి తేడా తెలియదని మీరెలా చెప్పగలరు? వాజమ్మలు,శుంఠలు అని నోరు పారేసుకోవడం ఎంతవరకు సబబో ఆలోచించండి.పోనీ మీరు చెప్పండి కాంగ్రేస్ కి, బీజేపీకి తేడా ఏంటొ?
సరే తమ అభిమాన హీరో ఏదో చెప్పాడు. అది విని ఆయన అభిమానులు మురిసిపోయారు. దానివలన దేశానికి లేదా మరెవరికైనా జరిగిన నష్టం ఏంటొ చెప్పగలరా?
మీరు అల్లిన వృద్ధుడి కథ కట్టుకథ అని మీరే చెప్పడం చాలా వింతగా ఉంది.
నేను మూడేళ్ళుగా బ్లాగులు రాస్తున్నాను. అయా సందర్భాల్లో ఆయా నటుడి అభిమానులు నాపై నోరు చేసుకుంటూనే వున్నారు (మరీ ముఖ్యంగా 'మెగాస్టార్ బిక్షాపాత్ర' అన్న పోస్టుకి నన్ను బాగా తిట్టారు).
Deleteఒక సినిమా హీరోని నటుడిగా తీవ్రంగా అభిమానించడం నేను అర్ధం చేసుకోగలను. కానీ ఆ హీరో (అది ఎవరైనా కావచ్చు) చెప్పాడని ఓటు వేసే (నేను చాలామందిని చూశాను) అజ్ఞానాన్ని నేను అర్ధం చేసుకోలేకున్నాను.
ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ అవినీతిని అసహ్యించుకున్నారు, మోడీ పాలన కావాలనుకున్నారు, ఆయనకి ఓట్లేసి గెలిపించుకున్నారు, మంచిదే కదా! (ఇదంతా రాజకీయపరమైన ఆలోచన.. యువత ఇలాగే ఆలోచించాలని నా అభిప్రాయం).
కానీ - మా అభిమాన హీరో చెప్పాడని మోడీకో, కాంగ్రెస్ కో, లేక మరెవరికో ఓట్లేసే చదువుకున్న నిరక్షరాస్యుల్ని చూస్తే నాకు రోత, కంపరం.
ఆ హీరోలు ఈ సినిమా పిచ్చోళ్ళని ఎందులోనన్నా దూకి చావమని సలహా ఇస్తే బాగుండు. :)
(మీరు మీ అభిమాన హీరోని ఈ చర్చలోకి లాగకండి. నేను చెబుతున్న విషయం అన్ని హీరోల అభిమానులకి అప్లై అవుతుంది.)
"కానీ - మా అభిమాన హీరో చెప్పాడని మోడీకో, కాంగ్రెస్ కో, లేక మరెవరికో ఓట్లేసే చదువుకున్న నిరక్షరాస్యుల్ని చూస్తే నాకు రోత, కంపరం"
Deleteమరి ఎమ్జీఆర్/ఎన్టీఆర్ లాంటి వాళ్ళు పెట్టిన పార్టీలకు పొలోమని చంకలు గుద్దుకుంటూ వోట్లు వేసిన వాళ్ళ సంగతి ఏమిటి? సినిమా గ్లామరు లేకుంటే సదరు "మహానటులు" గెలిచే వారా?
PS: ఎన్టీఆర్ మీ అభిమాన నటుడనుకుంటా.
@Jai,
Deleteఅరవం వాళ్ళ సినిమా పిచ్చి జగద్వితం, తరవాత ఆ పిచ్చి మనక్కూడా పాకింది.
నా సినిమా అభిమానం సినిమాలకే పరిమితమైంది. నాకు న్యూస్ పేపర్ చదవడం వచ్చు. కాబట్టి రాజకీయ విషయాల్ని నా అంతట నేనే అర్ధం చేసుకుంటుంటాను, నాకు ఎన్‌టీఆర్ సలహా అవసరం లేదు.
ఇందుకు కారణం ఏమైయ్యుంటుంది?
నాకనిపించేది.. నేను చదువుకున్న కాలేజీల్లో రాజకీయ వాతావరణం ఉండేది. SFI, AISF, ABVP, RSS, RSU.. అందరి రాజకీయాల గూర్చి ఎంతోకొంత అవగాహన వుండేది. ఇప్పటి కుర్రాళ్ళకి ఆ వాతావరణం లేదు, వాళ్ళు కార్పొరేట్ కాలేజీల ఉత్పత్తుల్లాగా మిగిలిపొయ్యారు.
ప్రస్తుతం కాలేజీల్లో కులసంఘాలు, ఆయా కులాల హీరోల పట్ల వెర్రి అభిమానం.. సరైన వాతావరణం లేక వారు ఎడ్యుకేట్ అవ్వలేకపోవడం ఒక కారణంగా తోస్తుంది.
నా అభిమాన హీరోని చర్చలోకి నేను లాగానా? ప్రశ్నిజం అని పేరు పెట్టి, మీరు ఏ హీరో గురించి రాసారో మీకే తెలీదనుకోవాలా?
ReplyDeleteఈ పోస్ట్ అందరు హీరోల గురించి అని ఇప్పుడు అంటున్నారు.మీరు రాసిన కామెంట్లు మీరే ఒక్కసారి చదువుకోండి.
1.dear BSR,
this post is not about begging.
a popular hero started a political party. his main agenda is 'questioning' only!
2.'ప్రశ్నించడం' అనే concept నా గుండెల్ని తాకిందండి! అందుకే ఈ పొస్ట్. :)
3. >>ఆ హీరో రాజకీయాలలోకి రాకుంటె ఈ కథంశం మీకు రాయలని తట్టె ఉండేది గాదు<<
ఖచ్చితంగా అవును. :)
అవును, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ హీరో గూర్చి రాశాను. నేను బాలయ్య, చిరంజీవిల గూర్చి కూడా రాశాను. ఎప్పుడు ఎవరి గూర్చి ఎలా రాయాలన్నది పూర్తిగా నా ఇష్టం (ఇందులో మీకున్న సమస్యేమిటి?).
Deleteమీరు చదువుకున్నవాళ్ళైతే (అనుకుంటున్నాను).. మోడీ, చంద్రబాబు, జగన్, సోనియా గాంధీల గూర్చి కొన్ని వేల వ్యాసాలు ప్రచురితమై వున్నాయి. అవి చదువుకుని రాజకీయంగా ఆలోచించడం నేర్చుకోండి. రేపు మన మంచిచెడ్డలకి బాధ్యత వహించేది ఈ రాజకీయ పార్టీలే.. మీ సినిమా హీరోలు కాదు.
ఇంతకన్నా మీ హీరో వీరాభిమానులకి వివరణ ఇవ్వడం అనవసరం అనుకుంటున్నాను. అయినా అర్ధం కాకపోతే, విషయాన్ని ఇంతటితో వదిలెయ్యండి. థాంక్యూ.
రమణ గారూ..
Deleteమీ హీరో, మీ అభిమాన హీరో అని sweeping remarks చేయకండి. మీరు చదువుకున్నవాళ్ళైతే(అనుకుంటున్నాను.) అని అవమానకరంగా మాట్లాడకండి. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించలేదు. మీరు రాసిన దాన్నే విమర్శించాను. సినిమా హీరోల అభిమానులతో మీ గత అనుభవాల దృష్ట్యా మీరు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మీరు ఎప్పుడు ఎవరి గురించి ఏం రాసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. నేను ఒక పాఠకుడిగా స్పందించాను. అంతే.రాజకీయంగా ఆలోచించడం గురించి నాకు సలహాలు ఇస్తున్నారు. సంతోషం. మీకొక సలహా. మీ రచనల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. సీరియస్ విషయాలను కూడా సరదాగా రాయటం మీ బలం. అదే మీ బలహీనత కూడా అవుతోంది.
ఉంటాను.
ధన్యవాదములు.
మీ రాతల కంటె వాటికి వచ్చిన కామెంట్స్ మజాగా ఉంటాయి. కామెంట్స్ కంటె మీరు పెట్టె Title, బొమ్మలు బాగుంటాయి . ప్రశ్నిజం-అన్నిటికంటే ఇది బాగా నచ్చింది నాకు. ఈ చదివితె చాలు. ఈ పొస్ట్ చదవక్కర్లేదు అని నా అభిప్రాయం. ఏవరో- శ్రీ శ్రీ మహాప్రస్థానం కి చలం రాసిన ముందుమాట చదివితే చాలు, కవితలు చదవక్కర్లెదు అని అన్నాడట.
ReplyDeleteకొంపదీసి ఇకనుండీ టైటిల్, బొమ్మ మాత్రమే చూసి.. అసలు పోస్ట్ చదవడం మానేస్తారా ఏమిటి?
Deleteబాబ్బాబూ! అంత పని చెయ్యమాకండి. ఇగ జూస్కోండి - ఇకనుండి పోస్టులో కూడా అద్దిరిపొయ్యే విషయం వుండేట్లు రాస్తాను. :)
కిరణ్,
ReplyDeleteరమణగారికి కొన్ని విషయాలలో స్థిర అభిప్రాయలు ఉన్నాయి. అవి నచ్చకపోతే, అర్థం కాకపోతే మీరు వివరణ అడగవచ్చు. అంతే కాని సినేమా హీరో కొరకు ఇంత వాదించనవసరంలేదు. ఆయనకు నచ్చింది రాసుకోవచ్చు. మీకు అది నచ్చకపోతే వేరే బ్లాగు పెట్టుకొని రాసుకోండి. ఊరికే అనవసరం గా ప్రశ్నించటం ఎమీ బాగాలేదు.
1. అసలు మీరెందుకు టపాలు రాస్తారు?
ReplyDelete2. రాస్తే రాసారు కానీ సినిమాల జోలికి ఎందుకు వెళ్తారు?
3. వెళ్తే వెళ్ళారు కానీ అమ్జద్ ఖాన్ సినిమా చింపిరి జుట్టు వంకర నవ్వు హీరో గురించి ఎందుకు రాసారు?
4. రాస్తే రాసారు కానీ ఆయన రాజకీయాలు & సిద్దాంతాల గోల ఎందుకు?
5. సరే ఇదీ ఓకే కానీ మీ ప్రశ్నలు సరిగ్గా సూటిగా ఎందుకు లేవు?
ఆగంగాడండి, తొందర పడి జవాబులు ఇయ్యమాకండి. జవాబులు వినడం (అలాగే ఇతరులు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వడం) మా ఇంటా వంటా లేదు.
ఇట్లు వరంగల్ జిల్లా జమ్మికుంట మండల గాలి విడాకుల ఆరంగుళాల సూది కమెడియన్ అభిమాన సంఘం
progress is not possible if no one dies, well said, keep on writing, great words.
ReplyDeletePost lo content chala bavundi. Doctor garu Jagan ni asalu comment cheyyadam ippati daka chudaledu. Odarpu yatra, Jagan speeches etc chala topics unnayi, comedy pandinchagal doctor garu thaluchukunte.
ReplyDeleteథాంక్యూ.
Deleteఏదైనా ఒక ఐడియా వస్తే.. టైముంటే.. దాన్నో పోస్టుగా రాయడం నాకు అలవాటు.
నేను జగన్ గూర్చి రాయలేదన్న విషయం మీరు చెబితేనే తెలిసింది. నిజంగానా?!
ఇది కేవలం కాకతాళీయమే గానీ, జగన్ పట్ల అభిమానం మాత్రం కాదని మనవి చేసుకుంటున్నాను. :)