Friday, 11 July 2014

పురుషుని వెనక స్త్రీ


ఇప్పుడైతే తెలీదు గానీ - 

ఒకప్పుడు మగప్రముఖుల్ని పత్రికలవాళ్ళు అడిగే రొటీన్ ప్రశ్న -

'ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ కృషి దాగుందని అంటారు, మరి - మీ విజయం వెనక వున్న ఆ స్త్రీ ఎవరు?'

ఆ ప్రముఖుడు వెంటనే 'నా భార్య' అని చెప్పేవాడు (ఇంకొకళ్ళ పేరు చెబితే భార్య ఊరుకోదని అలా చెప్పేవాడని నా అనుమానం).

ఆనాడు -

'ఏవిటీ అరిగిపోయిన ప్రశ్నలు, సమాధానాలు?' అని విసుక్కునేవాణ్ణి. 

ఈనాడు -

నేనానాడు అజ్ఞానంతో అలా విసుక్కున్నానని తెలుసుకున్నాను. 

ఇప్పుడు ఒప్పుకుంటున్నాను -

'ప్రతి పురుషుని విజయం వెనక ఒక స్త్రీ కృషి దాగుంది.' 

(photo courtesy : Google)

16 comments:

  1. Meeru rasina lines chadivi entabba em chepthunnaru anukunna...malli oo sari pic chusthe kani ardam kaledu prakala gari meeda SATIRE vesthunnaru ani...:):):) meeru enthina great andi

    ReplyDelete
    Replies
    1. ప్రకాశముగా :

      అబ్బే! నేను గ్రేటేంటండి? ఏదో మీ అభిమానం. నేనో తోక తెగిన బల్లిని, సొట్టలు పడ్డ బొచ్చెని.

      స్వగతముగా :

      నేను గ్రేటే కదా! ఇందులో విశేషమేముంది?!

      Delete
  2. తనదైన "చిరునవ్వుతో" మీ బ్లాగును పావనం చేస్తున్న మహనీయులు మీ అభిమాన నాయకులని చదివినట్టు గుర్తు నిజమేనా?

    ReplyDelete
    Replies
    1. ప్రశ్న అర్ధం కాలేదు. ఇంకొంచెం వివరంగా అడిగితే బాగుంటుందేమో!

      Delete
    2. ఎండే డొక్కల ఘోష (http://yaramana.blogspot.in/2013/09/blog-post_4399.html)

      "సమైక్యాంధ్ర కోసం మొక్కవోని దీక్షతో పోరాడుతున్న, అలుపెరుగని ప్రజానాయకుడు పరకాల ప్రభాకర్. ఆయన మన తెలుగు వాడవటం మనం చేసుకున్న అదృష్టం. ఇవ్వాళ సభకి ఆయన కూడా వస్తున్నాట్ట. అంతటి గొప్పనాయకుణ్ణి దర్శించుకునే భాగ్యం జీవితంలో నాకింత తొందరగా వస్తుందనుకోలేదు. ఏమి నా భాగ్యము!"

      అప్పుడే ఆ మహనీయుని మరిచితిరా? వారి దర్శన భాగ్యము ఆ దినమున మీకు కలగకపోవడం మీ (మా) దురదృష్టం.

      అయినను వారు మిమ్ముల మన్నించి తమ చిరుదరహాసముతో (చిరు అంటే చిరంజీవి కాదు సుమా) మీ (మా & మన) బ్లాగులో తన భక్తులందరికీ దర్శనం ఇచ్చి మన జన్మ పావనం చేసినారు. అట్టి మహనీయుని ముఖారవిందం గాంచిన బ్లాగ్మిత్రుల దేహాలు పులకించుట తధ్యము. ఇట్టి సదవకాశం కల్పించిన మీకు ఇవే మా వందనాలు.

      Delete
    3. జై గారు,

      కొంచెం ఇబ్బంది - నేన్రాసిన పోస్టు నాకే గుర్తుండకపోవటం!

      బోల్డంత సంతోషం - నా పాత పోస్ట్ మీకు బాగా గుర్తున్నందుకు!

      చక్కని కామెంట్ రాశారు.

      థాంక్యూ!

      Delete
    4. మీ పాత పోస్టు నాకు గుర్తున్నందుకు కారణం మీ గొప్పదనం కాదు, పరప్రభ గారి అమోఘ చాతుర్యం. వారి గొప్పదనం గురించి వర్ణించడానికి నా తెలుగు పరిజ్ఞానం సరిపోదు అయినా ప్రయత్నిస్తాను. వారు దేశానికే మణిదీపం, కారణజన్ములు, అసమాన ధీరులు, నిరుపమాన కళా కోవిదులు, సింగినాదం, జీలకర్ర, అప్పడాల కర్ర వగైరా వగైరా (I just ran out of Telugu superlatives in my limited vocabulary).

      పై వ్యాఖ్యాత స్వరూప తుమ్మల గారు అన్నట్టు మీరూ గొప్పవారే కానీ జాతికే వన్నె తెచ్చేంత స్థాయికి ఎదిగిన పరప్రభ గారి ముందు మీరు సైతం సరిపోరు.

      Delete
  3. రమణగారు,
    భర్త ఎన్నుకొన్న రాజకీయారంగంలో పరిస్థితి ఆశవహంగా లేనపుడు, ఆయన "ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగ పలికే" అని శ్రీ శ్రీ ఊహించిన సహచరి లక్షణాలు నిర్మల గారి లో ప్రస్పుటంగా నాకు కనిపించాయి. మాంగల్య బలం సినేమాలో శ్రీ శ్రీ గారు చెప్పినట్లు వాళిద్దరు "హాయిగా ఆలుమగలై కాలం గడపాలి, వేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి" అని ఆశిస్తూ
    జాతీయ మీడీయాలో మధ్య తరగతి మనోభావాలను ప్రతిబింబిస్తూ, చోర్దీప్ దేశాయ్ లాంటి వారి దూకుడిని అవలీలగా అడ్డుకొని, నోరేత్తకుండా వాయించి, చుక్కలు చూపించే నిర్మలా సీతారామన్ అంటే ప్రత్యేక అభిమానం.

    ReplyDelete
    Replies
    1. అవున్నిజం.

      'గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం.' అని పాడుకుంటూ తిరుగుతున్న భర్తకి 'దొరకునా ఇటువంటి సేవా.. ' అనే భార్య లభించడం అదృష్టమే!

      Delete
    2. భర్తకి 'దొరకునా ఇటువంటి సేవా.. ' అనే భార్య లభించడం అదృష్టమే!"
      నిజమేనండి. భర్తకి అనుకూలవతి అయిన భార్య లభిస్తే అతను దేశాలనేలే చక్రవర్తికన్నా గొప్పవాడికింద లెక్క అని పెద్దలు చెప్తారు. 'అందం ,ప్రాయం,ఐశ్వర్యం గల సుందరి దొరకుట అరుదు కదా' అని పాట ఉంది. దానికి అదనంగా క్రమశిక్షణ,తెలివి,అధికారం,దైవభక్తి, మెండుగా గల గుణాలు గలిగిన, చాలా అరుదైన నిర్మల సీతారామన్ వంటి వారు మరింత శ్రద్దతో , వెంకటేశ్వర స్వామికి ఆర్జిత సేవల వలే సకాలంలో,క్రమమ తప్పకుండా కుటుంబ సభ్యులకు సేవలుచేస్తూ, 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ ' పాటలో సావిత్రి లాగా నాకు కనిపిస్తున్నారు :)

      Delete
  4. అవునండీ నిర్మలాసీతారామన్ గారు కేంద్రమంత్రి అవగానే ఈయనకు ఈపదవి వచ్చింది.కేవలం కాకతాళీయం

    ReplyDelete
    Replies
    1. అయ్యుండొచ్చు, నేనేం కాదనటంలేదు.

      ఆయన ప్రతిభని మెచ్చి అధినాయకులవారు ఆయనకీ పదవిని ఇచ్చుండొచ్చు.

      Delete
  5. ఇంతకాలానికి ఆయన ప్రతిభ గుర్తించే వారు దొరికారు

    ReplyDelete
    Replies
    1. మీరు ప్రతిభను గుర్తించినందుకు ప్రభుత్వాన్ని మాత్రమె మెచ్చుకోవడం బాలేదు. తన ప్రతిభను ఏలినవారి దృష్టికి తీసుకొచ్చిన ఘనత పరప్రభ గారిదే.

      ఆయన తన ప్రతిభను చాటే ఎఒక్క అవకాశమూ వదలలేదు. ప్రతి పార్టీలోకి చేరారు, మళ్ళీ వదిలేసేటప్పుడు కమెరాల సాక్షిగా దాన్ని ఘంటలు ఘంటలు అనర్గళంగా తిట్టారు. నిరంతరం ఖాళీ లేకుండా ఏదో ఒక మీడియాను పట్టుకొని ప్రజల కళ్ళ ముందు తారసలాడారు.

      ముఖ్యంగా తెలంగాణా ఉద్యమాన్ని నీరు కార్చేందుకు వారు చేసిన కృషి అమోఘం, అద్వితీయం, అనితరసాధ్యం, సింగినాదం, జీలకర్ర (ఇంకా చెప్పాలి కానీ మళ్ళీ నా పదవిజ్ఞానం న రాహిత్యం చెయ్యిచ్చింది). ఊరూరా తిరిగారు, పది మంది వచ్చినా రాకున్నా సభలు పెట్టారు, నోరారా తిట్టారు, ఎంతో శ్రమ పడ్డారు, అంతకంటే ఎక్కువ శ్రమపడి వాటికి మీడియా పబ్లిసిటీ వచ్చేలా జాగ్రత్త పడ్డారు.

      Delete
    2. జై వారు,

      ఈ రోజు మీడీయా అందరికి పబ్లిసిటి ఇస్తుంది. అందులోను ఆంధ్రుల వాదన వినిపించిన వారు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆయన దానికోసం ప్రత్యేకం గా శ్రద్ద తీసుకోని పాకులాడవలసిన అవసరం లేదు. ఎవరికి ఆయన మీటీంగ్ వలన లాభం ఉందనుకొంటే వారు చూపిస్తారు. ఇదే పాటర్న్ ఇతరులకు వర్తిస్తుంది.

      Delete
  6. నిన్న OP మధ్యలో టీ తాగుతూ.. ఒక చిన్న ఐడియాతో నాలుగు లైన్లు రాసేసి.. ఐదు నిమిషాల్లో పోస్టుగా మలిచాను.

    ఈ పోస్ట్ ఉద్దేశం - సరదాగా ఒకక్షణం నవ్వేసుకోడమే!

    అంచేత - ఇంత చర్చ అవసరం లేదని నా భావన. ఇంక కామెంట్లు ఆపేద్దాం. సరేనా?

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.