మనిషి పుట్టుకతో జంతువు. అయితే ఈ జంతువుకి ఆలోచన ఎక్కువ. ఆలోచనల ద్వారా - అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పయనించడం అనేది మనిషి చచ్చేదాకా కొనసాగే ప్రక్రియ. ఈ జ్ఞానాజ్ఞాములు సమతూకంలో వుంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని నా అభిప్రాయం. అజ్ఞానం ఎక్కువైతే సమాజానికి నష్టం, విజ్ఞానం ఎక్కువైతే మనిషికి నష్టం!
కొన్నిసార్లు జ్ఞానం ఆనందాన్నిస్తుంది, ఇంకొన్నిసార్లు అజ్ఞానమే సుఖాన్నిస్తుంది. అంచేత - ఈ జ్ఞానాజ్ఞానాల్లో ఎవరికేది కావాలో వారే నిర్ణయించుకోవాలి! నాకింత గొప్ప అవగాహన వుండడం వల్ల సుఖమయ జీవనం కోసం కొన్ని పన్లు మానేశాను. ఉదాహరణకు - నేను తెలుగు పత్రికలు చదవను, తెలుగు న్యూస్ చానెల్స్ చూడను. ఈ 'మానెయ్యడం' వెనక - గొప్ప థియరీ అంటూ ఏదీ లేదు. ఒకప్పుడు ఈ పన్లు చేస్తుంటే చిరాగ్గా వుండేది, మానేశాక ప్రశాంతంగా వుంది - అంతే! తద్వారా నచ్చని పని చెయ్యకపోవడంలో ఎంతో ఆనందం వుందని గ్రహించాను!
అలాగే - 'టైమ్స్ నౌ' అనే ఇంగ్లీషు న్యూస్ చానెల్ చూడ్డం మానేశాను. ఆ చానెల్‌కి ఎడిటర్ అర్నబ్ గోస్వామి అనే ప్రబుద్ధుడు. అతగాడు రాత్రిళ్ళు 'న్యూస్ అవర్' అంటూ ఒక చర్చల దుకాణం నడుపుతాడు. అయితే - అక్కడ చర్చలేమీ జరగవు. అక్కడంతా ఆ యాంకరాధముడి అరుపుల ప్రహసనం. ఆ అరుపుల్నే ప్రశ్నలు అనుకోమంటాడు! ఎవరికీ కూడా తన భీభత్స ప్రశ్నలకి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడు!
అన్నట్లు - అర్నబ్ గోస్వామిగారు గొప్ప దేశభక్తుడు కూడా! అతని దేశభక్తి వర్షాకాలం మురుక్కాలవ వలే పొంగి పొర్లిపోతుంటుంది. ఒక్కోసారి పూనకం స్థాయికి చేరుకొని - వేపమండల్తో కొడితే గానీ దిగదేమోనన్నంత ఉధృత స్థాయికి చేరుకుంటుంది. అప్పుడతను - తనకి నచ్చని అభిప్రాయాలు చెప్పే గెస్టుల్ని తిడతాడు, వాళ్ళు దేశద్రోహులంటూ మండిపడతాడు (గిచ్చడం, కొరకడం లాంటివేమన్నా చేశాడేమో నాకు తెలీదు)!
చాలారోజుల తరవాత (నా ఖర్మ కాలి) - అర్నబ్ గోస్వామి విన్యాసాలు వీక్షించే మహద్భాగ్యం మరొకసారి లభించింది. ఆరోజు - అతగాడు ఢిల్లీ రేప్ సంఘటన మీద ఒక బ్రిటీష్ యువతి తీసిన డాక్యుమెంటరీపై తీవ్రమైన కోపంతో ఊగిపోతున్నాడు. ఆ విదేశీయురాలు భారద్దేశం రూల్సుని పాటించలేదని చిందులేస్తున్నాడు. ఆవేశంలో నరాలు చిట్లి చస్తాడేమోనని భయపడ్డాను.. ఆ తరవాత కొద్దిసేపటికి ఆశ్చర్యపొయ్యాను.
ఏ దేశంలోనైనా, ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కలవాడైనా, 'ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్' అంటూ తపన పడతాడు. అయితే ఈ మహాజ్ఞాని ఆ డాక్యుమెంటరీని కేంద్రప్రభుత్వం నిషేధించడాన్ని సమర్ధిస్తాడు! ఆ నిషేధాన్ని ప్రశ్నించేవారిని తీవ్రస్థాయిలో కేకలేస్తున్నాడు. అతని దేశభక్తి ఉన్మాద స్థాయికి చేరింది! అంటే - ఇన్నాళ్ళైనా మనవాడి రోగం నిదానించలేదన్న మాట!
ఈ అర్నబ్ గోస్వామి సర్కస్ షోని క్రమం తప్పకుండా చూసే వాళ్ళు కూడా వున్నారు! కారణమేమి? ఎవరి కారణాలు వారివి. కొందరికి ప్రశాంతమైన చర్చలు ఇష్టం వుండదు. వారికి - తగాదాలు, తిట్టుకోడాలు, గందరగోళాలంటే ఇష్టం. వీళ్ళు - రోడ్డు మీద చిన్నపాటి తగాదాల్ని గుంపులుగుంపులుగా చేరి ఆసక్తిగా చూసే బాపతు. ఇంకొందరు సర్కస్ ప్రియులు! మరికొందరికి కోతి చేష్టలంటే భలే ఇష్టం!
'న్యూస్ అవర్' ప్రోగ్రాం WWE పోటీల్ని మరిపిస్తుంది. అక్కడా ఇంతే - పోతుల్లంటి వస్తాదులు ఒకర్నొకరు తీవ్రంగా దూషించుకుంటారు, ద్వేషించుకుంటారు, చాలెంజిలు విసురుకుంటారు. ఆ టెంపోని ఒక స్థాయికి తీసుకెళ్ళాక కొట్టుకుంటారు (కొట్టుకున్నట్లు నటిస్తారు). ఈ తగాదాలు జనాకర్షకంగా వుండేట్లు రాయడానికి ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటర్లు వుంటారు. అదొక ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ, ఫక్తు వ్యాపార సంస్థ. వాళ్ళ తన్నులాట ఎంత ఎక్కువమంది చూస్తే వారికంత గిట్టుబాటు.
అర్నబ్ గోస్వామి కూడా WWE సూత్రాన్నే నమ్ముకున్నట్లుగా వుంది. అతనికి తన ప్రోగ్రాంని ఇష్టపడేవారు, అసహ్యించుకునేవారూ.. ఎవరైనా పర్లేదు - వ్యూయర్‌షిప్ వుంటే చాలు! అందుకోసం వార్తల్ని వీధిపోరాట స్థాయికి దించేసి విజయం సాధించాడు. 'ద నేషన్ వాంట్స్ టు నో' అంటూ దబాయిస్తాడు - అదేదో దేశమంతా పన్లు మానుకుని అతని ప్రోగ్రామే చూస్తున్నట్లు! 'ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి' అంటూ ఏవో కాయితాలు చూపిస్తూ ఊపుతుంటాడు (ఎప్పుడు ఊపినా అవే కాయితాలని మా సుబ్బు అంటాడు)!
'వార్తలు - వీధిపోరాట చర్చలు' అనే వినోద కార్యక్రమంతో గోస్వాములవారూ, తద్వారా టైమ్స్ నౌ చానెల్ వారూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. వారి వినోద వ్యాపారం రిలయన్స్ వారి వ్యాపారంలాగా విజయవంతంగా కొనసాగుతుంది. చర్చల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన సీరియస్ వార్తల్ని సైతం యాక్షన్ థ్రిల్లర్ స్థాయికి దించేసిన ఈ చౌకబారు కార్యక్రమం చూడకపోవడం నాకు హాయిగా వుంది! మీక్కూడా ఆ హాయి కావాలా? అయితే - అది మీ చేతిలోనే వుంది!
'మిస్టర్ అర్నబ్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!'
(photo courtesy : Newslaundry)
ఎడ్ మర్రో గురించి మీకు తెలిసే ఉంటుంది. మన అర్నాబ్, కరణ్ థాపర్ అతన్ని ఇమిటేట్ చెయ్యడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటారు. అందుకే మనకీ పాట్లు.
ReplyDeleteఒకప్పుడు లారెల్-హార్డీ, వీరభద్రరావు-వేలు, కోటా-బ్రహ్మానందం లాంటి కామెడీ జంటలు సినిమాలలో ఉండేవాళ్ళు.. ప్రస్తుతం వాళ్ళను రీప్లేస్ చేస్తూ అర్నాబ్-సంజయ్ ఝా, అర్నాబ్-సంబిత్ పాత్ర మనకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. మీకు అర్నాబ్ లోని entertainment quotient అర్థం కావాలంటే అప్పుడప్పుడూ ఈ వెబ్సైట్ చూస్తూ ఉండండి.
http://www.theunrealtimes.com/
ఎడ్ మర్రో గూర్చి ఇంతకుముందు విన్నాను. ఇప్పుడు వికీలో చదివాను. థాంక్యూ!
Deleteనేను తెలుగు మరియు హింది టివి చాలా అరుదుగా తప్ప చూడను కాబట్టి నాకు ఈ సమస్య లేదు. ఈ ఆర్నబ్ పేరు ఏదో విన్నట్టున్నా కానీ అతని ప్రోగ్రాం ఎప్పుడూ చూడలేదు. రక్షించారు. ఇకముందు చూడను కూడా.
ReplyDeleteమీ పట్ల ఈర్ష్యగా వుంది. :)
DeleteEven i heard the name only, nrver watched his program.
Deleteఆర్నాబ్ ఒక విచిత్రమైన వ్యక్తి. ఇతని రోగానికి మానసికవైద్యమే లేదా?
ReplyDeleteఅసలు ఈయన షోకి బలిపశువుల్లా చర్చించడానికి ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు.
కాకపోతే బాగా డల్‌గా ఉన్నప్పుడు మంచి కిక్ ఇచ్చే షో ఇది.
అర్నబ్‌ది మానసిక సమస్య కాదు, చానెల్ రేటింగ్ పెంచుకునే వ్యాపార ఎత్తుగడ!
Delete(నాకు తెలిసి) కొంతమంది ఇతని చర్చల్లోకి రావడం మానేశారు.
ఇలాంటి మాధ్యమాల గురించి స్వ. పైడి తెరేశ్ బాబు ఏమన్నారో గుర్తు చేసుకుందాం:
ReplyDeleteవిభజన గీత-13
ఏకాం హి ద్వయో ఏకహ! ఏకాద్వయో త్రయంబకరాం!
త్రయోదశాంచ ద్వాదశహ! రిమోటాస్త్రాం ప్రయోగామ్యహం !
అపార్థా
రెండు ఒకట్లు ఒకటి యని, ఒక రెండ్లు మూడు యని, మూడు ఒకట్లు పదమూడున్నర యని,పదమూడు ఒకట్లు పన్నెండుంబాతిక యని దేనికి తోచిన కథనము అది ప్రచురణము,ప్రసారము చేయుచున్నది. ఏ పత్రిక,ఏ చానల్ కథనము ఎట్లేడ్చిననూ బకరా వలె నమ్మక, రెండు ఒకట్లు రెండే యను గణిత సూత్రముననుసరించి రెండు రాష్ట్రముల ఏర్పాటు తప్పదను సత్యమును నీవు విశ్వసింపుము. కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము.
టంగ్ టంగ్ టంగ్ టట్టంగ్ టంగ్ [ఇది ప్రాధమిక పాఠశాల ఘంఠారావము మరియూ పరమశుంఠా నాదము]
మీరు కవి తెరేష్‌బాబుని గుర్తు చెయ్యడం చాలా సంతోషంగా వుంది. ఆయన విభజన గీతల అభిమానిని నేను.
Deleteకవులకున్న సౌలభ్యం రచయితలకి వుండదు. ఆకాశాన్ని అరచేతిలో చూపించగల సమర్ధులు వారు. నేన్రాసిన పోస్టుని నాలుగు ముక్కల్లో తేల్చేశాడు తెరేష్‌బాబు! :)
ఇతని షోస్ ఏవీ ఐదు నిముషాలు కూడా చూడలేనండీ :-) మీ పోస్ట్ లో లాస్ట్ లైన్ సూపర్ :-)
ReplyDeleteథాంక్యూ!
Delete'ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ' కావాలి. అయితే ఎవరికీ మనకుమాత్రమే. అవతలి వాడికి ఉన్నట్లైతే మనల్ని చీల్చి చెమ్డాడుతాడు. ఆస్తి కావాలి. అయితే ఎవరికీ ? మనకు మాత్రమే. అవతలి వాడికి ఉంటే మనకునా గుర్తిమ్పేమ్టి? అన్ని హక్కులు ఉండాలి సార, అయితే అవి మనకు మాత్రమే ఉండాలి. అదే "ప్రజా స్వామికం." అలాగే విజ్ఞానం కూడా మనకే ఉండాలి. అవతలి వాడికి కూడా ఉంటే మనకు గుర్తిమ్పేమ్టి? తదాస్తు. jai rnab gOswamii.
ReplyDeleteఅంతే కదా మరి! :)
DeleteThe main reason for his outburst on the documentary is, NDTV got the telecast rights for the documentary.
ReplyDeleteYes, I agree with you.
Delete
ReplyDeleteవామ్మో వామ్మో ! మా మీడియా ఆల్ టైం స్టార్ అర్ణాబ్ మీద ఇన్నేసి అభాండాలా !
ఉండండి మీ పని జెబ్తా ! అర్ణాబ్ దగ్గిర చెప్పి మిమ్మల్ని ముఖాముఖి - ప్రైం అవర్ - లో చెయ్యమని చెబ్తా !
అప్పుడు తెలుస్తుంది అర్ణాబ్ తడాఖా !!
చీర్స్
జిలేబి
జిలేబి జీ,
Deleteనేను అరవలేను. నెమ్మదిగా, నిదానంగా మాట్లాడతాను. అంచేత - అక్కడ జరిగేది ముఖాముఖి కాదు, ఏకపక్షంగా అర్నబ్‌తో తిట్టించుకోడమే! అయినా - నో ప్రోబ్లం! నాకు పేషంట్లతో తిట్టించుకోవడం అలవాటే!
excellent analysis sir !!! i completely agree with you
ReplyDeleteMr. Arnab, please GO Swamee! Or I will express my freedom with a remote.
ReplyDeleteఆర్టికల్ చాలా బావుంది, సర్!
శ్రీ నివాస్ గారి కామెంటు అదురహో !!
Deleteసూపెర్!
జిలేబి
Srinivas garu,
DeleteI second Zilebi ji.
మొదటి పేరా చదవంగానే రెక్కల తాబేలు.... తోక పీత గుర్తు కు వచ్చాయి.... మనలో వుండే ఆజ్ఞానాన్ని తెలుసుకోవడం మన భాద్యత కాదు.... ఆ పని ఎదుటివాడిది... అలాగే ఎదుటి వాడి ఆజ్ఞానాన్ని గుర్తించడమే మన లోని జ్ఞానానికి నిదర్శనం.... :-) :-) :-) ఆ లెక్కన అర్నాబ్ గోస్వామి మహా జ్ఞాని....
ReplyDeleteలెస్స పలికితిరి! :)
Deleteఏమాత్రమూ డీసెన్సీ లేని టాక్ షో ఇదేననుకుంటా.WWE లో కనీసం ఇద్దరూ కొట్టుకుంటారు. ఇక్కడంతా అర్నాబ్‌దే కొట్టుడైనా, లాగుడైనా, పీకుడైనా. ఎనీవేస్, ఇప్పుడైతే మానేసాకానీ, ఒకప్పుడు ఈ టాక్‌షో చూసిన తర్వాత కాసేపు విరుగుడుగా ఆర్.ఎస్.టీవీలో (రాజ్యసభ టీవీ) వచ్చే టాక్ టైమ్ చూసేవాడిని. రెండూ రెండు పోకడలు.
ReplyDeleteడీసెన్సీ లేకపోవడమే ఈ షోకి ఆకర్షణ! దేనికుండే ప్రేక్షకులు దానికుంటారు! :)
Deleteఆర్ణబ్ గావుస్వామి కి సుబ్రమణ్యస్వామి తోడైతే?
ReplyDeleteరాలేది బూడిదే! :)
Deleteసార్ ! నా పతి దేవుడు రోజూ అతన్ని చూస్తే కానీ నిద్ర పొయే వారు కాదు, భరించలేక ఒక హెడ్ సెట్ కూడా కొని ఇచ్చాను. అసలు ఆ షో బ్యాన్ చేస్తే బాగుండు అని రోజూ నిజం దేవుణ్ణి మొక్కే దాన్ని, షో ఆపలేదు కానీ మా వారు కొంచెం టైం దొరికినా నిద్ర పోయేంత బిజీ అయిపొయారు. నాకు ఇప్పుడు నెమ్మది గా ఉంది.
ReplyDeleteఎవరు ఏమన్నా మీరు పోస్టులు ఆపకండి. మీ పోస్టుల్లో మాలాంటి వాళ్ళం మా భావాల్ని recognize చేసుకుంటాం. ( అందరికీ రాయటం రావొద్దూ ?)
Thanks for every post.
బయటి ప్రపంచంలో తెలుగు బ్లాగులు చదివేవాళ్ళు నాకెప్పుడూ కనపళ్ళేదు. చదివినా - బ్లాగుల్ని ఎవ్వరూ సీరియస్‌గా పట్టించుకోరు. ఇదంతా ఓ కాలక్షేపం వ్యవహారం. అంచేత - నేను (అప్పుడప్పుడు) నిర్లక్ష్యంగా కూడా రాస్తుంటాను.
Deleteఇప్పుడు మీ కామెంట్ చదూతుంటే నా అభిప్రాయం తప్పేమో అనిపిస్తుంది.
బయటి ప్రపంచమున్ తెలుగుబ్లాగులు వంకకు చూచునట్లుగా ......
Deleteపద్యం పూర్తిగా వ్రాయటం లేదు మన్నించండి. (ఒక వేళ పూర్తిచేయనందుకే ఆనందిస్తున్నారా? శుభం. అల్లాగూ మంచిదే లెండి. కానివ్వండి)
ఈ ఒక్కపాదం సులభంగానే ఉందికదా. అలా బహిఃప్రపంచమూ మనతెలుగుబ్లాగులు చదివేందుకు, గర్వంగా మా తెలుగుబ్లాగులు అని చెప్పుకోగలందులకు అందరం కృషిచేయాలని నా విన్నపం. అగ్రిగేటర్లు సరైన నిబంధనలతో వస్తే, వాటిని వదిలి సరుకున్న బ్లాగులద్వారా తెలుగుబ్లాగులకు మంచి ఖ్యాతి వచ్చే అవకాశం ఉంటుంది. ఏ నిబంధనలకన్నా అక్షేపణలు తప్పవనుకోండి. కాని నలుగురూ కలిసి వాసిని పెంచేందుకు ఆలోచించవలసిన పరిస్థితి ఉందని నా అభిప్రాయం.
మీ అభిప్రాయాలతో కొందరు వివాదించినా మీ బ్లాగు వాసికేమీ లోపం కనిపించటంలేదు. ఇబ్బంది పడకండి.
శ్యామలీయం గారు,
Deleteఎవరికి ఏది నచ్చితే అది రాసుకుంటారు. చదివేవాళ్ళు చదువుతారు, లేకపోతే లేదు. ఎగ్రిగేటర్లు ఇవ్వాళ వుండొచ్చు, రేపు మూత పడొచ్చు. అలాంటప్పుడు - తెలుగు బ్లాగుల స్థాయి 'పెంచడం', 'దించడం' ఎవరిచేతిలోనైనా ఎలా వుంటుంది!?
తెలుగుబ్లాగులు కేవలం కాలక్షేపం సరుకు కాదు, విషయం ఉన్నవే చదివించేగుణమూ ప్రయోజనమూ ఉన్నవే అన్న పేరు తెచ్చుకోవాలంటే బ్లాగులు వ్రాసేవారు తదనుగుణంగా వ్రాయాలికదా. అది అనవసరం అనుకుంటే వాదం లేదు. ఎవరిష్టం వారిది.
Deleteశ్రీ అర్నబ్ గోస్వామి గారు దేశానికో మేలు చేసిన విషయం కూడా మనం ఈ సందర్భంగా
ReplyDeleteమర్చిపోకూడదు. మాన్య రాహుల్ గాంధీ గారి జ్ఞాన సుగంధాన్ని మనందరకూ నిస్వార్ధంగా
పంచిన మహా మనీషి ఆయన. తనను తాను, తనకు తానుగా లోకానికి స్వచ్చంగా
తెలియ పర్చుకునే అవకాశాన్ని ఆయన శ్రీ రాహుల్ గాంధీ గారికి తన షో ద్వారా
ప్రసాదించడం కూడా శ్రీ అర్నబ్ తెలిసో తెలియకో దేశ హితానికి పాలుపడిన చర్యే.
కాకుంటే నాకైతే రాహుల్ గాంధీ దేశానికి ప్రధాన మంత్రి కాకపోవడంలో దేశానికేమైనా
నష్టం జరిగి ఉండేదా !? అన్న (కు)శంక పీడిస్తూనే ఉండే ...దేమో !?... నని...
రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ కోసం కాంగ్రెస్ పార్టీ 'టైమ్స్ నౌ' చానెల్‌ని ఎన్నుకోడానికి ప్రధాన కారణం - ఆ చానెల్‌కి ప్రింట్ ఎడిషన్ ('టైమ్స్ ఆఫ్ ఇండియా' న్యూస్ పేపర్) కూడా వుండటమే. కాకపోతే - అదంతా తన ప్రతిభేనని అర్నబ్ పోజు కొడుతుంటాడు.
Delete(అవును, ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ తిప్పలు భలే కామెడీగా వుంటాయి.)
నేను చూసిన ఒకే ఒక అర్ణబ్ షో !
ReplyDeleteఅసలు ఆ షో కి వచ్చినందుకు రాహుల్ గాంధీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
అర్నబ్ షోకి రాహుల్ గాంధీ ధైర్యంగా రాలేదు! అమాయకంగా వచ్చాడు! :)
Deleteఅదీ నిజమేనండీ, రాహుల్ ని చూస్తే అయ్యో పాపం అనిపించించింది.
Delete