Wednesday, 25 March 2015

కష్టమైన ప్రశ్న


"నువ్వీమధ్య తెలుగు న్యూస్ పేపర్లని ఇన్సల్ట్ చేస్తున్నావు."

"నేనా! ఎలా?"

"వాటిని చదవొద్దని చెబుతున్నావుగా?"

"చదవొద్దని చెప్పలేదనుకుంటా! కొనొద్దంటున్నాను."

"అలా చెప్పడం కూడా ఇన్సల్ట్ చెయ్యడమే అవుతుంది."

"ఎలాగవుతుంది? ఎవరైనా ప్రచార కరపత్రాలు ఫ్రీగా ఇస్తే చదువుతారు గానీ, కొనుక్కుని చదువుతారా?"

"అంటే - తెలుగు న్యూస్ పేపర్లు ప్రచార కరపత్రాలా?"

"అవును. అవి ఆయా రాజకీయ పార్టీల ప్రచార కరపత్రాలే కదా!"

"ఒప్పుకుంటున్నాను. కానీ - అన్నీ కాదుగా?"

"కాదా? బాబ్బాబూ! వార్తల్ని వార్తలుగా రాసే తెలుగు పత్రికేదైనా వుంటే చెప్పవా? వెంటనే చందా కడ్తాను."

"ఇది చాలా కష్టమైన ప్రశ్న. వెంటనే సమాధానాం చెప్పాలంటే కుదర్దు. కొద్దిగా టైమివ్వు. ఆలోచించుకుని చెబ్తాను."

"టేక్ యువరోన్ టైమ్." 

(picture courtesy : Google)

4 comments:

  1. చాలా అన్యాయం సార్. టీవీ చానెల్లను వదిలేసి కేవలం పత్రికలను విమర్శించడం బాలేదు. పాపం వాళ్ళేమి తక్కువ తిన్నారు?

    ReplyDelete
    Replies
    1. నిజమే! టీవీ చానెళ్ళు కూడా ఆయా పార్టీల సొంత దుకాణాలే. కాకపోతే - ఒక చానెల్‌కంటూ ప్రత్యేకంగా చందా కట్టం గదా!

      Delete
  2. న్యూస్ ఎప్పుడో చచ్చిపోయింది..... ఇప్పుడంతా వారి వారి పోషకుల వ్యూస్ .... పతంజలి గారి పెంపుడు జంతువులు.... మళ్ళీ గుర్తుకు వచ్చింది.... సార్.... థాంక్స్....

    ReplyDelete
    Replies
    1. పతంజలిని గుర్తు చేసినందుకు మీక్కూడా థాంక్స్!

      Delete

comments will be moderated, will take sometime to appear.