Friday 27 March 2015

ధోని మూర్ఖత్వం


"చిలక్కి చెప్పినట్లు చెప్పాను. విన్నాడా? లేదే! ఇప్పుడనుభవిస్తున్నాడు."

"ఎవరు?"

"ఇంకెవరు? ఆ ధోని!"

"మీరా! ధోనీకా! ఏంచెప్పారు?"

"అసలా ఆస్ట్రేలియా ఖండమే ఒక శనిగ్రహం. ఇండియాకి దక్షిణాన ఎక్కడో కిందుంది.  ఆ ఖండానికో వాస్తా పాడా! అందులోనూ మనవాళ్ళు బస చేసింది సిడ్నీకి ఆగ్నేయంగా వుండే హోటల్లోనాయె! ఆ హోటల్ మనకి అచ్చిరాదయ్యా ధోనీ, ఈశాన్యం వైపునుండే హోటల్‌కి బస మార్చు అన్జెప్పా. విన్నాడా? లేదే! ఇప్పుడనుభవిస్తున్నాడు."

"కుదర్లేదేమో!"

"కుదరాలి. కేప్టనన్నాక శాస్త్రం చెప్పినట్లు నడుచుకోకపోతే ఎలా? శాస్త్రానికి ఎదురు తిరిగితే మంచినీళ్ళు కూడా పుట్టవు! సెమీ ఫైనల్‌కి ముహోర్త బలం లేదు, ఇండియా వైపు శుక్రుడు వక్ర ద్రుష్టితో చూస్తున్నాడు. శుక్రుణ్ని తప్పించుకోవాలంటే, మ్యాచ్‌లో ఎరుపురంగు దుస్తులు వాడాలని చెప్పాను. విన్నాడా? లేదే! ఇప్పుడనుభవిస్తున్నాడు."

"మన డ్రెస్ బ్లూ కలర్ కదా!"

"అయితేనేం? ప్యాంట్ లోపల కట్ డ్రాయర్లు ఎర్రవి వేసుకోవచ్చుగా? వేసుకోలేదు! అంతా అయ్యాక - ఇప్పుడు ఎంతేడ్చినా ఏం లాభం!"

"అయినా క్రికెట్‌కి వీటితో సంబంధం ఏంటి!?"

"వుంది నాయనా వుంది. ఏదైనా శాస్త్రం ప్రకారం జరగాల్సిందే! గ్రహబలం కలిసి రాకపోతే బౌలర్‌కి బంతి పడదు, బ్యాట్స్‌మన్‌కి బంతి కనిపించదు. ధోనీ మూర్ఖత్వం వల్ల ఇవ్వాళ దేశానికే నష్టం కలిగింది. అదే నా బాధ!"

"ఇంతకీ ఎవరండి తమరు?"

"ఓయీ అజ్ఞానీ! శ్రీశ్రీశ్రీఅండపిండ బ్రహ్మాండ దైవజ్ఞ సిద్ధాంతినే ఎరగవా? నేనెవరనుకున్నావు? తెలుగు ముఖ్యమంత్రులు నా క్లయింట్లు. నా సలహా లేకుండా వాళ్ళు వీపు కూడా గోక్కోరు."

"అలాగా!"

"తెలంగాణా ముఖ్యమంత్రి జాతక రీత్యా హైదరాబాద్ నగరం నడిబొడ్డున నీళ్ళుండటం ఆయన కుటుంబానికి అరిష్టం అన్జెప్పాను, అంతే! ఆయనిప్పుడు హుస్సేన్ సాగర్‌ని పూడ్పించే పన్లో పడ్డాడు. కృష్ణానది తూర్పుదిశగా ప్రవహించడం ఆంధ్రా ముఖ్యమంత్రి పదవికి గండం అన్జెప్పాను, అంతే! ఆయనిప్పుడు కాలవలు తవ్విస్తూ కృష్ణానది ప్రవాహ దిశని మళ్ళించే పన్లో పడ్డాడు. ఏదో క్రికెట్ మీద ఆసక్తి కొద్దీ ధోనీకి సలహాలు చెప్పానే గానీ - అయాం వెరీ బిజీ యు నో!"   

(picture courtesy : Google)

14 comments:

  1. నేను కూడా ధోనితో చెప్పాను. పేరు DH@NNAEIOUEE అని మార్చాలని.....వినలేదు కోహ్లి కి కూడా చెప్పా..కోహ్లీ ఆడాలంటే అనుష్క....ఫ్లూఠో గ్రహానికి పూజలు చేయమని.

    ReplyDelete
    Replies
    1. కొడవటిగంటి కుటుంబరావు డెబ్భయ్యేళ్ళ క్రితం ఇట్లాంటి రచనలు చెయ్యగా - నేను ముప్పయ్యేళ్ళ క్రితం చదివాను. ఆయన రచనలు ఈనాడు కూడా రిలవెంట్‌గా వుండటం దురదృష్టం.

      ఆనాటి నమ్మకాలకి సమాజంలోని నిరక్ష్యరాస్యతే కారణమని అనుకున్నాను. అయితే - ఈనాడు మనకి చదువుకున్న నిరక్ష్యరాస్యులు తయారయ్యారు. :)

      Delete
  2. పనిలేని డాక్టరు గారూ, ఈ మధ్య మీమీద విమర్శలు జోరైనట్లు కనిపిస్తోంది.

    మీరు పూర్వాభిముఖంగానే కూర్చుని వ్రాస్తున్నరా లేదా? అదేలెండి తూర్పుకేసి తిరిగి కూర్చుంటున్నారా అని అడుగుతున్నాను!

    తూర్పుకేసి ఎందుకు తిరగాలీ అంటారా? నాకు మీకు పాఠం చెప్పే తీరికలేదు. కష్టేఫలే శర్మగారు మొన్ననే కాబోలు తమ బ్లాగులో వ్రాసారొక టపా దీనిమీద. వెంఠనే చదివేయండి మరి.

    ఎవరన్నా బ్లాగువాస్తు అని పుస్తకం వ్రాస్తే బాగుండును. నాకేమో తీరిక లేదాయె.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      అవును. ఈమధ్య నాపై విమర్శలు ఎక్కువయ్యాయి. కాకపోతే - మర్యాదగానే విమర్శిస్తున్నార్లేండి. వారికి నా ధన్యవాదాలు.:)

      Delete
  3. అసలు దోనీలో శని ప్రవేసించే గదా సిద్దాంతి గారి మాట చెవిన ఏసుకోంది. దేవుడు అనుగ్రహం లేకే గదా గ్రహించనిది? ఉండుంటే అన్ని చెవినేసుకునే గదా? ఏదోలే మన కర్మ కొద్ది, మన గ్రహ బలం బాగులేక, అన్ని జరి గిపోయాయి గానీ మనకేమి ఆడక తెలియకనా ఏమి? అన్నటు కౄష్ణా నది ప్రవాహ దశను మల్లీంచే కంటే దాని అమ్న రాస్త్రంలో అడు పెట్టనీయక పోవటమే మంచిది గదా? ఈ ఆలోచన సిద్దంతి గారి రాలేదా?

    ReplyDelete
    Replies
    1. ఏది ఏమైనప్పటికీ - శాస్త్రాన్ని కాదన్నవాడు భ్రష్టు పట్టాల్సిందే.. అది ధోని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. :)

      Delete
  4. అసలు దోనీలో శని ప్రవేసించే గదా సిద్దాంతి గారి మాట చెవిన ఏసుకోంది. దేవుడు అనుగ్రహం లేకే గదా గ్రహించనిది? ఉండుంటే అన్ని చెవినేసుకునే గదా? ఏదోలే మన కర్మ కొద్ది, మన గ్రహ బలం బాగులేక, అన్ని జరి గిపోయాయి గానీ మనకేమి ఆడక తెలియకనా ఏమి? అన్నటు కౄష్ణా నది ప్రవాహ దశను మల్లీంచే కంటే దాని అమ్న రాస్త్రంలో అడు పెట్టనీయక పోవటమే మంచిది గదా? ఈ ఆలోచన సిద్దంతి గారి రాలేదా? :)

    ReplyDelete
  5. ఇకపై టపా రాసేటప్పుడు కంప్యూటర్ స్క్రీన్ తూర్పుకు పెట్టి మీరు పడమటి వైపు తిరిగి రాయండి. పోస్టు ఆదరకపోతే అడగండి!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు తూర్పు వైపు తిరిగి రాయమంటున్నారు. మీరేమో పడమర వైపు అంటున్నారు! 'ఇంతకీ అసలు దిక్కు ఏ దిక్కు?' దిక్కుమాలిన ప్రశ్న అనుకోకుండా, 'ఒక దిక్కు తోచనివాడి ప్రశ్న' అనుకుని సమాధానం చెప్పగలరు. :)

      Delete
    2. Compromise solution :)

      శ్యామలీయం గారు చెప్పినట్టే తూర్పుకు తిరిగి రాసినా ఒకే కానీ కంప్యూటర్ పడమటి వైపు తిప్పండి. కంప్యూటర్ స్క్రీన్ నీడ కూడా మీ మీద పడకుండా జాగ్రత్త పడాలి అప్పుడే అక్షరాలూ బాగా కుదురుతాయి.

      Delete
    3. మీ సలహా పాటిస్తాను. పోస్టులు బాగుంటే క్రెడిట్ నాకు, బాగోకపోతేె డిస్‌క్రెడిట్ మీకు! :)

      Delete
  6. Very relevant write up but like many things, people who read this don't need it and people who need to know may not read this unfortunately. Humerous as always!!

    ReplyDelete
    Replies
    1. మిత్రమా! బహుకాల వ్యాఖ్యా దర్శనం. ధన్యవాదాలు!
      ఏదో ఊసుబోక రాసుకోడమే తప్పించి - రాసింది చదివి మారిపోడానికి ఇదేమన్నా తెలుగు సినిమానా!?

      Delete

comments will be moderated, will take sometime to appear.