Tuesday, 31 January 2012

నటనకి కులం ఉందా.. !?



టీవీలో  పాండురంగ మహత్యం  సినిమా  చూస్తున్నాను. ఘంటసాల  పాడిన 'అమ్మా  అని  అరచిన  ఆలకించవేమమ్మా.. ' పాట  వస్తుంది. ఘంటసాల  అద్భుత గానం. రామారావు  హృదయ విదారక  నటన. చూడ్డానికి  రెండు కళ్ళు  చాలవు. ఆనందంతో.. తన్మయత్వంతో.. మైమరచి  చూస్తుండగా..

"రవణ మామా! కాఫీ. అర్జంట్." అంటూ  సుడిగాలిలా  సుబ్బు  అడుగెట్టాడు.

"నీ  కాఫీదేముంది గానీ.. ఈ  పాట  చూడు  సుబ్బు. నీ  జన్మ  ధన్యమౌతుంది." అన్నాను.

సుబ్బూ  కూడా  సినిమా  చూస్తూ  కూర్చున్నాడు. పాట  అయిపోయింది.

"రామారావు  తెలుగువాడిగా  పుట్టటం  మన  అదృష్టం. ఆయన  దురదృష్టం." ఎప్పుడో, ఎక్కడో  ఎవరి గూర్చో  ఎవరో  అనంగా  చదివాను. ఈ  భారీ డైలాగ్  నాకు  బాగా  నచ్చింది. అందుకే.. ఇదిగో  ఇప్పుడు  రామారావు  కోసం  వాడి పడేశాను!

"తెలుగులో  అక్షరాలు  ఎక్కువ. వాచాలత్వం, వాగాడంబరం  కూడా  ఎక్కువే. రామారావు  తెలుగువాడవడం  మనకి  అదృష్టం  అనేది  అర్ధమైంది. కానీ ఆయనకి  దురదృష్టం ఎందుకో  అర్ధం  కాలేదు."

అమ్మయ్య! ఇన్నాళ్ళకి  సుబ్బుకి  క్లాస్  పీకే  అవకాశం  వచ్చింది.

"ఒరే నాయనా! నీకు  అరటిపండు  ఒలిచి  చేతిలో  పెడితే గానీ  అర్ధమయ్యి  చావదు. మళ్ళీ  అన్నిట్లో  నోరేస్తావ్. రామారావు  ఏ  అమెరికాలోనో  పుడితే  అంతర్జాతీయ  స్థాయి  నటుడయ్యేవాడు. గ్రెగరి పెక్, మార్లన్ బ్రాండో, రాబర్ట్ డి నీరో  పంక్తిలో  ఉండేవాడు. కేవలం  తెలుగువాడవటం  చేత  ఆయన  కీర్తి  తెలుగు దేశానికే  పరిమితమయ్యింది."

మా  సుబ్బు  ఒక  క్షణం  ఆలోచించాడు.

"రవణ మావా! ఈ  ప్రపంచం  ఒక  ఏక్సిడెంట్ల  కూపం. అందులో మనిషి జన్మ  ఒక  పెద్ద ఏక్సిడెంట్. ఈ  ఏక్సిడెంట్లు  కొందరికి  లాభం. కొంతమందికి  నష్టం. చాలామందికి  శాపం. ఏ  అంబాని  కుటుంబంలోనో, గాంధీ  వంశంలోనో  పుట్టటం  జాక్ పాట్. మన  దేశంలో  మనం  పుట్టిన  ప్రదేశం, కులం, జెండర్  మనిషి  భవిష్యత్తుని  చాలామటుకు  నిర్ణయించేస్తాయి. ఉదాహరణగా  నువ్విప్పుడు  ఆకాశానికెత్తేస్తున్న  ఎన్టీరామారావునే  తీసుకుందాం. తెలుగు  సినీ పరిశ్రమ  ఆ  రోజుల్లో  కేవలం  రెండు జిల్లాలకే  పరిమితమై.. ఒక కులం  ఆధిపత్యంలో  నడుస్తుండేది. ఆ రోజుల్లో  తెలుగు సినిమా  అగ్ర హీరోలందరూ  ఆ  ప్రాంతానికి, ఆ  కులానికి  చెందినవారై  ఉండటం  కాకతాళీయం  కాదు. చాలా  పద్ధతిగా  అమలు  పరచబడ్డ  మాస్టర్ ప్లాన్. ఆ  రోజుల్లో, ఆ  ప్రాంతంలో, ఆ కులంలో  హీరోకి  కావలసిన  అన్ని  అర్హతలతో   రెడీగా.. ఎవైలబుల్ గా  ఉండటం  ఎన్టీఆర్ కి  కలిసొచ్చింది. ఎ  సింపుల్  కేస్  ఆఫ్  రైట్  ప్లేస్  ఎట్  రైట్  టైం! మరప్పుడు  ఎన్టీఆర్  అదృష్టవంతుడు  అవుతాడు గానీ  దురదృష్టవంతుడు  ఎలా  అవుతాడు?"

ఇంతలో  పొగలు గక్కుతూ  కాఫీ  వచ్చింది.

"రామారావు  ఒక  అద్భుత నటుడు. ఆ  విషయాన్ని  నేను  అస్సలు  కంటెస్ట్  చెయ్యట్లేదు. ఒక  ప్రతిభాశాలి  పాపులర్  నటుడవడానికి  సహకరించిన  సామాజిక, ఆర్ధిక, రాజకీయ  కోణం  గూర్చి  మాత్రమే  మాట్లాడుతున్నాను. రామారావు  ఆ  ప్రాంతంలో, ఆ  కులంలో  పుట్టకపోయినట్లయితే.. ఇంతకి  వంద రెట్లు  ప్రతిభావంతుడైనప్పటికీ.. మనం  ఎప్పటికీ  ఎన్టీరామారావు  పేరు  వినేవాళ్ళం  కాదు. ఇంత  చిన్న  లెక్క  తేలకుండా.. రామారావుని  ఇంగ్లీషోడిగా, ఫ్రెంచోడిగా ఊహించుకుని  ఎట్లా  మాట్లాడగలవ్?"

"ఓరే  సుబ్బు! నీ  బుర్ర  రోజురోజుకీ  ఇరుగ్గా  తయారవుతున్నట్లుంది!" చికాగ్గా  అన్నాను.

"రవణ మావా! నేను  చెప్పేది  నీకర్ధమవుతున్నట్లు లేదు. ఇప్పుడు  నేను  నీకు  అరటి పండు  వలిచి  నోట్లో  పెడతాను. రామారావు  తను  పుట్టిన  నిమ్మకూరు  గ్రామంలోనే  ఒక  పుజారి గారింట్లో  పుడితే  అర్చకత్వం  చేసుకునేవాడు. లేదా  ఓ  చిన్న ప్రభుత్వ ఉద్యోగం  చేసుకుంటూ  ప్రశాంత జీవనం  కొనసాగించేవాడు. పక్కనున్న కుమ్మరి బజారులో  పుడితే  కుండలు  చేసుకుంటూ  రెక్కలు  ముక్కలు  చేసుకునేవాడు. ఏ  శివరాత్రికో, శ్రీరామనవమికో నాలుగు  నాటకాలు  వేసుకుని  కళాతృష్ణ  తీర్చుకునేవాడు. ఈ  రామారావునే  ఊరి  బయట  పల్లెలోకి  పంపిద్దాం. జీవితమంతా  చెప్పులు  కుట్టుకుంటూ  బ్రతికేసేవాడు. కనీసం  తిరనాళ్ళప్పుడు  కూడా  వేషం  దొరికేది  కాదు. ఇప్పుడు  చెప్పు. రామారావు  దురదృష్టమేంటో!"

"సుబ్బు! చాలా  దారుణంగా  మాట్లాడుతున్నావ్."

"ఇందులో  దారుణం  ఏముంది? మన  సమాజం  అనేక  సామాజిక వర్గాల  కలయికతో  ఏర్పడ్డ  ఒక  పటిష్ట వ్యవస్థ. ఈ  వ్యవస్థ  నాగార్జునా  సిమెంట్  కన్నా  దృఢమైనది! ఒక్కో  సామాజిక వర్గం  ఒక్కో  రంగంలో  పట్టు  సాధిస్తుంది. ఏ  రంగంలోనూ  'అందరికీ  సమానావకాశాలు'  అనేది  బూతద్దంతో  గాలించినా  కనబడదు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు  ఒకే  కులానికి  చెందినవాళ్ళై  ఉండటం.. చిన్న వ్యాపారస్తులంతా  ఇంకో కులానికి  చెందినవాళ్ళై  ఉండటం  కాకతాళీయం  కాదు. మనం  అయా  సామాజిక వర్గాలలో  పుట్టటం  మాత్రం  ఏక్సిడెంట్."

"సుబ్బు! నువ్వు  ఒక  గొప్ప నటుణ్ణి  కించపరుస్తున్నావ్."

"రామారావు  అంటే  నీకు  ఇష్టం  మాత్రమే. నాకు  వెర్రి అభిమానం. ఆ  మహానుభావుణ్ణి  కించ పరిచేంతటి  అధముణ్ణి  కాదు. నా  పాయింటల్లా  మన  సమాజ పరిమితుల  వల్ల  ఇంకో  పది మంది  రామారావుల్ని  మిస్  అయిపొయ్యామని. అంతే! 'మనుషులంతా ఒక్కటే. కులరహిత సమాజం.' లాంటి  టీవీ  నైన్  రవిప్రకాష్  బ్రాండ్  స్లోగన్స్  వినటానికి  బాగానే  ఉంటాయి. అదే  నిజమయినట్లయితే  ఒక  గిరిజనుడు  రాసిన  కథకి, బిసీ  కులస్థుడు  పాటలు  రాస్తే, దళితుడు  హీరోగా, బ్రాహ్మణుడు  నిర్మాతగా  కొన్ని  సినిమాలు  రావాలి. అలా ఏదైనా  సినిమా  వచ్చిందా? నాకైతే  తెలీదు. నీకు  తెలిస్తే  చెప్పు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెడుతూ   టైం  చూసుకున్నాడు.

"నాకు  బ్యాంక్  పనుంది. వెళ్ళాలి." అంటూ  హడావుడిగా  నిష్క్రమించాడు  సుబ్బు.

హమ్మయ్య! వర్షం  వెలిసినట్లయింది.

టీవీలో 'జయకృష్ణా ముకుందా మురారి.. ' అంటూ  ఘంటసాల  ఆలాపన  మొదలైంది. తన్మయత్వంతో  కళ్ళు  మూసుకున్నాను.

83 comments:

  1. ఏమిటో కళ్ళఎదురు కుండా కొత్త కుల వ్యవస్థలు తయారవుతుంటే చూస్తూ కూర్చుంటూ ఇక్ష్వాకుల నాడు ఏర్పడ్డ కుల వ్యవస్థలని సరిదిద్దాలని చూస్తాము.

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ నాకర్ధం కాలేదు.

      Delete
  2. మీరు చెప్పింది చాలా నిజం. అసలు పుట్టుక తోటి వారి వృత్తిని నిర్ణయించడం చాలా దారుణం.సంతోష కరమయిన విషయం ఏమిటంటే అది ఇప్పుడిప్ప్పుడే మారుతుంది. మనిషి తనకు ఇష్టమయిన వృత్తి చేసుకోవాలి. ఆ రెండు జిల్లా ల లో ,ఆ కులం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇతరులకి అవకాశం రాకూడదు అని మొదట నుండి వ్యవహరించారు. కానీ వాళ్ళ చర్యలని అడ్డుకొని ఎదగ లేక పోవడం మిగతా వారి అసమర్ధత కి నిదర్శనం. దానికి ఎవరిని నిందించి ప్రయోజనం లేదు.ఒక్క చిరంజీవి,రవితేజ మాత్రమె వీళ్ళని తట్టుకొని పైకి వచ్చారు.

    అలనాడు రెండక్షరాల రాజకీయ కులం వాళ్ళు గొప్ప డైరెక్టర్ లు గా ఉన్నారు కాని,వాళ్ళు ఏ కుల ఫీలింగ్ చూపించలేదు. ఇప్పటి హీరోల కులం వాళ్ళు ,అ డైరెక్టర్ ల కింద పని చేసి,తరువాత అందరిని తొక్కి వేసారు అంటారు.జరిగిపోయిన దాని గురించి బాధ పడటం కన్నా అందరికి అవకాశం ఎలా రావాలి అని ఆలోచించాలి.

    ఈ కుల బానర్ లు, స్టూడియో లు కాకుండా అంతర్జాతీయ లేక జాతీయముగా పేరు ఎన్నిక గల్ల కొన్ని నిర్మాణ సంస్థలు మన తెలుగు సినిమా రంగం లో అడుగు పెట్టాలి. వీళ్ళు కధకి ప్రాముఖ్యం ఇచ్చి సినిమాలు నిర్మించాలి.ప్రస్తుతం ఉన్న చాలా స్టూడియో లు అన్ని గవర్నమెంట్ ల్యాండ్ తో కట్టుకోన్నవి. గవర్నమెంట్ కూడా సామాజిక న్యాయం ప్రకారం ఇతరులకి కూడా ల్యాండ్ అలాట్ చెయ్యాలి.

    ప్రభుత్వ ,ప్రైవేటు భాగస్వామ్యం తో కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్ లను స్టార్ట్ చేసి అన్ని కులాల వాళ్ళకి ప్రవేశం కల్పించాలి. కొన్ని ప్రొఫెషనల్ గా పని చేసే నిర్మాణ సంస్థలు ఈ సంస్థల నుండి నటీ నటులని తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్. ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తే అందరికి అవకాశాల తో పాటు నాణ్యమయిన తెలుగు సినిమా చూడగలం.దీర్ఘ కాలిక ప్రణాళిక కావాలి. లేదంటే నాలాంటి సిని అభిమానులు ఈ పొట్ట మూరి హీరోల యాక్షన్ చూడలేక హాలీవుడ్ సినిమాలకి షిఫ్ట్ అయినట్లు మన తెలుగు ప్రేక్షకులు కూడా డబ్బింగ్ సిమిమాలు,పర భాషా సినిమాల కు షిఫ్ట్ అవుతారు.

    మన తెలుగు నటీ నటుల యాక్షన్ తమిళ హీరో ల తో పోల్చుకుంటే నక్కకి ,నాక లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.మన వాళ్ళ పొట్టలు,వీళ్ళ తొడలు కొట్టడాలు,యాక్..నా వళ్ళ కాదు రమణ గారు. అసలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చెప్పాలి అంటే కామెడీ యాక్టర్ లు మాత్రమె టాలెంట్ కలవారు అండీ. చూడండి ఒక బ్రహ్మానందం, సునీల్,అలీ, కోట,వేణు మాధవ్, వీళ్ళు అంతా మన హీరో ల కన్నా వంద రెట్లు బాగా నటించగలరు.

    తెలుగు సినిమా రంగం ఈ పనికిమాలిన హీరో ల చేతినుండి, నిజమయిన కధే హీరోగా ,నటనే ఊపిరిగా బతికే నటుల చేతిలోకి వెళ్ళేంత వరకు ఎదురు చూడడమే మన లాంటి సామాన్యులకి మిగిలింది. లేదంటే మా కూతురు కి తెలుగు బొజ్జ కృష్ణ ,విగ్గు కృష్ణ లని బూచోడు అని చూపిస్తూ, భయ పెడుతూ భోజనం పెట్టె రోజులు తప్పవు.

    ReplyDelete
  3. బాగుందండి నా అభిప్రాయం కూడా అదే రామ రావు మంచి నటుడు అది నిజమే .. కులాల వాళ్ళు ఇతరులు రాకుండా అడ్డుకుంటున్నారు అది నిజమే . ఇక చిరంజీవి, రవి తేజాల మాదిరిగా ఇతరులు ఎదగక పోవడం అసమర్తతనే అని రాసిన కామెంట్.... ఇప్పుడున్న కుల వ్యవస్థను చేదించుకొని ఎదగడం కష్టం. చిరంజీవి సైతం సినిమాలో ఉన్నత కాలం ఆధిపత్య కులం వారితో బాగానే ఉన్నారు. వారిని ఎదిరించే దైర్యం చేయలేదు. చివరకు ఆయన చేసిన ఎక్కువ సినిమాలు ఆ కులం నిర్మాతలవే అదో పెద్ద విషవలయం . ఎవరి తప్ప్పు , ఎవరి అసమర్ధత అనే వాదన ఎవరిష్టం వారిది

    ReplyDelete
  4. మీ వాదనతో ఏకీభవిస్తాను. కానీ రామారావుగారు పుట్టిపెరిగిన నాటికి ఆయనది ఆధిపత్యకులం కాదని గుర్తించవల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజుల్లో అది ఒక వెనకబడ్డ కులంగా భావించబడుతూండేది. ఆ కోపంతోనే ఆ కులస్థులు బ్రాహ్మణుల్ని ద్వేషించేవారని కూడా విన్నాను. అది ఆధిపత్యకులం కావడం 1970 తరువాతే మొదలయింది. అంతకుముందు కాదు. రామారావుగారి కాలం నాటికి బ్రాహ్మణులే అన్నివిధాలా ఆధిపత్యకులం. రాజకీయనాయకులూ, ముఖ్యమంత్రులూ, గవర్నర్లూ. పత్రికాధిపతులూ, సినిమా దర్శకులూ, నిర్మాతలూ, అఖరికి హీరోలు కూడా బ్రాహ్మణులే (రామశర్మ, కాంతారావు, చిత్తూరు నాగయ్య etc.). నిజానికి తొలితెలుగుసినిమా హీరో రామానుజాచార్యులనే బ్రాహ్మణుడు. రామారావుగారిని మొదట్లో ఆదరించి పైకి తీసుకొచ్చినది ఈ బ్రాహ్మణవర్గమే, ఆయన సొంతకులం కాదు. అప్పట్లో ఆయన సొంతకులానికి అంత సీన్ లేదు.

    మీ ఏక్సిడెంట్ వాదనతో కూడా ఏకీభవిస్తున్నాను. ఈ ఏక్సిడెంటునే మన పూర్వీకులు కర్మఫలం అని వర్ణించారు. ఒక వ్యక్తి తన పూర్వపుణ్యఫలం ద్వారా పైకి రావాల్సి ఉంటే అలా పైకి రావడానికి అనువైన పరిసరాల్లోనే అతన్ని భగవంతుడు జన్మింపజేస్తాడు. ఆ పరిసరాల్ని భగవంతుడు అలా ఉపయోగించుకుంటాడు. ఇందులో మానవులు పాత్రధారులే తప్ప సూత్రధారులు కాదు.

    ఇహపోతే పదిమంది రామారావులొచ్చి ఉండేవారనే వాదన. ఇది సరికాదు. రామారావుగారిలాంటి మనిషి ఎక్కడా లేడు, ఉండడు. ఉండబోడు, మీరు ఎంత వెన్నుతట్టి ప్రోత్సహించినా సరే ! మనుషులు పైకి రావాలంటే స్వతహాగా ఆ zeal, తృష్ణ, సామర్థ్యం, కృషీ ఉండాలి. ఊరికే ఉట్టిపుణ్యాన ఒక ప్రాంతంలోనో, కులంలోనో పుడితే సరిపోదు. బ్రాహ్మణకులంలో పుట్టినంతమాత్రాన ప్రతివాడూ ఋషి అవుతున్నాడా ? రామారావుగారిని పెద్దవాణ్ణి చేసింది కమ్మకులం కాదు, తెలుగువాళ్ళందరూను. తన అభ్యున్నతి కోసం కమ్మకులం ఆయన్ని తాత్కాలికంగా ఉపయోగించుకుంది. ఆయన తమకి పూర్వంలా ఉపయోగపడడు అనుకున్నరోజున ఆయన్ని నిర్దాక్షిణ్యంగా అధికారపీఠం నుంచి తోసేసింది, అంతే !

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాతగా కామెంట్ ఇంత వివరంగా రాశారు!

      పేరు రాస్తే బాగుండేదేమో!

      Delete
  5. ఈ మారు వేరే సంబోధన!- దాటేరు గారు,

    ఏ కులమూ మీదంటే,
    'బ్లాగ్ కులము' మాదండీ
    అయినా అందులో మా కులమూ వేరండీ !

    నటన తిరగేసినా నటనే !

    కులం తిరగేసి కొంత లాగితే లంకె. లంకెలు లేకుంటే గూగులోడు బతక లేడు. ! ఆ లాగే లంకెలు లేకుంటే జీవనం సాగదు! ఆ లంకె కాలా కాలానికి తిరగబడ్డ లంకె !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. మీరు నన్ను ఎన్ని రకాలుగా సంబోధించినా..

      మనది బ్లాగ్ కులమే లేండి!

      Delete
  6. మాయలోకం

    ReplyDelete
    Replies
    1. కులాల సంగతి అలా ఉంచితే అందరూ ఒకటే అనే విషయం ఆచరణలో సాధ్యమా ?

      ఒక ఆఫీసులో చైర్మన్, మానేజర్, అటెండర్ అందరూ అవసరమే. అందరమూ చైర్మన్లమే అవుతాము ... అంటే ఆఫీసు నడిచేదెలా ?.

      Delete
    2. ఉద్యోగ హోదా అనేది ప్రతిభని బట్టి నిర్ణయించవచ్చు.

      కానీ కులానికి ఆ సౌకర్యం లేదు గదా!

      Delete
    3. ప్రతిభ అనేది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి వృత్తికి ఉంటుంది. ఒక నర్స్ కు రోగులకు సేవ చేయటంలో ఎంత ప్రతిభ అవసరమో.... డాక్టరుకు వైద్యం చేయటంలో అంతే ప్రతిభ అవసరం.

      నా అభిప్రాయం అది కాదండి. ఒక సంస్థకు చైర్మన్, పై స్థాయి ఉద్యోగులు, క్రింది స్థాయి ఉద్యోగులు ఎంత అవసరమో సమాజానికి కూడా అన్ని రకాల వాళ్ళూ అవసరమే అనిపిస్తుంది.

      అందరికీ సమానంగా హోదా, జీతభత్యాలు ఉన్నప్పుడే ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు ?.

      Delete
    4. anrd గారు,

      అవునండీ అన్ని రాకాల వాళ్ళూ అన్ని స్థాయిల వాళ్ళూ సమాజానికి అవసరమే. అందరూ సమానమే అంటే జీతభత్యాల్లోనూ అన్నింట్లోనూ సమానం అని కాదండీ, ఒక మనిషిగా అందరూ సమానమే, మిగిలిన అసమానతలన్నీ వాళ్ళు చూపించే ప్రతిభా, నైపుణ్యం లాంటి వాటి మీదా ఆధారపడితే తప్పులేదు.

      వీలయినంత ఎక్కువమందికి, తమ ప్రతిభ ఎందులో ఉందో దేంట్లో నైపుణ్యం ఉందో అందులో రాణించే అవకాశం అందివ్వగలగడం, కనీసం ఆ దిశగా ఆలోచించడం నాగరిక సమాజాల బాధ్యత.

      సమాజంలో ఉన్న పరిస్థితులవల్ల (చాలా గొప్ప వాళ్ళూ, అతి పనికిమాలిన వాళ్ళూ మినహాయింపు) తమలోని అంతర్గత నైపుణ్యాన్ని గమనించుకొని దాన్ని సమాజానికీ, తమ సంతోషానికీ ఉపయోగ పడేలా జీవించగలిగే అవకాశం ఎక్కువమందికి ఉండేలా చెయ్యడమే, ఏ కట్టుబాట్లయినా చట్టాలైనా చెయ్యల్సిన పని.

      In simple a civilized society should strive to reduce the role of birth and increase the role of worth in shaping the destiny and thoughts of its members.

      There is no shame in understanding and accepting the relative weight of birth and worth in the present society. In fact such realization is the basis for correcting it.

      Delete
    5. సమాజానికి అన్ని రకాల వారూ అవసరమేనండి.

      కాదనేదెవరు?

      కాకపోతే.. 'మనమేరకం?' అనేది పుట్టుక ద్వారా నిర్ణయింపబడటమే ఒక విషాదం.

      Delete
    6. పుట్టుకతో ఏ వృత్తి అయినా పూర్వం అన్ని వృత్తుల వాళ్ళూ మంచి జీవితాన్నే గడిపారు అనిపిస్తుందండి. పూర్వం నందగోకులంలోని యాదవులు క్షత్రియులా ? శూద్రులా ? అన్నది నాకు తెలియదు కానీ, ఆ గోకులంలో పశుపోషణ వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా చక్కటి భోగభాగ్యాలతో జీవించారని తిరుప్పావై ద్వారా తెలుస్తోంది. పూర్వం వస్త్రాలు తయారుచేసేవాళ్ళు కూడా మంచి జీవితాన్నే అనుభవించి ఉండవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు యంత్రాలు లేవు కాబట్టి రాజ్యంలోని అందరూ వారి దగ్గరే వస్త్రాలను కొంటారు కాబట్టి. ఇలా అన్ని వృత్తుల వాళ్ళూ మంచి జీవితాన్నే గడిపి ఉంటారు అనిపిస్తుంది. .



      పూర్వం కూడా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి గా మారటం , ద్రోణాచార్యులు విలువిద్య నేర్పటం, శబరి పూజలు చేయటం, గుహుడు రాజవటం, ధర్మవ్యాధుడు బ్రాహ్మణునికి ధర్మానికి సంబధించిన విషయాలను చెప్పటం జరిగింది. ఈ రోజుల్లో కూడా డాక్టర్లు తమ వారసుల్ని డాక్టర్లుగానూ, రాజకీయనాయకులు, వాణిస్యసంస్థ అధిపతులు, వాళ్ళ వాళ్ళ సంతానాన్నే తమ తరువాత బాధ్యతలను అప్పగిస్తున్నారు కదా ! చాలా వ్యాఖ్యలు వ్రాసినందుకు క్షమించండి..

      Delete
    7. నందగోకులంలోని వాళ్ళు ఎలా ఉన్నారో తిరుప్పావై ద్వారా తెలియడమేంటండీ? తిరుప్పావై ఎప్పటిది? గోకులంలో యాదవులెప్పటివాళ్ళూ ? పూర్వా కాలంలో అందరూ బాగుండేవారని డాక్టరు గారి బ్లాగులో మీ వ్యాఖయల ద్వారా తెలుసుంది అని రేపెవరైనా అనొచ్చు అలాగైతే.

      Delete
    8. anrd గారు,

      పూర్వం అన్ని వృత్తుల వాళ్ళూ మంచి జీవితాన్నే గడిపారు అనిపిస్తుందండి అని మీరంటే నేనేం చెప్పలేనండీ. ఎందుకంతే అప్పటి సంగతులు మరి మనకెంతెలుసు. నా కుండే మిడి మిడి ఙానానికి మాత్రం పూర్వాకాలంలో మంచి జీవితాన్ని గడిపిన వాళ్ళ చరిత్రే రికార్డు చేయబడిందేమో అనే అనుమానం కూడా ఉంది మరి.

      ఇక మీరుదహరించిన విశ్వామిత్రుడు, ద్రోణాచార్యులు, శబరి, గుహుడు,ధర్మవ్యాధుడు వంటి ఉదాహరణలు కూడా ప్రత్యేకమైన, అసాధారణమైన విషయాలుగానే శాస్త్రాల్లో చెప్పబడ్డాయిగానీ, అదేదో అప్పటి సమాజంలో మాములుగా జరిగే ప్రక్రియలా చెప్పబడలేదనుకుంటా.

      మీ అభిప్రాయాలు ఓపిగ్గా చెప్తూ ఇతరుల అభిప్రాయాల్ని వింటూ వ్యాఖ్యానిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

      Delete
    9. అయ్యో ! ఇన్ని వ్యాఖ్యలు వ్రాస్తున్నందుకు రమణసార్ ఏమనుకుంటారో ? తిరుప్పావై లో నందగోపుని ఇంటి వర్ణన ఉందిలెండి. ఆండాళ్ వంటి అవతారమూర్తులకు అవన్నీ తెలుస్తాయి.

      కొందరు తపశ్శక్తి గలవారు కూడా ధ్యానం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతారు అని ఒక యోగి ఆత్మ కధ గ్రంధంలో చెప్పబడింది..

      Delete
    10. anrd గారు..

      నేను అనుకునేది ఏమీ లేదు!

      మిత్రుల విషయ పరిజ్ఞానికి, వాదనా పటిమకి అబ్బుర పడుతున్నాను.

      మధ్యలో కొద్దిగా ఇరుక్కుందామని ఉంది గానీ.. పని వత్తిడి వల్ల కుదరట్లేదు.

      అంతే!

      Delete
    11. *పూర్వా కాలంలో అందరూ బాగుండేవారని డాక్టరు గారి బ్లాగులో *
      అయ్యా అజ్ణాతా గారు,
      తమరి కి మనపూర్వులు బాగా జీవించలేదని ఎలా చెప్పగలరు? ఈ మధ్య కాలం లో చరిత్ర మీద అవగాహన లేని వారు, ఎందుకు కొరగాని వాళ్లు యునివర్సిటీలలో చేరి ఆచార్య పదవులు వెలగ బెడుతూ, పుస్తకాలు రాయటం ఎక్కువైయింది. మన సమాజాంలో ఉన్న ప్రతిదానికి వక్ర భాష్యాలు చెప్తూ రాయటం వారి లక్ష్యం. గతం లో భారత దేశం అంతా అజ్ఞానం లో, పేదరికం తో,కుల పిచ్చితో, అసమానతలతో, మగ్గిదన్నట్లు పుస్తకాలు రాయటం ఎక్కివైంది. అది చదివి మీలాంటి వారు, ఒకప్పుడు నేను కూడా అభివృద్ది అంటే తెల్ల వారి వలననే అనుకోంట్టూటం. దీనికి ప్రధాన కారణం మనకు స్కుల్స్ లో సరీయిన చరిత్ర చెప్పక పొవటమే. ఇక భారతదేశం లో ఎంతో సంపద ఉండేది కనుక అంతా బాగా జీవించేవారు అని చెప్పవచ్చు. దీనిని తెలుసుకోవటానికి ద్వాపర యుగం వరకు పోనక్కరలేదు. ఈ క్రింది చదవండి.

      World history by per capita GDP

      In 1000 AD, according to Maddison’s calculations, China and India together contributed 50.5% of world GDP (GDP being computed in 1990 dollars and in purchasing power parity (PPP) terms). By 1600, that share had gone up to 51.4%, with China accounting for 29% and India 22.4% of world GDP. A hundred years later, China’s GDP had fallen but India’s went up to 24.4% of world output. By 1820, however, India’s share had fallen to 16.1%. By 1870, it went down to 12.2%. International Monetary Fund (IMF) projections indicate that India’s share of world GDP would be 6.1% in 2015.

      http://www.livemint.com/2010/08/25212010/World-history-by-per-capita-GD.html

      Sri

      Delete
    12. అయ్యా Sri గారు,

      >>"తమరి కి మనపూర్వులు బాగా జీవించలేదని ఎలా చెప్పగలరు?"

      నేనట్టా అన్నానని మీకెందుకనిపించిందయ్యా ? మరొక వ్యాఖ్యకి నా స్పందన లోని ఒక ముక్క ఏరుకొచ్చి మీరూ రాయలనుకున్నదంతా ఇక్కడ రాశారు. ఆ పనేదో సూటిగా చెయ్యకుండా నా వ్యాఖ్యని అసందర్భంగా వాడుకోవటం ఎందుకండీ.

      >>"భారత దేశం అంతా అజ్ఞానం లో, పేదరికం తో,కుల పిచ్చితో, అసమానతలతో, మగ్గిదన్నట్లు పుస్తకాలు రాయటం ఎక్కివైంది. అది చదివి మీలాంటి వారు, ఒకప్పుడు నేను కూడా అభివృద్ది అంటే తెల్ల వారి వలననే అనుకోంట్టూటం."

      మీరనుకోండి. నేనలా అనుకున్నానని మీకెవరు చెప్పారు ? ఇక్కడే ఏదో వ్యాఖ్యలో చెప్పారు, మీరన్న పుస్తకాలు చదివి గుడ్డిగా వాదించే వాళ్ళకీ, ఏవో ఒకటీ అరా లింకులూ నీతి సూత్రాలూ పట్టుకొచ్చి మీలా చెప్పేవారికీ పెద్ద తేడా ఏమీ లేదని. మరోసారి చూసుకోండి.

      >>"దీనికి ప్రధాన కారణం మనకు స్కుల్స్ లో సరీయిన చరిత్ర చెప్పక పొవటమే"

      మా బళ్ళో బాగానే చెప్పారు. ఎందుకంటే మా పిల్లకాయలందరం చెప్పిందాన్నీ, చదివిందాన్నీ కొద్దిగా ఆలోచించి అర్థం చేసుకునే వాళ్ళం. మీ స్కూలు సంగతి తల్చుకుంటే బాధగానే ఉంది మరి :P

      >>"భారతదేశం లో ఎంతో సంపద ఉండేది కనుక అంతా బాగా జీవించేవారు అని చెప్పవచ్చు."

      ఎంతో సంపద ఉంటే అంతా బావుంది అనుకుంటున్నారా. సరలాక్కానివ్వండి. కాకపోతే మీరిప్పటిక్కూడా అభివృధ్ధి అంటే తెల్ల వారు చెప్పే సంపదలోనే ఉంది అనుకుంటునట్టున్నారు.

      Delete
    13. *నేనట్టా అన్నానని మీకెందుకనిపించిందయ్యా ? *
      ఎందుకంటే ఆ వాక్యం లో మీరు "డాక్టరు గారి బ్లాగులో మీ వ్యాఖ్యల ద్వారా తెలుసుంది అని రేపెవరైనా అనొచ్చు అలాగైతే" అని అన్నారు కనుక రిఫెరెన్స్ ఇచ్చాను.

      *చదివిందాన్నీ కొద్దిగా ఆలోచించి అర్థం చేసుకునే వాళ్ళం.*

      మీరెప్పుడైనా సోషల్ పుస్తకం చదివినపుడు దేశ విభజన గురించి ఆలోచించారా? దేశ చరిత్రలో ఇండియా విభజన ఎంతో ప్రాముఖ్యత గల విషయం కదా! ఆ విభజన సమయంలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది కాందిశీకులు భారతదేశం వచ్చారు, ఎంత శాతం భూభాగం మనకు వచ్చింది. ఎందుకు వచ్చింది మొద|| వివరాలు ఏ తరగతి సోషల్ స్టడిస్ పుస్తకం లో రాశారో ఏ పరీక్షలో అయినా వాటిగురించి ప్రశ్నగా అడిగారో మీకు గుర్తుందా? అదే సోషల్ బుక్ లో రాజారాం మోహన్ రాయ్ సంఘ సంస్కర్త లాంటి పాటాలు మటుకు చాలా ఉండేవి.
      మీరు రాసిన సుదీర్గ వ్యఖ్యలో చదివివే వారికి నా వ్యఖ్యవలన కొన్ని విషయాలు/ నా పాయిట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవటానికి ఉపయోగ పడుతాయి అని నాకు అనిపించిన వాటికి జవాబులు ఇచ్చాను. ఇక మీరు ప్రస్థావించిన సంపద ఉంటే సుఖం మొద|| వాటికి జవాబులు ఇవ్వను. ఇది చర్చ మాత్రమే, గెలవటానికోసం కాదు. వాదన అసలేకాదు. ఆ పాయిoట్ మీద చర్చించుకొంటు పోతే పుస్తకం కూడా తయారవుతుంది. నేను ఇచ్చిన వివరాలు వదిలేసి, వ్యక్తిగతం గా తీసుకొని, రాసిన ప్రతి లైనుకి తిరిగి వ్యాఖ్యలు రాయటం, మీలో చిన్న పిల్ల వాడి మనస్తత్వం సూచిస్తున్నాది. అజ్ఞాత అయ్యి ఉండి కూడా అంత ఫీలైతే ఎలా?

      Sri

      Delete
    14. Sri గారు,

      మిమ్మల్ని నొప్పించుంటే క్షమించండి. మీముందు చిన్నపిల్లాడినే అయ్యుండొచ్చు.దయచేసి మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. నేను రాసింది ఇది:

      "నందగోకులంలోని వాళ్ళు ఎలా ఉన్నారో తిరుప్పావై ద్వారా తెలియడమేంటండీ? తిరుప్పావై ఎప్పటిది? గోకులంలో యాదవులెప్పటివాళ్ళూ ? పూర్వా కాలంలో అందరూ బాగుండేవారని డాక్టరు గారి బ్లాగులో మీ వ్యాఖయల ద్వారా తెలుసుంది అని రేపెవరైనా అనొచ్చు అలాగైతే"

      అందులోని ఉద్దేశ్యం, అసందర్భమైన రిఫరెన్స్ లతో కంక్లూజన్లు చెయ్యడం వృధా అని చెప్పడమే కానీ పూర్వం అంతా బాగుండేదనో కాదనో చెప్పడం కాదు. మీరు అందులోనుండి ఒక ముక్క తీసుకొచ్చి అది నా అభిప్రాయంగా చెప్పడం వల్ల నేను స్పందించాల్సి వచ్చింది.

      ఇంక మీరు చెప్పిన సోషల్ టాపిక్స్ విషయానికొస్తే అవి ఏ క్లాసు పుస్తకంలోనూ లేవండీ మాకైతే. కాకపోతె మా సోషల్ అయ్యవార్లు పాఠాల్లో లేని చాలా విషయాలు మాతో ముచ్చటించే వాళ్ళు అదృష్టవశాత్తూ. తరవాత మీలాగే పుస్తకాలకి బయట ఉండే విషయాలు కూడా చదవడం అలవాటు చేసుకున్నాంలెండి. ప్రత్యేకంగా మీరేవైనా పుస్తకాలు సూచించ గలిగితే మరీ ఆనందం.

      అన్నీ చర్చించటానికి ఇది సందర్భం కాదు అనేదాంట్లో నేను మీతో ఏకీభవిస్తాను. మీరు ఇచ్చిన వివరాలు వదిలెయ్యలేదండీ వాటిని పరిశీలించాను. మీ వ్యాఖ్యలో ప్రతి లైనుకీ సమాధానం ఇవ్వడం వెనక దురుద్దేశం ఏమీ లేదండీ. కాకపోతే నేను స్పందించిన ప్రతి వాక్యం లోనూ మీరు నాకు కొన్ని ఉద్దేశ్యాలు ఆపాదించినట్టు అనిపించింది కాబట్టి స్పందించాను (ఒక్క సంపద మీద తప్ప. కావాలంటే నా వ్యాఖ్య మరొక్కసారి పరిశీలించుకోండి). నీకు గూగుల్ ID లేదు నువ్వు అఙాతవికదా, వదిలేసుండాల్సింది అంటే ఇక నేనేమీ చెప్పలేను :)

      కొంతవరకూ మీతో వాదించిన మాట నిజమే అయినా, పెద్దలుగా మీ మీద పూర్తి గౌరవం ఉంది అని తెలియజేసుకుంటున్నాను :)

      Delete
    15. లాగిన్ అవ్వనప్పుడు తొందరలో రాసిన వ్యాఖ్య అది. అఙాతగా అయినా సొంత పేరుతో అయినా ఒకటే కదండీ అందుకే ఇప్పుడు మీకు మళ్ళీ లాగిన్ అయ్యి రాస్తున్నాను.

      Delete
    16. *మిమ్మల్ని నొప్పించుంటే క్షమించండి.*

      నేను నొచ్చు కోలేదండి. క్షమాపణలు అనవసరం. కాకపోతే మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎక్కడ మొదలు పెట్టి, ఎలా జవాబు చెప్పి అర్థవంతంగా ముగించటం అయ్యేపని కాదని పించింది. అందువలన అలా అన్నాను అంతే.

      Sri

      Delete
  7. దారినబోయే దానయ్య31 January 2012 at 13:57

    >>"ఒక వ్యక్తి తన పూర్వపుణ్యఫలం ద్వారా పైకి రావాల్సి ఉంటే అలా పైకి రావడానికి అనువైన పరిసరాల్లోనే అతన్ని భగవంతుడు జన్మింపజేస్తాడు. ఆ పరిసరాల్ని భగవంతుడు అలా ఉపయోగించుకుంటాడు. ఇందులో మానవులు పాత్రధారులే తప్ప సూత్రధారులు కాదు."

    ఓస్ అదీ విషయం మరి. గాధీ కుటుంబంలో వాళ్ళైనా అంబానీలైనా అలా భగవంతుడి తో ఉపయోగించుకోబడుతున్న వాళ్ళు మరి :))))))

    ReplyDelete
  8. <<>>

    లేకపొతే తెలుగు కాకుండా, వేరే ఏ భాష లోనూ నటించని అయన "విశ్వ"విఖ్యాత etc ఎలా అవుతారు????

    <<>>
    ఇది ఎవరూ కాదనలేని నిజం! 1940 ల లో జాన్ ఫోర్డూ, 50 ల లో, హిచ్కాకూ, 60 ల లో, కూబ్రిక్కూ సినిమాలు ఇప్పుడు చూసినా సిల్లీ గా గానీ, ఓవర్ యాక్షన్ లా గానీ అనిపించవు, కానీ తెలుగు సినిమాలు మాత్రం చాలా silly గా ఉంటాయి.
    had we got better people "then" in Movies, telugu cinema right "now" would have got the best of the quality. very unfortunate!

    ReplyDelete
    Replies
    1. ఇంత మంచి కామెంట్ ని 'అజ్ఞాత'గా రాయడం అన్యాయం!

      Delete
    2. ఈ మధ్య యమగోల కొంచెం చూసి, ఆతరువాత టి.వి. ఆపేశాను. జయప్రద సన్నగా ఉంటే, పెద్దాయన గురించి నా నోటితో ఎందుకులే చెప్పటం, ఆ సినేమాలో పెద్దాయన ఎలా ఉంటారో అందరికి తెలుసుకదా! వారినాయనో అప్పట్లో ఆసినేమాను ఎలా చూశారో ! ఇక నటన విషయానికి వస్తే, రామారావు గారు నటనలో శివాజి గణేశన్ గారిని అనుకరిస్తాడు, కాకపోతే శివజి గారిలా తారాస్థాయిలో పెద్దగా అరవడు.అంతే. శివాజి గణేశన్ గారిది ఒవర్ యాక్షన్ లో పైస్థాయి.ఆయన అరిస్తే చేవులో చిల్లులు పడతాయేమొ అన్నంత భయం వేస్తుంది. సినేమా చూస్తే అరుపులకి తల నొప్పి రావటం ఖాయం. ఇక రామారావు గారు స్వతహాగా అందగాడు కనుక నటనలో లోపాలు ఎంచకుండా, ఆయనని అలా చూస్తూ ఉండి పోయేవారు.

      *had we got better people "then" in Movies*
      నేనైతే అలా అనుకోను, చిరంజీవి వచ్చిన తరువాత సినేమాలో మార్పు కనిపించింది కదా! మళ్లి ఇప్పుడు ఎందుకు తగ్గింది అంటే ప్రస్తుతానికి మనదగ్గర పెద్ద సత్తా లేదు.
      Sri

      Delete
    3. అతి తక్కువ దేశాలు మాత్రమే ఆడే క్రికెట్ లో కప్పు గెలిస్తే ...... ప్రపంచ కప్ గెలిచామని ( ప్రపంచాన్నే గెలిచినట్లు ) మనలాంటి పేదదేశాలు చంకలు గుద్దుకోవటాన్ని చూసి ....ఇతరదేశాల వాళ్ళు నవ్వుకుంటారేమో అనిపిస్తుంది నాకు.

      Delete
  9. చాలా బావుందండీ. సుబ్బు గారి సంభాషణలూ, మీ సందేహాలూ చాలా క్లిష్టమైన విషయాలని కూడా (అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళకే లెండి)విడమరిచి చెప్తున్నాయి.

    మీ మొత్త కథనంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లుంటే ఉండొచ్చు కానీ, అసలు విషయం మాత్రం చాలా చక్కగా చెప్పారు. పైన ఒక అజ్ఞాత గారు చెప్పినట్టు రామారావు గారి ఉదాహరణ కొద్దిగా మిస్ ఫైర్ అయ్యుండొచ్చు..

    అసలు మీ టపాలోని అంశం మాత్రం చాలా సున్నితంగా, ఆలోచింప చేసే విధంగా చెప్పగలిగారు. మీరు థీరైజ్ చెయ్యకుండా చదివేవాళ్ళని ఆలోచింపచేసేట్టుగా రాయటం నాకు చాలా నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. అతి తక్కువ దేశాలు మాత్రమే ఆడే క్రికెట్ లో కప్పు గెలిస్తే ...... ప్రపంచ కప్ గెలిచామని ( ప్రపంచాన్నే గెలిచినట్లు ) మనలాంటి పేదదేశాలు చంకలు గుద్దుకోవటాన్ని చూసి ....ఇతరదేశాల వాళ్ళు నవ్వుకుంటారేమో అనిపిస్తుంది నాకు.

      Delete
    2. పూర్వం అన్ని కులాల వాళ్ళూ బాగానే ఉండేవారు. క్రమంగా సమాజంలో ఈ అసమానతలు చోటుచేసుకున్నాయి . కులం సంగతి అలా ఉంచితే ఒక కూలీ రోజంతా పనిచేస్తారు. ఒక ఉద్యోగి రోజంతా పనిచేస్తారు కానీ వారి జీతభత్యాలలో చాలా తేడా ఉంటుంది. ఇవన్నీ ఎవరూ మాట్లాడరండి. కానీ పూర్వులు ఏం చేసినా అర్ధం చేసుకోకుండా తప్పుపడతారు. అదే విషాదం.


      పూర్వులు చెప్పింది ఒక శూద్ర కులానినే. కానీ, ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నత కులాలలోనూ డబ్బు ,హోదా లేనివారున్నారు. శూద్రులలోనూ డబ్బు, హోదా ఉన్నవారున్నారు. శూద్రులే సాటి శూద్రులను తక్కువగా చూస్తారు. ఎవరో చెప్పినట్లు ఇప్పుడు లోకంలో రెండే కులాలు డబ్బున్న వారు. లేనివారు.

      Delete
    3. anrd గారు,

      క్రికెట్టు గురించి మీ కామెంట్ నాకర్ధం కాలేదు :(

      పూర్వులూ, ఆర్యులూ, శూద్రులూ వగైరాల గురించి అసలు మాట్లాడలేదు కదండీ ఇక్కడ !! ఇంతకీ మీరేమంటారు ?

      >>"పూర్వం అన్ని కులాల వాళ్ళూ బాగానే ఉండేవారు. క్రమంగా సమాజంలో ఈ అసమానతలు చోటుచేసుకున్నాయి. పూర్వులు ఏం చేసినా అర్ధం చేసుకోకుండా తప్పుపడతారు. అదే విషాదం"

      అంటారు. అంతేనా !!! దానికేం.. నిరభ్యంతరంగా అనేసుకోండి. మీకెలా అనిపిస్తే అలా అనుకోవచ్చు. కానీ మీరు విషాదంగా ఫీలయ్యి బాధపడుతుంటే మాత్రం దాని మీదే మీ బ్లాగుంటే అందులో టపా రాయండి మర్చిపోకుండా. అక్కడ చర్చిద్దాం. అది ఈ టపాకి అంతగా సంబంధం లేని వేరే చర్చ అనిపిస్తుందండీ నాకైతే.

      Delete
    4. who are these పూర్వులు ? are they 100 years ago, 200 years, 2000 years, 5000 years or 10000 years ?

      What criteria fits this ?

      Delete
    5. ఈ టపాలో కులాల ప్రసక్తి వచ్చింది కదండి. ఈ కులాలను పూర్వులే నిర్ణయించారు అని మన పెద్దలను తప్పు పడుతున్నారు కొందరు. కాబట్టే నేను ఇలా వ్రాయవలసివచ్చిందండి. ఎప్పుడో పెద్దవాళ్ళు కులవ్యవస్థను పెట్టారు నిజమే వాళ్ళను తప్పుపట్టేముందు ...

      ఇప్పుడు మనం ఒక కూలివానికి ఒక ఉద్యోగికి సమానంగా జీతభత్యాలు ఇస్తున్నామా ? సమానంగా ఆదరిస్తున్నామా ? ఇప్పుడు సమాజంలో సమానత్వం ఉండాలంటే ఏం చెయ్యాలి ? ఇవన్నీ అందరూ ఆలోచించవలసిన ప్రశ్నలు. ఆలోచించుకోవాలి.

      Delete
    6. anrd గారు,

      మీ వివరణకి ధన్యవాదాలు. ఇంక మీ వ్యాఖ్య విషయానికి వస్తే...

      అందరికీ సమానంగా జీతభత్యాలు ఎందుకివ్వాలండీ అసలు? మనిషికి మనిషిగా విలువిస్తే చాలు. జీతభత్యాలు వంటివి చేసే పనులనిబట్టీ, ఆయా వస్తు సేవల అవసరాల్ని బట్టీ ఉంటాయి దాంట్లో ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు.

      పలానా కులాల వాళ్ళు ఫలానా పనులే చెయ్యాలనడం, పైగా ఆయా కులాల్లో పుట్టడం పూర్వజన్మల పాపపుణ్యాల ఫలితం అని చెప్పడం నాకైతే సరైన ఆలోచన కాదనే అనిపిస్తుంది.

      కేవలం పూర్వులు పెట్టారు అనే కారణంతో అది ఖచ్చితంగా తప్పే అనడంగానీ, లేదా అదే కారణంతో అది ఖచ్చితంగా ఒప్పే దాన్ని ప్రశ్నించకూడదు అనడం కానీ రెండూ ఒకటే నా దృష్టిలో. కాదంటారా ?

      పైన అజ్ఞాత గారు అడిగినట్టుగా అసలీ పూర్వులంటే ఎవరండీ ?

      Delete
    7. లేకపొతే తెలుగు కాకుండా, వేరే ఏ భాష లోనూ నటించని అయన "విశ్వ"విఖ్యాత etc ఎలా అవుతారు????.....ఈ వ్యాఖ్యకు నేను క్రికెట్ గురించి చెప్పానులెండి. ఇది మీకు సంబంధించిన విషయం కాదు.

      నేను ఈ రోజు బాగా పనివత్తిడిలో ఉన్నాను. ఆ కంగారులో ఇలా ఒక దగ్గర పోస్ట్ చెయ్యబోయి ఇంకో దగ్గర పోస్ట్ చేస్తున్నాను.

      ( అందరికీ సమానంగా జీతభత్యాలు ఎందుకివ్వాలండీ అసలు? )
      మనుషులు అందరూ సమానమే... ఎవరి కష్టమైనా ఒకటే కదండి ! .

      (పలానా కులాల వాళ్ళు ఫలానా పనులే చెయ్యాలనడం, )
      ఇలా అన్నారు కానీ ..... పూర్వం కూడా ఒక కులం వాళ్ళు ఇంకొక కులానికి సంబంధించిన వృత్తులను చేపట్టం జరిగిందండి.....ఉదా...విశ్వామిత్రుడు, ద్రోణాచార్యుడు.....

      ( కేవలం పూర్వులు పెట్టారు అనే కారణంతో అది ఖచ్చితంగా తప్పే అనడంగానీ, లేదా అదే కారణంతో అది ఖచ్చితంగా ఒప్పే దాన్ని ప్రశ్నించకూడదు అనడం కానీ రెండూ ఒకటే నా దృష్టిలో. కాదంటారా ? )

      నా అభిప్రాయం ప్రతి విషయానికి పెద్దవాళ్ళను తప్పుపట్టటం జరుగుతోంది. వాళ్ళు దైవం దృష్టిలో అందరూ సమానమే అని కూడా చెప్పారు మరి. .

      ( పైన అజ్ఞాత గారు అడిగినట్టుగా అసలీ పూర్వులంటే ఎవరండీ ? )

      పూర్వులు అంటే మనకు పాతతరాలవాళ్ళు.

      మీ అందరికి ధన్యవాదములు. ఇప్పటికే రమణ గారిని చాలా ఇబ్బంది పెట్టినందుకు సారీనండి. .

      Delete
    8. @WP
      *పలానా కులాల వాళ్ళు ఫలానా పనులే చెయ్యాలనడం, పైగా ఆయా కులాల్లో పుట్టడం పూర్వజన్మల పాపపుణ్యాల ఫలితం అని చెప్పడం నాకైతే సరైన ఆలోచన కాదనే అనిపిస్తుంది.*
      మీలాగే నాకు అనిపిస్తుంది అండి. ఈ రోజుల్లో మీలాంటి వారు హిందూ వ్యవస్థలోని, పాత పద్దతులను ఇలా నిలదీస్తూన్నారు కదా! మరీ ఆరోజుల్లో భూస్వాముల దగ్గర ఎంతో భూమి ఉండేది. వారు ఎన్నో సంవత్సరాలను నుంచి తమ పొలాలో కూలి పని చేసిన దళితులకు కొంత భూమి ఇవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా? అని ప్రశ్నలు వచ్చేవి. వారికి అలా అనిపించి, భూమిని దానం చేస్తూంటే ఎవరైనా అడ్డుకొన్నారా? అడ్డుకొన్నా పైవర్గాల వారు చెప్పే కర్మ సిద్దాంతం, పూర్వజన్మలు, పాపపుణ్యాల సిద్దాంతాలను పటాపంచేలు చేయటానికకైనా, గ్రామనికి ఒక్క భూస్వామి అన్నా తన భూమిని దానం చేసి ఉండి ఉంటే ఆసిద్దాంతం ఎప్పుడో గాలికి కొట్టుకొని పోయి ఉండేది కదా!అని పిస్తుంది. మీకు తెలిసి అలా ఎవరైనా దానం చేశారా? తెలిస్తే ఆ వివరాలను దయచేసి మాతో పంచుకోగలరు. (అప్పట్లో వినోభ బావే గారికి కొందరు ఇచ్చారు. దానిని మినహాయించండి. )
      Sri

      Delete
    9. @ఈ టపాలో కులాల ప్రసక్తి వచ్చింది కదండి. ఈ కులాలను పూర్వులే నిర్ణయించారు అని



      ANRD గారు, టపాలో ఒక్క కులంప్రసక్తి వచ్చిందేమో కాని, 'కులాల' ప్రసక్తి పెద్దగా లేదండీ. ఆ వ్యవస్థను పలానా వారు పెట్టారని కుడా ఈ టపాలో లేదండీ. మీరు చెప్పదలుచుకొన్నది ఇక్కడ సరిపోదు

      @@@ఇప్పుడు మనం ఒక కూలివానికి ఒక ఉద్యోగికి సమానంగా జీతభత్యాలు ఇస్తున్నామా ?



      కూలివానికి, నటుడి తో సమానం గా ఇవ్వాలా లేదా అన్నది మీరు వాదిస్తున్న ప్రశ్న అయితే, అలాక్కుడా టపా లో సంపాదన, జీత భత్యాల వివరాలు చర్చించలేదు కదండీ.

      Delete
    10. Sri/అజ్ఞాత గారు,

      నేను హిందూ వ్యవస్థ లోని పాత పద్దతుల్ని నిలదీయటం లాంటి పనులేం చెయ్యట్లేదండీ. ఏదో నాకు తెలిసిన దాంతో చర్చిస్తూ ఇతరుల వ్యాఖ్య ద్వారా నా అవగాహన మెరుగు పరచుందామని ప్రయత్నిస్తున్నా అంతే. మీరు మరీ అంత పెద్ద పెద్ద పదాలు వాడకండీ నాకు భయమేస్తుంది :)

      ఇంక మీరడిగిన విషయానికొస్తే.. ఆ రోజుల్లో కూడా కొంతమంది ప్రశ్నించే ఉంటారనిపిస్తుందండీ. భూస్వాములైనా, బ్రామ్హణులైనా, క్షత్రియులైనా తాము చేసేది తప్పు అనుకొని చెయ్యరండీ. అదే ఈ సమాజం నడవాల్సిన పద్దతి అని నమ్మి ఆ గానుగ లోనే తిరుగుతారండీ. మీరన్నట్టు ఏ భూస్వామైనా అలా భూమి దానమిస్తే, తీసుకునే వాళ్ళు కూడా హమ్మో ఈ పని మేం చెయ్యకూడదేమో, చేస్తే మొత్తం సమాజానికి వ్యతిరేక మవుతామేమో అనే ఆలోచిస్తారేమో బహుశా.

      అప్పటి రోజుల్లో పరిస్థితుల్ని మనం మరీ అంత ఖచ్చితంగా చెప్పలేం కదండీ. మనకి తెలిసిన రోజుల్లోనే మీరుదహరించిన దానికి సరిపోలిన ఉదాహరణలు కొన్ని చూస్తే, బహుశా అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించొచ్చు కానీ ఇదమిధ్ధంగా చెప్పలేం. ఉదాహరణకి, ఒక భూస్వామి తన పొలాన్ని ఒక దళితుడికి అమ్మితే ఆ చుట్టు పక్కల పొలాలున్న మిగిలిన భూస్వాములు దాన్ని ఒప్పుకోక పోవటం లేదా ఒక బ్రామ్హణుడు విధిలేని పరిస్థితుల్లో తన ఇంటిని ఒక దళితుడికో, శూద్రుడికో అమ్మబోతే ఆ వీధిలోని వాళ్ళు ఒప్పుకోక పోవటం లాంటివి మనకి ఊహ తెలిశాక కూడా జరిగాయి కదండీ. ఇప్పుడు చాలా మెరుగయ్యింది లెండి.

      నిజమే మీరన్నట్టు తగినన్ని ప్రయత్నాలు జరిగుంటే తప్పుడు సిధ్ధాంతాలు ఎప్పుడో గాలికి కొట్టుకు పోయుండేవి. ఎక్కవమందికి ప్రశ్నించే అవగాహనా అవకాశం లేక పోవటం కారణమై ఉండొచ్చు. ఎక్కడిదాకో ఎందుకండీ, మీరన్నట్టు అవి ఒకవేళ తప్పైతే తప్పే అయ్యుండొచ్చు అని ఒప్పుకోవడానికి ఇప్పటికీ వెనుకంజ వేస్తూ ఏదో మంచి దాని వెనకాల ఉండే ఉంటుందనీ, అప్పటి దేశ కాల మాన పరిస్థితులకి అదే సరైందనీ, అప్పుడే ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లే వారనీ, ఆ వ్యవస్థల విజయాల్ని ఉదాహరణలుగా చూపించి, లోపాల వెనక మనలాంటి అర్భకులకి అర్థం కాని మాయ ఉండేదనీ నీజాయితీగా నమ్మే వాళ్ళూ, నమ్మబలికించే సుంకుచిత భావాలూ నాకైతే ఇంకా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. బహుశా మీకూ కనబడొచ్చు.

      Delete
    11. anrd గారు,

      >>"మనుషులు అందరూ సమానమే... ఎవరి కష్టమైనా ఒకటే కదండి !"

      నిజమేనండీ. కానీ ఇక్కడ విషయం కష్టానికి వచ్చే జీతభత్యాల సంగతి కదా. కష్టం తో పాటు అది ఉత్పత్తి చేసే వస్తువు లేదా సేవ యొక్క అవసరం ఎంత, పడే కష్టం లో నైపుణ్యం మనకి అందుబాటులో ఉందా అనేవాటిని బట్టి ఆ కష్టానికి ప్రతిఫలం నిర్నయించే పద్దతిలో నాకు తప్పు కనబడట్లేదు.

      ఎవరికి అవసరమైన పనులూ, నైపుణ్యం ఉన్న పనులూ వారి వారి ఆర్థిక అవసరాలనిబట్టీ, ఆసక్తిని బట్టీ వాళ్ళు ఎంచుకోవచ్చు కదా ఎంచక్కా.

      అయినా ఎదుటి మనిషిని మనిషిగా చూసి వారి ప్రవర్తననీ, వారిలోని సృజనాత్మకతనీ, ఙానాన్నీ బట్టి ఎక్కువతక్కువలు ఉండటం మంచి పద్దతిగానే అనుకుంటున్నాను నేను.

      అలాకాదు అందరూ సమానమే అన్ని విషయాల్లోనూ మరీ ముఖ్యంగా దేవుడి దృష్టిలో అంటే.. ఏమో తెలియదు కానీ ఇక్కడ మనం చర్చించే అంశాలకి సంబంధం లేని నీతి సూత్రాలు గా మాత్రమే పరిగణిస్తానేమో. ఇలా అసందర్భంగా వాడటం వల్ల ఇలాంటి ఎన్నో నీతి వాక్యాలు వాటి అర్థాన్ని కోల్పోతున్నాయేమో అనిపిస్తుందండీ అప్పుడప్పుడూ.

      >>"పూర్వం కూడా ఒక కులం వాళ్ళు ఇంకొక కులానికి సంబంధించిన వృత్తులను చేపట్టం జరిగిందండి"

      ఇంతకు ముందు చెప్పినట్టుగా, అసలు జరగలేదని నేను చెప్పడానికి ప్రయత్నించట్లేదండీ. అప్పుడుకూడా అవి అసాధారణమైన, ప్రత్యేకమైన విషయాలు గానే జరిగాయి గానీ అదేదో మామూలుగా జరిగే ప్రక్రియలు కాదు అనే అంశాన్ని పరిశీలించమని సూచిస్తున్నానంతే.

      >>"నా అభిప్రాయం ప్రతి విషయానికి పెద్దవాళ్ళను తప్పుపట్టటం జరుగుతోంది. వాళ్ళు దైవం దృష్టిలో అందరూ సమానమే అని కూడా చెప్పారు మరి"

      నిజమేనండీ మీరన్నట్టు అటువంటి గుడ్డెద్దుపోకడలు కనబడుతున్నాయి. కాకపోతే నేనింతకు ముందే చెప్పినట్టు ప్రతిదానికీ పూర్వులు అసలేం తప్పులు ఎరగరు అన్నట్టు చెప్పడం కూడా అదే కోవలోకి వస్తుందనేది నా అభిప్రాయం.

      >>"పూర్వులు అంటే మనకు పాతతరాలవాళ్ళు"

      అవునండీ అదే అర్థం కాక అడిగాను. పాతతరం వాళ్ళు అంటే... రామారావూ, YSR తరం వాళ్ళా? చెన్నారెడ్డీ, నరసిమ్హారావు తరంవాళ్ళా? ఇందిరా గాంధీ, మొరార్జీ అప్పటి వాళ్ళా ? గాంధీ నెహ్రూ అంబేద్కర్ తరం వాళ్ళా ? రామ్మోహన్రాయ్,ఈశ్వరచంద్ర వివేకానంద అప్పటి వాళ్ళా? టిప్పుసుల్తానూ, ఔరంగజేబు సమయం వాళ్ళా ? శంకరాచార్యా, ఢిల్లీసుల్తానుల కాలం వాళ్ళా ? హర్షవర్ధనుడూ, సముద్రగుప్తుడూ నాటి వాళ్ళా? ఆశోకుడూ బుధ్ధుడూ మధ్య కాలం వాళ్ళా ? ఉపనిషత్తులు రాయబడినప్పటి వాళ్ళా? బ్రమ్హణాస్ రాయబడినప్పటి వాళ్ళా ? వేదాలు రాయబడినప్పటి వాళ్ళా ? రాతి యుగం లో వాళ్ళా? లేకా ఇంకా ఆదిమ స్థాయిల్లో వాళ్ళా?

      ఎవరెవరు ఈ పూర్వుల్లో ఉన్నారూ? ఎవరు లేరు ? అందరూ ఉన్నారా ?
      ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెప్పారు మరి. ఎవరిది ప్రామాణికం?

      Delete
    12. wp గారూ నాకు తెలిసింది చాలా తక్కువ.

      తెలిసినంతలో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ..... కులం అనేది తప్పక పుట్టుక ద్వారా మాత్రమేనా ? లేక ? అన్నది ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది.

      వీలు కుదిరిన వాళ్ళు భగవధ్గీతలో .... జ్ఞానయోగం, మోక్షసన్యాస యోగం చదవగలరు.
      శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ... గ్రంధంలో కూడా ఎన్నో వివరములు ఉన్నాయి..

      Delete
    13. anrd

      >>>>శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ... గ్రంధంలో కూడా ఎన్నో వివరములు ఉన్నాయి..

      ఏమి వివరాలున్నాయో కొంచెం వివరించ గలరా ??????


      అయితే బ్లాగుల్లో శ్రీపాద చరిత్రలోని ఘట్టాలను, 'బుజ్జిపండు చదువు' పేరు తో వ్రాస్తున్నది మీరేనా :)

      Delete
    14. anrd గారు,

      >>"నాకు తెలిసింది చాలా తక్కువ"

      అందరమూ అంతే లెండి. ఏదో మనకి తెలిసినంతలో చర్చించుకోవటం తెలియనవి తెలుసుకోవటానికి ప్రయత్నించటం. ధన్యవాదాలు .

      Delete
  10. నా వయస్సుని బట్టి చెప్పగలుగుతున్నాను.రామారావు హీరోగా వచ్చిన కొత్తలో అతని కులం ఆధిక్యంలో లేదు.సినిమారంగంలో రెడ్లు,బ్రాహ్మలు కీలకమైన స్థానంలో ఉండేవారు.నాగయ్య,C.S.R.నారాయణరావు,Y.V.రావు ,పెద్ద హీరోలు.B,N.రెడ్డి ,H.M.రెడ్డి పెద్ద నిర్మాతలు .హీరోయిన్లు ,భానుమతి వంటి వారిని మినహాయిస్తే వేశ్యా కులం వారు.తర్వాతకాలంలో కమ్మ వారి ప్రాబల్యం పెరిగింది.మొదట్లో బ్రాహ్మలూ ,రెడ్డ్లూ రామారావునీ, నాగేశ్వరరావునీ ప్రోత్సహించారు.ఆమాట వాళ్ళే చెప్పుకొన్నారు.రామారావు అందం ,పర్సనాల్టీ వల్ల, అక్కినేని నటనతో పైకి వచ్చారు.
    50 నుంచి దాదాపు 70 దాకా వీళ్ళ నటన సహజంగా lowkey లో వుండేది.రానురాను కృతకంగా ,మేనరిజంస్ ఎక్కువైపోయాయి .ఐనా వీరి ప్రభ వెలుగుతున్నప్పుడు కూడా ఇతర కులాల హీరోలు రాణించారు.హరనాథ్ ,రమణమూర్తి,రామకృష్ణ ,క్రిష్ణం రాజు,రంగనాథ్,చంద్రమోహన్ వంటి వాళ్ళు.మరి ఇప్పుడంతా ఎవరి కుటుంబసభ్యుల్ని వాళ్ళు ప్రొమోట్ చేసుకొంటున్నారు.అందుచేత ఏ కుటుంబంలో పుట్టారన్నమాట అప్పటీకన్నా ఇప్పుడు ఎక్కువగా వర్తిస్తుంది.! ,

    ReplyDelete
  11. ఈ పోస్టుకి కామెంట్లు రాస్తున్న మిత్రులకి ధన్యవాదాలు.

    రాయదల్చుకున్న పాయింట్ కి ఎన్టీఆర్ ని ఉదాహరణగా తీసుకోవటం తప్పన్న సంగతి గ్రహించాను.

    నా విషయ పరిజ్ఞాన లేమికి మన్నించగలరు.

    ఇకనుండి ఇట్లాంటి పొరబాటు దొర్లకుండా జాగ్రత్తగా ఉంటాను.

    నా తప్పుని సవివరంగా తెలియ చేసిన WP, కమనీయం గార్లకి మరియూ అజ్ఞాతలకి కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. Ramana gaaru,

      I may be hitting a tangent from the topic. nevertheless, I want to share this with you.

      Many times in our society, the one who goes against the dominant line of thinking is expected to be 100% perfect. Those who subscribe and support to the dominant line of thinking have the luxury of making honest mistakes while others do not have it.

      Instead of trying to be 100% perfect, its better to go ahead and present our point and have the gumption to accept mistakes while still putting our point across. You did exactly that

      Delete
    2. >>>ఒక పుజారి గారింట్లో పుడితే అర్చకత్వం >>> పక్కనున్న కుమ్మరి బజారులో పుడితే కుండలు చేసుకుంటూ >>> రెక్కలు

      హ్మ్ ..ఆయన ఇంటింటికీ తిరిగి పాలమ్మింది ఎ కులం లో పుట్టిన వర౦ అండీ :)

      @రాయదల్చుకున్న పాయింట్ కి ఎన్టీఆర్ ని ఉదాహరణగా తీసుకోవటం

      అదేమీ లేదండీ, ఇప్పటి వరకు అదే నిజమని నమ్మే వారికి కాదని తెలిసింది కదా మీ టపా లోని వ్యాఖ్యల వల్లనే :)

      Delete
  12. ఒక రకంగా అప్పట్లొనే నయం, కనీసం సినీ రంగంలో ప్రయత్నించడానికి అవకాశం ఉండెది, ఇప్పుడు ఐతే, యే కులం ఐనా, సినిమా ఫామిలీ ఐతే తప్ప అసలు అవకాశమే దొరకడం కష్టం కదా. ఒకవేళ డబ్బు ఉండి సినిమా తీసినా, థియేటర్లు దొరకనివ్వడం లేదు అంటున్నారు మరి.

    ReplyDelete
  13. Ofcourse,there is no need for Mr.Ramana to apologize.He stated his view ,no doubt.There are politics in cinefield like many other fields.I think there is more nepotism than casteism inthat field.But ultimately acceptance by the public is very important,which is got only by consistent performance and success.Luck,talent and clever use of opportunity also play important part.

    ReplyDelete
  14. MR Ramana,

    There is no need to regret to take reference of Ramarao's name for your aricle..whatever you have written absolutely right..

    If a seed is planted in a right place in a right time..then its job is over...rest will take care itself..

    More than his action ..his caste and may be his personality is dominating..so somehow it worked for him..though he acts exceptionally well in certain characters...but i dont think he is versatile..

    ReplyDelete
  15. Chusara kulala godava vachesariki entamandi spandistunaaro,chaduvuto,vrutthi to sambadam lekunda spandistunaaru bahusa mee ee itara postulaku raananni comments dhiniki vastunnaiatukunta.

    ReplyDelete
    Replies
    1. Ramesh Babu గారు,

      కులాల గొడవనగానే ఎక్కువమంది స్పందించారని నేనైతే అనుకోను. విభిన్న అభిప్రాయాలున్న అంశం మీద చర్చ కాబట్టి ఎక్కువ వ్యాఖ్యలు వస్తున్నాయి అనుకుందాం. ఏమంటారు :)

      సాధారణంగా రాజకీయ పరమైన అంశాలు గానీ సామాజిక సమస్యల మీద గానీ అయితే ఎక్కువ మందికి ఆసక్తీ, అభిప్రాయాలు, అవగాహనా ఉన్న అంశాలు కాబట్టి స్పందన కొంచెం ఎక్కువే ఉంటుంది మీరన్నట్టు.

      గుత్తొంకాయ కూర గురించి రాస్తే అవును చాలా బాగుంటుంది అని తప్ప పెద్దగా చర్చించడానికేం ఉంటుందండీ :)

      Delete
  16. లేకపొతే తెలుగు కాకుండా, వేరే ఏ భాష లోనూ నటించని అయన "విశ్వ"విఖ్యాత etc ఎలా అవుతారు????

    <<>>
    ఇది ఎవరూ కాదనలేని నిజం! 1940 ల లో జాన్ ఫోర్డూ, 50 ల లో, హిచ్కాకూ, 60 ల లో, కూబ్రిక్కూ సినిమాలు ఇప్పుడు చూసినా సిల్లీ గా గానీ, ఓవర్ యాక్షన్ లా గానీ అనిపించవు, కానీ తెలుగు సినిమాలు మాత్రం చాలా silly గా ఉంటాయి.
    had we got better people "then" in Movies, telugu cinema right "now" would have got the best of the quality. very unfortunate!


    Sorry andi Yaramana garu! I dont have a blog, just tried to type in telugu using lekhini for the first time, inspired by your telugu.
    BTW, I am big fan of your blog, please keep writing.

    ReplyDelete
  17. డియర్ రమణ,

    ఎక్కడో మొదలు పెడితే ఎక్కడనించి ఎక్కడకో మరెక్కడకో..

    ఈ టపా ఇంత గందరగోళంగా మారిందేమిటి?

    ముందుగా.. నువ్వు చెప్పదలచుకున్న విషయానికి రామారావుని ఉదాహరణగా తీసుకుని ఉండాల్సింది కాదు.

    కమనీయం గారు చెప్పినట్లుగా రామారావు ఫీల్డ్ లో ఎంటర్
    అయ్యేనాటికి హేమహేమీలు, ఉద్దండులు అయిన దర్శకులు, కధకులు, మ్యూజిక్ దర్శకులు ఒకరికి ఒకరు పోటీగా సినిమాలు తీస్తున్నారు.

    రామారావు అందగాడు అవటం మూలానా ప్లస్ అతనిలో ఉన్న పట్టుదల, మొండిగా కష్టపడటం లాంటి గుణాల మూలంగా encourage చెయ్యబడ్డాడు.

    అలా అంచెలంచెలుగా స్వయంకృషి కొంత, అదృష్టం, అవకాశం కొంత
    కలసిరావడంతో పైకి వచ్చాడు.

    ఆ తర్వాత తన గొప్పతనాన్ని ప్రదర్శించడంతో పాటు, కుల బందుత్వాలని, తన వారిని కాపాడుకుంటూ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు.

    ఈ క్రమంలో తనకి నచ్చినవారినే అన్ని శాఖలకి నియమించేలాగా నిర్మాతల మీద వత్తిడి తెచ్చేవాడని అనేకమంది రాయగా చదివాను.

    ఉదాహరణకి విఠలాచార్య కాంతారావు, రాజశ్రీ, రాజనాల, సత్యనారాయణ, కాసిన్ని జంతువులుతో సినిమా తీసేవాడు. తన స్థాయికి తగ్గి ఆయన సినిమాలలో కూడా తనే నటించాడు.

    కళ కళ కోసం కాదు గాడిద గుడ్డు కాదు, ఇది ఫక్తు వ్యాపారం మాత్రమే! మేము వ్యాపారం చెయ్యడానికే వచ్చాము - ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అనే రోజులు వచ్చిన తర్వాత తెలుగు సినిమా వెర్రితలలు వేయటం మొదలెట్టింది.

    అందులో భాగమే అడవిరాముడు, యమగోల తదితర సినిమాలు.

    ఆకలయింది అంటే అన్నం పెట్టమని కాని అశుద్ధం పెట్టమని కాదుకదా.

    ఇంకా నీ బ్లాగు లో చర్చ హిందూయిజం మీద కుల వ్యవస్థ మీద ఎక్కువగా జరిగింది.

    (నా లాప్ టాప్ కదలకుండా చాల ఏడిపిస్తోంది. అందుకని ముగిస్తాను.)

    ఒక్కమాట - శ్రమ శక్తీ - అదనపు విలువల గురించి చదివితే చాలా క్లారిటీ వస్తుంది అనుకుంటాను.

    ఇంకా ఇవాల్టి తెలుగు సినిమా గురించి యెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనుకుంటాను.

    కాకపోతే ఆ హీరొయిన్ లని చూసినప్పుడే కాస్త బాధ వేస్తుంది - వానలో, బురదలో, మంచు కొండల్లో హీరో చక్కగా ఫుల్ సూట్తో.. ఎవరో, ఎక్కడో, ఎప్పుడో పాడిన పాటకి గెంతుతూ వుంటే - పాపం ఆ అమ్మాయి యెంత డబ్బులు తీసుకుంటే మటుకు.. పైన ఓ కర్చీఫ్, కింద ఓ కర్చిఫ్ కట్టుకుని ఓ యాభై అరవై మగాళ్ళ ముందర అడ్డమైన గెంతులు గెంతుతుంటే అయ్యో పాపం! అనిపిస్తుంది.

    వారసత్వ హీరోలు పోయేంత వరకు మన కొద్దిమందికి ఇష్టం వున్నా లేకపోయినా తెలుగు సినిమా వర్ధిల్లుతూనే వుంటుంది!

    తెలుగు సినిమా -- వర్ధిల్లు!
    సినిమా వారస హీరోల్లారా వర్ధిల్లండి!!

    గోపరాజు రవి

    తోక : నేను స్క్రీను మీద తెలుగు సినిమా చూసి దాదాపు పాతిక ముప్పై ఏళ్ళు అవుతోంది.

    (ఏవో ఒకటి, రొండు తప్ప తప్పులుంటే క్షమించండి.)

    ReplyDelete
    Replies
    1. నాకూ ఆ హీరొయిన్ లని ఇప్పుడు చూస్తూంటే ఇంకా బాధ వేస్తున్నాది. శ్రీదేవిని, బోనికపుర్ జంటను చూస్తుంటే, మాంత్రికుడి చేతికి చిక్కిన చిలుకలాగా ఉన్నాదనిపించింది. ఆమే రోజు రోజుకి తగ్గి స్లిం గా తయారవుతుంటే, బోని కపుర్ రోజు రోజుకి పెరిగి పోతున్నాడు.
      ఇక జయప్రద సంగతి చెప్పక్కరలేదు. ఆమేకు ఈ వయసులో ఎమీ ఆ కష్ట్టాలు. అమర్ సింగ్ జైలు కెళితే, బైలు కోసం డీల్లిలోని గల్లీల లో తిరగటం :-)

      Sri

      Delete
  18. చాలా బావుంది...నాకు మీ సుబ్బు బాగా నచ్చేస్తున్నాడు!

    ReplyDelete
  19. చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. మీరు రామారావుని తప్పుగా ఎన్నుకున్నారో లేదోగానీ చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పారు. అర్థం చేసుకోవాలి అనుకున్నవాళ్ళకి ఎక్కుతుంది...అది చాలు! మీ సుబ్బు చెప్పినదాన్లో ఎంతో నిజం ఉంది!

    ReplyDelete
  20. రమణ గారు బాగా రాశారు .క్షమాపణలు ఎందుకు ? రామారావును ఉదాహరణగా తీసుకోవడం లో తప్పేముంది . మన అభిప్రాయాలు అందరికీ నచ్చాలని లేదు . అందరిని మెప్పించడం ఎవరి తరం కాదు. లోకో భిన్నరుచి అన్నారు. అలా ఉండడమే మంచిది .

    ReplyDelete
  21. రమణ గారు,

    మొత్తం మీద, "ఈ మారు వేరే సంబోధన!- దాటేరు గారు", అని సరిగ్గానే ఊహించానన్న మాట ! కామెంటు ఏరు టపా ఊరిని బాగానే దాటేసింది !!!

    గన్స్ గో టు ఒన్ హండ్రెడ్!!!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  22. శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ... గ్రంధంలో చాలా వివరాలు ఉన్నాయండి. కులాల గురించి కూడా వివరాలు ఉన్నాయి.

    కులం లేక వృత్తిని బట్టి అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు అని నాకు అనిపిస్తుంది.

    'బుజ్జిపండు చదువు' .... బ్లాగ్ గురించి నాకు తెలియదు..

    ReplyDelete
    Replies
    1. anrd

      @ ..గ్రంధంలో చాలా వివరాలు ఉన్నాయండి. కులాల గురించి కూడా వివరాలు ఉన్నాయి.

      మీరెప్పుడు విష్యం తప్ప తప్పించుకోటానికి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అని చెప్పడమే పనా. ఏమి వివరాలున్నాయో చెప్పండి !!!

      @@కులం లేక వృత్తిని బట్టి అంటరానితనాన్ని పెద్దలు ప్రోత్సహించలేదు అని నాకు అనిపిస్తుంది.

      అక్కడ వ్రాసి లేకున్నా మీకు అనిపించింది, అని చెపితే సరిపోతుందా.?????


      @@@'బుజ్జిపండు చదువు' .... బ్లాగ్ గురించి నాకు తెలియదు..

      హ హ ..శ్రీ పాదుని బాల్యం కాపీ కొట్టి 'బుజ్జి పండు చదువు' అని కవరప్ చేసి, అటు శంకరా భరణం బ్లాగులో పెద్దలని బకారాలని చేసిన రియాల్టీ షో :)

      Delete
  23. మిత్రులారా,

    నా టపా ఒక ఆసక్తికర చర్చకి దారి తీసింది.

    అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

    మీ నాలెడ్జికి, వాదనా పటిమకి ఆశ్చర్యపోతున్నాను.

    నేను ఒక ఎకడెమిక్ వర్క్ (పిచ్చి వైద్య శాస్త్రం) పై బిజీగా ఉండటం వల్లనూ..

    చర్చ స్థాయి మరీ ఎక్కువగా ఉండుట చేతనూ..

    కేవలం కామెంట్ల ముద్రాపకునిగా మిగిలితిని.

    మన్నించగలరు.

    ReplyDelete
  24. "నటనకి కులం ఉందా" అనే ప్రశ్నకు టూకీగా సమాధానం అవుననే చెప్పాలి. కొన్ని మచ్చుతునకలు చ్చొస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

    1. చిరంజీవి బాలకృష్ణల ఫంఖాలు బ్లాగ్లోకంలో ఒకరి మీద ఒకరు రాసుకునే బూతులు
    2. హరికృష్ణ రెండో "భార్య" కుమారరత్నం తన "తండ్రి" గారి భాషను, కులాన్ని స్వీకరించిన సమయ స్ఫూర్తి
    3. చనిపోయిన ఇన్నేళ్ళకి మహానటుడు గారి గురించి సడన్గా పుట్టుకొస్తున్న వ్యాఖ్యానాలు

    నాకు ఏ కులాన్నీ తప్పు పట్టే ఉద్దేశ్యం లేదు. పై ఉదాహరణల వల్ల ఆ వ్యక్తులను కించపరిచి ఉంటె క్షమించండి.

    ReplyDelete
    Replies
    1. Point 3 is about SVR (suddenly resurrected in the last few years by his newly found "fans")

      Delete
  25. @Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)Jan 31, 2012 06:14 AM:

    You hit the nail on its head. The "dominant groups" use imperfections in the opposing arguments as a tool to protect their "vested interests".

    వాదనలు నటనకు కులానికీ ఉన్న(?) అనుబంధం నుంచి మరెక్కడికో వెళ్ళిపోయాయి. విషయం ఎటు తిరిగీ తప్పు దారి పట్టింది కాబట్టి నేను కూడా ఈ అవకాశాన్ని "సద్వినియోగం" చేసుకుంటాను.

    కుల వ్యవస్థ కేవలం పని పంపకం (division of labor) అని, ఒకప్పుడు భేదం తప్ప వివక్ష లేదనీ (different but equal) వాదించే వారికి నాదో ప్రశ్న. అంతోటి దానికి చెవిలో సీసం అవసరమా? బలప్రయోగంతో నిలబెట్టిన "వ్యవస్థ" సమతులమనయిదని ఊహించుకొని మురిసిపోవడం సబబు కాదు.

    ReplyDelete
    Replies
    1. @Jai Gottimukkala,

      There is a hell lot of difference between division of labour and division of labourers.

      The so called Varna/Caste system looks more like division of labourers.

      Delete
  26. మీ సుబ్బు ఈ మధ్య వివాదాస్పదంగా భాషిస్తున్నాడు.
    కాస్త మీ వైద్యం అవసరమేమో చూడండి.

    ReplyDelete
  27. ee desam lo kulam podu matham chavadu amirca vellina aavakaaya vaddu ani sistla cheppina aagedi kaadu

    ReplyDelete
  28. అంతా అయిన ఆరునెలలకు, పిచ్చి వైద్యం ప్రాక్టిస్ చేసుకొనే డాక్టర్ రాస్తున్న బ్లాగుకు వచ్చి,ఒకరు నాదోక ప్రశ్న చెవిలో సీసం, బలప్రయోగం , వ్యవస్థ అని ఎవేవో మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి తిక్క ప్రశ్నలకు, పిచ్చి పేషంట్లను చూసే డాక్టర్ రమణ గారు మాత్రమే సరి అయిన సమాధానం చెప్పగలరు. వారు ఇటువంటి వారిని రోజు ఎంతో మందిని చూస్తారు కదా! ఓపిక ఎక్కువగా ఉంట్టుంది. :-)

    ReplyDelete
  29. @Weekend Politician:

    "The so called Varna/Caste system looks more like division of labourers"

    I agree in a broad sense. However, there are two deeper aspects: inheitance by birth and defined hierarchy. Together with selective education (e.g. lead in the ears), it means only those born into a particular caste are prepared for the "assigned role".

    The argument that all castes are equal (or were equal at one time) is clearly wrong. Examples like Viswamitra are too few to support the claims of revisionist casteists.

    ReplyDelete
  30. నేను ఇది చదివి కామెంటు వ్రాసే టైముకు మీరు మరో పోస్టు రాసేశారు. దానికి ఓ యాభై కామెంట్లు వచ్చాయి.
    ఈ డిస్కషన్ ఎవరైనా థీసిస్ కు ఉపయోగించుకోవచ్చు. కాంట్రవర్సీ అయితే అయింది కానీ, మీరు మధ్యలో తగ్గడం నాకేం నచ్చలా..

    ReplyDelete
  31. చందు గారు,

    రమణగారు చెప్పిన పాయింట్ లో కొత్తదనమేమి లేదు. అసలికి మన సమాజానికి పది రామారావుల అవసరం ఉందా? నటుల సంఖ్య ఇంజనీర్లు, డాక్టర్ల మాదిరిగా ఎక్కువ అవసరం లేదు కదా!

    సమాజంలో ఎంత రామారావు పాపులర్ నటుడైనా, అదే కాలం లో నాటకాలు వేసే డి.వి. సుబ్బారావు గారికి ఆయన పరిధిలో తగిన గుర్తింపు ఉంది. ఎవరిగుర్తింపు వారిదే. రామారావు గారు రాజకీయాలలోకి రాకపోయింటే, రమణ గారిలాంటి వారు భానుమతిని గుర్తుకు చేసుకొన్నట్టు ఆయనని గుర్తుకు తేచ్చుకొనే వారేమో!

    Sri

    To be continued ...

    ReplyDelete
  32. @Sriram/ Ram/ Sri

    >>రమణ గారిలాంటి వారు భానుమతిని గుర్తుకు చేసుకొన్నట్టు


    సావిత్రి :)

    ReplyDelete
  33. గొట్టిముక్కు, WeekendPolitician వాదనలు గందరగోళంగా వున్నాయి. సీసం ఎవరు ఎవరికి, ఎందుకు పోసారు? అనేది చెప్పకుండా సీసం పోశారు పోశారు ఇది న్యాయమా? ధర్మమా? అని చొక్కా పట్టుకుని అడిగితే నాయం సెప్పడానికి టైం మిసన్లో 3000ఏళ్ళు ఎనక్కి ఎల్లే ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు నాయసాస్త్రం పెకారం అన్నాయం. ఇప్పుడు ధర్మ సాస్త్రం పెకారం అర్హత వున్న లేకున్న కులం కోటాల వాటాలు ధర్మం. మీ కామెంట్లు అందరికీ షీషం పోస్తున్నాయి, ఇది నాయమా.

    ReplyDelete
  34. అఙాత (4 February 2012 06:28),

    నా వాదనలో మీకు ఎక్కడ గందరగోళం కనబడిందో చెప్పండి. ఊరికే ఇద్దరుముగ్గురు వాదనలని కలిపి మీ ఇష్టం వచ్చిన ప్రేలాపనలు రాస్తే అప్పుడవుతుంది గందరగోళం. జై గారు రాసిన వ్యాఖ్య సందర్భాన్ని బట్టి అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఏ గందరగోళం ఏమీ లేదు. మీకుంటే ఆ ముక్క ఆయన్నే అడగండి. మధ్యలో ఇద్దరి వాదనలూ కలిపి మీకు గందరగోళంగా ఉంటే మేమెం చేస్తాం చెప్పండి !!

    అసలు రమణగారి టపాకి నేను అవసరమైనంతే స్పందించాను. అనవసరంగా భుజాలు తడుముకునేవాళ్ళూ, కొంత వరకూ విషయాన్ని దారి మళ్ళిస్తే ఆ పాయింట్ల వరకూ నా వాదన చెప్పాను.

    మీరు చేస్తున్నది అసందర్భ ప్రేలాపన కాకపోతే, నా కామెంట్లలో మీకు గందరగోళంగా ఎక్కడనిపించిందో ధైర్యంగా చెప్పండి. తప్పకుండా స్పష్టత ఇవ్వటానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  35. Weekend Polititian


    /'బుజ్జిపండు చదువు' .... బ్లాగ్ గురించి నాకు తెలియదు../ అని ANRD అనే వ్యక్తీ సేప్పగానే, తెలీదని ఆ కధ కాస్త ఇవరించాము. అంతే!

    అంత మాత్రాన నేను కాదు అని చెప్పిన వారిని , నువ్వే ,నువ్వే అని ఎవరు నిందించినది లేదు


    కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు, ఆ వివరణ పట్టుకొని ఇంకేదో చాలా వ్రాసెన్ కాని, శ్రీపాద వల్లభ సంపూర్ణ చరిత్ర లో అసలేం ఉన్నది ఈ టపా లో చర్చించిన విషయాలు అన్నది మాత్రం తెలివిగా దాటేస్తూ వచ్చారు ANRD గారు . అంటే వారు చెప్పినవి ఏమిటి అని ఎవరు అడగనే కూడదు.


    ఏదేమైనా మంచి నిర్ణయం, వేరే బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయకపోవడం. టపా వదిలేసి కులాలు, పురాణాలు,పూర్వీకులు అని కొట్టుకొనే వాళ్ళు సగం తగ్గినట్లే .


    మీరు స్పందించారు కాబట్టి తెలియచేస్తున్నాను.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.