మా శీనుగాడు ఎన్టీరామారావుకి వీరాశూరాభిమాని. రామారావు సినిమాలన్ని మొదటిరోజు మొదటిఆట చూడాల్సిందే. సినిమా చూస్తున్నంతసేపూ మావాణ్ని ఎన్టీరామారావు పూనేవాడు. రామారావు ఆవేశపడితే శీనుగాడు ఆవేశపడేవాడు. రామారావు ఏడిస్తే శీనుగాడిక్కూడా ఏడుపే! ఒక్కోసారి నాకు చూడ్డానికి తెరమీద బొమ్మకన్నా మావాడి మొహమే బాగుండేది. మా శీనుగాడిది George Bush పాలసీ! రామారావు అభిమానులు వాడికి ఆత్మీయులు. కానివారు పరమశత్రువులు! very simple!
నాకు కిష్టిగాడు ఇంకో స్నేహితుడు. నాగేశ్వర్రావు అభిమాని. నాగేశ్వర్రావుతో పాటూ మావాడు కూడా హీరొయిన్ని ప్రేమించేవాడు. హీరోయిన్ దూరమైన హీరోగారి విరహరోదనలో తానూ పాల్గొనేవాడు. అయితే వీడి అభిమానం శీనుగాడి అభిమానంలా మొరటుగా ఉండేదికాదు.
ఆరోజుల్లో నాకు వీళ్ళద్దర్నీ చూస్తే ఎగతాళిగా ఉండేది. నవ్వొచ్చేది. ఇప్పుడు నా అభిప్రాయాలు చాలా మారిపొయ్యాయి. వెర్రి అభిమానంతో ఒక సినిమా నటుణ్ణి ఆరాధించేవారిపై ఒకప్పట్లా ఇప్పుడు నాలో తృణీకారభావం లేదు. పైగా అదొక అదృష్టం అనికూడా అనుకుంటున్నాను.
ఇష్టం లేకుండా ఎవరూ ఏ పని చెయ్యరు. ఆకలితో ఉన్నవాడికి ఐశ్వర్యారాయ్ కన్నా అన్నం చాలా అవసరం. అట్లే.. కడుపు నిండినవాడికి ఐశ్వర్యారాయ్ తో చాలా అవసరం. ఎందుకో నా మెదడులో ఈ 'వీరాభిమాన నాడీవ్యవస్థ' సరీగ్గా develop అవ్వలేదు. చిన్నప్పట్నించి నా అభిమానం ఆ సినిమా వరకే పరిమితం.
నాకు రామారావు, నాగేశ్వర్రావులిద్దరూ ఇష్టం.. అయిష్టం కూడా! ముందు ఇష్టం ఎందుకో రాస్తాను. నాగేశ్వరరావు అత్యుత్తమ నటుడు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన 'దేవదాసు' నటన ఒక top class performance. 'రోజులు మారాయి'లో రైతుబిడ్డ వేణుగా చాలా సహజంగా పాత్రలో ఇమిడిపోయాడు. బాటసారి, విప్రనారాయణ, దొంగరాముడు, మూగమనసులు, పెళ్ళినాటి ప్రమాణాలు, మురళీ కృష్ణ.. ఇదొక endless list.
ఇక నాకిష్టమైన ఎన్టీరామారావు సినిమాల list పలురకాలుగా ఉంటుంది. ముందుగా నా చిన్నప్పటి list. అగ్గి పిడుగు, బందిపోటు, గండికోట రహస్యం, చిక్కడు దొరకడు, కదలడు వదలడు. బుద్ధి వికసించిన తరవాత వీటికొక additional list. జయసింహ, మల్లీశ్వరి, మిస్సమ్మ, రక్తసంబంధం, గుండమ్మకథ, దేవత, దాగుడు మూతలు.. ఇదో చాంతాడు. ఇక రామారావు వేసిన పౌరాణికవేషాలు సరేసరి.
రామారావు, నాగేశ్వర్రావులు మంచిసినిమాల్లో గొప్పపాత్రలు పోషించిన ఉత్తమనటులు. వీరి ప్రతిభకి హేట్సాఫ్! నాకు ఇంతకుమించి వారితో ఏ emotional attachments లేవు. అందుకే వీళ్ళిద్దర్నీ చిన్నప్పుడు అంతగా ఇష్టపడినా.. తర్వాత్తర్వాత వాళ్ళ సినిమాలు నచ్చక పట్టించుకోడం మానేశాను. పాపం! మా శీను, కిష్టిగాళ్ళకి ఆ సౌకర్యంలేదు. తమ అభిమాన నటులు వృద్ధులైనా.. చచ్చినట్లు వారి సినిమాలు చూసేవాళ్ళు.
గతమెంతో ఘనమైన నాగేశ్వ్రర్రావు, రామారావులు డెబ్భైలలో ఏమయ్యారు? ఇద్దరికీ stardom అనే కిరీటం తలకన్నా పెద్దదైపోయింది. ముసలిహీరోని కుర్రాడిగా చూపించడానికి టెక్నీషియన్లకి తలప్రాణం తోకకొచ్చేది. శరీరంలో మార్పు ప్రకృతి సహజం. దాన్ని దాచటానికి ఎవరు తిప్పలుపడ్డా ఎబ్బెట్టుగా ఉంటుంది.
ఇద్దరూ మహానటులే! అప్పటికే డబ్బు బాగా సంపాదించేసారు. చక్కగా, graceful గా వయసుతగ్గ పాత్రలు వెయ్యొచ్చుగా! ఈ కుర్ర look పాట్లు ఎందుకు? నాకీ పాయింట్ అర్ధంగాక నా మిత్రద్వయాన్ని అడిగేవాణ్ణి.
శీనుగాడు కోపగించుకునేవాడు. రామారావుని ageless wonder అనేవాడు. నాకు సినిమా చూట్టం చేతకాదని కూడా దబాయించేవాడు. కిష్టిగాడు బయటకి నాతో ఏకీభవించినట్లే ఉండేవాడు. కానీ silent గా నాగేశ్వర్రావు సినిమాలు చూసేసేవాడు. వాళ్లు వారి అభిమాన నటులకి కట్టుబానిసలు!
ఒకేనటుడు ఒకసినిమాలో అద్భుతం. ఇంకోసినిమాలో వికారం. పాలు, నీళ్ళలా వేరుగా కనిపించేవారు. నాకిదేమి సమస్య? శీనుగాళ్ళా రామారావు వెడల్పు బెల్టుని, bell bottom ప్యాంటుని ఎందుకు ఇష్టపళ్ళేకపొయ్యాను? కిష్టిగాళ్ళా నాగేశ్వర్రావు బుట్టవిగ్గు, తగరపు్ కోటుల్ని ఎందుకు enjoy చెయ్యలేకపొయ్యాను?
సుబ్బుది different వాదన. రామారావు, నాగేశ్వ్రర్రావులకి నటన ఒక వృత్తి. డబ్బులిస్తే కుర్చీ, బల్లతో కూడా duet డ్యూయెట్ పాడగల సమర్ధులు. వారికి లేని గొప్పదనాన్ని, పవిత్రతని ఆపాదిస్తూ ఒక ఉన్నతస్థానంలో కూర్చోబెట్టి.. మన ఊహకి తగ్గట్లుగా ప్రవర్తించాలనుకోడం కరెక్ట్ కాదంటాడు.
ధనమూలమిదం జగత్ అన్నారు పెద్దలు. దశాబ్దాలపాటు శ్రమించి ఒక స్థానాన్ని చేరుకున్నాక.. ఆ brand image ని సొమ్ము చేసుకోకుండా ఎలా ఉంటారు! ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చేస్తుందదేగదా! డబ్బులిచ్చి మరీ నటించమని బ్రతిమాలుతుంటే నటించాడానికేం? తీసేవాడికి, చూసేవాడికి లేని బాధ నాకేల!
నా దృష్టిలో నటులు కూరగాయల్లాంటివాళ్ళు. మంచి దర్శకుడు మంచి వంటగాడిలాంటివాడు. నాగేశ్వర్రావు, రామారావులు తాజాగా ఉన్నరోజుల్లో బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్వీప్రసాద్, ఆదుర్తి వంటి ప్రతిభావంతులు వారితో అనేక వంటలు చేశారు. ప్రేక్షకుల జిహ్వచాపల్యాన్ని తీర్చారు. వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నారు. అది వారి అదృష్టం. ఈ గొప్పదర్శకులకే డెబ్భైల ముసలిహీరోల్ని ఇస్తే ఏం చేసేవారు?
అసలక్కడ చెయ్యడానికేముంది? అప్పటికే తెలుగు సినిమాల్లో కథ మాయమైపోయింది. హీరోగారి ఇమేజ్, అభిమానుల సరదాలకి తగ్గట్లు కథలు రాసుకోవటం మొదలైంది. పండిపోయిన, ముదిరిపోయిన కూరల్ని ఏ సాంబారులోనో వదిలినట్లు.. హిందీవాళ్ళు ముసలి హీరోలతో multi starrer అంటూ కలగూరగంప సినిమాలు తీసేవాళ్ళు. మనకా సౌలభ్యం లేదు. అందుకే బి.ఎన్.రెడ్డి శోభన్ బాబుతో సైలెంటుగా 'బంగారు పంజరం'
తీసుకున్నాడు.
ఇప్పుడు మీకో అనుమానం రావొచ్చు. తాజా కూరగాయల్తో వంట చెయ్యడం, మెప్పించడం ఎవరివల్లనైనా అవుతుందని. ఎంతమాత్రమూ కాదు. ముదిరిపోయిన కాయగూరల్తో నలభీములైనా చెయ్యగలిగేదేమీ ఉండదు. అట్లే.. వంట రానివాడికి ఎంత తాజా కూరగాయలిచ్చినా వంట చెడగోట్టేస్తాడు.
దేవదాసు సినిమాని కె.రాఘవేంద్రరావు ఎలా తీస్తాడు? పట్నం నుండి వచ్చిన దేవదాసుని చూడంగాన్లే సిగ్గుతో పార్వతి పైట జారిపోతుంది. ఇంతలో వర్షం పాట. యాపిల్ పళ్ళ మధ్య చంద్రముఖి. ఆమె బొడ్డుపై బొంగరం. ఈ పార్వతి, చంద్రముఖిల నాభి జఘన ప్రదర్శనా పోటీని అత్యంత రసవత్తరంగా తీస్తాడు. సినిమా super hit కూడా కావచ్చు!
బాపు, రమణలు మిస్సమ్మ తీస్తే ఎలాగుంటుంది? సినిమా అంతా background బాపు గీసిన రామాయణం బొమ్మలు (మిస్ మేరీ ఇంట్లో గోడ మీద సహా)! పొద్దస్తమానం మిస్సమ్మ చెంపలు, కళ్ళ క్లొజప్పులు. సహజత్వం పేరిట చీకట్లో సినిమా. మిస్సమ్మ, ఎం.పి.రావుల మధ్య గోరింటాకు, గజ్జెలు.. అంటూ ఏవో పైత్యవికార చేష్టలతో పాటలు. మధ్యలో కొన్ని రామాయణం పిట్టకథలు. ఎల్వీప్రసాద్ బావురుమనేవాడు!
కె.విశ్వనాథ్ 'రోజులు మారాయి' ఎలా తీసేవాడు? దళితురాలైన హీరోయిన్ క్లాసికల్ డ్యాన్సులు చేస్తుంటుంది. రైతుబిడ్డయిన మన హీరోగారు సంగీత విద్వాంసుడు. అంచేత హీరోయిన్ నృత్యాలకి గొంతు కలుపుతాడు. హీరోయిన్ని చేరదీద్దామని విలన్ సిఎస్సార్ ప్రయత్నిస్తుంటాడు. ఆయన కూడా సంగీత ప్రియుడే! సినిమాలో భూమి సమస్య కాస్తా సంగీతనృత్య సమస్య అయిపోతుంది. దటీజ్ కళాతపస్వి!
మాయాబజార్ దాసరి తీశాట్ట. నేను చూళ్ళేదు. కానీ ఊహించుకోగలను. దాసరి పాత్రలు పేజీల కొద్దీ మాట్లాడుతుంటాయి. దాసరి సినిమా సంభాషణలు తూకం వేస్తే మన గాలి జనార్ధనరెడ్డి అక్రమంగా తవ్వుకుపోయిన ఇనుప ఖనిజం కన్నా ఎక్కువ బరువుంటాయని మా సుబ్బు చెబుతుంటాడు.
ఇప్పుడు దాసరి మాయాబజార్ లో ఒక సీన్ ఊహించుకుందాం. శశిని తన కోడలుగా చేసుకుందామనుకున్న సుభద్ర ఆశలపై బలదేవుడు నీళ్ళు చల్లుతాడు. కౌరవులతో వియ్యానికి plan చేస్తాడు. అప్పుడు సుభద్ర ఏమంటుంది?
"అన్నయ్యా! నువ్వు చేస్తున్నది అన్యాయం. ఇదేనా నువ్వు తోబుట్టువుకి ఇచ్చే మర్యాద?" కట్! కె.వి.రెడ్డి సుభద్ర ఇక్కడితో ఆపేస్తుంది.
కానీ దాసరి సుభద్రకి ఇంకా డైలాగులున్నాయి. "ఆడదానికి భర్త ప్రత్యక్ష దైవం. పుట్టిల్లు చల్లని గూడు. ఆ ఇంటికి అన్నలు మొండిగోడలు. ఇప్పుడా గోడలే నా కొడుకి పెళ్ళికి మొండిగా, అడ్డు గోడలుగా నిలుస్తుంటే.. ఇక నాకు దిక్కెవ్వరు? ఈ కొంపకి ఆడపడుచుని. అత్తింటివారు పుట్టింటివారైనా.. పుట్టింటివారు అత్తింటివారైనా.. ఇచ్చిన మాట తప్పి అన్యాయం చేస్తూ.. " డైలాగులు ఇంకో నాలుగు పేజీలున్నై. సమయభావం వల్ల రాయలేకపోతున్నా! క్షమించగలరు.
నాకు గుత్తొంకాయ కూర చాలా ఇష్టం. అంతమాత్రాన గుత్తొంకాయలు ఎలాఉన్నా, కూర ఎలా వండినా తినను. వంకాయలు బాగోకపోయినా, రుచి కుదరకపోయినా పక్కన పెట్టేస్తాను.
చివరి తోక..
నే ప్రస్తావించిన దర్శకుల అభిమానులకి 'మనోభావాలు' దెబ్బతింటే.. వారికి నా క్షమాపణలు. మన ప్రముఖ దర్శకుల vision దశాబ్దాలుగా ఒకేవిధంగా ఉందనేదే నా point!
మన ఆలోచనలు, భావాలు (నాతోసహా) సాధారణంగా ఒక మూసలో ఉంటాయి. పెద్దగా variety ఉండదు. కమ్యూనిస్టు కాకరకాయ పులుసులో కూడా గొప్పకమ్యూనిజాన్ని కనగలడు. మతోన్మాది మజ్జిగన్నంలో కూడా మతాన్ని వెతుక్కుంటాడు. ఎవడిగోల వాడిది. అలాగే మన తెలుగు సినిమా దర్శకులు కూడా ప్రతికథలోనూ తమ మూస ఆలోచనలు జొప్పించి.. ఆ సినిమాని తమదైన శైలిలో రక్తి కట్టించారు. వారికి నా అభినందనలు!
(photo courtesy: Google)
adbhutam, nijamga excellent mi visleshana, na abhipraayam kooda acham ide, chaalaa saarlu ilaanti aalochanale vachi navvukuntu untaanu.
ReplyDeleteVimarsa intha sunnithanga saradaga chakkaga cheppaaka evarini noppisthundilendi..
annttu veera soora dheeraabhimaanulu unnaaru kadoo!!
స్నేహితుల సరదా సంభాషణల్ని టపాగా రాసి పడేశాను. మీకు నచ్చింది. సంతోషం.
DeleteI think you can write a book on Telugu movies, I wonder how u remember so many minute details, keep up the good work.
ReplyDeleteమైన్యూట్ డిటైల్సా! గాడిద గుడ్డేం కాదు. గుర్తున్న రెండు విషయాలతో నాలుగు ముక్కలు గెలికేశాను. ఇవన్నీ 'పని లేక.. ' కబుర్లు మిత్రమా!
Delete'మిస్సమ్మ'గా భానుమతి స్టిల్స్ పెట్టాను. గమనించావా? గూగులోడికి మరోసారి థాంక్స్!
Deleteసారీ. ఏమీ అనుకోకండి.
ReplyDeleteమీ టపా త్రివిక్రం సినిమాలా ఉంది.
త్రివిక్రం సినిమాలో సీన్లు ఉంటాయి కాని కథ ఉండదు.
మీ టపాలో కూడా (మీరే చెప్పినట్టు) కబుర్లున్నాయి కాని విషయం లేదు.
వాస్తవం చెప్పారు. సారీ ఎందుకు! విషయం లేకుండా టపాలు ఎలా రాయాలో ప్రాక్టీస్ చేస్తున్నాన్లేండి!
Delete:)
ReplyDeleteమిస్సమ్మలో భానుమతి స్టిల్స్ పెట్టినందుకు చాలా థాంక్స్ అండి డాక్టర్ గారు, మొదటిసారి చూస్తున్నా ఈ ఫోటోస్ :)
ReplyDeleteకె. విశ్వనాథ్ గారు కళాతపస్వి అనిపించుకోకముందు నేరము-శిక్ష , సుడిగుండాలు , కాలం మారింది లాంటి సినిమాలు సాంప్రదాయ సంగీత, నృత్యాల ప్రసక్తి లేకుండానే తీసారు. ఎస్పేషల్లీ కాలం మారింది సినిమా కులాల సబ్జెక్ట్ మీదే ఉంటుంది. సంప్రదాయ కళలు ఆయన ఫోర్టే అని నిశ్చయించుకున్నది సిరిసిరిమువ్వ సినిమా సక్సెస్ వల్లే అనుకుంటాను. కాబట్టి ఆయన మీరు చెప్పిన "ప్రతి కథలో మూస ఆలోచనలు జొప్పించే" దర్శకుల కోవలోకి చెందరనుకుంటా...
నాకీ భానుమతి మిస్సమ్మ ఫోటోలు ఎంత బాగున్నాయో! ఫోటోలని ఇరికించడం కోసమే ఈ పోస్ట్ రాశాను.
Deleteమీరు చెప్పిన (వెరైటీ సబ్జక్టులతో) సినిమాలు తీసినాయన పేరు కె.విశ్వనాథ్. ఆయన చాలా ప్రతిభావంతుడు.
నే రాసిన కళాతపస్వి సంగీత నృత్యాలని స్పెషలైజ్ చేసినవాడు. మూస సినిమాలు మాత్రమే తీశాడు!
This comment has been removed by the author.
Delete:) నాకు మాత్రం ఇలాంటి దర్శకులతో, హీరోలతో ఎలాంటి ఇష్యూ లేదు. ఫలానా వారి సినిమాలు చూడాలో, వద్దో మనం ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. సినిమా, సినిమాకి వెరైటీ కోసం ప్రయత్నించకుండా మనకు ఎంతో ఖర్చు మిగిలిస్తున్నారు.
Deleteఏదో సరదా కోసం రాశానే గానీ.. నాక్కూడా ఎవరితోనూ ఇష్యూ లేదు. సినిమా చూడ్డం వీపు దురద లాంటిది. ఎవడికి దురద పుడితే వాడు గోక్కుంటాడు. కొందరికి గోకుడు ఎక్కువై తాట కూడా లేచిపోతుంది.
Deleteనాలాంటివాడు 'పని లేక.. ' పాత దురదల్ని నెమరు వేసుకుంటాడు. ఇంతకు మించి ఈ విషయాలకి ప్రాధాన్యం లేదు.
మిమ్మల్నిగొప్ప మాటల రచయిత త్రివిక్రమ్ తో పోల్చి 'ములగ చెట్టు' ఎక్కించేసారని నా అనుమానం :)
ReplyDeleteముందు నాకు ఆ త్రివిక్రం అనబడే 'గొప్ప మాటల రచయిత' ఎవరో తెలీదు. కాబట్టి మునగచెట్టు ఎక్కే అవకాశం లేదు.
Deleteసినిమా చూడటం అనేది జీవితంలో ఒక ఫేజ్. చిన్నప్పుడు క్రికెట్ ఆడతాం. సినిమాలు చూస్తాం. తరవాత సినిమాలు ఎంజాయ్ చేసే వయసు దాటిపోతుంది. అందుకనే సినిమావాళ్ళు ఒక section of people కోసమే సినిమాలు తీస్తారు. వ్యాపార ధర్మం!
త్రివిక్రం అనబడే 'గొప్ప మాటల రచయిత' తెలియకుండా తెలుగు సినిమాల మీద టపాలు వ్రాయడాన్ని ఖండిస్తున్నాం. అధ్యక్షా!
Delete@Mauli మీకు అలా అర్థం అయ్యిందా?
@ Bonagiri gaaru
Deleteరమణగారికి బాపు తెలుసు, త్రివిక్రమ్ తెలీదు అంటే నమ్మేస్తామా ఏంటి. మీరు కూడా నమ్మకండి :)
>>>బాపు, రమణలు మిస్సమ్మ తీస్తే ఎలాగుంటుంది? సినిమా అంతా బ్యాక్ గ్రౌండ్ లో బాపు గీసిన రామాయణం బొమ్మలు (మిస్ మేరీ ఇంట్లో గోడ మీద సహా)! పొద్దస్తమానం మిస్సమ్మ చెంపలు, కళ్ళ క్లొజప్పులు. సహజత్వం పేరిట చీకట్లో సినిమా. మిస్సమ్మ, ఎం.పి.రావుల మధ్య గోరింటాకు, గజ్జెలు.. అంటూ ఏవో పైత్యవికార చేష్టలతో పాటలు. మధ్యలో కొన్ని రామాయణం పిట్ట కథలు. ఎల్వీప్రసాద్ బావురుమనేవాడు!>>>
ReplyDelete<>
ఈ పేరా, చివరి వాక్యం నవ్వీ నవ్వీ కళ్ళవెంట నీళ్ళొచ్చాయి. బాగుందని పని కట్టుకు చెప్పడమెందుకని కామెంట్ రాయను. ప్రతిసారీ చదివి వెళ్ళిపోతాను. కానీ ఇవ్వాళ ఈ వాక్యం .......ఈ ఆదివారం బాగుంది. పొద్దున ఆ డాక్టర్ గారు. ఇప్పుడు మీరు. ....
ఇంకా ఇలానే మీ "పనిలేక" కబుర్లు రాస్తూనే ఉండండి రమణగారు:))
ఈ పేరా వల్ల బ్లాగుల్లోని బాపు భక్తులు నా భరతం పడతారనుకున్నాను. అందుకనే చివర్లో disclaimer కూడా రాసుకున్నాను. మీకు నచ్చిందంటున్నారు. ధన్యవాదాలు.
Delete(ఇవ్వాళ లేచిన వేళావిశేషం మంచిది లాగుంది. పెద్దగా అక్షింతలు పళ్ళేదు!)
Just for Info... (Not that you might not know)...
ReplyDeleteBapu had directed one film Rajadhiraju.. with christian story (Story of Jesus?). I think Bapu had forgot to hang his Ramayana paintings... :)
Phaneendra
రమణ గారు ,
ReplyDeleteఏ టపా చదివిన బాగుంది అని నాలో నేను అనుకోవటమే గాని కామెంట్ వ్రాసే అలవాటు లేదు . ఈ టపా చదివిన తరువాత కామెంట్ వ్రాయకుండా ఉండలేక వ్రాస్తున్నాను . మీ టపా చాల బాగుంది . ముక్యంగా దాసరి శైలి లో మీరు అల్లిన డైలాగ్ చాల నవ్వు తెప్పించింది . ఎందుకో జంద్యాల గారిని మర్చిపోయినట్టున్నారు ....
నాకు ఒక ఐడియా మైండ్ లోకి రాంగాన్లే టపాగా రాసేస్తుంటాను. పెద్దగా విషయం ఉండదు. టపా మీకు నచ్చినట్లైతే సంతోషం. నచ్చకపోయినా.. ఎందుకు నచ్చలేదో చెబుతూ ఒక కామెంట్ రాస్తే మరీ సంతోషం.
Deleteనాకు జంధ్యాల అంటే ఇష్టం. అందువల్లే ఆయన గూర్చి రాయలేదు!
బాగుంది.మంచి ఫోటో .. తొలుత భానుమతి తోనే కొంత సినిమా చిత్రీకరణ కూడా జరిగిందట .. ఆమె పూజల వల్ల షూటింగ్ కు ఆలస్యం గా వస్తే నిర్మొహమాటంగా ఆమెను తొలగించి సావిత్రిని ఎంపిక చేశారట.. సావిత్రికి బదులు భానుమతినే ఉంటే మిస్సమ్మ ఎలా ఉండేదో ?
ReplyDeleteఈ ఫొటోలు నాకు భలే బాగున్నాయి. ఇంతకు ముందు మిస్సమ్మగా ఎవర్నీ ఊహించుకోలేకపొయ్యేవాణ్ణి. ఈ ఫొటోల్లో 'కొత్త మిస్సమ్మ' కూడా అందంగా, ముద్దుగా ఉంది.
Deleteఇంతకు ముందు.. మిస్సమ్మగా భానుమతిని తొలగించి చక్రపాణి మంచి పని చేశాడనుకునేవాణ్ణి. ఇప్పుడు ఈ ఫోటోలు చూస్తుంటే చక్రపాణి పొరబాటు చేశాడనిపిస్తుంది.
I hope you know that now a days fans are based on the actor's caste :-).... seen few people... they say they like big hero because of their action, but behind the scenes it is all caste :-)
ReplyDelete