"తప్పకుండా! అలాగే! చూద్దాం. చేద్దాం. అంతే! అంతే! అలాగే!" అంటూ ఫోన్ పెట్టేశాను.
మనసు చికాగ్గా ఉంది. నాకీ పని చెయ్యడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఒక చిన్న ఆబ్లిగేషన్ వల్ల చెయ్యక తప్పేట్టు లేదు.
'ఇలా ఇరుక్కు పోయానేమిటబ్బా! బయటపడే మార్గంలేదా?' అనుకుంటూ ఆలోచనలో పడ్డాను.
ఎదురుగ్గా గోడ మీద నాన్న ఫొటో.. నన్ను చూసి నవ్వుతున్నట్లుంది.
"బ్రోకరు మాటలు బాగానే చెబుతున్నావే!" అంటున్నట్లుగా కూడా అనిపించింది.
నాన్న చనిపోయి చాలా యేళ్ళయింది. చాలామందికి తమ తండ్రి గూర్చి ప్రేమ, ఉద్విగ్నతతో కూడిన గొప్పజ్ఞాపకాలు ఉంటాయి. 'మా నాన్నగారు' అంటూ పుస్తకాలు కూడా రాస్తున్నారు. నాకంతటి అదృష్టం లేదు. నేనెప్పుడూ నాన్నని గొప్ప వ్యక్తిగా భావించలేదు. మేమిద్దరం మామూలు మనుషులం. భోంచేస్తూ, టీవీ చూస్తూ చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. జోకులేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు వాదించుకునేవాళ్ళం.
నాన్న అతిసాధారణ వ్యక్తి. భోజన ప్రియుడు. స్నేహితులతో కబుర్లు, పుస్తకాలతో స్నేహం ఆయనకి ఇష్టం. నాన్న స్నేహితుల లిస్టులో నేనుకూడా ఉన్నానని గర్వంగా చెబుతున్నాను. ఆయనెప్పుడూ నాదగ్గర తండ్రి హోదా చూపించలేదు. ఆయన చివరిదాకా నాకు స్నేహితుడిగానే ఉండిపొయ్యాడు. ఫలానా పని చెయ్యమనిగానీ, చెయ్యొద్దనిగానీ నాకెప్పుడూ సలహా ఇవ్వక పోవడమే నాన్న నాకు చేసిన గొప్ప మేలు.
"బ్రోకరు మాటలు చెప్పకు." ఇది నాన్న తరచూ వాడే మాట. బ్రోకర్ అనగా 'దళారీ' అని అర్ధం. అయితే నాన్న బ్రోకర్ పదాన్ని dictionary అర్ధంతో ఎప్పుడూ వాడలేదు. ఆయన దృష్టిలో అదో పెద్ద తిట్టు! బ్రోకర్లంటే నిజాయితీపరులు కాదనీ.. సొంతలాభం కోసం నిజాల్ని ట్విస్ట్ చేసే అవకాశవాదులని ఆయన అభిప్రాయం. అసలు నాన్నకి ఈ బ్రోకర్లంటే ఎందుకంత ఎలెర్జీ?
మన సమాజంలో 'బ్రోకర్' పదానికి గౌరవం లేదు. కొందరైతే 'బ్రోకరంటే అమ్మాయిలని set చేసేవాడు' అని కూడా అనుకుంటారు. అందుకే 'అమ్మాయిల బ్రోకర్' అనే మాట పాపులర్. 'మూగమనసులు' సినిమాలో అల్లు రామలింగయ్య జమునని నాగభూషణానికి 'సెట్' చెయ్యబోతాడు. ఆ ప్రయత్నంలో జమునతో తన్నించుకుంటాడు. భార్యతో తిట్టించుకుంటాడు.
ఈ 'బ్రోకర్' అనే పదానికున్న negative connotation వల్ల.. పెళ్ళిళ్ళ బ్రోకర్లు మేరేజ్ బ్యూరో నిర్వాహకులగానూ, ఇళ్ళస్థలాల బ్రోకర్లు రియల్ ఎస్టేట్ ఏజంట్లుగానూ రూపాంతరం చెందారు (పేర్లు మార్చుకున్నారు). పశ్చిమ దేశాల్లో కార్పోరేట్ డీల్స్ కుదిర్చే బ్రొకర్లకి భారీ కమీషన్లు ముడతాయి. మనది పుణ్య భూమి. ఇచట అఫీషియల్ బ్రోకరేజ్ నిషిద్ధం.
ఇళ్ళస్థలాల బ్రోకర్ ఏం చెబుతాడు? అమ్మేవాడితో.. భూటాన్ లో భూకంపం వచ్చినందున ఇళ్ళస్థలాల రేట్లు దారుణంగా పడిపోయ్యయంటాడు. చచ్చోనోడి పెళ్ళికి వచ్చిందే కట్నంగా ఫలానా రేటుకి, ఫలానా వాడికి అమ్మెయ్యమంటాడు. కొనేవాడికి కొసరు కబుర్లు వినిపిస్తాడు. స్థలం బంగారం అంటాడు. ఇంగ్లాండులో ఇత్తడి రేటు తగ్గినందున నెల లోపే స్థలం రేటు రెట్టింపు అయిపోతుందంటాడు. ఈ రకంగా రెండు పార్టీల దగ్గర రెండురకాల రికార్డులు వేస్తాడు. డీల్ సెటిల్ చేసి కమిషన్ తీసుకుంటాడు. ఇదంతా మనకి తెలిసిన వ్యవహారమే!
మన రాజకీయ నాయకుల కూడా అచ్చు ఇలాగే చెబుతారు. ఫలానా ప్రాజెక్ట్ దేశానికి తక్షణావసరం అంటారు. ఈ ప్రాజెక్టుతో దేశాభివృద్ధి అమెరికాకి అరంగుళం అంచులోకి వచ్చేస్తుందంటారు. అయితే ఈ 'దేశాభివృద్ధి'లో మతలబు వేరుగా ఉంటుంది. నాలుగ్గోడల మధ్యన పెద్దమనుషుల ఒప్పందాలు జరుగుతాయి. మన ఆస్థులు వాళ్ళే రాసేసుకుని మనకే బ్రోకరేజ్ విదుల్చుదురు! ఇదొక ఆధునిక బ్రోకర్ వ్యవస్థ.
పూర్వం ఏదైనా పత్రికా సంపాదకుడు ప్రభుత్వ పాలసీని సమర్ధిస్తూనో, వ్యతిరేకిస్తూనో ఒక సంపాదకీయం రాస్తే ప్రజలు సీరియస్ గా ఆలోచించేవారు. ఇప్పుడీ రంగం మారిపోయింది. పత్రికాధిపతులే ఎడిటర్లు. వారికి వ్యాపారాలుంటయ్. రాజకీయ ప్రయోజనాలుంటయ్. మనకి మాత్రం పరిశుద్దాత్మతో నీతిబోధనలు ప్రవచించెదరు. మనల్ని ఉత్తమ ఓటరుగా తీర్చిదిద్దుటకు శ్రమించెదరు!
వీరిని ఇంటలెక్చువల్ బ్రోకర్లని అనవచ్చును. ఈ తెగవారు తమ వాదనాపటిమతో, రచనాచాతుర్యంతో మనని బురిడీ కొట్టించి 'భలే చెప్పాడే!' అనిపిస్తారు. కానీ.. వారి అసలు ఉద్దేశం వేరు. వీళ్ళుకూడా నాన్న చెప్పిన బ్రోకర్లే. తమ అసలు రంగు కనబడనీయకుండా రకరకాల ముసుగులు కప్పుకుని మోసం చేసే దొంగబ్రోకర్లు. అసలు బ్రోకర్ల కన్నా ఈ ముసుగు బ్రోకర్లు మహా ప్రమాదకరమైన మాయగాళ్ళు. ఇప్పుడా ముసుగులు కూడా పక్కన పడేస్తున్నార్లేండి!
'ఇందుగలడందు లేడని సందేహము వలదు.. ఎందెందు వెతికినా అందందే కలడు బ్రోకర్.' అని అనిపిస్తుంది. 'ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం బ్రోకర్ల పీడన పరాయణత్వం.' అని కూడా అనిపిస్తుంది. ఒకడు కనబడే బ్రోకరైతే, మరొకడు కనబడని బ్రోకరు. ఒకడిది పొట్ట పోసుకునే వృత్తి అయితే వేరొకడిది పొట్ట కొట్టే వృత్తి.
ఈ విధంగా 'సర్వం బ్రోకర్ల మయం' కావడానికి కారణం ఏమిటి? సమాజంలో డబ్బు అవసరాలు పెరగడం, డబ్బుతోనే రాజకీయాలు కూడా నడపగలమన్న నమ్మకం పెరిగిపోవడం అయ్యుండొచ్చు. అందుకనే మనం ఇప్పుడు Forbes జాబితా అంటూ డబ్బున్నోళ్ళ పేర్లు ఫాలో అవుతున్నాం. వాళ్ళే మనకి ఆదర్శం.
నాన్నకాలం స్వర్ణయుగం. డబ్బు అవసరాలు తక్కువ. అంచేత ఆ కాలంవారు నిజాయితీగా, నిక్కచ్చిగా బ్రతగ్గలిగారు. ఇవ్వాళ అన్నింటినీ శాసిస్తుంది డబ్బే. 'కోటివిద్యలు డబ్బు కొరకే' అన్నది నేటిసామెత. డబ్బుకోసం అమ్ముడు పోనిదేదీలేదు. నేటి బాలలే రేపటి బ్రోకర్లు. భారంగా నిట్టూర్చాను.
నాన్న ఫోటో వైపు చూస్తూ.. 'సారీ నాన్న!' అనుకున్నాను!
నాన్న నన్ను చూసి నవ్వుతూనే ఉన్నాడు!
(photo courtesy : Budugu)
super
ReplyDeletethank you.
Deleteమిమ్మల్ని కష్టపెట్టిన విషయమేమిటో రాయకుండా కడుపు చించుకున్నారు. బహుశా అది రాయడం ఇష్టం లేకకావచ్చు. లేదా పూర్తి పర్సనల్ అనుకుని కావచ్చు. కానీ అంత సినికల్ కానక్కర్లేదేమో!మా ముందు తరం దూతలు మీరే సినికల్ అయితే మేమేమవ్వాలి? డబ్బుకు అమ్ముడు పోనిది ఇంకనూ కలదు.రమణ, చంద్ర అమ్ముడవుతారని ఎవరైనా అంటే నేను నమ్మను.
ReplyDeleteమరీ సినికల్ గా రాశానంటారా? జరుగుతున్న చరిత్రని రాశాననుకుంటున్నానే!
Deleteటపా బాగుంది.
ReplyDeleteIE లో మీ బ్లాగు లోడవడానికి చాలా టైము పడుతోంది.
టెంప్లేట్ మార్చాలేమో చూడండి.
థాంక్యూ! నేను chrome వాడతాను. IE లో చెక్ చేస్తాను (ప్రయత్నిస్తాను).
Delete(నాకీ పనులు ఇంతకు ముందు నా night staff ఒకతను చూసేవాడు. పగలు MCA చేస్తూ.. రాత్రిళ్ళు నా ఆస్పత్రిలో పని చేసేవాడు. ఇప్పుడతను కోర్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాకు కష్టాలు మొదలయ్యాయి!)
దళారి మాటలు చెప్పొద్దూ అని అందరినీ ఆటపట్టించే తాతయ్య గురుతు వచ్చారు :)
ReplyDeleteఅంతేనా! నేనీ టపాలో మీడియా దొంగల గూర్చి, globalization మోసం గూర్చి రాశాననుకున్నానే!
Deleteఅవునా, బాబూ చిట్టీ అన్నట్లు అ మాటతో మా తాతగారు గుర్తొచ్చి టపా లో మిగిలినది చదవకపోతేనేం అనిపించింది :P
Deletemanchi post...
ReplyDeletebaagaa vraasaaru ramana gaaroo!
@sri
thank you.
Deleteడాక్టర్ గారు,
ReplyDeleteబాగుంది సార్,
రియల్ ఎస్టేట్లో అమ్మబొతే అడవి కొనబొతే కొరివి.అంతా బ్రోకర్లమయం.
కామేడి టచ్ మాత్రం బాగా తగ్గింది.
జి రమేష్ బాబు
గుంటూర్
రమేష్ బాబు,
Deleteఈ సారికి సర్దుకోండి. ఒక్కోసారి తప్పదు. నా పోస్టులు (రాస్తున్నప్పటి) నా మూడ్ ని ఫాలో అవుతుంటాయి.
Deleteరమేష్ బాబు గారు,
@రియల్ ఎస్టేట్లో అమ్మబొతే అడవి కొనబొతే కొరివి.అంతా బ్రోకర్లమయం.
బ్రోకర్లు ఎవరో కాదు అండి. అందుకే మరి రమణగారి బాధ ఇక్కడ.
రియల్ ఎస్టేట్ ఎకనామీకి మూలస్థంబాలు బ్రోకర్లే :)
సాయపడే గుణం తగ్గుముఖం పట్టాక, ఎవరి పని వారు చేసుకోడానికి 24 గంటలు సరిపోదు. సో బ్రోకర్స్ పుట్టారు.
@ఒకడిది పొట్ట పోసుకునే వృత్తి అయితే వేరొకడిది పొట్టలు కొట్టే వృత్తి.
రమణగారు మీ వ్యాఖ్యను ఖండిస్తున్నాను. కోటి విద్యలు కూటికొరకే అన్నారు మరి :)
ఏదేమైనా పదిమందికి సాయం పడాలనుకొనే వాళ్లకి మంచి బ్రోకర్లే దొరుకుతారు. (రమణగారి లాంటి వారయితే ఇంకా భేషుగ్గా ఉంటుంది ) :P
Super.
ReplyDeleteఒక్కక్కడు ఒక్కో నరహంతకుడు
ReplyDelete(మీరు ప్రస్తావించిన వాళ్ళను నేను చూశాను )