Tuesday, 11 September 2012

తెలంగాణా.. ఒక సవర్ణదీర్ఘసంధి!


అబ్బబ్బ! మొన్నటిదాకా చిదంబరం. ఇప్పుడు షిండే. మనుషులు మారారుగానీ.. పద్ధతులు మారలేదు. అందరిదీ మా తెలుగు మాస్టారి విధానమే!

'ఎవరా తెలుగు మాస్టారు? ఏమా విధానం?'

నాకు మా మాజేటి గురవయ్య హైస్కూల్లో ఎనిమిది నుండి పది వరకు.. మూడేళ్ళపాటు తెలుగు సబ్జక్టుకి ఒక టీచరే continue అయ్యారు. ఆయన మాకు సంధులు చెప్పేవారు. సంధులలో మొదటిది సవర్ణదీర్ఘసంధి. అది వివరంగా చెప్పేవారు. అందరికీ సూత్రం కంఠతా రావాలి. అది ఆయన policy. మాస్టారు క్లాసుకి రాంగాన్లే అందరం చేతులు కట్టుకుని నించొని.. ఒకళ్ళ తరవాత ఒకళ్ళం సవర్ణదీర్ఘసంధి అప్పచెప్పేవాళ్ళం.

క్లాసుల్లో ఒకళ్ళిద్దరు నిద్ర పొయ్యేవాళ్ళు. కొందరు కిటికీలోంచి కాకుల్ని, కుక్కల్ని చూస్తూ కాలక్షేపం చేసేవాళ్ళు. వాళ్ళల్లో ఏదోక దరిద్రుడు సూత్రం సరీగ్గా అప్పచెప్పేవాడుకాదు. ఇంక చచ్చామన్నమాటే! మేస్టారు మళ్ళీ సవర్ణదీర్ఘసంధి వివరంగా చెప్పేవాడు. మళ్ళీ అప్పజెప్పించుకోవడం మొదలు. ఈవిధంగా మాకు భూమి గుండ్రంగా ఎందుకుందో అనుభవపూర్వకంగా అర్ధమైంది. రెండోసంధి గుణసంధి. అది సగంలో ఉండగానే పదోతరగతి పరీక్షలొచ్చాయి. అమ్మయ్య!

ఈ సవర్ణదీర్ఘసంధి బాధ భరించలేక ఒకసారి మా సత్తిగాడు గుణసంధిలోకి రమ్మని మాస్టారుకి మొరపెట్టుకున్నాడు. 'వెధవా! నాకే పాఠాలు చెబుతావా?' అంటూ మాస్టారు సత్తిగాడి వీపు సాపు చేశారు. అప్పట్నించి ఎవరూ నోరెత్తే సాహసం చెయ్యలేకపోయారు. మన తెలుగు మాస్టారుకి సవర్ణదీర్ఘసంధి మాత్రమే వచ్చునని.. అందుకే ఇట్లా manage చేశారని మా సుబ్బు అంటాడు.

నాకీమధ్య మళ్ళీ సవర్ణదీర్ఘసంధి గుర్తొస్తుంది. రాష్ట్రవిభజన గూర్చి కేంద్ర హోమ్ మినిస్టర్లు చేసే ప్రకటనలు 'అప్పురేపు'లా ఒకేవిధంగా ఉంటాయి. వాళ్ళు 'ఏకాభిప్రాయ సాధన' అన్నపుడల్లా నాకు 'సవర్ణదీర్ఘసంధి' అన్నట్లు వినిపిస్తుంది!

రేపోమాపో చంద్రబాబు ఉత్తరం ఇస్తాట్ట. మరి ఒవైసీ ఎప్పుడిస్తాడో? ఎవరోకళ్ళు ఇవ్వకపోయినా సమస్య మళ్ళీ మొదటికే. అందరూ ఉత్తరాలిచ్చినా.. సంతకాలు సరీగ్గా లేవనో, స్టాంపులు సరిపడా అతికించలేదనో తిప్పి పంపొచ్చు. మళ్ళీ fresh గా ఇమ్మని అడగొచ్చు! దటీజ్ సవర్ణదీర్ఘసంధి!

'సమస్య సున్నితమైనది.' కాదన్నదెవరు?

'లోతైనది.' ఒప్పుకున్నాం.

అయితే ఏంటి? ఎక్కడైనా, ఎప్పుడైనా రాజకీయ నిర్ణయాలు, పరిష్కారాలు ప్రజల జీవితాలతోనే ముడిపడే ఉంటాయి. అందుకేగదా మీకు ఓట్లేసి గెలిపించి మా భవిష్యత్తు మీచేతిలో పెట్టింది. సున్నితం, లోతు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పే బదులు తప్పుకోవచ్చుగా!

షిండేగారికి ఎవరో చిన్న రాష్ట్రాల వల్ల నక్సలైట్ల సమస్య పెద్దదైపోతుందని చెప్పారట! మూడేళ్ళనుండి సీమాంధ్ర నాయకులు ఈసంగతి ఇల్లెక్కి అరుస్తున్నారు. దానికి ప్రతిగా తెలంగాణా నాయకులు ఎలుగెత్తి సమాధానం చెబుతున్నారు. కానీ home department కి మాత్రం ఇప్పుడే వినబడుతుందిట! ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఒకే రాష్ట్రంగా కలిపేసి నక్సలైట్ సమస్యని అంతమొందిస్తారేమో!

ఏమిటో! అంతా సవర్ణదీర్ఘ సంధి మయం! ఇంతకీ కాంగ్రెస్ దగ్గర గుణసంధి సూత్రం ఉందా? లేక మా తెలుగు మాస్టారిలా....

(photo courtesy : Google)

37 comments:

  1. ఇదంతా ఓ స్త్రీ రేపురా type..తేలదు, తెమలదు
    :venkat

    ReplyDelete
  2. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తెలంగాణా అల్-ఖైదా కేంద్రంగా మారుతుందని ఒక సీమాంధ్ర నాయకుడు అంటాడు. మూడేళ్ళ తరువాత (అప్పుడు కూడా గాంక్రెస్ అధికారంలో ఉంటే) గాంక్రెస్ హోమ్ మంత్రి నోట అదే మాట వినిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. కాంగ్రెస్ పార్టీకి తన పార్టీ ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలు. ప్రజాపక్షాన నిలిచి నిర్ణయాలు తీసుకునే చరిత్ర ఆ పార్టీకి ఎప్పుడూ లేదు.

      Delete
    2. వ్యక్తివాద సమాజంలో ఏ పాలకవర్గ పార్టీ అయినా అలాగే అనుకుంటుంది. తెలంగాణా విషయానికొస్తే తెలంగాణాకి ఎక్కువ ద్రోహం చేసింది గాంక్రెసే. తెలంగాణాకి అనుకూలమైన ముల్కీ నిబంధనలని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి పివి నరసింహారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలిగించిన తరువాత కూడా తెలంగాణా ప్రజలు గాంక్రెస్‌కి వోట్లు వేశారు. అదే తెలంగాణా ప్రజలు చేసిన పెద్ద తప్పు.

      Delete
    3. ప్రవీణ్ గారు,

      మీరు కాంగ్రెస్ ని 'గాంక్రెస్' అని రాస్తున్నారేమిటి!

      Delete
    4. తమిళ్ నేర్చుకుంటున్నాడేమో లేండి. క, ఖ, గ, ఘ,జ్ఞ వరసంతటికీ గ అనే పలకుతారు. hee hee

      Delete
    5. పేరుని కావాలనే హత్య చేశాను. అంతే కానీ అరవం లేదు, మలయాళమూ లేదు.

      Delete
  3. నేనూ మాజేటి గురవయ్య హైస్కూలే. 1976-78 :)

    ReplyDelete
    Replies
    1. ఓ!అలాగా! నేను 10th క్లాస్ జైఆంధ్రా బ్యాచండి! (అనగా 1973.)

      నాకు మూడే్ళ్ళూ (8th, 9th & 10th) పరిమి ఆంజనేయశర్మ గారు క్లాస్ టీచర్. మొన్నామధ్య ఆయన మీద ఓ బ్లాగ్ రాశాను. గురవయ్య హై స్కూల్ గూర్చి ఓ టపా రాద్దామనుకుంటున్నాను.

      మనిద్దరం ఒకే స్కూల్ విద్యార్ధులవడం చాలా సంతోషంగా ఉంది.

      Delete
  4. please review this Site
    www.logili.com
    post your Book Reviews
    review.logili@gmail.com

    ReplyDelete
  5. stamps sarriga levano, signs sarigga levano .... correct ga chepparu, congress ade chestadi. Eppudu Babu enduku 2nd letter evvataniki hadavidi padutunnado ardam kadu. Elagu memu ok ani msg leak chesadu ga inka e over action apite kanisam kosta lo anna gelustadu.

    ReplyDelete
  6. తెలంగాణా ఒక అంతులేని రంది కూడా.
    ఇవ్వకపోతే ఏంచేద్దాం అంది తెలంగాణా వారికీ
    ఇచ్చేస్తే ఏమైపోతామో అని సీమాంధ్ర వారికీ
    -Ravi Kairan, Hyderabad

    ReplyDelete
  7. నేను కూడా
    ఆఆంజనేయ శాస్త్రి గారూ మరియూ ఐ ఎస్ ఆర్ గారి వద్దా చదివాను
    మీ తెలుగు మాష్టారు అశ్వథనారయణ గారా?
    అయితే మనం సమకాలీనులం

    ReplyDelete
    Replies
    1. అవును. మనిద్దరం సమకాలికులం. అశ్వథనారాయణ గారు సంస్కృతం సెక్షన్ల వారికి తెలుగు టీచర్. మాకు కాదు.

      మన్నించాలి. మా తెలుగు టీచర్ పేరు (ఈ బ్లాగ్ వరకు) రాయడం నాకు ఇష్టం లేదు.

      Delete
    2. తెలుగు టీచర్ పేరు ఎందుకు వ్రాయను అన్నారో అర్ధమై , పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చిందండీ :)

      Delete
  8. మా తెలుగు ఉపాధ్యాయులు శివరామకృష్ణగారు. వీరు మీకు తెలిసే అవకాశం లేదనుకుంటా. ఎందుకంటే ఈయన తరువాత వచ్చిచేఱారు.

    ReplyDelete
  9. chaala baagaa cheppaaru !

    ReplyDelete
  10. నక్సలైట్లు ఇంకా లేఖలు ఇచ్చుడు లేదంటున్రు, గందుకే జర ఆగమవుతునాది. మిలినియం మార్చ్ ఢిల్లీదాకా ఆగకుండా చేసినా ఇచ్చుడే, చేస్తలేరు. :D

    ReplyDelete
  11. ఇంత వరకు మీరు మీ ఉపాధ్యాయుల గురించి negative గా రాయడం చూడలేదు, మీ నుంచి expect చేయలేదు ఈ విధంగా

    ReplyDelete
    Replies
    1. మరీ negative గా రాశానంటారా? సారీ!

      Delete
  12. ఇందులో నెగెటివ్ ఎముందండీ ....ఆ సారు మాంచి నిక్కచ్చి గా ఉంటారు సూత్రం వచ్చే దాకా వదలరు అని అర్థం అయింది.....ఇక కాంగ్రెస్స్ విషయానికి వస్తే ఇంత దారునంగా జనాలని ఎన్నో రకాలుగా మోసం చేసినా జనా లు కాంగ్రెస్స్ కే ఎందుకు ఓటు వేస్తారొ అర్థం కాదు...నాకు ఈ మధ్య నే ఓటు హక్కు వచ్చింది....నేనా తప్పు చెయను కానీ జనం మాళ్ళీ కాంగ్రెస్స్ కే ఓటుతారు అదంతే.....

    ReplyDelete
    Replies
    1. >>నాకు ఈ మధ్య నే ఓటు హక్కు వచ్చింది.<<

      ఇక మీకర్ధమౌతుంది లేండి. ఇప్పుడు మీరు దేశానికి ఎవరి వల్ల తక్కువ నష్టం కలుగుతుందో తేల్చుకోవాలి. ఇది చాలా కష్టం!

      Delete
  13. ఒక ముఖ్యమయిన తేడా ఉందండోయ్. మాస్టారు గుణసంధి నేర్పకపోతే (లేదా సుబ్బు అన్నట్టు ఆయనకు అది రాకపోతే) ఆయనకు పోయేదేమీ లేదు, పిల్లలే పరీక్షలో తప్పుతారు. బాబు, షిండే, మన్మోహనులు వగైరాలు తెలంగాణా విషయం తేల్చకపోతే వాళ్ళే పరీక్షలో (ఎన్నికలలో) తప్పుతారు (ఓడిపోతారు). పోయినసారి తప్పలేదు అంటారా? అది స్కూల్ ఎక్షామ్ రానున్నది పదో తరగతి బోర్డు పరీక్ష.

    ReplyDelete
    Replies
    1. మీ ఎనాలిసిస్ బాగుంది. కానీ కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వెయ్యరాదు. పేపర్ ఔట్ చేయించో, కాపీ కొట్టో పాసైపోగలదు!

      Delete
    2. పరీక్షలు తప్పడం, పాస్ అవడం వాకి మామూలే. వారికన్నా, తెలబాన్లకు టెన్షన్, బెంగ ఎక్కువవుతోంది. వాళ్ళు తప్పితే మీరు సీటు ఎక్కుతారనుకుంటే తప్పనివ్వండి.

      Delete
    3. @yaramana: పేపరు అవుట్ అయినా ఆ ప్రశ్నలు నేర్చుకోవాలి కదా. అందుకే కాపీ కొట్టడమే సులభం. ఇన్విజిలేటరు మనాడు (ఉ. నరసింహన్ గారు) అయితే చూసీ చూడనట్టు ఉంటాడు, ఇంకా కావాలంటే దగ్గరుండి మరీ కాపీ కొట్టిస్తాడు.

      Delete
  14. మాకో ప్రొఫెసర్ ఉండేవారు, వాళ్ళావిడ కూడా మా బాచ్ కే వేరే సబ్జెక్టు తీసుకొనే వారు లెండి.. మేడం అంటే ఆయనకీ చాలా భయ్యం అని పుకారు. వాళ్ళ మనవడి ఉయ్యాల ఫంక్షన్ వీడియో లో మేడం పక్కన కుర్చీలో వచ్చి కూర్చోడం హాస్టల్లో మిగిలిన బ్రాంచ్ అందరి తో కలిసి ఒక వంద సార్లన్నా రివైండ్ చేసిచూసి ఆనందించి ఉంటాం :)

    విష్యం ఏంటి అంటే, సర్ ప్రతి ఇయర్ మొదట్లో ఒక ప్రాబ్లం ని సాల్వ్ చెయ్యడం వివరిస్తారు. నెక్స్ట్ క్లాస్ నుండి ఇష్టం ఉన్న వారు పలానా చాప్టర్ లో పలానా ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, సందేహం ఉంటె అడగండి కాని , నేను అందరికి వివరించను అని అంటారు. బుక్ మొత్తం అదే ప్రహసనం. కొన్నాల్ల్లకి బోర్ కొట్టి మాలో మేమో, ఆయనతోనో కబుర్లు చెప్పెసుకొనే వాళ్ళం (క్లాస్ లో అబ్బాయిలు లేకపోవడం వాళ్ళ కామెంట్స్ ఏమి ఆయన చెవిని పడవు )

    చూస్తే మన్మోహన్ సారు మా ప్రొఫెసర్ లాను, సోనియమ్మ మేడం తో సరిగ్గా సరిపోతారు. మొదట్లో ఒక సారి సాల్వ్ చేసారు (డిసెంబర్ 9 ప్రకటన ). మిగిలిన సమస్యలన్నీ ఇష్టం ఉంటె మీరే ప్రయత్నించి పరిష్కరించుకోండి. లేకపోతె లేదు అని వదిలేసారు.

    ReplyDelete
  15. మాకో హిందీ మాస్టారు ఉండేవారు.
    ఆయన క్లాసులోకి రాగానే హిందీ పరీక్షలకి ఫీజు కట్టని వాళ్ళని బెంచీ ఎక్కించేవారు.
    మిగిలినవాళ్ళలో ఒకడికి టెస్ట్ బుక్ ఇచ్చి పాఠం చదవమనేవారు.
    ఆయన మాత్రం కుర్చీలో నిద్రపోయేవారు.

    ReplyDelete
    Replies
    1. మీ హిందీ మాస్టారు చాలా మంచివారిలా ఉన్నారు. మా హిందీ మాస్టారు ఆయన రాసిన హిందీ గైడ్ కొనని వాళ్ళని.. కొనేదాకా రోజూ క్లాసులో నించోబెట్టేవాడు. గైడ్ కొన్నవాళ్ళకి ఉదారంగా మార్కులేసేవాడు.

      Delete
    2. While I was doing my MBA at OU, we had a subject called Public Enterprise Management (i.e. how to manage PSU's). OU was possibly one of the very few universities that included this subject in MBA. The reason was our principal Dr. Laxmi Narayan was India's foremost expert on this subject. He had written the only textbook and an overwhelming percent of research papers & articles on this subject.

      We were in the funny position of Dr. LN teaching us from his own book and citing his own articles. Ofcourse the entire class had to buy his book and he generously negotiated a discount from the only bookshop that sold the book. We wondered/joked he was his own Ph.D. guide.

      Delete
  16. బీ.ఫార్మసీ రెండవసంవత్సరంలో ఒక సివంగిలాంటి మేడం వచ్చేవారు. ఆవిడకి ఎప్పుడైనా సరిగ్గా ప్రిపేర్ అవ్వకండా వస్తే అంతకు ముందురోజు జరిగిన టాపిక్ మీదకి ఏదోలా టాపిక్ తెచ్చి ఇద్దరు ముగ్గుర్ని(బాగా వెధవల్ని చూసుకుని) అడిగేవారు. వాళ్లు ఎలాగూ చెప్పలేరు. దాంతో అవిడ "మీకు ఎంత చెప్పినా ఏంటీ ఉపయోగం? మరీ దారుణంగా తయారవుతున్నారు. ఇలా చేస్తే అందరూ ఫెయిలవుతారు." టైపులో కొంచెం దీవించి ఆపైన "నేను మీకు క్లాసు చెప్పను. ఆ టాపిక్ చదవండి. మళ్లీ అడుగుతాను" అని వార్నింగ్ ఇచ్చి హాయిగా కూర్చునేవారు. కనీసం నెలకోసారైనా అలా చేసేవారు.

    ReplyDelete
  17. టపాకు సంబంధం లేని వ్యాఖ్య.

    రమణగారు,
    అవుట్ లుక్ పత్రికలో కవర్ పేజి మీద హైదరాబద్ స్కాం కేపిటల్ ఆఫ్ ఇండియా అని రాశాడు. తెలుగువారిని గజదొంగల కింద జమకట్టేశాడు. కంటికి కట్టినట్లు అన్ని స్కాంలు అందులో ఇరూకున్న వారి పోటొలు, తిన్న సొమ్ములు ప్రచూరిస్తూంటే, శోభనా కామినేని అనే ఆవిడ తెలుగు వారి కల్చర్లో రిస్క్ టేకింగ్ ఎక్కువ అని, దొంగతనాలను వేనకేసుకొస్తున్నాది. మన తెలుగు వారు రిస్క్ కి ,దోపిడికి భేదం తెలియనంతగా ఇలా దిగజారి పోయారేమిటి? మీరు ప్రస్తుత తరం తెలుగు వారి గురించి ఒక టపా రాయండి.

    http://www.outlookindia.com/article.aspx?282212

    ReplyDelete
    Replies
    1. @శోభనా కామినేని అనే ఆవిడ తెలుగు వారి కల్చర్లో రిస్క్ టేకింగ్ ఎక్కువ అని, దొంగతనాలను వేనకేసుకొస్తున్నాది.

      అజ్ఞాత గారు ,

      మన తెలుగు వాళ్ళని మనం వెనక వేసుకు రాకపోతే తెలంగాణా వాళ్ళు వెనకేసుకొస్తార ?
      పై స్థాయిలో రిస్క్ కన్నా దోపిడీ కాస్త తేలిక అవడాన మనవాళ్ళు ట్రై చేసి ఉంటారు. మీరు రమణ గారిని అడిగారు బానే ఉంది కాని ఆయన సుబ్బు గారిని అడిగితె ఆ నిజాలు మనం తట్టుకోలేము ,
      కాబట్టి మీ అభ్యర్ధన ను త్వరగా వెనక్కి తీసేసికోండి :)

      Delete
  18. సుబ్బు గారిని అడగటానికి కారణం దేశం వదిలేసిన ప్రవాసాంద్రులకు ప్రస్తుత ఆంధ్రా ప్రజల మనోభావాలు మంచిగా తెలుస్తాయని. ఒకటి మాత్రం నిజం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు ప్రపంచ ప్రఖ్యాత గజదొంగలకు జన్మనిచ్చిన గొప్ప భూమి. రేపు వీరివలన తెలుగు వారికి మా రాష్ట్రం లో ప్రవేశం లేదు అని బోర్డ్ పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పటికే బాంక్ వాళ్లు వ్యాపారానికి ఋణాలు ఇచ్చే విషయం లో ఆ బోర్డ్ పెట్టేశారని ఆంధ్రజ్యోతి వాడు గోల చేస్తున్నాడు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.