Saturday, 22 September 2012

నిధి చాలా సుఖమా!


పాట అనగానేమి? ఒక వ్యక్తి స్వర పేటికలోని vocal cords నుండి ధ్వని పుడుతుంది. ఆ ధ్వని శబ్దతరంగాల రూపంలో చెవిలోగల కర్ణబేరిని తాకుతుంది. అక్కడ నుండి మెదడుకు చేరుకుని process అవుతుంది. ఇది నేను చిన్నప్పుడు విన్న సైన్స్ పాఠం.

అయితే సైన్సుకి అందనివి కొన్ని వున్నాయి. అది గాత్రసౌందర్యం.. గానమాధుర్యం. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే 'త్యాగయ్య' చిత్రంలోని చిత్తూరు నాగయ్య ఆలాపించిన 'నిధి చాలా సుఖమా!' పాట వినొచ్చు.

డా.భార్గవి పబ్లిష్ చేసిన వి.ఎ.కె.రంగారావు ** 'ఆలాపన' పుస్తకం ఈమధ్య చదివాను. రంగారావుని డా.భార్గవి అద్భుతంగా ఇంటర్వ్యూ చేశారు.  ఆ పుస్తకం నుండి నా పోస్టుకి సంబంధం వున్న నాలుగు పంక్తులు ఇస్తున్నాను.

భార్గవి : కళ్యాణిలో నాగయ్యగారు "త్యాగయ్య"లో పాడిన 'నిధి చాలా సుఖమా' కూడా చాలా బాగుంటుంది. నాగయ్యగారికి కళ్యాణి ఇష్టమయిన రాగమా?

వి.ఎ.కె. : ఆయన కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. హిందుస్తానీ, మరాఠీ నాట్యసంగీతం, పార్శీ నాటక సంగీతం గురించి తెలుసుకున్నారు. సైగల్ పాడినవన్నీ అర్ధం చేసుకున్నారు. కాబట్టి మొట్టమొదట సినిమాపాటకి వ్యక్తిత్వం కలిపించిన ఇద్దర్లో నాగయ్య ఒకరు. రెండోవాడు బి.ఎన్.ఆర్.


భార్గవి : అంటే 'నిధి చాలా సుఖమా' ఈయన పాడిన దానికి మిగతావాళ్ళు పాడినదానికీ చాలా తేడా వుంటుంది. చాలా గొప్పగా పాడారు.


వి.ఎ.కె. : అవును. చాలా గొప్పగా పాడారు. అయితే త్యాగయ్యలో వుండే ఏ కీర్తనా కూడా నాగయ్య వెర్షన్ అని చెప్పుకోడానికి లేదు. ఆయన పెద్ద పెద్ద విద్వాంసుల్ని రప్పించుకుని వాళ్ళ పాట విని ఆ పద్ధతిలో తయారు చేశారు. ఆయన గొప్పగా పాడారు. నిజానికి అందులో వున్న వ్యవధిలో 'ఎందరో మహానుభావులు' ఆయన లాగా పాడి రక్తి కట్టించినవాళ్ళు మరొకరు వినపళ్ళేదు.


గాయకుడిగా నాగయ్య స్థాయి ఏమిటో ఈపాటికి మీకు బోధపడి వుంటుంది. సినిమాపాటకి గౌరవం కలిగించడం కోసం నాగయ్య చాలా కృషి చేశాడు. గాయకుడు నాగయ్య వారసత్వాన్ని ఘంటసాల కొనసాగించాడుగానీ.. ఘంటసాల నాగయ్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి కాదు.

నటనపరంగా చిత్తూరు నాగయ్య తన సమకాలికులతో పోలిస్తే ఎన్నో మైళ్ళు ముందుంటాడు. ఈరోజుకీ నాగయ్యతో సరిపోగల నటుడు తెలుగులో మరొకరు లేరని నా అభిప్రాయం. (నాగయ్యతో పోల్చగల ఏకైక ఆర్టిస్ట్ భానుమతి మాత్రమేనని కొందరంటారు.)

'త్యాగయ్య' సినిమాకి సంగీతం, దర్శకత్వం కూడా నాగయ్యే కాబట్టి.. ఈ సినిమాకి సంబంధించి క్రెడిట్ మొత్తం నాగయ్యకే చెందుతుంది. కన్నుల నిండుగా తన ఇష్టదైవాన్ని నింపుకున్న భక్తుడు భక్తి పారవశ్యంతో, ఆత్మవిశ్వాసంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వుంటాడు. అన్నగారి పట్ల వినయం, తన రామభక్తికి స్వర్ణబంధాలు అడ్డంకి అనే ఖచ్చితమైన భావన. ఈ ఆలోచనలలో నిమగ్నమైన త్యాగయ్య, మంద్రస్థాయిలో మదిలోని మాట పాటగా వెలువరిస్తాడు. ఎంతో ప్రఖ్యాతి వహించిన కీర్తనని నాగయ్య అద్భుతంగా అభినయించాడు. చిత్రీకరించాడు. ఈ పాట వింటూ నాగయ్యని జాగ్రత్తగా గమినిస్తుంటే నే చెప్పేది మీకు అర్ధమవుతుంది.

ఇక్కడితో నే రాద్దామనుకున్న పోస్ట్ అయిపొయింది. కానీ.. విధి బలీయమైనది. కొన్ని యాక్సిడెంట్లు పోస్ట్ స్వరూప స్వభావాల్ని మార్చేస్తాయి. ఈ పోస్టుకి సంబంధించిన నాగయ్య పాట లింక్ ఇవ్వబోతుండగా accidental గా కంటపడిందొక భయంకరమైన లింక్.

యూట్యూబ్ ఎంత మంచిదో అంత దుర్మార్గమైనది. అందుకే జె.వి.సోమయాజులుతో బాపురమణలు తీసిన త్యాగయ్య 'నిధి చాలా సుఖమా'ని కూడా నాగయ్య పక్కనే పెట్టేసింది! నాగయ్య పాడిన పాట పాడిన బాలసుబ్రహ్మణ్యం!

మీరెప్పుడైన కడుపు నిండా అన్నం తిని సున్నం రుచి చూశారా? ఘుమఘుమలాడే ఫిల్టర్ కాఫీ తాగంగాన్లే ఫినాయిల్ వాసన చూశారా? ఈ అనుభూతులు చదివే కన్నా చూసి తెలుసుకోండి. ఇక్కడ యూట్యూబ్ లో నాగయ్య పాట కింద బాపురమణల పాట కూడా ఇస్తున్నాను. చూస్తే మీకు నేచెప్పిన అనుభూతులన్నీ తన్నుకుంటూ వచ్చేస్తాయి. ప్రామిస్!

** 'ఆలాపన' వి.ఎ.కె.రంగారావు (2003)
బదరీ పబ్లికేషన్స్, భార్గవి నర్సింగ్ హోమ్,
పామర్రు, కృష్ణా జిల్లా.



41 comments:

  1. Nidhi chaala sukhama nee sannidhi chaaala sukhama??


    office ninchi intiki vachetappudu naa alochanalu ilaane untaayi.. job sukhama leka family tho quality time mukhyamaa...

    - A confused house wife :(

    ReplyDelete
  2. రమణ గారు,
    ఎస్పీబీ ని పూర్తిగా బధ్యుడిని చేయలేము. నాగయ్య గారి సినిమా లో ఎస్పీబీ పాడితే, నాగయ్య గారికి దగ్గరగా పాడగలిగే వాడేమో!
    ఈ వీడియో లో అయితే నాగయ్య గారి నటన అంత గొప్పది ఎందుకో బోధపడలేదు. ఏమిటో! ఫినాయిల్ వాసన అలవాటయిపోయి, కాఫీ వాసన తెలుస్తున్నట్లు లేదు నాకు.

    ReplyDelete
    Replies
    1. బొందలపాటి గారు,

      గాయకుల్ని నేనెందుకు బాధ్యుణ్ణి చేస్తాను? సినిమాకి సంబంధించినంత మటుకు అన్నింటికీ డైరక్టరే బాధ్యుడు.

      అవును. నాగయ్య స్టాండర్డ్స్ ప్రకారం అయన నటన సాధారణమే. కానీ బాపు త్యాగయ్యని చూసాక నాగయ్య చేసిన త్యాగయ్య పది రెట్లు గొప్పగా అనిపించింది! ఏ రకంగా చూసినా బాపు త్యాగయ్య పాట అత్యుత్తమ చెత్త ప్రదర్శన.

      అన్నట్లు మీ వర్డ్ ప్రెస్ బ్లాగు నా కామెంట్లని ఒప్పుకోవడం లేదు. నా పాస్ వర్డ్ ని తప్పంటే తప్పు అంటుంది.

      Delete
    2. అయ్యో, అలానా. దీనిని ఎలా సాల్వ్ చేయలో నాకూ తెలియదండీ!

      Delete
  3. దర్శకేంద్రుడి తో ఓ త్యగయ్య ని తీయించి వదిలితే, ఆ తరువాత బాపు గొప్పగా తీశాడని మీరే ఒప్పుకొంటారు. :-)

    ReplyDelete
    Replies
    1. అవును. అంతకు మించి వేరే మార్గం లేదు!

      Delete
  4. ఏమిటో! మీకు నాగయ్య గారంటే ఎక్కువ ఇష్టం.
    బాపు రమణలంటే తక్కువ ఇష్టం అనుకుంటాను.
    లేకపోతే బాలుని నాగయ్యతో పోల్చడమేమిటి?

    ReplyDelete
  5. మీ తక్కెడలొ ఒకవైపు నాగయ్య గారిని, ఇంకొవైపు ఎవరిని వేసినా, నాగయ్య గారి వైపె మొగ్గుతుందని , మీ గత టపాలని బట్టి తెలుస్తుంది.అంత మాత్రానా బాలు గారిని ఇలా విమర్సించడం ఎమి బాలెదండి. ఏ గాయకుడైన బాగా పాడాలనె ప్రయత్నిస్తాడు, అలానె నాగయ్య గారు , బాలు గారు పాడారు.మీరు మొదట నాగయ్య గారి ఇంట్లొకి వెళ్ళ్లి బోజనం చెసారు, ఆ తరువతా బాలు గారి ఇంటికి వెళ్ళారు ఆ బోజనం నాగయ్య గారంటి బోజనం అంత బాగలెదు. మేము అనగా మా ఈడు వాళ్ళం, ముందు బాలు గారింట్లొ బోజనం చేసాం, ఆ తరువతా మిగతా వాళ్ళ ఇల్లకి వెళ్ళాం, మిగతా వాళ్ళు కుడా బాగానే పెట్టారు, కాని అవకాశం వస్తే , బాలు గారింటికే వెళ్తాం. అదన్న మాట. ( ఇందులొ అచ్చుతప్పులకి క్షమించండి).
    :venkat.

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      మీరు బాలుకి చుట్టమో, స్నేహితులో అయితే నన్ను మన్నించగలరు.

      మీరు నేను నాగయ్య సమకాలికుడినని అనుకుంటున్నారు! కానీ కాదు. నేను పదో తరగతిలో ఉండగా ఘంటసాల చనిపోయాడు. కొన్నేళ్ళ క్రితం దాకా నాగయ్య హీరో వేషాలు వేశాడని.. పాటలు పాడే వాడని కూడా నాకు తెలీదు. ఈ సంగతుల్ని నా 'చిత్తూరు నాగయ్య - సైకో థెరపిస్ట్' టపాలో వివరంగా రాశాను.

      చదువుకునే రోజుల్లో యండమూరి, మల్లాది లాంటి వాళ్ళు రాసే నానా చెత్త చదివి అదే గొప్ప అనుకునేవాడిని. ఒక మంచి రోజు రావిశాస్త్రిని చదివాను. కుటుంబరావుని మొదలెట్టాను. కన్యాశుల్కం, మాలపల్లి చదివాను. వెంటనే అంతకు ముందు చదివిన చెత్తని చెత్త బుట్టలో పడేశాను. ఈ దశని 'వంట.. కథ.. నా తంటా!' అనే టపాలో వివరంగా రాశాను.

      ఒక పాఠకుడిగా, వీక్షకునిగా నాకు లాయల్టీలు లేవు. ఉండవలసిన అవసరమూ లేదు. మన అభిప్రాయాలు నిర్మొహమాటంగా రాసుకొడానికే బ్లాగులు ఉన్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ రూపాయి ఆదాయం ఉండదు. వ్యాపార పత్రికల్లా అందర్నీ అలరించడానికి బ్యాలెన్స్ మైంటైన్ చెయ్యవలసిన అగత్యమూ లేదు. నాకు అందుకే బ్లాగులంటే ఇష్టం.

      మీ వంటి విజ్ఞులు అర్ధం చేసుకోవలసినది.. నాకు నాగయ్యతో చుట్టరికం లేదు. బాలుతో పొలం గట్టు తగాదా లేదు. నా చెవుల ద్వారా విని, కళ్ళతో చూసి, మెదడుతో ఆలోచించి ఈ బ్లాగు రాశాను. అంతకు మించి నాకు, నా తక్కెడకీ ఏ స్వార్ధమూ లేదు. (మీ వంటి పిన్నలు నా బ్లాగు చదివి.. 'ఏమిటి వీడి నాగయ్య గోల?' అనుకుంటూ నాగయ్యవైపు దృష్టి మరల్చుతారని ఆశ ఉంది లెండి!)

      మీ థియరీ ప్రకారం ఘంటసాల కన్నా బాలు, గురజాడ కన్నా మధుబాబు, ఎన్టీఆర్ కన్నా చిరంజీవి ప్రతిభావంతులు అవుతారు. కొందరి దృష్టిలో అదే కరెక్ట్ కావచ్చు. వారికో నమస్కారం. కానీ ఇంటర్ నెట్ పుణ్యాన మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయిగా! భ్రమల్లో బ్రతకడం అవసరమంటారా? ముందు ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నాం కాబట్టి దానికే కట్టుబడి ఉందాం అనుకోవడానికి ఇదేమీ దైవభక్తి కాదుగా!

      Delete
    2. వెంకట్,
      నాగయ్య, KLసైగల్ వణుకుడు స్వరాన్ని కొందరికి నచ్చడం మామూలే. మా తాత గారు తెగ మెచ్చుకునే వారు, మేము అనుకరిస్తూ ఎద్దేవా చేసే వాళ్ళం. మానాన్న వాళ్ళిద్దరికీ అభిమాని అయినా, ఘంటసాల అద్భుతంగా పాడుతాడని, లవకుశ పాటలు తెగ మెచ్చుకునేవారు. ఆయనకు నాగయ్య నచ్చాడు, అంతే. బాలు తక్కువ అని అనుకోకూడదు. మల్లెపూల వాసన నచ్చింది అంటే గులాబి, సంపెంగలు చెత్త అని కాదు.
      పోతే నాకు పై రెండు చిత్రాల్లో నాగయ్య నటన బాగానే వుంది కాని అద్భుతమని అనిపించలేదు. పాట కూడా అంతే. స్లో పేస్‌లో నాగయ్య అంత విద్వాంసుడు కాని బాలుతో, బాగా పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ కనిపిస్తోంది.

      జీడి తిని పెరిగిన వారికి, స్విస్ చాకొలేట్లు తినిపించినా ... ఫలానా కొట్లో జీడి అంత బాగా వుందా అనే చూస్తారు. కారణం? రెఫెరెన్సు సెట్ అయిపోయుంటుంది, దాన్ని మార్చడం మన తరం కాదు.
      బాలు తరాలవాళ్ళకి ఘంటసాల నాగయ్యలా అని పిస్తారని, ఘంటసాలకు బాలులా పాడటం రాదని మొన్న ఇరవైల్లో వున్న మా అక్క కూతురి వాదన నోరెళ్ళబెట్టి విని తేరుకోవడానికి, మామూలు మూడ్లోకి రావడానికి 10నిముషాలు పట్టిందంటే నమ్మండి. కృష్ణుల(నల్లోళ్ళ) అరుపులకు అలవాటు పడిన తరానికి ఘంటసాల, బాలులు నచ్చకపోవడంలో వింతేముంది?!

      Delete
    3. @SNKR,
      మొత్తానికి మీరు నన్ను మీ తాత గారి కేటగిరీ లోకి నెట్టేశారన్నమాట! థాంక్యూ!
      మీకు ఈ పాటలో సోమయాజులు, బాలు, బాపు నచ్చారా! కంగ్రాచులేషన్స్!!

      Delete
    4. @SNKR,
      నిజమే K L సైగల్ వింటే ఒకవిధమైన అనుమానం ఇది పాటా అని, ఆ తరువాత విసుగు పుట్టటం తప్పని సరి. అక్కడి వరకెందుకు మంగమ్మ గారి మనుమడు సినేమా లో భానుమతి పాట విన్న మిత్రుడొకరు ఆమే గొంతు అంత ఘోరంగా ఉంటే ఎందుకుపాడి ప్రజల ప్రాణాలు తీస్తుంది అని, దర్శకులు ఎందుకు పాడిస్తారు అని నా మిత్రుడొకరు అనేవాడు. వాడికి ఆమే ప్రత్యేకత అర్థమయ్యేట్టు చెప్పటానికి చాలా సమయంతీసుకొంది.

      SriRam

      Delete
    5. /మీకు ఈ పాటలో సోమయాజులు, బాలు, బాపు నచ్చారా! /
      నాగయ్య చిరునవ్వులు చిందిస్తూ, మౌనంగా తనలోని 'సుబ్బుతో' పాడించారు. బాలు కొంచెం పాట పాడినా బాగానే నిదానంగా నాగయ్య స్టైల్లో పాడారు. నేను సోమయాజుల ఆక్షన్ వూసే ఎత్తలేదు, మీరే చేర్చారు. :) అయినా నాగయ్య ఆ పాత్రలో అతికినంత సౌమ్యంగా సోమయాజులు అతకరు. B & Wలో సినిమాలో లైటింగ్ ఎఫెక్ట్ బాగుంటుంది, నాగయ్య మొహంలో ప్రొజెక్ట్ చేసిన లైట్ వల్లఓ వెలుగు చూడొచ్చు, కలర్ సినిమాల్లో ఆ కాంట్రాస్ట్ అంత ఎఫెక్టివ్‌గా వుండదు.
      భానుమతి నటన నాకు చిన్నప్పటినుండి చిరాకు, చాలా 'అతి'గా వుంటుంది. పాటలు కొన్ని ఓకే. భానుమతి కన్నా సూర్యకాంతం మహానటి అని నా ఖచ్చితమైన అభిప్రాయం, మీరు నాతో ఏకీభవిస్తారని తెలుసు. :) పోతే, GIdoc గారి అభిప్రాయం దాదాపు నాదీను. డైరెక్టర్ మొహం అటుకేసి పెట్టుకో, డైలాగ్ ఇలా చెప్పు అని డైరెక్టర్ అంటే, ఎంత శంకరశాస్త్రైనా మాత్రం ఏం చేయగలరు? 'శారదా' అని గద్దించలేరు కదా!

      Delete
  6. I have not seen either of the movies up until now. I have to completely agree with Ramana regarding the distinction between these two. Without a question the great Nagayya is in a class all by himself!

    In my opinion it is not so much the rendition of the song that sets them apart. In fact I thought SPB did a pretty good job as well. Somayajulu would have been well served if he remembered his preaching to Dasu (the music teacher with Hitler mustache) about the delivery of words (naadam, sruthi, swaram, ardrata, etc) from Sankarabharanam. But, I would have to lay majority of the blame with the director.

    Watch how Nagayya declines the gift with great politeness, deference, appreciation and a beautiful smile. Somayajulu does not earn the same respect and empathy from the audience. The excessive eagerness of the girl for the jewelry, the overly aggressive talk by the sister-in-law and the gratuitous dialogue by the king's messengers damage the scene.

    Movie makers never seem to learn the dictum: Never mess with the classics.

    Here is a clip that contains the aforementioned song from the original that sets the scene somewhat better. http://www.youtube.com/watch?v=BE2POyYR13Y&feature=relmfu

    BSR

    ReplyDelete
  7. రమణగారు,

    "కానీ ఇంటర్ నెట్ పుణ్యాన మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయిగా,ముందు ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నాం కాబట్టి దానికే కట్టుబడి ఉందాం అనుకోవడానికి ఇదేమీ దైవభక్తి కాదుగా"
    బాగా చెప్పారు. కాని మీ బ్లాగులో ఇప్పటి వరకు జరిగిన చర్చల వలన, మీరు మార్చుకొన్న అభిప్రాయలు ఎమైనా ఉన్నాయా? అందుకు మీ బ్లాగులో వ్యాఖ్యలు రాసిన వారెవరైనా మీకు ఉపయోగపడ్డారా? ఎంత వరకు, ఎలా మీ అభిప్రాయం మార్చుకోవటానికిఉపయోగ పడ్డారు. వ్యక్తిగత పరిచయం లేకుండా మనుషులను బ్లాగుల ద్వారా,వ్యాఖ్త్యల లో రాసే వివరణ ద్వారా ఇతరుల ఆలోచనలను ప్రభావితం చేయగలమా? బ్లాగులన వలన మన అభిప్రాయాలలో వచ్చిన మార్పులు, పెరిగిన అవగాహన అనే కోణం లో ఒకటపా మీరు రాస్తే చదవాలని ఉంది. వీలు చూసుకొని వివరంగా రాయండి.

    ReplyDelete
    Replies
    1. నాకు తోచిన సమాధానం ఇక్కడే రాసేస్తాన్లేండి. ఇప్పటికే సమయాభావం వల్ల ఇబ్బందిగా ఉంది.

      బ్లాగుల్లో టపాలు, చర్చలు ఏ విధంగా ఉంటాయి? నా అభిప్రాయం చెప్పడానికి ఫ్రాయిడ్ ని అప్పు తెచ్చుకుంటాను.

      Id : నేను రాసేదే కరెక్ట్. నా అభిప్రాయాలు, భావాలన్నీ సకల విషయాలపై సమగ్రంగా, లోతుగా పరిశీలించి, విశ్లేషించుకుని రాస్తున్నవి. ఈ బ్లాగుల్లో తిరిగే వెధవలకి బుర్ర తక్కువ. విషయ పరిజ్ఞానం ఉండదు. వీళ్ళకి కనీసం నన్ను విమర్శించే హక్కు లేదు. భడవలు.. బడుద్దాయిలు.. ఇంకా చాలా 'లు'! (pleasure principle)

      super - ego : అయ్యలారా! అమ్మలారా! ఇది నా అభిప్రాయమని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఈ చర్చ ఫలితంగా నా అభిప్రాయంలో ఆవగింజంత తప్పు ఉన్నదని తేలినా ఆ అభిప్రాయాన్ని సమూలంగా మార్చుకోడానికి ఏ మాత్రం వెనకంజ వెయ్యనని మనవి చేసుకుంటున్నాను.

      ego : అవును గదా! కృతజ్ఞతలు. నిజమే గదా! ధన్యవాదాలు. నేను ఇలా అనుకుంటున్నాను. మీరలా అంటున్నారు. ఇద్దరం కరెక్టే! (reality principle)

      చివరాఖరికి నే చెప్పునేదేమనగా.. బ్లాగులనేవి మన అభిప్రాయాలు వెల్లడించుకునే వేదిక మాత్రమే. ఇక్కడ భావ సంస్కరణలకి తావు లేదు.

      Delete
  8. టు ది బెస్టాఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్... త్యాగయ్య తీయాలని తాపత్రయ పడ్డ బాపూరమణలు నాగయ్య గారి అపరిమిత ప్రతిభ ముందు కుప్పిగంతులు వేయాలనుకోడం తమ సాహసమే అని గుర్తుంచుకునే తీశారు. సోమయాజులు కూడా.. నాగయ్య గారి స్థాయికి తాను చేరుకోలేనన్న ఎరుకతోనే నటించాడు. ఆ సినిమా పోయిన తర్వాత వాళ్ళు దాని మీద జోకులూ వేసుకున్నారు. త్యాగయ్యలో సోమయాజులు ఏదో బాక్సర్ లా ఉన్నాడనో... సంథింగ్ అలాంటిదేదో కామెంట్లూ చేసుకున్నారు. ఈ వివరాలు సినీరమణీయంలోనో దేనిలోనో చదివినట్టు గుర్తు. ఈ మధ్య కోతికొమ్మచ్చిలో కూడా ప్రస్తావించి ఉండొచ్చు.

    ReplyDelete
    Replies
    1. @puranapandaphani,

      బాపు రమణలు డబ్బు పెట్టే వాడు దొరికితే ఏదైనా చుట్టేసిన ఘనులు. క్లాసిక్స్ తీసే దర్శకులు పాత్రధారుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తతో, ఖచ్చితత్వంతో ఉంటారు. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ పాత్రకి సూటవ్వని నటుణ్ణి ఎన్నుకోవడం కూడా బాపు 'దర్శకత్వ ప్రతిభ' గానే మనం భావించాలి.

      Delete
  9. నాగయ్య, ఘంటసాల, ఎస్ పి
    ఆ పేర్లు చదివితే తెలియడం లేదు..తరాల మధ్య అంతరాలు..అభిప్రాయాలు, నేపధ్యాలు..

    ReplyDelete
    Replies
    1. నిజమే. ఆ లెక్కన నేను నాగయ్య గూర్చి పట్టించుకోరాదు. మరప్పుడు నాగయ్య నాకెందుకు అంతలా నచ్చాడు? ఆయన 'త్యాగయ్య' తీసిన పన్నెండేళ్ళకి నేను పుట్టాను. నాలోనే ఏదైనా తేడా ఉందంటారా?!

      Delete
    2. అని నేను అనడం లేదు.
      నాగయ్య గారి కాలం వేరు. ఆ అభిరుచి వేరు. దానిని ఆస్వాదించేవారు దానిని అస్వాదిస్తారు. తరువాతి తరం వారు వేరు..వారికి ఘంటసాల కంథం శ్రావ్యం గా ఉంటుంది. ఎస్ పి ఆయన తరం వేరు. ఆయన గొంతులోని మాధుర్యాన్ని కోరుకునేవారుంటారు.
      మీరు కొన్ని పాటలకి నాగయ్య గారి బాగున్నారని అనుకుంటున్నారు. మరి కొన్నింటికి ఘంటసాల. ఇక ఎస్ పి సంగతి సరే!
      అందరికి అందరూ ఎప్పుడూ నచ్చాలని లేదు కదా!

      Delete
    3. అనిల్ గారు,

      సరదాగా అన్నాను లేండి. అందరికీ అందరూ నచ్చరు. ముమ్మాటికి నిజం. కింద రామ్మోహన్ (మోహనరాగం) గారి వివరాణాత్మక కామెంట్ చదవండి. మనకి ఏ వస్తువైనా, విషయమైనా నచ్చడం, నచ్చకపోడానికి చాలా కారణాలు ఉంటాయి. అనేక సంగతులు ప్రభావితం చేస్తుంటాయి. సమకాలీనత ఒక అంశం మాత్రమే (అయితే చాలా ముఖ్యమైనది). నాకు ఏ మాత్రం నచ్చని బాపు పాట మన బ్లాగర్లకి బాగా నచ్చింది. వాళ్లకి నచ్చింది నాకెందుకు నచ్చలేదు? అన్నది నేను విశ్లేషించు కొనవలసి ఉంది. ఆల్రెడీ రామ్మోహన్ గారు ఎన్నో విషయాలని స్పృశించారు. ఆలోచిస్తున్నాను.

      Delete
  10. రమణ గారు,

    నిజజీవితం లో త్యాగయ్య పైపాటలో చిత్తూరు నాగయ్య గారి లాగా పరమశాంతంగా, దిక్కులను బిక్క చూపులు చూస్తూ, మనసులో నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా ? లో గొంతుకతో అని తర్జన భర్జనలు పడేరకం అయ్యుంటాడని నేను అనుకోను. ఆ పాత్ర పోషణలో నాగయ్య గారికి త్యగయ్య మీద ఉన్న గౌరవం,భక్తి,ప్రేమా కనిపిస్తున్నాది. ఆధ్యత్మిక జీవితం లో అన్ని వదలి అడుగుపెట్టిన పోతన, అన్నమయ్య, త్యాగయ్యలను వారి సాహిత్యం, పాటలు విని చాలా శాంత స్వభావులుగా ప్రజలు ఊహించుకొంటారు గాని, నిజజీవితంలో వారు అలాంటి వారు కాకపోవచ్చు. ఎంతో గట్టి స్వభావం, ధైర్యం ఉండేవారే అధ్యాత్మిక జీవితంలో కి అడుగు పెట్టి చివరిదాక ఉండగలరు. అలా ఉన్న వారి పేర్లే చరిత్రలో నిలుస్తాయి. మీ బ్లాగులో వ్యాఖ్యలు రాసే గోర్తి బ్రహ్మానందం గారు ఈమాట వెబ్ పత్రిక లో కొన్నిసం || క్రితం ప్రముఖ చరిత్రకారుడు డి.డి. కౌశంబి (వామపక్ష మేధావుల )తరహాలో రీసర్చ్ చేసి ఆర్టికల్స్ రాశారు. అది చదివితే మీకు త్యాగరాజు గురించి చాలా విషయాలుతెలియవచ్చు.

    నాకు సోమయాజులు కూడా నచ్చాడు. ఆయన మొహంలో కనిపించే ఒక విధమైన అశాంతి/కోపం కూడా సరిగ్గా త్యాగరాజు పాత్ర కనుగుణంగా ఉందనిపిస్తున్నాది.

    భానుమతి,నాగయ్యలను పొగుడుకొంట్టూ మీరు రాసిన ఈ టపాను చదివి మిమ్మల్ని ఒకసారి ఊహిస్తే కంటి ముందు పద్మనాభకనిపించాడు. మీరు చూడండి ఈ క్రింది పాట:)

    http://www.youtube.com/watch?v=Jke3DEZZNzw

    SriRam

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      ప్రొద్దున్నుండి చిత్తూరు నాగయ్యకి PRO గా చెయ్యలేక చస్తున్నాను. దురదృష్టం. ఒక్కళ్ళు కూడా నా POV ఒప్పుకోవట్లేదు.

      భానుమతి అద్భుతంగా పాడిన పాటకి లింక్ ఇచ్చారు. ధన్యవాదాలు. మీరు నాకిచ్చిన పద్మనాభం కేరక్టర్ ని అర్జంటుగా ఒప్పేసుకుంటున్నాను.

      Delete
    2. నా ఈ వ్యాఖ్యకీ రమణగారి పోస్టుకీ సంబంధం లేకపోయినా, శ్రీరాం గారు త్యాగరాజు గురించి ఎప్పుడో రాసిన వ్యాసం గురించి చెప్పారు కనక ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను.
      మొదటిది - నేను వామపక్ష పక్షిని కాను. రెండోది - త్యాగరాజంటే నాకు వల్లమాలిన అభిమానం, పిచ్చి. మూడోది - కళ వేరు, వ్యక్తులు వేరు. కళలో వారికున్న అమోఘమైన ప్రతిభ చూసి నేను మనుషుల్ని అంచనా వెయ్యను, అది త్యాగరాజు కావచ్చు, అన్నమయ్య కావచ్చు. నా దృష్టిలో రెండూ వేర్వేరు. భక్తి వున్నంత మాత్రాన భక్తులు దేవుళ్ళు కారు. త్యాగరాజు లాంటి భక్తుల్ని దేవుళ్ళని చెయ్యడం అనాదిగా చూస్తూనే ఉన్నాం. చరిత్రని కప్పి పుచ్చడంలో పుక్కిట పురాణాల పాత్ర ఇంతా అంతా కాదు. అందువల్లే సంగీతం కంటే రామ భక్తుడిగానే పదిమందీ కథల్లడం తప్పనిపించింది నాకు. నాలుగోది -త్యాగరాజూ మనలాంటి మనిషే - కాకపోతే ఆయనకి అద్వితీయమైన ప్రతిభా, విద్యాదాన గుణం వంటివి కొన్ని ఉన్నాయి. వాటికే నేను మోకరిల్లుతాను.

      రమణ గారూ, మీ బ్లాగులో నా సొంత కామెంటు రాసినందకు క్షమించేయండి.

      -బ్రహ్మానందం

      Delete
    3. బ్రహ్మానందం గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      ఇప్పుడు నాకొక విషయం స్పష్టమైంది. తెలీని విషయంలో వేలేం ఖర్మ.. కాలే దూర్చేశానని!

      Delete
  11. I have not seen either of the movies up until now. I have to completely agree with Ramana regarding the distinction between these two. Without a question the great Nagayya is in a class all by himself!

    In my opinion it is not so much the rendition of the song that sets them apart. In fact I thought SPB did a pretty good job as well. Somayajulu would have been well served if he remembered his preaching to Dasu (the music teacher with Hitler mustache) about the delivery of words (naadam, sruthi, swaram, ardrata, etc) from Sankarabharanam.
    But, I would have to lay majority of the blame with the director.

    Watch how Nagayya declines the gift with such politeness, respect, appreciation and a beautiful smile. Somayajulu does not earn the same respect and empathy from the audience. The excessive eagerness of the girl for the jewelry, the overly aggressive talk by the sister-in-law and the gratuitous dialogue by the king's messengers damage the scene.

    Movie makers never seem to learn the dictum: Never mess with the classics.

    Here is a clip that contains the aforementioned song from the original that sets the scene somewhat better.
    http://www.youtube.com/watch?v=BE2POyYR13Y&feature=relmfu

    BSR

    ReplyDelete
  12. రమణగారూ
    నాగయ్య, సోమయాజులు-ఎస్‌పి గొడవ తేలాలంటే ముందుగా అభిరుచి సంగతి తేలాలి. ఫిల్టర్‌ కాఫీ-ఫినాయిల్‌ అని ఎమోషనల్‌గా రెస్పాండయ్యేంత అనుబంధం నాకీ సంగీతంతో తేదుగానీ పోల్చి చూడాల్సి వస్తే నాక్కూడా నాగయ్యే హాయిగున్నాడు. ఎవరు హాయిగున్నారో తేలడం వరకు బాగానే ఉంది. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు. సీన్‌ వైజ్‌ ఆలోచిస్తే ఏవో కొన్ని కారణాలు దొరికాయి.బాపు గారు దాసరిగా మారిపోయి మెలోడ్రామా కురిపించారు. అంతకాలం ఒకే కుటుంబంలో ఉన్నవారికి పరస్పరం అవగాహనలేకుండా పోయే అవకాశం తక్కువ. త్యాగయ్యను మాటమాత్రం అడక్క్కుండానే నగలు ఇష్టమొచ్చినట్టు అలంకరించుకునే అవకాశం లేదు. అంతటితో ఆగకుండా ఆయన వదిన అంతగా తిట్లు కురిపించే అవకాశం అంతకన్నా లేదు. మొత్తంగానే తొలిసీన్‌లో ఉన్నంత గ్రేస్‌ రెండో సీన్‌లో లేదు.అలాగే నటన. మన అవగాహనను బట్టి ఏవో అంచనాలకు రావచ్చు. మీలాగే నేనూ నాగయ్యకే ఓటు వేయొచ్చు. కానీ భానుమతి రూపాయికి రూపాయింబావలా చేస్తుందని సావిత్రి మాత్రమే ఎంత కావాలో అంతే చేస్తుందని నాకు అనిపించవచ్చు. కానీ బాలు పాట కంటే నాగయ్య పాట ఎందుకు నచ్చింది అంటే మాత్రం సమాధానం చెప్పుకోవడం కష్టంగానే ఉంటుంది. నాకు అనుబంధం లేని కళారూపమది. నాకు శాస్ర్తీయ సంగీతం అంటే శాస్ర్తులుగారు మెచ్చే సంగీతం అనేంత అజ్ఞానముంది. అలాగే సైగల్, ముఖేశ్‌, ఎంఎస్‌ సుబ్బలక్ష్మి, గీతాదత్‌, కెజె జేసుదాస్‌ ఎందుకు నచ్చుతారంటే చెప్పడం కష్టం. చిన్నప్పుడు ఎక్జామ్‌ మొదలైన ఇరవై ఐదు నిమిషాల దాకా పక్కనే ఉన్న బంకులో మధుబాబు డిటెక్టివ్‌ చదివి పరీక్షకు హాజరయిన నాబోటి వాడు ఆ తర్వాత రావిశాస్ర్తి అని దోస్తవిస్కీ అని పలవరిస్తున్నాడంటే కూడా ఏవో కారణాలు చెప్పుకోవచ్చు. కానీ మాకు ఏ రకంగానూ సంబంధం లేని, భాషకూడా పూర్తిగా తెలీని నవరంగ్‌ పాటలను పలవరించనేల. ప్యాసాను ఇన్ని సార్లు చూడనేల. కాబట్టి అభిరుచికి సంబంధించి పీర్‌ గ్రూప్‌, గ్రూమింగ్‌ వ్యవహారమేదో ఉంటుందని సందేహం. మన ఇష్టపడే, సమయం ఎక్కువగా గడిపే గ్రూప్‌లో వెలువడే అభిప్రాయాలు, అందులో మనకు నచ్చిన అంశాలు మనం చదివిన పుస్తకాలు ఇవన్నీ సంక్లిష్టంగా కలగలిసి ఒక అభిరుచిని తయారుచేస్తాయేమో అని సందేహం. అందులో భావజాలం కూడా పనిచేస్తుందనుకోండి. అది వేరే విషయం. త్యాగయ్య రాజును ధిక్కరించడం అనే లక్షణం ఉన్న అంశాన్నిమీరు ఎంచుకోవడంలో అది కనిపించడం లేదా! అయినప్పటికీ ఇది చిక్కుముడేనండి.అభిరుచి అనేదానిపై ఏఏ ప్రభావాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది మీలాంటి వారు ఎవరైనా సాధికారంగా విశ్లేషిస్తే బాగుంటుంది. దీనికంటే మా చెడ్డ సమస్య రుచి, అందం. మీ బ్లాగులో తరచుగా ఫిల్టర్‌కాఫీ గుభాళిస్తూ ఉంటుంది. నాకూ ఆ పిచ్చి ఉంది. అది దాని రుచివల్లనేనా..లేక అందులో ఉన్న శ్రమ, ఫిల్టర్‌ వేసి ఎదురుచూడడం అనే లక్షణాల వల్ల వచ్చిందా అని పురుగు తొలుస్తూ ఉంటుంది(ఇన్ని సందేహాలతో బతకడం ఎందుకు అని తిట్టేయబోకండి.ఇలా ప్రతిదాన్నీ లాజికల్‌గా చూడడం మీబోటి పీర్‌ గ్రూప్‌ వల్ల వచ్చిందే అని నెపాన్ని మీ మీదకే నెట్టేయగలను). ఒక ఉదయం పూట ఫిల్టర్‌ కాఫీ కోసం వైజాగ్‌ వీధుల్లో మూడు నాలుగు కిలోమీటర్లు నడిచాక అనిపించింది. ఇంతమందికి అవసరం లేదు అనిపించింది మనకు మాత్రమే ఎందుకు ముఖ్యమైనదిగా కనిపిస్తున్నది అని.అలా అని బ్రూతో రాజీపడలేం. రుచి అందం లాంటివి పూర్తి సబ్జెట్టివ్‌ అని అనుకునేవాడిని. అందరూ వాళ్ల అమ్మ వంట గురించి గొప్పగా చెపుతూ ఉంటారు కాబట్టి రుచి అనేది అలవాటుతో ముడిపడిన వ్యవహారం అని కూడా అనుకునేవాడిని. కానీ ఎక్కువమంది గుంటూరు భోజనం, నెల్లూరు భోజనం అనేసరికి ఇందులో సామూహిక అంశ ఎక్కడ్నించి వచ్చిందనే గొడవ. ఇది పూర్తిగా మాన్యుఫాక్చర్డ్‌ మాత్రమేనా, మార్కెట్‌ మాత్రమే కారణమా నిజంగానే రుచి అనే ఒక లక్షణమున్నదా అనే సందేహం తీరింది కాదు. ఫిల్టర్‌ కాఫీ అనేది రోడ్డుమీద అంతరించడంలో పనిచేసిన మార్కెటే ఇక్కడా గుంటూరు భోజనాన్ని పీటమీదకూర్చోబెట్టడంలో పనిచేసిందేమో అనుకోవచ్చు. అది మాత్రమే వాస్తవం అయితే బాగుండును. కానీ నిజంగానే ఆ రెండూ బాగున్నట్టు అనిపిస్తుందే. అక్కడే వస్తుంది చిక్కు. బాగుండడం మార్కెట్‌, వెసులుబాటూ అన్నీ కలగలిసిన వ్యవహారమేదో ఉందేమో. చాలామంది ఇప్పటికీ రోటిపచ్చళ్లను,మట్టి పాత్రలో వంటలను బాగా గ్లామరైజ్‌ చేసి చెపుతుంటారు. మనిషి ఎపుడూ వర్తమానంతో సంతృప్తిపడడు(ఎక్కువభాగం) కాబట్టి కొన్నింటిలో భవిష్యత్‌ను మరికొన్నింటిలో భూతకాలాన్ని రోమాంటిసైజ్‌ చేయడం అలవాటు అనుకోవాలా నిజంగానే రుచి ఉందా....మీ కామెంట్‌ను అడ్డం పెట్టుకుని చాలా అడిగేశాను. ఇంకా ఎక్కువైతే ఆబోరు దక్కదేమో! ఉంటాను.

    ReplyDelete
    Replies
    1. రామ్మోహన్ గారు,

      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. నా టపా కన్నా మీ వ్యాఖ్య బాగుందని నా మిత్రులు అంటున్నారు. ముళ్ళపూడి భాషలో చెప్పాలంటే ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది.

      రుచులు, అభిరుచుల గూర్చి మీ అభిప్రాయలతో ఏకీభవిస్తున్నాను. మీరు మధుబాబు నుండి రావిశాస్త్రికి షిఫ్ట్ అయినట్లే నేనూ ఎన్నో విషయాల్లో షిఫ్ట్ అయిపోయాను. అయిపోతున్నాను కూడా. డార్విన్ జీవ పరిణామం గూర్చి చెప్పాడు. అట్లే అభిప్రాయ పరిణామాలు కూడా సంభవిస్తాయి. ఇందులో సత్యాసత్యాలు, నైతికానైతికాలు కూడా మనం ఏర్పరుచుకునే బౌండరీలు మాత్రమే.

      చిన్నప్పుడు పీచు మిఠాయిని ఎంజాయ్ చేస్తాం. అప్పుడది కరెక్ట్. ఇప్పుడు దానికి దూరంగా ఉంటాం. ఇప్పుడు ఇదీ కరెక్టే. డబ్బు సంపాదించంగాన్లే ప్రతి రోజూ కనీసం మూడు సినిమాలు చూడాలని చిన్నప్పుడు ఒట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు సినిమా చూసి పుష్కరం దాటింది!

      చిన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడని నమ్మాను. అటు తరవాత ఘంటసాల, రఫీల మైకం ఆవరించింది. ఒకప్పుడు నన్ను చికాకు పరచిన నాగయ్య ఇప్పుడు నాకెంతో ఇష్టుడు. కారణాలు వెతుక్కుంటున్నాను.

      అభిప్రాయ వ్యక్తీకరణలో జగన్మోహనరెడ్డిని ఆదర్శంగా తీసుకుంటూ మడెమ తిప్పకూడదనుకుంటాను. మాటపై నిలబడాలనుకుంటాను. కానీ నా వల్ల కావట్లేదు. బహుశా నాది నందమూరి వంశంలా మాటపై నిలబడే వంశం కాదేమో!

      అందాకా ఎందుకు? ఒక్క రోజులోనే నేను డిఫెరెంట్ గా అలోచిస్తాను. మొన్నామధ్య మంచి ఫిల్టర్ కాఫీ తాగుతూ చంద్రబాబు నాయుణ్ణి తెగ మెచ్చుకుంటూ ఒక టపా రాసేశాను. గంట తరవాత 'నేనేనా ఇలా రాసింది?' అని ఆశ్చర్యపోయాను. అనగా ఒక కాఫీ నా ఆలోచనల్ని అంతలా ప్రభావం చేసిందన్న మాట! ఇది నాక్కూడా ఆశ్చర్యం కలగజేస్తుంది.

      అందుకే నన్ను నేను అంచనా వేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించను. అదేదో ఎదుటివాడికి అప్పజెప్పేస్తే హాయిగా ఉంటుంది!

      Delete
  13. మీ బ్లాగ్ మాలిక లో కనపడటం లేదు. గమనించారా?

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ చూసిన తరవాత చెక్ చేసుకున్నాను.
      అవును. నా బ్లాగ్ మాలిక నుండి తొలగించబడింది. కారణం తెలీదు.
      బహుశా వారికి నా 'పని లేక.. ' బ్లాగ్ పనికి మాలిన బ్లాగుగా అనిపించిందేమో!
      లేక మాలిక వారికి ఏదైనా సాంకేతిక సమస్య ఉందేమో!
      నాకైతే కారణం తెలీదు.
      ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

      Delete
    2. "'పని లేక.. ' బ్లాగ్ పనికి మాలిన బ్లాగుగా అనిపించిందేమో! "
      రమణగారు,

      మీ బ్లాగు పనికిమాలినది ఎలా అవుతుంది ? మీరు పని గట్టుకొని అదేపనిగా అవకాశం దొరికినపుడల్లా బాపు,బాలు,సచిన్ ల లోపాలు వెతకటం చాలా చక్కగా, గొప్పగా, నిబ్బద్దతతో కంకణం కట్టుకొని మరీ చేస్తూంటే! చాలా ముచ్చట వేస్తుంది.

      Delete
  14. మాలిక గొడవ


    ముందుగా మాలిక mess-up వలన కలిగిన ఇబ్బందికి మీకూ, మిగిలిన వారికీ sincere aplogies. దీని గురించి పోస్టు నిన్నే వేద్దామనుకుని కస్త బద్ధకించాము. రేపు తప్పకుండా వేస్తాం.

    గత రెండేళ్ళుగా మాలికని హోస్ట్ చేసిన server కంపెనీవారి Hard Disk కాస్తా crash అవ్వటంవల్ల మాలిక ఒక మూడు వారాలపాటు పని చెయ్యలేదు. ఆ డిస్క్ ఇప్పటిదాకా రికవర్ అవ్వలేదు. ఇక లాభంలేదని వేరే కంపెనీకి మారిపోయాం. అయితే గత పది పన్నెండు నెలలుగా మాలికలో కలిపిన బ్లాగులకి మా దగ్గర backup లేకపోవటం వల్ల, ఆ crash అయిన డిస్క్ లో చాలా బ్లాగులు పోయాయి.

    పాత హోస్టింగ్ కంపెనీగానీ information రికవర్ చెయ్యలేకపోతే దీనికి పరిష్కారమొకటే. మళ్ళీ ఆ బ్లాగులన్నిటినీ మాలికకి కలపటం - manually. So, ఏమీ అనుకోకుండా మీ మీ బ్లాగ్ URL ళ్ళను మళ్ళీ admin@maalika.org కి పంపిస్తే వాటిని కలిపేస్తాం.

    ReplyDelete
  15. మై డియర్ రమణ,
    నిధి చాలా సుఖమా...... అనే త్యాగరాజ కీర్తనను నాగయ్య ఆలపించిన దానిగురించి చాలా చక్కగా వ్రాశావు.

    మనకున్న 64 కళలో ఒకటయినది సంగీతం.
    ఈ కళలు సమాజములోని వారందరినీ ఒక క్రమ పద్దతిలో నడచుకోవటానికే గాక దైవ చింతనతో దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి కూడా ఉపయోగ పడేది.

    ఇప్పటికాలములో ఈ కళలన్నీ కేవలము బాగా ఉన్నవాళ్ళాకే, పనిలేక, లేదా సమాజములో ఒక హోదా సంపా దించడానికే అని కొంతమంది అభిప్రాయము.

    దీనికి కారణము ప్రస్థుత కాల మాన పరిస్థితులకు అనుగుణముగా అంటూ ఆధునికత అనే నెపంతో అంధానుకరణవలన "విలువలు" పోగొట్టుకొని కేవలము "డబ్బు" సంపాదనకు సరిపడ ఆలోచనలను మాత్రమే కూడగట్టుకుంటున్నాము.

    ఎవరైతే దేవుడిని ప్రసన్నము చేసుకోవాలనే తపతనతో కీర్తనలు ఆలపిస్తారో అవి తప్పనిసరిగా శాస్త్రీయముగా ఉంటాయి. అట్టి శాస్త్రీయ సంగీతములోని గొప్పదనం "సంగీతం" అంటే ఎమిటో తెలియని వారు కూడా అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించగలరు. (మొండిగా, బయటకు ఇష్టంలేదనే వారిగురించి కాదు).

    త్యాగయ్య సినిమాను నాగయ్య 1946 లో తను స్వంతంగా తీశాడు. మామూలుగానే నాగయ్య "దేవుని" మీద బాగా భక్తి విశ్వాసాలు కలవాడు. అలాంటి వారికి, అంతగా "సూడో సెక్యులర్" గురించి తెలియని వాడు, "నిధి పై ఉన్న సుఖము కన్నా రాముని పై ఉన్న భక్తి వలన కలిగిన సుఖమే మిన్న" అని నమ్మిన వాడు ఎటువంటి భక్తి పరమయిన సన్నివేశాలలోనయినా నటించగలడు అనే దానికన్నా జీవించగలరు అనేది కరెక్టనుకుంట.

    మరిప్పుడో అలాంటి భక్తి పరమయిన సినిమాలు ఇప్పటి ప్రజలు ఆదరిస్తారో లేదో అనే ఆలోచనలు ప్రేక్షకులనుండి రాకముందే సినిమా ప్రొడ్యూసర్లూ, డైరెక్టర్లూ బాగా డబ్బు సంపాదించడానికని "సంగీతము" అనే కళకి మిగతా అన్ని కళలూ (అంటే మసాలా కలిపి), భక్తి కన్నా మిగతా భౌతికమయిన విషయాల మీద ఎక్కువ శ్రధ్ధ చూపటం వలన "నటించే" వాళ్ళలో కూడా చాలా వైవిధ్యం (ఇచ్చే డబ్బుకి తగ్గ నటన) చూపుతున్నారు. కాబట్టి ఇలాంటి భక్తి కి సంభంధించిన సినిమాలలో "భక్తి పై తపన" "లేని" వారికి "ఉన్న" వారికి మధ్య పోలిక తగదేమో.

    నా ఉద్దేశ్యంలో ఇక్కడ నటనకన్నా భక్తి పై తపన కలిగి ఉందా, లేదా అనేదే పోల్చదగ్గ "అంశం".

    ReplyDelete
    Replies
    1. నాకు భక్తి, సంగీతం.. రెండూ కూడా తెలీవు. ఏదో యూట్యూబ్ లో పాట నచ్చి ఒక టపా టపటపా రాసి పడేశాను. తరచి చూడగా ఇది చాలా లోతైన విషయముగా గోచరించుచున్నది.

      Delete
  16. రమణగారు,

    టపాకు సంబంధం లేని వ్యాఖ్య. ఈ క్రింది పోటొను చూడండి. వేటగాడు సినేమాలో శ్రీదేవి పాటను (ఆకు చాటు పిందె తడిసే)ఎంతో ఇష్ట్టంగా చూసిన నేను, ఈ పోటొలో శ్రీదేవిని చూసి జీర్ణించుకోలేకపోయాను. అందం కోల్పోయినా, వయసు నెత్తిన పడినా, జిమ్ములో చేరి ముసలి,ముదురు సొగసులను మెరుగు పరచుకొంట్టూ, టి వి షోలకి వచ్చి ఎగిరే వృద్దనారులకు, ఈవయసులో నాట్యం ఎందుకు చేయాలనిపిస్తుంది? :) వాళ్లు ఎంత ఎగిరినా నాలాంటి అభిమానులను కొంచెం కూడా కదలించలేక పోయారు. ఇది వారికి తెలియదా?
    మానసిక వైద్యులైన మీరు ఈ వృద్దనారుల విశేష నృత్యం పైన విశ్లేషిస్తూ సరదాగా ఒక టపా రాయగలరా?

    http://www.ndtv.com/album/listing/entertainment/ex-rivals-sridevi-madhuri-dance-together-13871#/slide/1

    ReplyDelete
    Replies
    1. అక్కడ శ్రీదేవి పక్కన ఓ ముసలి ఎలుగు టోపీ పెట్టుకుని వూగుతూ డాన్స్ చేస్తుంటే "ఈవయసులో నాట్యం ఎందుకు చేయాలనిపిస్తుంది? :) " అని అనిపించలేదూ?
      ముసలాళ్ళకు ముసలి నాట్యాలు. ఇది బాగుందే.

      Delete
    2. "ఓ ముసలి ఎలుగు టోపీ "

      పురుషులను ఇలా దూషించటం అన్యాయం. వారికని ముసలితనమేమి దరిచేరదు. కేరిర్ లో విజయాలు సాధించిన వారు నిత్య యవ్వనులు. అదేగాక డబ్బు అధికారం ఉంటే ముసలితనం అసలికి దరిచేరదని రెండో పెళ్లి చేసుకొన్న అన్నగారి నుంచి మొన్న రాజభవన్ లో తివారి వరకు నిరూపించారు. ఒకవేళ అటువంటి వారెక్కడైన ఫైల్ అవుతారననే అనుమానం, ఎవరికైనా ఎక్కడ వస్తుందో అని మందుల కంపేనిల రూపంలో పెద్ద కార్పోరేట్లే వారికి సహాయం చేయటానికి ఎన్నో దివ్య ఔషధాలు కనుకొంట్టుంటాయి. వీళ్లు కొనుకొంట్టుంటారు.

      ఆరోజుల్లో అన్నగారు ఎగిరితే జనం చూశారు. ఇప్పుడు శ్రీదేవి ఎగిరితే, ఈ వయసులో ఇదేమి జబ్బు అని అంటారు. టి వి కనుక చానల్ మారుస్తాము.

      Delete
  17. డాక్టారూ, ఇంతకీ...

    'నిధి చాలా సుఖమా?
    రాముని సన్నిధి సుఖమా?
    నిజముగ తెలుపుము రమణా .. ఆ.. '

    చెబితే తెలుసుకోవాలని బయట పేషంట్లు ఇంపేషంటయిపోతున్నారు. ;) :))

    ReplyDelete
  18. నిధి ఒక "బెల్లం" లాంటిది. ఎప్పటికయినా దాని చుట్టూ ఈగలు ముసరక తప్పదు.

    ReplyDelete
  19. ఈ రెండు పాటల్లొ తేడ ఎంటంటె, చెష్టలకి, వెకిలి చేష్టలకి ఉన్న తేడ. ఇది పూర్తిగ ధర్శకుని ప్రతిభ. నిర్మత కాళ్లు వెళ్లు పెట్టడం కూడ ఒక కారణం కావచ్చు.
    జీవితములొ మొదటి సారి అంత నిధి చుసినప్పుడు, సమాన్య మనషి మనసుకి, ఒక భక్తుడి మనసుకి కలిగె సంఘర్షణ ని చక్కగా చుపించారు నాగయ్య. ఆ సంగర్షణ లోంచి వచ్చిన clarity ని ఆనందమయమైన మొము లొ చూపించారు. ఈ basic point మన color సినిమా లొ మరచినట్టు ఉన్నారు.
    ఈ స్వాతంత్ర్యం ఉండాలనె నాగయ్య ఈ సినిమా సొంతంగా తీసినట్టు ఉన్నారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.