ఇప్పుడు నేను నాకు చాలా ఇష్టమైన పాట గూర్చి రాస్తున్నాను. నచ్చిన సినిమాలోనే నచ్చిన పాట అంటూ నా సినిమా పాటల పోస్టులో ఒక థియరీ రాశాను. నా థియరీ ప్రకారం నాకు ఇష్టమైన పాట ఎంతో ఇష్టమైన సినిమా నుండే రావాలి. కావున ముందు నాకు ఇష్టమైన సినిమాని ప్రస్తావిస్తాను.
సినిమాలు నాకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చాయి. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు నా సప్తపది సినిమా జ్ఞాపకాలు అంటూ ఒక పోస్టులో రాశాను. నాకు సినిమాలు, స్నేహితుల జ్ఞాపకాలు కలగలిపి ఉంటాయి. రాజ్ కపూర్ తీసిన 'ఆవారా' సినిమా నాకు చాలా ఇష్టం.
ఆవారా సినిమా నాకు నా ప్రియమిత్రుడు శరత్ ని గుర్తుకు తెస్తుంటుంది. ఆరోజుల్లో శరత్ కి నాకూ తెల్లవార్లు కబుర్లే. అది సాహిత్యం కావచ్చు. సినిమా కావచ్చు. రాజకీయాలు కావచ్చు. ఫ్లాస్క్ నిండా కాఫీ, పెట్టె నిండా సిగరెట్లు. ఇవి మా ఇంధనం! పొద్దున్నే మైసూర్ కేఫ్ శంకర నారాయణ చేతిమీదుగా వేడివేడి ఇడ్లీ కారప్పొడి నెయ్యి, కాఫీ.
వెనక్కితిరిగి చూసుకుంటే.. అప్పటి రోజులు నాజీవితంలో స్వర్ణయుగం అనిపిస్తుంది. తరవాత రోజుల్లో శరత్ సైకియాట్రిస్టుగా ఖమ్మం పట్టణంలో ఒక వెలుగు వెలిగాడు. అతనిప్పుడు ఈలోకంలో లేడు. నా ఆలోచనల్లో మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. శరత్ నన్ను అంతగా ప్రభావితం చేశాడు.
శరత్ విశ్లేషణలు నాకు ఆసక్తికరంగా ఉండేవి. ఆవారా సినిమా మనకి అంతలా నచ్చడానికి కారణాలు చెప్పేవాడు. ఆవారా స్వాతంత్ర్యానంతరం దేశపరిస్థితుల్ని అద్దం పట్టింది. యువత వామపక్ష భావాలతో ఉవ్విళ్ళూరుతుంది. ధనిక, పేదల మధ్యన విపరీతమైన తేడా. పేదరికాన్ని, ముఖ్యంగా లుంపెన్ ని రొమేంటిసైజ్ చెయ్యడం యువతకి నచ్చింది. ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కి ప్రేమకథ పూసి subtle గా ప్రెజెంట్ చెయ్యడం ఈ సినిమా గొప్పదనం. బహుశా అందుకేనేమో ఈ సినిమా సోవియట్ రష్యాలో సూపర్ హిట్టయ్యింది.
'ఆవారా'లో రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్, నర్గీస్, కె.ఎన్.సింగ్ లు ప్రధాన పాత్రధారులు. నాకు మొదటిసారి ఈ సినిమా చూస్తున్నప్పుడు కొత్తగా అనిపించింది. కారణం lengthy close up shots. మరీ ముఖ్యంగా రాజ్ కపూర్, పృథ్వీరాజ్ కపూర్ లు confront అయ్యే సన్నివేశాలలో ఈ టెక్నిక్ గమనించవచ్చు.
నటన విషయంలో పృధ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ ని అన్ని సీన్లలో డామినేట్ చేసేశాడు. సినిమాలో పలుచోట్ల నిశ్శబ్దం కూడా చాలా శక్తిమంతంగా మాట్లాడుతుంది! తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారికి ఇదో కొత్త అనుభవం.
అదే సమయంలో బ్రిటిష్ వాడి నుండి నేర్చుకున్న(తెచ్చిపెట్టుకున్న) హుందాతనం. మనసులో బురదగుంట ఆలోచనలు. బయటకి dignified restraint. ఇట్లాంటి పెద్దమనుషుల గూర్చి ఉప్పల లక్ష్మణరావు 'అతడు-ఆమె'లో వివరంగా రాశాడు. కొడుకుచే తిరస్కరించబడిన తండ్రిగా పృధ్వీరాజ్ కపూర్ నటన (సినిమా చివరి సీన్) ఎంతగానో ఆకట్టుకుంది. ఇండియాలో నటనపరంగా పృధ్వీరాజ్ ని ఎదుర్కోగల ధీశాలి ఒక్క చిత్తూరు నాగయ్య మాత్రమేనని నా నిశ్చితాభిప్రాయం.
అలగాజనం, క్లాస్ జనం మధ్యన స్పష్టమైన economical, social, biological గీత గీసిన ఉన్నతవర్గ ప్రతినిధిగా జడ్జ్ రఘునాథ్ ఒకవైపు. ఈ దేశంలో ఉన్న దరిద్రానికీ, దిక్కుమాలిన తనానికి, కసికి (తనెందుకంత మొరటుగా ఉంటాడో రీటాకి చెంపదెబ్బ కొట్టి మరీ చెబుతాడు రాజ్) ప్రతీకగా రాజ్ ఇంకోవైపు.
ఒక ఆవారా (రాజ్) ఇంకో ఆవారా (వీధి కుక్క) తో కబుర్లు చెప్పే సన్నివేశం బాగుంటుంది. ఈ సన్నివేశంతో రాజ్ మనస్తత్వాన్ని సింబాలిక్ గా దర్శకుడు మనముందు ఆవిష్కరిస్తాడు. "మనుషులు జంతువులు. వారికి స్నేహం చేసేవారు, ప్రేమించేవారు చాలా అవసరం." అంటూ రాజ్ కుక్కతో కబుర్లు చెబుతాడు. హేట్సాఫ్ టు కె.ఎ.అబ్బాస్!
కొందరు రాజ్ కపూర్ ఆవారా కేరక్టర్ (కేవలం అవారా సినిమా ఒక్కటేకాదు. మొత్తం రాజ్ కపూర్ ట్రాంప్ కేరక్టర్) చార్లీ చాప్లిన్ ట్రాంప్ కి అనుకరణగా ప్రస్తావిస్తుంటారు. రాజ్ కపూర్ ట్రాంప్ ని physical గా మాత్రమే తీసుకున్నాడనీ.. ఆవారా సైకోడైనమిక్స్ పూర్తిగా 'భారతీయత్వం' అని నా అభిప్రాయం. శ్రీ 420, జాగ్తే రహో, జిస్ దేశ్ మే గంగా బెహ్తి హై సినిమాలు విడివిడిగా చూడరాదు. కలిపే చూడాలి. అప్పుడే రాజు (ట్రాంప్) మనకి అర్ధమౌతాడు.
నాకు నచ్చిన ఆవారా పాట అనంగాన్లే మీరు నేను "ఘర్ ఆయా మేరా పర్దేశి" అంటూ డ్రీమ్ సాంగ్ గూర్చి రాస్తాననుకోవచ్చు. ఇది 'mother of all dream songs in India' అని అనుకుంటున్నాను. మిస్సమ్మలో మిస్ మేరి కలకి కూడా ఈ పాటే తల్లి! చాలా ట్యూన్లతో కూడిన ఈపాట గూర్చి తరవాత ఎప్పుడైనా రాస్తాను. ఈ పాట ట్యూన్ శంకర్ దా? జైకిషన్ దా? అని చాలా చర్చ నడిచింది. ఆరోజుల్లో ఏపాట ఎవరిది? అంటూ శంకర్-జైకిషన్ అభిమానుల్లోనే రెండు గ్రూపులుగా విడిపోయి వాదించుకునేవారు.
'ఆవారా'లో the best song "హం తుఝ్ సె మొహబ్బత్ కె సనం.. " అని అనుకుంటున్నాను. ఈపాట ఎన్నిసార్లు విన్నా నాకు మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది. రాజ్ కపూర్ ఎంతటి అసాధారణ నటుడో ఈపాట చూస్తే తెలుస్తుంది. నాకు ఈపాట ఎందుకంత విపరీతంగా నచ్చింది? బహుశా నాలో అంతర్లీనంగా defeatism ఉందేమో! నా personality లో అపరిచితుడుగా దాగున్న ఈ pessimistic trait నాక్కూడా ఆశ్చర్యాన్నే కలగజేస్తుంటుంది.
రాజు ఒక దొంగ. పెద్దింటి అమ్మాయి రీటాని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమని పొందడానికి దొరలాగా ప్రవర్తిస్తాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇవ్వడం కోసం జడ్జ్ రఘునాథ్ దగ్గర్నుండే హారం కొట్టేస్తాడు. ఆ సంగతి పుట్టినరోజు వేడుకలో బయటపడుతుంది. అతను నిర్మించుకున్న ప్రేమసౌధం కూలిపోతుంది.
ఇష్టపడి, కష్టపడి ఆడిన ఆట ఓడిపోతే ఎలా ఉంటుంది? ఖేల్ ఖతం. దుకాణ్ బంద్. ఇంక మిగిలిందేమిటి? feelings of emptiness. sense of hopelessness. అటువంటి సందర్భాల్లో ఏడుపురాదు. హృదయం ఘనీభవిస్తుంది. గుండె గొంతుకలో కొట్టాడుతుంది. నైరాశ్యం. నిర్వేదం.
ఇదంతా రాయడం సులువు. నటించటం చాలా కష్టం. రాజ్ కపూర్ మాత్రం ఈ భావాలన్నింటినీ అద్భుతంగా అభినయించాడు. తన బాధని చిన్ననవ్వుతో మిళితం చేశాడు. ఈ expression నాకు మరీమరీ నచ్చింది. మన తెలుగులో నాగేశ్వరరావు వెలుగు నీడలు, మురళీకృష్ణ వంటి సినిమాల్లో గొప్పగా నటించాడు. కానీ నాకీ resigned look చాలా కొత్త. ఎప్పుడూ చూళ్ళేదు. అంతేనా? కాదు. రాజ్ కపూర్ చేతిలొ కత్తి కూడా నటిస్తుంది!
రాజ్ కపూర్ ఆస్థాన విద్వాంసులు శంకర్ - జైకిషన్, శైలేంద్ర మరియూ ముఖేష్. బర్సాత్ నుండి ఈ టీమ్ కంటిన్యూ అయ్యింది. ముఖేష్ గొంతులో మెలొడీ పెసరట్టులో ఉప్మాలా మెత్తగా, హాయిగా ఉంటుంది. నటుడు రాజ్ కపూర్ కన్నా దర్శకుడు రాజ్ కపూర్ ఎన్నోరెట్లు ప్రతిభావంతుడంటారు. నిజమే కావచ్చు. YouTube లోంచి ఈపాట మీ కోసం. ఎంజాయ్ చెయ్యండి మరి!
(photos courtesy: Google)
Excellent review Ramana! It is fascinating that Russia and the entire eastern Europe knows Raj Kapoor and his movies intimately. My fellow resident in New York from Romania named Savescu could sing almost every hit song of Raj Kapoor in entirety! If you look at IMDB viewer reviews for Awaara, the majority are from foreigners. The movie was so popular in Turkey, it got made in Turkish with songs and all.
ReplyDeletehttp://www.youtube.com/watch?v=Pb4C5arrw3Q
The young are still performing Awaara songs
http://www.youtube.com/watch?v=c0f_mFB1yO8&feature=related
Great movie maker and great actor.
BSR
Thank you Gldoc. I enjoyed the videos thoroughly. Thanks ramana garu. Super.
ReplyDeleteనేను హాస్టల్ లో ఉండే రోజుల్లో, నా రూం లో నేను వేసిందే "రాజకపూర్-నర్గిస్" బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ ఉండేది. దాన్ని మా వాళ్ళు మొదటి సారి చూసి తెగ మెచ్చుకొన్నారు. అది "రామారావు-సావిత్రి" అని కొందరు, "నాగేశ్వర్ రావు-సావిత్రి" అని కొందరు వాదించుకొని వాళ్ళ తెలివి, నా "బహు ముఖ" ప్రతిభ బయట పెట్టారు. మా గ్యాంగ్ మీ లాగే సినిమా లు చూస్తూ, ప్రేమ పాటలు పాడుతూ, వాటి మద్యలో "గిల్భిస్ గ్రీన్ లేబుల్" నంచుకొంటు అదో స్వర్ణ యుగం. అప్పుడు నాతొ పాటు కొంతమంది ఎక్కువగా పాత హిందీ పాటలు విన్తూన్దెవరు. ఆదివారం దూరదర్శన్ రంగోలి కచ్చితంగా చూసే గ్యాంగ్ అది. మేము కూడా ఇలానే సినిమా విశ్లేషణలు, అంటే మరి ఇలా "సైకో" విశ్లేషణలు కాకుండా.., సితార, శివరంజని లో కాపి కొట్టిన జ్ఞానం తో ఎడిటింగ్ అదిరింది, ఫోటోగ్రాపి బాగుంది.., ఇక్కడ డైలాగ్ ఇలా ఉంటే అదిరేది లాంటి విశ్లేషణలు అన్నమాట. మాది మరి అన్ని క్యారెట్ లు కాకపోయినా మాది స్వర్ణయుగామే.. మీ అవారా ఎంత పని పెట్టాడు. పాట కి మీకు తాంక్స్. మీకు వీలుంటే కింది లింక్ చుడండి. అందులో కూడా ఒక మంచి పాట దాగుంది.
ReplyDeletehttp://inspiringrays.blogspot.in/2011/06/blog-post.html
స్నేహితులతో కబుర్లు ఎవరికైనా మధుర స్ప్రుతులే. అయితే అవన్నీ మనకి గొప్ప జ్ఞాపకాలుగా మిగిలి పోతాయని అప్పుడు తెలీదు.
Deleteమీరు నర్గీస్, రాజ్ కపూర్ పెయింటింగ్ ని కనీసం రామారావు, సావిత్రి అనుకునేంతగా వేశారంటే.. మీరు గొప్ప పెయింటర్ అని అర్ధమవుతుంది. నా హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో పెద్ద సావిత్రి ఫోటో ఉంటుంది. చాలామంది కుర్రాళ్ళకి సావిత్రి తెలీదు. వాళ్ళు నన్నడిగే ప్రశ్న.. "ఆవిడెవరు? మీ అమ్మగారా?"
సావిత్రి మీ అమ్మగారా ? నవ్వలేక చచ్చాను.
Deleteనా గర్ల్ ఫ్రెండ్ కి నేనొక వింత మనిషిని.
చద్దన్నం తింటానని చెప్పినప్పుడు, పాత సినిమాలు చూస్తానని చెప్పినప్పుడు, రావణాసురుడు కూడా మంచివాడే అని చెప్పినప్పుడు నన్ను చుసిన చూపు నేను మర్చిపోలేను, అంతే కాదు నువ్వేదో పెద్ద తేడాగాడివి రా బాబు అన్న మాట అప్పుడప్పుడు గుర్తు చేసుకుని నవ్వుకుంటాను.
Nice review.
ReplyDeleteఇంకోసారి టోపీ తీయించారు డాక్టర్ గారు.మనూళ్ళోనే అప్పుడెప్పుడో ఓ సారి ఏదో సందర్భంగా రాజ్ కపూర్ సినిమాలు వరసగా వేసారు.టీవీలో మిస్ ఐనవి అప్పుడు చూసాను.జిస్ దేశ్ మె గంగా బెహతీ హై,మేరా నాం జోకర్, శ్రీ 420.ఆవారా నేను చూసిన మొదటి రాజ్ కపూర్ సినిమా..నాగయ్యగారిని నేను ఎక్కువగా చూడలేదు కనుక నాకు తెలీదు..ఇంతమంచి పోస్ట్ కు మీకు మరో మారు ధన్యవాదాలు.
ReplyDeleteబ్లాగుల్లో కుర్రకారు కొత్త సినిమాల గూర్చి తెగ రాసేస్తున్నారు. నా లాంటి మాజీ ప్రేక్షకుడు పాత సినిమాల్ని నెమరు వేసుంటుంటాడు.
Deleteఇది రివ్యూ కాదు. నాకు నచ్చిన ఒక సినిమా గూర్చి కొన్ని ఆలోచనలు.
ఇట్లాంటి జ్ఞాపకాలు రాసుకునేందుకు నెట్ లో బొమ్మలు, విడియోలు చాలా అనుకూలంగా ఉంటాయి.
nice and interesting review..those were socialist days, now there is no such pretense, now everything is pure commercial..movies, art, books.
ReplyDeletevasantham
మంచి రివ్యూ య ర!!! మనం ఎన్నీ సినిమాలు చూసినా, వాదనలూ వితండ వాదనలూ చేసుకున్నా ఏకీభవించిన కొన్ని విషయాల్లో ఇదొకటి! నాకు రాజ్ కపూర్ గొప్పదనం మొదటిసారిగా 1985 లో ఓరి భగవంతుడా 27 ఏళ్ళ క్రితమా - మొన్నలాగానే ఉందే!!( అప్పటివరకూ మనసినిమాలు విదేశాల్లో ఇంతగా ఆదరిస్తారని (రించారనీ) అభిమానులూ, వీరాభిమానులూ ఉంటారనీ తెలీదు) పీటర్ అనలిటస్ అనే గ్రీకు వ్యక్తి (సీనియర్ రెసిడెంటు) తన కార్లో ఎక్కించుకొని నాకు హాస్పిటల్ మిగతా ప్రదేశాలు చూపించటానికి (నేను ఇంటర్వ్యూ కెళ్ళినప్పుడన్న మాట) కారొ స్టార్టు చెయ్యగానే ఈ పాట రావటం మొదలెట్టింది చికాగో లో. అప్పుడు అతను సావధానంగా చెప్పడు, తను కూడా రాజ్ కపూర్ సినిమాలతో పెరిగాననీ, పాటలకి అర్ధం తెలియకపోయినా చాలా పాటలు వచ్చనీ .....ఇక చాలాసార్లు మాకు సంభాషించుకోటానికి స్టార్టర్లు అవసరం లేకపోయింది. GMCANA reunion నుండి నిన్న రాత్రే చికాగో నుండి వచ్చాము. దాన్ని నువ్వు ఇలా ఈ బ్లాగు టపాతో కొనసాగించటం ఎంతో మధురంగా ఉంది!!!
ReplyDeleteగౌతం
డియర్ గౌతం,
Deleteఆవారా సినిమా గూర్చి నాకు గుర్తున్న ఓ నాలుగు ముక్కలు రాశాను. రివ్యూ రాసేంత జ్ఞానం లేదు. ఓపికా లేదు. మన బజ్జీల కబుర్లు, సినిమా జ్ఞాపకాలు బ్లాగులుగా రాస్తూ.. నలుగురితో చదివిస్తున్నా.
రాజ్ కపూర్ పాపులారిటీ గూర్చి నువ్వు చెప్పిన ఉదాహరణ నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజుల్లో ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ లో సోషలిస్ట్ ప్రోపగాండ సినిమాలు ఎక్కువ. వాళ్లకి రాజ్ కపూర్ సినిమాలు నచ్చడం అర్ధం చేసుకోగలను. కానీ గ్రీస్ వాళ్ళు కూడా రాజ్ కపూర్ ఇష్టపడటం విశేషమే!
ముకేష్ గొంతులో మెలొడీ = పెసరట్టులో ఉప్మా :) ఎన్నో పోలికలు విన్నాను కానీ ఈ పోలిక మొదటిసారి వింటున్నా. మంచి పోస్ట్.
ReplyDeleteముకేష్ , రాజ్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన పాటల్లో నా ఫేవరేట్ సాంగ్ "ఆసూ భరీ హై జీవన్ కీ రాహే..కోయి ఉన్ సే కహ్ దే హమే భూల్ జాయే" పర్వరిష్ సినిమాలోది...
"ఆసూ భరీ హై.. " అద్భుతమైన పాట! నాక్కూడా ఇష్టం.
Deleteనా బ్లాగులో ఉప్మా పెసరట్ తరచుగా కనబడుతుంది లేండి!
ReplyDeleteఎన్ని మార్పులు,చేర్పులు. చేసినా అవారా సినిమాకి,భలేరాముడు సినిమాకి మూలకథ అశోక్ కుమార్ హీరోగా వేసిన 'కిస్మత్ 'అనే పాపులర్ ఫిల్మ్.దానికి,ఇంగ్లిష్ మూలం ఉందేమో తెలియదు.రాజ్కపూర్ మంచి నటుడూ ,దర్శకుదూ కూడా.చార్లీ చాప్లిన్ని అప్పుడప్పుడు అనుకరిస్తూ ఉంటాడు.
'ఆవారా'కి దగ్గరగా 'భలేరాముడు' ఉంటుందని విన్నాను. రామారావు, జమున నటించిన 'మంచి మనిషి' సినిమా కూడా ఆవారా కథని పోలి ఉంటుంది. ఐతే.. వీటన్నింటికీ మూలం 'కిస్మత్' అని తెలీదు.
Deleteనాకో సందేహం. ఒక సూపర్ హిట్ సినిమాని రాజ్ కపూర్ + అబ్బాస్ అంత నిస్సిగ్గుగా కాపీ కొట్టేస్తారా? అని (ఆ పని మన పూరీలు, చపాతీలు చులాగ్గా చేసేస్తారు).
రమణ గారు,
ReplyDeleteదొంగ కమ్యునిస్ట్టుల గురించి నేను అడిగిన దానికి ఇప్పటివరకు మీదగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. సమాధానం ఎప్పుడిస్తారా అని నేను గంటకోఆరి మీబ్లాగును చూస్తూన్నాను.
SriRam
ఆవారా సినిమా మొదటి సారి సెకండ్ ఇయర్ లొ భాస్కర్ టాకీస్ లొ చూసి పిచ్చెకింది.ఆ తరువాత రాజ్ కపూర్ సినిమాలన్నీ వరస పెట్టి చూశా.ఇప్పటికీ మనసు బాగొనప్పుడు చూస్తూనే ఉన్నా.
ReplyDeleteకొంచెం రంధ్రాన్వేషణ చేయనివ్వండి... యాభైలలో ఒక ఆవారా RITA అని ఇంగ్లీషులో రాస్తాడంటారా? లేక హిందీ లో రాస్తాడంటారా?
ReplyDelete