(నేనింతకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఉద్యమం గూర్చి 'వేతనశర్మ' ఉద్యమం అని ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు ఆ పోస్టుకి కొనసాగింపుగా రాస్తున్నాను.)
ప్రభుత్వోద్యోగులు 'సమైక్యాంధ్ర' అంటూ ఒక ఉద్యమాన్ని నడిపారు. నాకు పరిచయం ఉన్న చాలామంది ఆ ఉద్యమ నాయకుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనీ మధ్య మళ్ళీ సమైక్య ఉద్యమం మొదలెడుతున్నానని గాండ్రించాడు. ప్రజలు ఆ ఉద్యోగ నాయకుడిలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగుల్ని గాంచారు, పరవశించారు. నేను మాత్రం ఆ నాయకుళ్ళో ఓ పులిని వీక్షించాను. అందుకే నాకాయన గాండ్రించినట్లనిపించింది.
హిట్లర్ కన్నా దుర్మార్గుడు, ఘంటసాల కన్నా గొప్పగాయకుడు, రావిశాస్త్రి కన్నా గొప్ప రచయిత ఈ ప్రపంచంలో లేడని నా ప్రగాఢ నమ్మకం. అనేక ప్రాపంచిక విషయాల్ని రావిశాస్త్రి కథల దృక్పధం నుండే నేను అర్ధం చేసుకుంటుంటాను. ఇందుకు నేను బోల్డెంత సంతోషంగానూ, గర్వంగానూ ఫీలవుతుంటాను కూడా.
ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన 'వేతనశర్మ కథ' చదవడం వల్ల నాకు ఉద్యోగుల పట్లా, వారి ఉద్యమాల పట్ల గొప్ప అవగాహన కలిగింది. అందుకే నాకెంతో ఇష్టమైన ఆ కథకి పరిచయం కూడా రాసుకున్నాను. రావిశాస్త్రి పుణ్యమాని.. నాకు ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తే పులులు గుర్తొస్తాయి. కొందరికి పులంటే భయం. ఇంకొందరికి పులిలో రాజసం, ఠీవి కనిపిస్తాయి. నాకు మాత్రం పులి ప్రమాదకరంగా కనిపిస్తుంది.
నాకు తెలిసిన చాలామందికి గవర్నమెంటు ఆఫీసుల్లో చేదు అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఉద్యోగులు సామాన్య మానవుణ్ని అమెరికావాడు ఇథియోపియా కరువు బాధితుణ్ణి చూసినట్లు అసహ్యించుకుంటారు. తప్పదు! వారి పని ఒత్తిడి అంత గొప్పగా ఉంటుంది! జీవితం మీద విరక్తి కలగాలంటే ఏదైనా పని మీద గవర్నమెంటు ఆఫీసుకి వెళ్తే చాలని అనేకమంది అభిప్రాయం. సామాన్య మానవులెవరైనా ఏ గవర్నమెంట్ డిపార్టమెంట్లోనైనా సరే.. సకాలంలో పని పూర్తి చేసుకుని, గౌరవప్రదంగా బయటపడ్డారంటే వారికి సన్మానం చెయ్యాల్సిందే.
ప్రభుత్వాలు ఉద్యోగస్తుల ద్వారా టాక్సులు వసూలు చేస్తాయి. ఆ మూలధనంతో ప్రజల అవసరాల కోసం ఎలా ఖర్చు చెయ్యాలో ప్లాన్లు వేస్తాయి. దీన్నే బడ్జెట్ అంటారు. అయితే మన బడ్జెట్లో సింహభాగం ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. మిగిలిన కొంత సొమ్ముని ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం మరియు పేదప్రజల సంక్షేమ పథకాల నిమిత్తం ఖర్చు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులదే ప్రధాన పాత్ర. అయితే వారు వారి పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా?
ఉద్యోగస్తులు సంఘటితంగా పోరాడి తమ డిమాండ్లు సాధించుకుంటున్నారు. మంచిది. అది వారి హక్కు. కాదనడానికి మనమెవరం? అయితే వీళ్ళని మనం కొన్ని ప్రశ్నలు వెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళకి జీతాలు వచ్చేది మనం కట్టే పన్నుల్లోంచి కావున. మరి వీళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధుల్ని నిర్వర్తిస్తున్నారా?
ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాల్లో పదిరూపాయిలు తేడా వస్తే మెరుపు సమ్మె చేస్తారు. ఒకరోజు సీనియార్టీ తేడా తేల్చుకుందుకు సుప్రీం కోర్టు తలుపు కూడా తడతారు. 'మా జోలికి వచ్చారా? ఖబడ్దార్. మేం ఎన్టీఆర్ ని మట్టి కరిపించాం. చంద్రబాబుకి బుద్ధి చెప్పాం. ఆలోచించుకొండి.' అంటూ ప్రభుత్వాలకి మాఫియా టైపు వార్నింగులిస్తారు.
ప్రభుత్వ డాక్టర్లు కూడా 'సమైక్యాంధ్ర' అంటూ రోజుకో స్కిట్ తో వెరైటీ ప్రదర్శనలు నిర్వహించారు. మంచి వినోదాన్ని పంచారు. ప్రభుత్వ డాక్టర్లూ! మీకున్న సామాజిక స్పృహకి వందనాలు. కానీ మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు నెలకి ఎన్ని రోజులు వారి ఆస్పత్రికి వెళ్తున్నారు? మీ అందరికి ప్రైవేట్ నర్సింగ్ హోములు ఎందుకున్నాయి? లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటూ పేదప్రజలకి సరైన వైద్యం అందించడంలో మీ పాత్ర సక్రమంగా నిర్వహిస్తున్నారా?
అసలు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఒక పేద దేశానికి అవసరమా? ఒకే కాయితం వివిధ సంతకాల కోసం అనేక సెక్షన్ల మధ్యన గిరిగీలు కొట్టించే ఈ ఉద్యోగుల వ్యవస్థ మన దేశ ఆర్ధిక ప్రగతికి అడ్డంకి కాదా? వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం కలిపించి.. వారిని చచ్చేదాకా టాక్స్ పేయర్స్ మనీతో పోషించే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ దేశానికి ఏ విధంగా మేలు చేస్తుంది?
ఈనాడు మన యువత అనేక రంగాల్లో దూసుకెళ్తుంది. మనకి ప్రతిభావంతుల కొదవ లేదు. కానీ వారి సేవల్ని ప్రభుత్వ స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండటం దురదృష్టం. సరైన వ్యవస్థని సృష్టించుకుని, మన యువతని సరీగ్గా వాడుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని నా అభిప్రాయం. అటువంటి పరిస్థితి రావాలని, వస్తుందని ఆశిద్దాం.
(photo courtesy : Google)
అదృశ్య శక్తులు నడిపిస్తే నడిచిన వారు. పాపం సొంత కాళ్లు లేవు నిలబడటానికి.
ReplyDeleteఆ విషయం వారిక్కూడా తెలుసు. కానీ.. తెలీనట్లుగా ఉంటారు.
Deleteమీ ఆశావహ దృక్పథం నాకు బాగా నచ్చింది. మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteఏదో పోస్టుకి మంగళం పాడాలని అలా రాశానే గానీ.. నాకైతే నమ్మకం లేదు.
Deleteనీ ముగింపు చూసి , ఏదో మంచి వాక్యంతో ఈ బ్లాగ్రాత నంతమొందించుదామని రాసావే అనుకొన్నాను. అది నిజమని ఒప్పుకొని నాకు ఆనందాన్ని కలిగించావు, నీ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము కానీయ లేదు!
Deleteగౌతం
@TJ "Gowtham" Mulpur,
Deleteనామీద నీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు. :)
(నా పోస్టుకి అదో 'శుభం' కార్డు.)
మా వైపు ఉద్యమం జరిగింది..ఇక్కడ "ఉద్యోగాలు" లేవని ముఖ్య ఆరోపణ. ఉద్యోగాలు అంటే ఏంటి?? పని వేదోక్కొని, నెల నెల జీతం దొరికేవాన్ని ఉద్యోగాలు కావు.
ReplyDeleteఉద్యోగాలు అంటే, పని చేయకున్నా, నెల నెల టంచనుగా జీతం దొరకడం, ఎవరు మనల్ని నిలదియకుండా ఉండడం, "ని సత్తా, పనితనం" కి సంబంధం లేకుండా, కాలానుగునంగా ఇంక్రిమెంట్, ప్రమోషన్ దొరకడం. జీతం కన్నా ఎక్కువగా ఆదాయం ఉండడం, ..ఇవన్ని ఉండే "ప్రభుత్వ ఉద్యోగం".
వీరు ఇప్పుడు ప్రమోషన్ లు తొందరగా దొరుకుతాయనో (తెలంగాణ లో), తమ స్థానాలు మారుతయనో (సిమంద్ర లో) పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసారు. దాని వాళ్ళ జరిగిన నష్టం అపారం. కాని మీరనట్టు చాల మంది ఇందుకు మద్దత్తు తెలిపారు. ప్రజలకు అది తప్పక వీరితో కలిసారా?? వీరిని నమ్మి కలిసి నడిసారా?? అదో పెద్ద ప్రశ్న.! దిని వెనక సాముహిక మంసతత్వం ఎలా ఉంటుందో మిరే చెప్పాలి..
మీరు చెప్పినవన్నీ తప్పని చెప్పే అవకాశం మన ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వలేదు. అవి అక్షరాల నిజ౦. మనకు కనపడే అవినీతి, పోలిస్ వ్యవస్థ, రెవెన్యు వ్యవస్థ లలో ఉంది, కాని ప్రతి విభాగం లో అంతులేని అవినీతి ఉంది. అక్కడ బయటపడే అవకాశం లేక పోవచ్చు.
మనం అవినీతి లో మొదటి ఇరవై స్థానాల్లో ఉన్నాం. మనకన్నా ముందున్న దేశాల్లో అవినీతి ఎక్కువగా పై (ముఖ్య రాజకీయ, న్యాయ వ్యవస్థ లలో) ఉంది. కాని మన దేశం లో అవినీతి మధ్య స్థాయిలో ఎక్కువగా ఉంది, అది ముఖ్య౦గా ప్రభుత్వ అధికారుల స్థాయిలో ఎక్కువ అవినీతి ఉ౦ది.
మన ఉద్యోగులు నిజంగా ప్రజా క్షేమం కోరుకొనే వల్లే అయితే.., మన సమాజం ఇలా ఎందుకు ఉండేది??
ఇక్కడ ఉద్యోగులు ఉద్యమం చెయ్యలేదని నా అభిప్రాయం.
Deleteముఖ్యమంత్రి + మీడియాతో అవగాహన కుదుర్చుకుని కొంత డ్రామా నడిపారు. అంతే.
రెండు సంవత్సరాల క్రితం నేను రాసుకొన్న పోస్ట్..నేటికి అదే పద్దతి.! విభజనలో విసిగేత్తిస్తున్న రాజకీయాలు..
ReplyDeletehttp://www.inspiringrays.blogspot.in/2013/01/nothing-is-possible.html
"Nothing" is possible..
who said "nothing is impossible"..
"nothing" is possible.! here is the example...
గత కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా మన ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎం.ఎల్.ఎ లు, ఎం.పి లు ఇది నిరుపిస్తువస్తున్నారు. "తెలంగాణ" రావడం, పోవడం అనే మాయ మాటలతో కలక్షెపమ్ చేస్తూ.., డెల్లి ప్రయాణాలతో, విందు సమావేశాలతో కాలం గడిపేస్తున్నారు.
అది ఉద్యమం.., ప్రజలు, విద్యార్తులు తమంత తాముగా వచ్చి నిలబెట్టిన ఉద్యమం.అ ఉద్యమం ఉద్దేశ్యాలు, వాటి తప్పొప్పులు చర్చిన్చ్చేమో..కాని రాజకీయ నాయకులూ అవేమి చేయడం లేదు. ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి మాత్రమె ప్రయత్నిస్తున్నారు. పడువులతో ఉద్యమం చేయడం అంటే ప్రజా ధనంతో, ప్రజలిచ్చిన అధికారం తో పబ్బం గడుపుకోవడమే.. తమకు వచ్చే ప్లస్సులు, మైనస్సులు లేక్కేసుకోవడానికి మాత్రమె వాళ్ళు చేస్తున్నది.
రోజంతా వార్తలు అవే, పొద్దున్న లేస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడం, అది ఒక ఉద్యమ స్పూర్తితో కాకుండా, రాజకీయ లబ్ది కోసం, ప్రజలను పక్క దారి పట్టించటం కోసం మాత్రమె..లెక్కలేని వార్త చానల్ లు, చిరాకు పుట్టించే అంకర్ ఎక్ష్ప్రెషన్, అరుచుకోవడమే అసలు వాదన.,
అసలు మన వాళ్ళు ఇంతకూ తప్ప ఎం పనిచేస్తున్నారు...! అందుకే అన్నది "nothing" కూడా మనకు సాధ్యమే...
కాంట్రాక్టర్లు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు.. ప్రజాప్రతినిధులు అయినప్పుడు ఈ సమస్య వస్తుంది.
Deleteవేతన శర్మలను ఉతికి ఆరవేయుట, చీల్చి చెండాడుట, చెవులు మూసి చితగ్గొట్టుట... అనే మీ ప్రోగ్రామ్ బహు పసందుగా ఉంది. రావిశాస్త్రి ఆవాహనంతో మీరు రాయాలే గానీ, ఈ సీరియల్ వంద పోస్టులదాకా నడిచినా దానికి ఆదరణ ఏమాత్రం చెక్కుచెదరదని మా గాఠి నమ్మకం :-) ఏదేమైనా, ఆలోచన రేకెత్తించే పోస్టు. పదునైన ప్రశ్నల్ని ఎక్కుపెట్టారు. అన్నట్టు, మీరు మొత్తంగా ’’ప్రభుత్వ ఉద్యోగ విధానమే’’ మంచిది కాదంటారా? లేక లోపభూయిష్టంగా మారుతన్న ప్రభుత్వోద్యోగ విధానాన్ని సమూలంగా సంస్కరించి గాడిలో పెట్టి పనిచేయించేలా ‘‘వ్యవస్థ’’లో మార్పు అవసరమంటారా?
ReplyDeleteనాగరాజ్ గారు,
Delete>>లోపభూయిష్టంగా మారుతన్న ప్రభుత్వోద్యోగ విధానాన్ని సమూలంగా సంస్కరించి గాడిలో పెట్టి పనిచేయించేలా ‘‘వ్యవస్థ’’లో మార్పు అవసరమంటారా?
ఈ చాయిస్ ఐడియల్. కానీ కుదర్దు.
కావున..
>>మొత్తంగా ’’ప్రభుత్వ ఉద్యోగ విధానమే’’ మంచిది కాదంటారా?
అవునని అంటాను.
>>అసలు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఒక పేద దేశానికి అవసరమా? ఒకే కాయితం వివిధ సంతకాల కోసం అనేక సెక్షన్ల మధ్యన గిరిగీలు కొట్టించే ఈ ఉద్యోగుల వ్యవస్థ మన దేశ ఆర్ధిక ప్రగతికి అడ్డంకి కాదా?
ReplyDeleteతిరుగు లేని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు జవాబు దొరికిన సమయానికి ముందే ఇంచు మించు సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. జవాబు దొరకనంత వరకు సమస్య పరిష్కారం కాదు.
ప్రభుత్వ ఉద్యోగులను కూడా ప్రైవేటుగా పరిగణిస్తే కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు.
Is it not the same case with the other side of the employees? I mean, did not T-employees do the same kind of agitations? Are they so pure, not corrupt? Are they so perfect and performing their duties on time without taking even a single penny of bribe? Don't they fight for the same issues of seniority, promotions etc etc.
ReplyDeleteYour article seems to be focusing on whether the govt employees (so large in size) is really needed for the country. I cent per cent agree with that. But your examples show you are against the so-called agitation for united statehood. It is shown in your earlier posts also.
The issues raised either in this post and some of earlier posts are applicable equally to both the agitations. But you have always been critical of united agitation. It seems these issues stuck you only when United argument raises its voice.
You can simply skip under the guise of the knowledge of situations around in your district and neighboring (coastal) districts. That is your choice.
And sir, please don't think this as criticism, it is mere observation.
Why didn't you write up something directly supporting separation of the state? Anyway, there is no need for such article now, as it is going to happen soon.
ఫణి గారు,
Deleteవేతనశర్మ (రావిశాస్త్రి కథ మీరు చదివే ఉంటారు) కి ఆంధ్రా / తెలంగాణా అనే ప్రాంతీయత లేదు.. సర్వాంతర్యామి.
నా పోస్టులు చదివానన్నారు. ధన్యవాదాలు. కాబట్టి నేను 'సమైక్యవాది'(??????)ని కాదన్న సంగతి మీకు అర్ధమయ్యే ఉంటుంది. నా ధోరణిలో ఏదో రాసుకుంటున్నాను. 'డైరక్టు'గా రాయడం అంటే ఏంటో నాకు అర్ధం కావట్లేదు. (నాకు తోచిన రీతిలో మాత్రమే నేను రాయగలను. ఇంకోలా రాయలేను గదా).
('మీరనుకున్నంత' డైరక్టుగా పోస్టులు రాయలేనందుకు చింతిస్తున్నాను.)