Saturday, 16 November 2013

టెండూల్కరుని టెక్కునిక్కులు

గమనిక :

'భారతరత్న' సచిన్ టెండూల్కర్ కి అభినందనలు. ఇదే టాపిక్ మీద అక్టోబర్ 9, 2011 న ఒక పోస్ట్  రాశాను. ఇప్పుడది పునర్ముద్రిస్తున్నాను. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అక్తర్ ప్రస్తావన ఎందుకొచ్చిందో పూర్తిగా గుర్తు రావట్లేదు (కష్టపడి గుర్తు తెచ్చుకోవలసింత గొప్ప విషయం కాదు గనుక వదిలేస్తున్నాను). 
     
                              *                  *              *                *                *

అక్తర్ బంతులకి సచిన్ భయపడ్డాడా! నమ్మబుద్ధి కావట్లేదు కదూ! ఒకవేళ నిజంగానే అక్తర్ విసురుడుకి టెండూల్కర్ భయపడితే అందులో పరువు నష్టమేమి? 'బ్యాటుతో కాదురా. కంటిచూపుతో సిక్స్ కొట్టేస్తా.' అనే చౌకబారు తెలుగు సినిమా డైలాగ్ సచిన్ చెప్పడు. మరేం చేస్తాడు? అక్తర్ bowling video ని తన coach అధ్వర్యంలో అధ్యయనం చేస్తూ.. ఎలా ఎదుర్కోవాలో సాధన చేస్తూ.. ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఆడుతూ.. అక్తర్ bowling ని అద్భుతంగా ఎదుర్కొంటాడు. 

ఇది గొప్పఆటగాడి లక్షణం. భయపడటం అనేది బూతుమాట కాదు. అసలు ఆ భయమే చాలాసార్లు మనని కార్యసాధకుణ్ణి చేస్తుంది. కానీ.. మన హీరోగారు భయపడ్డాడంటే మనం తట్టుకోలేం. ఈ భయపడటం అనే పదం 'పిరివాడు' అనే ఒక negative sense లో వాడుతూ.. ధైర్యానికి వీరుడూ, శూరుడూ అంటూ లేని గొప్పదనాన్ని ఆపాదిస్తాం. 
                  

అయినా.. అక్తర్ పశుబలంతో బంతులిసిరాడేగానీ.. బుర్ర తక్కువవాడిలా ఉన్నాడు. ముందు తన పుస్తకానికి ఏ దేశంలో market ఎలా ఉంటుందో అంచనావెయ్యాలి. ఆ దేశంలోని రాజకీయాలనీ, అభిమానుల మనోభావాలనీ అంచనా వెయ్యగలగాలి. ఇండియాలో పుస్తకం బాగా అమ్మాలనుకుంటే ఏ ఆస్ట్రేలియావాడినో, పాకిస్తాన్ వాడినో target చేస్తే మంచిది. అది మంచి వ్యాపారస్తుడి లక్షణం కూడా! 

ఈ వ్యాపారస్తులకి common sense కూడా ఎక్కువే! ప్రతి అంతర్జాతీయ క్రికెటర్ ఇండియాలోకి అడుగుపెట్టంగాన్లె ముందు సచిన్ని పొగుడుతారు. మనం క్రికెట్ ఆటకి మహారాజ పోషకులం. టెండూల్కర్ మన దేవుడు. దేవుణ్ణి పొగిడితే లాభం గానీ.. తెగిడితే ఏం లాభం? ఈమాత్రం తెలివిలేని అక్తర్ని చూస్తే నవ్వొస్తుంది. బహుశా పాకిస్తాన్లో అమ్మకాలు దృష్టిలో పెట్టుకుని సచిన్ భయపడ్డాడని రాశాడేమో! సైజు ప్రకారం ఇండియాది పెద్ద మార్కెట్ గదా! మరి ఈ తిక్కలోడు సచిన్ని టార్గెట్ చేసుకున్నాడేమి!               

సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ఇవ్వాలని ఆయన అభిమానులు ఇల్లెక్కి కూస్తున్నారు. మంచిదే. అభీష్ట సిద్ధిరస్తు. క్రికెట్ ఆడటం public service క్రిందకి వస్తుందేమో మనకి తెలీదు. కానీ.. టెండూల్కర్ బూస్ట్ నించి బర్నాల్ దాకా కనీసం వంద బ్రాండ్లకి ambassador. ఆయనకి గొలుసు హోటళ్ళు (chain of hotels) కూడా ఉన్నాయి. 

రేపు 'Boost is the secret of my భారతరత్న' అనే కొత్త tagline తో కొత్త కాంట్రాక్టులు రాబట్టుకోవచ్చు.' వంద పెప్సీ మూతలు కలెక్ట్ చేసుకోండి. భారతరత్నతో shake hand పొందండి.' అనే కొత్త campaign మొదలుపెట్టొచ్చు. best of luck to సచిన్. అయినా.. ఎం.జీ.రామచంద్రన్ కిచ్చిన భారతరత్న ఎవరికిస్తే మాత్రమేంటి?       

బంగారు నగల వ్యాపారస్తుల్లాగా.. సామాన్య ప్రజలకి సంబంధంలేని రత్నాలు, ముత్యాల మీద ఎవార్డులు ఇవ్వడమే నవ్వొస్తుంది. భారతబొగ్గు, భారతఉప్పు లాంటి పేర్లు ఎవార్డులకి పెడితే ఇంకా అర్ధవంతంగా ఉంటుంది కదా! బొగ్గూ, ఉప్పు లేని మన బ్రతుకు ఊహించుకోలేం. మనకి ఏమాత్రం సంబంధంలేని రాళ్ళూ, రప్పల పేర్ల మీద ఎవార్డులు ఇస్తున్న గవర్నమెంట్ ఉద్దేశ్యం కూడా.. వీళ్ళని పట్టించుకోకండి అనేమో!  
                  

ఇన్ని సెంచరీలు కొట్టిన టెండూల్కర్ శరద్ పవార్ తో తన మాతృభాష మరాఠీలో.. "అంకుల్! నా అభిమానులు ఉల్లిపాయలు కొనలేక చస్తున్నారు. కనీసం ఒక రూపాయైనా ధర తగ్గించండి." అని చెప్పొచ్చు. వాళ్ళభాషలోనే అన్నా హజారేకి మద్దతూ పలకొచ్చు. అప్పుడు ఏమవుతుంది? భారతరత్న రావటం అటుంచి.. ఉన్న ఎవార్డులు, రివార్డులు పొయ్యే ప్రమాదం ఉంది. 
                  
సచిన్ గవాస్కర్ శిష్యుడు. డబ్బు సంపాదనలో ఆరితేరినవాడు. అట్లాంటి చెత్త ఆలోచనలని దగ్గరికి కూడా రానివ్వడు. 'పనికొచ్చే' ఆలోచనలు చెయ్యటంలో బొంబాయివారు సిద్ధహస్తులు. అందుకే.. 'బొంబాయి నడిబొడ్డున నాలుగెకరాలు ఫ్రీగా ఇవ్వండంకుల్. ఒక academy పెడతాను.' అంటూ గురువుగారిలా భోజన కార్యక్రమాల్లో ఆరితేరివుంటాడు. 
                  
సచిన్ అద్భుతమైన క్రికెటర్. కష్టపడి ఆడాడు. ఇంకా కష్టపడి బాగా సంపాదించుకున్నాడు. అందుకతను అనేక marketing టెక్కునిక్కులు ప్రయోగించాడు. మంచిదే. అయితే భారతరత్న ఇవ్వాలనుకుంటే ఇది సరిపోతుందా? అపార జనాకర్షణ కలిగిన ఒక ఆట ఆడి, తద్వారా కోట్లు వెనకేసుకోవటం, పుట్టపర్తి బాబావారి సేవలో తరించిపోవటం మించి public life లో సచిన్ సాధించింది ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది. కాబట్టే ఈ చర్చంతా. 
                  
'అసలిప్పుడు నోబెల్ ప్రైజులకే దిక్కు లేదు. అందరి దృష్టీ స్టీవ్ జాబ్స్, రతన్ టాటా, నారాయణమూర్తిల మీదే ఉంది. అట్లాంటిది ఈ రోజుల్లో భారతరత్నకి మాత్రం ఏపాటి విలువుంది?' అంటారా? అయితే గొడవే లేదు! 

(photos courtesy : Google)   

23 comments:

  1. బలే మంచి పోష్టు పసందైన పోష్టు! వసంతాల సిక్సర్లు రాలే మంచి పోష్టు!
    మీరు వేసిన ప్రశ్నలకు క్రికెట్‌ (పిచ్చోల్లు) సారీ! అభిమానులు జవాబు చెప్పగలరా? లేరంటే లేరు! ఆత్మ వంచన పర వంచన చేసుకోనే మన అభి మానులు భారత రత్న కంటే నోబల్‌ ప్రైజు ఇచ్చి ఉన్నట్లైతేసంతోషం పట్టలేక ఆత్మ హత్యలు చేసుకొని ఉండి ఉండరా?

    ReplyDelete
  2. @THIRUPALU P

    /* మీరు వేసిన ప్రశ్నలకు క్రికెట్‌ (పిచ్చోల్లు) సారీ! అభిమానులు జవాబు చెప్పగలరా? లేరంటే లేరు! */

    నేనూ ఒకప్పుడు క్రికెట్ అభిమానినే ( మీ భాషలో పిచ్చోడు అనేమో), కానీ ఈమధ్య మరీ కమర్షియల్గా అయిపోయిందనిపించి ( T20, IPL వల్ల), గత 5-6 ఏళ్ళుగా చూడట్లేదు. సచిన్ అంటే మాత్రం ఇంకా అభిమానం ఉంది.

    జవాబు చెప్పలేక అని మీరు అంటున్నారు. 'అవసరం లేక ' చెప్పట్లేదేమో అని నా అభిప్రాయం!

    @రమణగారూ,
    మీ పోస్టు చూస్తే సచిన్ మీద మీ కోపమంతా అతను బొంబాయివాడు అవ్వటంవల్లేనేమో అనిపిస్తుంది. మీరు ఇంతకుముందు అన్నట్టు గవాస్కరు కాలంలో బొంబాయివాళ్ళ ఆధిపత్యం ఉండి ఉండవచ్చు, సచిన్ బొంబాయినుంచి కాకుండా హైదరాబాదు వాడు అయివుంటే ఇంత గుర్తింపు వచ్చిఉండకపోవచ్చు. అంతమాత్రాన అతను చేసినవాటిని తక్కువ చేసి చూడటం, చులకనగా మాట్లాడటం అవసరంలేదేమో కదా!

    సచిన్ కి భారతరత్న ఇచ్చినందు వల్ల నాకు అతనంటే అభిమానం ఏమీ పెరగలేదు, ఇవ్వకపోతే ఏమి తగ్గేది కాదు. మీరన్న " ఎం.జీ.రామచంద్రన్ కిచ్చిన భారతరత్న ఎవరికిస్తే మాత్రమేంటి? " వాక్యంతో కొంతవరకు ఏకీభవిస్తాను.

    చేసే పని మీద నిబధ్ధత ఉన్నవారిని ఎవరినైనా గౌరవించాలి. అలా ఉన్నవారు పేరు తెచ్చుకొని దానితోపాటు కోట్లు సంపాదించుకోనివ్వండి, ఎవరు కాదన్నారు? సి.ఎన్.ఎస్.రావుగారు సచిన్ లాగా కోట్లు సంపాదించక పోవచ్చు, అంతమాత్రాన ఆయన సచిన్ కన్నా తక్కువ అని అనట్లేదుగా?

    We don't have many genuine & inspiring heroes in India. We can’t afford to disrespect the very few we have.

    ReplyDelete
  3. I completely agree with @శ్రీనివాస్

    I think we should learn to recognize those who have brought name and fame to India in whatever field they are working / representing.

    If Don Bradman is great to Australia and Lara is great to WI, why not Sachin to India?

    ReplyDelete
  4. In the days of Bradman Cricket was not commercialised. Lara's country is so small, howsoever he wishes to commercialize his talent, it does not work much. I agree with "ఎం.జీ.రామచంద్రన్ కిచ్చిన భారతరత్న ఎవరికిస్తే మాత్రమేంటి?"

    Excellent write up Doctor Jee.

    ReplyDelete
  5. భారతరత్న సచిన్ కంటే పొడుగేమో!

    ReplyDelete
  6. తన విలువ తగ్గించుకొని సచిన్ విలువ పెంచిన భారతరత్న అవార్డు.

    ReplyDelete
  7. డాక్టర్ గారూ, మీరు వ్రాసినదే ఒక హాస్య ప్రసంగం విన్నాను. ఒక అద్భుతమైన బ్లాగులో ఆకాశవాణి విజయవాడ వారి కార్యక్రమాల్లో కొన్ని అప్లోడ్ చేస్తున్నారు. అందులో మీ ప్రసంగం (మీదే అనుకుంటాను) కూడా అప్లోడ్ చేశారు. ఆటో ప్రయాణం పులి మీద స్వారి. బాగున్నది. చదివినావిడ కూడా చాలా అర్ధవంతంగా చదివారు. మీ బ్లాగులో ఈ విషయం ఎక్కడ వ్రాయాలో తెలియక లేటెస్ట్ వ్యాసంలో వ్యాఖ్యగా వ్రాసేస్తున్నాను.

    http://myradiofm88.blogspot.in/2013/04/riding-tiger-comic-speech-puli-swari.html

    ReplyDelete
    Replies
    1. SIVARAMAPRASAD KAPPAGANTU గారు,

      నా బ్లాగులు కొన్ని ఆకాశవాణిలో వచ్చాయి. అవి చదివినవారు పన్నాల కృష్ణకుమారి గారు. అయితే ఇంతవరకు నేనూ విన్లేదు. మీ దయవల్ల ఇప్పుడే ఒకటి విన్నాను. మీరన్నది నిజం. ఆవిడ చాలా అర్ధవంతంగా చదివారు.

      చాలా ఓపికతో లింక్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

      Delete
  8. ఫీల్డ్ ఏదైనా సరే, అద్భుతమైన ప్రతిభ చూపిన వాళ్ళకు గుర్తింపు రావాల్సిందే అలా జరిగితేనే మరొకరికి ఏదైనా సాధించడానికి స్పూర్తిగా ఉంటుంది. సచిన్ కు భారత రత్న రావడం ఈ దేశం తనని తాను గౌరవించుకోవడం తప్ప సచిన్ కు దాని వల్ల ఒరిగేదేమీ లేదు. ధ్యాంచంద్, మిల్కా సింగ్ లాంటి వాళ్ళ విషయంలో జరిగిన తప్పు (కారణం ఏదైనా) సచిన్ విషయంలో జరగకపోవడం ఆనందించాల్సిన విషయం.

    జవహర లాల్ నెహ్రూకు భారతరత్న ఇచ్చినప్పుడు ఎంజీఆర్ కు ఎందుకు ఇవ్వకూడదు. కనీసం సినిమాలకన్నా సేవ చేశాడు కదా :P

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @Karthik

      The equation is very simple !

      Bharat Ratna is the Republic of India's highest civilian award, for performance of highest order in any field of human endeavour.

      Sachin is UNDISPUTED champ. Period.

      So no reason,absolutely no reason - "why Sachin should not be given Bharat Ratna !". That's it ! No more arguments from either side.


      But my friend

      [సచిన్ కు భారత రత్న రావడం ఈ దేశం తనని తాను గౌరవించుకోవడం తప్ప సచిన్ కు దాని వల్ల ఒరిగేదేమీ లేదు.]

      This is completely wrong. In fact it hurt many people feelings (including me) who believes in NO ONE let me repeat NO ONE is bigger than the state.

      More over I gently remind you one thing. Government amended rules in late 2011 to consider Sachin's nomination for this award, which in turn open flood gates to 'Jewels of India' in future.

      If award does not bring any respect to Sachin, why he was so silent? Why never said a simple NO to this? Okay I know Sachin is very humble, so he didn't say no as he feels that it is disrespecting the Government of India. He accepted this too just like MP seat offered by UPA government. Hence, let us keep him aside. Tell me why fans have pressurized the government for this amendment ?

      This clearly proves something isn't it ?

      What is that something? Let me explain !

      Imagine a day after 20 - 25 years from now - I believe cricket will fade away or die a natural death by then at least in India . Whoa I am talking about cricket's death, but what will be the future of India by considering 18 Chinese incursions in this year? Oh, but I digress !!!!! Many people in the future generations may or may not know about cricket by that time . But still they remember Sachin why because his name is engraved in Indian History as "Bharat Ratna".

      Thats what I want to say here, if it does make any sense to you !

      Btw, already lot of noise is present around Sachin as of now, and actually it is degrading his value. Please don't add fuel with this kind of statements my friend.

      Finally,
      Are you comparing Nehru to MGR? You are cruel man :-)))


      Note : I wrote this comment in friendly tone. I am least bothered to know what the mess going around, and busy in earning grains for my livelihood :-)))) So no hard feelings !

      Delete
    3. I dont find anything wrong with my statement :P

      When I hear the word "Bharatha Ratna", people come to my mind are Dr. Kalam, Lata Mangeshkar and Bismillah Khan. I'm 200% sure Sachin belongs to that league and if he is denied that award then it is a national shame. It is indeed very unfortunate that Dhyanchand and Milka Singh arent awarded the same.

      Delete
  9. Excellence and Contribution in some or other field - I thought this is the basis of Bharat Ratna, in which case, Sachin is most deserving candidate.



    ReplyDelete
  10. @karthk This bharat rathna helps the corporate companies and tendulkar to maintain his brand value.... atleast for some more time...

    ReplyDelete
    Replies
    1. Two things here:

      1. Sachin was so popular all these years without Bharatha Ratna and What brand value did Bharatha Ratna add to M.S. Subba Lakshmi and Lata Mangeshkar?

      2. Whats wrong about having brand value? IMO he deserved that.

      Delete
  11. భారత బొగ్గు, భారత ఉప్పు, భారత ఉల్లి, భారత లొల్లి... అబ్బబ్బబ్బా, కొత్తపదాల్నిమీరు మంచినీళ్లు తాగినంత ఈజీగా భలే కనిపెడతారే :-) అన్నట్టు, అసలు నేను - నాకంటే - ఎక్కువగా అభిమానించే క్రికెట్ గాడ్ మీదే సెటైర్లు వేస్తారా? ఎంత ధైర్యమండీ మీకు? పోనీ నన్నొదిలేయండి. నేనంటే సచిన్ లాంటి సౌమ్యుణ్ని. ఎవ్వరితోను గొడవలు పెట్టకోను. కనీసం మీరు వంద కోట్లమంది మనోభావాలనైనా లెక్క పెట్టరా? సర్లేండి, అయ్యిందేదో అయిపోయింది. మీరు 99శాతం మంచి పోస్టులు రాశారు కాబట్టి దాడులకు దిగకుండా వదిలేస్తున్నాం. ఈ విషయాన్నిక ఇంతటితో ఆపేయండి. మళ్లీ సీన్లోకి సుబ్బూని ఎంటర్ చేసి, ఛస్... ఉల్లిధర, హజారే ఉద్యమల్దాకా ఎందుకు, అత’గాడు‘ అస్తమానం ముంబయి లాబీయింగుతో భారత క్రికెట్టును ఏళ్ల తరబడి బల్లిలా పట్టుకు వేళాడాడే తప్ప, జెంటిల్మెన్ క్రీడకు పట్టిన చీడపురుగు ’బెట్టింగు‘ మీద కూడా పల్లెత్తు మాట మాటాడలేదనిన్నీ; వాడెవడో బహుమతిగా ఇచ్చిన ఫెరారీ కారుకు సైతం దిగుమతి సుంకం కట్టని ఉట్టి స్వార్థపరుడనిన్నీ; సచినుడికి భారతరత్న ఇవ్వడం వెనక కాంగ్రెస్ హైకమాండు ఓట్ల కుట్ర కూడా దాగుందనిన్నీ వగైరా వగైరా ఈకలు పీకించి, కొత్త మెలికలు పెట్టించారనుకోండి, ఇక మీ బ్లాగులో యుద్ధమే, ఏమనుకున్నారో! అసలే సచిన్ అంటే నేను సగం చెవి కోసేస్కుంటాను, ఆయ్! :-)
    (చివరి తోక: సరదాకి రాసిందిది. ఎవ్వరినీ నొప్పించడానిక్కాదు. సచిన్ కోసమే నేను క్రికెట్ చూస్తాను. గాడ్ లేని క్రికెట్ చూడనికపై)

    ReplyDelete
    Replies
    1. @నాగరాజ్

      ఇదేదో జూలియస్ సీజర్ నాటకంలో ఆంటోనీ స్పీచ్ లాగా ఉన్నదే.

      Delete
    2. SIVARAMAPRASAD Garu,
      నిజాల్ని నిర్భయంగా మాట్లాడుకోలేని గొప్ప రాష్ట్రంలో, అంతకంటే గొప్ప దేశంలో బతుకుతున్నాం మనం. అందుకే కొన్ని విషయాలు డొంకతిరుగుడుగా మాట్లాడుకోవాల్సి వస్తోందేమో. మీరిలా నిజాల్ని బహిర్గతం చేస్తే నాపై భౌతికంగా కాకపోయినా భౌద్ధికంగా దాడులు జరుగుతాయేమో. అసలే గాడ్. దేవుడితో పెట్టుకుంటే ఇంకేమన్నా ఉందా? శంకరగిరి మాన్యాలే. అందుకే మార్క్ అంటోనీని ఆశ్రయించాల్సి వచ్చింది. జూలియస్ సీజర్ నాటకం చదవలేదు గానీ, సినిమా చూశాన్నేను. మీరు గుర్తు చేసిన హానరబుల్ అంటోని స్పీచ్ ట్రూలీ మార్వలస్. అన్నట్టు, నాకు నిజంగానే సచిన్ అంటే చాలా ఇష్టం (టెన్నిస్ ప్లేయర్ ఫెదరర్ తర్వాత). థాంక్యూ :-)

      Delete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. Is there any rule that Bharata Ratna award should be given only to social workers. I used to think it is for people who achieved great heights in their fields.

    ReplyDelete
  14. మనకి ఏమాత్రం సంబంధంలేని రాళ్ళూ, రప్పల పేర్ల మీద ఎవార్డులు ఇస్తున్న గవర్నమెంట్ ఉద్దేశ్యం కూడా.. వీళ్ళని పట్టించుకోకండి అనేమో!

    ReplyDelete
  15. బాగా రాసారు డాక్టర్ గారు, మీ అభిప్రాయంతో ఎఖిభవిస్తున్నాను.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.