Monday, 4 November 2013

ధనికుడు - పేదవాడు

మనుషులు రెండు రకములు.

ఒకటి ధనికుడు. రెండు పేదవాడు

ధనికుడు ఏమి చేయును?

చెప్పాలంటే చాలా ఉన్నాయి. మచ్చుకు కొన్ని..

- గనులు త్రవ్వును.

- పరిశ్రమలు స్థాపించును.

- కాంట్రాక్టు పద్ధతిన డ్యాములు నిర్మించును.

- ప్రజాప్రతినిధిగా ఎన్నికవును, ప్రజాసేవ చేయును.

- ఉగాది పర్వదినాన తెలుగుదనం కోసం పంచె కట్టుకొనును.

- కూతురికి సాంప్రదాయ నృత్యమునందు తర్ఫీదు ఇప్పించును.

- తెలుగు భాషా రక్షణకై కార్యక్రమములు నిర్వహించును.

- పుట్టిన్రోజున వికలాంగులకి మూడు చక్రాల సైకిళ్ళు పంపిణీ చేయును.

- సాయంకాలం క్లబ్బులో టెన్నిస్ ఆడి.. స్కాచ్ విస్కీ చప్పరించుచూ.. దేశము గూర్చి బాధ పడును.

సరె సరే! ధనికుడి గూర్చి వివరంగానే చెప్పావ్.

మరి పేదవాడు ఏమి చేయును?

ఏదో మాట వరసకి, పోలిక కోసం పేదవాడి ఊసు తెచ్చానే గానీ..

వాడసలు మనిషే కాదు.

వాడి గూర్చి రాయడం శుద్ధ దండగ!



(photos courtesy : Google)

11 comments:

  1. అర్ధాంతరంగా ఆపేసినట్టుగా, అయిపోయినట్టుగా అనిపించిందెందుకో?! ధనికుడి తాలూకు డాబుసరి గొప్పతనాన్ని మీకే సాధ్యమైన ఛలోక్తులతో, విశేషణాలతో ఇంకొంత పెంచుంటే బావుండేదేమో. గోర్కీ రచన ‘‘నగరం’’లో ఓ ధనికుణ్ని ఒక సామాన్యుడు ఇంటర్వ్యూ చేస్తాడు. అందులో ధనికుడు తన గురించిన చేదు నిజాలు చాలా చెబుతాడు. బహుశా... మీరు చదివే ఉంటారు.

    ReplyDelete
    Replies
    1. నాగరాజ్ గారు,

      వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      అవును, ఇంకొంచెం రాయొచ్చు. కానీ పొట్టిగా ఉంటేనే బాగుంటుందనిపించింది.

      (నేను గోర్కీ అన్నీ చదవలేదు.)

      Delete
  2. మధ్యముడైన మధ్యతరగతి మానవుడు వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయి చావలేక బతకలేక త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాడు..అందుకే మీ టపాలో మాయమయివుంటాడు..

    ReplyDelete
  3. Naaku kudaa naagaraju gaaru annatle anipinchindi sir..:-):-)

    ReplyDelete
    Replies
    1. అవునా!

      రావిశాస్త్రి ఇట్లాంటి పొట్టిపిట్టకథలు చాలా రాశాడు. అప్పుడప్పుడు నాకవి గుర్తొస్తుంటాయి. అదీ కథ!

      Delete
  4. సినేమా రంగంలో వచ్చిన మార్పులనుమహేష్ భట్ రాశాడు. చాలా బాగా రాశాడు. మీకు వీలున్నపుడు చదవండి.

    http://www.bollywoodhungama.com/movies/features/type/view/id/5698

    ReplyDelete
  5. ఈ ధనికులు, పేదవాళ్ళు రోజులతో పాటు మారుతుంటారేమో. ఓ 30 సంవత్సరాల క్రితం పేద కుటుంబం ఇప్పుడు ధనిక కుటుంబం అయ్యుండొచ్చు అలాగే ఓ 20 సంవత్సరాల క్రితం ధనిక కుటుంబం ఇప్పుడు పేదవాళ్లై ఉండొచ్చు (నేను కొన్ని ఉదాహరణలు నిజంగా చూశాను). ఏ కుటుంబమైనా ఎందుకు పేదగా ఉంటుంది, ఎలా (మోసం చెయ్యకుండా) ధనిక కుటుంబంగా మారుతుందో అర్ధం చేసుకుంటే పేదరికాన్ని కొంత తగ్గించడానికి వీలౌతుందేమో :)

    ReplyDelete
  6. నేను పెట్టిన కామెంట్‌ ను తినేశారు! భావ్యమా సార్‌!

    ReplyDelete
    Replies
    1. లేదండి. మీ కామెంట్ నాదాకా రాలేదు. మధ్యలో ఏదో అయ్యింది. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.