Sunday 16 February 2014

భరతమాత ముద్దుబిడ్డలు


ఇప్పుడు ఉద్యమాల సీజన్ నడుస్తుంది. ఉద్యమం అంటే తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఒక బాధిత ప్రజా సమూహం చేసే పోరాటం అని అర్ధం. అయితే ఇప్పుడు ఉద్యమం అనే పదానికి అర్ధం మారిపోయింది. తమకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నవారి హక్కుని కాదనడం కూడా ఉద్యమమే అంటున్నారు. అంగబలం, అర్ధబలానికి అధికారం కూడా తోడైతే శబ్దం ఎక్కువగానే ఉంటుంది.. లక్ష్మీ ఔటు మోత కూడా AK 47 పేల్చినట్లుగా వినిపిస్తుంది. 

ఉద్యమాలు ప్రజలు నడిపించడం పాత పధ్ధతి. ఇప్పుడంతా మారిపోయింది. ఉద్యమాలు కూడా ఔట్ సోర్స్ చేయబడ్డాయ్! అందుకే ఇప్పుడు ప్రైవేట్ టీవీ చానెళ్ళు ఉద్యమాల్ని నడిపిస్తున్నాయి. ఈ టీవీ చానెళ్ళ ప్రధాన లక్ష్యం తమ ప్రయోజనాలు, తమ వర్గం వారి ప్రయోజనాల్ని పరిరక్షించడమే. అందుకే ఈ చానెళ్ళు సమాజంలో ఉన్న కొన్నివర్గాలకి మాత్రమే గొంతునిస్తాయి, కొమ్ము కాస్తాయి, బాకాలూదుతాయి. తమవాడికి వీపు దురద పుడితే ప్రజలందరికీ దురద పుడుతుందన్నట్లు హడావుడి చేస్తాయి. 

ఒకప్పుడు బీహార్లో కులప్రాబల్యం ఎక్కువనీ, కులాలే రాజకీయ శక్తుల్ని నియంత్రిస్తాయని చెప్పుకునేవారు. ఇప్పుడు మనం బీహార్ వైపు చూడనక్కర్లేదు. మనని మనం చూసుకుంటే చాలు! పొరుగున ఉన్న తమిళనాడు, కేరళలలో పార్టీకొక పత్రిక ఉంది. వాళ్ళది చాలా సింపుల్ వ్యవహారం. 

మనవి కులరాజకీయాలు కాదు, రాజకీయాలే కులాల్ని అనుసరించి సాగుతున్నయ్. అందుకే పత్రికలు ఒకే వార్తని వారివారి కులదృష్టితో, ప్రాంతదృష్టితో రిపోర్ట్ చేస్తున్నాయ్. కాబట్టే ఒక రాజకీయ నాయకుడు బరి తెగించి ప్రవర్తిస్తే.. అతను 'మనవాడు' కాబట్టి భగత్ సింగ్ తో పోల్చుకుని ఆనందిస్తున్నాం. 

మంచిది, భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని ప్రస్తుతానికి ఆనందిద్దాం. ఈ రకంగా అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీలు కూడా జన్మించే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రేటున దేశానికి వన్నె తెచ్చిన ముద్దుబిడ్డలంతా మన మధ్యనే తిరుగాడుతుంటారు. అప్పుడా దృశ్యం కన్న భరతమాత ఉద్వేగంతో కార్చే ఆనందభాష్పాలు తుడవటానికి ఎవరి చేతిరుమాళ్ళూ సరిపోవు, పెద్దపెద్ద టర్కీటవల్సే కావాల్సి ఉంటుంది. కాబట్టి - అవేవో ఇప్పుడే రెడీగా ఉంచుకుందాం. 

(picture courtesy : Google)

15 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. భగత్సింగులు లాలా లజపతి రాయ్‌ లు మన అవసరాన్ని బట్టి వస్తారండి. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్లు ( ఈ సామెతను ఉపయోగించకూడదు. ఉపయోగిస్తె స్త్రీలను కించపరిచినట్లు ఉంటుంది గాని ఆభావాన్ని చెప్పటానికి తప్పట్లెదు.) ఏ పరాయి దేశంలోనో ఇట్లా చేస్తే భగసింగ్‌ తో పోల్చవచ్చు నేమో. ఇదేమిటండి సొంత ఆస్తులకోసం పార్లమెట్‌ లో స్ప్రేలు చల్లడం. ( అదీ పెప్పెర్‌ స్ప్రే కాదట. ఏదో రసాయనాలు కలిపిన, ఇతర దేశాల్లో నిషేదించబడినదటా! దేశ ప్రజాస్వామిక భావాన్ని బ్రష్టుపట్టించడం. రాజకీయ సన్యాసం పుచ్చుకొవలిసి వస్తుందనేమో!

    ReplyDelete
    Replies
    1. వీరంతా భరతమాత మొద్దు బిడ్డలు!!!

      Delete
  3. అల్లూరి కూడా జన్మించాడండీ! హర్ష కుమార్ అట.. అభినవ అల్లూరి..చూళ్ళేదా మీరు?

    ReplyDelete
  4. మీరు అప్పుడెప్పుడొ తెలుగు తల్లి అని స్త్రీ సెంటిమెంటు అంటగట్ట వద్దు అన్నారు, ఇప్పుడు భరతమాత ఎందుకొ భారతదేశం అనవచ్చుగా ....!! మీరు మట్టుకు మీ రచనలొ సెంటిమెంటు పండించటానికి వాడుకొవచ్చా??

    ReplyDelete
    Replies
    1. యేం చెప్తాం?కాల మహిమ! మతి చలించిన వారికి వైద్యం చేసే వైద్య శిఖామణికే చిత్త చాంచల్యంలో తన మాటను తనే మర్చిపోయి నాలుక్కర్చుకోవాల్సి వచ్చింది!!అవునా సార్?!

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
  5. What has happened in the Parliament is deplorable. We all should condemn it irrespective of whether we support united ap or divided ap.

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. Telangana Gandhi ani media lo jarige pracharam meeda meeru spandinchunte, bavundedemo, sir. Oka region lo nivasinche janam andarini dongalu ani koose vadi meeda, meeru comment cheyyadam eppudu chudaledu.

    ReplyDelete
  8. 18/02/2023
    వరంగల్:
    తెలంగాణ(తెలుగు అనకూడదేమో!!)వాచకం;ఒకటొ అధ్యాయం;రాష్ట్రపిత:-
    తెలంగాణ జాతిని 60 సంవస్ట్సరాల ఆంద్రొగ్రవాధుల ధాస్య శ్రుంఖలాల నుండి శాంతియుతంగా సాత్విక పద్దతిలొ పొరాడిన శ్రి శ్రి శ్రి.......


    విజయవాడ:
    తెలుగు వాచకం;ఒకటొ అధ్యాయం;రాష్ట్ర భగత్ సింగ్:-
    తెలుగు జాతి విడిపొగూడదని తన ప్రాణలకి తెగించి పొరాడి ఆ ప్రయత్నం లొ తన రాజ్కీయ జీవితాన్ని త్యజించిన వీర ధీరొదాత్థ శ్రి శ్రి శ్రి.......

    నల్గొండ : ఊత్తర తెలంగాణ రాజకీయ నాయకులు దక్షిణ తెలంగాణని పట్టించుకొవడం లేదు కనుక ఫ్లొరైడ్ సమస్య పొలేదు కావున వారికి ప్రత్యేక రాష్ట్ట్రం కావాలి...


    ఆనంతఫురం:కొస్తా ఆంధ్ర రాజకీయ నాయకులు రాయలసీమని పట్టించుకొవడం లేదు కనుక తాగునీటి సమస్య పొలేదు కావున వారికి ప్రత్యేక రాష్ట్ట్రం కావాలి...













    ReplyDelete
    Replies
    1. nijangaa meeru annatlu uttara telangana adipthyam lo dakshina telangana pidincha baduthe ( ippudu andhra vallu chesinattu )... thappakundaa dakshinaa telangana rasta erpatu dhaniki solution ani bavisthe thappakundaa ...aaa rastaa erapukuu malli poradlisindhe . guttha adhipathyam poye varuku poratam agadu bayaaa :)

      Delete
  9. శ్రీనాధుడు తన సాటి కవుల్ని వెక్కిరిస్తూ చెప్పిన పద్యమిది:

    కొందరు ప్రాక్కిటీస్వరులు, కొందరు కాలుని ఎక్కిరింతలున్
    కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్
    కొందరు కృష్ణ జన్మమున గూసిన వారలు నందరందరే
    యందరు నందరే మరియు నందరు నందరే యందరందరే

    :ఇప్పటి వీళ్లకి బాగా సరిపోతుంది కదూ?

    ReplyDelete
  10. ఇంకా మిగిలిన నాయకులు నిద్ర లేవలేదు.లేదా ఇంకా వారి యాడ్స్ తయారు కాలేదు. లేకపోతే మనం ఇప్పటికే అభినవ రామ్మూర్తి, అభినవ శ్రీరాములు, అభినవ ప్రకాశాలు టీవిల్లో కనిపించేవారు. జాగో భాయియోం... అవకాశం మళ్లీ దొరకదు. లేవండి. 2014 ఎన్నికల్లో మళ్లీ జాతికి పునరంకితాలను ప్రకటించండి...

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.