Saturday 27 December 2014

రచయితల రోగం


"బావా! బావోయ్!"

"వూఁ!"

"ఒక డౌటు."

"అడుగు."

"రచైత అంటే ఏంటే ఎవురు బావా?"

"రచనలు చేసేవాళ్ళని రచయిత అంటారోయ్!"

"రచన్లా! అంటే ఏంది?"

"కథలు, నవలలు, వ్యాసాలు.. ఇట్లా చాలా వున్నైలే!"

"అబ్బో! చాలా యవ్వారవేఁ వుంది. ఇంతకీ రచైతలు రచన్లు ఎందుకు చేస్తారంటావ్?"

"మనోల్లాసానికి, మనోవికాసానికి.. "

"కొద్దిగా తెలుగులో చెప్పు బావా!"

"రచయితలు గొప్ప ఆలోచనాపరులు. పాఠకులకి కొత్త విషయాలు తెలియజెయ్యడానికి రచనలు చేస్తారు."

"పాటకులా! ఆళ్ళెవరు? చీటీపాట పాడేవాళ్ళా?"

"కాదు కాదు, రచయిత రాసింది చదివేవారిని పాఠకులు అంటారు."

"బావా! రచైత అంతేసి ఆలోచించడం దేనికీ? అన్నేసి పేజీల్తో బుక్కులు రాయటం దేనికి? తోచకపోతే నాలాగా హాయిగా సుట్ట కాల్చుకుంటా గమ్మునుండొచ్చుగా?"

"వుండొచ్చు. కానీ - వారి సామాజిక స్పృహ అందుకు వొప్పుకోదు."

"అర్ధవైఁంది బావా! ఇది కూడా ఒక యసనం అన్నమాట!"

"వ్యసనమా!"

"అవును బావా! మన అబ్బిగాణ్ని చూడు - పేకాడకుండా వుండలేడు. సూరిగాడు తాక్కుండా వుండలేడు. అట్టాగే రచైతలు కూడా రచన్లు చెయ్యకుండా వుండలేరన్నమాటేగా?"

"సరే! అలాగే అనుకో!"

"బావా! ఇదేవఁన్నా రోగవాఁ?"

"వురే! ఇందాకట్నుండి చూస్తున్నాను, ఒకటే వాగుతున్నావు. పొద్దస్తమానం పొలం పన్జేసుకునేవాడివి - నీకివన్నీ అవసరం అంటావా?"

"అదేంది బావా అట్టా కోపం జేస్తావు? ఏదో సదువు లేనోణ్ని - యివరంగా చెప్పొచ్చుగా?"

"నాకు వివరంగా చెప్పేంత ఓపిక లేదు. నీకో నమస్కారం, దయచేసి దయచెయ్యి!"

"అట్టాగే పోతా! ఇంత మరియాదగా చెప్పినా యినకుంటానికి నేనేవఁన్నా రచైతల్లాగా పనీపాటా లేనోణ్నా?"

(picture courtesy : Google)

12 comments:

  1. రచైత అంతేసి ఆలోచించడం దేనికీ? అన్నేసి పేజీల్తో బుక్కులు రాయటం దేనికి? తోచకపోతే నాలాగా హాయిగా సుట్ట కాల్చుకుంటా గమ్మునుండొచ్చుగా?"

    "వుండొచ్చు. కానీ - వారి సామాజిక స్పృహ అందుకు వొప్పుకోదు."
    "అర్ధవైఁంది బావా! ఇది కూడా ఒక యసనం అన్నమాట!"
    ఇంత మరియాదగా చెప్పినా యినకుంటానికి నేనేవఁన్నా రచైతల్లాగా పనీపాటా లేనోణ్నా?


    అదుర్స్

    ReplyDelete

  2. డా టే రు బాబు గారు,

    ఉండండి ఉండండి, రావి, పతంజలి శ్మశానం నించి లేచి వచ్చి మిమ్మల్ని వాయ గొట్టా లని బయలు దేరు తున్నారు ఈ టపా విషయం తెలిసి !!!

    :)

    జిలేబి

    ReplyDelete
  3. రచ్చ చేసేవారు రచయితలు!!

    ReplyDelete
  4. అబ్బా! అబ్బా! ఇంతోటి అలోచనలు చేసి అదర నవ్వించడం అవసరమా? పనిలేక గానీ, :) అయినా అంతర్లీనంగా హాస్యమే గాదు అద్బుతమైన థీం కూడా వుంది లెండి. మీ భామ్మర్ధికి అమాయకంగానే అంత తర్కం ఎలా వస్తుంది?
    అంతకంటే బొమ్మ అదిరింది.

    ReplyDelete
  5. రమణగారు, రచయితలలో చాలా రకాలు ఉంటారు. కొందరు రచయితలు ఎంత తక్కువ చదువు చదివితే, అంత ఎక్కువ రచనలు చేసి సమాజంపై వారి కసి తీర్చుకోవలను కొంటారు. వృదాప్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈ మధ్య కొత్తపుస్తకం రాసారు. అన్ని పుస్తకాల వలే, తాను రాసింది పాఠకులు చదివి పక్కన పడేసి, ఎక్కడ తనని మరచిపోతారేమో అని, తలక్రింద దిండులాగాపెట్టుకొనేందుకు వీలుగా గట్టి బైండ్ చేయించి అమ్మటం వారికలవాటు.

    ReplyDelete

  6. రమణ గారు, చార్లెస్ డికెన్స్ నవలలోని హీరోల ప్రేరణగా తీసుకొని, కష్టాలను అధిగమిస్తూ అతను ఎలా చదువుకొన్నాడో చూడండి. Pls watch video.
    http://tribune.com.pk/story/357765/pakistans-caste-system-the-untouchables-struggle/

    ReplyDelete
  7. మీరు ఏ దొ గొప్ప చదువు చదివి వుంటే రాసి వెలగపెట్టవచ్చు గదా. చదివి తరించేవాళ్ళం. ఆ రచయిత పేరు చెప్పే దైర్యం కుడా లేదు. సచ్చు కామెంట్లు రాయటం తప్ప.ఏ నాడూ పసవున్న కామెంట్లు పసవుండే విమర్శ చేయలేక కమ్యునిజం పైన పడి ఏడవటం. రమణ గారూ గతంలొ నేను ఒక కామెంట్ రాసినాను మీటపాలొ. ఎందువలనొ దాన్ని మీరు ప్రచురించలేదు కారణం ఎమిటొ తెలియదు నేనెప్పుడూ దూషణపర్వానికి దూరం. దీన్ని మీరు ప్రచిరించే ఉద్దేశం వుంటే మీగురించి రాసింది తీసేసి ప్రచురించండి.

    ReplyDelete
    Replies
    1. బ్లాగర్స్ బ్లాగర్‌లో కామెంట్ ఎడిట్ చెయ్యడం కుదరదు. కాబట్టి మొత్తం కామెంట్ పబ్లిష్ చేస్తున్నాను. ఈ మధ్య కామెంట్ల విషయంలో జాగ్రత్తగా వుంటున్నాను. నాకు 'గుర్తున్నంతమటుకు' మీ కామెంట్ పబ్లిష్ చెయ్యకుండా లేను. మధ్యలో ఏదో అయినట్లుంది. :)

      Delete
    2. మీరు అనవసరం గా కోపపడుతున్నారు. కమ్యునిజం లోనే పసలేదు. అయినా ఈ రోజుల్లో కమ్యునిజం మీదపడి ఏడవ వలసిన అవసరం ఎవరికి ఉంది? కమ్యునిస్టు లు న్యుట్రల్ గా ఉంట్టూ, అన్నిమతాలవారి లోపాలను ఎత్తిచూపుతారా అంటే అదేమి లేదు. హిందూమత గ్రంథాలల మీద మాత్రం పడి ఏడుస్తూంటారు. హిందుమతాన్ని,హిందూ గురువులను మాత్రం విమర్శించే హక్కు ఎవరిచ్చారు? మిగతవారు ఎమి చేస్తున్నానోరు ఎందుకు మెదపరు?

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. కమ్యునిష్టులు పుట్టుకతో అత్యధికంగా ఏ మతం లో వారో సెలవిస్తారా తమరు

      Delete

comments will be moderated, will take sometime to appear.