ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ ముషిరుల్ హసన్ మొన్న ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడని హిందూలో చదివాను. ఈ వార్త చదివాక చాలా దిగులుగా అనిపించింది. నేను చాలాయేళ్ళుగా హిందూలో ప్రచురితమయ్యే ముషిరుల్ హసన్ వ్యాసాలు చదువుతున్నాను. దేశ విభజన, విభజనాంతర పరిణామాలు, మతరాజకీయాలు.. ఇలా అనేక విషయాలపై ఆయన ఆలోచింపజేసే రచనలు చేశాడు.
ముషిరుల్ హసన్ అంతకుముందు కొన్ని ఎకెడెమిక్ పుస్తకాలు రాసినప్పటికీ.. నాలాంటివాడికి బాగా తెలీడానికి కారణం - సల్మాన్ రష్దీ! రష్దీ రాసిన 'సెటనిక్ వెర్సెస్' అన్న పుస్తకం ముస్లిం మతచాందసులకి కోపం తెప్పించింది. దాంతో ఆయతొల్లా ఖొమైనీ రష్దీని చంపెయ్యమని ఓ ఫత్వా (?) జారీ చేశాడు. ముస్లిం వోట్లని దృష్టిలో వుంచుకుని - ఆనాటి భారత ప్రభుత్వం హడావుడిగా రష్దీ పుస్తకాన్ని నిషేధించింది (ఎంతైనా పుస్తకాల్ని నిషేధించడంలో ప్రభుత్వాలు భలే ఉత్సాహంగా వుంటాయి)!
అనాడు - 'సెటనిక్ వెర్సెస్' నిషేధించడాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగా - జామియా మిలియా ఇస్లామియా హిస్టరీ ప్రొఫెసర్ ముషిరుల్ హసన్ వార్తలకెక్కాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా మతవాదులకి లిబరల్స్ ఆలోచన బూతుగానే అనిపిస్తుంది. అంచేత - ముస్లిం మతచాందసులు - క్లాసుల్లో పాఠాలు చెప్పుకుంటూ, పుస్తకాలు రాసుకునే మన ప్రొఫెసర్‌గార్ని తుక్కుబడ తన్నారు. పాపం! ఆ దెబ్బలకి ఆయన ఆస్పత్రి పాలయ్యాడు.
ముషిరుల్ హసన్ రాసిన ఓ పుస్తకం కొన్నాను గానీ - చదవలేకపొయ్యాను. ఆకలిగా లేనప్పుడు మసాలాదోసె ఆర్డరివ్వం కదా? మరప్పుడు చదివే ఓపిక లేనప్పుడు పుస్తకం కొనడం దేనికి? ఎందుకో నాకు తెలీదు. తెలిస్తే - చాలా పుస్తకాలు కొనేవాణ్నే కాదు!
ముషిరుల్ హసన్ సాబ్! గెట్ వెల్ సూన్!
(photo courtesy : Google)
ముషిరుల్ హసన్ సాబ్! గెట్ వెల్ సూన్!
ReplyDelete// చదివే ఓపిక లేనప్పుడు పుస్తకం కొనడం దేనికి? // చదివినట్లు ఫీలై ఉపశమనం పొంది, తృప్తి పొందడానికి.ఆకలిగా లేనప్పుడు మసాలాదోసె ఆర్డరివ్వం కదా? అవును ఇవ్వం. పుస్తకాలు చదవాలనే ఆశ మాత్రం అలాంటిది కాదు. కోటా శ్రీనివాస రావు కోన్ని చూస్తూ కోడి బిరియాని తిన్నట్లు ఫీలవడం అన్న మాట! :)
బోరు కొడుతోంది. మీ సుబ్బుని ఒకసారి పిలుస్తారా?
ReplyDeleteసుబ్బు!
Deleteసుబ్బుని గుర్తుంచుకున్నందుకు థాంక్స్!
ప్రయత్నిస్తానండీ!
Deleteసుబ్బూ ఒకటో సారి
సుబ్బూ రెండో సారి
సుబ్బూ మూడో సారి!
ఎక్కడున్నా హాజర్ హో!!
జిలేబి
Deleteయూ జీ శ్రీ రాము గారు,
>>>మీ అభినందనలకు థాంక్సండి. రాసే స్కిల్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు.!! మీ ఉవాచ !!
మొత్తం మీద డాటేరు బాబు గారు యూ జీ గారి ని బుట్టలో పడేసేరు !
సన్నాసి బుట్టలో పడ్డాడు ! బుట్టోపాఖ్యానం ! ఇక శ్రీ రాము గారు బ్లాగు మొహరాయించు తారని ఆశిస్తా !!
జిలేబి
చూడండి జిలేబి గారు కృష్ణ, రావు గోపాలరావు సవాళ్లు విసురుకొన్న్నా, ఒకరి నొకరు పొగుడుకొన్నా, వాళ్లిద్దరు మామా అల్లుళైనా ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారు. అనవసరం గా మీలాంటి ప్రేక్షకులు కంఫ్యుషన్ అవుతారు :)
Deleteపై వ్యాఖ్య లోచెప్పాలనుకొన్నది, స్పష్టంగా చెప్పలేకపోయను. కృష్ణ, రావు గోపాలరావు హీరో, విలన్ అర్థం ధ్వనిస్తుంది. ఇక్కడ హీరోలు విలన్ లు ఎవ్వరు లేరు. ఈ క్రింది వీడీయో చూడండి. అందులో వారిద్దరికి పడకపోయినా, ఒకరినొకరు నమ్మకపోయినా, రోజు సాయంత్రమైతే కలసి పార్టి చేసుకొంటారు. రమణ గారి బ్లాగులో వ్యాఖ్యలు రాయటమనేది ఒక సరదా! ఆయన టపా రాయటం నేను వ్యాఖ్య రాస్తాను. నా మిత్రులు ఆ వ్యాఖ్యలను చదివి ఆనందిస్తారు :)
Deletehttps://www.youtube.com/watch?v=qvGATrKdExQ