Friday 28 November 2014

అమాయకుల ఆందోళన


ఒకానొకప్పుడు - ఎక్కడైనా, ఎప్పుడైనా అంతిమంగా న్యాయమే జయిస్తుందని నమ్మేవాణ్ని. యిలా నమ్మడం నా అమాయకత్వం మాత్రమేనని కొన్నాళ్ళకి అర్ధం చేసుకున్నాను. అప్పుడు నేను - నా అమాయకత్వానికి నవ్వుకున్నాను.

ఈ తరహా అమాయకత్వం ఏ వొక్కడి సొత్తూ కాదనుకుంటాను. ఎందుకంటే - ఈ లోకంలో ఎప్పుడూ కావల్సినంతమంది అమాయకులు వుంటూనే వున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుంది. యిలా జాలి పడటం నాకేమీ సంతోషంగా లేదు.

ఒకప్పుడు అజ్ఞానంతో - 'మీ చర్మం రంగు తెల్లగా మార్చేస్తాం' అంటూ క్రీముల కంపెనీలు గుప్పించే ప్రకటనలు చూసి - 'చర్మం ఆరోగ్యంగా వుండాలి గానీ ఏ రంగులో వుంటేనేం?' అని విసుక్కునేవాణ్ని. నేనిప్పుడా ప్రకటనల్ని అర్ధం చేసుకున్నాను, సమర్ధిస్తున్నానుకూడా! అవును - మనం తెల్లగా వుండాలి! వుండి తీరాలి!

'హిందూ మతవాదులు గోవుల్ని చంపడం నిషేధించండి! అంటూ నినదిస్తారే గానీ, అదే జాతైన గేదెల్ని చంపొద్దని ఎందుకు అనరు?' ఇది కంచె ఐలయ్య ప్రశ్న. తెల్లగా వుండటమే గోవుల పవిత్రతకి కారణమా? అయ్యుండొచ్చు! 'ఎరుపంటే కొందరికి భయం భయం!' అన్నాడే కానీ - నలుపు తెలుపుల సంగతి చెప్పలేదు శ్రీశ్రీ.

కాబట్టి - మనిషైనా, జంతువైనా చర్మం నల్లగా వున్నట్లైతే - ప్రాణాలకి రక్షణ ఉండదని అర్ధమవుతుంది. మన పేదదేశాలవారికి అమెరికా ఒక సుందర స్వప్నం. కానీ ఆ అమెరికాలో నివసించే నల్లవారికి మాత్రం ఒక పీడకల. ఈ విషయం మాల్కం ఎక్స్, మార్టిన్ లూధర్ కింగ్ వంటి హక్కుల నాయకులు హత్య చేయబడ్డప్పుడే అర్ధమైంది.

కొన్నిరోజుల క్రితం అమెరికాలో ఓ 'నల్లతోలు' యువకుణ్ని కర్తవ్య నిర్వహణయే పరమావిధిగా భావించిన 'తెల్లతోలు' పోలీసు దొర అనుమానంగా, హడావుడిగా కాల్చి చంపేశాట్ట.

ఇదసలు వార్తేనా? కాదు కదా! మరీ ఆందోళనలేమిటి? ఎందుకంటే - మొదట్లో నే చెప్పినట్లు - ఈ ప్రపంచం అమాయకుల నిలయం. ఈ అమాయకులు అజ్ఞానంతో అరుస్తారు. అలా అరవగా అరవగా - కొంతకాలానికి వారే విజ్ఞానవంతులవుతారు.

ఒక మాజీ అమాయకుడిగా నొక్కి వక్కాణిస్తున్నాను - ఇవన్నీ మనం పట్టించుకుని సమయం వృధా చేసుకోరాదు. ఎంత అన్యాయం! అమెరికా ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎక్కడెక్కిడికో వెళ్ళి దుష్టుల్ని సంహరించి ప్రపంచశాంతిని కాపాడుతుంది కదా! అటువంటి ఒక గొప్పదేశానికి - తన పౌరుడ్ని (వాడు నల్లవాడో తెల్లవాడో మనకనవసరం) చంపుకునే అధికారం, హక్కు వుండకూడదా? వుండాలి! వుండితీరాల్సిందే!!

(photo courtesy : Google)

22 comments:

  1. నేను కూడా ఒక తాజా మాజీ అమాయకుడిని !!

    ReplyDelete
  2. ఆ హక్కు కేవలం అమెరికాలోని తెల్లవాళ్ళకే అంటే ఒప్పుకోం, ఇక్కడ గోధుమరంగు వాళ్ళకీ వుండాలి!

    ReplyDelete
    Replies
    1. అది ఆల్రెడీ వుందిగా!

      Delete
  3. //ఒక మాజీ అమాయకుడిగా నొక్కి వక్కాణిస్తున్నాను //
    నేను కూడా సార్‌, నా ఓటు మీకే.
    //ఒక గొప్పదేశానికి - తన పౌరుడ్ని (వాడు నల్లవాడో తెల్లవాడో మనకనవసరం) చంపుకునే అధికారం, హక్కు వుండకూడదా? వుండాలి! వుండితీరాల్సిందే!!//

    ఈ విషయంలో మనం అమెరికాను అభినందించాలి. నల్ల తోలు ఉన్నవాల్లను తుడిచి పెట్టటానికి వారికి హక్కున్నది. ప్రజా స్వామ్య రక్షకులుగా. కానీ వారా పని చేయాటం లేదు. ఎంత మంచి వాళ్లు పాపం!.
    నేను టైపు చేసే లోపలే ఎవరో వేశారే. నేను మొదటి వాణ్ణి అవుదామనుకుంటె!

    ReplyDelete
    Replies
    1. మాజీ అమాయకుల క్లబ్బుకి స్వాగతం!

      ఏదీ.. ఒక్కసారి గట్టిగా అనండి -

      "అమెరికా జిందాబాద్!"

      Delete

  4. ఖబడ్ దార్, నిలు, లేకుంటే కాల్చేస్తా అంటూ అమాయికం గా కాల్చేసే పోలీసోళ్ల మనస్తత్వం ఎట్లాంటి దంటారు డాటేరు బాబు గారు ??

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      పోలీసుల గూర్చి తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రి విస్తృతంగా రాశాడు. ఆయన రాసినంతగా వేరే ఇంకెవరైనా రాశారేమో నాకు తెలీదు.

      పోలీసులు ప్రభుత్వం తరఫున అత్యుత్సాహంగా ప్రజల పీచమణుస్తుంటారు. అందుకు మెచ్చి - ప్రభుత్వం వారిమీద ఈగ కూడా వాలకుండా చూస్తుంటుంది. ఇదోరకంగా - quid pro quo. :)

      Delete
    2. రమణ గారు,
      రావిశాస్రి ఎప్పటివారు? చనిపోయే దశాబ్దాలు అవుతున్నాది. అప్పటికి ఇప్పటికి ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ఆయన్ని ఇంకా తలచుకొవటమంటే పాఠకులను దాదాపు 60 సం|| వెనుకకి తీసుకుపోవటమే. అయినా మీరు ఆయనని మరవకపోగా, వర్తమాన రచయిత వలే విరివిగా ప్రస్థావించటం ఎమిటి? ఈ తరం పాఠకులని, మీ శైలితో ఆకట్టుకొని గతంలోకి వారికి తెలియకుండానే తీసుకువెళ్లటం చేస్తున్నారు. అసలికి మీరోక టైం మేషిన్ లా అందరిని గతంలోకి ఎందుకు తీసుకుపోవాలనుకొంట్టున్నారు? ఇది మీకు భావ్యమా? మీరు రావిశాస్రి గురించి రాసినపుడల్లా నా మైండ్ ఆగిపోతున్నాది :)

      శంకరాభరణం సినేమాలో దొరకునా ఇటువంటి సేవ పాటను అందుకొని, బేబితులసి శంకరశాస్రి వారసత్వాన్ని కొనసాగించినట్లు, బ్లాగులో మీరు రావిశాస్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. సంతోషం. అంతటితో ఆగక శంకరాభారణం పద్యాల క్లబ్ లో(బ్లాగు లో), హాయి గా తెలుగు పద్యాలు రాసుకొనే జిలెబి జి కి , ఆయన గురించి చెప్పటంలో అర్థమేమిటి ? రేపు జిలేబి జి, ఆయన పుస్తకాలు చదివి రాములమ్మలా మారి, ఉదయం ఆరు గంటలకల్లా ఎర్ర టపాల తూటాలు పేలిస్తే, మా బోటివారం ఎమి కావాలి? :)

      నరసింహలో రజనీకాంత్ సౌందర్య పెళ్ళి వీడియోని, రమ్యకృష్ణ చూసిందే చూస్తూ బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్లు, మీరు రావిశాస్త్రి సాహిత్యం చదివిందే చదివి, ఆకాలంలో నే ఉండిపోయినట్లూన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి తెలిసినట్లు లేదు. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికావాడే, వాడి ప్రభ తగ్గిపోయిందని అనుకొంట్టున్నాడు. అంటే డాలర్లు అచ్చుగుద్దటం (క్వాంటిటేటివ్ ఈజింగ్ ) వలన ప్రజలకు ఉపయోగంలేదని గ్రహించాడు. బ్రిటిష్ వాడికి భారత దేశ ఆర్ధిక రంగం ఒక్కటే పచ్చ కాంతి లో కనపడుతున్నాదని, ప్రపంచంలో అన్ని దేశాల ఆర్ధికపరిస్థితి ఎర్రకాంతిలో కనిపిస్తున్నదని చెప్తున్నాడు. ప్రపంచం ఎంతో మారింది కమ్యునిస్ట్ లు, కేపిటలిస్ట్ లు ఇద్దరు కొట్టుకొని అలసిపోయారు. అంతా ఇప్పుడు ఇండియా వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
      బాషా సినేమాలో విలనే, తన కూతురు నగ్మాని తీసుకుపోయి రజనీకాంత్ ను పెళ్లి చేసుకొమ్మనట్లు , అమెరికా వాళ్లు మనదేశమే సుపర్ పవర్ గా ప్రకటించుకొమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇది మీరు గమనించాలి. మీరు 2014 లోకి రావాలి. పేపర్లలో వచ్చే ఈ క్రింది న్యుస్ ను మీరు చదవాలి.


      1. Federal Bank if the inflation is less than 2% they went on printing Money from thin air. They printed 3.6 trillion dollars and this money did not come down to the middle class.
      http://www.fool.com/investing/general/2014/11/05/was-quantitative-easing-a-waste-of-36-trillion.aspx

      2. This is best time for India to become superpower: KPMG CEO
      http://articles.economictimes.indiatimes.com/2014-11-28/news/56540201_1_kpmg-india-indian-institute-superpower

      3. In a world economy where “red lights” are flashing everywhere” – to use British PM David Cameron’s evocative phrase - India is signalling green.
      The world has lived on easy money ever since Lehman Brothers went bust in September 2008. Since then almost every major country or economic grouping has been busy printing money to avoid a Great Depression. The US has had three QEs (quantitative easing), with the third one having just ended. Europe is sure to ease up again as the eurozone is still to recover. Japan, after doing a massive stimulus under Shinzo Abe two years ago, launched a second massive bond-buying plan a few weeks back.
      http://firstbiz.firstpost.com/economy/indias-economy-looks-good-world-flashing-red-lights-108793.html

      4. The Chinese Economy Is Facing A $6.8 Trillion Nightmare That Could Get Worse
      http://www.businessinsider.in/The-Chinese-Economy-Is-Facing-A-6-8-Trillion-Nightmare-That-Could-Get-Worse/articleshow/45307435.cms

      5. China tries to stop women marrying for money, rather than love

      http://www.telegraph.co.uk/news/worldnews/asia/china/8714097/China-tries-to-stop-women-marrying-for-money-rather-than-love.html

      Delete
    3. శ్రీరాం గారు,

      your comment is really good, i enjoyed it.

      మీరు ఈ కామెంట్‌నైనా (వెనక్కి తీసుకోకుండా) అలా వుండనిస్తారని ఆశిస్తున్నాను.

      Delete

    4. ఉండండుండండీ యు జీ శ్రీరాము గారు,

      వచ్చే వారం నించే రాములమ్మ తడాకా తెల్లర గట్రా ఆరు గంటలకే జూపిస్తా !!

      (గాండ్రు మంటున్న)
      జిలేబి

      Delete
    5. @జిలేబి ,
      బ్లాగులో ఉండే రైట్ వింగ్ వాళ్లందరు ఇటువైపుకు రావటం లేదు. నాకా గూగుల్ ప్లస్, ఫేస్ బుక్ అకౌంట్స్ లేవు. బ్లాగులో నేనొక్కడినే మిగిలాను. ఇది రమణ గారికి అర్థమైంది. శత్రువు బలహీనపడినపుడే పార్టిని విస్తరించాలని ఎత్తుగడ వేశారు :). అందుకే మీలాంటి వారికి రావిశాస్త్రి ని చదవమని సలహాలిస్తున్నారు. కమ్యునిస్ట్ పుస్తకాలు చదివినవారు బ్రాహ్మణులు తప్పించి చివరివరకు కమ్యునిస్ట్ మేధావిగా కొనసాగడం చాలా తక్కువ.(ఐలయ్యకు కమ్యునిస్ట్ లు అంటే అందుకే కోపం.ఈ విష్యం గురించిమళ్లి రాస్తాను) ఆ పుస్తకాలు దళితులు చదివితే దళిత వాదం, మైనారిటిలు చదివితే మైనారిటి వాదం, స్రీలు చదివితే స్రీవాదులు గా మారుతారు. నా భయమంతా మీరు స్రీవాదిగా మారి మమ్మలిని విసిగిస్తరేమో అని ! జిలేబి పేరును తీసివేసి "కన్యకుమారి ధీమహి" అని పేరు తగిలించుకొంటారేమో అని! ( కాత్యాయని విద్మహే పేరుగల రచయిత్రి ఇప్పటికే ఒకరున్నారు). మీకు తెలుగు భాష మీదపట్టుంది, పురాణాలు తెలుసు, ఇంట్లో పనులని అయిన తరువాత హాబిగా పురాణంలో ఒక కథ చదివి ఆ నాటి సమాజంలో పురుషాంకారం ఎలా ఉండేది అని టపాలు రాసుకొంట్టూ పోగలైగితే చాలు :)

      స్వతహాగా కమ్యునిస్ట్ పార్టి అభిమాని అయిన రమణ గారు ఈ మధ్య బిజెపి గెలిచిన తరువాత డీలా పడ్డారు. అది అట్ల ఇట్లా కాదు, 60ఏళ్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టి వారు ఎన్నికలలో ఓడిపోయినా, సంపాదించిన సొమ్మును వ్యాపారంలో ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలా అని బిజిగా ఉంటే, కమ్యునిస్ట్ పార్టివారు ,అభిమానులు వారి పార్టి కేంద్రంలో అధికారం కోల్పోయినట్లు కుమిలిపోతున్నారు. అయితే మీకి సలహా ఇవ్వటం వెనుక రమణగారి ఉద్దేశమేమిటని మీరు ప్రశ్నించవచ్చు? వివరిస్తాను ఓపిక చేసుకొని చదవండి.
      కమ్యునిస్ట్ రాజకీఅయ నాయకులను చూడండి. వారు చాలా అల్పసంతోషులు. యం.యల్.ఏ. లుగా గెలవకపోతున్నా ఆ విషయాన్ని పట్టించుకోరు. కాని వారు, వాదాల వారు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలకు మాత్రం తప్పక హాజరౌతారు. అది వారికెంతో ఇష్టం. ఆ సభలలో వారు ఎంతో గొప్పగా ఈ వాదాల వారిని పొగడుతారు. ఈ వివిధ వర్గాల వాదాల వారున్నంతకాలం, వారి పార్టి భవిషత్ కు ఢోకా లేదనుకొంటారు. ఈసామాజిక స్వరాలను వినిపించే వారు సమాజన్ని విశ్లేషిస్తున్నారను కొని గొప్పలు పోతారు. వాస్తవానికి పుస్తకాలు చదవటం వారి బలహీనతగా గుర్తించరు( దేవదాసు కి మందు బలహీనత ఎలాగో, కమ్యునిస్ట్ లకి/ మేధావులకి సాహిత్యం పెద్ద బలహీనత). కాని కమ్యునిస్ట్ల చరిత్రను విశ్లేషిస్తే ఈ వాదాల వారి వల్లే కమ్యునిస్ట్ పార్టీలు వీకయ్యి పోయాయి అని వారు గ్రహించరు. వాదాల పేరు తో కొత్తగా ఒక దుఖాణం పెట్టుకొనేది, ఆ తరువాత అధికారంలో భాగస్వామ్యం వస్తేనే ఎమైనా సాధించగలమని భావించి, అప్పటివరకు బ్రాహ్మణిజం మీద దుమ్మెత్తి పోసి, చివరికి బ్రాహ్మణికల్ పార్టిలైన కాంగ్రెసో , బిజెపి లో నో చేరిపోతారు. ఉదాహరణ కి డిల్లి బిజెపి యం.పి. ఉదిత్ రాజ్ .
      బిజెపి గెలిచిన తరువాత రమణ గారి కి మనసు మనసులో లేకుండా పోయింది. ఎక్కడ వారి సాహిత్య సేవను సంఘ్ పరివార్ వారు అడ్డుకొంటారో అని మొదట్లో భయపడ్డారు. కాని అవేమి జరగలేదు. సంఘ్ పరివార్ వారికి వీరి బలహీనత తెలుసు.కారణం సంఘ్ పరివార్ వీరికన్నా ఒక ఆకు ఎక్కువగా సమాజాన్ని చదివింది. వీరు పోరాటం చేయటం కన్నా ప్రజలను పుస్తకాలతో చైతన్య పరచి,సమాజాన్ని మారుద్దామని అనుకొంటారు. అది చివరికి వారికే లాభం అని బిజెపి వారికి బాగా తెలుసు(ఉదిత్ రాజ్ వంటి వారు బిజెపి తీర్థం స్వీకరించినట్లు). కాని రమణ గారి దృష్టిలో ఎంత సాహిత్యం విస్తరిస్తే అంతగా పార్టి అభివృద్దికి పాటు పడుతున్నాని వారనుకొంట్టున్నరు. అందుకే మీలాంటి తెలుగు బాషపై పట్టున్న వారిని, రావి శాస్త్రి పుస్తకాలు చదివితే మీకు తెలియకుండానే కమ్యునిస్ట్ పార్టి వైపు మొగ్గుచూపుతారని భావించారు. అలా నేను సైతం డాక్టర్ పని చేసుకొంట్టు, క్రమశిక్షణగల కార్యకర్తగా పార్టి అభివృద్దికి పాటు పడుతున్నాని, ఉడుతా భక్తిని ప్రదర్శించటమే వారి ఎత్తుగడ :)

      Delete
    6. @UG SriRam,

      I appreciate your writing skills. Your comments are very funny and interesting.

      (in a hurry, time to work.)

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. This comment has been removed by the author.

      Delete
    9. శ్రీరాం గారు,

      మీ కామెంట్లు పెద్దవిగా వుంటున్నాయి, చదవడానికి టైం తీసుకుంటుంది. ఇంత పొడుగాటి కామెంట్లు రాసేబదులు - ఈ మెటీరియల్‌తో మీరే ఒక బ్లాగ్ పోస్ట్ రాయొచ్చునని నా (ఉచిత) సలహా. :)

      Delete
  5. సార్.... మీరు కూడా..... అది తెల్లవాళ్ళ దేశం అని నమ్ముతున్నారా ఏమిటి.... ఖర్మ....... వాళ్ళు ఆక్రమించుకున్న కున్న దేశం కదా.... అది.....

    ReplyDelete
  6. నేను మీ బ్లాగ్ చదివే వరకు మహా అమాయకుడిని. ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయింది. మీకు నా కృతఙ్ఞతలు.

    ReplyDelete
  7. పతంజలి గారి - ఖాకీవనం మరిచిపోయినట్టున్నారు.

    ReplyDelete
    Replies
    1. అనిల్ గారు,

      అవును - 'ఖాకీవనం' పోలీస్ డిపార్ట్‌మెంట్ గూర్చి ధైర్యంగా, రియలిస్టిక్‌గా రాసిన నవల. అలాగే 'జైలు' అని కొమ్మిరెడ్డి విశ్వమోహన్‌రెడ్డి ఒక మంచి నవల రాశాడు. స్పార్టకస్ 'ఖాకీబతుకులు' రాశాడు. ఇవన్నీ పోలుసు పాత్రలే ఇతివృత్తంగా రాసిన నవలలు.

      రావిశాస్త్రి పోలీసు పాత్రల్ని సృష్టించినా (ముఖ్యంగా 'ఆరు సారాకథలు') - "పోలీసు"ని (undercurrent గా) రాజ్యానికి ప్రతినిథిగా వాడుకుంటూ తన సాహిత్యంలో ఒక తాత్విక స్థాయినిచ్చాడు. ఈ ప్రయోజనం (ఈమధ్య) మరెవరన్నా సాధించారేమో నాకు తెలీదు, మీరే చెప్పాలి (1990 తరవాత తెలుగు సాహిత్యంలో ఎవరేం రాశారో నాకు సరీగ్గా తెలీదు).

      Delete
    2. //1990 తరవాత తెలుగు సాహిత్యంలో ఎవరేం రాశారో నాకు సరీగ్గా తెలీదు//
      1990 తరవాత శ్రీరామ రాజ్యం వచ్చేసింది మరి సాహిత్య అవసరమేంటి?
      సార్‌, స్పార్టకస్ 'ఖాకీబతుకులు' ఇప్పుడు మార్కెట్‌ లో దొరుకుతుందా?

      Delete
    3. @THIRUPALU P,

      'ఖాకీబతుకులు' కాపీలు -

      నాకు ఐడియా లేదండీ. out of print అని అనుమానం.

      Delete

comments will be moderated, will take sometime to appear.