Monday, 10 November 2014

ఆకలి - అజ్ఞానం


అవి నేను ప్రాక్టీసు మొదలుపెట్టిన రోజులు. నాది పూర్తిగా పట్టణ నేపధ్యం. అంచేత గ్రామాలకి సంబంధించిన విషయాలేవీ నాకు తెలిసేవి కావు. ఒక పట్టణం అనేది అనేక గ్రామాలకి కేంద్ర స్థానమనీ, అందువల్ల - పేషంట్లలో ఎక్కువమంది గ్రామాల నుండే వస్తారనీ తెలుసుకున్నాను. గ్రామీణ పేషంట్లతో ఇంటరాక్ట్ అవ్వడం నాక్కొంచెం ఇబ్బందిగా వుండేది.

వ్యవసాయ పనులైన - నాట్లు, కలుపులు లాంటి పదాలకి అర్ధం వాళ్ళనే అడిగి తెలుసుకునేవాణ్ని. కొందరు పేషంట్లు ఓపిగ్గా వివరించేవాళ్ళు, ఇంకొందరు - 'వీడికి వ్యవసాయం గూర్చే తెలీదు! ఇంక మనకి వైద్యమేఁం చేస్తాడు?' అన్నట్లు నావైపు అనుమానంగా చూసేవాళ్ళు.

గ్రామీణ యువతులు చూడ్డానికి చిన్నగా వుంటారు. అందుక్కారణం - వారికి చాలా చిన్నవయసులోనే పెళ్లైపోతుంది. ఆ చిన్నవయసులోనే ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనేస్తారు. అంచేత వారి శరీరంలో ఎదుగుదల వుండదు. పాలిపోయిన మొహాల్తో, ఎండిపోయిన డొక్కల్తో బలహీనంగా, హీనంగా కనబడ్తూ వుండేవారు. 'వీడికీ మాత్రం తెలీదా?' అని మీలో కొందరికి అనిపించొచ్చు, ఇంకొందరికి నా అజ్ఞానం సిల్లీగా కూడా అనిపించొచ్చు. కానీ ఏం చేసేది? నిజంగానే నాకేమీ తెలీదు!

అంతేనా? వాళ్లకి మందులు రాసేప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యేవాణ్ని. ఆ స్త్రీలు పెళ్ళై పిల్లలున్నవారు, కావున - టెక్నికల్‌గా వాళ్ళని పెద్దవాళ్ళు(ఎడల్ట్స్)గా పరిగణించాలి. కానీ - శరీర బరువు రీత్యా చూస్తే వాళ్ళు చిన్నపిల్లల కేటగిరీలోకొస్తారు! ఇంతకీ - వాళ్ళు పిల్లలా? పెద్దలా? ఎవరనుకుని మెడిసిన్ రాయాలి?

ఇటువంటి సమస్యల గూర్చి సైకియాట్రీ టెక్స్ట్ బుక్సులో రాయరు. మొత్తానికి ఏవో తిప్పలు పడి ప్రిస్క్రిప్షన్ రాసేవాణ్ని.

అంతా అయ్యాక - చివరాకరికి వాళ్ళు "బలానికి ఒక మంచి 'స్టానిక్' రాయి సార్!" అనడిగేవారు!

జీవితం గూర్చి నాది పూర్తిగా పుస్తకాల జ్ఞానమే! ఆకలి, కష్టాలు వంటి పదాలకి అర్ధం తెలీదు. పంట పొలాల్ని, గ్రామాల్ని రైల్లోంచి చూసిన అనుభవం మాత్రమే వుంది. గ్రామీణ పేదల జీవితాల్ని అర్ధం చేసుకోడానికి నా దగ్గరున్న ఏకైక టూల్ - సాహిత్యం! ఎమిలి జోలా 'ఎర్త్' (ఈ నవల్లో దరిద్రానికున్న దుర్మార్గపు యాంగిల్ దారుణంగా వుంటుంది), పెర్లస్ బక్ 'గుడ్ ఎర్త్' (ఈ నవల్లో దరిద్రం కొంత డీసెంటుగా వుంటుంది) వంటి నవలల పరిజ్ఞానం మాత్రమే!

నాకు వారి 'స్టానిక్' అజ్ఞానానికి జాలేసేది! లాభం లేదు, నా దేశప్రజల అజ్ఞానమును నా జ్ఞానమనే టార్చి లైటుతో పోగొట్టవలననే సత్సంకల్పంతో, సదాశయంతో - 'నేను సైతం, నేను సైతం' అనుకుంటూ - ఉత్సాహంగా గొంతు సవరించుకుని - 'పోషకాహారం అనగానేమి? అందువల్ల కలుగు లాభములేమి?' అంటూ ఓ మంచి క్లాసు పీకేవాణ్ని! ముక్తాయింపుగా - బీ కాంప్లెక్స్ మందులు వాడటం శుద్ధదండగని అమూల్యమైన సలహా ఇచ్చేవాణ్ని.

'సరైన ఆహారం లేకపోడమే మీకున్న రోగం. రోజూ రెండు గుడ్లు తినండి, గ్లాసుడు పాలు తాగండి. బ్రహ్మాండమైన బలం వచ్చేస్తుంది.'

వారు నా ఉపన్యాసాన్నంతా ఓపిగ్గా విని -

"బలానికి ఒక మంచి 'స్టానిక్' రాయి సార్!" అని మళ్ళీ అడిగేవారు. నాకు చికాగ్గా అనిపించేది.

'ఓ ప్రభువా! నా దేశప్రజల్ని ఎలా ఎడ్యుకేట్ చేసేది? ఎలా? ఎలా?' అంటూ సమాధానం లేని ప్రశ్నల్ని వేసుకుని జుట్టు పీక్కునేవాణ్ని.

అలా నా అజ్ఞాన పేషంట్లకి అనేక ప్రవచనాలు ఇస్తూ ఇస్తూ, దాదాపు అన్నిసార్లు ఓడిపోతూ పోతూ - కొన్నాళ్ళకి నేను పెద్దమనిషినయ్యాను. ఈలోగా - నాలో జ్ఞానకిరణాలు మునిసిపాలిటీ వీధి దీపంలా ఆలస్యంగా వెలిగాయి.

ఆ జ్ఞానకిరణాలేమనగా -

ఆ స్త్రీలు వ్యవసాయ కూలీలు. వారి జీవితంలో తీయనైన అనుభూతులుండవు (గొడ్డుకారం మాత్రమే వుంటుంది). వారికి సుఖం తెలీదు, పరమాన్నం తెలీదు, బిరియానీ తెలీదు, సినిమాలు తెలీదు, షికార్లు తెలీదు, అన్నింటికన్నా ఆశ్చర్యం - మన మధ్యతరగతి వారు బహు బాగా ఎంజాయ్ చేసే సంగీత సాహిత్యములన్న అసలే తెలీదు!

అలా అని వారికి ఏదీ తెలీదని కాదు, వారికీ కొన్ని తెలుసు. రోజంతా ఎండలోపడి నడుములిరిగేట్లు కూలి పన్జెయ్యడం తెలుసు. పచ్చడి మెతుకుల రుచి తెలుసు. అర్ధాకలి తెలుసు, కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు. జీవితాన్ని బాధగా, భారంగా ఎలా నెట్టాలో తెలుసు.

వారికి - కోడిగుడ్డు, పాలు 'బలం' అని కూడా తెలుసు. కానీ - అవి వారికి అందని ద్రాక్ష పళ్ళు. వాళ్ళది పసిపిల్లలకే సరైన ఆహారం పెట్టుకోలేని దుస్థితి. అందువల్లనే ఒక 'స్టానిక్' బలం మందు తాగేసి.. షార్ట్‌కట్‌లో పోషకాహారం లేని లోటు తీర్చుకుందామనే ఆశ! ఇన్నాళ్ళూ ఇంత చిన్న విషయం తెలీంది నాకే!

వాళ్ళు నండూరి సుబ్బారావు ఎంకిపాటలా చిలిపిగా వుండరు, వడ్డాది పాపయ్య వర్ణచిత్రంలా వయ్యారంగా వుండరు, బాపు బొమ్మలా అందంగా వుండరు. మరెలా వుంటారు? సత్యజిత్ రే హీరోయిన్లా బోల్డంత పేదగా, మురికిగా వుంటారు. మా.గోఖలే కథలా వాస్తవంగా వుంటారు. ఆరు సారాకథల ముత్యాలమ్మలా తెలివిగానూ వుంటారు. 

ఆ స్త్రీలలో చాలామందికి రాత్రిళ్ళంటే భయం. వారి భర్తలకి వీరి ప్రవర్తన పట్ల 'అనుమానం'! అందువల్ల  ఆ భర్తోత్తములు రాత్రిళ్ళు పూటుగా తాగొచ్చి, నాటుగా భార్యల్ని కొడతారు.

'అప్పుడు మీరు మీ పుట్టింటికి వెళ్లిపోవచ్చుగా?' అని ఆశ్చర్యంగా అడిగేవాణ్ని!

ఇట్లాంటి గొప్ప సందేహాలు పుస్తకాల ద్వారా ఆకలిని అర్ధం చేసుకుందామనుకునే అజ్ఞానులకి మాత్రమే కలుగుతాయనుకుంటా! ఎంతైనా - మధ్యతరగతి అజ్ఞానానికి అవధులుండవు!

'ఎళ్ళొచ్చు! కానీ - ఆడింకా గోరం. మా నాన రోజూ తాగొచ్చి అమ్మని సావకొడతా వుంటాడు. మా వదిన ఒకటే తిట్టుద్ది. అది తిండిక్కూడా గతిలేని పాడుకొంప. ఆడా బాదలు పడేకన్నా - ఆ చావేదో ఈడే చస్తే పోద్ది!'

వారిది చాలా ప్రాక్టికల్ థింకింగ్. నో నాన్సెన్స్ ఎప్రోచ్. (మనలా) ఆలోచనలో జీళ్ళపాకం సాగతీతలుండవు. థియరీ ఎండ్ ప్రాక్టీసులో అంతరాలుండవు. స్పష్టమైన అవగాహన, ముక్కుసూటి ఆచరణ వారి సొంతం.

ముగింపు -

పుస్తకములెన్ని చదివిననూ పాండిత్యము మాత్రమే వచ్చును గానీ, జ్ఞానము రాదు. తమ ఆకలి కబుర్లతో నా అజ్ఞానాన్ని పారద్రోలిన ఎందరో పేషంట్లు.. అందరికీ వందనములు.     

(picture courtesy : Google)

13 comments:

  1. ఇంతింత జ్ఞానం ఇచ్చే పల్లెలకు పోవటానికి నేటి వైద్యవిదార్థులకు ఎందుకు చిరాకు? డబ్బాట్టే రాలదనా?

    ReplyDelete
    Replies
    1. వారికి "ఫెసిలిటీస్" సరిపోవట! పైగా - నేన్రాసిన జ్ఞానం వారికి అనవసరం, శుద్ధ దండగ.

      Delete
  2. I STRONGLY CONDEMN JUDAS STRIKE.

    ReplyDelete
  3. నేనందుకే సర్విస్ లో చేరాను,
    ప్రాక్టిస్ జోలికే పోలేదు.
    బాగా వ్రాసారు.

    ReplyDelete
  4. //పుస్తకములెన్ని చదివిననూ పాండిత్యము మాత్రమే వచ్చును గానీ, జ్ఞానము రాదు. తమ ఆకలి కబుర్లతో నా అజ్ఞానాన్ని పారద్రోలిన ఎందరో పేషంట్లు.. అందరికీ వందనములు. //
    ఎంతమంచి డైలాగ్‌ చెప్పారు! కాదు కాదు సందేశం ఇచ్చారు. వీటి మధ్య చాలా అంతరమే ఉందే, నేను రెండు ఒకటే ననుకుంటున్నాను. నాకు గ్నానోదయం కలించారు. అయినా, పండితులైతే పదిమంది చేత పొగిడించుకోవచ్చు, గ్నానులై ఏమి సాదిస్తారు? బూడిద తప్ప. గ్నానులంటే ఎలాంటి గ్నానులు. ఆత్మ గ్నానులా, పరమ గ్నానులా? గ్నానులు మోక్షానికి మాత్రమే వెల్తారట! మోక్షానికి వెళ్లటనికి గ్నానులు కావలా? ఆ... ఉండండి సార్‌, ఇహం లేంది పరమెవడికి కావాలి? మీరుకూడా వాళ్లను పొగిడి నట్లు పొగిడి బ్లాక్‌ హోల్సులో తొస్తున్నారు.

    ReplyDelete
  5. టపాలో ఎర్త్ నవల ప్రస్తావన వచ్చింది కనుక...

    ఎర్త్ నవల్లో అధిక శ్రమతో డస్సి పోయి అక్కడికక్కడే పొలంలో పడి పాల్మీర్ మరణించే ఘట్టాన్ని ఇప్పటికీ నేను చాలా భయం భయంగా చదువుతాను.

    ఇంత దరిద్రం ఉంటుందా, ఇన్ని కష్టాలు ఉంటాయా అనిపించే పాల్మీర్ లాంటి జీవితాలు మన చుట్టూనే చాలా ఉంటాయి కానీ మీరన్నట్టు, మన పరిథిలో లేక పోవడం వల్ల వాటి మీద దృష్టి పడదు. పడినా పేజీ తిప్పినట్టు వెంటనే మరలి పోతుంది.

    ReplyDelete
  6. 1) 16000 mbbs doctors applied for 1100 vacancies 6months back.
    Where is deficit of mbbs doctors?
    2) 2000 specialist doctors applied for 500 specialist posts 6 months back......
    Where is the deficit of specialists?
    3) when govt has so many unemployed doctors or otherwise doctors striving for rural service then,why is govt not using them to fill on permanent basis?
    4) what is the need for govt to send 5000 u.g and 2000 p.g every year in the name of rural service when the deficiency shown by govt is less than 2000 which should have been filled on permanent basis
    5) in the name of rural service why is govt cheating public and media......
    As said by DME of Telangana "we are using masters in medical colleges for mci inspections,and throwing diplomas as required by deputations in district hospitals"
    Then,where the hell is rural service motto here?
    6) As per mci regulations during inspections number of SENIOR RESIDENTS are equally important just as number of assistants and associates for the grant of a medical seat......which should be filled every year by a proper notification just as AIIMS,PGI,JIPMER do......
    7)"aakali tho unnavaadi noti daggara koodu laakkoni, kadupu nindina vaadiki pettinattu undi"
    Those who have applied for permanent jobs are denied jobs and those who wish to pursue higher education or better training are forced to do cheap,one year use and throw slavery......
    8)Above all this who the hell gave this govt. the right to withhold original degree certificates even after successful completion of degree.
    9) How can govt make its own rule of registering doctors only after rural service....... So govt wants unregistered doctors for rural service and corporate,foreign trained doctors for their personal treatments...... According to MCI successful completion of masters or diploma gives them all rights to claim their registration.
    Withholding a persons original certificates is an OFFENCE but,govt is creating its only laws to cover its offences....,
    10) The most blunders of all, govt.says its been spending more than a crore for a medical student education.....if so , 6000 mbbs seats per year ( 6000 x 50 lakhs) 2000 pg seats per year (2000 x 1crore). You can calculate......it goes to more than 5000 crores....... But health and family welfare budget in total is never more than 500 crores.....which includes many more things apart from budget allocated to medical college alone.
    11) Ultimately if govt reserves its right to obtain its services from the junior doctors just because it has spent some money for their education (though this principle is against basic human rights,govt did not select students by choice,they have claimed these seats by merit) then govt.should start using all those passed out B TECH students for completion of pending Projects.......law students for clearing all lakhs of pending cases......all those degree students for clerical work in govt.offices in which a file does not move to next station for months.......because directly through fees reumbersement or indirectly through establishment of govt. colleges govt. Is spending 1000's of crores in all these fields of education.........
    WHY IN THE NAME (masked in the name)OF RURAL SERVICE A BUDDING DOCTOR IS BEING harrassed........
    If a doctor cannot understand this how can a normal person or a paid media can understand this........
    JUNIOR DOCTORS ARE NOT AGAINST RURAL SERVICES BUT AGAINST FALSE INTERPRETATIONS AND PRINCIPLES OF GOVERNMENT.


    If there are no doctors at rural areas. ... people and media will question government. ...

    If they have to employ permanent doctors. .. they have to pay more salaries. ...

    So... this is a cheaper TEMPORARY alternative. ..

    Government doesn't want better way of solving this problem. ... but just want to push the junior doctors to show the occupancy of vacancies. ...

    ReplyDelete
    Replies
    1. Superb. Doctors and students should fight against govt monopoly in medical education.

      Delete
    2. How can a Juda call himself as a doctor??? Florence Nightingale is better than this judos. You are aware why NRI's are joining their children in India in Medicine. why , cahduvu kontaniki , India Anuvina Desam. Can't Doctors(Judas) wait for 2 years to earn money by serving their own deprived people especially in Rural areas. How Dr. Rajasekhar is defending Judas , sorry I dont know.

      Delete
    3. మీరడిగన ప్రశ్నలన్నింటికీ మీకు సమాధానం చెప్తాను....

      ఇక్కడ రూరల్ సర్వీస్ చేయాల్సిన డాక్టరలంతా, వారి డిగ్రీ పూర్తి చేసిన వారు. ఇంతకుముందు డిగ్రీ చేతిలో పెట్టి వుద్యోగమో, ప్రైవేటు ప్రాక్టీసో చేసుకొమ్మని పంపేవాళ్ళని ఇప్పుడు రూరల్ సర్వీసు పేరుతో సగం జీతానికి ఇంకో సంవత్సరం చేయమంటున్నారు. కాబట్టి వారు డిగ్రీ ఇంకా చేతికివ్వలేదుగానీ, అచ్హంగా పూర్తి డాక్టర్లే.....

      మీకెవరైనా తెలిసిన జూడా వుంటే, ఇప్పుడు ఈ జూడాలకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తున్నారో కనుక్కోండి. రూరల్ పోస్టులు ఖాళీలు లేక ఎక్కడ చదివారో అదే కాలేజీలో 80% పని చేస్తున్నారు. ఒక వేళ 20% మందికి కావలిస్తే మిగిలిన 80% ని అనవసరంగా సమయం వృధా చేయాల్సిన అవసరం వుందా? (ఇంటర్ 17 సంll, MBBS 5 1/2 సంll, PG 3 సంll, రూరల్ సర్వీసు MBBS తరువాత 1 సంll, PG తరువాత 1 సంll, మధ్యలో సెకండ్ అటెంప్ట్ లు వుంటే ఇంకో 2 సంll, మొత్తం..... 30 నుండి 32 1/2 సంll. ఇంత దీర్ఘమైన కోర్సు ఇంకే ఫీల్డ్ లో నైనా వుందా? )

      ఒక పక్క 16000 మంది డాక్టర్లు, మాకు వుద్యోగాలు కావాలి మొర్రో అని మొత్తుకుంటుంటే....... మీకివ్వం అని జూడాలని సతాయించాల్సిన అవసరం వుందా?

      ఆ 1100 పోస్టులు ఒక్కసారి రెగ్యులర్ జాబ్స్ ఇస్తే ఈ సమస్య తీరిపోతుంది కదా?

      మీ వూర్లో ఒక ఆసుపత్రి వుందనుకోండి...... అక్కడ కొద్ది రోజులు నిలకడగా పని చేసే డాక్టరు వుండాలనుకుటారా లేక ప్రతి 12 నెలలకు మారే తక్కువ అనుభవం గల డాక్టరు కావాలనుకుంటారా మీరు?

      మన గ్రామీణ ఆసుపత్రుల్లో డాక్టర్లు తప్ప అన్నీ వున్నాయనుకుంటున్నారా? ఒక్కసారి వెళ్ళి చూడండి. జ్వరం మందులు, రెండు ఆంటిబయాటిక్కులూ, B కాంప్లెక్సు ఇంజెక్షన్లూ తప్ప ఇంకేమీ వుండవు. వీటి గురించి ఆలోచించే ఓపిక, అడిగే సమయం మీకూ, మీడియాకూ వుండవు.

      ఒక్క డాక్టర్లే ప్రజలు కట్టే పన్నులతో చదువుతున్నరన్నట్లు biased opinions ఇవ్వకండి.
      ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఇంకా ప్రతి డిగ్రీ విద్యార్థి ప్రజల డబ్బులతో చదివేవారే. ఇంకా ఇప్పుడు ఫీజు రీ ఎంబర్సుమెంట్ పేరుతో ఫీజులే కట్టేస్తున్నారు.

      పేదవారికి ఒక్క ఆరోగ్యం దొరక్కపోతేనే అన్యాయమా? వారికి తగిన రోడ్లు, ఇళ్ళూ, కరెంటూ ఇతర మౌలిక సదుపాయాలు, విద్య, న్యాయం, భద్రత ఇవన్నీ అవసరం కాదా? డాక్టర్లు తో పని చేయించి ఆరోగ్యం అందిస్తారు సరే.... మరి ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వీళ్ళూ కాస్త ప్రజలకోసం కొన్ని సంll పనిచేయచ్హుకదా !!!
      ఇప్పుడున్న వసతులతో పెండింగ్ లో వున్న కోర్టు కేసులు పరిష్కరించాలంటే 450 సంll పట్టే పవిత్ర భారతదేశం మనది. అయినా మన కోర్టులు 5 1/2 రోజులే పని చేస్తాయి, ఎండాకాలంలో 1 నెల కోర్టు మూసేస్తారు... లా చేసిన విద్యార్థులతో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నమేమైనా చేస్తున్నారా ఎవరైనా?
      కొన్ని లక్షల ఫైల్స్ పెండింగ్ లో వుంటాయి..... కోట్ల మంది వాటి కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరుగుతుంటారు.

      చదివినందుకు చేతిలో డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టడం తప్ప, వారికి తగిన వుద్యోగం చూపించడం తెలియని....
      అలా వుద్యోగం చేయించి వారిని దేశం కోసం వాడుకోవాలని తెలియని, చేతగాని ప్రభుత్వం మరియు వారి విధానాలు వున్న దేశం ఇది.

      మీరంటున్న చదువు "కొనడం" అన్నది ఒక్క MBBS లో మాత్రమే కదు, ఇప్పుడు ప్రతి చదువూ కొనబడుతున్నదే...... సో అది ఇక్కడి టాపిక్ కు సంబంధం లేని వాదన.

      కాస్త సింపుల్ గా చెప్పాలంటే బయటకు చిన్న పుండులాగా కనిపించే కాన్సర్ లాంటిది ఈ పరిస్థితి....
      వున్న సమస్య లోతు తెలియకుండా, తెలియనీయకుండా పైనున్న పుండుకు కట్టు కట్టడం లాంటిది ఈ "జూడాలతో రూరల్ సర్వీస్"

      ఇంకో విషయం....
      ఈ రూరల్ సర్వీసుకి MBBS డాక్టర్లు సరిపోతారు. PG చేసిన స్పెషలిస్ట్ (నరాలు, గుండె, కంటి) డాక్టర్లను ఏ సదుపాయాలూ లేని చోట, వారు నేర్చుకున్నది ఏదీ చేయలేనిచోట పని చేయమని చెప్పడం ఏ విధంగా న్యాయం?

      MBBS చదివారుకదా మరి ఈ మాత్రం చేయలేరా అనచ్హు.... అక్కడికి తగిన వైద్యమేమో అదే చేయండి అనీ అనచ్హు.....

      మీరొక M.Sc, M.Edకెమిస్ట్రీ లెక్చరర్ అనుకోండి...... మిమ్మల్ని 5వ తరగతికి పాఠాలు చెప్పమంటే ఎలా వుంటుంది? ఆలోచించండి.....



      ప్రాణాలంటే మీకు లెక్క లేదా అని ఎమోషనల్ గా మాత్రమే ఆలోచిస్తే ఇక లాజిక్ కి చోటుండదు.....
      ఎమోషనల్ గా ఆలోచిస్తే ఏడుపొస్తుందేమో కాని, ఇప్పటి పరిస్థితిలో మార్పు మాత్రం రాదు.....

      Delete
    4. You can look into one more detailed analysis about this issue here.

      http://www.thehealthsite.com/diseases-conditions/the-govts-decision-to-send-inexperienced-mbbs-doctors-to-rural-india-is-flawed-expert-interview/

      Delete
  7. రాజశేఖర్ గారు కళ్లు తెరపించారు. మీవివరణ లో నిజాలు ఉన్నాయనిపిస్తున్నాది.

    ReplyDelete
    Replies
    1. Sri ram garu, think in positive way and in the national interest. Just think once again.

      Delete

comments will be moderated, will take sometime to appear.