Friday, 14 November 2014

తూచ్! 'పని లేక.. ' పేరు మార్చట్లేదు


నా బ్లాగు పేరుని చిత్తూరు నాగయ్యలా మృదువుగా, ఎస్వీరంగారావులా బరువుగా, గుమ్మడిలా గంభీరంగా మారుద్దామనుకున్నాను.

ఇంతలో -

సినిమాల్లో తాళి కట్టే ముందు 'ఆగండి!' అని కేక వేసినట్లుగా..

శంకరాభరణం శంకరశాస్త్రి 'శారదా!' అని అరచినట్లుగా..

'ఈ బ్లాగ్ పేరు మార్చడానికి మేం ఒప్పుకోం!' అంటూ గద్దించారు కొందరు మిత్రులు.

మీకు 'పని లేక.. ' పేరే అంత బాగుంటే - దాన్ని మార్చి నే బావుకునేదేమిటి?

ఏవీఁ లేదు.

కాబట్టి - ఇలా 'పని లేక.. ' గానే మిగిలిపోదామనుకుంటున్నాను.. మిగిలిపోతున్నాను!

గమనిక -

ఇప్పుడీ పోస్ట్ హడావుడిగా ఎందుకు రాశానంటే - ఈ విషయం ఇంతటితో వదిలేద్దామని తెలియజెయ్యడానికి..

(picture courtesy : Google)

9 comments:

  1. సారీ డాట్రరూ. పనుంది. ఆనక కనిపిస్తాను.

    ReplyDelete
  2. మీరు పనిలేక రాస్తుంటే, మేమంతా పనిలేక చదువుతుంటే మధ్యలో పనిలేక పిల్లితల గొరిగినట్టు పనిలేక పేరు మార్చడమేమిటండీ పనిలేక పోతేనూ!

    ReplyDelete
  3. శుభం.
    దీన్నే wiser counsels prevailed అంటారు :))

    ReplyDelete
  4. మీ రు ' పని లేక ' రాస్తేనే డీప్‌ గా రాస్తారు. అల్పజీవుల గురించే రాయండి!

    ReplyDelete
  5. క్షణ క్షణముల్ మానసిక వైద్యుల చిత్తముల్!!

    చీర్స్!
    జిలేబి

    ReplyDelete
  6. Good ! పేరు మార్పు నిర్ణయాన్ని మార్చుకోవడం మంచి నిర్ణయం !! :))

    ReplyDelete
  7. a peru ina okka te doctor gaaru, peru lo amundi pennidi, mee blog lo undi pasa. adi chaalu. keep it up.
    regards,
    paturi,

    ReplyDelete
  8. గుండెపోటు గుమ్మడి "బాబూ" అని పిలిచినట్లు కూడా అనిపించాలే!

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.