Wednesday 14 March 2012

రాహులుని రోదన

అది టెన్ జన్‌పథ్. విశాలమైన ఇల్లు, పొడవాటి వరండా. చిన్నబాబు రాహుల్ గాంధి సీరియస్‌గా వున్నాడు. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయ్. వరండాలో రాజ్యసభ సభ్యత్వం అడుక్కోడానికి వచ్చిన లీడర్లు గొడవారా వేసున్న చెక్కబల్లల మీద కునికిపాట్లు పడుతున్నారు. రాహుల్ బాబుని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడి, తొట్రుపడుతూ గబుక్కున నించొని, వొంగొంగి నమస్కారాలు చేశారు. రాహులుడు వారిని కన్నెత్తి కూడా చూళ్ళేదు.

గదులన్నీ దాటుకుంటూ సరాసరి తల్లి బెడ్రూంలోకి వెళ్ళాడు. సోనియా గాంధి మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంది. కొడుకు వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచింది.

"రా నాన్నా రా! ఇలావచ్చి నాపక్కన కూర్చో!" అంటూ ఆప్యాయంగా పిలిచింది.

రాహులుడు తల్లి పక్కన కూర్చున్నాడు. దిగులుగా ఉన్న కొడుకుని చూసి కంగారుపడింది సోనియా.

"ఎలక్షన్లలో ఓడిపోవడం బాధగానే ఉంటుంది కన్నా! గడ్డం చేయించుకొమ్మంటినే. అసలే ఎండాకాలం, దురద పెడుతుంది నాయనా." నీరసంగా అంది సోనియా.

రాహుల్ ఒక్కసారిగా చిన్నపిల్లాళ్ళా భోరున యేడవడం మొదలెట్టాడు! 

సోనియా భయపడిపోయింది. కొంపదీసి రాహుల్ని గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసిందా ఏమిటి! 

కొద్దిసేపటికి తేరుకున్నాడు రాహుల్, కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాడు.

"అమ్మా! మనం మన ఇటలీ వెళ్లిపోదాం, ఈ దేశంలో ఉండొద్దు." ఏడుపు గొంతుతో అన్నాడు.

"ఏమైంది నాన్నా!" కన్నతల్లి తల్లడిల్లిపోయింది.

రాహుల్ గాంధి జేబులోంచి సెల్ ఫోన్ తీశాడు.

"పొద్దున్నించి వొకటే మెసేజిలు, చూళ్ళేక చస్తున్నా!" అంటూ ఫోన్లో మెసెజిలు తల్లికి చూపించాడు.

"విషయం ఏంటి బంగారం!" అయోమయంగా అడిగింది సోనియమ్మ.

"కంగ్రాట్స్ రాహుల్. ఎ కరెక్ట్ డెసిషన్ ఎట్ కరెక్ట్ టైం. వి ఆర్ ఎరేంజింగ్ ఎ ఫేర్ వెల్ పార్టీ టు యు." అన్న మెసేజ్‌ని తల్లికి చూపించాడు రాహుల్.

"ఎవరికో పంపాల్సిన మెసేజ్ పొరబాటున నీకు పంపారు కన్నా! డోంట్ వర్రీ." ధైర్యం చెప్పింది సోనియా.

"నా ఏడుపూ అదేనమ్మా! రిటైర్ అయ్యింది క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. జనాలేమో నేను రిటైరయ్యాననుకుని పండగ చేసుకుంటున్నారు! నా రిటైర్మెంటుని స్వాగతిస్తూ వేలకొద్ది మెసేజ్‌లు వస్తున్నాయమ్మా. మొదట్లో నేనూ పొరబాటున పంపుతున్నారనుకున్నాను, కానీ కాదు. రాహుల్ అంటే నేనేననుకుని ప్రజలు నా రిటైర్మెంటునే స్వాగతిస్తూ పండగ చేసుకుంటున్నారు!" మళ్ళీ బావురుమన్నాడు రాహుల్ గాంధి.

సోనియాకి రాహుల్ని ఎలా ఓదార్చాలో తెలీక అయోమయంగా చూస్తుండిపోయింది!

19 comments:

  1. అదిరింది గురువా..
    వేసుకో మూడు వీర తాళ్ళు
    - పుచ్చా

    ReplyDelete
  2. వొహొ వొటరా! ఇదిగొ ఇంకొ వీరతాడు!

    భలె భలె అయనను మకెలా మాచర్మము బహు మందముకదా 2014 కు కొద్దిగా ముఖము కడుగుకొని తయారు అవితెచాలదా మరలా జైకొట్టటానికి ఆంధ్రకాంగ్రెసాసురులు సిగ్గు యెగ్గు లెకుండా జయ జయద్వనాలు ప్రారంభించెదరుకదా. మాకు రాహుల్ అన్న నామధెయము అచ్చిరావటం లెదు దినికన్న ఉత్తరకుమార్ ఈనామము యెలాగుండును..........

    ReplyDelete
  3. "నా ఏడుపూ అదేనమ్మా! రిటైర్ అయ్యింది క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. జనాలు నేను రిటైరయ్యాననుకుని సంతోషిస్తున్నారు!

    హహహహహ:):) డాక్టరు గారూ ఈ టపాకి ఒక వంద వీర తాళ్ళు పడతాయి చూడండి మీకు..అప్పుడు మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం శత వీర తాళ్ళ టపా అని.. నా తరపు నుంచి పది వీర తాళ్ళు...:):):)

    ReplyDelete
  4. అబ్బ అబ్బబ్బా!
    అస్సలు కుదర్దు!
    మా బాల కృష్ణ మీద ఐతే ఇంత పొడుగు టపా రాస్తారు,అది ప్రతి రెండు టపా లకి ఒకసారి నామస్మరణ చేస్తారు!
    మరి ఈ రాజకీయ బాల కృష్ణుడి గురించి ఇంట చిన్న టపా ఐతే ఎలాగండి!
    అన్నిటికి సమవర్తి సమ న్యాయం పాటించాలి మరి.

    ఏదో సరదాకి అన్నాను :-) ఈ కామెంట్ కోడిగుడ్డు కి ఈకలు పీకొద్దు బాబోయ్!

    ReplyDelete
  5. ఫినిషింగ్ టచ్...సరదాగా..

    సోనియా: రాహుల్ మైనే కహా థా, యుపి చలా జాయేగా...

    (ఒక పాత యాడ్ గుర్తు తెచ్చుకోండి. అందులో యుపి కి బదులు పానీ అని ఉంటుంది)

    ReplyDelete
  6. సూపర్...అదిరింది చెణుకు :)

    ReplyDelete
  7. మితృలారా

    ధన్యవాదాలు. మరీ వీరతాళ్ళు ఎక్కువయినా మెడ పట్టేస్తుంది. అసలే చేతి నొప్పితో బాధ పడుతున్నా (ఈ మధ్య ఒక పేషంట్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లే ఇచ్చి.. చెయ్యి మెలిపెట్టేసాడు). ఇప్పుడు మెడ నొప్పి తొడయితే నా పరిస్థితేం గాను?

    మధ్యాహ్నం బేరాల్లేవు (పేషంట్లు లేరు. ఈ మధ్యన పేషంట్లకి కూడా అర్ధమవుతున్నట్లుంది.. డాక్టర్లు చేసి చచ్చేదేమీ లేదని!). ఖాళీగా ఉండి.. చంపడానికి ఈగలు, దోమలూ కూడా లేక.. ఈ టపా రాశాను.

    మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  8. "ఎవడికో పంపాల్సిన మెసేజ్ పొరబాటున నీకు పంపారు నాన్నా! డోంట్ వర్రీ." ధైర్యం చెబుతున్నట్లుగా అంది సోనియా.
    రమణ, సరదాకి వ్రాసినా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. ప్రజలేమనుకున్నా, పైకి ఏమనినా ఏమాత్రమూ "సిగ్గు" పడకుండా మనలను కాదులే అని వారికి వారు నచ్చచెప్పుకుంటారు.
    చాలా బాగున్నది.

    ReplyDelete
  9. డాక్టరుగారూ,

    క్రికెటరు రాహుల్ ఆడి ఆడి అలసిపోయి నాడు.
    ..... అతనే హుందాగా రిటైరయ్యాడు
    రాకుమార్ రాహుల్ ఓడి ఓడి అలసిపోయి నాడు
    ..... అతన్ని జనం రిటైరు చేసేస్తున్నారు

    ReplyDelete
  10. On call today...late in reading this. A good Twist that I haven't expected. Like others said, Good one. At your request No veerataallu and no shakehand!

    ReplyDelete
  11. ..బాగుందే...వీరతాడు ఒకటీ!

    ReplyDelete
  12. డాక్టరు గారు,

    ఈ రాహులూ, సోనియామాత, వీళ్ళంతా ఎవరండీ ? ఇండియా లో ఉంటూంటారా?

    జిలేబి.

    ReplyDelete
  13. డాక్టర్ గారూ,

    అందుకే నేను ఇంతకు ముందే అడిగా కాంగ్రెస్స్ జాతీయ ప్రదాన కార్యదర్శి మరియు భావి ప్రధాని అవ్వడానికి రాహుల్ కి వున్న అర్హతేమిటి,జగన్ కి ముఖ్యమంత్రి కావడానికి లేని అర్హతేమిటి అని.
    కాంగ్రెస్స్ ను మన రాష్త్రం నుండి వదిలిస్తే మనకు పట్టిన దరిద్రం కూడా వదిలిద్ది ఎందుకంటే అప్పుడు రెండే ప్రాంతీయ పార్టీలు వుంటాయి కాబట్టి.

    రమేష్ బాబు గుడివాడ

    ReplyDelete
  14. వీల్ల సంభాషన మొత్తం ఇటలి భాష లొ జరుగుతుందనుకుంటా...కాని నేను గమనించింది ఏమంటే...ఒక్క రాహుల్ గాంధీ పొస్ట్ పైనే ఎటువంటి చర్చ లేకుండా మన బ్లాగ్మితృలంతా...ఏకగ్రీవంగా డాట్రారుని సపొర్ట్ చెసారు

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.