Monday 26 March 2012

కళాపోషణ

ఆయనో ప్రముఖ కాంట్రాక్టర్, కాంగ్రెస్ నాయకుడు, నిష్టాగరిష్టుడు. తన పుట్టిన్రోజు కళారంగానికి సుదినం అని ఆయన అభిప్రాయం. ఆయనకా ఆభిప్రాయం వుండటంలో ఆశ్చర్యం లేదు! కానీ ఆయనగారి ఆతిధ్యం పొంది ఆయన్ని కీర్తించడానికి అనేక ప్రముఖులు క్యూ కట్టడం మాత్రం ఆశ్చర్యకరమే! 

కళలు నానావిధములు. ప్రజలకి పనికొచ్చే కళలు, ప్రజలకి పనికిరాని కళలు. ఈ కళాకారుల్లో కొందరికి ఆర్ధికంగా దుస్థితి అయితే మరికొందరిది గుర్తింపు కోసం వెంపర్లాడే దుస్థితి. వీళ్ళంతా యేదోరకంగా డబ్బు సంపాదించినవారి పంచన చేరి, వారిని మెప్పించి తమక్కావలసిందాన్ని సంపాదించుకుంటారు.      
               
పూర్వం రాజులు తమ యుద్ధవ్యాపకాలు, ప్రజల నడ్డివిరిచే పన్నుల వసూళ్ళూ వంటి పనుల్లో బిజీగా వుండేవాళ్ళు. ఈ పన్లయ్యాక సేద తీరడానికి వారికి వినోదం అవసరమయ్యేది. అందుకోసం రాజులకి సంగీతం, నృత్యం, కవిత్వం తెలిసిన కళాకారుల్తో పని పడేది. రాజులు వారి దగ్గర్నుండి కొద్దిగా వినోదం పొంది, ఇంకొద్దిగా కీర్తింపచేసుకుని ఖరీదైన బహుమానాల్ని దానంగా ఇచ్చేవారు. 

ఈ కళాకారులు రాజుల చల్లని నీడలో సుఖంగా సేద తీరుతూ ప్రబందాలు, కవితల్నీ రాసేవాళ్ళు. వీళ్ళు బ్రతక నేర్చిన కళాకారులు, అందుకే పొరబాటున కూడా ప్రజల పక్షాన మాట్లాడరు. 'ఓ రాజా! పొరుగు రాజ్యాల మీదకి అనవసరంగా యుద్ధానికి పోనేల? ఈ సంవత్సరం కరువొచ్చిందికదా! పన్నులో ఓ దమ్మిడీ తగ్గించరాదా?' అని సలహాలిస్తే రాజుపక్కనుండే సేనాపతి తక్షణం శిరచ్చేదన కావిస్తాడని వీరికి తెలుసు.

గుప్తుడి స్పాన్సర్డ్ కవులు గుప్తుల కాలం స్వర్ణయుగమనీ, కృష్ణదేవరాయలు స్పాన్సర్డ్ కవులు రాయలవారి పాలనలో రత్నాలు రాసులు పోసుకుని అమ్మేవారని రాసుకుంటూ (యే ఎండకా గొడుగు పడుతూ) స్వామికార్యము, స్వకార్యము చక్కపెట్టుకున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు తమ విధేయులకి పద్మ అవార్డులు ఇచ్చినట్లే.. ఆరోజుల్లో రాజులు కవులకి, కళాకారులకి కాళ్ళూ చేతులకి కంకణాలు, కడియాలు తొడిగేవాళ్ళు.     
                 
కాలక్రమేణా రాజులు అంతరించిపొయ్యారు. వారి స్థానంలో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు వచ్చి చేరారు. ఆనాటి రాజులకి మల్లె ఇప్పటి డబ్బున్నమారాజుల్లో కొందరికి 'కలాపోసన' అనే దురదుంది. సహారా బాబు ప్రపంచ సెలెబ్రెటీలకి తన లోయనగరంలో 'సపరివార ఆతిథ్యం' ఇస్తాడు. విజయ మల్లయ్య కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కోసం కోట్లు గుమ్మరిస్తాడు, ముద్దుగుమ్మల్తో జల్సా చేస్తాడు. కాంట్రాక్టర్ తన పుట్టిన్రోజున నచ్చినవారికి అవార్డులు (?) ఇస్తాడు.

మా సుబ్బు ఇట్లాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకొమ్మమంటాడు.

"నువ్వు వ్యక్తులకి ఉండని, ఉండాల్సిన అవసరం లేని గొప్పగుణాల్ని ఆపాదిస్తున్నావ్. అక్కడ ఇచ్చేవాళ్ళకీ, పుచ్చుకునేవాళ్ళకీ, పొగిడే ప్రముఖులకీ ఎవరి లెక్కలు వారికున్నయ్. లెక్కల్లేనిదల్లా వాళ్ళని సీరియస్‌గా తీసుకునే నీకే! లైట్ తీస్కో బ్రదర్!" 

ఎస్, సుబ్బూ ఈజ్ రైట్!

36 comments:

  1. డాక్టర్ గారు,
    పొరబాటున కూడా ఏ కుండలు చేసేవాడి మట్టి మీదనో, రాళ్ళు కొట్టేవాడి చెమట మీదనో రాయలేదు.

    ఇప్పుడు రాజులు లేరు. వారి స్థానంలో రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు ఉన్నారు. పూర్వం రాజులు ప్రాణాలకి తెగించి యుద్ధాలు చేశారు. ఇప్పుడు లాబీయింగ్, పర్సెంటేజ్ ఫిక్సింగ్, కబ్జాయింగ్, లూటింగ్.. యుద్ధమంత రిస్క్ కాదు.


    'చూడు రెడ్డి! నీ పుట్టిన రోజు స్వాతంత్ర్య దినంలాగా జరపనక్కర్లేదు. డిల్లీ పెద్దలకి అత్యంత ఖరీదైన బహుమతులు లంచంగా ఇవ్వకు. వాళ్ళని వల్లో వేసుకోడాని డిల్లీలో నువ్విచ్చే అర్ధరాత్రి పార్టీలు మానెయ్యి.' అని సుబ్బిరామిరెడ్డికి ఎందుకు చెప్పరు?

    వీళ్ళు ప్రజా కళాకారులు కాదు. కేవలం వృత్తి కళాకారులు. అనగా ఒకాయన డబ్బులిస్తే నటిస్తాడు. సావిత్రేనేం ఖర్మ! బల్లనీ, కుర్చీని కూడా ప్రేమిస్తాడు.

    సుబ్బిరామిరెడ్డికి పేద కళాకారులతో ఏం పని? నాకు తెలిసి ఆయన తన ఇమేజ్ పెంచుకొడానికి పనికొచ్చే పెద్ద వాళ్ళకి మాత్రమే సన్మానాలు చేస్తాడు. ఇంకెవ్వర్ని పట్టించుకోడు." అన్నాడు సుబ్బు.

    అక్కినేని, నారాయణరెడ్డి వృద్ధులు. పొద్దస్తమానం ఇంట్లో కూర్చుంటే వాళ్ళకీ విసుగనిపిస్తుంది. అందుకే ఈ వృద్ధులు ఎవరు పిలిచినా వెళతారు. ఒక శాలువా కప్పించుకుంటారు. వీలైతే నాలుగు మంచి ముక్కలు చెప్తారు. అన్నం తినే టైమవ్వంగాన్లే ఇళ్ళకి పొయ్యి నాలుగు మెతుకులు తిని ఇన్ని మాత్రలేసుకుని నిద్రోతారు.. పొద్దున్నే వాకింగ్ చెయ్యాలిగా. దీన్ని కూడా విమర్శిస్తే ఎలా? లైట్ గా తీస్కో!" అంటూ ముగించాడు సుబ్బు.

    ఆద్యంతం సూపర్బ్ సర్,


    రమేష్ బాబు గుడివాడ

    ReplyDelete
  2. అదృష్ట్టమంటే నారాయణ రెడ్డి గారిది. రామారావు సినేమాలకు పాటలు రాసి, వ్యక్తిగత పరిచయం వలన తెలుగు దేశం పార్టి అధికారంలో ఉన్నపుడు పదవులు పొందేవాడు, అలాగే కాంగ్రెస్ పాలనలో చుట్టరికాలతో
    ఆపదవిని నిలబెట్టుకొని, ప్రభుత్వం మారిన తరువాత కొనసాగే వాడు.

    ReplyDelete
  3. అక్కినెని గారి పీనాసి తనం, ధనం పట్లవారి కాంక్ష తెసినవారు యెవరు ఇందులొ ఆశ్చర్యపడరు. ఇక సినారె గారు వారికి తొడు బొయనవారు.ఇద్దరు వేదికపులులు భలె భలె మాటలు చెపుతారు ఉత్త యుగలసన్నాసులు, దొందు దొందు. ఇక నత్తి సుబ్బా గారికి కీర్తి కండూతి.మరి ముగ్గురు కలెస్తె వచ్చేది వెధవత్రయం వారికి యాచక ఆలొచనలు లుప్తబుద్దులు వున్న మహగుణత్రయం. సొ వారు పరమ పక్కా వె........

    ReplyDelete
  4. ఎవడి అభద్రత వానిది,
    ఏదో ఒకటి చేయక పొతే ఎలా మరి అందరి నోళ్ళలో నానేది..

    ReplyDelete
  5. ఏమండోయ్ డాటేరు గారు,

    మీ మీద పరువు నష్టం దావా ఏమన్నా రాగల దేమో,

    కాస్త జాగ్రత్త గా ఉండండి!

    రెండు, రెడ్డి గారు మంచి సంఘ సేవకులని విన్నానే? అందుకే వారి గురించి ఆ పెద్దవాళ్ళు నిజం చెప్పి ఉండ వచ్చు గదా ?

    మూడు, డబ్బున్న వారంతా 'ఉడాలు' వారే నంటారా ?

    జిలేబి.

    ReplyDelete
  6. బాగా చెప్పారు, శ్రీశైలం ప్రాజెక్టులో బాగా నొక్కేసిన సురారెడ్డి గారికి చిత్తశుద్ధిలేని శివపూజలన్నా, సినీకళాకరులంటే అదో ఇదిలేండి.
    వేతనశర్మ కథ మీనుండి వినాలని కుతూహలంగా వుంది.

    ReplyDelete
  7. ఆ రోజుల్లో రాజభజన, ఈ రోజుల్లో చెక్క భజన అంతా డబ్బు చుట్టు తిరుగుతుంది అని
    చెప్పిన మీ అర్టికల్ చాలా నచ్చింది.. ఆయితే మనం చరిత్రలో అయా రాజుల గురించి, అనాటి కవులు
    గొప్పగా వర్ణించింది కూడా ఈ విధంలోకి వస్తుందనుకుంటానండీ.... యధా రాజా.. తధా కళాకారులు..

    ReplyDelete
  8. ఎటూ సుబ్బి రామిరెడ్డి మీద రాశారు. లాజిక్ స్పాన్సర్ చేసినందుకు ఎముకల డాక్టరు మిత్రుడికి కూడా ఏదో ఒక బిరుదు కలపొచ్చుగా...... బొమికల బంధు, పిండికట్టు ప్రపూర్ణ లాంటివి..... మరీ సాదా సీదాగా వట్టి చిరకాల మిత్రుడేనా?

    ReplyDelete
  9. జయహో గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  10. ramesh babu alapati గారు,

    రాహుల్ గారు,

    వ్యాఖ్యకి ధన్యవాదాలు.

    ReplyDelete
  11. జిలేబి గారు,

    తెలుగు బ్లాగులు చదివేవాళ్ళు చాలా చాలా తక్కువ. చదివి దావాలు వెయ్యడం కూడానా!

    'ఉడాలు' అనగానేమి?

    ReplyDelete
  12. SNKR గారు,

    'వేతనశర్మకథ' అనునది ఒక మహానుభావునిచే రచించబడిన ఒక మహాద్భుత కథ. చదవని వారి జన్మ వ్యర్ధము. చదివి ఆనందించిన వారి జన్మ చరితార్ధము!

    ReplyDelete
  13. Meeru intha serious ga raastharari expect cheyaledu Ramana garu, Chala bagunnayi mee postulanni, Varam krindate oka mithrudi dvara mee blog choosi kuthoohalamga motham anni postulanni chadivesanu, Adbhuthamuga raasthunnaru, Krithagnabhinandanaalu
    -Dr Ramesh Babu Bobbili

    ReplyDelete
  14. రాజీవ్ రాఘవ్ గారు,

    గవర్నమెంట్ ఉద్యోగస్తుడు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రాయలేడు. అందుకే నరసింగరావు బీనాదేవిగా మారిపోయాడు.

    emergency గుర్తుంది కదా!

    ప్రజాస్వామ్యంలోనే లేని స్వేచ్చ రాజుల కొలువులో ఎలా ఉంటుంది? కాబట్టే మనకి పొగడ్త సాహిత్యం!

    ReplyDelete
  15. @Chandu S,

    ఎలాగూ మీరీ కామెంట్ రాస్తారని తెలుసు. అందుకనే విశేషణాలు జోడించలేదు!

    మా హరిబాబు బొమికలకే కాదు.. స్నేహితులకి కూడా ఆత్మబంధువే లేండి! మావాడు లేకపోతే మాకిక్కడ రోజు గడవదు.

    ReplyDelete
  16. Ramesh Bobbili గారు,

    నా బ్లాగులు ఓపిగ్గా చదవడమే కాకుండా.. బాగున్నయ్యంటూ మెచ్చుకుంటున్నారు. కృతజ్ఞతలు.

    నేను 'సీరియస్' గా రాయనండి. అంతా సరదా వ్యవహారమే!

    ఇంతకు ముందు బాగా చదివేవాణ్ణి. ఇప్పుడు కీ బోర్డ్ పని పడుతున్నాను. అంచేత చదవడం కొంచెం తగ్గింది.

    ReplyDelete
  17. Telugu(font)lo rayadamelago teliyajeyagalaru, Krithaganalatho..

    ReplyDelete
  18. అయ్యా మీకోసమే :)
    http://www.64kalalu.com/katha?start=5

    సారీ. పోస్ట్ కి సంబంధించిన విషయం కాదు.

    ReplyDelete
  19. ఆ.సౌమ్య గారు,

    రావిశాస్త్రి గూర్చి లింక్ చదివాను. ధన్యవాదాలు. పురాణం రావిశాస్త్రి భక్తి గూర్చి బాలికి చాలా కోపం ఉన్నట్లుంది. పాపం బాలి!

    ReplyDelete
  20. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.....

    ReplyDelete
  21. చాల రోజుల తర్వాత ఫుల్ మీల్స్! God Bless Subbu!

    ReplyDelete
  22. సుబ్బి చిచ్చీ - పసి వయసు
    సుబ్బీ - బాల్యం
    సుబ్బడు/సుబ్బి గాడు - స్కూలు వయసు
    సుబ్బు / సుభాష్ - కాలేజీ
    డాక్టర్ సుబ్బు /సుబ్రావ్ - ప్రొఫెషనల్
    సుబ్బా రావు - గృహస్తు
    డాక్టర్ సుబ్బా రావు గారు - మేధావి

    అండ్ ఫైనల్లీ.....

    సుబ్బానంద సరస్వతి - స్వామిజి/సన్యాసి .

    ReplyDelete
  23. మీ సుబ్బు చెప్పినట్టు, సినారె, అనారా లు టైంపాస్ కోసమో, మొహమాటం కోసమో వెళ్ళి ఉంటారు.
    పాపం డబ్బు కోసం అయ్యుండదు.

    ReplyDelete
  24. kastephale గారు,
    Krishna Palakollu గారు,
    bonagiri గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  25. అదేమిటండీ...కొత్త పోస్టుకి కామెంట్స్ disable చేసారు? నా కామెంటు ఇది

    "అద్భుతం మాస్టారూ....పుస్తకం విలువని ఒక్క టపాలో చూపించేసారు!"

    ReplyDelete
  26. ఆ.సౌమ్య గారు,

    ధన్యవాదాలు.

    నేనే పాపము ఎరుగను. నా కామెంట్ బాక్స్ కి పిచ్చెక్కింది. వదిలించటానికి ప్రయత్నిస్తున్నా. కుదరటం లేదు.

    ReplyDelete
  27. రోకలి తలకి చుట్టండి :))

    ReplyDelete
  28. @బొనగిరి,

    వాళ్లిద్దరు వేళ్లడానికి ఇంకొక కారణం కూడా వుండి ఉండవచ్చు. పని చేసే మానేజర్ దగ్గర, ఇంట్లొ పేళ్లాందగ్గర ఖాళీగా, పని లేకుండా కనిపిస్తే వారు తట్టుకోలేరు. సాధారణంగా మగవారు ఎప్పుడు భార్య కొరకు , ఆమే పిల్లలు కొరకు కష్ట్టపడి, చచ్చే వరకు సంపాదిస్తూ వారికి దోచి పెట్టాలి. లేకపోతే సహించలేరు. ఇది పేరు ప్రఖ్యాతులు,కోట్లు సంపాదించినా మగవారికి కూడా వర్తిస్తుంది. వారు ఖాళీగా ఉండకుడదు. ఒక వేళ అలా ఉంటే వారి విలువ, భార్య దగ్గర పడిపోతుంది. సమయం చిక్కినప్పుడల్లా, నువ్వేమి కష్ట్టపడ్డావు, పిల్లల్ను పెంచటానికి నేను ఎన్ని త్యాగాలు చేశానని ఏకరువుపేట్టటం మొదలు పేడతారు. కనుకనే ఇటువంటి వారు సభలకు, సన్మానలకు వెళ్లి తమ విలువను ముసలి వయసులో కూడా తగ్గ కుండా, జాగ్రత్తగా కాపడుకొని, వీలైతే పెంచుకొంట్టూంటారు. సన్మానం కొరకు వేరే ఊరికెళ్లటం ,అక్కడ హోటల్ లో బస చేయటం, ఆ వూరిలో కనిపించిన వస్తువులు, చీరలు, నగలు కొని భార్యకు తెచ్చి ఇస్తే ఆమే సంతోషిస్తుంది. ఇక ఈ ముసలి మొగుళ్లకి, నేను చూడు ఎంతమంచి వాడిని, నా భార్యను ఈ వయసులో కూడా ప్రేమగా చూసు కొంట్టున్నాను. రాముడి కన్నా మంచి వాడిని కదా అని అనుకొంట్టుంటారు :)

    ReplyDelete
  29. "పొద్దస్తమానం ఇంట్లో కూర్చుంటే వాళ్ళకీ విసుగనిపిస్తుంది. అందుకే ఈ వృద్ధులు ఎవరు పిలిచినా వెళతారు. ఒక శాలువా కప్పించుకుంటారు. వీలైతే నాలుగు మంచి ముక్కలు చెప్తారు. అన్నం తినే టైమవ్వంగాన్లే ఇళ్ళకి పొయ్యి నాలుగు మెతుకులు తిని ఇన్ని మాత్రలేసుకుని నిద్రోతారు.. పొద్దున్నే వాకింగ్ చెయ్యాలిగా. దీన్ని కూడా విమర్శిస్తే ఎలా? లైట్ గా తీస్కో!"

    బ్రహ్మాండమయిన ముగింపు.

    ReplyDelete
  30. @Ramesh Bobbili,

    you may try lekhini or google transliteration in telugu or aksharamala.

    Or ask google for telugu typing. you'll get lot more options.

    thank you.

    ReplyDelete
  31. Rao S Lakkaraaju గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  32. రమణ గారు,

    ముందు గా నేను రాసే ఈ వ్యాఖ్య వ్యక్తిగత విమర్శగా గా తీసుకోకండి. ఎంతో మంది ఈ టపాను చదివినా ఒక్కరు కూడా తమ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చాలా ఆశ్చర్యం వేసి నా అభిప్రాయం రాస్తున్నాను. పేదవారి కోణం నుంచి చరిత్రను చూస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరిని విమర్శించవచ్చు. పోని పేద వారు సాధించిన విజయాlu ఎమైనా ఉన్నాయా, వాటిని అనుసరించి జీవితం గడపటానికి అని ఆలోచిస్తే, పేదరికమన్న ఆలోచనే మనుషులకు భయాన్ని కలిగిస్తుంది, అనుసరించటం తరువాత సంగతి. గత చరిత్రను, కొత్త సిద్దాంతల కోణం లో చూస్తే అన్ని తప్పులే కనిపిస్తాయి.

    * రావిశాస్త్రి లాంటి ప్రజా రచయితలకయితే ఇబ్బంది గాని. వీణ వాయించుకునే వాళ్లకి, దేవుళ్ళ పాటలు పాడుకునేవారికి ఇబ్బంది ఎందుకుంటుంది?*
    మీరు పోతన, త్యాగయ్యా, అన్నమయ్య, రామదాసు మొద|| వారినే తీసుకొంటే వారేవ్వరు, రాజుగారికి వత్తాసు పలికి పేరు ప్రఖ్యాతులు,ధనం సంపాదించుకోలేదని అర్థమౌతుంది. వీరు దేవుడి పాటలు పాడుకొన్నా, కొందరు ఎన్నో కష్ట్టాలు పడలేదా?

    *అష్టదిగ్గజాలని స్పాన్సర్ చేసిన శ్రీక్రిష్ణదేవరాయలు క్లాసిక్ ఎగ్జాంపుల్. గుప్తుడి స్పాన్సర్డ్ కవులు గుప్తులకాలం స్వర్ణయుగమనీ, కృష్ణదేవరాయలవారి స్పాన్సర్డ్ కవులు రాయలవారి పాలనలో రత్నాలు రాశులు పోసుకుని అమ్మేవారని (లౌక్యంగా) రాసుకుంటూ (ఏ ఎండకా గొడుగు పడుతూ) స్వామికార్యము.*

    ఇక ఈ టపాలో మీరు వెల్లడించిన అభిప్రాయాలు మార్క్సిజం కోణంలో/ప్రభావంతో కొంతమంది రచయితలు ఇలాంటి అభిప్రాయాలను వ్యక్త పరచేవారు. వారి కోణం ఎప్పుడు తమ దేశ గత చరిత్రను తక్కువ చేసి చూపటం, ఇంకా చెప్పాలంటే తమ పూర్వీకులు పనికిమాలిన వారని, చాలా మంది భోగలాలసతో ఒకరి కంటే ఎక్కువ ఆడవారితో కాలక్షేపం చేస్తూ, వేశ్యలతో గడుపుతూ వారి సుఖం వారు చూసుకొనే వారని వీరి ఆరోపణ. అందులో కొంతమందికి, బ్రాహ్మణుల మీది ఉన్న వ్యతిరేకతతో రాజులతో పాటుగా కవులను ఆ లిస్ట్ లోకి చేర్చేవారు. శ్రీక్రిష్ణదేవరాయలు కీర్తి ఇప్పటివరకు చరిత్ర లో నిలచి ఉండవచ్చు గాని, వారు పాలించింది చాలా తక్కువ కాలం. ఆయన 20సం|| పాలించాడు. ఈ రచయితలు శ్రీకృష్ణదేవరాయలను విమర్సించే ముందు, ఆయన కాలం లోని ఎకనామిక్ మోడల్ ను ఎక్కడైనా కూలం కషంగా చర్చించంగా మీరు చదివారా? చాలా మంది స్విపింగ్ జనరలైసేషన్ చేసి రాశారు.
    నేను ఒక ఆర్ధికవేత్త రాసిన వ్యాసం లో శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి ఎకనామిక్ మోడల్ చాలా ఉత్తమమైనది అని చదివాను. ఆ వ్యాసం చిక్కితే మీకు తెలియజేస్తాను. మనదేశ సంస్కృతిని, కళలను తక్కువ చేసి చూపటానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. దాని గురించి సరిగా అవగాహన లేని మన రచయితలే (1930-1980 సం|| కాలం నాటి)వారికి వంత పాడేవారు. ఇంటర్నెట్ పుణ్యమా అని, ఇన్ని రోజులు అబద్దపు ప్రచారం చేసిన వారి నోరు మూతపడేటట్లు ఎన్నో ఆధారాలు దొరుకుతున్నాయి. మచ్చుకి బ్రిటిష్ వారు ఒకప్పుడు మన కళలను ఏవిధంగా తక్కువ చేసి మాట్లాడేవారో, దానికి వి. రామచంద్రన్ గారి సమాధానం ఎలా ఇచ్చారో ఈ క్రింది వీడీయోను చూసేది.

    Neurology and the Passion for Art
    http://www.youtube.com/watch?v=0NzShMiqKgQ

    ఇక శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఆర్ధిక పరిస్థితి ఎంతో మెరుగుగా (బూం పిరియడ్ లో) ఉండింది. [ఆర్ధికం గా హెచ్చు స్థాయిలో ఉన్న రోజులలొని పరిస్థితులను(India share of world GDP in the 1st century to (28.9%) in 1000 AD, and in 1700 AD with (24.4%), తక్కువస్థాయిలో ఉన్న రోజులలోని వారు ఊహించుకొంటే పైన చెప్పిన లోపాలే కనిపిస్తాయి (3.8% in 1952)] కనుకనే అల్లసాని పెద్దన విలువలతో కుడిన జీవితం గడపాలనే ఉద్దేశంతో, వరుధిని-ప్రవరాఖ్యుల కథను కావ్యంగా రాశాడు. ధూర్జటి గారికి వేశ్యల దగ్గరికి పోయే అలవాటు ఉండి, దాని పట్ల విముఖత నొంది శ్రీ కాళహస్తిశ్వర మహత్యం మొదలైనవి రాశారు. స్వయంగా రాయల వారు అముక్తమాల్యద రాశారు. ఆరోజులలో ప్రజలేమీ రాజరికం వలన మనమనుకొన్నంత దరిద్రం తో బ్రతకలేదు. ఈ సంవత్సరం కరువొచ్చిందికదా. పన్నులో ఓ దమ్మిడీ తగ్గించరాదా అని అడుకోవటానికి. ఈ అడుకోవటమనేది ప్రజాస్వామ్యం వచ్చిన తరువాత మరీ ఎక్కువై పోయింది. పెద్ద ఇండాస్ట్రియలిస్ట్ మొదలు కొని, సామాన్య ప్రజలు రిసర్వేషన్ కొరకు తమ కులాన్ని అందులో చేర్చాలని డిమాండ్ చేయటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.


    * ఈ రాజాస్థాన కవులంతా ఊహాసుందరుల జఘన సౌందర్యం (రాణి గారి గూర్చి రాస్తే మళ్ళీ శిరచ్చేదనే!)*
    రాజుగారి వరకు వేళ్లారు, ఏ భర్త అయినా తన భార్య జఘన సౌందర్యం కంటికట్టినట్లు వర్నిస్తే చూస్తూ ఊరుకొంటాడా?


    SriRam

    ReplyDelete
  33. Sri Ram గారు,

    మీ విమర్శ వస్తుగతంగానే ఉంది కాబట్టి, నేను వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం లేదు.

    ఈ పోస్టులో నేను చెప్పదలచుకున్న విషయం.. ఒక డబ్బున్న మారాజు తన పుట్టినరోజు పేరు మీద జరుపుతున్న (celebration of wealth/power) వేడుకల్లో.. మనం గౌరవిస్తున్న కొందరు ప్రతిభావంతులు పాల్గొనడం నాకు రోత కలిగిస్తుందని.

    ఈ ప్రధాన పాయింట్ కోసం నేను తెచ్చిన కొన్ని పోలికల పట్ల మీకు అభ్యంతరం ఉందని తెలియజేశారు.

    నాకు స్థూలంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నయ్. రాజాస్థానం వారు రాజు పాలన గూర్చి రాయడం అంటే సచివాలయంలో చీఫ్ సెక్రెటరీ ముఖ్యమంత్రి గూర్చి రాయడం లాంటిది అని! సామాన్య ప్రజల POV తో చరిత్ర రాయడమంటే ప్రాణాల మీద ఆశ వదుకోవాల్సిందే. నాకు మొన్నటికి మొన్న emergency లో జరిగిన దారుణ నిర్భంధ కాండలో రాజ్యం క్రూర స్వభావాన్ని చూసిన తరవాత పెద్దగా డౌట్లేమీ మిగల్లేదు.

    మనం చాలా విషయాలపై మనకున్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక అవగాహనని అనుసరించి ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాం.

    'ప్రస్తుత రాజకీయ నాయకులు స్వార్ధపరులు.' అంటే 'అందరూ' అని కాదు. చాలామంది నిజాయితీపరులున్నారు. కానీ స్థూలంగా ఒక అభిప్రాయం కలిగి ఉంటాం.

    అలాగే రాజులు, రాజాస్థాన కవులు గూర్చి నాకు స్థూల అభిప్రాయం ఉంది. నాకీ అభిప్రాయం కలగడానికి ఒక డి.డి.కోశాంబి కారణం కావచ్చు. రావిశాస్త్రీ కావచ్చును.

    మీరిచ్చిన లింక్ చూశాను. గంటన్నర ఉంది. తప్పకుండా మొత్తం చూస్తాను.

    సమాజం మారుతుంది. ఇప్పటిదాకా గొంతు లేని అనేక వర్గాలు తమ అస్థిత్వాన్ని చరిత్రలో, సాహిత్యంలో వెతుక్కుంటున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ మంచి పరిణామం.

    చరిత్రని రకరకాల వ్యక్తులు భిన్న కోణాల్లో విశ్లేషణ చేస్తారు. చెయ్యాలి కూడా. అప్పుడే నిజాలు బయటికి వస్తాయి. ఈ ప్రయత్నం ఒక మతానికో, సంస్కృతికో వ్యతిరేకం అని ఎలా అనుకోగలం? అలాంటప్పుడు ప్రభుత్వాలని విమర్శించడం 'దేశద్రోహం' అవుతుంది గదా!

    ReplyDelete
  34. excellent....mee blog parichayam ayinappatinundi anni chaduvuthunnanu...adbhuthamga unnayi...mee prathi blog lo vishayam thappakunda untundi...daniki mee adbhutha rachana patimanu jodinchi...konchem chamatkaram melavinchi rasthunnaru...kotha vishayalu telusukovadam,telisina vishayalu kotha konam lo chudatam,andmaina bhashalo,hasyam jodinchi maku andisthunnaru....nenu ravi sastri gari gurinchi vinnaa kani aayana rachanalu pedhaga chadavaledu....meeru ravi sastri gariki entha pedha abhimanoo,,nenu meeku antha pedha abhimani ni aipoyanu...naku matram ravi sastri garu meeree :)

    ReplyDelete
  35. Vamsi Krishna Nimmaraju గారు,

    థాంక్యూ!

    మీరు లేఖిని సహాయంతో తెలుగులో కామెంటవచ్చు. ప్రయత్నించండి.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.