"ఇంకా ఎంత దూరం ఉంది నాయనా?"
దేవదాసు సినిమా క్లైమాక్స్ గుర్తుంది కదూ! దుర్గాపురం చేరేదాకా బతుకుతానో లేదో అనే దేవదాసు ఆర్తి, ఆతృత.. పారుని చూడకుండానే చనిపోతానేమోననే ఆవేదన.. గుండెని కరిగించి కన్నీటిని వరదలా ప్రవహింపచేసే ఉద్వేగపూరిత ఘట్టం. సీతారాం (బండి నడిపిన వ్యక్తి) నటన అపూర్వం. తెలుగుసినిమా చరిత్రలో నన్ను ఇంతకన్నా ఏడిపించిన సన్నివేశం మరోటి లేదు.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే - ప్రతిరోజూ ఉదయం నేను కూడా దేవదాసులా ఫీలవుతుంటాను. దేవదాసుకి పార్వతి బాధ. నాకు ట్రెడ్‌మిల్ బాధ! ఈ డాక్టర్లు రాక్షసులకి తక్కువ, పిశాచాలకి ఎక్కువ. ఎక్సర్సైజులు చెయ్యకపొతే చస్తావని బెదిరిస్తుంటారు. ఆ డాక్టరే భార్య రూపేణా ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఎడారిలో ఎండమావి వంటిదని ప్రత్యేకంగా రాయనవసరం లేదనుకుంటాను.
కృష్ణకుమారి అక్కయ్యా! భార్యలకి భర్తల ఆరోగ్యం పట్ల తీవ్రమైన శ్రద్ధ ఎందుకు? మన పవిత్ర భారతదేశంలో భార్యలకి భర్తల పట్ల గల ఘోరప్రేమే కారణమని నేనూ, 'నీ బొంద! అది ప్రేమా కాదు, దోమా కాదు. మొగుడు చస్తే బాధ్యతలు నెత్తిమీద పడతయ్యనే బయ్యం! ప్రతిరోజూ నోరు నొప్పెట్టేలా తిట్టుకోడానికి కొత్తమనిషి దొరకడనే అభద్రతా భావం!' అని నా స్నేహితుడూ వాదించుకుంటున్నాం. ఎవరు కరక్టో చెప్పండి. మీరు చెప్పేదాకా మేం వాదించుకుంటూనే ఉంటాం! చెప్పకపొతే కొట్టుకుని చచ్చిపోతాం!!
'ట్రెడ్‌మిల్ ఎందుకయ్యా? హాయిగా పొద్దున్నే గ్రౌండ్ లో వాకింగ్ చెయ్యొచ్చుగా?' అని మీకు అనుమానం రావొచ్చు. 'పొద్దున్నే నిద్రలేచి రోడ్డున పడకురోయ్! నిన్ను ఏ పేపరోడో, పాలపేకెట్లోడో అనుకుంటారు.' అని మా సుబ్బు భయపెడ్తాడు. కుక్కలు కరుస్తయ్యని కూడా బెదరగొడతాడు. అసలు విషయం - నేనెక్కడ వాకింగ్ చేసి ఆరోగ్యం మూట గట్టుకుంటామేమోనని సుబ్బు భయం! కానీ - నేను స్నేహితుల మాటకి విలువిచ్చే మనిషిని! అందుకే - ఉదయాన్నే లేవకుండా బారెడు పొద్దెక్కేదాకా నిద్రోవడం, పొరబాటున లేచినా వాకింగుకి దూరంగా ఉండడం చేస్తున్నాను. తప్పదు, స్నేహధర్మం!
అయితే అన్నిరోజులూ ఒకలా ఉండవు. నేను వాకింగ్ చెయ్యక తప్పని పరిస్థితులు వచ్చేశాయ్. కొన్నిరోజులు ఇంటికి దగ్గరగా వున్న గ్రౌండ్‌కి వెళ్లాను. అక్కడ నడిచేవాళ్ళని చూసి ఆశ్చర్యమేసింది. వాకింగ్ ట్రాక్ మీద క్రమబద్దంగా, హడావుడిగా నడుస్తున్న వారంతా గొర్రెల్లా కనిపించారు.
నడకలో కూడా ఒక్కోడిది ఒక్కో స్టైల్. ఒకరిది అడుగులో అడుగేస్తూ పెళ్లినడకయితే, ఇంకొకరిది 'పదండి ముందుకు పదండి తోసుకు' అన్నట్లు పరుగులాంటి నడక. అక్కడ చాలామంది వాకర్లు కాదు. టాకర్లు మాత్రమే! కొందరైతే మొక్కుబడిగా నాలుగు రౌండ్లు నడిచి పక్కనే ఉన్న హోటల్లో అరడజను నేతి ఇడ్లీలు ఆరగించి వెళ్తున్నారు! ఆరోగ్యంగా జీవించడానికి ఇన్ని కష్టాలు పడాలా? వామ్మో! నా వల్లకాదు.
కానీ 'నడక' లేని జీవితం గాలిలో దీపం వంటిదని డాక్టర్లు ఘోషిస్తున్నారు, భయపెడ్తున్నారు, అసలు వాళ్ళు పెట్టే ఈ భయంతో చచ్చేట్లున్నాం. అందువల్ల 'ట్రెడ్‌మిళ్ అని ఆంగ్లంలో పిలవబడుతున్న ఒక నడక మిషన్ని కొన్నాను.
ట్రెడ్‌మిల్ - బుజ్జిముండ! చూడ్డానికి అందంగా, గంభీరంగా ఉంటుంది. కానీ ఈ మిషన్ మీద నడవడం మాత్రం దుర్భరం. కింద పట్టా వెనక్కి కదిలి పోతుంటుంది. మనని వెనక్కి లాక్కెళ్ళి పోదామని, పడేద్దామని ఆ పట్టా తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. కింద పడితే మూతి పళ్ళు రాల్తాయి కావున, పడకుండా మనకి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విధంగా కదిలే ఒక పట్టాతో మనం చేసే నిరంతర పోరాటన్నే 'ట్రెడ్‌మిల్ వాకింగ్' అంటారు!
మిషన్ ముందు ఒక బల్ల. దానిమీద ఎంత దూరం? ఎంత సమయం? ఎన్ని కేలరీలు? - ఇట్లా ఏవేవో లెక్కలు. 'జాగ్రత్త, ఇరువైపులా ఉన్న కడ్డీలని జాగ్రత్తగా పట్టుకోండి. ఈరోజుల్లో కరెంట్ యే క్షణాన్నైనా పోవచ్చును. మీ భద్రతకి మా బాధ్యత లేదు!' ఇలా అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ నడుస్తూ, అప్పుడప్పుడు పరిగెడుతూ- క్షణక్షణం ఆశగా ఎదురుగానున్న మీటర్లపై కాలము, దూరము అంకెలు చూసుకుంటూ - 'విధి ఒక విషవలయం, విషాద కథలకు అది నిలయం.' అని పాడుకుంటూ -
"ఇంకా ఎంతదూరం ఉంది నాయనా?"
నా ఏడుపు వాకింగ్ మా 'గుండెలు తీసిన బంటు' గోఖలేకి తెలిసింది. 'అలా ఏడుస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యకు, ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి.' అన్నాడు. ఈ గోఖలేకి వొక్కటే పని - గుండె ఆపరేషన్లు చెయ్యడం. నేను మాత్రం చాలా బిజీ! అసలే దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సమస్యలోంచి ఎలా బయటపడుతుంది? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం చైనా ఇండియాకి సహకరిస్తుందా? లేదా? ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాల గూర్చి ఆలోచించాల్సిన గురుతర బాధ్యతలు నామీదున్నాయి.
అయినా ఎంజాయ్ చేస్తూ ట్రెడ్‌మిల్ చెయ్యడమేమిటి! ఎంజాయ్ చెయ్యడానికి ఇదేమన్నా జ్యోతిలక్ష్మి డాన్సా? లేక సింగిల్ మాల్ట్ విస్కీయా? ఒరే మందుల కంపెనీ బాబులూ! జలుబుకీ, గజ్జికీ కూడా వందల కొద్దీ మందుల్ని మార్కెట్ చేస్తారు. పొద్దున్నే ఈ వాకింగులు, పీకింగులు లేకండా ఏదన్నా మందులు కనిపెట్టి చావండ్రా! నడవలేక ఇక్కడ కువసాలు కదిలిపోతున్నాయ్!
డారమణగారూ... నేనింకా ఓ ట్రెడ్‌మిల్ కొనుక్కుందామనుకుంటున్నా. ఇలా బెదిరిస్తున్నారేంటి సార్???
ReplyDeleteGood one Ramana. there is nothing in science that says vigorous exercise prolongs life. You just have to be active that's all. Brisk walking and taking stairs when you can will do. I am somewhat nihilistic. I would say instead of numerical life in years, we should have life index. Life index is number of years x 1 x pleasure points. If you don't smoke, drink, avoid salt, avoid meat, and so on, your life index would be 100. If you indulge in pleasures the years number would decrease, but, the life index remains constant. So, it is individual choice. Who says one should follow any particular regimen? Most of the longevity the humans have achieved is from better nutrition (fortification of foods, better food preservation), vaccinations and may be better acute medical care. By and large we will live per our genes. This living long thing is a racket. Don't fall into it.
ReplyDeleteపాటలు వింటూనో, సినెమాలు చూస్తూనో, లెకపోతే షీర్ ఎంటెర్టైన్మెంట్ ఇచ్చే న్యూస్ చానెల్స్ చూస్తూనో చేసెయ్యండి exercise. టైం అసలు తెలీదు మీకు.
ReplyDeleteచాలా బాగా వ్రాశారు సార్ ! కడుపుబ్బేలా నవ్వించారు.
ReplyDeleteమాకు ట్రెడ్డులూ లేవు మిల్లులూ లేవు. చక్కగా కుక్కల్ని తోలుకోడానికీ, పడిపోకుండా ఉండటానికో కర్ర, చేత్తొ పుచ్చుకుపోతాం, గ్రవుండికి. ఓపికున్నంతసేపు తిరగడం, వచ్చెయ్యడం. మీరు నాగరీకులు కదా.......
ReplyDeletepuranapandaphani గారు,
ReplyDeleteఅయితే మీక్కూడా..
in front crocodile festival అన్న మాట!
congrats!
@GIdoc,
ReplyDeletecan i have my single malt whiskey without reducing life index?
జలతారువెన్నెల గారు,
ReplyDeleteప్రస్తుతం మీరు సూచించిన విధంగానే నేను వాకుతున్నాను.
but.. still..
"ఇంకా ఎంత దూరం ఉంది నాయనా?!"
durgeswara గారు,
ReplyDeleteఅంతేలేండి. ఎదుటివాడి కష్టాలు నవ్వు తెప్పిస్తాయి.
డాక్టరు గారు,
ReplyDeleteనడిస్తే కాలరీలు ఖర్చవుతాయని అంటారు డాక్టర్లు.
ఈ ట్రేడ్మార్క్ మిల్లు లో కాలరీలు ఖర్చు తో బాటు జేబు కి కూడా కరెంటు బిల్లు రూపేణా ఖర్చన్న మాట !
ఫిక్సెడ్ కాస్ట్ : ట్రేడ్మార్క్ మిల్
రన్నింగ్ కాస్ట్: కరెంటు బిల్
వెరసి 'కాస్ట్లీ రన్నింగ్/జాగ్గింగ్'
చీర్స్
జిలేబి.
kastephale గారు,
ReplyDeleteమీ పద్ధతి బెస్ట్.
మీలా నేనూ రోజూ గ్రౌండుకి వెళ్ళాలనుకుంటాను. వల్ల కావట్లేదు.
బద్దకస్తులకి ఏదైనా కష్టమే! ఆ కష్టాలే ఈ పోస్ట్.
జిలేబి గారు,
ReplyDeleteఅవును. ఖరీదైన వాకింగే!
ఈ gym exercise equipment చాలామంది ఇళ్ళల్లో ఉంటున్నాయి. కాకపోతే.. ఎక్కువమంది వీటిని బట్టలారేసుకోడానికి వాడుతుంటారు!
can i have my single malt whiskey without reducing life index?
ReplyDeleteఅబ్బా! ఆశ..దోశ..అప్పడం..వడ..భలే అడుగుతున్నారులే:):)
ఎక్కువమంది వీటిని బట్టలారేసుకోడానికి వాడుతుంటారు!
ఇది నిజ్జంగా నిజం..
రవణ గారు,
ReplyDeleteనేను కొంత కాలం రాం దేవ్ బాబా గారి యోగా చేసి "ఓ..ఆరోగ్యం గా ఉన్నట్లు" తెగ ఫీలయిపోతుండేవాడిని. ఓ సంవత్సరం నుంచీ మానేశాను. తేడా ఏమీ తెలియటం లేదు. బాబా గారు తన నిరాహార దీక్షని ఏదో సాకుతో ఓ వారం రోజుల్లోపలే విరమించటం కూడా ఆయన యోగా పై నా నమ్మకం సడలటానికి ఓ కారణం. వీలయితే యోగా మీద కూడా ఓ టపా రాసేయండి..
నాయనా రమణ,
ReplyDeleteబద్దకస్తులకి ఏదైనా కష్టమే!
కరెక్టుగా చెప్పావు.
ఆధునీకరణ (పిజ్జాలు మొదలగునవి) పేరుతో జిహ్వ చాపల్యం చంపుకోలేక అడ్డమయినవన్నీ తిని ఆయాసంతెచ్చుకోవటమెందుకు, ఈ ఆయాసం తగ్గించుకోవటానికని రోజూ "పరిగెత్తి" మరల ఆయాసం తెచ్చుకోవటము దేనికో నాకర్ధ కాదు. అంతా మెకనైజుడు జీవితం. పూర్వం ప్రతి పనిలోనూ దాదాపుగా, చక్కగా శారీరక శ్రమతో కూడిన పనులు అందరూ చేసే వారు. ఇప్పుడలాకాదుగదా. Gldoc చెప్పింది కరెక్ట్.
రమణగారు,
ReplyDeleteమీకిరువైపులా పక్కన ఉండే ట్రేడ్ మిల్ లో అమ్మాయిలు ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు ఎంజాయ్ చేస్తూ ట్రెడ్ మిల్ చెయ్యడం అంటే ఎమీటో అర్థం మౌతుంది. సమయం ఇట్టే గడిచిపోతుంది. If you are feeling bore, then fall in love. అప్పుడు ప్రపంచం ఎంతో అందం, అద్బుతంగా కనిపిస్తుంది :)
సుభ గారు,
ReplyDeleteహ.. హ.. హా.. మీ ఇంట్లో కూడా ఒక బట్టల దండెం (ట్రెడ్ మిల్) ఉందని అర్ధమవుతుంది!
@Gldoc గారూ మీ Life Index చాలా కొత్త ఐడియా బాగుంది. దాన్ని ఇంకొంచం వివరాలతో జుప్పిస్తే వాడకానికి వీలుగా ఉంటుంది. మీరు దీని మీద ఒక పుస్తకం వ్రాయ వచ్చు.
ReplyDeleteఆ Life Index ప్రేరణను Gldoc గారి మనస్సులో కల్పించిన రమణ గారికి (వ్యాసానికి) ధన్యవాదాలు.
బొందలపాటి గారు,
ReplyDeleteయోగా గూర్చి నాకు పెద్దగా తెలీదు. అవి stretching exercises మాత్రమే అని కొందరంటారు. యోగా గూర్చి ఎక్కడా scientific publications నా దృష్టికి రాలేదు.
ఇప్పటికే నా టపాల్ని బ్లాగర్ ఒకాయన తన బ్లాగ్ లో తీవ్రంగా విమర్శిస్తున్నారు. నేను నా స్నేహితుల్ని దృష్టిలో ఉంచుకుని మా చిన్నప్పటి ఆలోచనలని రాస్తున్నాను. అంతే!
నాకెందుకో మీరు తీసుకున్న బ్లాగు విరామం చాలా విజ్ఞతతో తీసుకున్నదని అనిపిస్తుంది.. ఇప్పుడు. (i am contemplating the same.)
@DSR Murthy,
ReplyDeleteఈ కబుర్లు నేనూ చెబుతాను మిత్రమా!
కానీ నడక తప్పట్లేదు!
Srinivas గారు,
ReplyDeleteమీ సలహా బాగుంది. ట్రై చేస్తాను!
Rao S Lakkaraju గారు,
ReplyDeleteథాంక్యూ!
హాయిగా సాయంత్రం ఏడు గంటలకి వాకింగ్ కెళ్ళిపోండి. నాలాగన్నమాట. అప్పటికి బద్ధకాల గొడవ తీరిపోతుంది:)
ReplyDeleteరమణ గారు,
ReplyDeleteఇన్నాళ్ళు గా వ్రాస్తుంటే ఇప్పుడే మీ బ్లాగు చూడడం జరిగింది అని ఎవరయినా ఆనడం ఇంకా పెద్ద తిట్టు అండీ :)
అందుకే ఒక నెలరోజుల పాటు మీ ఒక్క బ్లాగ్ మాత్రమె సంకలిని లు ప్రచురిస్తాయి. ఆ ఒక్క నెల అయ్యే వరకు వ్రాయండి ( ఎప్పుడో నాకు తెలిదు :))
మిత్రమా రమణా,
ReplyDeleteజీవిత సత్యం ఏమిటంటే "జాతస్య మరణం ధ్రువం". పుట్టిన వాళ్ళందరూ గిట్టక తప్పదు. "జీవితం బుడగస్య బుడగహ" అని కే.విశ్వనాధ్ తన శుభోదయం సినిమాలో ఎప్పుడో చెప్పాడు. ఇలా ఏమాత్రం గ్యారంటీ లేని జీవితం కోసం చిన్నప్పటినించీ ఎంతో ముద్దుగా పెంచుకున్న మన దేహాల్ని కష్ట పెట్టడం సబబు కాదు నాయనా! ఇక ఏ ట్రెడ్ మిల్లులూ, ఎక్సర్సైజులూ యమధర్మ రాజు తో నీ అప్పాయింటుమెంటు ని తప్పించలేవు సోదరా! అందుకే నేను ఎప్పుడూ ఇటువంటి దుష్ట సాధనాలకి ( ట్రెడ్ మిల్లు వగైరా) దూరంగా ఉంటూ వచ్చాను. ఇంకొంతమంది దుష్టులు ( ఉదాహరణకి మన ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ సుధాకర రెడ్డి ) హైకింగు బైకింగు, రన్నింగు అనే చెడు అలవాట్లు మనకి అంటించడానికి ప్రయత్నిస్తుంటారు. మనం అటువంటి చెడు సావాసాలకి దూరంగా ఉంటూ బీ.ఎస్సార్ చెప్పిన "లైఫ్ ఇండెక్స్ ని గుర్తు చేసుకోవాలి. అంతే!
దినకర్.
జయ గారు,
ReplyDeleteఅసలు వాకింగే అవసరం లేదని GIdoc శెలవిస్తున్నారు. నాకెందుకో ఆయన వ్యాఖ్య భలే నచ్చింది! ప్రస్తుతానికి ఆయన్ని ఫాలో అయిపోతాలేండి!
Mauli గారు,
ReplyDeleteఅంత పెద్ద తిట్టంటారా? ఔరా! నా బుర్రకి తట్టనే లేదు!
క్షమించండి. నాకు మీ రెండో పాయింట్ అర్ధం కాలేదు.
Dinakar,
ReplyDeleteనీ గూర్చి నా బ్లాగులో మంచిగా రాశాను. చదివావన్న మాట.
>>ఏ ట్రెడ్ మిల్లులూ, ఎక్సర్సైజులూ యమధర్మ రాజు తో నీ అప్పాయింటుమెంటు ని తప్పించలేవు సోదరా!
అవును గదా!
ఇంత జాగ్రత్త గా వ్రాసే మీరే మానేస్తాను అంటే,ఇంకేం వ్యాఖ్యానించాలి. అసలు మీలాంటి వారు వ్రాసే మంచి(?) టపాలు తగ్గిపోతునాయని ఎంత అల్లల్లాడి పోతున్నారో చూస్తున్నారు కదా :)
ReplyDeleteMauli గారు,
ReplyDeleteమీ కామెంట్ లోని వ్యంగ్యం అర్ధమైంది.
మీకెలా అనిపిస్తే అలా!
డాక్టరు గారూ తప్పులో కాలేసారు.. నేను చూసింది మాత్రమే చెప్పా:):):)
ReplyDeleteడాక్టర్ గారు,
ReplyDeleteఆమద్యన ఇలాగే నేనూ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాకింగ్ చెస్తావా అని అడిగారు లేదు అనేసరికి పో నీజీవితంలో 5 ఇయర్స్ తగ్గిపోయినవి అని బెదర గొట్టారు.
ఐనా జీవితంలో ఎలాంటి ప్రాబ్లెం వున్నా మన డాక్టర్ రమణ గారు వున్నారుగా
వాకింగ్ చేస్తే పొట్ట తగ్గుతుందని వాకింగ్ చేసా కాని పొట్ట తగ్గల, కనుక పొట్ట తగ్గే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోరూ.
రమేష్ బాబు గుడివాడ
రమేష్ బాబు గారు,
ReplyDelete>>ఐనా జీవితంలో ఎలాంటి ప్రాబ్లెం వున్నా మన డాక్టర్ రమణ గారు వున్నారుగా.
తన problems ని solve చేసుకోలేని డాక్టరు మీ సమస్యల్ని ఎలా తీరుస్తాడండి బాబు!
"ఇప్పటికే నా టపాల్ని బ్లాగర్ ఒకాయన తన బ్లాగ్ లో తీవ్రంగా విమర్శిస్తున్నారు"
ReplyDeleteఆ బ్లాగరు ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. వారి బ్లాగులు సందర్శించి తరిస్తాను.
వా ఆ వా ఆ వా ఆ...నాదీ షేం టు షేం ఇదే పరిస్థితి...నాకు కూడా షేం టు షేం ఇలాగే పొద్దున్నే లేవడం నడవడం, ట్రెడ్ మిల్ ఎక్కడ ఇష్టం ఉండదు....మీతోపాటే కలిసి ఏడుస్తా వా ఆ వా ఆ.....
ReplyDeleteనేను రోజూ మనసులో అనుకునే మాట ఈరోజు మీరు పబ్లిగా ఆనేసారు.
"ఒరే మందుల కంపెనీ బాబులూ! జలుబుకీ, గజ్జికీ కూడా వందల కొద్దీ మందుల్ని మార్కెట్ చేస్తారు. పొద్దున్నే ఈ వాకింగులు, పీకింగులు లేకండా ఏదన్నా మందులు కనిపెట్టి చావండ్రా! నడవ లేక ఇక్కడ కువసాలు కదిలి పోతున్నాయ్!"
మనం నడుస్తూనే ఉంటాం..ఒక్క అంగుళం ముందుకు కదలం, జీవితం లో అయినా గట్టి నేల మీద అయినా.అంతా మిధ్య..లా ఉంటుంది, ఆరు కిలో మీటర్ లు అని ఉంటుంది, తీరా చూస్తే..ఎక్కడ వేసిన గొంగళి అంటే..అన్నట్టు..అక్కడే..కాళ్ళు నొప్పులు వస్తాయి, కూసాలు కదిలి పోతాయి, మునుకులు అరిగిపోతాయి..అని ఒకరు..రక రకాలు గా చెబుతూ ఉంటారు.మళ్లీ ఆ దోక్తోర్లె సరే..నడవండి అంటారు..
ReplyDeleteభూమి మీద నడవడమే మంచిది, అంటున్నారు. భూ ఆకర్షణ శక్తి కి ఎదురు గా ,మన నడక మంచిది అంటున్నారు.
అవును, ఈ ట్రేడ్ మిల్..ఇంక ఎంత దూరం..?? అనుకుంటూ చచ్చి చెడి చేసే నడకే..సినిమాలు చూస్తూ.టి వి లో, . కొంత నయం..రెండు కష్టాలే కదా..బాలన్సు అయిపోతాయి.
వసంతం.
ఆ.సౌమ్య గారు,
ReplyDeleteనాకు మీరు తోడు దొరికారు. సంతోషం.
నడిస్తే కాళ్ళు నొప్పెడుతున్నాయంటే.. 'గుండె నొప్పి కన్నా కాళ్ళు నొప్పి నయం గదూ!' అంటున్నాడు నా ఫ్రెండ్ డాక్టరొకడు. నిజమే చెప్తున్నాడనిపించింది. (ఫీజు పుచ్చుకోనప్పుడు డాక్టర్లు పచ్చి నిజాలే మాట్లాడాతార్ట!).
వసంతం గారు,
ReplyDeleteమీరూ ట్రెడ్ మిల్ బాధితులన్న మాట! చాలా కవితాత్మకంగా రాశారు.
సినిమా చూస్తూ నడవడం బాగానే ఉంటుంది గాని.. ఒక్కోసారి నడక కన్నా సినిమాయే దుర్భరంగా ఉంటుంది.