"ప్రధానమంత్రిజీ! ప్రధానమంత్రిజీ! రక్షించండి." నిండుసభలోకి సావిత్రి స్టైల్లో ఏడ్చుకుంటూ పరుగున వచ్చాడు దినేష్ త్రివేది.
సభికులు (పార్లమెంట్ సభ్యులు) బిత్తరపొయ్యారు. జరుగుతున్న (లోక్) సభ ఒక ముఖ్యమైన (బజెట్) సమావేశం. త్రివేదిని కీచకుడిలా తరుముకుంటూ వచ్చిన మమతా బెనర్జీ ఒక్కక్షణం ఆగి సభని పరికించింది. సింహాసనం మీదనున్న మన్మోహన్ సింగ్‌ని చూసి నిర్లక్ష్యంగా నవ్వింది. మన్మోహన్ ముక్కామల స్టైల్లో ఇబ్బందిగా కదిలాడు.
"హు.. ఇదొక సభ! వీళ్ళందరూ సభ్యులు! ఈ ప్రధానమంత్రి నేను కూర్చండబెట్టిన మట్టిబొమ్మ. ఎవరు?.. ఎవరు నన్నెదిరించువారు?" అంటూ ఎస్వీరంగారావులా గర్జించింది మమత.
"అయ్యో! మమతా దీదీ! నీ పరాక్రమం నాకు తెలియనిదా! కానీ నిండుసభ కొలువై ఉండగా నీవిటుల త్రివేది వెంటపడుట.. " నీళ్ళు నమిలాడు విరాట మహారాజు.. సారీ, మన్మోహనుడు.
"నీవా నాకు సభామర్యాదలు నేర్పునది! మన్మోహనా! నువ్వేం చేస్తావో నాకనవసరం. తెల్లవారేసరికి ఈ త్రివేది రాజీనామా నా మందిరానికి చేరాలి. లేదా నీ యూపియే 2 ని సర్వనాశనం చేస్తాను. నీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటావో నీట ముంచుకుంటావో ఇహ నీ ఇష్టం." అంటూ విసవిసా సభ నుండి నిష్క్రమించింది మమతా బెనర్జీ!
చివరి తోక -
పొద్దున న్యూస్‌పేపర్ చదువుతుంటే - ఢిల్లీలో జరుగుతున్న రాజకీయం ఇంతకుముందెక్కడో చూసినట్లు అనిపించింది. కొద్దిసేపు ఆలోచించాక 'నర్తనశాల' గుర్తొచ్చింది. దీన్నే 'డిజా వు' (deja vu ) అంటారు.
డి జా ఉ ఏమో కాని,
ReplyDeleteవీడి చావుకి వచ్చింది గా
- పుచ్చా
మీకిలాంటివన్నీ ఎలా తడతాయండీ ??? :))
ReplyDeleteexcellent
ReplyDeleteఅయితే మమత కి మంచి భవిష్యత్తు ఉందంటారు.బాగు బాగు .
ReplyDeleteputcha,
ReplyDeleteఎవరి చావుకొచ్చింది?
విరాట, మన్మోహన్లు పెద్ద గుమాస్తాలు. వారి స్థాయికి (మించి) ఎన్నో రెట్లు ఉద్యోగం వారికి లభించింది. అవమానాలు భరించాలి. తప్పదు మరి!
ఆ.సౌమ్య గారు,
ReplyDeleteటపా రాద్దామనుకున్నప్పుడల్లా మా నర్సుల్తో కరెంట్ షాక్ ఒకటి ఇప్పించుకుంటాను (నాకు ఫ్రీ లేండి!). అప్పుడు ఎక్కడ లేని వెర్రి మొర్రి ఆలోచనలు వచ్చేస్తాయి. వాటినే పోస్టుగా రాసేస్తాను. ఇది నా ట్రేడ్ సీక్రెట్. దయచేసి ఎవరికీ లీక్ చెయ్యకండి.
kastephale గారు,
ReplyDeletethank you.
Mauli గారు,
ReplyDeleteమమత భవిష్యత్తు నాకు తెలీదు గానీ.. కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతుంది. మనకి వినోదదాయకం. ఎంజాయ్!
ఆయ్,
ReplyDeleteమా మనమోహను ల వారిని అన్నేసి మాట లంటారా ?
వారే లేకుంటే ఈ భారద్దేశం తొంభై లో నే దివాలా తీసి ఉండేది.
(ఇప్పుడు ఏక్ జీ,దో జీ, త్రీ జీ వీటి తో కావడం లేదా అని అడగ మాకండీ ! అది వారి దాకా రాలేదంతే)
విరాటుని కొలువులో ఇక రామారావు(నర్తన శాల లో రామారావు గారి గురించి అడుగు తున్నా) గారేవరండీ ?
జిలేబి.
జిలేబి గారు,
ReplyDeleteమీ మన్మోహన్ని మహారాజనే గదా నేనూ రాసింది!
సైరంధ్రిని వలలుడు వెంటాడిన సీన్లో (సినిమాలో) బృహన్నల లేడుగదండి! కాబట్టి రామారావు ప్రస్తావన లేదు. (ఆ పాత్రక్కూడా మన్మోహనే కరెక్ట్!)