Friday 2 March 2012

గురువుగారి జ్ఞాపకాలు.. నా బాలకృష్ణ అభిమానం!

నాకు బాలకృష్ణ అంటే ఇష్టం, అట్లని నేను బాలకృష్ణ అభిమానిని కాను. బజ్జీలంటే ఇష్టమేగానీ, బజ్జీలు తినను అన్నట్లు కంఫ్యూజింగ్‌గా వుందికదూ! చదువరులు నన్ను మన్నించాలి, విషయం తెలియాలంటే నా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళాల్సిందే!

అవి నేను గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో పదోక్లాసు చదువుతున్న రోజులు. సుబ్బారావు నాకు క్లాస్మేట్. బోర్లించిన మరచెంబు మొహంతో, గుండ్రంగా కార్టూన్ కేరక్టర్లా వుంటాడు. అప్పుడే నిద్ర లేచినట్లు మత్తుగా, బద్దకంగా వుంటాడు. రోజూ తలకి దట్టంగా ఆవఁదం పట్టిస్తాడు. నుదుటిమీదా, మెడవెనుకా ఆవఁదం మరకలు మరియూ ఆవఁదం కంపు. అంచేత సుబ్బారావు 'ఆవఁదం సుబ్బడు'గా ప్రసిద్ధుడయ్యాడు.

ఆవఁదం సుబ్బడికి చదువంటే అమితమైన ఆసక్తి. పొద్దస్తమానం పుస్తకంలోకి తీవ్రంగా చూస్తూంటాడు, సీరియస్‌గా వల్లె వేస్తుంటాడు. కానీ పాపం! సుబ్బడికి నత్రజనికీ, నక్షత్రానికీ తేడా తెలీదు. గాంధీ గోడ్సే అన్నదమ్ములంటాడు. అమీబాకీ అమెరికాకి యేదో సంబంధం వుందని అనుమానిస్తాడు. సహజంగానే సుబ్బడికీ యేనాడూ పదిమార్కులుకూడా రాలేదు.

డబుల్ డిజిట్స్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న మా సుబ్బడు, వున్నట్టుండి ఒకసారి సైన్స్‌లో పాసైపొయ్యాడు! నాపక్కనున్నవాడు కూపీలు లాగడంలో సిద్ధహస్తుడు. క్షణకాలంలో సుబ్బడి ఆన్సర్ షీట్‌ని స్కాన్ చేసేశాడు. సుబ్బడు ఆన్సర్ షీట్ పాసయ్యేంతగా లేదనే రహస్యాన్ని నాచెవిలో వూదాడు.

మాకు సైన్స్ టీచర్ పరిమి ఆంజనేయశర్మగారు. ఆయన తెల్లగా, లావుగా, చిరుబొజ్జతో.. తెల్లని పంచె, లాల్చీతో.. పొడుగుజుట్టుతో.. కూనిరాగాలు తీస్తుంటారు. ఆయన పిల్లల్లో పిల్లాడు. అంచేత సరదాగా, హాయిగా పిల్లలతో కలిసిపొయ్యేవారు. అయన విద్యార్ధుల పట్ల మొరటుగా ప్రవర్తించరు, కనీసం పరుషంగానైనా మాట్లాడరు.

ఆంజనేయశర్మగారు సైన్సు పాఠాన్ని ఒక కథలాగా చెప్తారు, ఆ విధానం చాలా అసక్తిగా వుంటుంది. వారు నోట్సులకి వ్యతిరేకి, టెక్స్ట్‌బుక్స్ మాత్రమే చదవాలి. పాఠం అయ్యాక మేం డౌట్లు అడగాలి, ఆ డౌట్ల నివృత్తి కోసం క్లాసు చివర్లో కొంతసమయం కేటాయించుకునేవారు. ఈ ప్రశ్నలు సమాధానాల సెషన్ చాలా ఉత్సాహభరితంగా, వివరణాత్మకంగా వుంటుంది. అంతే! పాఠం అయిపోయింది, ఇంకేం లేదు. ఇదే మా మాస్టారి బోధనాపధ్ధతి.

మాకాయన బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను ప్రభుత్వ గ్రంధాలయంలో చందమామ రెగ్యులర్‌గా చదివేవాణ్ని, అక్కడ పాత చందమామలు సంవత్సరాల వారిగా హార్డ్‌బౌండ్ చేసి ర్యాకుల్లో నీట్‌గా సర్ది వుంచేవాళ్ళు. ఆ చందమామలు నాకు విందుభోజనంతో సమానం. మాస్టారుకి నా చందమామల పిచ్చి తెలుసు. అంచేత క్లాసులో నాతో పిల్లలకి చందమామ కథలు చెప్పించేవారు. గమ్మత్తేమంటే పిల్లలతోపాటు ఆయనకూడా శ్రద్ధగా నా కథలు వినేవారు! ఒక కథని వినేవాళ్ళకి ఆసక్తిదాయకంగా వుండేందుకు నాటకీయంగా ఎలా చెప్పాలో కూడా టిప్స్ ఇచ్చేవారు.

సరే! మనం మళ్ళీ మన ఆవఁదం సుబ్బడి మార్కుల విషయానికొద్దాం. సుబ్బడికి పొరబాటున మార్కులు ఎక్కువేసిన విషయం ఆయన దృష్టికి తీసికెళ్ళాను. ఆయన చిన్నగా నవ్వారు, ఆ తరవాత ఒకక్షణం ఆలోచించారు. ఆపై రహస్యం చెబుతున్నట్లు లోగొంతుకతో ఇలా అన్నారు -

"ఒరే నానా! ఎప్పట్లాగే నీకు మంచిమార్కులు వచ్చాయిగదా. సుబ్బారావుతో నీకు పోటీ ఏంటి నానా? పాపం! ఆ వెధవాయ్ మార్కుల కోసం తెగ కష్టపడుతున్నాడు నానా. ఇంతకు ముందుకన్నా చాలా ఇంప్రూవ్ చేశాడు. వాడినిప్పుడు పాస్ చెయ్యకపోతే అసలు చదువు మీదే ఇంట్రస్ట్ పోతుంది. ఈ సంగతి వాడికి తెలీనీకు నానా, తెలిస్తే హర్టవుతాడు." ('నానా!' అనేది మాస్టారి ఊతపదం.)

నాకప్పుడర్ధమైంది. గురువుగారు పేపర్ దిద్దడంలో కేవలం పరీక్షల కోణం మాత్రమే కాకుండా ఇతర అంశాల్ని కూడా అలోచిస్తారని! నేను మా గురువుగారికి శిష్యుణ్ని. అంచేత ఆయన ఆలోచనా సరళిని అనుకరిస్తాను. సుబ్బడువంటి కష్టజీవులపట్ల సానుభూతి, ఆదరణ, ప్రేమ కలిగి ఉండాలని వారి దగ్గరే నేర్చుకున్నాను.

ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ దగ్గరకొద్దాం. బాలకృష్ణంటే నాకెందుకు ఇష్టమో ఇప్పుడు మీకర్ధమైయ్యుంటుంది. బాలకృష్ణ డాన్స్ చేసే విధానం చూడండి. అందులో నాకు ఎంతో సిన్సియారిటీ కనిపిస్తుంది. ఎంతో కష్టపడి శరీరభాగాల్ని కదుపుతూ, ఆయాసపడుతూ, చిన్నప్పుడు మనం డ్రిల్ క్లాస్‌లో పడ్డ కష్టాలన్నీ పడతాడు. అతని పట్టుదల చూడ ముచ్చటగా వుంటుంది.

సినిమా రంగంలో కమల్ హాసన్, ప్రభుదేవా వంటి మంచి డ్యాన్సర్లు వున్నారు. వాళ్ళు వంకర్లు తిరిగిపోతూ డ్యాన్సులేస్తారు. ఇదేమంత విశేషం కాదు, విశేషమంటే బాలకృష్ణ డ్యాన్సే. ఆవఁదం సుబ్బడు పదిమార్కులు దాటడానికి పడ్డ తపన, శ్రమ నాకు బాలకృష్ణ డ్యాన్స్ చేసే ప్రయత్నంలో కనిపిస్తుంది!
                               
బాలకృష్ణ డైలాగుల్ని గమనించండి. అతనిలో తండ్రి గంభీరత, స్పష్టత, నైపుణ్యతలు లేశమాత్రమైనా లేవు. కానీ ఎంతో కష్టపడతాడు, శ్రమిస్తాడు. హోటల్ కార్మికుడు  పిండి రుబ్బినట్లు, కూలీవారు రాళ్ళు పగలకొట్టేట్లు.. అత్యంత ప్రయాసతో సంక్లిష్టమైన పదాలు, వాక్యాలు పలుకుతుంటాడు. గుండె ఆపరేషన్లు చేసే తండ్రికి పుట్టినందువల్ల కనీసం కాలు ఆపరేషనైనా చేద్దామనే తపన, ఆరాటం నాకు బాలకృష్ణలో కనిపిస్తుంది. ఎవరిలోనైనా ఈ గుణాన్ని మనం మెచ్చుకోవలసిందే.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కొందరు మహానుభావులు తోటికళాకారుల ప్రతిభాపాటవాల్ని ఖచ్చితత్వంతో విమర్శిస్తారు. శంకరాభరణం శంకరశాస్త్రి 'శారదా!' అనే గావుకేకతో కూతురిపెళ్లిని చెడగొట్టుకున్నాడు. ఆయన చెప్పదలచుకున్న సంగతి గావుకేక లేకుండా కూడా చెప్పొచ్చు. కానీ ఆయనలా చెప్పడు, చెబితే శంకరశాస్త్రి ఎలాగవుతాడు!?

మరప్పుడు ఆ శంకరశాస్త్రి మన బాలకృష్ణతో ఏంచెబుతాడు? - "చూడు బాలయ్యా! కళ అనేది కమ్మని ఫిల్టర్ కాఫీ వంటిది. ఆ స్వచ్చమైన కమ్మని కాఫీలో నీ నటన అనబడే ఈగపడి తాగడానికి పనికిరాకుండా చెయ్యరాదు. కాఫీ ఈజ్ డివైన్ వెదర్ ఇటీజ్ ఫిల్టర్ ఆర్ ఇన్స్టంట్." అని నిక్కచ్చిగా, నిర్దయతో చెప్పేస్తాడు.

ఒక మంచిప్రయత్నాన్ని నీరుగార్చే ఎస్వీరంగారావు మార్కు ధోరణి నాకు నచ్చదు. అన్నట్లు ఎస్వీరంగారావు బాలకృష్ణ పౌరాణిక సినిమా చూస్తే ఏమంటాడు? గద పైకెత్తి పట్టుకుని, క్రోధంతో మీసం మెలిస్తూ, ఈవిధంగా గర్జిస్తాడు.

"తుచ్ఛఢింభకా! ఏమి నీ భాష? నీ భాషాహననము కర్ణకఠోరముగా యున్నది. యేమి నీ హావభావములు? వీక్షించుటకు మనసు రాకున్నది. దీన్ని నటన అందువా బాలకా? ఇది యేదైనా అగునేమో గానీ నటన మాత్రం కానే కాదు. ఓయీ భాషా హంతకా! నటనా శూన్యా! అద్భుత ప్రతిభాశాలియైన నీతండ్రి నా మదీయ మిత్రుడైన కారణాన నిన్ను ప్రాణములతో వదిలివేయుచున్నాను. నీవు ఇప్పుడే కాదు, భవిష్యత్తునందు కూడా ఎక్కడైనా ఎప్పుడైనా డైలాగులు చెప్పజూచితివా - నా గదాదండమున నీతల వేయిచెక్కలు గావించెద. నీకిదియే నాతుది హెచ్చరిక."

అదే మా గురువుగారైతే ఏం చేసేవారు? బాలకృష్ణకి షేక్‌హ్యాండ్ ఇస్తారు, ఆప్యాయంగా కౌగిలించుకుంటారు, మెచ్చుకోలుగా భుజం తడతారు. ఆ తరవాత సంతోషంగా ఇలా అనేవారు.

"నానా బాలయ్యా! చాలా బాగా చేశావ్. నాకు నీలో పెద్దాయన కనబడుతున్నారు నానా. నీకు తొంభై మార్కులు వేస్తున్నా, ఇంకొంచెం కష్టపడు నానా. నీ తండ్రిగారి స్థాయిని తప్పకుండా అందుకుంటావ్. నువ్వు ఈసారి వందమార్కులు తెచ్చుకోవాలి నానా!"

మా గురువుగారు సహృదయులు, అమాయకులు. అందువల్ల ఆయనకి ప్రతిభ ఒకాటే కాదు, ప్రయత్నం కూడా గుమ్మడికాయంత సంతోషాన్నిస్తుంది. గురువుగారి ప్రోత్సాహంతో ఆవదం సుబ్బడు తీవ్రంగా, ఘోరంగా, బీభత్సంగా తపస్సు చేసి అత్తెసరు మార్కులతో పదోక్లాసు గట్టెక్కాడు. అటుపిమ్మట ఉన్నతోద్యోగంలో ఉన్న తన మేనమామ సాయంతో ఒక ప్రభుత్వ చిరుద్యోగిగా రూపాంతరం చెంది జీవితంలో సెటిల్ అయిపోయ్యాడు.

మా గురువుగారి శిష్యులు డాక్టర్లు, ఇంజనీర్లు చీమల్లా, దోమల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మేం ఆంజనేయశర్మగారి దగ్గర పాఠాలు నేర్చుకోవడం మా జీవితాల్లో ఒక చెరగనిముద్ర వేస్తాయని మాకు అప్పుడు తెలీదు (కొన్ని అనందాలు అనుభవిస్తున్నప్పుడు తెలీదు). నాదృష్టిలో ఆయన మాఅందరికన్నా ఆవదం సుబ్బడికే ఎక్కువ సహాయం చేశారు.

ప్రతిభ అనేది యాంత్రికంగా పాఠ్యాంశాల మనన కార్యక్రమాల ద్వారా మాత్రమే నిర్ణయించకూడదనీ, కష్టపడే తత్వాన్ని ప్రోత్సాహించాలనీ, పరుగు పందెంలో కుందేలుకి, తాబేలుకి డిఫరెంట్ యార్డ్‌స్టిక్ వుండాలనీ మా గురువుగారి అభిప్రాయం.

ముగింపు -

శ్రీ పరిమి ఆంజనేయశర్మ గారు.
సైన్స్ మరియు లెక్కల అధ్యాపకులు.
శ్రీ మాజేటి గురవయ్య హై స్కూల్, గుంటూరు.
డెబ్భై మరియు ఎనభయ్యవ దశకంలో మాలాంటి ఎందరికో స్పూర్తిప్రధాత.

మా గురువుగారి గూర్చి రాస్తూపొతే చదువరులకి విసుగనిపించవచ్చు. అంచేత నాకిష్టమైన, అలవాటైన విద్య - సినిమా సంగతుల్ని కలిపి రాశాను. అందుకోసం ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ గూర్చి రాశాను, అతని అభిమానులు సరదాగా తీసుకోగలరని నా నమ్మకం.    

78 comments:

  1. చాలా చక్కగా వ్రాసారు!
    ఒక్క విషయం. కర్ణ పేయముగా అంటే వినటానికి బాగుందని అండీ. మీరు ఇది మార్చి కర్ణకఠోరముగా అని వాడండి.

    ReplyDelete
  2. శ్యామలీయం గారు,

    ధన్యవాదాలు.

    నా తెలుగు సరిచేసినందుకు ఇంకోసారి ధన్యవాదాలు.

    (మీ సలహా పాటించాను.)

    ReplyDelete
  3. బాలకృష్ణలో మేము కామెడీ హీరోని చూసి ఆనంద బాష్పాలు కార్చేవారం. (అసలు నేను థియేటర్‌లో చూసిన బాకృ సినిమాలు రెండు ఆణిముత్యాలే లెండి)

    ReplyDelete
  4. @puranapandaphani,

    క్షమించండి. మీ అభిప్రాయంతో ఏకీభవించను.

    నేను బాలకృష్ణ అభిమానిని. నేనతన్ని గొప్ప మాస్ హీరో అనుకుంటున్నాను.

    రామారావు, నాగేశ్వరరావులు తెలుగు సినీరంగానికి రెండు కళ్ళ లాంటివారయితే.. చిరంజీవి, బాలకృష్ణలు రెండు కిడ్నీల వంటివారు!

    ReplyDelete
  5. మా నాన్నే, మా నాన్నే ,

    మా బాలకిట్టి గారి గురించి ఏమి చక్కగా చెప్పారు డాక్టరు గారు. జిలేబీ కూడా ఇందుకే బాలక్రిష్ణుడికి వంద మార్కులు ఇచ్చును !!

    ఇక మీ మేష్టారు గురించి, గురుభ్యోన్నమః! అట్లాంటి గురువులు మీకు ఉండడం మీరు చెసుకున్న పుణ్యఫలం.

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. యస్వీరంగారావు గారి డైలాగు సూపర్ అండి. నేను ఫేస్ బుక్ లో కూడా కాపీ చేసిపెట్టుకొన్నా. :)

    ReplyDelete
  7. ఎక్కడనుంచి ఎక్కడికి లాక్కుపోయారసలు! టపాలో ప్రతీ వాక్యం నవ్వించింది, నిజమనిపించింది. ఒఖ్ఖ "కాఫీ ఈజ్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ ఫిల్టర్ ఆర్ ఇన్స్టంట్" తప్ప. ఇన్స్టంట్ కాఫీ డివైన్ ఏమిటండీ.. అన్యాయం! :)

    wonderful post!! :)

    ReplyDelete
  8. @ గిరిజా కృష్ణ సూర్యదేవర,

    ధన్యవాదాలు.

    ఏంటో.. అలా కుదిరిపోయింది.

    ReplyDelete
  9. @కొత్తావకాయ,

    నాకూ instant coffee ఇష్టం లేదు. రాత కోసం అలా compromise అయ్యాన్లేండి!

    మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  10. జిలేబి గారు,

    మీరూ మా బాలయ్య అభిమానులా!

    మా గురువుగారి విషయంలో మీ వ్యాఖ్య బాగుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  11. All your posts are hilarious. Keep up the good work sir

    ReplyDelete
  12. Panileni yaramana garu,
    Panileni meeru oka s amajika vargasnni target chestu raastunnaru.go for positiv writings.

    ReplyDelete
  13. @nirmal,

    thanks for the advice.

    i'll try to be positive in future.

    ReplyDelete
  14. రమణ,
    ప్రస్తుతం గురువు గారు శ్రీ ఆంజనేయ శర్మ గారు హైదరాబాదులో ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు. నేనిప్పుడే వారితో మాట్లాడాను.
    నేను ఆయన దగ్గర శిష్యుడిగా 1972-73 లో ఉన్నాను. అప్పట్లో ఇంటిపరుతో పిలిచే అలవాటు ఎక్కువగా ఉండేది. ఆయనతో నా ఇంటిపేరు చెప్పగానే నా పేరుతో సహా మా బాచ్ లోని మిగతా వాళ్ల పేరు పేరున అందరి కుశలము అడిగారు. ఇప్పటి కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజీలలోని మాస్టర్లు బాగా చదివే వాళ్ళ మీద బాగా శ్రధ్ధ తీసుకుని వాళ్ళు పనిచేసే సంస్థలకు పేరువచ్చేటట్లుగా పాఠాలు చెప్తారు. కాని శ్రీ ఆంజనేయ శర్మ గారి లాంటివారు విధ్యార్ధులకు, ముఖ్యముగా అంత బాగా చదవలేని వాళ్ళకు వినయ, విధేయలతోబాటు మంచి స్పూర్తిని ఇచ్చే విధముగా, ఆ విధ్యార్ధుల తల్లి దండ్రులకు పేరు వచ్చేటట్లుగా పాఠాలు చెప్పేవారు.
    ఆయన చేత దెబ్బలు తినే శిష్యుడు కూడా రెండు చేతులెత్తి నమస్కారం పెట్టే వాళ్ళు. ఆయన ఫోనులో మాట్లాడుతూ "నానా, అప్పట్లో నాతో కలసి పనిచేసే గురువులతో చూశారా విధ్యార్ధులు మనకి నమస్కారాం పెడుతున్నారంటే, అది మన గొప్పదనము కాదు అది వాళ్ళ సంస్కారం" అన్నారుట" చూడండి ఎంత గొప్ప "గురువు". ఇంకా మాట్లాడుతూ, జీవితంలో బ్రతకడానికి దేవుడు నాకిచ్చిన వృత్తి అది. ఇప్పటికీ నా శిష్యులు ఫోన్లు చేస్తూ మీలాంటి "గురువులు" ఇప్పుడు లేరంటే "నానా, అది చాలా తప్పు. జీవితం లో ఎప్పుడూ పైకి ఎదుగుతూ పోయేటప్పుడు నాక్రింద ఎవరున్నారని చూసి గర్వమూ, మన పైన ఎవరో వున్నారని నిరుత్సాహమూ పడకూడదు. అప్పుడే మనకు "తృప్తి" అనేది దొరుకుతుంది" అన్నారు. నిజంగా ఆయన ఒక "ఋషి".
    ఆయన గురుంచి ఎంత వ్రాసినా చాలదు,
    నా "గురువు" గారికి ఇవే నా నమస్కారములు, కృతజ్ఞతలు.

    ReplyDelete
  15. గురూ గారు,
    మీరు తిట్టాలనుకొన్నపుడల్లా సుగర్ కోటింగ్ ఎక్కువ చేస్తారనుకొంటా, మరీ చేదు గా ఉండకుండా ఉండటానికి.
    రామా రావు కి కొంచెం కోటింగ్ వేశారు. కమ్యూనిస్టులకి కోటింగ్ కొంచెం పెంచారు. బాలకృష్ణ కి అసలు చేదు ఉంది అని కనుక్కోలేనంత కోటింగ్ వేశారు! :-)

    ReplyDelete
  16. గ్రేట్!
    మీ లాజిక్కూ, సెన్స్-ఆఫ్-హ్యూమరూ, ఇమేజినేషనూ....
    చాలా బాగుంది.
    శారద

    ReplyDelete
  17. @dsr murthy,

    అవును. నిజం. పూర్తిగా ఒప్పుకుంటున్నాను.

    గురువుగారితో నిన్న నేనూ కొద్దిసేపు ఫోన్లో మాట్లాడాను.

    (ఎప్పట్లానే) ఆయన జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపొయ్యాను.

    నేను ఆయన గూర్చి నా జ్ఞాపకాలతో మాత్రమే ఒక పోస్ట్ రాయాల్సిందేమో!

    ఎవరూ చదవకపోతే నష్టమేమి?

    అనవసరంగా బాలకృష్ణని ఇరికించానా?

    ఒక ఆలోచనని రాసేసుకుంటూ పోయి.. పబ్లిష్ చేసేస్తే.. ఇట్లాంటి ధర్మసందేహాలు/రిగ్రెట్స్ వస్తుంటాయేమో!

    ReplyDelete
  18. మీ గురువు లాటి గురువు అందరకి దొరకరు. మీరు,మీ సహాధ్యాయులు అందుకు అదృష్టవంతులు.
    చిరంజీవి-బాలకృష్ణ కిడ్నీ లు లాంటివారు అన్నారు. సినిమా రక్తం ని శుభ్రపరచే వారా!? నాగార్జున-వెంకటేష్ లని లంగ్స్ తో పోలుస్తారా? మరి హార్ట్ ఎవరబ్బా? ఏమిటో..ఇన్ని పిచ్చి ఆలోచనలు కల్గించారు.
    సినిమా జ్ఞానం కలగనందుకు విచారం. మీ పోస్ట్ తెగ నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  19. శారద గారు,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  20. బొందలపాటి గారు,

    హ.. హ.. హా.. !

    మీరు నా రహస్యాల్ని బయట పెడుతున్నారు.

    సరదాగా కేవలం స్నేహితులతోనే మాట్లాడుకునే అంశాలని కూడా పబ్లిష్ చెయ్యగలగడం బ్లాగ్ రైటింగ్ లో ఉన్న సౌలభ్యం. అంత మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉందంటారా?

    ఈ ఆలోచనలకి పత్రికలు ఎలాగూ దూరంగా ఉంటాయి. ఉదాహరణకి.. ఈ మధ్య జ్యోతి వాళ్ళు నా బ్లాగులు రెండు ప్రచురించారు. censor కత్తెర రుచి చూపారు. వాళ్ళకి ఉన్న ఇబ్బందులు మనకి లేవు. ఈ బ్లాగులు పైసా ఆదాయం లేని హాబీ. కావున మనసులోని ఆలోచనలని రాసేస్తూ పోవడమే నా పద్ధతి.

    మెచ్చుకున్నవారికి ఒక దండం. తిట్టేవాళ్ళకి రెండు దండాలు.

    ReplyDelete
  21. రమణ,
    నేను ఆయన గూర్చి నా జ్ఞాపకాలతో మాత్రమే ఒక పోస్ట్ రాయాల్సిందేమో!

    ఎవరూ చదవకపోతే నష్టమేమి?

    అనవసరంగా బాలకృష్ణని ఇరికించానా?
    అని వ్రాసావు.

    అని వ్రాసావు. ఈ సందర్భముగా ఒక విషయం. శ్రీ ఆంజనేయ శర్మగారి లాంటి "గురువులు" చదువుకోసం తమ దగ్గరకు వచ్చిన ప్రతి విధ్యార్ధికి ఆ విధ్యార్ధియొక్క మానసిక స్థితికి, బాగా కష్ఠపడి చదువుకునే వారికి అనుగుణంగా ఏవిధముగా ఎంకరేజ్ చేసేవారో అనే విషయంలో బ్లాగ్ చదివేవారికి అర్ధమవ్వాలని ఉద్దేశ్యంతో అందరికీ తెలిసిన ఒక బాలకృష్ణను ఉదహరించావు. అదే ఎవ్వరికీ తెలియని ఒక వ్యక్తినుదహరిస్తే ఒక గురువుగా శ్రీ ఆంజనేయ శర్మగారి "విధ్యాభోధన" లోని తపన ఎవ్వరికీ అర్ధం కాదు. సమాజములో అందరికీ తెలిసిన వ్యక్తినుదహరించినప్పుడు సహజముగా ఆ వ్యక్తి మీద అభిమానమున్నవారు ఇలాంటి సంధర్భములో తను అభిమానించే వ్యక్తికి బదులు ఇంకొకరిని ఉదహరించవచ్చు కదా అనుకుంటారు. ఇది వారి వారి అభిమానమూ, ఆలోచన మీద ఆధారపడుతుంది.
    ప్రతి వ్యక్తిలోనూ ఏ లోపాలు లేకుండా చూడగలిగే వారే "ఋషి".

    ReplyDelete
  22. తుఛ్ఛ డింభకా!! హ హ హ...డాక్టరు గారూ కెవ్వుమనిపించారు..

    ReplyDelete
  23. @వనజవనమాలి,

    నా చిన్నప్పుడు NTR,ANR లు చిత్రసీమకి రెండు కళ్ళు అనేవాళ్ళు! కానీ.. ఈ రెండు కళ్ళు అన్న పదాన్ని చంద్రబాబు unpopular చేసేశాడు. అంచేత రెండు చెవులు, రెండు కాళ్ళు అనేకన్నా రెండు కిడ్నీలు అంటే గంభీరంగా ఉంటుందని అలా అనేశాను. వాస్తవానికి చిరంజీవి, బాలకృష్ణలు రెండు ఇడ్లీలు కూడా కాదు. నాకు చిరంజీవి, బాలకృష్ణల 'గొప్ప నటన' కే కళ్ళు తిరుగుతుంటయ్. మరి మీరేమో మీరు వెంకటేష్, నాగార్జున అంటూ ఎవరెవరి పేర్లో చెబుతూ నన్ను గాభరా పెడుతున్నారు.

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  24. @Krishna Mohan,

    అప్పుడప్పుడు చక్కగా రాస్తుంటానండి! థాంక్యూ!

    ReplyDelete
  25. @సుభ,

    మీరు కెవ్వు మన్నారంటే టపా బాగున్నట్లే!

    ధన్యవాదాలు.

    ReplyDelete
  26. This comment has been removed by the author.

    ReplyDelete
  27. రమణ గారు,
    మా [మన] గురువు గారి గురించి అంత బాగా వ్రాసినందుకు, గుర్తుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదములు.
    నేను కూడా ఆంజనేయ శర్మ గారి శిష్య పరమాణువునే.
    నా 8వ తరగతిలో గురవయ్య హై స్కూల్లో మాకు పిరియాడిక్ టేబుల్ గొప్పతనం గురించి చెప్పిన క్లాసు నాకు ఇప్పటికి గుర్తు ఉన్నది నాకు.
    ఆ మాస్తారికి మా బాచ్ మొత్తంలో మొత్తం పిరియాడిక్ టేబుల్ మొత్తం కంఠతా చెప్పగల "ఒక్కడే ఒక్కడు" గా నా పేరు ఆయనికి గుర్తు. ఇది నాకు చాలా నచ్చిన విషయం, ఎందుకో మరి ;)
    ఇంచుమించు అలాంటి ఆదరణ ప్రేమ నాకు తుర్లపాటి గారి ఇంటి వద్ద, బడిలో లెక్కలు నేర్చుకునేటప్పుడు నాకు కనిపించింది.
    ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు.

    నాకు తెలిసిన ఫ.వె.ఆ.హ రమణ [పబ్బరాజు] డాక్టరు కాదు, సివిల్ ఇంజనీరింగ్ చేసి, కంప్యూటర్ పని చేస్తున్నట్లు గుర్తు. మరి?
    నేను కూడా ఒక ప్రభుత్వ చిరు వుద్యోగినే, కాక పొతే, గత దశాబ్దంగా అమేరికా లో ఉంటూ ఇక్కడ ఒక ప్రభుత్వ శాఖలో పని చేస్తున్నాను.
    నేను మీకు తెలిసిన సుబ్బారావుని కాదనుకుంటా, నాకు ఆముదం అంటె పరమ చికాకు కూడా. ;)
    మీరు మరీ టూమచ్ గా సుబ్బారావు పేరుని మీ బ్లాగ్ లో బాగా అన్ పాపులర్ చేస్తునా రండోయ్. పనికి మాలిన చెత్త రమణ అంటూ నాచేత కూడా ఒక రివెంజి బ్లాగ్ వ్రాయించేలా వున్నారే? ;)
    -- సుబ్బారావు మేళ్ళచెరువు

    ReplyDelete
  28. @MS,

    మీ ఆలోచనలని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    అవును. పిరియాడిక్ టేబుల్ అనేది ఆంజనేయశర్మగారి శిష్యులకి కొట్టిన పిండి.

    >>మీరు మరీ టూమచ్ గా సుబ్బారావు పేరుని మీ బ్లాగ్ లో బాగా అన్ పాపులర్ చేస్తునా రండోయ్. పనికి మాలిన చెత్త రమణ అంటూ నాచేత కూడా ఒక రివెంజి బ్లాగ్ వ్రాయించేలా వున్నారే?

    అవును సుమా! ఈ మధ్య నేను సుబ్బారావు పేరు ఎక్కువ వాడుతున్నట్లున్నాను. ఈ పేరంటే నాకింత ఇష్టమని తెలీదు!

    ఆవదం సుబ్బడు ఒక ఫిక్షస్ క్యారెక్టర్. అయితే నేను ఒక పోస్టులో డాక్టర్ సుబ్బారావుని కూడా పరిచయం చేశాను. మీరు గమనించనట్లుంది.

    అయినా పేరుదేముందండి? అ,ఆ,ఇ,ఈ అని పెడితే బాగోదని.. పిలుచుకోడానికి ఒక గుర్తే పేరు.

    నా పోస్టుల వల్ల తెలుగు సినీ హీరోల అభిమానుల 'మనోభావాలు' దెబ్బ తింటున్నాయని తెలుసు. ఇప్పుడు మీరు కొత్తగా 'సుబ్బారావుల మనోభావాల' ని రంగం లోకి తెచ్చారు!

    సో.. మీ సుబ్బారావులంతా మా రమణల మీద రివెంజ్ బ్లాగులు రాస్తే చదవడానికి సిద్ధంగా ఉన్నాం! బెస్ట్ ఆఫ్ లక్.

    ReplyDelete
  29. బాలకృష్ణ అభిమానం అనగానే అనుకున్నాను "పడుతుంది కాజా" అని. నా అంచనాలని ఏమాత్రం తప్పకుండా పడింది :))

    Hilerious...superb! ఎక్కడినుండి ఎక్కడికి ముడెట్టారండీ! :))
    బాలకృష్ణ డాన్సు చూసినప్పుడల్లా నేను అనుకుంటాను...ఎంత కష్టపడుతున్నాడు,ఆపసోపాలు పడిపోయి మరీ డాన్సు చేస్తున్నాడు అని. :))

    మీ గురువుగారిలాంటి గురువుగార్లు ఆ కాలంలో ఉండేవారు. వారికి నా నమస్సులు! వారి దయార్దృ హృదయానికి జోహార్లు!

    ReplyDelete
  30. రమణ గారూ, సుబ్బారావుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలంటే నాదొక సలహా. ఇప్పడికే సుభాషితాల సుబ్బు మీ బ్లాగులో నిజమయిన కథానాయకుడు కదా. పైపెచ్చు ఆయన ఒక మేధావి కూడానూ.

    ఆయన పూర్తి పేరు డా. అవడం సుబ్బారావని ప్రచారం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలంటే ఆయనకు మీరు తరుచూ ఆడిపోసుకునే వర్గాన్ని అంటకట్టేస్తే సరి. అలాగే గురువు గారి ప్రేరణతో కష్టపడి ఎదిగి పదో క్లాసుకల్లా అందరిని తలదన్నే మార్కులు తెచ్చుకున్నాడని కూడా చెప్పొచ్చు.

    ReplyDelete
  31. @ఆ.సౌమ్య,

    హలీవుడ్ లో method acting చాలా పాపులర్.

    మన బాలకృష్ణది laborious acting అనవచ్చునేమో!

    ReplyDelete
  32. @Jai Gottimukkala,

    మీ సలహా బాగానే ఉంది.

    >> ఆయనకు మీరు తరుచూ ఆడిపోసుకునే వర్గాన్ని అంటకట్టేస్తే సరి.

    మీరు కూడా నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటే ఎలాగండి!

    ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకూడదనుకుంటే.. కడుపు నొప్పి, విరోచనాలు, వీపు దురద అంటూ చచ్చుపుచ్చు వైద్యసలహాలు/విషయాలు రాసుకుంటూ బతకాలి.

    ఈ మధ్య కొందరు తుమ్ము ఎందుకు వస్తుంది? దగ్గు అంటే ఏమిటి? అంటూ రాస్తున్నారు. (తుమ్మొచ్చినప్పుడు తుమ్మండి. దగ్గొచ్చినప్పుడు దగ్గండి. అంతే! వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుని కొత్త సమస్యలు కొని తెచ్చుకోకండి!)

    లేదా.. వరలక్ష్మి వ్రతమహత్యం రాసుకోవాలి.

    ఆ పరిస్థితే వస్తే.. బ్లాగ్ రాయడం ఆపేస్తే పీడా వదిలిపోతుంది.

    ReplyDelete
  33. రమణ గారూ, మీరు ఒక వర్గాన్ని కానీ, ఒక పేరున్న వ్యక్తులను కానీ టార్గెట్ చేయడం లేదని నాకు తెలుసు.

    I should have said "the caste which you *allegedly* run down". ఇది తెలుగులో సరిగ్గా చెప్పడం నా చాత కాలేదు. నా వచ్చీ రాని తెలుగులో కష్టపడుతూ పెట్టె బాధ భరిస్తూ నా భావాన్ని సరిగ్గా అందించలేకపోయాను.

    పెద్దమనసుతో క్షమించండి. అంటే తప్ప తుమ్ము దగ్గు విరేచనాల గురించి రాసి సుబ్బుని మాకు దూరం చేయొద్దు.

    ReplyDelete
  34. "నా వచ్చీ రాని తెలుగులో కష్టపడుతూ Google Transliteration పెట్టె బాధ భరిస్తూ"

    ReplyDelete
  35. arachakam sir... sooooooooooooperrrrrrrrr ;)

    ReplyDelete
  36. అద్దరగొట్టేహారంతే రమణ గారూ(కిం.ప.దొ.న)

    మీ గురువుగారికి వందనాలు వంద వందనాలు,అటువంటి గురువుల శిష్యరికం లో పెద్దవారయినందుకు మీకు అభినందనలు

    ReplyDelete
  37. chala bagundandi.. mee guruvu gariki, naa vandanaalu..cheppandi..

    vasantham.

    ReplyDelete
  38. @Jai Gottimukkala,

    అమ్మయ్య! థాంక్సండి.

    సరదాగా మనసుకి నచ్చిన పాయింటుని బ్లాగుగా రాసేస్తున్నాను. అంతే!

    ReplyDelete
  39. @రాజకుమార్,

    thaaaankyoooooo!!!

    ReplyDelete
  40. @శ్రీనివాస్ పప్పు,

    థాంక్యూ! బాలకృష్ణ స్టెప్పులు, సీన్లు అప్పుడప్పుడు టీవీలొ చూడ్డం తప్పించి.. నాకింతవరకూ అతని సినిమా చూసే భాగ్యం కలగలేదు!

    ReplyDelete
  41. @vasantam,

    ధన్యవాదాలు.

    ReplyDelete
  42. రమణ గారు, 'వచ్చీరాని తెలుగులో' కష్టపడిపోతూ చెప్పలేక, ఇంగ్లీషులో ఆశువుగా నుడివిన మాటలు మీకు అర్థమయివుంటే తెలుగులో చెప్పరూ...
    "the caste which you *allegedly* run down" అంటే ... "కులము ఏదైతే,ఆరోపించినట్లు మీరు కిందికి వురక బట్టిండ్రో" అనుకోవచ్చా? :D

    ReplyDelete
  43. @SNKR:

    గదే మక్కీ కి మక్కీ అంటే మల్ల. Literal transliteration వల్ల భయంకరమయిన పరిణామాలు వస్తాయని చెప్పే జోకు ఒకటి గుర్తుకొస్తుంది.

    The saying "the spirit is strong but the flesh is weak" is "translated" into Russian using a online service. The resullting phrase "translated" back to English now reads "the meat is rotten but the vodka is good".

    "ఏ కులాన్నయితే మీరు అడిపోసుకుంటారని కొందరు అపోహ పడుతారో" would have conveyed the meaning better. Not sure how it will fit in the rest of the sentence though.

    ReplyDelete
  44. @yaramana:

    "బాలకృష్ణ స్టెప్పులు, సీన్లు అప్పుడప్పుడు టీవీలొ చూడ్డం తప్పించి.. నాకింతవరకూ అతని సినిమా చూసే భాగ్యం కలగలేదు!"

    వెంటనే ఈ లోటు తీర్చుకోండి.

    అలాగే మహానటుడు ఈటీవీ సుమన్ గారి గురించి కూడా మీరు ఒక టపా రాయగలరని మా కోరిక.

    ReplyDelete
  45. > వరలక్ష్మి వ్రతమహత్యం రాసుకునే పరిస్థితే వస్తే బ్లాగ్ రాయడం ఆపేస్తే పీడా వదిలిపోతుంది.
    Objection please.
    నేను నా నవకవనవనం బ్లాగులో శ్రీమద్భాగవతమహాత్మ్యం కావ్యం వ్రాసుకుంటున్నాను. అదేదో దీనపరిస్థితి అన్నట్లు ఉంది మీ statement. ఆపేది లేదు అని మనవి చేసుకుంటున్నాను. (మీరు చదివేదిలేదు అని నాకు repartee ఇవ్వనవుసరం లేదు. నేను ఎవ్వరినీ నా కవిత్వం చదివమని బలవంతం చేయటం లేదు)

    ప్రస్తుతానికి వరలక్ష్మి వ్రతమహత్యం అనే కావ్యమేదీ వ్రాసే ఉద్దేశం లేదని హామీ ఇస్తున్నాను.

    ReplyDelete
  46. శ్యామలీయం గారు,

    మీ కామెంట్ చదివి పగలపడి నవ్వుతున్నాను.

    సీరియస్ గా జోకులు వెయ్యడంలో.. సరిలేరు మీకెవ్వరు.

    మీరు రాస్తే ఏ వ్రత మహత్యమైనా చదవడానికి నేను రెడీ. కానీ నాకు వ్యవహారిక తెలుగు మాత్రమే వచ్చు. కాబట్టి అర్ధమయ్యే అవకాశం లేదు.

    ఏదో ఫ్లోలో అలా రాసేశాను. మన్నించండి.

    ReplyDelete
  47. ఎవరండీ ఇక్కడ వరలక్ష్మి వ్రతం గురించి అన్నేసి మాటలు అన్నది. అఆయ్!!!

    ఎక్కడ నా కత్తి, ఎక్కడ నా బాణం, ఎక్కడ నా విల్లు అందుకో స్వామీ విల్లు ఎక్క పెట్ట వలసినదే ఇమ్మీడియట్లీ



    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  48. నేనూ సరదాగానే ప్రతిస్పందించాను. మీకు వ్యావహారిక మైన తెలుగు మాత్రమే వచ్చునన్నారు. చాలా సంతోషం. అయితే మీరు తప్పకుండా శ్రీమద్భాగవత మాహాత్మ్యం కావ్యాన్ని చదవగలరని నావిశ్వాసం. ఇందులో జటిలభాషావిన్యాసాలు యేమీ ఉండవండి.

    మీరు చదవదలచుకుంటే లింక్
    http://syamalatadigadapa.blogspot.in/

    ReplyDelete
  49. శ్యామలీయం గారు,

    'వ్య'వహారిక అని రాశాను. మీ వ్యాఖ్య చూసి 'వ్యా'గా ఇప్పుడు సరిచేసుకుంటున్నాను. మీరు నా టపాల్లో కనిపించే తెలుగు దోషాల్ని ఓపికగా సరి చేస్తున్నారు. ధన్యవాదాలు.

    మీ లింక్ చదువుతాను. థాంక్యూ!

    ReplyDelete
  50. @Jai Gottimukkala,

    ఇంట్లో అందరూ మహేష్ బాబు అభిమానులు. నాకు ఒక మహేష్ బాబు సినిమా చూపించడానికి పదేళ్ళుగా అనేక కుట్రలు చేస్తున్నారు. 'దూకుడు' జస్ట్ మిస్! నేను భవిష్యత్తులో ఏదైనా సినిమా అంటూ చూస్తే గీస్తే అది మహేష్ బాబు సినిమానే అవ్వచ్చు.

    మా పిల్లలు బాలకృష్ణ, చిరంజీవిల సినిమా ఫ్రీగా చూపించినా చూడమంటున్నారు.

    మీరు చెప్పే ఈ టీవీ నటుడి గూర్చి బ్లాగుల్లో చదివి నవ్వుకోవడం తప్పించి.. వారి నటనా చాతుర్యాన్ని ఎప్పుడూ చూళ్ళేదు. కాబట్టి అదృష్టవంతుణ్ణి.

    ReplyDelete
  51. సినీమాలు!
    వీటిలో వినిపించే అత్యంతదయనీయమైన తెలుగూ
    వీటిలో కనిపించే అతిజుగుప్సాకరమైన దృశ్యాలూ
    వీటిలో వినిపించే ప్రళయకాలపర్జన్యగర్జానుకారి ఢమఢమ రొదల సంగీతమూ
    వీటిలో కనిపించే నీచనికృష్టనటనావికటవిన్యాసవిజృంభణలూ
    ఇవన్నీ తప్పించుకుంటే అదృష్టవంతులంగాదా.

    టీవీలు.
    అయ్యో సినిమాలే నయమనిపించే నిత్యరోదనాశీలి టివిని కూడా కట్టిపెట్టగలిగితే మరింత అదృష్టవంతులంగాదా.

    ఇవన్నీ లేని రోజుల్లో ప్రజలు యెంత ఆనందంగా జీవించేవారో తలుచుకుంటేనే అద్భుతంగా ఉందే!

    ReplyDelete
  52. జిలేబి గారు,

    మీ కామెంట్ స్పాం లో ఉంది. ఇప్పుడే బయటకి లాక్కొచ్చాను.

    వరలక్ష్మి వ్రతానికున్న పవరేంటో తెలిసింది.

    మీ ఆగ్రహాన్ని తట్టుకోలేకపోతున్నా.

    అర్భకుడను. నా అజ్ఞానాన్ని మన్నించవలసిందిగా వేడుకొనుచున్నాను.

    (నేనిప్పుడు శ్యామలీయం గారి వెనుక దాక్కొనెదను.)

    ReplyDelete
  53. బాలకృష్ణ మీద అభిమానం అనగానే ఒక్కసారి ఆశ్యర్యమనిపించింది. ఇదేంటీ ఈయన మొన్నటి వరకు బాగానే ఉన్నారే....ఇప్పుడేమయిందబ్బా అనుకున్నా. మొత్తానికి మంచి టపా. మీ గురవుగారు నాకు తెగ నచ్చేసారు. నాదీ అదే ఫిలాసఫీ. నోట్స్ రాయడం అన్నా, చదవడం అన్నా మహ చెడ్డ చిరాకనుకోండి. నోట్స్ రాయకుండా చిన్నప్పుడు టీచర్లతో ఎన్ని తిట్టు తిన్నానో నాకే తెలుసు.( మా అక్కకు కూడా తెలీదు). మీ గురువర్యులకు నా ప్రణామములు.

    ReplyDelete
  54. @మనోజ్ఞ,

    బాలకృష్ణ ఇప్పటికీ నా అభిమాన నటుడే! అతని కష్టాన్ని చూసి మీకు గుండె తరుక్కుపోవట్లేదా!

    నోట్సులు రాయడం ఒక దరిద్రం. నోట్సులు చెప్పేవాళ్ళు దరిద్రులు. దురదృష్టవశాత్తు చాలా మంది టీచర్లు నోట్సుల వీరుళ్ళు. పాడిందే పాటగాళ్ళు. వీళ్ళకి టీచింగ్ అనేది ఒక రిట్యువల్. ఈ రోజుకీ టీచర్లు పిల్లల్ని తన్నే సంస్కృతిలో ఉన్నందుకు మనం సిగ్గు పడదాం.

    పిల్లలకి పాఠాలు (అర్ధమయ్యేలా) చెప్పడం చాలా తెలివైన, కష్టమైన వృత్తి. అందుకే కొందరు మాత్రమే ఈ రంగంలో విజయం సాధించగలరు. వారిలో మా ఆంజనేయశర్మగారు ఒకరు.

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  55. post బాగుంది. మాస్టారి మాటలకోసం మళ్ళీ చదివాను.
    ఓపిక చేసుకుని ఈ కింది వీడియో చివరి వరకూ చూడండి.

    http://www.youtube.com/watch?v=xsl2ta3UVjU

    ReplyDelete
  56. చదువు రాని విద్యార్దిని మీ గురువుగారు చంకకెత్తుకున్నట్లు నటనరాని బాలయ్యను మన నెత్తికెత్తుకున్నామని .చెప్పకనే చెప్పారు డాక్టర్ గారు..

    ReplyDelete
  57. @ChanduS,

    thanks for the link.

    enjoyed Balakrishna's excellent dancing!

    ReplyDelete
  58. ఒకే ఒక్క మాట...కేక!

    ReplyDelete
  59. రమణ గారు,
    ఆంధ్ర జ్యోతి లో మీ బ్లాగ్ పేజి చదివాను. ఈరోజు ఇక్కడ మీ బాలకృష్ణ పోస్ట్ చూసాను. నేను బాలకృష్ణ అభిమాని అనగానే ఏదో ఒక మూల ఇంకా చదవాలా అని ఒక సందేహం, సరే చూద్దాం అని మొత్తం చదివాక, ఇంత మంచి మాస్టారి గురించి రాసినందుకు , దానిని చెప్పిన విధానం , మొత్తం మీద ఈరోజును అద్భుతం గా మొదలెట్టిన్చినందుకు, ధన్యవాదాలు.
    రాజశేఖర్

    శ్యామలీయం గారు, మీరన్నట్లు పిల్లలు కార్టూన్ లకు, స్త్రీలు ఏడుపు సీరియళ్ళకు, మగవాలు క్రికెట్ లేదా సినిమా చానెల్స్ కు పెద్దలు న్యూస్ చానెల్స్ కు అంకితం అయి ఇళ్ళలో ఒకరికొకరు చాలా దూరంగా బతుకు తున్నారు. ఇవన్ని లేని కాలం లో జీవితం బాగుండేది......

    ReplyDelete
  60. Dr.Rajasekhar గారు,

    థాంక్యూ!

    ReplyDelete
  61. intaki Balakrishna visayam lo ayyanni encourage chestunna teacher evaru?

    ReplyDelete
    Replies
    1. ayana abhimanule ayana teachers....

      Delete
  62. రమణ గారు బాగుంది. మీరు ఇంకా సుమన్ సినిమా చూడలేదా ? చాలా మిస్ అవుతున్నారు.ఓ సారి చూడండి మీ వ్యంగ్యం మరింత రాటు దేలుతుంది .

    ReplyDelete
  63. chaala rojula taruwaata oka manchi blog lo writeup chadivaanu...
    mee write-up chala bagundi and comments kooda chala chakka ga vunnaie... keep going ....me fan list lo memu cheripoyamm :)

    ReplyDelete
  64. అద్భుతమండి :) వెలుగు చూపే గురువులు అందరికి వందనాలు.

    ReplyDelete
  65. yaramana
    first congratulations
    I am also from guntur but now in USA. I never had a class with Anjaneya sarma garu , however My friends were in his tution in 5 th line. We used to live in 4 th line and attended his tution only one day and that day , the love and affection he showered on me though I was not student just becuase he knew me that I was a student in Mageti guravaih school and was living in 4 th line He had lot of memory, and run down the list of the people with my last name living in guntur at that time. Really a nice person .He used to supply each student a small wooden plank for support for writing That used to create curious at that time. great guy!!

    with regard to balakrishna's dance and dialogues it is really hilarious. I get total comedy the moment he enters the scene. I do some mimicry and I do how he walks and talks in the presence of our friends (his shape), families- a one and onlly "actor". I guess he is the comedy king of the telugu movie. this is the first time I saw your blog. some one send me. nice meeting our gunturians.

    ReplyDelete
  66. After looking at comments....Janalu kosaru vishayniki (Balakrishna) ichina importance Asalu vishayani ivvaledu anipinchindi....Enthaina manam alpa santhoshulamu...athi medhavulamu kada!!!!!

    ReplyDelete
  67. It's beautiful analogy. Mee guruvu gariki vandanalu.

    ReplyDelete
  68. Chala bhagundhi sir. Visuga a ? nenu inko padhi sarlu aena chadhuvuthanu.

    ReplyDelete
  69. Sir, This post is very good. You reminded me my high school days and friends. Government Junor College, Darsi, Prakasam Dt in years 1980 to 83 i studied there. Thanks for ur hiloriuos post.

    ReplyDelete
  70. ఈ పోస్ట్.. DANCE లో D కూడా చేతకాని పవన్ కళ్యాణ్ కి రాసుంటే సరిగ్గా ఉండేది.

    ReplyDelete
  71. orey vedhava

    ReplyDelete
  72. rey ramana inkosari balayya gurinchi extralu rasavo pagilipoddi

    ReplyDelete
    Replies
    1. అయ్యా హరి గారూ,

      నేనీ టపా రాసి సంవత్సరం దాటింది. రాసినవాణ్ణి నేనే మర్చిపొయ్యాను. ఇన్నాళ్ళకి మీ మనోభావాలు దెబ్బ తిన్నట్లున్నాయ్!

      మీరింత మర్యాదగా చెప్పిన తరవాత బాలయ్య గురించి రాయడానికి నాకెన్ని గుండెలు! ఇంక రాయన్లేండి!

      Delete
    2. ఎన్ని కోట్ల మంది నోరు మూయించగలవు హరీ? మీ బాలయ్య సినీమాలు చూసి తలబాదు కొనేవాళ్ళకు కనీసం యిలా సేదతీరే హక్కు వుంది

      Delete
  73. hero medha abimana vundavachchu gni pichchi vunda kodadu

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.