"ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? రిచర్డ్ హాడ్లీకి ఇడ్లీ తినిపించాను, మెక్‌గ్రాత్‌ని మంచినీళ్ళు తాగించాను, షేన్ వార్న్‌కి వార్నీషు వేశాను, అక్రంని అప్పడంలా నమిలేశాను, ఉమర్ గుల్‌ని గుడ్డలా ఉతికేశాను (ప్రాస కోసం ప్రయాసల్ని పాఠకులు గుర్తించగలరు). కానీ.. కానీ.. ఈ వందోసెంచరీ ఎందుకు చెయ్యలేకపోతున్నాను? చెయ్యలేకపోతున్నాను? చెయ్యలేకపోతున్నాను?"
అదో ఐదు నక్షత్రాల హోటల్, అందులో ఓ విశాలమైన గది. గది మధ్యలో నిద్రపోతున్న గున్నేనుగులా డబుల్ కాట్, దానిపై మంచు కప్పేసినట్లు తెల్లని బెడ్ షీట్. ఓ పక్కగా అందమైన సోఫా. ఆ మూలగా ఒక టేకుబల్ల, దానిపై టేబుల్ లైట్.
ప్రస్తుతం ఆ గదిలో ఒక నడివయసు వ్యక్తి సోఫాలో జారగిలిపడి శూన్యంలోకి చూస్తున్నాడు. పరీక్షగా చూస్తే అతను తీవ్రఆలోచనల్లో మునిగున్నాడని అర్ధమౌతుంది. అతడి నామధేయం సచిన్ టెండూల్కర్, క్రికెట్ క్రీడాకారుడు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అభిమానులు, బ్యాంకులవారిగా కోట్లాది రూపాయిలు అతగాడి సొంతం.
విధి బలీయమైనది, క్రూరమైనది కూడా! క్రికెట్ బ్యాటుతో ప్రపంచాన్ని శాసించిన సచిన్బాబుకి ఈమధ్యన అనేక కష్టాలు మరియూ కడగండ్లు! అతనిప్పుడు అశోకవనంలో సీతలా (దుఃఖించడానికి ఆడామగా తేడాలుండవ్) శోకమూర్తియై, ఆలోచనా కడలిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
'అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను గదా! సాయిబాబా బొమ్మ జేబులో పెట్టుకుంటున్నాను. బ్యాటు, హెల్మెట్లకి లార్డ్ బాలాజీ టెంపుల్లో స్పెషల్ పూజలు చేయిస్తున్నాను. కారు నంబర్ మార్చాను, ఇల్లు మారాను, ఈశాన్యం వైపు తిరిగి కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను. ఎర్రరంగు కలిసొస్తుందంటే ఎర్రరిబ్బను కట్ డ్రాయర్లో దోపుకుని బ్యాటింగు చేస్తున్నాను. కానీ.. కానీ.. ఎందుకిలా?" బాధగా నిట్టూర్చాడు, కంట్లో పల్చటి కన్నీటి పొర.
ఇంతలో కిర్రుమంటూ గది తలుపు తెరుచుకుంది (గది తలుపు ఎప్పుడూ కిర్రుమనే తెరుచుకుంటుంది, ఇంకోలా తెరుచుకోలేదు). ఒక నడివయసువాడు.. బట్టతల, పిల్లి గెడ్డంతో ఉన్నవాడు.. ఫుల్ సూట్, బ్లాక్ షూ ధరించినవాడు.. లోపలకొచ్చి సచిన్‌కి ఎదురుగానున్న సోఫాలో కూర్చున్నాడు. అతని తల ఇత్తడి చెంబులా, కళ్ళు గోళీకాయల్లా ఉన్నాయి. శరీరం బక్కగా, సరివి కట్టెకి సూటూబూటూ తొడిగినట్లున్నాడు. అతగాడు ఆ డ్రస్సు ఠీవీ కోసం కన్నా, గాలొస్తే ఎగిరిపోకుండా రక్షించుకుందుకు వేసుకున్నాడనిపిస్తుంది.
"సచిన్! అయాం డాక్టర్ మరణం. నాపేరు విండానికి గమ్మత్తుగా వుంటుంది. మా తాత చనిపోయిన రోజే నేను పుట్టాన్ట. నాతండ్రి ప్రముఖ నాస్తికుడు. అంచేత నా తండ్రి తన తండ్రి మరణానికి గుర్తుగా నాపేరు 'మరణం'గా ఫిక్సయ్యాడు. నేను ఆంధ్రాలో ప్రముఖ సైకాలజిస్టుని. మీకు సాయం చేద్దామని వచ్చాను." అన్నాడు డాక్టర్ మరణం.
టెండూల్కర్‌కి విసుగ్గా ఉంది. కానీ కష్టాల్లో ఉన్నాడు, నమ్మకాల్ని తీవ్రంగా నమ్మినవాడు. అంచేత సహనం వహించి డాక్టర్ మరణం అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పాడు.
"చివరి ప్రశ్న. ఈమధ్య మీకు ఒకబంతి రెండుబంతులుగా కనిపిస్తుందా?" అడిగాడు డాక్టర్ మరణం.
సచిన్ ఒక్కక్షణం ఆలోచింఛి, అవునన్నట్లు తల ఊపాడు. విషయం అర్ధమయిందన్నట్లు తల పంకించాడు డాక్టర్ మరణం.
"సచిన్! మీ కేస్ చాలా సింపుల్. మీరు మీ వందో సెంచరీ గూర్చి ప్రీ ఆక్యుపై అయ్యున్నారు. పొద్దస్తమానం వంద సంఖ్య గూర్చే ఆలోచించడం మూలానా, మీకు తెలీకుండానే ఆ వందలో ఉన్న రెండుసున్నాలు మీ మనసులో బలంగా నాటుకుపొయ్యాయి. అందుకే మీకు గ్రౌండులో కూడా రెండుసున్నాలు కనబడుతున్నయ్. గ్రౌండులో రెండుసున్నాలంటే రెండుబంతులు. కావున మీకు ఒకబంతే రెండుగా కనిపిస్తుంది. అంచేతనే మీరు ప్రతి అడ్డమైనవాడికి మీ వికెట్ సమర్పించుకుంటున్నారు."
సచిన్ ఆసక్తిగా అడిగాడు - "ఇప్పుడు నేనేం చెయ్యాలి?"
"వెరీ సింపుల్! మీ రెండుసున్నాల్ని ఒకసున్నాకి మారిస్తే సమస్య పరిష్కారం అయినట్లే. ఈక్షణం నుండి మీరు వంద గూర్చి ఆలోచించడం మానెయ్యండి. ఇప్పట్నించి మీ సంఖ్య పది. మీరు ఈ పది నంబర్ని జపిస్తూనే వుండండి. మనసులోంచి వంద చెరిగిపోయి పదిముద్ర పడాలి. అప్పుడు మీకిక బంతి ఒకటిగానే కనిపిస్తుంది. పదిలో ఉంది ఒక సున్నానే గదా!" అంటూ లేచాడు డాక్టర్ మరణం.
మరి - డాక్టర్ మరణం సలహా సచినుడికి పని చేస్తుందా? చూద్దాం!
హాయిగా నవ్వుకున్నాను మీ పోస్ట్ చదివి.Nice one!
ReplyDeleteguddu
ReplyDeleteడాక్టర్ మరణం కి తట్టిన సమాధానం ఇన్నాళ్ళు సచిన్ కి ఎందుకు తట్టలేదు. ఒకవేళ ఆ ఫది కూడా కష్టమైతే ఏమీ చెయ్యాలి? రాహుల్ కి అమ్మ ఉంది. సచిన్ కి నాన్న కూడా లేదు కదా...
ReplyDelete- ఒక అయోమయ జీవి
- పుచ్చా
good one
ReplyDeleteమరణం ఐ లవ్ యు
ReplyDeleteమీరు టచ్ చెయ్యని టాపిక్కే ఉండదా,
ReplyDeleteఇది అందరికి తెలిసిందే ఐనా చాలా బాగుంది.
యరమణ , డా. మరణం కింద మారేరా.
కాముధ
మితృలారా,
ReplyDeleteధన్యవాదాలు.
పొద్దున్నే మెళకువొచ్చింది. బ్రష్ చేసుకుంటుంటే ఈ ఐడియా వచ్చింది. ఇంక ఆలస్యం దేనికి? మంచి కాఫీ తాగుతూ రాసేశాను.
మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
ఈ మధ్య టెండూల్కర్ పరిస్థితి మరీ దీనంగా తయారైంది. బుకీ గాడు ఎవడైనా అతను సెంచురీ కొట్టేట్లు మ్యాచ్ ఫిక్స్ చేస్తే బాగుణ్ణు! వేరే మార్గం కనబడట్లేదు.
అదరగొట్టావు రమణ,
ReplyDeleteఉండు! నేనిప్పుడే నా ఫ్రెండ్ టెండూల్కరికి ఈ విషయం మరల గుర్తు చేస్తాను. ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లున్నాడు. నాతో కలిసి ఆడినంతకాలం ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. నా ఉద్దేశ్యం "పాకిస్తాను" వాళ్ళు గ్యారంటీగా చేతబడి చేసుంటారు. నీకు గుర్తుందో లేదో వరల్డ్ కప్పులో అఫ్రీదిగాడు "మాచ్ ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఎట్టిపరిస్థిలో టెండూల్కర్ ని 100 లోపలే ఔట్ చేస్తాము" అన్నాడు. ఎంత ఖర్చయినా పర్వాలేదు. డా. మరణం చేత మరల కౌన్సెల్లింగ్ ఇప్పాంచాల్సిందే. నీవు ఆ పనిమీదే ఉండు.
రమణగారూ,
ReplyDeleteమీరు పనిలేక రాసిన టపాలే నాకు నచ్చుతున్నాయండీ. పనిగట్టుకుని రాసినవి అంతగా నచ్చట్లేదు :)
ఈ సలహా సచిను ఫాన్స్ కి కుడా నండోయ్. భావి భారత రత్న కోసం ఆందోళన చెందడం, టపా కట్టడం అభినందనీయం
ReplyDeleteIf he really reads yours (or not) and gets his 100th century he should pay Dr. Maranam's fees to you as Ya Ra is Dr. MaraNam! Mari neeku full black suit undaaa?
ReplyDeletejust realized, "ma ra na" is a jugglery of "ra ma na".
ReplyDeleteGood one sir.
డాక్టర్ గారూ,
ReplyDeleteనేను కూడా ఎప్పుడూ అదే అనుకుంటాను సచిన్ సేవలు ఇంకా భారతదేశానికి అవసరమా అని.హుందాగా తప్పుకొని కుర్రాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి.
కాని మీ ట్రేట్మెంట్ పనిచేసి ఇవ్వాళ 100 చెసేటట్లు వున్నాడు.
రమేష్ బాబు గుడివాడ
డాక్టర్ గారూ,
ReplyDeleteనేను కూడా ఎప్పుడూ అదే అనుకుంటాను సచిన్ సేవలు ఇంకా భారతదేశానికి అవసరమా అని.హుందాగా తప్పుకొని కుర్రాళ్ళకి అవకాశం ఇచ్చేదానికి.
కాని మీ ట్రేట్మెంట్ పనిచేసి ఇవ్వాళ 100 చెసేటట్లు వున్నాడు.
రమేష్ బాబు గుడివాడ
"Dr." Maranam sevalu desaniki(?) vupayogapaddayi!
ReplyDeleteI think your Maranam treatment worked well :)
ReplyDeleteనిన్న ఈ పోస్ట్ వెయ్యడం ఏవిటీ, ఇవ్వాళ సెంచరీ పూర్తి చేయడమేవిటీ?
ReplyDeleteసరస్వతీ కటాక్షం వల్ల వచ్చిన వాక్శుద్ధి
మీకు కొన్ని అద్భుత శక్తులు ఉన్నాయని నా నమ్మకం.
మిలియనీర్ అవ్వమని నన్ను ఆశీర్వదించండి.
డాక్టర్ గారు,
ReplyDeleteమొత్తానికి దేశాన్ని,భారత్ గెలుపుని పణంగా పెట్టి గురువుగారు 100 సాధించాడు.ఏ రోజన్నా సచిన్ కొడితే భారత్ గెలిచిందా.
అదొకటైతే మన సాక్షి పేపరొడికి సచిన్ ని పొగడడమొకటే పనిగాపెట్టుకునట్లున్నాడు.
గురువుగారు మరొక విషయమేమిటంటే మీ అభిమాన నటుడు మొన్నేవరో అభిమానిని భద్రాచలంలో కొట్టాడట ఇదేమి రోగమండి బాబు.రాజైఏయాలలోకి వస్తానంటాడు ఆమాత్రం సహనం లేకపొతే ఎట్ల.
రమేష్ బాబు గుడివాడ
డాక్టరు మరణం గారు,
ReplyDeleteమా నాన్నే, ఎలేవెంత్ ప్లేయర్ అని రెండు ఒకట్ల సిద్ధాంతం ఇచ్చుంటే బాగుండేది!
రెండు, ఈ క్రింది వాక్యాలలో మీరు వేటూరి గారి ని కాకుంటే, సమరం గారిని ఏమన్నా స్పృశిస్తున్నారా అన్న చిన్న డౌటు. సందేహం తీర్చగలరు.
"మీకు గ్రౌండులో కూడా రెండు సున్నాలు కనబడుతున్నయ్
గ్రౌండులో రెండు సున్నాలంటే రెండు బంతులు. కావున మీకు బంతులు కూడా రెండుగా కనిపిస్తున్నయ్.
అంచేతే
మీరు ప్రతి అడ్డమైన వారికి మీ వికెట్ సమర్పించుకుంటున్నారు"
చీర్స్
జిలేబి.
@Chandu S,
ReplyDeleteమిలియనీర్ ఏంటండి.. మరీ చీప్ గా!
మీరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదిస్తున్నాను!
@Weekend Politician,
ReplyDeleteకదూ!
నాకూ అలానే అనిపిస్తుంది!
మొత్తానికి సచిన్ చేత సెంచురీ చేపించారు:):)
ReplyDeleteచీపు మినిష్టర్ వద్దండీ. చీపు గా మిలియనేర్ నే చెయ్యండి.
ReplyDelete