Saturday, 25 May 2013

క్విజ్


"మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఎవరు?"

"సోనియా గాంధీ తండ్రి."

"ధోని భార్య పేరేమిటి?"

"సాక్షి."

"గుడ్. శ్రీరాముని భార్య పేరు?"

"నయనతార."

"2008లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచిలో ధోని ఎంత స్కోర్ చేశాడు?"

"ముప్పై మూడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు. పాంటింగ్ రనౌట్ చేశాడు."

"సూపర్బ్. అంబేద్కర్ ఎవరు?"

"కలకత్తా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్."

"అమ్మ తోడు. అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్.. "

"జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు. సినిమా పేరు ఆది."

"వెరీ గుడ్. 'కన్యాశుల్కం' రాసిందెవరు?"

"సిరివెన్నెల సీతారామశాస్త్రి."

"పోకిరి సినిమాలో మహేశ్ బాబు ఎందర్ని చంపాడు?"

"ముప్పై మందిని కాల్చి చంపాడు. పదిమందిని గాల్లోకి ఎగరేసి చంపాడు. ప్రకాశ్ రాజ్ ని మాత్రం పీక్కోసి చంపాడు."

"ఎక్సెలెంట్. పొట్టి శ్రీరాములు ఎవరు?"

"మా తాతయ్య ఫ్రెండ్."

"కిలో వంకాయలు పది రూపాయిలైతే రెండు కిలోలు ఎంత?"

"వంకాయలంటే బ్రింజాలేనా?"

"అవును."

"ఈ లెక్క మాకు చెప్పలేదు. పోర్షన్లో లేదు."

(picture courtesy : Google)

4 comments:

  1. హ..హ..హా..."ఈ లెక్క మాకు చెప్పలేదు. పోర్షన్లో లేదు" చాలా బాగుంది.

    ReplyDelete
  2. కొట్టువాడు చెబుతాడులెండి, ఇదీ పెద్ద ప్రశ్నా?క్విజ్ అడిగేవాళ్ళకి కూసంత బుర్రుండాలండి

    ReplyDelete
  3. "మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ ఎవరు?"

    "సోనియా గాంధీ తండ్రి."


    ఈ రెండు లైన్ లు సాధారణం కాదండీ........ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ కోడలనీ నెహ్రూ -గాంధీ వియ్యంకులనీ సరదాగా చతుర్లాడేంత గొప్పొల్లనీ చాలా బ్రమలు మన ఆంధ్రప్రదేష్ జనాల్లో ఉండిపోయి తెగ గెలిపించేస్తున్నారు కాంగ్రేసుని (మా ఊళ్ళో ఒకాయన ఉన్నాడు జెడ్ పీ. చైర్మన్ గా గెలిచాడు ఆ మహానుభావుడు తన ఉపన్యాసం లో గాంధీ ఫ్యామిలీ త్యాగాలంటూ మహాత్మా గాంధీ నుండి సొనియా గాంధీ దాకా వచ్చాడు ....నా బుర్ర పేలింది ఒక జిల్లా స్థాయి నేత అయ్యుండి కనీస నిజాలు తెలియని గొప్పోల్లు పాలిస్తున్నారు మనం ఎన్నుకుంటున్నం!)...ఈ రెండు లైన్ల ని కనుక విషదీకరింఛి మన దెశ ఓటర్లకి నిజం తెలియజేస్తెయ్ ఖచ్చితంగా కాంగ్రేస్ పరిస్థితి ....దేశ పరిస్థితి మారుతుంది!

    ReplyDelete
    Replies
    1. ఆ జిల్లాస్థాయి నాయకుడికి నిజాలు తెలుసు. కాకపోతే అబద్దాలే చెబుతాడు. మనం నమ్ముతాం. ఓట్లేస్తాం.

      (కాంగ్రెస్ కి ఓటెయ్యకపోతే కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మారుతుంది. కానీ దేశపరిస్థితి కూడా మారుతుందని నేనైతే అనుకోవట్లేదు.)

      Delete

comments will be moderated, will take sometime to appear.