తమిళ సినీ నేపధ్య గాయకుడు T.M.సౌందరరాజన్ ఇవ్వాళ మరణించాడు. ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ చూశాను.
నేను సినిమాలు చూసే రోజుల్లో అరవ సినిమాలు (ఇప్పుడంత కాకపోయినా) తెలుగు డబ్బింగులుగా వచ్చేవి. ఎక్కువ సినిమాల్లో శివాజీ గణేశన్, M.G.రామచంద్రన్ లు హీరోలు. వారి నటన అత్యంత తీవ్రంగా ఉండేది. 'కోటీశ్వరుడు' అని ఓ శివాజీ గణేశన్ డబ్బింగ్ సినిమా గుర్తుంది. అందు శివాజీ నటనా బీభత్స విశ్వరూపం గాంచి గజగజలాడితిని.
సినిమాకి హీరో ఎవరైనా సౌందరరాజన్ పాట మాత్రం ఉండేది. నాకు సౌందరరాజన్ పాడుతున్నట్లుగా అనిపించేది కాదు. దిక్కులు పిక్కటిల్లేట్లు పెడబొబ్బలు పెడుతున్నట్లుగా ఉండేది. పొత్తికడుపులోంచి నరాలు బిగబెట్టి.. కడుపులోంచి పేగుల్ని మెలితిప్పుతూ.. ఒంట్లోని రక్తాన్నంతా గొంతులోకి తెచ్చుకుని.. గుడ్లు పగిలేలా, గుండెలు అవిసేలా పాడటం సౌందరరాజన్ స్పెషాలిటీ. వామ్మో! ఏమి హై పిచ్ స్టోన్! ఆయన పాటే ఓ సుడిగాలి, సునామి, భూకంపం, ప్రళయం.
తెలుగులో జయభేరి సినిమాలో చివరిపాట మన సౌందరరాజన్ పాడాడు. వదినగారి ప్రాణాలు తిరిగి ఇవ్వమని అర్ధిస్తూ (గద్దిస్తూ, గర్జిస్తూ) కాశీనాథశాస్త్రి సౌందరరాజన్ గొంతుతో పాడతాడు. అన్ని పాటలూ పాడిన ఘంటసాల ఈ పాట ఎందుకు పాడలేదు?
అప్పుడు నాకర్ధం కాలేదుగానీ.. ఇప్పుడర్ధమైంది. ఇది పి.పుల్లయ్య దర్శకత్వ ప్రతిభే. ఘంటసాల గొంతైనట్లైతే మబ్బుల్లోంఛి దూసుకెళ్ళి దేవుడి దాకా చేరేది కాదు. చేరినా ఘంటసాలకి దేవుడు భయపడే వాడు కాదు. సౌందరరాజనా మజాకా! దెబ్బకి దేవుడు దడుచుకుని శాంతకుమారికి ప్రాణం ప్రసాదిస్తాడు. మీ కోసం ఆ పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి.
(photo courtesy : Google)
సాధరణం గా ఇప్పటి తమిళ గాయకులుఖూనీ చేసేలా కాకుండా ఆయన తమిళ ఉఛ్ఛారణ బానే ఉంది. దెయ్-వం అనలేదు, దైవమనే అన్నాడు. వత్తులు పలికాడు. నిరుజీవం అనలా నిర్జీవమనే అన్నాడు. దరుమం అనలా. ధర్మమనే అబ్బాడు. అప్పట్లో దర్శకుడో, పెండ్యాలో శ్రధ్ధ తీసుకొని ఉంటారు.
ReplyDeleteసౌందరరాజన్ వత్తుల్ని అరిశల్లా వత్తేస్తాడు. ఆరకంగా ఆయనలో వంక పెట్టడానికేమీ లేదు.
Deleteఆయన తమిళ హీరోలకి సరీగ్గా సరిపోయిన గాయకుడు.
ఆయనకి నా నివాళులు.
పైన తెలుగు ఉఛ్ఛారణ అని చదువుకోగలరు.
ReplyDeleteకలసి ఉంటే కలదు సుఖం సినిమాలో.. ముద్దబంతి పువులు బెట్టి పాటలో ముందొచ్చే ఆలాపన (తందనాన.. నాననందనా..) కూడా సౌందర రాజన్తోనే పాడించారు. హైపిచ్ లో ఆ ఆలాపన ఘంటసాల కన్నా సౌందర రాజన్ వాయిసే రాణిస్తుందని. అదీ నిజమే. కావాలంటే చూడండి... వినండి...
ReplyDeletehttp://www.youtube.com/watch?v=oW3TeEYGelk
శ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో ఫస్ట్ పాట ఆయనదే..
ReplyDeleteహరిహరి నారాయణో.. ఆదినారాయణో.. కరుణించి మమ్మేలు కమలలోశనుడా.. సెబితే శానా ఉంది.. ఇంటే ఎంతో ఉంది
రాముడో బీముడో ఎవురైనగానీ.. పెళ్లాల కోసమే పోట్టాడినారు
సీతమ్మోరిని యముడు లంకకు ఎత్తుకు పోతే
కర్ణుడు వచ్చాడంట కుంబకర్ణుని తన్నాడంట..
..భలే ఉంటుంది.
బాలు గారు,
Deleteసౌందరాజన్ గూర్చి మరింత సమాచారం షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఆయన గొంతు దాచుకోకుండా గళమెత్తిన గొప్పగాయకుడు.
did you delete any of your posts recently ?
ReplyDeleteI can see comments in maalika but could not see the post.
మీరు పోస్ట్ రాసి డిలీట్ చేయడం నమ్మలేకపోతున్నాను
నా పోస్టులని గమనిస్తున్నందుకు ధన్యవాదాలు.
Deleteఅవును. ఒక పోస్ట్ పబ్లిష్ చేసి రెండు గంటల్లోనే తీసేశాను.
"తప్పలేదు."