Saturday 25 May 2013

గుండెని పిండేసిన ఫొటో


నిన్న ఉదయం 'ఆంధ్రజ్యోతి'లో ఈ ఫోటో చూశాను.

ఫొటో మనసుని కలిచివేసింది అన్నది చిన్నమాట.

కొన్ని ఫొటోలంతే.. గుండెని పిండేస్తాయి.

పాపం! లేత కుర్రాడు.. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు.. వడదెబ్బకి బలైపొయ్యాడు.

భానుడి ప్రతాపం అంటూ వార్తలు చదువుతూనే ఉంటాం.

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పే డాక్టర్ల ప్రోగ్రాములు చూస్తూనే ఉంటాం.

కానీ ఈ చిత్రం.. వాటన్నింటికన్నా ఎంతో గాఢంగా ప్రజల్ని ప్రభావితం చేసింది.. భయభ్రాంతులకీ గురిచేసింది.

అందుకేనేమో.. నిన్నట్నుండి మా ఊళ్ళో పగలు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది.

(అంచేత.. నాకు 'పని లేక.. ' ఇలా టపాలు రాస్తూ కాలక్షేపం చేస్తున్నాను.)

(photo courtesy : ఆంధ్రజ్యోతి దినపత్రిక)

6 comments:

  1. Very sad. Chala papam aa babu.

    ReplyDelete
  2. నిజమేనండి. మీరన్నట్లు ఈ అబ్బాయి ఫోటో చూసిన తరువాత చెప్పలేనంత బాధగా అనిపించింది. పాపం పరీక్షల కంగారులో ఏమీ తినకుండా వెళ్ళాడేమో ? అరగంటలో ఇంటికి వస్తున్నాను అమ్మా..అని ఫోన్లో తల్లికి చెప్పాడట.. ఇవన్నీ వార్తా పత్రికలో చదివిన తరువాత చాలాచాలా బాధగా అనిపించింది.

    దిక్కుమాలిన పరీక్షలు, చదువుల పేరుతో పిల్లలకు వత్తిడి బాగా పెరిగిపోయింది. పోలీస్ ఉద్యోగాల కోసం వెళ్ళి పరిగెట్టలేక కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటివి విన్నప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది.

    సమాజంలో కొందరు ఎంతో విలాసంగా జీవిస్తుంటే కొందరు ఎన్నో బాధలు పడుతున్నారు. సామాన్యులు బ్రతకటానికి ఇంతలా కష్టపడే విధంగా వ్యవస్థ మారిపోవటానికి సమాజంలోని కొందరు దురాశాపరులే కారణం.
    వ్యవస్థలో ఎన్నో లొసుగులుంటే పట్టించుకోకుండా నిర్లిప్తంగా మారిపోయి వినోదకార్యక్రమాలతో పొద్దు పుచ్చుతున్న ప్రజలది కూడా తప్పు ఉందేమో ? అనిపిస్తుందండి.

    ReplyDelete
  3. "చస్తూ బతికే కన్న ఒక్క వడదెబ్బ తో పొతే మేలన్న" - ఈ టైటిల్ తో నేను రాసిన కవిత చదవండి.. ఎప్పుడూ కవిత రాయని నేను ఈ అబ్బాయి కోసం మొదటి సారిగా కవిత రాసాను...

    ReplyDelete
  4. The plight of his parents is unimaginable. Quite unfortunate

    ReplyDelete
  5. :-( రెండు రోజుల నుండీ..నిజం గా కదిలించి పారేసింది ఈ ఫోటో.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.