Monday 24 February 2014

కాలక్షేపం వార్తలు


"ఆ రెండు దెయ్యాల దుర్మార్గమే"

ఈ వార్త ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' ఐదో పేజిలో వచ్చింది. తెలుగు వార్తా పత్రికల స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది. ఇంకా జారటానికి అక్కడ మిగిలిందేమీ లేదు. ఒక వార్తని అర్ధవంతంగా రిపోర్ట్ చెయ్యటం వీరికి చేతకాదు. అందుకే వార్తలో సాధ్యమైనంతవరకూ తిట్లూ, బూతులు వెతుక్కుని.. వాటినే ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. 

నెల్లూరు జిల్లాకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే ఓ చిన్నపాటి తెలుగు దేశం నాయకుడు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ లపై ఫైర్ అవుతూ చేసిన 'దెయ్యం' కామెంట్ ఇది. ఆ నాయకుడికి తన రాష్ట్రం విడిపోయినందుకు కోపం, బాధ ఉండి ఉండొచ్చు, లేదా తన నియోజక వర్గ ప్రజల దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి ఈ భాష వాడి ఉండొచ్చు. కానీ ఆ వార్తని రిపోర్ట్ చెయ్యడానికి పత్రిక వాడిన శీర్షిక అభ్యంతరకరంగా ఉంది.  

తెలుగు దేశం నాయకుడు చేసిన విమర్శ రాజకీయమైనది. వాస్తవానికి ఈ వార్తని రాసేప్పుడు పత్రికలు దేవుళ్ళు, దెయ్యాల భాష (ఆ నాయకుడు అలా మాట్లాడినప్పటికీ) వాడకూడదు. అది పత్రికల బాధ్యత. ఎందుకంటే ఆయన దెయ్యాలుగా రిఫర్ చేసిన వ్యక్తులు స్త్రీలు, ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే రెండు పెద్ద రాజకీయ పార్టీల్లో ముఖ్యమైన స్థానంలో ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వారివారి పార్టీలు తీసుకున్న రాజకీయ నిర్ణయం. అప్పుడు వారిపై విమర్శలు కూడా రాజకీయంగానే ఉండాలి, పత్రికలు అటువంటి విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ, వ్యక్తిగత దూషణలకి కాదు. 

ఆ తెలుగు దేశం నాయకుడు చాలా విషయాలు చెబుతూ, మధ్యలో ఒక మాటగా ఈ దెయ్యాల భాష వాడి ఉంటాడు. కానీ పత్రిక వారికి దెయ్యాల ప్రస్తావన ఆకర్షణీయంగా ఉందనిపించింది. అందుకే అన్నీ వదిలేసి 'దెయ్యాలు' అంటూ హైలైట్ చేశారు. ఇట్లాంటి తిట్ల భాష వాడితేనే పత్రికల్లో ప్రచారం లభిస్తుందని ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రస్థాయి నాయకులు. 

చంద్రబాబు నాయుడంతటి నాయకుడే తన రాజకీయ ప్రత్యర్ధుల్ని 'మొద్దబ్బాయ్, దొంగబ్బాయ్' అంటూ సంబోధించడం ఒక విషాదం. ఇదెక్కడి రాజకీయ భాష! జుగుప్సాకరమైన ఇట్లాంటి భాషని పెద్దస్థాయి నాయకులు మాట్లాడటం వల్లనే చిన్నస్థాయి నాయకులు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇది రాజకీయాలకే నష్టం. 

ఇక ఆంధ్రజ్యోతి ఓనర్ గారు తమ పత్రిక విలువలకి కట్టుబడి నిస్వార్ధంగా నిలబడుతుందని (వారికి ప్రతి ఆదివారం ఇదో తంతు) గర్వంగా చెప్పుకున్నారు. మంచిది, ఆయన అభిప్రాయం ఆయనిష్టం. ఆ పత్రికకి తెలుగు దేశం పార్టీలో అంతా నిస్వార్ధమైన మంచే కనిపిస్తుంది, జగన్మోహనుడి పార్టీలో అంతా స్వార్ధపూరిత చెడ్డే కనిపిస్తుంది. తన పత్రికకి - తెలంగాణా జిల్లాల ఎడిషన్లలో సమైక్య దుర్మార్గం కనిపిస్తుంది, సీమాంధ్ర ఎడిషన్లలో విభజన దుష్టత్వం కనిపిస్తుంది. రెండు కళ్ళ సిద్ధాంతం మనకి బాగానే పరిచయం. కాబట్టి - ఆ పత్రిక ఓనరు గారి ద్వంద్వవిధానం వారి నిజాయితీగానే మనం భావించాల్సి ఉంటుంది. 

ప్రజలు తెలివైనవారని నా నమ్మకం. అందుకే వాళ్ళు మీడియా వండే మసాలా వార్తల్ని పట్టించుకోవటం మానేశారు. కొందరు మరీ పనిలేని వాళ్ళు టీ స్టాల్లో టీ తాగుతూ కాలక్షేపంగా ఏదో మాట్లాడుకుంటారు. అంచేత వీటిని కాలక్షేపం వార్తలుగా అనుకోవచ్చు. అంతకుమించి ఈ వార్తలకి ప్రాధాన్యం లేదు. 'మరి ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ వార్తల్ని ఎందుకంతగా చదువుతారు? చూస్తారు?' సినిమాలో చివరికి గెలిచేది హీరోనే అని తెలిసినా, ఆ ఫైటింగుల్ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు. వారికదో సరదా. ఈ వార్తల గతీ అంతే!

(photo courtesy : Google)

12 comments:

  1. జనం మీడియాను నమ్మిన కాలం గతించి చాలా కాలం అయింది .. ఒకప్పుడు కరపత్రం లోని విషయానికి సైతం ప్రాధాన్యత ఉండేది .. అక్షరం ముద్రణలో వస్తే దానికో విలువ ఉండేది .. మీకు తిట్లు తప్పక పోవచ్చు కాని దైర్యంగా రాశారు

    ReplyDelete
    Replies
    1. అవును. జనం మీడియాను నమ్మట్లేదు, నాకైతే ఇది శుభవార్తే.

      Delete
  2. ఇదేనేమో మీడియ ప్రజల పక్ష పాత దోరని. నిజమే నేమో తెలుగుదేశం పెట్టుబడులు అక్కడ ప్రవహిస్తున్నాయి అనడం.

    ReplyDelete
    Replies
    1. ఈరోజుల్లో 'పెట్టుబడి' అనేది చిన్న విషయం. మీడియా కూడా రాజకీయాల్లో ఒక భాగం అనుకుంటున్నాను.

      Delete
  3. రమణాగారూ, నా వ్యాఖ్య మరీ పెద్దదైపోవటం వలన విడిగా ఒక టపాగా ప్రకటించాను. దయచేసి పత్రికల్లో తెలుగుభాష చదవండి.

    ReplyDelete
    Replies
    1. మీ పోస్ట్ చదివాను. లింకుకి ధన్యవాదాలు. మనిద్దరిదీ దాదాపుగా ఒకటే అభిప్రాయం అని నా అభిప్రాయం. :)

      Delete
  4. చంద్రబాబు మొద్దబ్బాయి అన్నది రాహుల్ గాంధీనా, నాకిప్పుడే అర్ధమయ్యింది. ఇంతవరకూ ఆయన తన పుత్రరత్నాన్ని అలా ముద్దుగా పిలిచాడు అనుకున్నాను.

    అన్నట్టు మరో విషయం. మీ అబ్బాయి పేరు రాహుల్ అని గుర్తు. అర్జెంటుగా నరేంద్ర అని మార్చేయండి. లేకపోతె ప్రజలకు కాంగ్రెస్ మీద (ముఖ్యంగా గాంధీ పరివారం పై) ఉన్న వ్యతిరేకత వల్ల మీకు నష్టం జరగోచ్చు. ఆ కుటుంబీకుల పేరు తనకు పెట్టినందుకు బుడుగు మిమ్మల్ని క్షమిస్తాడని ఆశిస్తాను.

    ReplyDelete
  5. Ramana garu,
    Firstly, thank you for writing this blog. It has helped me laugh a lot, think a lot, know a lot. Really !

    sorry for writing my comments in english, but i got no patience now to type in telugu.
    I was a silent reader of your blog a while ago. I'm not sure which one but one post , as far as I remember, on women, I'm not sure what it is now ... but I remember it felt a little too far away for my taste. So being a silent reader, I just silently stopped reading. Now I'm sorry that l I was very hasty then.

    Recently I'm reading your blog again.Your writings,they made me laugh, made me think & most of all made me admire your nature. I'm a huge fan now, for the way you reply to comments in a soft yet firm way, escaping prolonging some using soft humor. This is exactly opposite to how I would react. A reason why I want to continue being your ekalawya shishyaa, silently perhaps but surely.

    Thank you a lot for this blog Sir, please keep writing ! You're making some unknown strangers happy !

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for the nice words.

      నేను కేవలం సరదా కోసమే రాస్తుంటాను. అంతకుమించి నా రాతలకి ప్రయోజనం ఉందని నేను అనుకోవట్లేదు.

      కామెంట్లకి పొడుగు సమాధానాలు రాయాలనే అనుకుంటుంటాను గానీ.. పొట్టిగా సరిపుచ్చడానికి కారణం ఓపిక / సమయం లేకపోవడమే.

      Delete
  6. Ramana Sir,
    I'm starting to imagine how it would feel for a day being in your line of work. No wonder you won't want work when you write a blog too. But still some of your line of work reflects in this blog, which is highly thought provoking, plus the way you maintain your humor in serious topics as well amazes me.

    That may only be one reason --- energy/time ... for eg: take me, if someone crosses me just for the heck of it ( I see it happen few times in your blog with you ), I get all the energy in the world & time too to give a befitting reply. :-) Another reason I'm guessing(?) may be a kind of wisdom that asks you to steer clear from useless banter.

    ReplyDelete
  7. sir,
    mee blog lo sonia ni sushma ni tittatam anedi sadaru nayakuni tappu ani raasaru
    asalu vishayam loki velthe telangana soniamma daya ani congresolle antunnaru
    telangana lo nannu chinnamma gurthuchu komani sushmaji ne swayamga annaru
    mari valliddaru meme karanam ani ladies ga paperlo ekkaga lenidi varini tidithe paperlo rayagudadu raasthe chetta paperuna politics lo pogidichu kovataniki arhulaina vallu tittulaku kuda ready ga
    undali adi ladies aina gents aina sare.

    Aina meeru titla tho modalu petti andhra jyoti meeda dwesham tho rasinatlu undi
    AA comment AJ lone kadu anni paperla lonu vachindi

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.