Saturday, 18 October 2014

పాతపాట పాడుతున్న కొత్తప్రభుత్వం


విదేశీ బ్యాంకుల్లో మన బడాబాబులు టన్నుల కొద్దీ సొమ్ము దాచుకున్నారనీ, ఆ సొమ్ముని అణాపైసల్తో కక్కిస్తానని నరేంద్ర మోడీగారు ఎన్నికల ప్రచారంలో గర్జించారు. ఆ డబ్బంతా కాంగ్రెస్ పార్టీ దొంగలదేననీ, కావునే - కాంగ్రెస్ పార్టీ దొంగవేషాలేస్తుందని కూడా వాకృచ్చారు. ప్రజలు కూడా నిజమేనని నమ్మారు. 

దేశభక్తులు (అనగా మోడీ భక్తులు. దేశం, మోడీ అనేవి వేరువేరు పదాలు కాదు - 'దేశం' అంటేనే మోడీ) ఆ డబ్బుతో మనం చెయ్యాల్సిన అభివృద్ధి పనుల చిట్టా కూడా రాసుకున్నారు. ఇక విదేశీ నల్లధనం తరలి రావడమే తరువాయి అన్నట్లు ఆత్రుతతో ఎదురు చూస్తుండగా - కేంద్రప్రభుత్వం వారు సుప్రీం కోర్టుకి 'ఆ నల్ల కుబేరుల పేర్లు చెప్పలేం' అంటూ సెలవిచ్చారు. 

అలా చెప్పలేకపోవడానికి కారణాల్ని కూడా సదరు మంత్రివర్యులు చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఇరవైయ్యేళ్ళ క్రితం దుష్ట కాంగ్రెస్ జర్మనీవాడితో ఏవో పెద్దమనుషుల ఒప్పందాలు చేసుకుని కాయితాల మీద సంతకం పెట్టిందిట. అదేదో డబుల్ టేక్సేషన్‌ట! మనకి సింగిల్ టేక్సేషన్ గూర్చే సరీగ్గా తెలీదు! ఇట్లాంటి అంతర్జాతీయ పవిత్ర ఒప్పందాల్ని అర్ధం చేసుకోవాలంటే - వయోజన విద్యాకేంద్రాల్లో చేరాల్సిందే!

కొన్నాళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పాట పాడింది. ఆ పార్టీ దేశ ప్రజల ప్రయోజనాల కన్నా అంతర్జాతీయ ఒప్పందాలే మిన్న అని నమ్మింది. అందుకే ఆ పార్టీని ప్రజలు చెత్తబుట్టలో పడేశారు. మరప్పుడు ఆనాడు మోడీగారు నల్లధనం తెప్పిస్తామని ఎందుకు బల్ల గుద్దారు? 'మేం దొంగల పేర్లు చెబితే అంతర్జాతీయంగా మన పరువు పోతుంది' అన్న కాంగ్రెస్ పల్లవి బీజేపీ కూడా ఎందుకు పాడుతుంది? 

'మంచిరోజులు వచ్చాయి' - ఈ పేరుతో ఒక తెలుగు సినిమా వచ్చింది. ఇదే పేరుతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. అయితే - నటులే మారారు తప్ప సినిమా పాతదే అనే అనుమానం ఎవరికైనా వస్తే - వారంతా దేశద్రోహులే! 

త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల - హుధుద్ తుఫాను కన్నా తీవ్రమైన నష్టాన్ని కలగజేసిందనీ, ఆ నష్టాన్ని చక్కదిద్దడంలోనే పీకల్దాకా (ఇంకా) మునిగిపోయి వున్నామనీ కొత్త ప్రభుత్వం చెబితే వినేవారు వినవచ్చుగాక, నమ్మేవారు నమ్మవచ్చుగాక! అయితే - ఇలా ఎంత కాలం?

ముగింపు - 

మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు! ఎవడీ దేశద్రోహి?

వీడికి పన్లేదు సార్! ఆ విషయం అందరికీ తెలియాలనే - 'పని లేక.. ' అంటూ ఏవో చెత్తరాతలు రాస్తుంటాడు. 

అలాగా! వీడికి మన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం గూర్చి తెలీనట్లుంది. ఒక చీపురు తీసుకొచ్చి వీడి మొహాన కొట్టండి. రోడ్లన్నీ శుభ్రంగా ఊడిపించండి. ఫినాయిల్తో పాకీదొడ్లు కడిగించండి. 

అలాగే సార్! కానీ - నడుం విరిగి చస్తాడేమో?

మరేం పర్లేదు! అప్పుడు 'నడుం లేక.. ' అని రాసుకుంటాడు!

(picture courtesy : Google)

13 comments:


  1. సూపెర్ ! ఈ టపా తరువాయీ మీరు గుంటూరు లో 'బతికి' 'బట్ట' కడతే దేశం లో ప్రజాస్వామ్యం ఉన్నట్టే లెక్ఖ!

    హన్నా! ఎంత మాట ఎంత మాట !! దీన్నే గదా తెలుగులో ఏరు దాటేక తెప్ప తగలెయ్యడం అంటారు మరి !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి జీ,

      ప్రస్తుతానికి ప్రజాస్వామ్యం ఉన్నట్టుగానే అనిపిస్తుంది. :)

      Delete
    2. ఎక్కాల్సిన రైలు ఒక జీవెతకాలం పాటు లేటు!

      Delete
  2. టపా బాగుంది. ముగింపు అంతకంటే బాగుంది!

    ReplyDelete
  3. రమణ గారు,
    మీకు సౌలభ్యంగా వుండే విషయాలు మాత్రమే గుర్తుపెటుకుని, మీరు ఎలాగూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు! నా వంతుగా నేను ఒక విషయం గుర్తుచేయదల్చుకున్నాను. మీ కోసం కాదులెండి, పాఠకుల కోసం.
    కాంగ్రెసు వారు, సుప్రీం కొర్టు చెప్పిన తరువాత 3 సంవత్సరాలు సిట్ (SIT) వెయ్యకుండా కాలక్షేపం చేశారు. చివరాకరికి సుప్రీం కొర్టు అల్టిమేటం ఇవ్వవలసి వచ్చింది. అది మీకు తెలుసు, అనే అనుకుంటున్నాను.
    ఇక పేర్లు ఎందుకు ఇప్పుడు బయట పెట్టటం లేదు అని అరుణ్ జైట్లి గారు ఇక్కడ చెప్పారు
    https://m.facebook.com/story.php?story_fbid=294926197362602&id=165095140345709

    కృష్ణ

    ReplyDelete
  4. ఏం చెప్పాలన్నా కూడా భయం వేస్తోంది!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      ఎందుకు భయం వేస్తుందో చెబితే - నేనూ భయపడతాను. :)

      Delete
  5. అప్పుడు లిస్టులో అన్నీ కాంగ్రెస్ వారి పేర్లే వున్నాయేమో అనుకుని బయట పెడతామన్నారు. తీరా ఇప్పుడు లిస్టులో తమవారి పేర్లు కూడా ఉండేసరికి నాలిక్కరుచుకున్నారు.

    లేదా...

    అధికారంలో లేనప్పుడు అది బయటపెట్టడం సులభమనుకునారు. ఇప్పుడు అది అంత వీజీ కాదని తెలిసిపోయింది!

    మొత్తమ్మీద...

    కాంగ్రేసుకు, బిజెపికి తేడా లేదు.

    ReplyDelete
  6. ప్రచారం చేసేటప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు కానీ రియాలిటీ కి వస్తే
    1. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా బాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యటం నేరం కాదు.
    2. ఆ అకౌంట్ లో వేసిన డబ్బులు ఎవరినైనా మోసగించి తెచ్చిన వైతే నేరం.
    3. నేరం చెయ్యని వాళ్ళ పేర్లు నేరం చేసిన వాళ్ళతోటి ప్రకటించటం ఇంకొక తప్పు
    4. నేరం చేసారు అని నిరూపించటం చాలా కష్టం. మొన్నీమధ్య 18 ఏళ్ళు కూడా పట్టచ్చు అని తెలుసుకున్నాను.
    వీటి మూలాన మీ లాజిక్ ని సమర్ధించటం కొంచెం కష్టంగా ఉంది.

    ReplyDelete
  7. // నేరం చేసారు అని నిరూపించటం చాలా కష్టం. మొన్నీమధ్య 18 ఏళ్ళు కూడా పట్టచ్చు అని తెలుసుకున్నాను. //
    అవునండీ, పనిలేక ,పాట లేక, తింటానికి తిండి లేక, ఉంటానికి గూడులేక చిన్న చిన్న దొంగ తనాలు చేసే దొంగ వెదవల్ని బొక్కలో తోసి మక్కెలిరగతణ్ణడం కాదు, చెయ్యని దొంగ తనాలుకూడా వప్పించడమైతే చాలా చాలా తేలిక గానీ. చాలా బాగా చెప్పారు LAKKAARAJU GAARU.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.