Friday 3 October 2014

యేసుదాసుని సూక్తులు


అందరికీ అన్నీ తెలియాలా? అవసరం లేదు. అలా తెలుకోవడం అనవసరం కూడా. నాకు పందుల పెంపకం గూర్చి తెలీదు, వీణ వాయించడం రాదు, టీవీ రిపైర్ చెయ్యడమూ రాదు. అందుకు నేనేమీ సిగ్గు పడట్లేదు. ఆయా రంగాల్లో ఆయా నైపుణ్యం కలవారు వున్నారు, వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు - నాకనవసరం. 

అందువల్ల నాలాంటి సాధారణ మానవుణ్ని - ఏదైనా తెలీని రంగం గూర్చి ప్రశ్నడిగితే టక్కున - 'తెలీదు'  అని చెప్పేస్తాడు. 

అదేవిధంగా -

'ఆడవాళ్ళ దుస్తుల పట్ల నీ అభిప్రాయం ఏంటి?' అనడిగితే -

'ఎవరికేది సౌకర్యంగా వుంటే అదే ధరిస్తారు. ఇందులో నాకెందుకు అభిప్రాయం వుండాలి!' అని ఆశ్చర్యపోతాను.

'ఆడవారి దుస్తుల బట్టి మగవాళ్ళు రెచ్చగొట్టబడి అత్యాచారాలకి పాల్పడుతున్నారా?' అనడిగితే -

కొద్దిసేపు - 'ఏం చెప్పాలా?' అని ఆలోచిస్తాను. ఎందుకంటే - ఆడవాళ్ళ దుస్తులకీ, నేరాలకి గల సంబంధం నాకు తెలీదు. అటువంటి పరిశోధన ఏదైనా దేశంలో జరిగిందేమో కూడా నాకు తెలీదు. తెలీనప్పుడు నోర్మూసుకుని వుండటం ఉత్తమం అని మాత్రం తెలుసు. అందువల్ల - 'తెలీదు' అనే సమాధానం చెబ్తాను. 

అయితే - మనుషులందు సెలబ్రిటీలు వేరు. ఈ సెలబ్రిటీలకి సన్మానాలు, భక్త పరమాణువులు ఎక్కువ. అంచేత వారు ఆవడల దగ్గర్నుండి ఆఫ్రికన్ చింపాంజీల దాకా అన్ని విషయాలు తమకి తెలుసుననే భావనలోనే వుంటారు. అదీగాక వారికి 'తెలీదు' అని సమాధానం చెప్పడం నామోషీగా వుంటుంది. కావున వారు అన్ని విషయాల్లో నోటికొచ్చిందేదో చెప్పేసి చప్పట్లు కొట్టించుకుంటారు.

మొన్నామధ్య ఒక టీవీ రియాలిటీ షోలో ఒక ప్రముఖ తెలుగు గాయకుడు రావిశాస్త్రి ఇంటి పేరు 'రావి' అనే భీభత్సమైన నిజాన్ని సెలవిచ్చార్ట! అందుకు మనం ఆయన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు - ఆయనకి తెలిసిందది! తెలీని విషయాల్ని 'తెలీదు' అని చెప్పుకోడానికి ఆయనేమీ మనలా సామాన్యుడు కాదుగా!

యేసుదాస్ మళయాళీ. చాలా భాషల్లో సినిమా పాటలు పాడాడు. శాస్త్రీయ సంగీతం కూడా పాడతాట్ట. శాస్త్రీయ సంగీతం పట్ల నాకు ఆసక్తి లేదు - కావున విన్లేదు. నేను ఏసుదాస్ సంగీతం వినకపోవడం వల్ల యేసుదాసు కొచ్చిన నష్టం లేదు. ఆయన ఎక్కడో అమెరికాలో వుంటాడు. అప్పుడప్పుడు మన దేశానికొచ్చి సంగీతాన్ని పాడి వెళ్తుంటాడు.

అయితే - నిన్న యేసుదాసుల వారికి ఆడవారు జీన్సు ధరించడం పట్ల చికాకు కలిగింది. శుభ్రంగా సంగీతం పాడుకునే ఆయన గారికి వున్నట్లుండి ఈ డ్రెస్సుల గోలెందుకో తెలీదు. పాపం! ఆయన వాలకం చూస్తుంటే అక్కడున్న సంగీతం పెద్దమనుషుల్తో నాలుగు మార్కులేయించుకోడానికి మాట్లాడినట్లుంది గానీ - వేరే ఉద్దేశం ఉన్నట్లు లేదు. ఉద్దేశం వుండేంత అవగాహన కూడా ఆయనకి వున్నట్లు లేదు. 

ఈమధ్య కొందరు ప్రముఖులు తామే రంగంలో నిష్టాతులమో - ఆ రంగం గూర్చి తప్ప మిగిలిన అన్ని విషయాల గూర్చి లెక్చర్లిస్తున్నారు, ముఖ్యంగా ఆడవారికి సలహాలివ్వడంలో చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఇంతకుముందు ఉదయాన్నే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సూక్తి గీత ముక్తావళి అనే కార్యక్రమం వచ్చేది (ఇప్పుడు కూడా వస్తుందేమో తెలీదు). ఇప్పుడా బాధ్యత సెలబ్రిటీలు నెత్తినెత్తుకున్నట్లుగా వుంది. ఎబోలా లాగా ఇది కూడా ఒక కొత్త రోగం అనుకుంటా! 

(picture courtesy : Google) 

32 comments:

  1. పోనీ ఇలా అనుకోరాదా డాక్టరుగారూ?
    యేసుదాసు అయ్యేది మరొకరయ్యేది తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు వారికి హక్కు ఏమీ ఉండదా?
    మీ అభిప్రాయాన్ని మీరు బ్లాగులో సెలవిచ్చారు. అది మీ కున్న సౌకర్యం.
    ఆయన అభిప్రాయాన్ని ఆయన సభలో సెలవిచ్చారు. అది వారికి అందుబాటులో ఉన్న సౌకర్యం.
    ఏ మంటారు?

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      యేసుదాసుకి తన అభిప్రాయం చెప్పే హక్కు లేదని నేను రాయలేదు. ఆయన వెలుబుచ్చిన అభిప్రాయం నాకు నచ్చలేదు. నా పోస్ట్ మీకు నచ్చకపోవచ్చు. అది మీ హక్కు, స్వేచ్చ. కాదండానికి నేనెవర్ని!?

      Delete
  2. సంస్కృతం మేళవించి శాస్త్రీయ సంగీతం సాంప్రదాయకంగా పాడే జేసుదాసు గారికి జీన్స్‌ పాంట్స్‌ ను చూసి చెరాకు రావడం సహజమే కదా? అదీ గాక అమెరికాను భారత సాంప్రదాయాల ప్రకార నడపడం ఇష్ట పడుతున్నారు కొంతమంది. అయినా మనకెందుకు లెండీ మనకు సంబందం లేని విషయాల్లో జ్యోక్యమెంద్కు? అన్నట్లు నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడటం లేదు కదా? సారీ!

    ReplyDelete
  3. //ఈ సెలబ్రిటీలకి సన్మానాలు, భక్త పరమాణువులు ఎక్కువ. అంచేత వారు ఆవడల దగ్గర్నుండి ఆఫ్రికన్ చింపాంజీల దాకా అన్ని విషయాలు తమకి తెలుసుననే భావనలోనే వుంటారు. అదీగాక వారికి 'తెలీదు' అని సమాధానం చెప్పడం నామోషీగా వుంటుంది. కావున వారు అన్ని విషయాల్లో నోటికొచ్చిందేదో చెప్పేసి చప్పట్లు కొట్టించుకుంటారు.//
    ఏసుదాసు వ్యాఖ్యల్లో ఈ చప్పట్లు కొట్టించుకునే లక్షణం మీకు కనిపించిందా... ఏదో సంగీత కళాశాలలో సంస్కృతిని నేర్చుకునే విద్యార్థులతో ఆయన అన్న మాటలు ఇంత ఉద్యమం చేయడానికి చాలినవేనా... వయస్సులో పెద్దవాడు ఓ మంచి మాట చెబితే కూడా తప్పేనా.... ఇలా అయితే రోడ్డెక్కుతున్న ప్రతి మహిళ ఇంట్లోనూ స్త్రీద్వేషులు ఉన్నట్టే. ఆడదానితో సంసారం చేసే ప్రతి మగాడూ దోపిడీదారుడే...
    వామపక్షీయులు, రాజకీయ నాయకులు, కులసంఘల పెద్దమనుషులు, మహిళాసంఘాల పెద్ద స్త్రీలకు, మీడియా మహానుభావులకు, తమ సంఖ్యను దాచిపెట్టుకుని ఇప్పటికీ అల్పసంఖ్యాకులమని చాటుకునే భావదరిద్రులకు, హిందూ సంస్కృతీద్వేషమే సెక్యులర్ వాదమనుకునే మేథావులకు మాత్రమే ఈ దేశంలో భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉంటుంది. కాశ్మీరాన్ని పాకిస్థానుకు ఇచ్చివేయాలని, అరుణాచలప్రదేశాన్ని చైనాకు ఇచ్చేయాలని, అసలు ఈ దేశంలో హిందువులే లేరని, వారంతా బయటినుంచి వచ్చినవాళ్లేనని, బ్రాహ్మణుడైన రావణుడు దళిత చక్రవర్తి అని వాళ్లు వాగవచ్చు. రాంచరణ్ పెళ్లి లైవ్ రావచ్చు, ఎన్టిీయార్ పెళ్లి లైవ్ రావచ్చు, కానీ ఆరెసెస్ సమావేశం లైవ్ రాకుూడదు. అది మతవాదం అని టాపు లేచేలా వాళ్లు వాగచ్చు. అది వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. హైందవ సంస్కృతిని గురించి ఎవరు మాట్లాడినా అదో ఉద్యమం. ఏం ఏసుదాసుకు తన భావాలను చెప్పుకునే స్వేచ్ఛ లేదా అధికారం లేదా...
    నా చిన్నప్పుడు బొడ్డుకు కింద భాగం కనిపించేది కాదు. ఇప్పుడు నాభికి జానెడు కిందవరకు ఉచిత దర్శనం చేయించే వస్త్రధారణ వచ్చేసింది. కొన్నాళ్లు పోతే బడికి, గుడికి, ఆఫీసులకు, బ్రాసరీలు, బికినీలు వేసుకుని వస్తాం... మీరంతా కళ్లుమూసుకోండి అనే రోజులు వస్తాయేమో.. (నేను విప్పుకు తిరుగుతాను, రేపులు చెయ్యగూడదని నీ కొడుకుకు నేర్పు అనే బోర్డులు ఇప్పటికే ప్రదర్శించారు)

    ఈ వివాదంతో సంబంధం లేకపోయినా డాక్టరుగారూ నాకో చిరు సందేహం.... తీర్చగలరా...
    స్కూళ్లల్లో, కాలేజీల్లో, ఉద్యోగాల్లో యూనిఫాంలు వేసుకోమంటే కూడా ఈ ఆడవాళ్ల వస్త్రధారణపైన నిబంధనలు పెట్టినట్టేనా...

    ReplyDelete
    Replies
    1. కాశీ,షిరిడి పుణ్య క్షేత్రాలను లైవ్ లో చూపించినట్లు, ఆర్.యస్.యస్. కార్యాలయం దగ్గర ఒక కెమేరా పెట్టి, డిడి లో టాటా స్కై లో ప్రసారం చేస్తే సరి, మీడీయాలో ఈ కాకిగోల ఉండదు.ఒకరోజు చూపితె గోల చేస్తారు,రోజు చూపితే ఎమి చేస్తారు? అప్పుడు అది న్యుసే కాదు, అందులో తప్పులే కనపడవు.

      జేసుదాసు వ్యాఖ్యల పై ఇంత విమర్శ చేసే మీడీయావారు, సామాజికులు (మాజీ కమ్యునిస్ట్ అభిమానులు), టివి లలో అభిప్రాయలు చెప్పే మహిళలు, ఎప్పుడనా స్రీల సౌందర్యం పెరుగుతాయని వచ్చే యాడ్స్ పై నోరు మెదపారా? కారణం వాటిని రోజు చూసి చూసి అందులో తప్పులు కనపడవు. తెల్లగా ఉంటేనే అందంగా ఉండటమనే భావనవను వేల కోట్ల వ్యాపార ప్రకటనలో 24 గంటలు సందు దొరికితే చూపుతూంటారు. కొంచెం ఆలోచిస్తే ఆ యాడ్స్ జేసుదాస్ అన్నమాటలకన్నా సమాజం పైన విపరీతమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఈ తెల్ల రంగు పిచ్చి, నల్లని వారి ఆత్మ విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఈ క్రీములు పూసుకొని తెల్ల బడినవారు ఎవ్వరు లేరు. అదే నిజమైతే భూమి మీద అందరు తెల్లవారుగా మారిపోయేవారే !

      Delete
  4. ఆడవారు ధరించాల్సిన సంప్రదాయమైన దుస్తుల పట్ల సంఘ పరివార్‌కి ఖచ్చితమైన స్టాండ్ వుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

    ఇప్పటికీ - యేసుదాస్ కామెంట్ 'రావి అనే ఇంటిపేరు గల శాస్త్రి' జ్ఞానంలాగే చూస్తున్నాను. అదే రాశాను కూడా.

    ఒకవేళ యేసుదాసుకి సంఘ పరివార్ టైపు ఆలోచనలు నచ్చి, పూర్తి అవగాహనతోనే మాట్లాడినట్లైతే - నా పోస్ట్ తప్పు. రాసినందుకు క్షమాపణలు చెప్పడానికి సిద్ధం.

    ఈ వివరణ ఎందుకంటే - నేనీ పోస్టుకొచ్చిన కొన్ని కామెంట్లు పబ్లిష్ చెయ్యట్లేదు (భాష నచ్చక). అందుకని.

    ReplyDelete
    Replies
    1. >'రావి అనే ఇంటిపేరు గల శాస్త్రి' జ్ఞానంలాగే చూస్తున్నాను.<
      ఇటువంటి అజ్ఞానంతో బతుకుతున్నవారు లేరని చెప్పను కానీ ఈ పోస్ట్ లో మీరు చెప్పిన గాయకుడు గారు మాత్రం అజ్ఞానంతో అనలేదండీ. వయసు(65+) మీద పడడం వల్ల వచ్చిన ఏమరుపాటుతో రావి ఇంటిపేరుగల ఇతర ప్రముఖులు కూడా ఉండడంతో పొరపాటున అన్నానే తప్ప తెలియక కాదని స్వయంగా ఆయనే లిఖిత పూర్వక క్షమార్పణలు చెప్పారు. సో అది ఫ్లోలో జరిగిన చిన్న పొరపాటే తప్ప మరోటి కాదు. ఆయన అదృష్టం బాలేక ఎడిటింగ్ టేబుల్ మీద కూడా తప్పించుకుని టెలికాస్ట్ అయిందా పొరపాటు.

      ఇక ఏసుదాసు గారిలాంటి మహోన్నత కళాకారుడు అక్కడున్న నలుగురు సంగీతం పెద్దల మార్కులుకొట్టేసి వారి మెప్పు పొందాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని నా అభిప్రాయమండీ. ఆయన చెప్పిన మాటకు అవగాహనతో పనేముంది అది ఆయన అభిప్రాయం అంతేకదండీ (ఏసుదాస్ గారి స్పీచ్ నేను వినలేదు జీన్స్ సాంప్రదాయ వస్త్రధారణ కాదు అని మాత్రమే అన్నారని అనుకుంటున్నాను మీ పోస్ట్ ను బట్టి) ఆయన జెనరేషన్ లోని అధికులకు ఉన్న అభిప్రాయమే ఆయనకీ ఉంది అని అంగీకరించి విని వదిలేయాల్సిన విషయమది. అసలు మీడియా మరియూ సదరు ఉద్యమకారులు ఇంత గోల చేయకపోతే ఎక్కడో ఒక చిన్న మీటింగ్ లో తను చెప్పిన విషయం ఎంతమందికి చేరి ఉండేదంటారు చెప్పండి.

      Delete
  5. డాక్టరుగారూ,
    యేసుదాసుగారి అభిప్రాయాలలో జ్ఞానాజ్ఞానాలను మనం తప్పుపట్టకూడదు. ఒకరి జ్ఞానదృష్టి , మరొకరికి అజ్ఞానంలాగా కనిపించటం వింతకాదు లోకంలో. ఆయనకు, మీకూ, నాకూ అందరికీ‌భావస్వేఛ్ఛా, తత్ప్రకటనాస్వేఛ్ఛా ఉన్నాయి. వాస్తవమే. కాని మరొకరి భావాన్ని విషయపరంగా విశ్లేషించటం వెరు దాన్ని ఎద్దేవా చేయటం వేరూ అన్న విషయం మనం మరువకూడదు. మీరు క్షమాపణలూ చెప్పనవసరం లేదు అలాగే ప్రతి నిందాత్మకవ్యాఖ్యనూ ప్రచురించనూ అక్కర లేదు. ఆరోగ్యకరమైన సమాజంలో విమర్శ తప్పనిసరి కాని హేళనా నిందా అనేవి అందరమూ పరిహరించాలని చెప్పటమే నా ఉద్దేశం. మరేమీ లేదు.

    ReplyDelete
  6. నాక్కుడా ఇప్పుడు పనిలేక ఈ కామెంటెడుతున్నా.

    అవును, నేను యేసుదాసుతో ఏకీభవిస్తున్నా, జీన్సు మన సంస్కృతి కాదు, ఐనా ఈ బట్టలు అవి ఇప్పుడొచ్చాయి కాని, ఒకప్పుడు అసలు ఈ బట్టలు మన సంస్కృతా? ఇవన్ని ఈ మధ్యకాలంలో వచ్చిన పోకడలు తప్ప, మా చిన్నప్పుడు ఇవేమీ లేవు బాబు, ఏ రావి ఆకులో, బాదం ఆకులో... అంతకు ముందు అవీ లేవు...

    ఐనా ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా...

    ReplyDelete
    Replies
    1. వావ్! నాకు మీకొచ్చిన ఆలోచన రాలేదు. వచ్చినట్లైతే ఎలాగోలా పోస్టులో ఇరికించేవాణ్ని! :)

      Delete
  7. తన డ్రెస్సింగ్ గురించి ఒక అమ్మాయి ఫేస్ బుక్ లో ఇలా రాసుకుంది :

    Yes, I wear a bra. Yes, it shows. So?


    Why? Why do you do that? Stare at my breasts like they are cute babies calling out to be cuddled. Strip me naked, slowly, every time I enter the bus? Try to glimpse into my cleavage when I am sitting and reading in the metro.

    Who gives you the right? To grope me in the crowded bus? To fall on me "innocently" when I buy popcorn in the theater. When I sit cross legged in the auto and you stop your bike and look hungrily at my legs.

    A piece of meat, am I?
    How do you think I feel? When I have to continuously watch over my shoulder, because it is 10 pm and there is nobody at the bus stop, except you. Staring at my neck.

    When I panic, because my phone is dead, and I am in a cab wearing a backless dress?
    When my friends and parents worry that I have to travel alone at night?
    When I am sleepless in the bus, thinking, that your hands will pin me down and yank my clothes away?

    What makes you think I should not wear that pretty black skirt?
    To be scared. Afraid. Tensed. Every time I am not at home.
    What makes you think I like it when I find you smiling at my bra strap that shows?

    Yes, I wear a bra. Yes, it shows. So?
    Ohh, don't say that its my clothes! I have found you eyeing the waist of that woman who was wearing the plain faded saree. Your eyes get all excited when the young college going girl enters the bus in just a kurta, no dupatta covering her bosom.

    And yes, one slip of the pallu or dupatta and you go wild.
    Staring. Smiling. And staring.
    So, if I have a beer in my hand when I am on a beach, you think you can click my picture?
    When I wear hot pants and laugh with a guy you think you can pinch my ass?

    Does the lit cigarette in my hand seem like an invitation to you? To come violate my body with your eyes?

    Yes, I am a girl and I drink alcohol, so I am an 'easy target'. Is that it?
    Yes, I drink. I smoke. Does that mean I want to have sex with you and every man on the street?

    You. Who teach your daughter to be safe from evil eyes, don't flinch before mentally having sex with me when you see me on the street?

    You, who get angry when a boy smiles at your sister, don't feel ashamed standing at the street corner whistling at me every night.
    No practice what you preach, for you, right.

    Do you still think I am the one who needs to change?

    - Nivedita N Kumar, June 27, 2014

    ReplyDelete
    Replies
    1. ఇందాక మా అమ్మాయి జీన్స్ వేసుకుని ఎక్కడికో బయలుదేరింది. యేసుదాసు బొమ్మ చూపించి - విషయం చెప్పాను. మొహం చిట్లించి - 'ముందాయన్ని గెడ్డం గీయించుకోమను.' అంటూ విసుక్కుంటూ వెళ్ళింది!

      Delete
  8. రమణ గారు,
    టపాకు సంబంధం లేని వ్యాఖ్య రాస్తున్నాను . చాలా సామాజిక విషయాలలో మీరు స్పందిస్తూంటారు. ఈ వార్త మీకంట పడిందో లేదో, మీదృష్టి కి తెస్తున్నాను. లిబరల్ అయిన సాగరికా గోష్ గారు "సెక్యులర్" పదం తొలగించి "ధర్మ" పదం వాడాలి అంట్టున్నారు. ఈ వారపైన మీ అభిప్రాయం టపాను రాసి చెప్పగలరు.
    Rename secularism. Call it ‘dharma’ or righteous administration

    http://blogs.timesofindia.indiatimes.com/bloody-mary/silly-secularism-to-neutral-dharma-rename-secularism-call-it-dharma-or-righteous-administration/

    ReplyDelete
    Replies
    1. శ్రీరాం గారు,

      నాకు నచ్చిన / నచ్చని అంశాలపై అప్పటికప్పుడు రాసెయ్యడం ఈమధ్య ఎక్కువైంది. నా ఆలోచన వెంటనే అచ్చులో చూసుకోడం మజాగా వుంటుంది. నేను బ్లాగ్ రాయడానికి ముఖ్యకారణం ఇదే.

      ఇంకో ముఖ్య విషయం - మీతో పోలిస్తే నాది మిడిమిడి జ్ఞానం. మన్దంతా - ఒక ఫొటో + నాలుగు ముక్కలు = ఒక పోస్ట్. అదో సరదా!

      సాగరికా ఘోష్? రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య అనుకుంటాను. నాకావిడ రాస్తుందని తెలీదు - చదవాలంటే కొంచెం కష్టమే! నాకిట్లాంటి కష్టమైన హోం వర్కు ఇవ్వడం అన్యాయం. :)

      Delete
  9. జేసు దాసు లాంటి గాయకులు లాల్చి పైజమా కాకుండా సాంప్రదాయ బద్దంగా దోవతి కట్టుకోవాలని అభిప్రాయం
    ఒక వేళ ఆయన దోవతి కట్టుకునే వారు అయితే చక్కగా లాల్చి పైజమా ధరించాలని నా అభిప్రాయం
    (ఆయన పాట లు విన్నాను కాని ఆయన్ని చూడలేదు అందుకే ఆయన దుస్తుల గురించి తెలియదు. తెలుసుకోవలసిన అవసరం లేదు )

    ReplyDelete
  10. పాపం! కొంతమంది ప్రముఖులకి లౌక్యం తెలియక ఇలా అనవసరమైన విషయాలలో తలదూర్చి విమర్శలపాలవుతారు.

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ రమణగారి ఫాలోయింగ్ చూస్తుంటే, రమణగారు కూడ లౌక్యం తెలియని ప్రముఖుల్లో ఒకరనిపిస్తోంది.

      Delete
  11. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా... మనసు లాగేస్తది లాగేస్తాది అని ఓ సినీ కవి వ్రాసిన పాట ఎక్కడైయినా జేసుదాసు పాడాడేమో ?

    ReplyDelete
  12. రమణ గారు,

    మొన్న మురళీ మోహన్,నేడు జేసుదాసు మీద విరుచుకుపడటం. పైకేమో మహిళ ల హక్కులకు మద్దతు, లోపలేమో వారిమీద చెప్పలేని బాధ,కోపం,ఈర్షా ,అసూయా. కారణం వాళ్లకి 70+ వయసున్నా మంచి నిగనిగలాడే జుట్టుతో ఉండటం. ఆ జుట్టు మీకు లేకపోవటం. ఎందుకండి పైకొకటి లోపల ఒకటి అసలు సంగతి రాయొచ్చుకదా! నాకు జుట్టున్న వారంటే నచ్చరు అని :)

    ReplyDelete
    Replies
    1. ఒకప్పుడు నేనూ మీలానే జుట్టు తక్కువ్వాళ్ళని చూసి నవ్వుకున్నాను. ఇప్పుడిలా అయిపొయ్యాను. ఇంక మీ ఇష్టం. :))

      (నాకెందుకో శ్రీరాంలో ఫ్యూచర్ రమణ కనిపిస్తున్నాడు.)

      Delete
    2. ఒక శనివారం నాకు హాఫ్ డే అవటంతో మా ఆవిడకి మూడింటికే స్కూల్ అయిపోతుందని తెలిసి ఈ బస్సుల్లో ఆటోల్లో యేమి తంటాలు పడుతుందిలే అని నేనే వాళ్ళ స్కూలు వరకూ వెళ్ళి బైక్ మీద తీసుకొస్తున్నా. అమ్మాయి లంతా మొహాలకి పల్లూ అడ్డం వేసుకోవటం చూసి, "యెండ కనుకుంటాను అమ్మాయి లంతా వుగ్రవాదుల్లా తయారయ్యారు" అని సర్దాగా కామెంట్ చేస్తే మా బంగారం, "లేదు లేదు, ఆ ముసుగుల కధ వేరే వుంది? తెలిసిన వాళ్ళు గుర్తు పట్టకుండా!" అనే సరికి మైండులో బాంబులు పేలినంత పనైంది?! అప్పటిదాకా ఒక్కముక్క తమిళం రాని నాకు తన్నుకుంటూ వొచ్చేసి, "అడాపావియా, యెన్నడా ఇదు కలికాలమా ఇరుక్క?!" అని వడివేలు మాదిరి గొణుక్కున్నా? అయ్యా, ఇవ్వాళ కొంచెం పెద్దదయిన ప్రతి టవున్లోనూ ఒక లవర్స్ పార్కు వుంటుంది! పోలీసులూ గట్రా యెట్సెట్రా వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకుండా వుండేందుకు కొందరు పెద్దల అజమాయిషీలో దాని చుట్టూ పెద్దయెత్తున వ్యాపారం కూడా జరుగుతూ వుంటుంది!! చుండూరు కుర్రాళ్లని అంతగా రెచ్చగొట్టి అంతటి భయానకమయిన చావుకి కారకులయిన సినిమా రంగపు మాంసఖండాల విక్రేతలు వీళ్ళకి ముడిసరుకులు సప్లై చేస్తూ వుంటారు!!! ఆలోచించండి, అర్ధం చేసుకోండి, శలభాలు తమంతట తామే మాడిపోవటానికి సిధ్ధపడి వురక లేస్తుంటే కాల్చెయ్యటం సహజస్వభావమయిన అగ్నిజ్వాలలకి మొహమాటం యెందుకుంటుంది?

      Delete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. శ్రీరాం గారూ, భలే కనిపెట్టారండీ. మీరు చెప్పాక నేను ఇటీవలి పోస్టులు కొన్ని చూసా. ప్రతీసారి డాట్టారు గారు ఆడిపోసుకున్న వ్యక్తీ జుట్టున్న మగాడే. కొందరికయితే గడ్డం కింద కూడా జుట్టుంది.

    రమణ గారూ, జుట్టున్న మాలాంటి వారిపై మహిళలు అభిమానం చూపిస్తున్నారని, పైగా మీ లాంటి బట్టతల బడుద్దాయిలను ఒక్క అమ్మాయీ కన్నెత్తి చూడడం లేదని ఎందుకండీ ఈర్ష్య? ఇకపై ఇలాంటి అసూయాపరమయిన టపాలు రాస్తే బాగుండదు ఇదే చివరి హెచ్చరిక!

    బట్టతల బాయ్కాట్! జుట్టున్న మగాళ్ళ మగసిరి వర్ధిల్లాలి!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
  15. అయ్యా / అమ్మా -

    నిన్నట్నుండి నన్ను వ్యక్తిగతంగా నిందిస్తూ వస్తున్న కామెంట్లు డిలీట్ చేస్తూనే వున్నాను - విసుగ్గా వుంది.

    మీ అభిమాన గాయకుల్ని కించపరుస్తూ రాశానని ఒకటే ఏడుస్తూ నన్ను తిడుతున్నారు. మీ ఏడుపు ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా ఏడ్చుకోండి. మీ సమయం, నా సమయం వృధా చెయ్యకండి. థాంక్యూ!

    ReplyDelete
  16. అయ్యా / అమ్మా -

    నేను నా అభిప్రాయాలు పోస్టులుగా రాస్తుంటాను. కొంతమంది చదువుతారు. అంతే.

    తెలుగు బ్లాగుల్లో కామెంట్లు రాయడం కూడా చాలా ప్రమాదం అని మొన్ననే తెలుసుకున్నాను. మన్నెవరైనా తిడితే ఆ బ్లాగు ఎడ్మిన్ కూడా భలే ఎంజాయ్ చేస్తాడు! ఇదెంత అన్యాయం!

    ఉదాహరణకి - మొన్నామధ్య 'బ్లాగిల్లు కబుర్లు' అనే బ్లాగులో నేనో జెనరల్ కామెంట్ రాయంగాన్లే ఒక ఎనానిమస్ వెంటనే ఎదురుదాడి చేశాడు. ఆ బ్లాగు ఎడ్మిన్‌కి కనీసపు మర్యాద లేదు. నన్ను ఎగతాళి చేసిన ఆ కామెంట్ తొలగించకపోగా - చాలా అర్ధవంతమైన చర్చ నడిచిందని చంకలు గుద్దుకున్నాడు.

    నా పోస్టులు చదివితే చదవండి. కామెంట్లు రాస్తే రాయండి. మిమ్మల్నెవరూ బ్రతిమాలట్లేదు. నా పోస్టుల వల్ల మీ మనోభావాలు దెబ్బ తినేట్లైతే కూడలి, మాలిక వాళ్ళకి చెప్పి ఎగ్రిగేటర్లలోంచి నా బ్లాగ్ తీయించెయ్యండి.

    అంతేగానీ - నన్ను వ్యక్తిగతంగా తిడుతూ విసిగించకండి (నాకు పేషంట్లతో తిట్టించుకోటం అలవాటే! వారికైతే మానసిక రోగం - మీకూ అంతేనా!?).

    ReplyDelete
  17. డాక్టరుగారు,

    కామెంట్లు పెట్టేవారిలో మర్యాదస్తులు, అది బొత్తిగా లేనివాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు, తీరికచేసుకొని అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పేవాళ్ళు, మరేమీ పనిలేక కేవలం వితండవాదంతోనే విసిగించటానికి వ్రాసేవాళ్ళు, తెలుసుకుందామని అడిగేవాళ్ళు, తెలియజెప్పుదామని ఆరాటపడేవాళ్ళు, మననో మనబ్లాగులో చర్చనో దారిలో పెట్టాలని ప్రయత్నించేవాళ్ళు, మననో మనబ్లాగులో చర్చనో దారితప్పించి వినోదించాలని ప్రయత్నించే వాళ్ళు, అన్నికథలూ తెలిసినవాళ్ళు, ఆవుకథమాత్రమే తెలిసినవాళ్ళు మనోవికాసందండిగా ఉన్నవాళ్ళు, మానసికరోగులు ఇలా రకరకాలుగా ఉంటారు. నిజానికి బ్లాగులు నడిపేవాళ్ళలోనూ ఇలాంటి అన్నిరకాలవాళ్ళూ ఉంటారు. మీరు మానసికవైద్యనిపుణులు. కాబట్టి ఇట్టే ఎవరెలాంటి బాపతో కనిపెట్టి, మరీ అవసరం ఐన టపాలూ, కామెంట్లకే స్పందించండి అని నా ఉ.బో.స (అనగా ఉచిత బోడి సలహా). మీరు కోప్పడినా విసుక్కున్నా కొందరు రెచ్చిపోయే అవకాశం హెచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,

      మీ వ్యాఖ్య నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అనేకన్నా ఎంతో ఊరటనిచ్చింది అన్నది సరైన పదం.

      నేను ఒక time frame పెట్టుకుని నా పోస్టుల్ని రాస్తుంటాను. రాయడం నాకో సరదా.

      వ్యక్తిగత విమర్శల్ని తప్పించుకోటానికి comment moderation పెట్టాను. అయితే - నాకో సమస్య వచ్చిపడింది. కొందరు గమ్మత్తైన ID లతో తిట్లు రాస్తున్నారు. నేనెలాగూ అవి పబ్లిష్ చెయ్యను. మరి వారెందుకలా రాస్తున్నారు? నిన్నటిదాకా నాకర్ధం కాలేదు.

      నిన్న నాకర్ధమైనదేమనగా - ఆ తిట్టేవారి ఉద్దేశం వారి కామెంట్ పబ్లిష్ అవ్వడం కాదు - నన్ను తిట్టడం! డిలీట్ చెయ్యడానికైనా అవి నేను చదువుతాను - చికాకు పడతాను, అది చాలు వారికి! ఇవ్వాళ వాళ్ళు విజయం సాధించారు. అదీ సంగతి.

      మీ ఉ.బో.స. నాకు గొప్ప psychological relief నిచ్చింది. నేనైతే మీ సలహాని అ.స (అద్భుతమైన సలహా) గా భావిస్తున్నాను. నేను ఎందరికో కౌన్సెలింగ్ చేస్తుంటాను. ఇవ్వాళ మీరు నాకు చేశారు. థాంక్యూ.

      మీకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

      Delete
    2. అలాంటి వారు ఎప్పుడూ ఉంటారు సార్‌, మీరు చెప్పినట్లు వారి ఉద్దేశం అవతలి వారిని గాయపరచి తృప్తి పడడం . తమ అభి ప్రాయలతో వ్యతిరేకించటం వేరు, పని గట్టుకొని తిట్టటం వేరు. అగతాయిలి లసంగతి మీకు తెలియనది ఏముంది? పట్టించు కోకపోవటమే మంచిది. తెలిసిన తరువాత మనల్ని భాదించవు గదా? బుద్దుడి కద గుర్తుకు తెచ్చుకుందాము. మీతిట్లు గోడకు తగిలి మళ్లీ మిమ్మల్నే ఎదురు తిరుగి తగుల్తాయని.

      Delete
  18. సర్, నేను ఒక చదువరి మాత్రమే. అయినా నాది ఓక చిన్న మాట (సలహా అని నేను అనుకోను).మీరు ఒక మంచి మానసిక నిపుణుడిగా మాత్రమే బూతులు రాసేవారిని చూడండి. వారి మనసిక పరిస్తితిపై జాలి పడి అలాంటి వారు భవిష్యత్తులో మీ పేషెంట్లుగా వస్తే వారికి ఏ విధంగా చికిత్స చేయవలెనో మీకు ఊపయోగపడుతుందని బావించి వారిని క్షమించండి.

    ReplyDelete
  19. మీ అభిప్రాయాలు ఏవిబడితే అవి పంచేసుకోవడానికి ఇదేమన్నా ఫేస్‌బుక్కనుకున్నారా? ఆయ్!. ఇక్కడ అభిప్రాయాల సెన్సారింగ్ జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఆ సెన్సారింగ్ 'సభ్యత' పేరుతోనూ, మరికొన్నిసార్లు 'దేశభక్తి' లేదా 'భక్తి' పేరుతోనో, లేకుంటే 'మనోభావాలు గాయపడడం' లేదా 'భావజాల వ్యాప్తి'పేరుతోనో జరుగుతుంది. ఈ quoted wordsని సుగుణాలుగా కలిగిన ప్రబుధ్ధులేమరి తమ వంకర బుధ్ధులు ప్రదర్శిస్తుంటారు (నిజానికి కూడలిలో ఇలా తాలుతప్ప మిగతాది కనబడకపోవడానికి ఈ 'ఆల్టర్‌నేటివ్ వాదాలను' బ్రతకనివ్వకపోవడం ప్రధాన కారణం. ఒక విషయమ్మీద నా (మరియు నా రౌడీమూక) అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, వాటినించి మిగిలినవారి అభిప్రాయాలు ఏకొంచెం వేరుగా కనిపించినా ఇలా మిడతల దండులా దాడిచేయడం ఒక అవలక్షణమై కూర్చుంది).

    సమాజంలో ఉన్న అన్ని అవలక్షణాలూ- vanity (= తామేదో మిగిలినవారిన్నా ఉన్నతులమనీ, వారికి తాము సమాధానమివ్వఖ్ఖర్లేదనీ అనుకొనేవడం) నుంచీ, outright ignorance (= కేవలం తామ నమ్మకాలకు ఏ నొప్పీ తగలకుండా ఉండటానికి లాజిక్‌నీ, factsనీ పాతెయ్యడం వరకూ)- ఉన్నాయి.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.