Wednesday 8 October 2014

ఇప్పుడు మీరు నా బ్లాగులో కామెంట్లు రాయొచ్చు


ప్రియమైన బ్లాగ్మిత్రులారా!

ఇప్పుడు మీరు నా బ్లాగులో హాయిగా కామెంట్లు రాయొచ్చు. కామెంట్లకి స్వాగతం.  

బూతులకి రియాక్ట్ అయ్యి పోస్టులు రాయడం మానేస్తే బూతుగాళ్ళు విజయం సాధించినట్లవుతుందని, బూతుగాళ్ళకి ఆ సంతోషం లేకుండా చేద్దామని నిర్ణయించుకున్నాను. వీలైతే ఇప్పుడే ఒక పోస్ట్ రాస్తాను. 

ఎప్పట్లాగే మీ విలువైన వ్యాఖ్యలతో నన్ను ప్రోత్సాహించవలసినదిగా మనవి. థాంక్యూ! 


(picture courtesy : Google)

17 comments:

  1. విత్ డ్రా అయిపోతే కువిమర్శకులకు విజయాన్ని పళ్ళెంలో పనసపండు లాగా అందించినట్లే కదా. సరైన నిర్ణయం తీసుకున్నారు మీరు. Welcome back to the world of comments (both good and not-so-good comments).

    ReplyDelete
  2. న బూతో న భవిష్యతి!

    మీ బ్లాగు కలకాలం మూడు బ్లాగులు, ముప్పయ్యారు కామెంట్లుగా వర్ధిల్లు గాక!

    ReplyDelete
  3. కొన్ని కొన్ని మనస్సుకు ఎక్కించుకోకూడదు రమణగారు...
    ధాంక్స్ ఫర్ మేకింగ్ అజ్ ఎగైన్ పార్టనర్స్...

    ReplyDelete
  4. నేనూ మీలాగే బ్లాగు రాయడం మానేద్దామనుకునే అది పొరపాటని గ్రహించి నిర్ణయం మార్చుకున్నా. కామెంట్ల కి మాడరేషన్ పెట్టండి. మీరు నిర్ణయం మార్చుకున్నందుకు ఆనందః.
    welcome and good decision

    ReplyDelete

  5. వెల్కం బెక బెక !!

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
  6. డాక్టరు గారూ!

    చాలా సంతోషం. తిరిగి మీరు ఉత్సాహం పుంజుకుని బ్లాగ్ మొదలుపెట్టినందుకు ధన్యవాదములు.

    మన శ్యామలీయం గారు చెప్పినట్టు, విమర్శ చేసేవారిలో, సద్విమర్శకులూ మరియు దుర్విమర్శకులూ ఉంటారు. సద్విమర్శను స్వీకరించండి. దుర్విమర్శను వదిలివేయండి.

    నా అభిప్రాయమైతే, అన్ని కామెంట్లనూ, ప్రచురించండి. పరిధిదాటి బూతు కామెంట్ చెసే వారి IDలను అందరికి తెలియచెప్పాల్సిన అవసరమున్నది. మీకు ఎలాగు మా పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.

    ReplyDelete
  7. రమణగారికి ఆత్మీయస్వాగతం

    మీ పునరాగమన నిర్ణయం చాలా ముదావహం.

    కాగితంరంగూ, గీతరంగూ ఒకటే ఐతే బొమ్మవేయలేం.
    అలాగే ఒకేరంగుబొమ్మ కన్నా రంగురంగుల బొమ్మ కంటికి మరింత బాగుంటుంది.

    ప్రపంచంలో అందరూ ఒక్కలాగే ప్రవర్తిస్తే అందరివీ అన్ని కథలూ ఒక్కలాగే ఉండి ఎవరికీ కొత్తగా చెప్పవలసినదీ ఎవరూ తెలుసుకోవలసినదీ ఏమీ ఉండదు. కళలూ ఉండవు కళాకారులూ‌ ఉండరు. ఎందుకంటే వాళ్ళకు సృష్టించటానికి పాత్రలు ఎక్కడి నుండి వస్తాయి మరి? అలగే వైవిధ్యం అన్నాక అన్నీ అమోదయోగ్యమైన సంగతులే ఉండవు కూడా అన్నదీ మనం గుర్తుంచుకోవాలి.

    బ్లాగుప్రపంచంలో వ్రాయసకాళ్ళూ, పైవ్రాతలవాళ్ళూ కూడా అనేకరకాల ప్రాపంచిక వ్యక్తిత్వాల వాళ్ళే ఉంటారు కదా. అందరూ క్రమశిక్షణ కలవారుగా ఉండరు కదా. దారి తప్పినవాళ్ళూ, దారి తెలిసినవాళ్ళు, దారి చూపే వాళ్ళు కూడా రకరకాల శాతాల్లో ఉంటారు. హిహిహీ యని నవ్వే బకాల సంగతి మాట్లాడుకోవటమే దండగే. అందుచేత అయోగ్యుల సంగతి ప్రక్కన బెట్టి మన దారిలో మనం ప్రయాణించటమే.

    మీరు చక్కగా వ్రాస్తున్నారు. మీ‌కృషిని కొనసాగించటానికి నా బోటిగాడి యోగ్యతాపత్రం మీకు అవసరం లేదు. అలాగే మీరు అయోగ్యుల విచిత్రవిన్యాసాలూ పట్టించుకోవలసిన పనీలేదు.

    ReplyDelete
  8. నా బ్లాగ్మిత్రుల ఆదరణకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా - శ్యామలీయం గారికి, జిలేబి గారికి. _/\_

    వాస్తవానికి నా మనసులో భావం రాయలంటే నాకున్న expression సరిపోదు. ఇంకా బాగా రాయడానికి నేను రావిశాస్త్రినీ కాను, పతంజలినీ కాను - రమణని మాత్రమే!

    ReplyDelete
    Replies
    1. రావి శాస్త్రి పతంజలి గార్లు మీలా బ్రహ్మాండమయిన బ్లాగులు రాయలేరు. అంచేత వారంతరి వారు వారు, మీ అంతటి వారు మీరు.

      Welcome back!

      Delete


  9. మీ నిన్నటి పోస్ట్ కి రెస్పాన్స్ గా ఈ క్రింది వ్యాఖ్య పంపుదామనుకొన్నా... కానీ మీ మెయిల్ ఐడి తెల్వలా...

    చాన్నాల్ల క్రితం ఒక మంచి ఆర్టికల్ చదివాను...

    దాని సారాంశం:
    గులాబి పువ్వు వాసన ఆ పువ్వుకు చెందుతుందా లేక వాసన చూసిన వ్యక్తికి చెందుతుందా?
    అలాగే, ఒక కవి/రచయిత రాసిన కవిత/రచన ఆయనకి చెందుతుందా? పాఠకుడికి చెందుతుందా?
    అసలు ఒక పాఠకుడు చదివి, చర్చించక పోతే... ఆ రచన కి విలువుందా?

    ఇక విషయానికొస్తే,
    మీరు రావి శాస్త్రి రచనలపై చెత్త రాతలు (బ్లాగులు) రాస్తున్నారని పాపం రావి శాస్త్రి గారికి కోపం వొచ్చి, తన రచనలన్నీ మీకు కనపడకుండ చేస్తే మీకెట్టా వుంటది?

    బాగుండదు కదా... అట్టాగే మాక్కూడానూ :)

    ReplyDelete
  10. ఏం సైకాలజిస్టండీ మీరు? ఎవడో ఏదో అన్నంత మాత్రానా తోకముడిచిపారిపోయారుగా? ఏనుగు రోడ్డుమీద వెళ్తూంటే కుక్కలు అరుస్తాయి. అవి ఊరకుక్కలా, జాతి కుక్కలా అన్నది అనవసరం. కుక్క ఎప్పుడూ కుక్కే కదా? అయినా బ్లాగులో కామెంట్ మోడరేషన్ ఉందిగదా, అది పెట్టుకుని మీకు నచ్చని కామెంట్లు పబ్లిష్ చేయక్కర్లేదు.

    అయినా ఇంటర్నెట్లో బతకాలంటే కొంచెం దళసరి చర్మం ఉండాలండోయ్! :-) అనుభవం మీద చెప్తున్నాను. ఇప్పుడు మీకూ తెల్సు అనుభవం వల్ల.

    అదంతా అలా ఉంచి బీహారీ బాబు లాగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను - బెలకం వేక్ (వెలకం బేక్)!

    ReplyDelete
  11. Thanks you sir for come back.

    ReplyDelete
  12. Welcome back Ramana gaaru, happy blogging.

    ReplyDelete
  13. రమణ గారు,

    మనలో మనమే ఎంత సేపని మాట్లాడుకోగలము చెప్పండి (కామెంటు అప్షన్ లేని పోస్టు).. ఏ చిన్న విషయమైన ఎదుటివాడితో పంచుకుంటునే కదా మనం మాట్లాడేదానికి అర్ద్రం ఉంటుంది.....

    ఎవడో ఒక ఎధవ మనల్ని ఏదో అన్నాదని, మిగతా వారందరితోను మాట్లాడడం మానేస్తామా చెప్పండి!!
    ఏది ఏమైనా మీరలా ఒక్కసారే అలిగి కామెంటు ఆప్షన్ తీసివేయడం బాలేదు. అట్లానే వెంటనే కామెంటు చేసే సౌకర్యం కల్పించడం ఆనందదాయకం....

    WELCOME BACK SIR....

    ReplyDelete
  14. మూడు రోజుల నుండి బిక్కు బిక్కు మటూ ఉండి పోయాం. నాలుగు రోజుల బ్లాగ్‌ పరిచయానికి ఎంత బాధ పశి పోయామో తెలుసా సార్‌! గ్లాడ్‌ టు మీట్‌ యు (బ్లాగ్‌) ఎగైన్‌.

    ReplyDelete
  15. ‘పనిలేక’ అను పని పట్టి
    జనమునెల్ల సంతోష పెట్టి
    మనసులెల్ల రంజిప జేసి
    మనుముల విశ్లేషణ చేసి

    పాఠకుల మీన మీ కరుణ
    ప్రసరించి నట్టి ఓ రమణా

    జేజేలు మీకు ఓ చమత్కార చంద్రా
    జేజేలు మీకు ఓ సంస్కార సూర్యా

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.