మా ఊరు గుంటూరు. మా గుంటూరు గతుకుల రోడ్లకీ, డబ్బా సినిమా హాళ్ళకీ ప్రసిద్ధి. మా గుంటూరియన్స్‌కి (ఇలా రాయడం నాకిష్టం, భలే స్టైల్‌గా వుంటుంది) తెరమీద బొమ్మలు ఆడ్డం చాలా వింతగా, ఆశ్చర్యంగా వుంటుంది. మేం వచ్చిన ప్రతి సినిమానీ నొరు తెరుచుకు చూస్తాం. కొత్త సినిమా రిలీజు కాకపోతే పాత సినిమాల్నే ఎంతో ఆసక్తిగా మళ్ళీమళ్ళీ చూస్తాం. సినిమా చూడ్డం మాకో యజ్ఞం, యాగం (ఈ రెంటికీ తేడా నాకు తెలీదు. అయినా ఫోర్సు కోసం రాస్తున్నాను).
నాకూ, నా స్నేహితులకీ చూడ్డానికి కొత్తసినిమాలేవీఁ మిగలనందున ఆరోజు 'సంపూర్ణ రామాయణం' అనే పంచరంగుల చిత్రానికి వెళ్ళాం. సినిమా మొదలై అప్పటికి పదినిమిషాలైంది. మిత్రబృందం చీకట్లో తడుముకుంటూ కుర్చీల్లో సర్డుక్కూర్చున్నాం. పాతసినిమా కాబట్టి ఆట్టే జనాలు లేరు. కూర్చున్నాక పక్కకి తిరిగిచూసి గతుక్కుమన్నాను. చచ్చాన్రా బాబు! ఇప్పుడెలా? హడావుడిలో చూసుకోకుండా ఇరుక్కుపొయ్యానే!
ఎందుకు చచ్చావ్? ఎక్కడ ఇరుక్కుపొయ్యావ్?
నేను గుంటూరు బ్రాడీపేటలో పుట్టాను, అక్కడే పెరిగాను. స్నేహితుల్తో క్రికెట్ ఆడుకోవటం, సినిమాలు చూడ్డం, పరీక్షలప్పుడు మాత్రమే చదువుకోవటం నా అలవాట్లు. వీలైనంతమేరకు హోటళ్ళలో తింటూ, హోటల్ పరిశ్రమని పోషించడం నాకున్న ముఖ్యవ్యాపకం. నదీప్రవాహంలో చెత్త కూడా ప్రయాణం చేస్తుంది. అలాగ - నేను కూడా స్నేహితుల్తో పాటు ప్రయాణం చేస్తూ గుంటూరు మెడికల్ కాలేజీలోకి వచ్చి పడ్డాను.
నా స్నేహితులు భారద్దేశ జనాభాలాగా, నానాజాతి సమితి లాగా - ఒక్కొక్కరు ఒక్కోటైపులో వుండేవారు. మాలో రామ్ బుద్ధిమంతుడు. చదువుల్లో ఫస్ట్, మిగిలిన విషయాల్లో లాస్ట్. అతగాడికి టెక్స్ట్ బుక్స్ తప్ప మిగిలిన విషయాలూ ఓ పట్టాన అర్ధమయ్యేవి కాదు, అలా అర్ధం కానివాటిల్లో అతి ముఖ్యమైనది సినిమా. సినిమా చూస్తూ తనకొచ్చే డౌట్లతో పక్కన కూచున్నవాడి బుర్రని డీప్ ఫ్రై చేస్తాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు నేను మావాడి పక్కన పడ్డాను, అదీ కథ!
కొద్దిసేపటికి రామ్ ప్రశ్నల పరంపర మొదలైంది.
"ఎవరతను?" శోభన్‌బాబుని చూపిస్తూ అడిగాడు.
"రాముడు."
"ఆ ముసలాయన ఎవరు?" ఇంకో ప్రశ్న.
"గుమ్మడి, కాదు.. దశరధుడు."
"ఆవిడ?"
"కైకేయి."
నాకు సినిమా మీద ఇంటరెస్ట్ పోతుంది. రామ్ ప్రశ్నల వరద నన్ను ముంచేస్తూనే ఉంది. రాముణ్ని అడవులకి పంపమని కైక అడిగే సీన్ వచ్చింది. దశరధుడు భోరున యేడుస్తున్నాడు.
"కైక! అన్నది నువ్వేనా? విన్నది నేనేనా?" అంటూ నేలమీద కూలబడ్డాడు.
"ఆయన ఏడుస్తున్నాడెందుకు! గెడ్డం దురద పుడుతుందా?" ఇంకో ప్రశ్న.
"లేదు."
"దశరధుడు డ్రాయర్ వేసుకున్నాడేంటి! ఆరోజుల్లో కూడా డ్రాయర్లున్నాయా?" ఇంకో ప్రశ్న.
సమాధానం యేం చెప్పాలో తెలీలేదు. సినిమాలో కైక వల్ల దశరధుడు యేడుస్తుంటే ఇక్కడ నేను మావాడి ప్రశ్నలకి యేడ్చాను.
నాకు దేవుడంటే నమ్మకం లేదు. కానీ ఆరోజు ఫ్రస్ట్రేషన్‌లో దేవుణ్ని ప్రార్ధించాను. 'దేవుడా! నాకీ ప్రశ్నల రాక్షసుడి బాధ లేకుండా ప్రశాంతంగా సినిమా చూసే అదృష్టాన్ని ప్రసాదించు!'
దేవుడు నా ప్రార్ధన విన్నాడు!
శ్యామ్ నా క్లాస్మేట్. అప్పుడప్పుడు మాతో కలిసేవాడు. సినిమా చూస్తూ రామ్ కొనసాగిస్తున్న హింసాకాండ గూర్చి కొంత ఐడియా వుంది. ఆరోజు శ్యామ్ మాతో 'శంకరాభరణం' సినిమాకి వచ్చాడు. హడావుడిగా మా సీట్లు రామ్ పక్కన ఉండకుండా మేనేజ్ చేసేసుకున్నాం. పాపం, రామ్ పక్కన శ్యామ్ ఇరుక్కుపోయాడు. స్నేహితుడు సుడిగుండంలో చిక్కుకున్నా కాపాడుకోలేని నిస్సహాయుల్లా మేం శ్యామ్ వంక జాలిగా చూశాం.
సినిమా మొదలైంది. రామ్ వైపు నుండి ప్రశ్నల వర్షం శ్యామ్ వైపు కురవటం మొదమైంది. రామ్ ప్రశ్నలకి శ్యామ్ తొణక్కుండా, యేమాత్రం తగ్గకుండా సమాధానాలు చెబుతూనే వున్నాడు. వాళ్ళ సంభాషణ నాకూ వినిపిస్తుంది.
"ఆ ముసలాయన పాడుతున్నాడెందుకు?"
"ఆయన శంకరాభరణం శంకరశాస్త్రి. మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. పోలీసుల కళ్ళు గప్పడానికి శాస్త్రీయ సంగీతం పాడుతుంటాడు."
"ఈ పొడుగాటి అమ్మాయి ఎవరు? ఎందుకలా డ్యాన్స్ చేస్తుంది?"
"మంజుభార్గవి పెద్ద సీబీఐ ఆఫీసర్. శంకరశాస్త్రి క్రిమినల్ ఏక్టివిటీస్‌ని దర్యాప్తు చేస్తుంది. డ్యాన్సర్‌గా మారువేషం వేసింది. ఇది తెలుసుకున్న శంకరశాస్త్రి మంజుభార్గవిని చంపేస్తాడు. అదే ఈ సినిమాకి ట్విస్ట్. డోంట్ మిసిట్, జాగ్రత్తగా చూడు."
సినిమా అయిపొయింది. అందరం లేచాం, రామ్ సీట్లోంచి లేవట్లేదు. సినిమా అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాడు, అయోమయంగా చూస్తున్నాడు. కొద్దిసేపటికి సీట్లోంచి లేచి నిదానంగా బయటకి వచ్చాడు.
"ఒరే శ్యామ్! ఇదన్యాయం. నువ్వు ఇచ్చిన లీడ్స్ ఆధారంగా సినిమా చూశా. మంజుభార్గవిని శంకరశాస్త్రి చంపే సీన్ కోసం ఎదురుచూస్తూ కూచున్నా. సినిమా ఒక్కముక్క అర్ధం కాలేదు. తెలీకపొతే తెలీదని చెప్పాలిగానీ మిస్లీడ్ చెయ్యటం ఘోరం."
"ఏవిటోయ్ నీకు చెప్పేది? అంత పెద్దతెర మీద పేద్దగా సౌండ్ పెట్టి వాళ్ళు బొమ్మేస్తుంటే సినిమా ఎందుకర్ధం కాదు? చూడ్డం చేతకాదా?" నవ్వుతూ అన్నాడు శ్యామ్. రామ్ ఏమీ మాట్లాళ్ళేదు.
అప్పట్నుండీ ఎవర్నీ యే ప్రశ్నలూ అడక్కుండా బుద్దిగా సినిమా చూస్తూ, సొంతంగా సినిమాలు అర్ధం చేసుకోనారంభించాడు రామ్. మేం 'అమ్మయ్యా!' అనుకున్నాం.
(సంఘటన వాస్తవం, పేర్లు మాత్రం మార్చాను.)
(picture courtesy : Google)
మీ గంగారాం లాంటి మిత్రుడు నాక్కూడా ఒకడుండే వాడండోయ్. ఒక సంభాషణ చూస్తే తెలుస్తుంది. 36యేళ్ళ క్రిందటి సంగతి:
ReplyDeleteఒక రోజు నా స్నేహితురాలొకావిడ తను యిల్లు మారానని చెప్పటానికి నా సీటు వద్దకు వచ్చింది.
వచ్చినావిడ: మేము నిన్న యిల్లు మారామండీ.
నేను: .. ఏదో అనబోతున్నాను...
మిత్రుడు: ఎక్కడికి మారారు?
వచ్చినావిడ: లలిత్ నగర్
మిత్రుడు: ముందెక్కడుండే వారు.
వచ్చినావిడ: రాం నగర్
మిత్రుడు: ఎందుకు మారారు?
వచ్చినావిడ: కొంచెం పెద్దిల్లు కావాలని
మిత్రుడు: అద్దె ఎంత?
ఆవిడేదో కోపం అణచుకుని చెప్పగానే మా వాడు, "ముందు యెంత యిచ్చేవారు?" అన్నాడు.
వచ్చినావిడకు మండి పోతోంది. మా మిత్రుడికి ఆవిడ పరిచయం కూడా లేదు. అయినా నిజంగా ఒక పాతిక చొప్పదంటు ప్రశ్నలు వేసి విసిగించేసాడు. ఆవిడకి చివరికి తిక్కపుట్టి నాతో, "ఇదిగో చచ్చినా యిక నీ సీటుకు రానంటే రాను. కావాలంటే నువ్వే వస్తూ ఉండు" అనేసి మామిత్రుడితో 'అన్నట్లు మీ పేరేమిటి? ' అనేసి సమాధానం వినకుండా వెళ్ళిపోయింది. తమాషా యేమిటంటే అసలావిడ నాకోసం వచ్చినా నాకు నోరు విప్పే ఛాన్స్ రాలే లేదు.
baagundi
ReplyDelete?!
హహహహహాహ హమ్మో ఇంకా నవ్వలేను! ఈ శిశుపాల వేణు గారు మాత్రం సూపరో సూపరు!
ReplyDeleteశ్యామలీయం గారు..
ReplyDeleteధన్యవాదాలు.
మావాడు చదువులో గోల్డ్ మెడలిస్ట్.
గమ్మత్తేమంటే..
వాడి చదువు విషయం మాకు ఈర్ష్యగా ఉండేది.
మా సినిమా, క్రికెట్ నాలెడ్జ్ వాడికి ఈర్ష్యగా ఉండేది.
ఎందుకో? ఏమో! గారు..
ReplyDeleteధన్యవాదాలు.
రసజ్ఞ గారు..
ReplyDeleteధన్యవాదాలు.
కాలేజ్ రోజులు గుర్తొచ్చి.. టక టక టైప్ చేసి.. పబ్లిష్ చేసిపడేశాను.. మా గ్యాంగ్ వాళ్ళ కోసం.
మీక్కుడా బాగున్నందుకు సంతోషం.
ఒకరకంగా చూస్తే ఇలాంటి వారిని మనం చాలాసార్లు సరిగ్గా అర్ధం చేసుకోము. మనకి వారికి ప్రపంచాన్ని చూసే దృష్టిలో బేధం ఉండటం వలన వాళ్ళు -మనదృష్టిలో- యిలాంటి విసిగించే పనులు చేస్తుంటారు.
ReplyDeleteఛ చాలా లేటుగా చూసానండీ.. సూపరో సూపరు.. : ) : ) : ) : )
ReplyDeleteDear YV
ReplyDeleteI have read your blog totally, I was laughing a lot while I was reading.
We just got the power after 5 days. It was a whole new experience.
Talk to you later.
soopero! sooper! neeku nuvve saati raa!
ReplyDeletego ve ra